Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · If he forgets God, the hero turns into a zero!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
If he forgets God, the hero turns into a zero!
31 August 1992, Gaṇeśa Caturthī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
సంఘ
మర్యాదలన్నియు
గంగ
కలిసె
మనుజ
జాతికి
తృప్తియే
మాయమయ్యె
శీల
నైతిక
విలువలు
చితికిపోయె
మానవత్వంబు
క్షీణించె
మనుజులందు.
ప్రేమస్వరూపులారా!
మానవజీవితము
అనేక
దశలలో
ప్రవహించి
సాగిపోవుచున్నది.
ఒక్కొక్క
దశయందుకూడను
మానవుడు
అహంకారమును,
అసూయను,
అసత్యమును
ఆలింగనము
చేసుకుంటున్నాడేగానీ
సత్య,
ధర్మ,
నిరహంకారములను
పెంపొందించుకొనలేకపోతున్నాడు.
పవిత్రమైన
మానవజన్మను
పాషాణముగా
మార్చుకుంటున్నాడు,
మానవుడు.
దివ్యమైన
మానవత్వాన్ని,
భవ్యమైన
జీవితాన్ని
అన్యాయమార్గములో
ప్రవేశపెడుతున్నాడు.
నిజముగా
మానవజన్మ
అతి
ఉత్కృష్టమైనది,
సౌశీల్యమైనది,
సౌజన్యమైనది.
మానవత్వమునుండి
దివ్యత్వములో
ప్రవేశించాలనుకుంటే
సత్సంగము
అత్యవసరము
మానవ
జీవితములో
మొదటి
దశ
బాల్యము.
ఈ
దశయందు
మానవుడు
శ్రేయో
మార్గము
మరియు
ప్రేయో
మార్గములమధ్య
వ్యత్యాసమును
గుర్తించుకొనలేక
అమాయకత్వములో
మునిగిపోతాడు.
అయితే,
మానవుడు
పెరుగుతూ
పెరుగుతూ
ప్రేయో
మార్గమునే
ఆశిస్తున్నాడుగానీ,
శ్రేయో
మార్గమును
అణుమాత్రమైనా
తలంచుట
లేదు.
క్రమక్రమేణా
యవ్వనములో
ప్రవేశిస్తున్నాడు.
ఈ
దశలో
దేహము
పుష్టిగా,
మనస్సు
శక్తివంతముగా,
యింద్రియములు
పటుత్వముగా
ఉండటంచేత
మానవత్వమును
పూర్తిగా
విస్మరించి
కేవలము
భౌతికమైన
జీవితములో
ప్రవేశించి
జీవితమునే
నిర్లక్ష్యముచేత
వ్యర్థము
గావించుకుంటున్నాడు.
2
▾
Meaning
Keep
మంచి,
చెడ్డల
విచక్షణా
జ్ఞానము
కోల్పోతున్నాడు.
పెద్ద,
చిన్న
తారతమ్యమును
విస్మరిస్తున్నాడు.
పశుత్వములో
ప్రవేశిస్తున్నాడు.
కడపటికి
మానవత్వమునే
కోల్పోతున్నాడు.
మానవుడు
కామము
అనే
నదిలో
ప్రవేశించి,
మోహము
అనే
అలలలో
కొట్టుకొనిపోయి,
సంసార
సాగరములో
పడి,
అశాంతి
ఆందోళనలలో
మునిగి,
అసంతృప్తి
అనే
తిమింగలమునకు
ఆహారముగా
మారుతున్నాడు.
యిట్టి
మానవత్వమును
మనము
కొంతవరకు
విచారణ
చేసి
దివ్యత్వములో
ప్రవేశించాలనుకుంటే
సత్సంగము
అత్యవసరము.
సత్సంగమంటే
ఏమిటి?
‘సత్’
అనగా
ఎట్టి
కాలమునందు
మార్పు
చెందనటువంటిది.
కాలముచేతగానీ,
దేశముచేతగానీ,
వ్యక్తులచేతగానీ
మారనటువంటిది
సత్యము.
అట్టి
సత్
తత్త్వముతో
సంగము
గావించుకోవాలి.
ఆ
‘సత్’
అనే
చైతన్యముచేత
నిరంతరము
ఆనందమును
అనుభవించాలి.
ఈ
సత్
చిత్
ఆనందములయొక్క
తత్త్వమే
సత్సంగము.
మానవునియందున్న
పశుత్వమును
నిర్మూలించి,
దివ్యత్వమును
వెలిగించుకోవటమే
ఆధ్యాత్మికమునకు
సరైన
అర్థము
ఈ
సత్సంగమునకు
మూడు
గుణములుంటున్నవి.
యివియే
మానవత్వములోపల
ప్రధానమైన
సూత్రములు.
‘భద్రం
శృణ్వంతు,’
‘భద్రం
పశ్యంతు,’
మరియు
‘భద్రం
కుర్వంతు.’
అవే
‘మంచిని
చూడు,’
‘మంచిని
విను,’
‘మంచిగా
జీవించు.’
యివే
మానవునికి
ప్రధానమైన
గుణములు.
సత్త్వరజోతమో
గుణములు
కాదు.
బాహ్యప్రపంచములో
లౌకిక
జీవితమునకు
యీ
సత్త్వరజోతమోగుణములు
గుణములుగా
భావిస్తున్నారేగానీ,
ధర్మమార్గములో,
దివ్యమార్గములో
ప్రవేశించదలచిన
మానవులకు
‘కుర్వంతు,
పశ్యంతు’-ఈ
రెండు
ఆదేశములు
చాలా
ప్రధానము.
భద్రం
పశ్యంతు-మంచినే
చూడు,
భద్రం
శృణ్వంతు-మంచినే
విను,
భద్రం
కుర్వంతు-మంచినిమాత్రమే
చేయి.
కానీ,
యీనాడు
యీ
వయస్సునందు
యీ
మూడు
గుణములు
మానవునియందు
శూన్యము.
కేవలము
భక్తి
ప్రపత్తులను
ప్రదర్శించుచున్నారేగానీ,
ఆచరించుటగానీ,
స్వయముగా
అనుభవించుటగానీ
జరగటం
లేదు.
ఆధ్యాత్మికమనేది
కేవలము
కొన్ని
బాహ్యమైన
కర్మలలో
ఉందిగానీ,
దివ్యమైన
అనుభూతిలోకి
చేరటం
లేదు.
3
▾
Meaning
Keep
అసలు
ఆధ్యాత్మికమంటే
ఏమిటి?
భజన
చేయటమా,
ఆధ్యాత్మికము?
‘సాయిరాం,
సాయిరాం’
అనుకోటమా
ఆధ్యాత్మికము?
లేక
క్షేత్రాలకు
పోవటము
ఆధ్యాత్మికమా?
యివన్నీ
మానవునియొక్క
బలహీనతలే!
నిజమైన
ఆధ్యాత్మికము
ఏమిటి?
మానవునియందున్న
పశుత్వాన్ని
నిర్మూలించాలి.
దివ్యత్వమును
వెలిగించుకోవాలి.
యిదే
ఆధ్యాత్మికమునకు
సరైన
అర్థము.
మనల్ని
దైవమునకు
దూరముగావించేవి
ముఖ్యంగా
రెండు-అసూయ,
అహంకారము
ఈనాడు
ధ్యానాలు
చేస్తున్నారు.
