Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Every human being is none other than the embodiment of God!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Every human being is none other than the embodiment of God!
4 December 1992, Brindavan
1
▾
Meaning
Keep
His poems 25
Also in his talks
(5)
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
17 July 1988
Only when man changes will the world change
21 August 1992
God is always the embodiment of Prema!
28 August 1996
That Which Gives Jñāna Alone Is Vidyā
16 July 1997
Love for God, fear of sin, morality in society
ఏమిలేని
బుఱ్ఱలోన
యేమైనను
చేర్చవచ్చు
ఏమేమో
నిండియున్న
బుఱ్ఱ
నింప
వీలుకాదు
కలి
బోధలు
నిండియున్న
తలబుఱ్ఱది
ఖాళియగున
తలబుఱ్ఱది
ఖాళికాక
యిల
సుకృతంబు
నింపనగునా!
ప్రేమస్వరూపులారా!
ప్రతి
మానవుడుకూడా
తానెవరో
తాను
తెల్సుకోవడానికి
ప్రయత్నించాలి.
‘నేనెవరు?’
అన్నప్పుడు,
ఈ
‘నేను’
దేహమా?
మనసా?
యింద్రియములా?
బుద్ధినా?
లేక
ఆత్మనా?
నిజముగా
నీవు
దేహమే
అయితే,
‘ఇది
నా
దేహము’
అని
ఎందుకు
చెప్పాలి?
నా
దేహము
అనుకున్నప్పుడు
దేహము,
నీవు
వేరు
కదా!
‘ఇది
నా
రుమాలు’
అన్నప్పుడు
రుమాలు
నీకంటె
వేరుగా
ఉంటుంది.
‘ఇది
నా
దేహము’
అని
చెప్పినప్పుడు,
దేహము
నీనుండి
వేరుగా
ఉన్నది.
నువ్వెవ్వరు?
చైతన్యమనేది
సర్వులయందు
ఉంటున్నది
కనుక
భగవంతుడు
అందరియందు
ఉంటున్నాడు
దేహము,
మనస్సు,
యింద్రియములు,
బుద్ధి
యివన్నీ
సాధనములు;
నీవు
మాష్టరు.
దీనికి
ఒక
చిన్న
కథ
ఉన్నది.
పిల్లలకు
కథలంటే
చాలా
యిష్టం.
కథలంటే
ఆధ్యాత్మికంగా
చెప్పేటువంటివి.
కాని,
యీ
కాలంలో
ఆధునిక
యువకులకంతా
నవల్సు
అంటే
చాలా
యిష్టం.
ఒక
25
సం॥ల
యువకుడు,
60
సం॥ల
తల్లి
ఉన్నారు.
ఈ
25
సం॥లు
తల్లికి
ఆ
యువకునితో
ఎక్కువ
అటాచ్మెంట్
ఉండేది.
తల్లిని
వదిలి
ఒక్క
దినమైనా
బయటికి
వెళ్లేవాడు
కాదు.
తల్లికూడా
అదేవిధంగా
వాత్సల్యాన్ని
పెంచుకుంటూ
పిల్లవాడిని
అత్యంత
గారాబంతో
పెంచుతూ
వచ్చింది.
ఇది
తల్లి,
బిడ్డలయొక్క
అన్యోన్యతతో
కూడిన,
అనురాగంతో
కూడిన
ప్రేమ.
2
▾
Meaning
Keep
వాత్సల్యంతో
కూడిన
ప్రేమ.
ఈ
ప్రేమను
వేరు
చేయడానికి
ఎవరికీ
సాధ్యంకాదు.
ఈ
విధంగా
ఉండగా
కొంతకాలమునకు
తల్లికి
అనారోగ్యం
ఏర్పడింది.
ఈ
అనారోగ్యం
కొంతవరకూ
శ్రుతి
మించిపోయింది.
తల్లి
చనిపోయింది.
ఆ
దేహాన్ని
ముందు
ఉంచుకున్నాడు,
యీ
యువకుడు.
‘తల్లీ!
ఇంతగా
ప్రేమించిన
నీవు
నన్ను
వదలిపోతివా?
ఎక్కడికి
పోయావు?
నన్ను
వదలి
ఏ
రీతిగా
నీవు
వెళ్లావు?
నేను
ఏ
రీతిగా
వంటరిగా
జీవించేది?
ఒక్క
దినమైనా
నిన్ను
వీడి
ఉండలేనటువంటివాడను.
ఈనాడు
నిన్ను
వదలి
నేను
ఏ
విధంగా
ఉండాలి?’
అని
చాలా
బాధ
పడ్తున్నాడు.
ఇక్కడ
మనం
కొంత
విచారణ
చేయాలి.
