Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · To search for the divinity that is everywhere is Ajñāna!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
To search for the divinity that is everywhere is Ajñāna!
1 December 1992, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
సాధకులమని
పిలిపించుకునేవారు
తాము
దైవాన్వేషణ
జరుపుతున్నామని,
దైవము
నిమిత్తమై
సాధనలు
సల్పుతున్నామని
అనేక
విధములుగా
వాదిస్తుంటారు.
దైవాన్వేషణ
అనగా
ఏమిటో
అర్థం
తెలియనటువంటి
వ్యక్తులే
యీ
విధమైన
పదం
ఉపయోగ
పెట్టి
‘సాధన’
అని
చెపుతుంటారు.
దైవాన్వేషణ
అనేది
ఆధ్యాత్మిక
మార్గంలో
సరియైనటువంటి
పదము
కాదు.
ఎక్కడో
ఒకచోట
ఉండినటువంటి
దైవాన్ని
అన్వేషణ
సల్పటం
సహజము.
సర్వత్రా
ఉండినటువంటి
దైవత్వాన్ని
అన్వేషణ
జరపటం
అజ్ఞానం!
తనయందు,
తనవెలుపల,
తన
చుట్టూ
సర్వత్రా
ఉండిన
దైవత్వాన్ని
అన్వేషణ
ఎందుకు
చేయాలి?
కనుక,
అన్వేషణ
జరుపుతున్నామనే
వ్యక్తి
దైవత్వాన్ని
గుర్తించనటువంటి
మూర్ఖుడే!
‘సర్వతఃపాణిపాదం’
అని
చెప్పింది
గీత.
వేదమునందుకూడా
‘అంతర్బహిశ్చతత్సర్వమ్
వ్యాప్య
నారాయణస్థితః’
అని
చెప్పడం
జరిగింది.
లోపల,
వెలుపల
సర్వత్రా
ఉండినటువంటిది,
నారాయణ
స్థితియే!
ఇక
సాధనలు
ఎందుకు?
అన్వేషణ
ఎందుకు?
సాధనలయొక్క
ఫలితమేమిటి?
ఏ
విధంగా
సాధన
చేస్తున్నాము?
భగవదన్వేషణ
మానవునియొక్క
సహజస్థితియే!
ఈ
విధంగా
ప్రశ్న
వేసుకుంటే
నిత్యజీవితంలో
తెల్లవారి
లేచినది
మొదలు
రాత్రి
పరుండునంతవరకు
మనం
చూచినటువంటిదే
సాధన
అన్పించుకోదు.
భగవంతుని
అన్వేషణ
అనగా
ఏమిటి?
మానవునియొక్క
సహజస్థితియే!
తనయొక్క
నిత్యజీవితంలో
అనుభవించే
ప్రతి
క్రియకూడా
భగవంతుని
స్వరూపమే!
‘భగవంతుడెలా
ఉన్నాడు?
ఎక్కడ
ఉన్నాడు?’
అనే
జిజ్ఞాస
ఉండినప్పుడే
యీ
అన్వేషణ
అనే
పదం
వర్తిస్తుంది.
యివన్నీకూడా
ఆధ్యాత్మికములని
భావించి
అర్థరహితమైన
పదములను
వినియోగించుకుంటూ
కాలమును
వ్యర్థం
గావించుకుంటున్నాడు,
మానవుడు.
ఆధ్యాత్మికమార్గంలో
ప్రవేశించిన
మానవుడు
దైవత్వాన్ని
తన
స్వంతంగా
చేసుకోవాలి.
ఇది
సహజమైన
స్థితిగా
భావించాలి.
అంతే
కాని
యిది
ప్రత్యేకమైన
స్థితికాదు.
2
▾
Meaning
Keep
ప్రత్యేక
మార్గం
కాదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
భగవంతుని
చింతించడానికి
ప్రయత్నిస్తూ
ఉండగా
మనస్సు
పరిపరి
విధములుగా
పరుగెడుతూ
ఉంటుంది.
మిగిలిన
విషయాలలో
మాత్రం
మనస్సు
సుస్థిరముగా
ఉంటుంది.
మనం
ఏదైనా
ఒక
పుస్తకం
చదువుతున్నాము.
మన
ధ్యానమంతా
ఆ
చదువుపైన
ఉంటుంది.
ఎటుప్రక్కా
చలించటం
లేదు.
ఉత్తరం
వ్రాస్తున్నావు;
‘ఒక
అక్షరం
ప్రక్క
మరొక
అక్షరం
ఏ
విధంగా
ఉన్నది?’