జపాలను
ఆచరిస్తున్నారు.
దాంతోబాటే
పశుత్వాన్నికూడా
పెంచుకుంటున్నారు.
పశుత్వము
ఉంచుకొని
ఎన్ని
సాధనలు
చేసినా
అన్నీ
వ్యర్థమే!
యీ
సాధనలు
అన్నీ
దైవమునే
మోసము
చేసినట్లవుతుంది.
సాధన
చేయటం
అంటే
అది
కాదు.
మనలో
ఉన్న
క్రూరబుద్ధులు,
దుష్టబుద్ధులు,
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అసత్యము,
అసూయ,
అహంకారము
ఇటువంటి
పశు
గుణములను
మనం
దూరం
గావించుకోవాలి.
యిది
నిజమైన
ఆధ్యాత్మికము.
మనల్ని
దైవమునకు
దూరము
గావించేవి
రెండు-అసూయ,
అహంకారము.
అసూయ
అనేది
జీవిత
వృక్షమునకు
చీడ
పురుగువంటిది.
అహంకారము
వేరు
పురుగువంటిది.
ఈ
రెండు
జీవితవృక్షమును
శిధిలము
చేస్తున్నాయి.
మానవత్వమును
పూర్తిగా
కోల్పోయేటట్లు
చేయునది
యీ
అసూయ,
అహంకారములే!
యివి
ఉండినవాడు
నిజముగా
మానవుడే
కాదు.
వీనిని
ఏ
విధంగా
ఆధ్యాత్మిక
మార్గములో
సాధకుడని
చెప్పటానికి
వీలవుతుంది?
యిది,
ముందు
ఒకటి
వెనుక
ఒకటి
ఆడేటువంటి
ఆటలు!
మరింత
దోషకరమైన
చర్యలు.
ఇటువంటివారు
దుస్సంగములో
చేరుతున్నారేగానీ,
సత్సంగములో
చేరటం
లేదు.
ఎందువలననగా
వారిలో
దుర్గుణములు,
దురాలోచనలు
ఉండటంచేతనే
దుస్సంగము
వారిని
ఆకర్షిస్తున్నాది.
కనుకనే
‘సత్’
అనే
చైతన్యతత్త్వమును
మనము
ఆశ్రయించాలి.
దుర్గుణములు
దూరము
చేసుకోటానికి,
సద్గుణములను
చేర్చుకోవటానికి
తగిన
తత్త్వమును
ప్రబోధించేదే
వినాయక
చవితి.
4
▾
Meaning
Keep
సమస్త
ఇంద్రియములకు
అధిపతియైనవాడే
గణపతి
గణపతి
అనగా
ఏమిటి?
గ-అనగా
‘బుద్ధి’
అనగా
విజ్ఞానము.
విజ్ఞాన,
ప్రజ్ఞానములకు
అధిపతి
గణపతి.
సర్వ
గణములకు
అధిపతియైనవాడే
గణపతి.
గణములనగా
మానవులయొక్క
యింద్రియతత్త్వములే!
సమస్త
యింద్రియములకు
అధిపతియైనవాడే
గణపతి.
‘విగతో
నాయక
యితి
వినాయక’
అని
నిర్వచనము.
అనగా
తనకు
ఎట్టి
నాయకుడు
లేనివాడు,
వినాయకుడు.
అతనికి
అతనే
నాయకుడు.
అతనికి
మరొక
మాష్టరు
లేడు.
అన్నింటికి
తానే
అధిపతి.
అదియే
‘వినాయక’
అనే
పదమునకు
సరైన
అర్థము.
భారతీయుల
పర్వదినములన్నీ
కూడను
పారమార్థిక
సంబంధమైన
అంతరార్థముతో
కూడినవే
గానీ,
బాహ్యసంబంధమైన
చర్యలతో
కూడినవి
కావు.
మొట్టమొదట
పర్వదినములలో
తెల్లవారి
లేచిన
తక్షణమే
మనము
ద్వారములకు
పచ్చని
ఆకులను
కడుతున్నాము.
నిత్యకళ్యాణమునకు,
పచ్చని
తోరణము
ప్రధాన
చిహ్నము.
కనుక,
‘మా
జీవితము
నిత్యకళ్యాణముగా
ఉండా’లనే
అంతరార్థమును
ప్రబోధించేదే
పచ్చని
తోరణము.
వైజ్ఞానికముగా
మరొక
అర్థాన్ని
దీనికి
ప్రబోధించవచ్చు.
ద్వారములో
కట్టిన
పచ్చని
ఆకులతోరణము
మానవులు
వదలిన
కార్బన్
డయాక్సైడ్ను
తీసుకొని
అందున్న
ప్రాణవాయువును
మనకు
అందిస్తున్నది.
ఈవిధంగా
విజ్ఞాన
రీతిగాకూడను
పచ్చని
ఆకులతోరణము
మానవునకు
సహాయమునే
చేస్తున్నది.
మానవుడు
కోరేది
ప్రాణవాయువు.
వృక్షములు
కోరేది
బొగ్గుపులుసువాయువు.
కనుక
రెండుకూడను
ఒకదానికొకటి
సహాయము
చేసుకుంటున్నాయి.
యీ
పర్వదినాన
తెల్లవారి
లేచిన
తక్షణమే
మానవుడు
అభ్యంగనస్నానము
ఆచరిస్తున్నాడు.
దీనికి
అంతరార్థము
ఏమిటి?
శారీరక
పరిశుద్ధత
ఆరోగ్యమునకు
ముఖ్యకారణము.
యింతే
కాకుండా,
భగవంతుడు
లోపల,
వెలుపలకూడా
ఉండినవాడు
కనుక
బాహ్యశుద్ధి,
అంతశ్శుద్ధి
రెండూ
మానవునికి
అవసరము.
అంతఃశుద్ధియొక్క
లక్ష్యము
ఏమిటి?
దుర్గుణములను
దూరము
గావించుకోటం,
సద్భావమును
నింపుకోటం.
యిదియే
నూతన
వస్త్రములు
ధరించే
దాంట్లో
ఉండే
అంతరార్థము.
నూతన
వస్త్రములో
లేక
పరిశుద్ధమైన
వస్త్రములో
వేసుకుంటాము.
అనగా
హృదయమునకు
వస్త్రము
అని
పేరు.
కనుక
లోపల
హృదయమును
పరిశుద్ధము
గావించుకోటమే
అంతర్శుద్ధియొక్క
లక్ష్యము.
5
▾
Meaning
Keep
అంతర్శుద్ధి
లక్ష్యముగా
నూతన
వస్త్రములు
ధరించుకోటమే
దీని
అర్థము.
యివన్నియు
అంతరార్థములను
ప్రబోధిస్తూ
పారమార్థిక
తత్త్వాన్ని
వెదజల్లుతూ
వస్తున్నాయి.
మనోపరిశుద్ధతచేత
బుద్ధి,
సిద్ధి
రెండూ
సంప్రాప్తమవుతాయి
ఈ
గణపతి
దినమునందు
మనము
అనేక
రకములైన
పూజలు
సలుపుతూ
కుడుములు,
ఉండ్రాళ్లు
భగవంతునకు
నైవేద్యముగా
పెడుతూ
ఉంటారు.