ఇంతకాలము
యీ
బిడ్డ
ఎవరిని
తల్లి
అని
గౌరవించి,
విశ్వసించి,
ఆరాధించి,
ఆనందాన్ని
అనుభవిస్తున్నాడు?
ఎవరిని
ఆరాధించాడు?
‘ఈ
దేహమే
నా
తల్లి’
అని
భావించి,
25
సం॥లు
విశ్వసించి,
ఆమెను
ప్రేమిస్తూ
వచ్చాడు.
యింతకాలం
ఆ
దేహమే
తల్లిగా
భావించాడు.
అయితే
ఆ
దేహము
అక్కడే
ఉన్నది
కదా!
అటువంటప్పుడు
‘నన్ను
వదిలిపోతివా?’
అని
ఎందుకు
అంటున్నాడు.
వదలి
పోయిందెవరు?
ప్రాణము.
అప్పుడు
తెల్సుకున్నాడు.
‘ప్రాణము
యీ
దేహంలో
ఉండినంతవరకు
తాను
తల్లిని
ప్రేమించాడు.
అన్ని
విధాలా
గౌరవించాడు,
సేవించాడు.
కాబట్టి
తన
తల్లి
ఎవరు?
ఎవరు
తనను
వదలిపోయారో
ఆమె
తన
తల్లి.
వదలి
పోయిందేమిటి?
ప్రాణం.
కనుక,
ప్రాణమే
తన
తల్లి,
దేహము
కాదు.
దేహము
కేవలం
ఒక
ఉపకరణము
మాత్రమే!
ఇంతకాలం
యీ
దేహాన్ని
తల్లిగా
భావించినవాడు
మరణించిన
తరువాత
దేహము
ఒక
ఉపకరణమని,
ప్రాణమే
తల్లి
అని
గ్రహించాడు.
కనుక,
ఎవరు
తల్లి?
ప్రాణమే
తల్లి.
ప్రాణమంటే
ఏమిటి?
ప్రాణమే
దైవము.
అదే
చైతన్యము.
ఆ
చైతన్యము
సర్వ
దేహములందు
ఉండటం
చేతనే
అన్ని
దేహములుకూడను
కలకలలాడుతూ,
కిలకిల
నవ్వుతూ,
తమతమ
కర్తవ్యములను
నిర్వర్తిస్తూ
ఉన్నాయి.
చైతన్యమనేది
సర్వులయందు
ఉంది.
కనుక
‘ఈశావాస్యమిదం
సర్వం.’
చైతన్యమనేది
అందరియందూ
ఉంటున్నది
కనుకనే
భగవంతుడు
అందరియందూ
ఉంటున్నాడు.
కానీ,
ఇప్పుడు
యీ
దేహాన్ని
వదలింది
చైతన్యము.
ఒకప్పుడు
ఈ
దేహములోకూడా
ఉంటూ
వుంది.
3
▾
Meaning
Keep
చైతన్యములేని
వస్తువు
లేనే
లేదు,
జగత్తులో!
చైతన్యము
లేనటువంటి
వస్తువు
లేనే
లేదు,
యీ
జగత్తులో!
అదే
సర్వులయందు
ఉండే
చైతన్యము.
ఈ
చైతన్యమునుండి
వచ్చినటువంటిదే,
దేహములో
ఒక
movement
గా
ఏర్పడినటువంటిదే
conscience.
ఈ
conscience
అనేది
దేహములో
ఉండడంచేత
senses
అనగా
యింద్రియములు
పని
చేస్తున్నాయి.
కాన్షియస్నెస్
అనేది
కాన్ష్యెన్స్నుండి
వచ్చింది.
ఇదే
ఆత్మతత్త్వము.
కాన్షియస్నెస్
అనేది
చైతన్యము.
కనుక
యీ
చైతన్యం
అనేది
సర్వత్రా
వ్యాపించి
ఒక్కొక్క
వస్తువునందు
ఒక
భాగంగా,
కెపాసిటీ
లేదా
లిమిట్‌గా
నిలచిపోయింది.
బల్బులు
అన్నీ
గ్లాస్‌తో
తయారుచేస్తారు.
కాని
లోపల
ఫిలమెంట్
వేరు
వేరుగా
ఉంటుంది.
ఒకటి
60,
ఒకటి
100,
ఒకటి
500,
ఒకటి
1000
వోల్టులు
కెపాసిటీ
ఉంటుంది.
వీటన్నింటిలోను
ప్రవహించే
కరెంటు
ఒకటే!
అదే
చైతన్యము.
అయితే
యీ
చైతన్యమనేది
ఎక్కడో
మనం
వెతకటానికి
వీలుకాదు.