అనేటువంటి
ధ్యానము
యిక్కడ
ఉంది.
దారి
చూస్తున్నావు,
ధ్యానం
చాలా
ఉంది.
ధ్యానములో
ప్రత్యేకంగా
కూర్చుని
భగవంతుని
చింత
చేయాలంటే
మనస్సు
పరుగెడుతుంది.
అన్ని
విషయములందు
మన
మనస్సు
సుస్థిరంగా
నిలుస్తోంది.
కాని
దైవ
విషయంలో
వచ్చేటప్పుడు
చలించుతోంది,
కదిలిపోతోంది,
పరుగెత్తుతుంది.
దీనికి
కారణం
ఏమిటి?
ఇది
మానవుని
యందున్నటువంటి
యిచ్ఛయొక్క
తప్పు.
తనయొక్క
సంకల్పము
సరియైన
సంకల్పం
కాదు.
ప్రాకృతవిషయములందు
ఎటువంటి
దీక్ష
ఉన్నదో
అదే
దీక్షను
భగవంతునియందు
ప్రవేశపెట్టటం
లేదు,
మానవుడు
ప్రాకృతిక
విషయములలో
మానవునికి
అమితమైన
ఆశ,
ప్రేమ,
యిష్టం.
కనుకనే
దానిపైన
ప్రత్యేకమైన
ఏకాగ్రత
చూపిస్తూ
ఉంటాడు.
భగవంతునిపైన
ఏదో
కొంతవరకూ
మాత్రమే
మనస్సు
లగ్నం
చేయటంచేత
అక్కడ
నిలచటానికి
ప్రయత్నించదు.
ఈ
ప్రాకృతసంబంధ
విషయములందు
ఏ
దీక్ష
ఉందో
అదే
దీక్షను
భగవంతునియందు
ప్రవేశపెట్టటం
లేదు.
‘ఇవన్నీ
నావి,
ఇదొక్కటీ
భగవంతునిది,’
అని
విభజిస్తున్నారు.
ఈ
విభజనవల్లనే
మనసుకూడా
విభజింపబడుతుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
డ్రైవింగ్
నేర్చుకునే
సమయంలో
విశాలమైన
మైదానమునకు
వెళ్లి
అక్కడ
అటూయిటూ
తిరిగినా
తప్పు
లేదు,
ప్రమాదం
లేదని
డ్రైవింగ్
నేర్చుకుంటాడు.
పూర్తిగా
డ్రైవింగ్
నేర్చుకున్న
తర్వాత
ఇరుకు
రోడ్లలోకూడా,
సందులు
గొందులలోకూడా
డ్రైవ్
చేయగలడు.
ఈయొక్క
అనుభూతికి
కారణమేమిటి?
పూర్వం
విశాలమైన
దానిలో
తాను
డ్రైవింగ్
నేర్చుకోవటంచేత
ఆ
నేర్పువల్ల
యీ
ఇరుకురోడ్లలోకూడా
చాలా
సులభంగా
వెళ్లగల్గుతున్నాడు.
అదే
విధంగా
తన
మనస్సును
విశాలమైన
రీతిలో
మొట్టమొదట
ప్రాక్టీసు
చేస్తే
ఎలాంటి
చిన్న
విషయములందుకూడా
ఆ
మనస్సు
ఏకాగ్రతను
కోల్పోదు.
3
▾
Meaning
Keep
ప్రేమను
పెంచుకోవటంచేతనే
ఏకాగ్రత
గల్గుతుంది.
ప్రేమ
తక్కువగా
ఉండటంచేతనే
ఏకాగ్రత
కుదరటం
లేదు.
ఇంకొక
చిన్న
ఉదాహరణ.
కారు
డ్రైవ్
చేసుకుంటూ
పోతున్నాడు.
కారులో
కూర్చున్నటువంటి
వ్యక్తులు
అనేక
విషయములు
మాట్లాడుకుంటున్నారు.
ఆ
ప్రశ్నలకు
తగిన
సమాధానం
యిస్తున్నాడు
డ్రైవరు.
నవ్వుతున్నాడు,
మాట్లాడుతున్నాడు,
జవాబు
చెబుతున్నాడు.
కానీ
కారు
డ్రైవ్
చేసుకుంటూ
పోతున్నాడు.
చూశారా?
అదే
డ్రైవరు
ఎవరైన
ఒక
పెద్ద
గుంపు
అడ్డం
వచ్చి,
రోడ్డు
చిన్నగా
ఉంటున్నప్పుడు
మాట్లాడడు,
జవాబు
చెప్పడు.