భగవంతునకు
నైవేద్యము
పెట్టేవి
ఎలాంటివి
పెట్టాలి?
తైల
సంస్కారము
లేకుండా,
లేక
అగ్నిలో
ప్రవేశించకుండా
కేవలము
ఆవిరిచేతనే
ఉడికేటువంటివిగా
ఉండాలి.
కనుకనే
బియ్యం
పిండిని
ఇడ్లీవలె
ఆవిరిలో
పెట్టి
కొంత
నువ్వుల
పిండో
లేక
పెసరపప్పో
దానిలో
పెట్టి
దీనిని
‘ఉండ్రాళ్లు’
అని
పిలుస్తూ
ఉంటారు.
వీటికి
అగ్ని
సంస్కారముగాని,
తైల
సంస్కారముగానీ
యేమాత్రము
చేరదు.
దీని
అంతరార్థము
ఏమిటి?
భాద్రపదమాసములో
యీ
చవితి
దినమునకు
నువ్వులపంట
రైతుల
యింటికి
వస్తుంది.
ఈ
నువ్వులపిండి
శ్వాసరోగములకు,
కంటి
రోగములకు
దివ్య
ఔషధము.
దీనిని
ఆవిరితో
ఉడికిన
బియ్యపుపిండిలో
పెట్టి
వండినప్పుడు
ఆ
పదార్థము
అతి
సులభముగా
జీర్ణమవుతుంది.
ఈ
విధంగా
ఆరోగ్యము,
ఆనందము
యీ
రెండింటిని
పురస్కరించుకొని
వినాయక
పూజ
చేసేటప్పుడు
ఆయనకు
నైవేద్యముగా
యీ
రకమైన
రీతిగా
చేస్తూ
వచ్చారు,
ప్రాచీనులు.
మనసు
పరిశుద్ధమైనప్పుడే
బుద్ధి
వికసిస్తుంది.
ఈ
యొక్క
బుద్ధి
వికసించినప్పుడే
దీనిలో
సిద్ధిత్వం
ప్రాప్తిస్తుంది.
కనుక,
మనో
పరిశుద్ధతచేత
బుద్ధి,
సిద్ధి
రెండూ
సంప్రాప్తమవుతున్నాయి.
ఈ
బుద్ధిని,
సిద్ధిని
వినాయకుడు
వరిస్తాడు.
‘సిద్ధి’
అనగా
ఏమిటి?
జ్ఞానసిద్ధియే
నిజమైన
సిద్ధి.
మనోశుద్ధియే
నిజమైన
సిద్ధి.
కనుక,
యీ
సిద్ధిబుద్ధులకు
క్షేమము,
ఆనందము
అనే
కొడుకులు
పుడతారు.
క్షేమానందములు
రెండూ
విఘ్నేశ్వరుని
పుత్రులని,
బుద్ధి
సిద్ధులు
రెండు
వినాయకుని
పత్నులని
శాస్త్రము
ప్రబోధిస్తూ
వచ్చింది.
పత్నులు
ఎవరంటే
ఆకర్షణ
శక్తి.
ఉదాహరణకు,
ఇనుము,
వెండి,
ఇత్తడి,
బంగారము
మొదలగు
కొన్ని
లోహములను
పెడతాము.
వాటి
మధ్యలో
సూదంటు
రాయి
పెడితే
అది
కేవలం
ఇనుమును
మాత్రమే
ఆకర్షిస్తుందిగానీ
విలువైనదని
బంగారును
ఆకర్షించదు.
అదే
విధముగా
గణపతి
సిద్ధి
బుద్ధితో
కూడినవాడు
కనుక
పరిశుద్ధ
హృదయాన్నే
ఆకర్షిస్తాడు.
6
▾
Meaning
Keep
మానవుడు
మొట్టమొదట
పరిశుద్ధమైన
మనస్సును
అభివృద్ధిపరచుకోవాలి
మనోశుద్ధి
మానవునకు
అత్యవసరము.
ఈ
మనోశుద్ధి
లేనటువంటివాడు
మానవుడే
కాదు.
మనస్సువలనే
‘మనిషి’
అని
పేరు
వచ్చింది.
మనస్సు
అశుద్ధమైనప్పుడు
వీడు
మనిషే
కాడు.
యీనాడు
అశుద్ధమైన
మనస్సును
ఉంచుకొని
మానవుడు
తాను
‘మనిషి’
అనే
పేరుతో
దేశమును,
సమాజమును
మోసము
చేస్తున్నాడు.
కనుక,
మానవుడు
మొట్టమొదట
పరిశుద్ధమైన
మనస్సును
అభివృద్ధిపరచుకోవాలి.
తనలో
ఉండినటువంటి
భావములే
యితరులలో
ఉంటున్నాయని
ఒక
విధంగా
భ్రమిస్తున్నాడు.
తనలోగల
లోపములనే
యితరులకు
ఆపాదిస్తూ
ఉంటాడు.
అయితే
తాను
తిన్నదే
తనకు
త్రేపు
వస్తుందిగానీ,
యింకొకరు
తిన్నది
తనకు
త్రేపు
రావటానికి
వీలు
లేదు.
తన
దోషములు
తాను
కప్పిపుచ్చుకొనే
నిమిత్తము,
ఆ
దోషములు
పరులయందు
ప్రవేశపెడుతున్నాడు.
యిది
కూడను
ఒక
పెద్ద
దుర్గుణమే!
తన
దోషమును
తాను
గుర్తించుకున్నప్పుడే
తాను
బాగుపడుతాడుగానీ
తన
దోషములే
యితరుల
యందుంటున్నాయని
అనుకుంటున్నప్పుడు
తన
దోషాన్ని
దినదినాభివృద్ధి
గావించుకుంటాడు.
‘పరులయందు
మంచిని
చూడు,
తనయందు
చెడ్డను
చూడు.’
అట్టి
మానవుడే
అభివృద్ధి
గాంచుతాడు.
తనయందున్న
మహాదోషములనుకూడను
కప్పిపుచ్చుకుంటూ
పరులయందు
ఉన్న
గొప్పను
తిరస్కరించుకుంటూ
పోవటంచేత
మానవత్వమనేదానిని
మరచిపోతున్నాడు.
ఈనాడు
యువకులందు
యిదే
ఎక్కువగా
ప్రవేశిస్తున్నది.
యింక
వారు
‘మానవులు’
అని
చెప్పుకోటంలో
అర్థమే
లేదు.
The
proper
study
of
mankind
is
man.
Thoughts,
words,
action
ఈ
మూడూ
ఏకం
కావాలి.
మనసులో
ఒకటి,
మాటలో
మరొకటి,
క్రియలలో
యింకొకటి
చేసినప్పుడు
వాడు
దురాత్ముడౌతాడు.
దానినే
‘మనస్సన్యత్,
వచస్సన్యత్,
కర్మణ్అన్యత్
దురాత్మనామ్’
అన్నారు.
ఈ
మూడింటి
ఏకత్వము
లోపల
మానవత్వము
అభివృద్ధిపరచుకోవాలి.
అదే
నిజమైన
మానవతా
విలువ.
గణపతితత్త్వము
పవిత్రమైన
ఏకత్వమును
బోధిస్తుంది
ఈనాడు
మానవుడు
అన్నింటియందు
విలువ
చూస్తున్నాడుగానీ
తన
విలువను
ఏమాత్రం
చూడటం
లేదు.