ఎందుకంటే
తనలో
ఉన్నది,
బయట
ఉన్నది
ఒక్కడే.
అదే
reflection
of
the
inner
being.
నీవు
అద్దంలో
ఎవరిని
చూస్తున్నావు?
నిన్ను
నీవు
చూసుకుంటున్నావు.
ఎవరిని
దండిస్తున్నావు?
నిన్ను
నీవు
దండిస్తున్నావు.
అద్దములో
ఉన్న
బొమ్మను
దండించావంటే
ఆ
బొమ్మ
నిన్ను
దండిస్తుంది.
ఆ
అద్దములో
ఉన్న
బొమ్మకు
నీవు
నమస్కారం
చేస్తే
ఆ
నమస్కారం
తిరిగి
నీకే
వాపస్
వస్తుంది.
ఏది
చేసినా
reaction,
reflection,
resound.
కనుక
యీ
అద్దం
ప్రకృతి.
ఈ
కాన్షెన్స్
అనేది
రిఫ్లెక్షన్;
అదే
జీవుడు.
ఈ
రియాలిటీ
చైతన్యము
అనేటువంటి
దేవుడు.
ప్రకృతి
భావము
ఉండినంతవరకు
మనకు
జీవ
భావము
పోదు
దేవుడియొక్క
ప్రతిబింబమే
జీవుడు.
ఈ
జీవుడనేది
ఎప్పుడు
కన్పిస్తోంది?
అద్దం
ఉంటే
కన్పిస్తుంది.
ఈ
అద్దమే
ప్రకృతి.
కనుకనే
యీ
ప్రకృతిభావం
ఉండినంతవరకూ
మనకు
జీవభావం
పోదు.
మననుండి
యీ
ప్రకృతిభావాన్ని
తీసివేయడానికి
వీలుకాదు.
కనుక,
ప్రకృతిభావములకు
బదులు
పరమాత్మభావాన్ని
పెంచుకున్నప్పుడు
‘సర్వం
విష్ణుమయం
జగత్,’
అవుతుంది.
విశ్వమంతా
విష్ణు
రూపములే
సర్వభూతములందు
సర్వవేళల
ప్రభుని
దివ్యశక్తే
పాలించుచున్నది
జీవకోటులన్ని
దైవమయమే!
4
▾
Meaning
Keep
చూశారా!
ప్రతి
జీవుడుకూడా
ఆత్మరూపునిగా
వెలుగొందు
దేవుడే!
ప్రతీ
మానవుడుకూడా
దైవస్వరూపుడే!
రూపనామములు
వేరు
వేరుగా
ఉండవచ్చును.
అయితే,
సర్వరూపములుకూడా
భగవంతుడే
అని
ఎప్పుడు
నీవు
చెప్పగలవు?
యీ
ఒక్కటి
మాత్రమే
చాలా
కఠినంగా
కన్పిస్తుంది.
కాని
అంత
సులభమైనది
మరొకటి
లేదు.
నిన్ను
నీవు
నూరు
శాతం
నమ్మకంతో
ఉంటే
అది
నీకు
తెలుస్తుంది.
ఈ
నూరు
శాతం
అంటే
ఏమిటి?
దీనికి
కొలబద్ద
ఏమిటి?
100,
50,
25
శాతం
ఏ
రీతిగా
గుర్తించగలవు?
దీనికి
చక్కని
ఉదాహరణము.
కష్టములయందు,
సుఖములయందు,
ఆదాయమునందు,
నష్టమునందు,
దుఃఖమునందు,
విచారమునందు,
నొప్పినందు,
ఆనందమునందు
అన్ని
సమయములందు
నమ్మకం
అనేది
గాఢంగా
ఉండాలి.
ఈనాడు
కొంచెం
కష్టం
కలిగితే
నమ్మకం
కొంచెం
తగ్గుతుంది.
కొంత
సుఖం
వచ్చినదంటే
హద్దుమీరిపోతాడు.
భగవంతుడిని
మర్చిపోతాడు.
కనుక
‘సుఖదుఃఖే
సమేకృత్వా
లాభాలాభౌ
జయాపజయాత్’
ఈ
రెండింటియందుకూడా
సమత్వం
కావాలి.
ఈ
సమత్వం
ఉండినప్పుడే
పరిపూర్ణమైన
100
శాతం
నమ్మకం
తెలుస్తుంది.
చూసేటువంటి
కొలబద్ద
యిదే!
మానవునియందున్న
పశుత్వాన్ని
దూరము
చేసుకుని,
మానవత్వాన్ని
దైవమువైపు
మళ్ళించడమే
ఆధ్యాత్మికము
ఆధ్యాత్మికము,
ఆధ్యాత్మికము
అంటుంటారు.