మీరు
మాట్లాడకండి
అని
చెప్పి
చాలా
జాగ్రత్తగా
డ్రైవింగ్
చేసుకుంటూ
పోతాడు.
కారణం
ఏమిటి?
ఈ
పెద్దగుంపు
ఎక్కువగా
ఉంది,
దారి
చిన్నదిగా
ఉంది.
ఏదైనా
ప్రమాదం
జరుగుతుందేమోనని,
తనకేమైనా
ప్రమాదం
జరుగుతుందేమోనని
తనపైన
తనకి
ప్రేమ
అధికంగా
ఉండటంచేత
అక్కడ
ఎక్కువ
ఏకాగ్రత
ఉంటోంది.
నీ
ప్రేమను
భగవంతునిపై
మళ్ళించినపుడు
ఏకాగ్రత
కుదురుతుంది
అదేవిధంగా
భగవంతునిపైన
ప్రేమ
అధికంగా
ఉన్నప్పుడు
ప్రక్కకు
వెళ్తాడు.
నీపైన
నీకెంత
ప్రేమ
అధికంగా
ఉంటున్నదో,
నీ
ప్రమాదాలను
నీవు
తప్పించుకునే
నిమిత్తమై
నీవు
ఎంత
జాగ్రత్తగా
డ్రైవ్
చేస్తున్నావో,
అదే
ప్రేమను
భగవంతునిపైన
పెట్టినప్పుడు
నీకు
ఏకాగ్రత
చలించటానికి
వీల్లేదు.
కనుక
ప్రేమ
తక్కువగా
ఉండటంచేతనే
ఏకాగ్రత
కుదరటం
లేదు.
ప్రేమనెంత
అధికంగా
పెంచుకుంటే
అంత
ఏకాగ్రత
కుదురుతుంది.
కనుక,
ఏకాగ్రత
కుదరనటువంటివారి
దోషము
ఏమిటంటే,
దైవముపైన
సరియైన
ప్రేమ
లేకపోవటమే!
దైవమంటే
ప్రేమ
అని
చెప్తావు.
తల్లి
బిడ్డలను
ప్రేమిస్తుంది.
బిడ్డ
తల్లిని
ప్రేమిస్తుంది.
కాని
ఆకలి
అయినపుడు
అమ్మకు
అమ్మే
తినాలి,
బిడ్డకు
బిడ్డే
తినాలి.
బిడ్డపైన
ప్రేమ
ఎక్కువగా
ఉందని,
బిడ్డకోసం
తల్లి
తింటే
బిడ్డ
ఆకలి
తీరుతుందా?
అయితే
యీనాడు
ప్రేమ
ప్రేమగా
ఉంటోంది.
ఏకాగ్రతను
తన
స్వంతముకోసం
ఉపయోగపెడ్తున్నారు.
‘నేను
భగవంతునికి
చెందినవాడను’
అనే
భావం
రావటం
లేదు.
ఉత్తరములో
వ్రాస్తుంటారు,
‘నేను
నీవాడను,
నీవు
నా
వాడవు’
అని.
4
▾
Meaning
Keep
కాని
ప్రాక్టికల్‌గా
కుదరటం
లేదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
మన
యింట్లో
తల్లి,
బిడ్డలు,
తండ్రి
అందరూ
ఉంటారు.
కాని,
ఎవరి
పని
వారు
చేసుకుంటూ
ఉండాలి.
యింట్లో
తల్లి
వంటగదికి
వెళ్లి
వంటలు
వండటం
యివన్నీ
చేస్తుంది.
బిడ్డలుకూడా
యిల్లంతా
శుభ్రం
చేయటం,
సామానులంతా
కడుక్కోవడం
యిలాంటి
యింటి
పనులేవో
చేసుకుంటూ
ఉంటారు.
ఇంత
పనులు
చేసినప్పటికీ
సాయంకాలం
అయ్యేటప్పటికి
‘అమ్మా!
నేను
యిల్లంతా
ఊడ్చాను,
సామానంతా
సర్దాను.
ఏమైనా
కూలి
యిస్తావా?’
అని
బిడ్డ
అడగదు.
భార్య
వంటనంతా
చేసి
‘యింత
శ్రమ
పడ్డాను,
ఈ
శ్రమకేదైనా
డబ్బులు
యిస్తారా?’
అని
భర్తనడగదు.
భర్త
ఆఫీసుకు
పోయి
పని
చేసి,
ఇంటికి
వచ్చిన
తరువాత
‘నేను
యింత
పని
చేశాను,
యీ
కుటుంబంకోసం.