7
▾
Meaning
Keep
తన
విలువను
తాను
గుర్తించాలి.
తన
ఘనతను
తాను
పెంపొందించుకోవాలి.
తన
జీవితానందమును
తాను
అనుభవించాలి.
నిరంతరము
స్వార్థము,
స్వార్థము!
పశువులకైనా
స్వార్థము
తక్కువగా
ఉందిగానీ
మనుషులందు
అమితంగా
పెరిగిపోయింది.
బిడ్డలు
పుట్టిన
తరువాత
రెక్కలు
వచ్చేంతవరకు
మాత్రమే
పక్షులు
వాటిని
పోషిస్తాయి.
తదుపరి
వాటిని
స్వేచ్ఛగా
జీవించుమని
వదులుతాయి.
ఎవరి
జీవితాన్ని
వారు
అనుభవిస్తారు.
కానీ,
యీనాడు
మానవునియందు
స్వార్థము,
స్వార్థము!
చచ్చేంతవరకు
స్వార్థము!
అటువంటి
మానవుడు
ఏనాడు
పరార్థాన్ని
పొందుతాడు?
చివరకు
అనర్థములో
మునిగిపోతున్నాడు.
యథార్థమును
మరచిపోతున్నాడు.
దివ్యత్వమునకు
దూరమైపోతున్నాడు.
మానవత్వమును
విస్మరిస్తున్నాడు.
యిట్టి
దివ్యమైన
మానవత్వమును
హెచ్చరించే
నిమిత్తమే
గణపతి
తత్త్వమనేది
పవిత్రమైన
ఏకత్వమును
ప్రబోధిస్తూ
వచ్చింది.
ఈశ్వరుడు
విశ్వకుటుంబీకుడు.
ఏ
విధంగా?
ఈశ్వరుడు,
పార్వతి,
గణపతి,
సుబ్రహ్మణ్యం
యీ
నల్గురు
చేరి
ఒక
కుటుంబము.
ఈ
కుటుంబములోపల
మనము
చక్కగా
విచారణ
చేసి
చూచినప్పుడు
అన్నీ
పరస్పర
విరుద్ధమైన
అంశములే
కనుపిస్తాయి.
ఈశ్వరుని
వాహనము
నంది.
పార్వతి
వాహనము
సింహము.
సింహానికి,
నందికి
ద్వేషము.
యింక
ఈశ్వరుని
శిరస్సుపైన
గంగ.
నుదుటిపైన
అగ్ని.
నీరు
ఉంటే
అగ్ని
ఉండదు.
అగ్ని
ఉంటే
నీరు
ఉండదు.
ఈ
రెండింటికి
పరస్పర
విరుద్ధము,
ద్వేషము.
యింక
వినాయకుని
శిరస్సు
గజముఖము.
తల్లియొక్క
వాహనము
సింహము.
సింహము
స్వప్నములో
వస్తేకూడను
ఏనుగు
బ్రతకలేదట!
అంత
విరోధమైనటువంటిది.
కానీ
తల్లి
ప్రక్కనే
ఉంటున్నాడు,
వినాయకుడు.
ద్వేషము
లేదు.
సుబ్రహ్మణ్యేశ్వరుని
వాహనము
నెమలి.
తండ్రి
ఆభరణములు
పాములు.
ఈ
పాముకు,
నెమలికి
పూర్తి
ద్వేషము.
కనుక
యిలాంటి
పరస్పర
విరుద్ధమైన
అంశములతో
కూడిన
కుటుంబములో
అందరు
కలసిమెలసి
ఉంటున్నారు.
ద్వేషమే
లేదు.
ఎంత
విరోధమైన
గుణములు
ఉండినప్పటికి
ఐకమత్యముచేత
దేశము
కళ్యాణము
అనుభవిస్తుంది.
8
▾
Meaning
Keep
స్నేహముచేతనే
మానవుడు
ఉన్నతస్థాయికి
ఎదగడంగాని,
అధోస్థాయికి
దిగజారిపోవడంగాని
జరుగుతున్నది!
విశ్వకుటుంబీకుడైన
ఈశ్వరుడే
విశ్వానికి
ఐకమత్యమును
బోధిస్తూ
ఉన్నాడు.
కనుక,
ఐకమత్యమనేది
అత్యవసరము.
ఐతే,
ఎలాంటి
దానియందు
ఐకమత్యము?
మంచియందు
ఐకమత్యము
ఉండాలి.
చెడ్డభావమునందు,
చెడ్డ
చర్యలందు
ఐకమత్యము
ఉండకూడదు.
అలాంటి
చెడ్డను
దూరము
చేసుకోవాలి.
యిక్కడ
యేమాత్రము
ఐకమత్యము
మనకు
అక్కరలేదు.
కారణమేమనగా
మనయొక్క
పవిత్రతను
మనం
పాడు
చేసుకుంటాము.
స్నేహముచేతనే
మానవుడు
ఉన్నతస్థాయికి
ఎదగడంగానీ
అధోస్థాయికి
దిగజారిపోవడంగాని
జరుగుతున్నది.
కనుక,
Tell
me
your
company,
I
shall
tell
you
what
you
are
అన్నారు.
మన
స్నేహముబట్టే
మనకు
మంచిచెడ్డలు
అబ్బుతున్నాయి.
అనేక
పర్యాయములు
చెప్పాను.
దూళి
ఉన్నది
భూమిపైన;
గాలితో
స్నేహము
చేస్తే
పైకి
వెళ్లిపోతుంది.
నీటితో
స్నేహము
చేస్తే
గుంతలో
దిగిపోతున్నది.
దానికి
క్రిందికి
దిగటానికి
కాళ్లు
లేవు,
పైకి
ఎగరటానికి
రెక్కలు
లేవు.
యిది
స్నేహముయొక్క
సంబంధము!
యీనాటి
మానవులుకూడను
ఉన్నత
స్థాయికి
పోవటానికి,
అధోస్థాయికి
దిగజారటానికి
యీ
స్నేహమే
కారణం.
ఈనాడు
నా
ఉద్దేశ్యములో
ఎవ్వరూ
లేరు
సరైన
స్నేహితులు,
ప్రపంచములో!
తమ
స్వార్థము,
తమ
స్వప్రయోజనమును
పురస్కరించుకొని
స్నేహము
చేస్తున్నారు.
తమకేమైనా
సహాయం
కావలసివస్తే
‘హలో!
హలో!’
అని
దగ్గరకు
వస్తున్నారు.
ఆ
కార్యము
తీరిపోగానే
గుడ్బైకూడా
చెప్పరు.
చెరువులో
నీరుండినంతవరకు
వేలలో
కప్పలు
వచ్చి
చేరతాయి.
నీరు
ఎండిపోతే
ఒక్క
కప్ప
అయినా
అక్కడ
ఉండదు.
నీవు
యువకుడుగా
మంచి
శక్తిసామర్థ్యంతో
ఉండి,
నీ
జేబులో
దండిగా
ధనము
ఉండి
నీ
తండ్రి
మంచి
స్థాయిలో
ఉన్నంతవరకు
‘హలో!
హలో!’
అని
అందరు
వచ్చి
చేరుతారు.
నీ
జేబులో
పైసా
తరిగిపోయింది,
తండ్రి
రిటైరై
పోయినాడు
అనుకో!