ఈ
ఆధ్యాత్మికమంటే
కొన్ని
నిముషముల
క్రితం
మన
అనిల్‌కుమార్
ఏదో
ఒక
ప్రత్యేక
అర్థాన్ని
చెప్పాడు.
ఆధ్యాత్మికమంటే
ఏదో
వేరే
అర్థము
లేదు.
మానవునియందున్న
పశుత్వం
దూరం
చేసుకుని
మానవత్వాన్ని
దివ్యత్వంగా
మార్చుకోవడమే
ఆధ్యాత్మికము.
మానవునియందు
పశుత్వము,
దైవత్వము,
మానవత్వము
మూడుంటున్నాయి.
ఆత్మ
లక్ష్యమునందే
ఉన్నప్పుడు
అది
దైవత్వము.
ఇంక
ఆత్మ,
మనస్సు,
శరీరము
యీ
మూడింటితత్వము
కూడినప్పుడు
యిది
మనిషితత్వము.
కాని
మనసుమాత్రమే
ఉంటున్నప్పుడు
యిది
పశుత్వము.
కేవలము
దేహాన్నే
అనుసరించినపుడు
దానవత్వము
అవుతుంది.
5
▾
Meaning
Keep
మనసుని
అనుసరించినపుడు
పశుత్వం.
మనస్సు,
దేహము,
ఆత్మ
మూడింటిని
అనుసరించటం
మానవత్వము.
కేవలం
ఆత్మనే
అనుసరించటం
దైవము.
కనుక
మానవత్వమునందు
దానవత్వము,
పశుత్వము,
దైవత్వము
ఉంటున్నాయి.
కనుక
ఆధ్యాత్మికమనగా
ఏమిటి?
మానవునియందున్న
పశుత్వాన్ని
దూరం
చేసుకోవాలి.
చెడ్డగుణములు
దూరం
చేసుకోవాలి.
దుష్టసంకల్పములను
దూరం
చేసుకోవాలి.
చెడుభావములను
దూరం
చేసుకోవాలి.
అందులో
ఉన్న
మానవత్వాన్ని
దైవత్వంవైపు
మరల్చాలి.
ఏమి
చేసినా
అవన్నీ
దైవకార్యంగా
భావించుకో!
అప్పుడు
work
will
be
transformed
into
worship.
నీవు
ఆఫీసుకు
వెళ్లు.
నీ
పని
నీవు
చెయ్యి.
నీ
వ్యాపారం
నీవు
చెయ్యి.
నీయొక్క
పనులు
చెయ్యి.
కాని
యివన్నీ
భగవదర్పితం
చెయ్యి.
అదే
నిజమైన
ఆత్మార్పణం.
ఈ
స్థాయి
ఎలా
వస్తుంది?
పాలనుండి
వెన్న
తీశాము.
ఈ
వెన్న
ఎక్కడనుండి
వచ్చింది?
పాలనుంచి
వచ్చింది.
పాలలో
యీ
వెన్న
ఎక్కడ
ఉంటున్నాది?
పాలలో
సర్వత్రా
ఉంటోంది
వెన్న.
వెన్న
లేని
పాలు
ఒక
చుక్క
అయినా
లేదు.
కనుక
యీ
వెన్న
అనేది
పాలల్లో
సర్వత్రా
ఉంటోంది.
అయితే
దానిని
పెరుగుగా
చేసి
చక్కగా
చిలికినపుడు
సర్వత్రా
ఉండిన
యీ
వెన్న
ఒకే
స్థానానికి
చేరుతుంది.
భగవంతుడు
సర్వత్రా
ఉండినా,
యీ
పాత్ర
అనే
దేహమునందు,
మనసు
అనే
పాలలోపల
చక్కని
దివ్యత్వమనే
వెన్న
ఉంటుంది.
అయితే
బుద్ధితో
యీ
మనసును
చక్కగా
మథనం
చేస్తే
సర్వత్రా
ఉండిన
వెన్న
ఒక్క
చోటికి
చేరుతుంది.
అయితే
యీ
వెన్నలోపల
కొంత
నీరు
కలిసివుంటుంది.
ఈ
వెన్న
అంత
స్వచ్ఛంగా
లేదు.
కారణమేమిటి?
దేహమనే
అభిమానం
ఉండటంచేత
యిందులో
దేహాభిమానం
అనే
నీరు
చేరిపోయింది.
తర్వాత
ఆ
వెన్ననుకూడా
చక్కగా
సంస్కారపరచినపుడు,
అగ్నిలో
సంస్కారం
చేసినపుడు,
క్రమక్రమేణా
యీ
నీరంతా
ఆవిరిగా
మారిపోతుంది.