మీరేదైనా
యిస్తారా?’
అని
అడగడు.
కారణమేమిటి?
ఇంటిలోనివారు
తన
స్వంతము.
ఈ
విధంగా
స్వంతమువారు
కావటంచేతనే
వారికొరకు
తన
సర్వశక్తి
ధారపోస్తున్నారు.
స్వంతవారు
కావటంచేతనే
వారిని
పోషించినందుకు
కూలిని
వారు
ఆశించటం
లేదు.
కాని,
ఎవరైనా
యిద్దరు
కూలీలను
పిలిచి
యింట్లో
ఏదైనా
పని
చేయించినప్పుడు
సాయంకాలానికి
‘సార్!
మా
కూలి
మాకివ్వండి’
అని
అడుగుతారు.
ఎందుకంటే
పనిచేసి
కూలినడిగి
తీసుకుని
పోయేవారు
పరాయివారు.
పని
సిన్సియర్‌గా
చేసి,
హృదయపూర్వకంగా
నా
పని
అని
చేసి
కూలి
అడగకుండా
ఉండేవారు
స్వంతంవారు.
ఫలితమునాశించి
జపధ్యానములు,
పూజలు
చేసేవాడు
భగవంతునికి
పరాయివాడు
భగవంతుడు
నా
స్వంతంవాడు
అనుకుంటే,
నేనింతపని
చేశాను,
యింత
జపం
చేశాను,
యిన్ని
సాధనలు
చేశాను
భగవంతుడు
నాకేమి
యివ్వటం
లేదే
స్వంతానికి
అని
ఫలితాన్ని
కోరి
చేసేవాడు
పరాయివాడు.
ఫలితమునాశించి,
జపములు,
ధ్యానములు
చేసి
భగవంతుడినుండి
ఫలితాన్ని
ఆశించేవాడు
పరాయివాడు.
భగవంతునికి
స్వంతమువాడు
కాడు.
‘నేను
నీ
వాడను’
అని
ఏ
ఫలితమును
ఆశించకుండా
తనయొక్క
ఆజ్ఞను
శిరసావహించేవాడు
స్వంతంవాడు.
కూలి
చేసినవానికి
అడిగినంత
మాత్రము
యిస్తాడు.
స్వంతమువారికి
అడగకపోయినా
యింకా
అధికంగా
యిస్తాడు.
భగవంతుని
అనుగ్రహానికి
పాత్రులుకావాలంటే,
భగవంతుని
ప్రేమతత్త్వాన్ని
చవి
చూడాలంటే
మనం
ఫలితాన్ని
ఆశించక,
ఆజ్ఞను
శిరసావహించి,
తనవారిగా
మనం
జీవించినపుడు
సర్వమూ
తానే
చూస్తాడు.
5
▾
Meaning
Keep
కాని
యీనాడు
కలి
ప్రభావంచేత
ప్రతి
చిన్న
దానికి
ఫలితం
కావాలి
అని
కోరుకుంటున్నారు.
‘జపం
చేశాను,
కాని
ఏమీ
ఫలితం
రాలేదే?
వ్రతాలు
చేశాను,
అయినా
నాకేమీ
ఫలితం
రాలేదే?’
అని
బాధపడుతుంటారు
కొందరు.
భగవంతుని
పరాయివానిగా
భావించి
నీవు
కూలి
పని
చేస్తున్నావు.
కనుక
నీవు
కూలివాడవు.
స్వంతంవాడివి
కాదు.
మనం
భగవంతునికి
స్వంతవాడు
కావాలి!
నీవు
స్వంతం
కావాలి.
నీవే
మాస్టర్
కావాలి.
అదే
నిజమైన
వేదాంత
ప్రబోధ,
ఆధ్యాత్మికమార్గము.
భగవంతుడికి
దూరంగా
ఉండి
నేను
పరాయి
వాడిని
అనుకున్నంత
కాలం
నీకు
ఫలితంకూడా
సిద్ధించదు.
‘నేను
తనవాడను’
అనుకోవాలి.
విభీషణుడు
రాక్షసుడు
అయినప్పటికి,
‘స్వామీ!
నేను
నీవాడను,
నీవాడను’
అని
రామునివద్దకు
పరుగెత్తి
వచ్చాడు.
ఈ
పదములు
వినినటువంటి
హనుమంతుడుకాని,
జాంబవంతుడుకాని,
సుగ్రీవుడుకాని,
అంగదుడుకాని,
లక్ష్మణుడుకాని
అందరూ
అడ్డు
చెప్పారు.
‘స్వామీ!
ఇతను
రాక్షసుడు.