యింక
నిన్ను
ఎవరూ
చూడరు.
నీవు
వస్తుంటే
వారు
యింకొక
మార్గములో
పోతుంటారు.
వీరంతా
తమ
స్వార్థముకోసము
నీతో
స్నేహము
చేసేవారే!
9
▾
Meaning
Keep
His poems 282
ప్రేమ
హృదయసంబంధమైనది,
శాశ్వతమైనది,
దివ్యమైనది
నిజమైన
స్నేహితుడు
భగవంతుడొక్కడే!
కనుకనే
ఎట్టి
సమయమునందు
with
you,
in
you,
around
you.
ఎలాంటి
పరిస్థితులలోకూడను
భగవంతుడు
నిన్ను
వదలడు.
అయితే,
నీ
హృదయమును
మాలిన్యము
చేసుకోటంచేత
తక్షణమే
భగవంతుడు
నిన్ను
వదులుతున్నాడు.
కారణం
ఏమిటి?
అటువంటి
హృదయములో
తాను
కూర్చోటానికి
అవకాశము
లేదు.
అనిత్యము,
అశాశ్వతము,
అసత్యము
అయిన
శరీరమే
నేలపై
కూర్చోవాలన్నప్పుడు
ఒక
చాపనో,
దిండునో,
పేపరో
ఏదో
ఒకటి
వేసుకొని
కూర్చుంటున్నావు.
మరి
భగవంతుడు
కూర్చోవాలంటే
అక్కడ
పరిశుద్ధము
చేయనక్కరలేదా?
ఒక
సీటు
వేయనక్కరలేదా?
అలాంటివి
లేకుండా
ఉండినప్పుడు
భగవంతుడు
ఎట్లా
వచ్చి
కూర్చుంటాడు?
భగవంతుడు
తప్పక
ఉన్నాడు.
కానీ
హృదయశుద్ధి
లేనప్పుడు
నీకు
కనుపించటంలేదు.
కుండలో
నీరున్నది.
కుండలో
నీరున్నంతవరకు
సూర్యుని
ప్రతిబింబము
కనుపిస్తున్నది.
కానీ,
కుండ
పగిలి
నీరు
కారిపోయినప్పుడు
ప్రతిబింబము
కనిపించదు.
ప్రతిబింబము
ఎక్కడికైనా
పోయిందా?
పోలేదు,
ఉంది!
కేవలం
నీరు
లేక
కనుపించటం
లేదు.
మన
దేహమే
ఒక
కుండవంటిది.
ప్రేమయే
దానియందు
నీరు.
ఆ
నీరు
ఉండినంతవరకు
నీటిలో
చక్కగా
ప్రతిబింబిస్తూ
ఉంటుంది.
నీరు
పోయేటప్పటికి
ప్రతిబింబము
కనుపించటం
లేదు.
ఈ
ప్రేమను
తుచ్ఛమైన
లౌకిక
విషయములలో
ప్రవేశపెడుతున్నారు.
‘ప్రేమ’
అనే
పేరు
పెట్టి
అనురాగమనే
దాంట్లో
ప్రవేశిస్తున్నారు.
నిజానికి
అనురాగమనేది
ప్రాపంచిక
సంబంధమైనది.
ఇది
క్షణక్షణానికి
తరుగుచూ,
పెరుగుతూ
ఉండేది.
దీనికి
విరుద్ధంగా
ప్రేమ
హృదయసంబంధమైనది,
శాశ్వతమైనది,
దివ్యమైనది.
చావు
పుట్టుకలేనట్టి
జీవుహృదిలో
నిత్యనిర్మల
జ్యోతియై
నెగడు
ప్రేమ
క్షణములో
తరిగిపోయి,
క్షణములో
పెరిగిపోయేది
యిది
ప్రేమయే
కాదు.
అది
ఎప్పుడుకూడను
మారేటువంటిది
కాదు.
అటువంటి
ప్రేమను
మనము
కలిగి
ఉంటుండాలి.
ఈనాడు
అవధూతలు
కావలసిన
మానవులు
యమదూతలుగా
మారుతున్నారు
మానవునియొక్క
జన్మము
చాలా
దుర్లభమైనదన్నారు.
మనముకూడను
ఆహార
నిద్రభయమైథునాదులతో
జీవిస్తుంటే
పశువులకు,
మనకు
మధ్య
ఉండే
వ్యత్యాసము
ఏమిటి?
10
▾
Meaning
Keep
మనం
చదువుకున్న
చదువులయొక్క
విలువ
ఏమిటి?
పశువు
ఏ
చదువు
చదవలేదే!
ఏ
కాలేజీకి
పోలేదే?
మనము
యింతా
కాలేజీకి
పోయి
చదువులు
చదివి
డిగ్రీలు
తీసుకుని
చివరకు
పశువులవలె
ప్రవర్తిస్తుంటే
మనిషికి,
పశువుకు
ఉన్న
వ్యత్యాసము
ఏమిటి?
బుద్ధిని
పెంచుకోవాలి.
మనస్సును
పరిశుద్ధము
గావించుకోవాలి.
మానవత్వమును
నిలుపుకోవాలి.
దివ్యత్వమును
వెలిగించాలి.
ఈ
పద్ధతికి
విరుద్ధంగా
నడుచుకోవటంచేతనే
మానవుడు
దినదినానికి
మానవత్వమును
కోల్పోతున్నాడు.
మానవుని
యింద్రియములు
యమదూతలుగా
మారిపోతున్నాయి.
మన
యింద్రియములు,
భావములన్నీ
యమదూతలు
కాకూడదు.
అవధూతలు
కావాలి.
ఈనాడు
అవధూతలు
కావలసిన
మానవులు
యమదూతలుగా
మారుతున్నారు.
అందరిని
హింసించటము,
అందరిని
నొప్పించటము,
అందరిని
బాధించటము,
యీ
రకమైనదిగా
ఉంటున్నాది.
Help
ever,
hurt
never.
ఈ
విశాలమైన
బుద్ధిని
మనం
పెంచుకోవాలి.
భారతీయుల
పర్వదినములన్నియు
అంతరార్థముతో
కూడినవే!
వినాయకునికి
గజముఖము
పెట్టారు.
దీనియొక్క
అంతరార్థము
ఏమిటి?
ఏ
మానవునికైనా
గజముఖము
ఉంటున్నదా?
యిది
సృష్టిలో
చాలా
విరుద్ధమైనది.
ఐతే
వినాయకునికి
యీ
తల
రావటానికి
కారణం
ఏమిటి?
దీనియొక్క
అంతరార్థము
వేరు.
వినాయకుడు
చాలా
తెలివితేటలు
కలవాడు.
గొప్ప
మేధాశక్తి
కలవాడు.
అందువల్లనే
‘గజ
తెలివి’
అంటారు.
గజమునకు
అమితముగా
తెలివి
ఉంటుంది.
మాష్టర్ని
తప్ప
యింక
ఎవరిని
నమ్మదు.
అనగా
దైవమును
తప్ప
దేనిని
నమ్మదు.
అలాంటి
తెలివి
కలవాడు
వినాయకుడు
కనుక
గజముఖము
తెచ్చి
అక్కడ
ఉండినట్లుగా
నిరూపిస్తున్నారు.
మీరు
చూస్తున్నారు.