ఆ
నీరు
ఆవిరిగా
మారిపోయే
సమయంలో
చెడు
వాసన
వస్తుంది.
అనగా
ఏమిటి?
ఆ
దుర్గుణాలన్నీ
పోతున్నాయన్న
మాట.
వెన్న
కాస్తుంటే
దానిలోనున్న
నీరంతా
పోతోంది.
ఈ
నీరు
పోయిన
తర్వాత
ఆ
వెన్న
నెయ్యి
అవుతుంది.
కమ్మని
వాసన
వస్తుంది.
ఈ
నీరు
ఉన్నంతవరకు
చెడు
వాసన
ఉంటుంది.
ఈ
నీరంతా
పూర్తిగా
వెన్నను
వీడిపోయాక
అది
పవిత్రమైనటువంటిదిగా,
చక్కని
నెయ్యి
తయారవుతుంది.
మంచి
వాసన
వస్తుంది.
6
▾
Meaning
Keep
పాలయొక్క
అంత్యమదే!
అదే
‘వేదాంతము’
అన్నారు.
వేదములకు
అంత్యము
జ్ఞానమే!
వేదాంతమనగా
ఏమిటి?
వేదములకు
అంతము,
వేదాంతము.
వేదములకు
అంత్యము
అనగా
ఏమిటి?
అదే
జ్ఞానము.
జ్ఞానమునకు
అంత్యము
కైవల్యం.
ఈ
జ్ఞానమనగా
ఏమిటి?
‘అద్వైతదర్శనం
జ్ఞానము.’
ఏకత్వంగా
ఉండేటువంటిదే
జ్ఞానము.
ఇప్పుడు
పాలయొక్క
అంత్యము
నెయ్యి.
పాలను
కాస్తున్నాము.
మీగడ
వచ్చింది.
దానిని
పెరుగుగా
చేశాము.
తిరిగి
ఆ
పెరుగును
చిలికితే
వెన్న
వచ్చింది.
వెన్నను
కాచిన
తర్వాత
నెయ్యి
వచ్చింది.
నెయ్యి
వచ్చాక
ఏమిటి
చేయటం?
భుజించటమే!
కనుక
పాలను
పెరుగుగా
చెయ్యవచ్చు.
పెరుగును
వెన్నగా
మార్చవచ్చు.
వెన్నను
నెయ్యిగా
చెయ్యవచ్చు.
కాని
నెయ్యినింకేమి
చేయగలవు?
ఏమీ
చెయ్యడానికి
వీలు
లేదు.
కనుక,
పాలకు
అంత్యరూపము
నెయ్యి.
అదే
విధంగా
వేదాన్ని
శోధించి,
శోధించి
రావటంవల్ల
జ్ఞానమనే
నెయ్యి
చిక్కుతుంది.
కనుక,
వేదములకు
అంత్యం
జ్ఞానమే!
దాని
తర్వాత
యింకొకటి
ఏదైనా
వస్తే
అది
అంత్యం
కాదు.
మరేవిధమైన
మార్పులేని
స్థితి
ఏదైతే
ఉంటుందో
అదే
అంత్యము.
దీనినే
‘మీమాంస’
అని
పిలుస్తూ
వచ్చారు.
మాంసము
కాదు.
మీమాంస.
మీమాంస
అనగా
ఏమిటి?
విచారణతో
కూడిన
చివరి
నిర్ణయము!
మన
హృదయమనే
క్షేత్రమునందే
కల్పతరువు
పెరుగుతోంది
మానవునిలో
చెడ్డ
ఉండినంతవరకూ
యీ
దుర్గంధము
అనేది
పోదు.
అదే
‘వాసనలు’
అంటారు.
‘నీ
జన్మాంతర
వాసన
నిన్ను
వెంటాడుతున్నదిరా!’
అంటారు.
వెన్న
పాలను
వదిలేసి,
పెరుగును
వదిలేసి,
అన్నింటినీ
వదిలి
వచ్చినా
యింకా
దానిలో
వాసన
ఉంది.
ఆ
వాసన
ఏమిటి?
ఈ
ప్రపంచముయొక్క
విషయవాసనలే!
అది
దీనితో
చేరిపోవటంచేత
స్వచ్ఛమైన
వెన్ననుకూడా
చెరుపుతూ
వచ్చింది.
దానిని
వేరు
చేయాలి.
ఇక్కడ
రెండు
ఉదాహరణలున్నాయి.
పాలు,
నీరు
మంచి
స్నేహితులనుకుంటే
ఒక్కొక్కసారి
నీరు,
పాలను
వదలటానికిష్టపడదు.