ఏదో
నిన్ను
వంచించే
నిమిత్తమై
నీ
దగ్గరకు
పరుగెత్తి
వస్తున్నాడు.
ఇతనిని
నమ్మ
వద్దు’
అన్నారు.
ప్రాకృతమైన
దృష్టి
యిది.
రాముని
దృష్టి
అదికాదు.
ఎవరైనా
సరే!
నీవాడనని
ఒకపరి
అన్న
ఏవాడైన
ఏలుదున్
వానిని’
అన్నాడు.
కేవలం
నీవాడనని
మాటల్లో
చెపితే
కుదరదు.
ఇది
భగవంతుడిని
వంచించటానికి
కాదు.
ప్రాక్టికల్‌గా
అనుభవించి
చూపించాలి.
కనుకనే
విభీషణుడిని
ఏలుకున్నాడు.
తక్షణమే
ఏలుకోవటమే
కాకుండా
ప్రామిస్కూడా
యిచ్చాడు.
‘విభీషణా!
రావణుని
హతమార్చి
నిన్ను
లంకకు
రాజుగా
చేస్తాన’న్నాడు.
నీవాడినని
ఒక్కతూరి
అర్పితమై
పోయినప్పుడు
యింత
పెద్ద
సత్కారం
యిచ్చాడు.
నెమ్మదిగా
సుగ్రీవుడు
రాముని
దగ్గర
చేరి
‘విభీషణుడు
లంకాపురినుండి
వచ్చాడు.
నీవాడనని
ఒక్కతూరి
అతడు
కాళ్ళమీద
పడేటప్పటికి
యింత
పెద్ద
వరం
యిచ్చావు!
కాని,
తన
మనసే
మారి
సీతను
నీ
కప్పజెప్పి
నన్ను
క్షమించు
స్వామీ!
నేను
నీవాడనని
రావణుడే
వచ్చి
పాదములపై
పడితే
వానికేమి
యిస్తావు?’
అని
అడిగాడు.
6
▾
Meaning
Keep
‘నా
సోదరుడైన
భరతుడిని
నేను
చేతులు
పట్టుకుని
ప్రార్థించి
అయోధ్యకు
రాజుగా
చేస్తాను,
రావణుడిని’
అన్నాడు.
‘నిజంగా
అలాంటి
ఉన్నతమైన,
ఉత్తమమైన,
ఘనమైన,
విలువైనటువంటి
ప్రార్థనే
కనుక
అతనిలో
కల్గితే
వాడిని
అయోధ్యకే
రాజుగా
చేస్తాను,’
అన్నాడు.
కనుక
అలాంటి
విశాలమైన
భావం
‘నేను
నీవాడన’ని
రావాలి.
అదేవిధంగా
లక్ష్మణుడు
కూడను
‘నేను
రాముడివాడను’
అని
అనుకోవటంచేత
తన
ఆస్తిపాస్తి,
ఆలుబిడ్డలు
సర్వస్వమూ
త్యజించి
రామునివెంట
పోయాడు.
‘నాది
నాది
అనేది
నీవొక్కడే;
అంతకంటే
నాకు
ప్రత్యేకంగా
లేదు’
అని
భావించాడు,
లక్ష్మణుడు.
యీనాటి
సాధకులంతా
ఇందుకు
భిన్నంగా
కూలివాడిగా
పని
చేస్తున్నారు.
కూలివానిలాగా
పని
చేసి
కూలి
తీసుకున్నాక
నాకు,
వానికి
సంబంధం
ఏముంది?
ఫలితంకోసం
పని
చేస్తున్నారు.
ఫలితాన్ని
తీసుకుంటున్నారు,
పరుగెడుతున్నారు.
కనుక
యింక
వారికి,
నాకు
ఉన్న
సంబంధమేమిటి?
ఏ
ఫలితమూ
లేక
దేనిని
కోరక,
‘నేను
నీవాడనని,
నీ
పని
నా
పనే’
అని
భగవంతునికి
స్వంతవానిగా
అయినపుడు
వాని
సర్వభాగ్యములు
తానే
అవుతాడు.
ఇంటిలో
పిల్లవాడున్నాడు.
నావాడే
అనుకుని
వాడు
అడిగినా,
అడగకపోయినా
వానికి
డ్రెస్లంతా
కుట్టిస్తాడు,
తండ్రి!
వాని
తిండితీర్థాదులంతా
చూసుకుంటాడు,
తండ్రి!
Previous
←
Service of the village becomes service of Rāma!
Next
Every human being is none other than the embodiment of God!
→