హాస్టలులో
ఉన్న
పిల్లలు.
ఆ
మార్గములోపల
ఎన్నో
కార్లు
పోతుంటాయి,
వస్తుంటాయి.
దానికి
ప్రక్కనే
ఉంటున్నాది
సాయిగీత.
దేనిని
అది
లక్ష్యము
చేయదు.
నేను
చెప్పక
పోయినా,
అటువైపు
పోతే
వాసన
పడుతుంది.
అరుస్తూ
బయటికి
వస్తుంది.
అది
గజవిశ్వాసము.
అనగా
బలమైన
విశ్వాసము.
బలమైన
తెలివి.
బలమైన
ప్రేమ.
అటు
యిటూ
ఊగేది
కాదు.
క్షణక్షణమునకు
కదిలేది
కాదు.
నిరంతరము
మారేది
కాదు.
అట్టి
తెలివితేటలు,
అట్టి
విశ్వాసము,
అట్టి
గాఢనమ్మకము
ఉండిన
దానికి
‘గజముఖము’
అని
పేరు.
11
▾
Meaning
Keep
ఈ
మూడు
కలిగినవాడు
ఎవరైనాసరే
గజముఖమే,
గజతెలివే!
యీనాటి
పిల్లలందరు
ఒకదానికొకటి
విమర్శించుకుంటూ
‘ఏమిటి
గణపతి
అంటే
ఏనుగుతల
ఉంటున్నాది?
యిది
చాలా
విచిత్రమైనది.
పుట్టినప్పుడే
ఏనుగుతల
ఉంటే
ప్రదర్శనలో
పెట్టవచ్చునే’
అని
వాదించుకుంటారు.
ఆ
గజతెలివి
అనేది
నిరూపించే
నిమిత్తమై
గజముఖము
పెడుతూ
చూపించారు.
భారతీయుల
పర్వదినములు
అన్నియు
అంతరార్థముతో
కూడినవేగానీ
బాహ్యమైనవి
కాదు.
దురదృష్టవశాత్తు
కాలమార్పుచేత
ఈనాడు
అన్నీ
బాహ్యమైనవే
అభివృద్ధిపరచుకుంటున్నారు.
అంతర్భావములుగానీ,
అంతరార్థములుగానీ
ఎవ్వరూ
విచారించటం
లేదు.
అనుకూలములని
చెప్పి,
ఆచారములని
చెప్పుకుంటూ
మూఢాచారములక్రింద
మునిగిపోతున్నారు.
ఈ
ఆచారములు
ఎట్లాంటివంటే
చిన్న
ఉదాహరణము
చెబుతున్నాను.
ఒక
ప్రాచీనకుటుంబం
ఉండేది.
వారు
ప్రాచీన
సాంప్రదాయమును
అనుసరిస్తూ
వచ్చారు.
ప్రతి
పౌర్ణమిదినము
వారింటిలో
సత్యనారాయణవ్రతము
చేయటము
ఆచారముగా
వస్తూ
ఉండినది.
పూర్వకాలములో
ధనధాన్యములు
సమృద్ధిగా
ఉండేవి.
ప్రతి
యింటియందు
ధాన్యము
సమృద్ధిగా
ఉండేది.
అనేక
సంవత్సరములుగా
ఈ
వ్రతమును
జరిపిస్తున్న
పూజారి
మరణించాడు.
కొత్త
పూజారి
వచ్చాడు.
ఆ
యింటి
యజమానురాలైన
వృద్ధురాలు
అడిగింది,
‘నాయనా!
నీకు
సత్యనారాయణవ్రతము
చేయించే
విధానము
తెలుసునా?’
అని.
‘అమ్మా!
బ్రాహ్మణుడై
పుట్టిన
నాకు
సత్యనారాయణవ్రతము
చేయించుట
తెలియదా?
తప్పక
తెలుసును,’
అన్నాడు.
ఆరోజుల్లో
తెల్లవారి
లేచేటప్పటికి
కాఫీ,
టీలు,
టిఫిన్లు
లేవు.
9
గం॥లకు
భోజనము
చేసేవారు.
యిప్పుడిప్పుడు
ప్రారంభమయ్యాయి,
యిడ్లీలు,
దోసెలు,
వడలు.
ఆనాడు
యేమీ
లేవు.
సత్యనారాయణవ్రతము
ఉదయం
5
గం॥లకే
ప్రారంభము
చేసేవారు.
దానికి
తగిన
సామాగ్రి
ముందురోజు
రాత్రే
సిద్ధము
చేసేవారు.
అప్పుడు
సత్యనారాయణవ్రతమునకు
కావలసిన
సామాగ్రి
అంతా
లిస్టు
వ్రాసి
యిచ్చాడు,
ఆ
ముసలమ్మకు.
‘యివి
అన్నీ
తయారు
చేసి
పెట్టుకోండి!
తెల్లవారి
5
గం॥లకే
వస్తాన’న్నాడు.
ఈ
వృద్ధురాలు
చూచింది.
‘అయ్యా!
మా
ప్రధానమైన
సాంప్రదాయమును
మరచిపోయావే’
అనింది.
‘ఏమిటమ్మా!
ఆ
సాంప్రదాయము?
చెప్పండి,
నేను
వింటాను’
అన్నాడు
క్రొత్త
పూజారి.
‘ముందు
రోజు
రాత్రి
పిల్లిని
పట్టి
గంపక్రింద
పెట్టి
పోవాలి.
12
▾
Meaning
Keep
అది
మా
సాంప్రదాయమం’ది.
‘యిదేమి?
సత్యనారాయణవ్రతానికి,
పిల్లిని
పట్టి
గంపక్రింద
పెట్టటానికి
ఏమి
సంబంధము,’
అనుకున్నాడు
బ్రాహ్మణుడు.
యిది
సాంప్రదాయము
కాదని
చెబుతే
తనకు
వచ్చే
దక్షిణ
పోతుంది.
సరే
అని
తానుకూడను
ఒక
పిల్లిని
పట్టి
గంపక్రింద
పెట్టి
పోయాడు.
ఈ
పిల్లిని
ఎందుకు
ముందురోజు
రాత్రి
గంపక్రింద
పెడుతూ
వచ్చారు?
ఆ
రోజుల్లో
ప్రతి
యింటిలో
యింటి
నిండుకు
ధాన్యము
ఉండేటువంటిది.
ధాన్యము
అధికంగా
ఉండటంచేత
ఎలుకలు
ఎక్కువగా
ఉండేవి.
ఈ
ఎలుకలు
పట్టేకోసం
పిల్లులను
పెంచేవారు.
పిల్లులు
యింటిలో
తిరుగుతుంటే
దానికి
కొన్ని
దుర్గుణాలు
ఉన్నాయి.
ఎక్కడైనా
ధాన్యములోపల
మలవిసర్జన
చేసి
దానిని
మూసిపెట్టేది,
వెళ్ళిపోయేది.
క్రితంరోజు
రాత్రి
గోధుమరవ్వ,
చక్కెర
కలిపి
సత్యనారాయణ
ప్రసాదమని
చేసి
తట్టలో
పెట్టాలి.
పంచామృతములంతా
సిద్ధము
చేయాలి.
ఈ
పంచామృతములు
అవి
ముట్టుకుంటాయో
ఏమోనని
పిల్లిని
గంపక్రింద
పెట్టేవారు.