కాని,
పాలు
మాత్రం
నీటిని
వదలటానికి
ప్రయత్నిస్తుంది.
ఈ
పాలు
అనేది
దైవము.
నీరు
అనేది
ప్రాణం.
ఈ
రెండూ
చేరే
ఉంటాయి.
ఒక
చిన్న
ఉదాహరణము.
7
▾
Meaning
Keep
Also in his talks
(1)
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
ఆడవాళ్లకు
మంచి
అనుభవం
ఉంటుంది.
పాలు
కాస్తున్నప్పుడు
పాలల్లో
చేరిన
నీరు
ఆవిరిగా
మారిపోతుంది.
ఈ
నీటిని
వీడిన
తక్షణమే
పాలు
‘ఓ!
నా
స్నేహితుడు
వీడిపోయాడే’
అని
చెప్పి
పొంగిపోతుంది.
ఆ
వెళ్లిపోయే
సమయంలో
తిరిగి
కొంచెం
నీళ్లు
దానిపై
జల్లితే
మళ్లీ
అణిగిపోతుంది.
పోయిన
స్నేహితుడు
తిరిగివచ్చి
చేరేటప్పటికి
తిరిగి
చల్లబడుతుంది.
కనుకనే
యీ
స్నేహము
వీడలేనటువంటిది.
చూశారా?
‘దేహమనే
క్షేత్రమందు
కలదు,
ఒక
కల్పతరువు.
దాని
చుట్టు
వనస్పతుల
కలపకంప
పెరిగియుండు.
కంప
తీసి
శుభ్రపరచిన
కల్పతరువు
కానబడును.’
ఈ
అనిత్యమందు
ఆ
కల్పతరువును
కలిపివేస్తున్నారు.
మన
హృదయమనే
క్షేత్రమందు
కలదు,
ఒక్క
కల్పతరువు.
అదియే
ఆత్మ.
దాని
చుట్టూ
వనస్పతుల
కలప
కంప
పెరిగింది.
దానివల్ల
యీ
కల్పవృక్షం
మనకు
కన్పించటం
లేదు.
పాడు,
పాడు
ఆశలు
అంతా
చేరిపోయాయి.
అవన్నీ
చుట్టుకోవటంచేత
ఆ
కల్పతరువు
మనకు
కనిపించటం
లేదు.
కలుపు
తీసి
శుభ్రపరిస్తే,
అంటే
యివన్నీ
కొట్టివేస్తే,
యీ
కల్పతరువు
కనబడును.
ఆ
కల్పతరువే
మన
అభీష్టాలన్నింటినీ
నెరవేర్చుతుంది.
కల్పవృక్షమును
నీవు
ఎక్కడికో
పోయి
వెతకనక్కర
లేదు.
నీ
హృదయమునందే
ఉంటోంది.
నీ
హృదయ
క్షేత్రమునందే
యీ
కల్పతరువు
పెరుగుతోంది.
ఈ
కల్పవృక్షమనేది
మనలోనే
ఉంటోంది.
ఎక్కడికో
పోయి
ఎందుకు
వెతుక్కోవాలి?
అడిగిన
పాలిచ్చు
కామధేనువు
వుండ
ధనమిచ్చి
ఆవును
కొనగనేల?
కోరిన
ఫలమిచ్చు
కల్పవృక్షంబుండ
పెరటి
పుష్పములకై
ప్రీతియేల?
మండెడు
కాంతితో
మేరుపర్వతముండ
వెండిబంగారులకై
వెతకనేల?
వెండి
బంగారములు
అందించే
మేరు
పర్వతమే
మన
చెంత
ఉండ,
పాడు
సంసారంబు
కోరనేల?
8
▾
Meaning
Keep
సత్సంకల్పమే
కల్పవృక్షము,
సదాచారమే
కామధేనువు!
కల్పవృక్షమును
నీ
దగ్గర
పెట్టుకొని
అరటిచెట్టుకోసమై
నీ
వెందుకింత
అవస్థపడ్తున్నావు?
మనలోనే
కల్పవృక్షము,
కామధేనువు
ఉంటున్నాయి.
బయట
ఎక్కడనో
లేవవి!
సత్సంకల్పమే
కల్పవృక్షము,
సదాచారమే
కామధేనువు!
ఈ
సదాచారమనే
కామధేనువు,
సత్సంకల్పమనే
కల్పవృక్షము
రెండూ
మన
దగ్గరనే
ఉంటున్నాయి.
వాటిని
మనం
చక్కగా
పెంచుకుంటే
మన
అభీష్టాలన్నీ
నెరవేరుతూనే
ఉంటాయి.
మన
చేతిలో
ఒక
100
రూ॥ల
నోటుంది.