ఈ
విధంగా
తమ
అనుకూలముకోసం
చేసిన
పనులన్నీ
ఒక
ఆచారముక్రింద
రూపొందినాయి.
నిజానికి
యివన్నీ
ఆచారములు
కాదు,
కేవలం
మూఢాచారములు.
యిలాంటివి
చూచే
యీనాటి
యువకులంతా
వీటిని
గురించి
హాస్యాస్పదముగా
మాట్లాడుతుంటారు.
అనుకూలముకోసం
చేసే
సదుపాయములకు,
ఆచారంకోసం
చేసే
దివ్యభావమునకు
చాలా
వ్యత్యాసము
ఉంటున్నది.
మీరు
నమ్మినా,
నమ్మకపోయినా
కర్మఫలసిద్ధాంతము
యేమాత్రము
మారదు
విద్యార్థులారా!
మనము
చేసే
ప్రతి
కర్మకు
ఒక
ఫలితము
ఉంటున్నది.
మంచి
కర్మకు
మంచి
ఫలము,
చెడ్డకు
చెడ్డ
ఫలము
ఉంటున్నది.
మీరు
నమ్మినా,
నమ్మకపోయినా,
కర్మఫల
సిద్ధాంతము
యేమాత్రము
మారదు.
ఒక
చిన్న
విత్తనము
ఉంటున్నాది.
అది
భూమిలో
నాటినప్పుడు
కొంతకాలమునకు
అది
మొలకెత్తి
పెద్ద
వృక్షమవుతుంది.
అందులో
ఉన్న
ఆకులు,
పువ్వులు,
కాయలు,
కొమ్మలు
రెమ్మలు
అన్నీ
యీ
విత్తనములో
భాగములే!
ఎలాంటి
విత్తనమో
అలాంటి
వృక్షము
వస్తుంది.
మామిడి
విత్తనము
పెడితే
వేప
చెట్టు
రాదు.
మనం
చేసే
ప్రతి
కర్మ
ఒక
విత్తనము
వంటిది.
యిక
మున్ముందు
నేడు
కాకపోయినా
రేపైనా
ఎన్ని
జన్మలకైనా
కర్మఫలమును
అనుభవించక
తప్పదు.
కనుక
మంచిని
చెయ్యాలి
మనము.
ఒక
చిన్న
ఉదాహరణము.
విద్యార్థులే
ఉంటున్నారు.
పరీక్ష
హాలులోకి
పోయి
పరీక్ష
వ్రాస్తారు.
13
▾
Meaning
Keep
తాను
వ్రాసిన
వ్రాతలోనే
ఉంటున్నాది
ప్యాసా,
ఫెయిలా
అన్నది.
అప్పటికప్పుడు
తెలీదు.
ఒక
నెలో,
ఒకటిన్నర
నెలలో
అయిన
తరువాత
ఫలితాలు
వస్తాయి.
ఫలితము
నీవు
వ్రాసినదానికి
తగినట్లుగానే
వస్తుందిగానీ
వ్రాయనిదానికి
రాదు.
ఆ
ఫలితము
నీ
వ్రాతలోనే
ఉంది.
అప్పటికి
తెలియదు.
కర్మ
ఒక
సమయములో
ఆచరిస్తే
ఫలితము
మరొక
సమయములో
వస్తున్నాది.
ఈ
కర్మకు,
కర్మఫలితమునకు
మధ్యలో
పరిణామము
జరుగుతూ
ఉన్నది.
ఆ
పరిణామములోపలనే
మానవునియొక్క
మంచిచెడ్డలు
మారుతున్నాయి.
ప్రతికర్మకు
మనం
ప్రతిఫలము
అనుభవించవలసివస్తుంది.
దీనిని
పురస్కరించుకొనే
మను
చక్రవర్తి
ధర్మమును
ఆచరించమని
చెప్పాడు.
కర్మేంద్రియ,
జ్ఞానేంద్రియములు
రెండింటిని
ఏకము
చేసినప్పుడు
అదే
శరణాగతి
విద్యార్థులారా!
ఒక
నిలువుటద్దము
ఉంటున్నాది.
ఆ
అద్దముముందు
నీవు
పోయి
నిల్చుకొని
ఆ
ప్రతిబింబమునకు
నమస్కారము
చేయి.
ఆ
ప్రతిబింబము
కూడను
నీకు
నమస్కారము
చేస్తుంది.
ఆ
ప్రతిబింబమును
నీవు
దండించు.
అది
నిన్ను
దండిస్తున్నది.
ప్రకృతి
ఒక
అద్దమువంటిది.
ఆ
అద్దములోపల
నీవు
యేమి
కర్మ
చేస్తున్నావో
అదంతా
తిరిగి
నీకే
వస్తున్నాది.
మనము
ఒకటి
చేసి,
యింకోటి
అనుభవిస్తున్నామని
చెప్పేది
వీలు
లేదు.
ఏది
చేశామో
అదే
అనుభవిస్తున్నాము.
కొన్నిటికి
అప్పటికప్పుడే
ఫలితములు
రావచ్చును.
కొన్ని
చాలా
ఆలస్యంగా
రావచ్చును.
కొన్ని
జన్మలకు
రావచ్చును.
నేను
యిప్పుడు
తప్పు
చేశాను
నాకు
యిప్పుడు
ఫలితము
రాలేదే
అని
గర్వించవద్దు.
‘ముందున్నదిరా
తొందరలోనే
ముసలితనమను
ముసళ్ల
పండుగ’
అని
ముందు
వస్తున్నాది.
కొన్ని
అప్పటికప్పుడే
వస్తుంటాయి.
చూడు,
యిప్పుడు
యీ
బల్లను
నేను
గట్టిగా
కొట్టాను.
బల్లను
గట్టిగా
కొట్టినానని
నిన్ను
నీవు
పొగడుకుంటున్నావు.
అదే
సమయంలో
ఆ
బల్లకూడా
నిన్ను
అంత
గట్టిగా
కొట్టింది!
అదే
విధముగా
reaction,
reflection,
resound.
యిది
తప్పింది
కాదు.
ఎట్టి
పరిస్థితులలోను
దీనిని
తప్పించుకోటానికి
వీలు
కాదు.
కనుక
మనము
కర్మలు
చేసే
పూర్వమే
మంచి
కర్మలు
ఆచరించాలి.
ఉపనిషత్తులు
‘తస్మై
నమఃకర్మణే’
అని
ప్రతి
కర్మకు
మొట్టమొదట
నమస్కారము
చేయాలని
బోధిస్తున్నాయి.
ఎందుకు?
మనచే
మంచి
పనులు
చేయించమని.
14
▾
Meaning
Keep
మంచి
భావాలు
పోషించమని.
మంచి
తలంపులు
కలిగించమని
కర్మకు
నమస్కారం
చేయాలి.
ఈ
నమస్కారములో
ఉండిన
అంతరార్థము
ఏమిటి?
5
కర్మేంద్రియములు,
5
జ్ఞానేంద్రియములు
ఈ
పదింటిని
చేర్చి
ఏకము
చేయటమే
నమస్కారము.
కర్మేంద్రియజ్ఞానేంద్రియములను
రెండింటిని
ఏకము
చేసినప్పుడు
అదే
శరణాగతి
అన్నారు.
యిదియే
ఆధ్యాత్మికమన్నారు.
అనేకత్వమును
ఏకత్వము
చేయటమే
నమస్కారము.
కానీ,
యీనాడు
ఏకత్వమును
అనేకత్వము
గావించే
మేధావంతులు
అభివృద్ధి
అవుతున్నారు.
అనేకత్వమును
ఏకత్వముగా
చేసే
గుణవంతులు
అరుదుగా
ఉంటున్నారు.
ఈనాడు
గుణవంతులు
కావాలి.
బలవంతులు
కాదు,
ధనవంతులు
కాదు.
యిది
ఏనాటికి
మనకు
పనికి
రాదు.
ఎండమావులు
ఏ
మానవునియొక్క
దాహమును
తీర్చలేవు.
ధనకనక
వస్తువాహనాదులు
ఏ
మానవుని
సంతృప్తి
చేయలేవు.
వీటివలన
అప్పటికప్పుడు
సంతోషపడవచ్చునేగానీ
అవి
మనకు
ఏనాటికి
దక్కేవి
కాదు.
మన
విద్యలు
గానీ,
ధనము
గానీ,
దేహబలముగానీ
అన్నీ
passing
clouds,
passing
clouds.
ప్రతి
ఒక్కటీ
కదలిపోయే
మేఘములే!
కానీ
ఒక్కటి
మాత్రమే
కదలనటువంటిది.
అదే
నీ
పవిత్రమైన
భావము.
దానిని
నిత్యమైనదిగా
సత్యమైనదిగా
తీర్చిదిద్దుకున్నప్పుడే
మానవత్వము
రాణిస్తుంది.
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానములతో
కూడిన
మానవత్వమును
అనుగ్రహించుమని
ప్రార్థించడమే
గణపతి
పూజ
విద్యార్థులు
గణపతిని
ఎక్కువగా
పూజిస్తారు.
ఎందుకనగా
బుద్ధిని,
సిద్ధిని
అందించమని.
గ-బుద్ధి,
ణ-విజ్ఞానము.
ఈ
రెండూ
చేరితే
విజ్ఞాన,
ప్రజ్ఞానములైపోతాయి.
ఈ
విజ్ఞానప్రజ్ఞానములు
రెండింటిద్వారా
సుజ్ఞానము
మనలో
ఆవిర్భవిస్తుంది.
సుజ్ఞానమంటే
ఏమిటి?
ఈ
సుజ్ఞానమే
మానవునకు
సులక్షణము.
అజ్ఞానమే
మానవునకు
అవలక్షణము.
ఈ
రెండూ
వేరు
వేరుగా
ఉండినంతవరకు
సుజ్ఞానప్రజ్ఞానములు
యేమాత్రము
ఏకత్వము
కాదు.
సుజ్ఞానమనేది
చక్కెర,
ప్రజ్ఞానమనేది
నీరు.
నీరు
నీరుగానే
చక్కెర
చక్కెరగానే
ఉంటే
ప్రయోజనము
లేదు.
ఈ
నీరు,
చక్కెర
రెండూ
చేరితే
పానకము
అయిపోయింది.
ప్రజ్ఞానవిజ్ఞానములు
రెండూ
చేరి
సుజ్ఞానమైపోయింది.
ప్రజ్ఞాన-గ,
ణ-విజ్ఞానము.
ఈ
రెండింటికి
అధిపతి
సుజ్ఞానము.
15
▾
Meaning
Keep
ప్రజ్ఞాన,
విజ్ఞాన,
సుజ్ఞానములతో
కూడిన
మానవత్వము
అనుగ్రహించమని
వినాయకుని
ప్రార్థిస్తూ
వచ్చారు.
ఈనాటి
విద్యలందు
ప్రజ్ఞానము
లేదు,
విజ్ఞానము
లేదు,
సుజ్ఞానము
లేదు.
కేవలము
bookish
knowledge,
practical
knowledge
యీ
రెండింటితోనే
మన
రథము
నడుపుకుంటూ
పోతున్నాము.
Bookish
knowledge
ఎంతసేపు
ఉంటుంది?
నేడు,
రేపు;
తరువాత
యిది
ఏమైపోతుందో?
అంతర్థానమై
పోతుంది.
అంతవరకు
పోనక్కరలేదు.
మనము
పరీక్షహాలులో
ప్రవేశిస్తూన్నాము.
పరీక్షహాలులో
ప్రవేశించేవరకు
నీవు
చదివినదంతా
నెమరు
వేస్తూ
ఉంటావు.
ఈ
పేపర్లో
దాన్నంతా
చేర్చి
దిద్దుతావు.
పరీక్షలు
అయిపోయిన
తరువాత
నీవు
చదివినదంతా
మరచిపోతావు.
ఈ
చదువు
పరీక్షహాలునుండి
బయటకు
వచ్చేటప్పటికే
పోతున్నాది.
అటువంటిది
జీవితమంతా
మన
వెంట
ఉంటుందా?
యీ
విద్యలన్నీ
విద్యలు
కాదు;
అవిద్యలనే
చెప్పవచ్చును.
అన్నింటిలో
‘O’
గ్రేడు
వచ్చిందని
గర్వించి
విఱ్ఱవీగిపోవటము,
యిది
అజ్ఞానమే!
ఏమిటి
యీ
‘O’
గ్రేడు?
ఈ
‘O’
గ్రేడుకు
రెండు
అర్థాలుంటున్నాయి.
ఒకటి
పస్ట్క్లాసు
గ్రేడు.
అదే
తిరిగి
జీరోగా
మార్చు.
అది
జీరోనా
లేక
పస్ట్క్లాసా?
ఏమీ
చెప్పలేము.
పాసా
లేక
ఫెయిలా?
రెండింటికి
అది
చిహ్నంగానే
ఉంటున్నది.
కాబట్టి
అదంతా
జీరోనే!
చిన్న
జీరో
పెట్టు;
పెద్ద
జీరో
పెట్టు;
ఎంత
పెద్దగా
మార్చినప్పటికిని
అది
జీరోనే!
కానీ,
దాని
ప్రక్కన
ఒకటి
పెట్టండి.
అదే
విలువ
వస్తుంది.
లైఫ్
యీజ్
జీరో!
గాడ్
యీజ్
హీరో!
పరమాత్ముని
మరుస్తే
యివన్నీ
జీరో
అయిపోతాయి!
భగవంతుని
మాత్రము
మరచకూడదు.
Hero
becomes
zero
if
he
forgets
GOD.
మనం
భగవంతుని
మరచకుండా
భగవద్భావాన్ని
హృదయంలో
పెట్టుకొని
సర్వ
కర్మలు
శక్త్యానుసారం
చేస్తూ
ఉంటే
యిదే
మానవత్వానికి
విలువ
యిస్తుంది.
ఏ
పని
చేసినా
భగవత్కర్మగా
మీరు
భావించండి!
పనులు
మానకూడదు.
పనులు
చేసే
తీరాలి.
Work
will
be
transformed
into
worship.
యిది,
మనము
చేయవలసిన
కర్మను
వదిలి
ప్రార్థన
చేయటం
కాదు.
ప్రార్థన
వదలి
కర్మ
చేయటం
కాదు.
రెండింటిని
ఏకత్వంగా
చేయాలి.
Previous
←
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
Next
Teaching equal-mindedness is the chief aim of Divinity
→