ఈ
100
రూ॥ల
నోటు
నిన్ను
చూసి
నవ్వుతుందిట!
‘ఒరే!
పిచ్చివాడా!
నన్నెందుకిలా
దీక్షగా
చూస్తున్నావు?
ఎన్ని
మొహాలో
చూసి
వచ్చాను,
నీ
దగ్గరకు.
తిరిగి
నిన్ను
విడిచి
ఇంకొకరి
దగ్గరకు
పోతాను.
నేను
ఒకరి
దగ్గర
ఉండేటువంటిదానను
కాను.
యిది
నా
100
రూ॥లు
అని
నీవెందుకు
అభిమానపడ్తున్నావు?’
అని.
కదలిపోయేటువంటిది,
యీ
యొక్క
లక్ష్మి
స్వరూపము.
డబ్బుయొక్క
స్వభావము
తిరగటం.
నీతి
మాత్రం
వస్తుందిట
మన
దగ్గరకు;
దినదినానికి
పెరిగిపోతూ
ఉంటుందిట,
వదలిపోదట!
Money
comes
and
goes;
morality
comes
and
grows.
యీ
ధనం
ఒక్క
చేతిలో
ఒక్క
క్షణమైనా
ఉండేది
కాదు.
అది
అందరి
దగ్గరకీ
వెళ్తూ
ఉంటుందిట!
కొంతమంది
ఆమెని
ఎలాగైనా
కట్టి
వేయాలని
చెప్పి
అనేక
రకములైన
యుక్తులనంతా
ప్రవేశపెడ్తుంటారు.
ఈ
లక్ష్మికి
రెండు
పేర్లున్నాయి-ధనలక్ష్మి,
దరిద్రలక్ష్మి
అని.
ఒకప్పుడు
ఈమె
ఒక
వ్యక్తి
దగ్గరకు
చాలా
ఆశకల
వ్యక్తి
దగ్గరకెళ్లిందట!
తిరిగి
వచ్చే
సమయంలో
ఆమెకు
చాలా
బాధ
కల్గిందట!
ప్రక్కనే
దరిద్రలక్ష్మికూడా
ప్రత్యక్షమైంది.
ధనలక్ష్మి
అడిగిందట
‘ఓ
భక్తుడా!
నీకు
ఆమె
కావాలా?
నేను
కావాలా?’
అని.
వీడికి
చాలా
భయం
వేసింది.
నీవే
కావాలంటే,
ఆమె
వచ్చి
మళ్లీ
పీడిస్తుందేమో,
పోనీ
యీయొక్క
దరిద్రలక్ష్మిని
అమ్మా!
నీవు
కావాలంటే
యీమె
పరుగెత్తి
పోతుందేమో
చాలా
భయం
వేసేసింది.
ఇద్దరి
మీదా
భక్తి
సమానంగా
ఉంది.
‘అమ్మా!
మీ
యిద్దరుకూడా
చాలా
అందంగానే
ఉన్నారు.
మీరు
కొంచెం
నావైపు
నడచుకుని
రండి’
అన్నాడు,
ధనలక్ష్మిని.
తరువాత
‘మీరు
నడచి
అట్లాపొండి,
దరిద్రలక్ష్మి!’
అన్నాడు.
లక్ష్మీదేవి
వచ్చే
సమయంలో
చాలా
అందంగా
ఉంటుంది.
దరిద్రలక్ష్మి
పోయే
సమయంలో
చాలా
అందంగా
ఉంటుంది.
కాబట్టి
యిద్దర్ని
‘అందగత్తెలు,’
అన్నాడుట!
అప్పుడు
యిద్దరూ
ప్రసన్నులై
వెళ్లిపోయారు!
9
▾
Meaning
Keep
Also in his talks
(7)
29 July 1990
Our Manas itself is the key
16 September 1990
Discipline is like our very life-breath
21 November 1990
Seva that sanctifies
1 June 1991
Spiritual Discipline (sadhana)
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
26 February 1995
Make Sacred Use of Your Youth
1 October 1998
Aham, Ātma, Mind, Speech
కనుక,
మనము
ఏమి
చెయ్యాలంటే
‘నొప్పించక
తానొవ్వక,’
ఎవరిని
యేవిధంగా
బాధ
పెట్టకూడదు.
దృష్టిదోషము,
శ్రవణదోషము,
వాగ్దోషము,
మనోదోషము,
క్రియాదోషము
అనే
పంచదోషములు
దూరము
చేస్తే
తానే
పరమాత్ముడు
Help
ever,
hurt
never
యిదే
పద్ధెనిమిది
పురాణముల
సారము.
అష్టాదశ
పురాణేషు
వ్యాసస్య
వచనద్వయం
పరోపకారః
పుణ్యాయ
పాపాయ
పరపీడనం
అందరిని
మనము
సంతోషపెట్టాలి.
యీ
విధమైన
యుక్తికూడను
ఒక
యోగమే!
యితరులను
నొప్పించకుండా
ఉండటంకూడను
ఒక
యోగమే!
మంచిగా
మనం
ఉపయోగించాలి,
సరైన
పదాలు.
You
can’t
always
oblige
but
you
can
always
speak
obligingly.
మంచిగా
మాటాడు.
ఆ
మంచి
మాటలలో
మాధుర్యము
ఉంటున్నాది.
ఈనాటి
విద్యార్థులు
మంచి
పలుకులు,
మంచి
దృష్టిని
మంచి
శ్రవణమును,
మంచి
ఆలోచనలను,
మంచి
క్రియలను
అభివృద్ధి
చేసుకుంటే
వానికంటే
దైవము
మరొకడు
లేడు.
దృష్టిదోషము,
శ్రవణదోషము,
వాగ్దోషము,
మనోదోషము,
క్రియాదోషములు
దూరము
చేస్తే
తానే
పరమాత్ముడు.
నీవే
దైవము,
God.
ఈ
దోషములు
ఉండటంవలనే
నీవు
డాగ్
Dogగా
మారిపోతున్నావు.
G
తో
ఆరంభమైతే
గాడ్.
Dతో
ఆరంభమైతే
డాగ్
అవుతావు.
ప్రారంభంలో
తేడాయే!
ఒకటి
లోపలకు,
ఒకటి
బయటకు.
ఈ
విషయమును
చక్కగా
జాగ్రత్తగా
చూసుకు
ప్రవేశించాలి.
ఈ
ఐదింటిలో
దోషముగా
ఉండే
దాంట్లో
ప్రవేశిస్తున్నాం.
ఈ
ఐదు
యింద్రియములు
పవిత్రముగా
ఉండేదాంట్లో
ప్రవేశిస్తున్నావా?
యిక్కడే
మనం
విచారణ
చెయ్యాలి.
అదే
‘విచారణ
శక్తి’
అన్నారు.
దీనినే
‘వేదాంత
విచారణ’
అన్నారు.
విచారణ
అనగా
మంచి
చెడ్డలు
విచారించటమే!
10
▾
Meaning
Keep
మన
స్వరూపాన్ని
మనం
మరచిపోతున్నాము
భగవద్గీతయందు
‘అనిత్యం
అసుఖం
లోకం’
అన్నాడు.
ఇటువంటి
లోకములో
నిత్యము
సుఖము
చూడాలనుకుంటే
ఎక్కడ
చిక్కుతుంది?
చిక్కదు.
లేదక్కడ.
బజార్లో
మీరు
పోయి
చూడండి.
ఒక
హోటలుపైన
‘మిలట్రీ
హోటలు’
అని
వ్రాసి
ఉంటుంది.
యింకొక
హోటలుపైన
యిది
‘బ్రాహ్మణ
హోటలు’
అని
వ్రాసి
ఉంటుంది.
ఈ
బోర్డును
చూడకుండా
మిలట్రీ
హోటలులో
ప్రవేశించి
నాకు
సాంబారు,
రసం
కావాలంటే
ఎక్కడ
చిక్కుతుంది?
బ్రాహ్మణహోటలుకు
పోయి
నాకు
పలావు,
కుర్మా
కావాలంటే
ఎలా
వస్తుంది?
చిక్కదు.
ఈ
తప్పు
ఎవరిది?
హోటలు
తప్పు
కాదు.
పేరు
చూడకుండా
నీవు
లోపల
ప్రవేశించావు.
పైన
వ్రాయబడిన
పేరు
చూచి
నీవు
ప్రవేశించి
ఉంటే
నీవు
ఆ
విధంగా
తికమకపడవు.
అదే
విధంగా
యీ
ప్రపంచానికి
మొట్టమొదట
ఒక
బోర్డు
ఉంటున్నాది.
‘అనిత్యం
అసుఖం
లోకం’
అని.
నిజంగా
అది
చూసి
ప్రవేశిస్తే
నిత్య
సుఖము,
నిత్యానందము
మనము
ఆశించనే
ఆశించము.
ఎందుకంటే
నిత్యానందము
మనలో
ఉంటున్నాది.
నిత్యసుఖము
మనలోనే
ఉంటున్నది.
అదే
మన
దివ్యస్వరూపము.
మనస్వరూపాన్ని
మనం
మరచిపోతున్నాము.
బయట
reaction,
reflection,
resound
ను
ఆశిస్తున్నాము
మనము.
ఈ
reaction,
reflection,
resound
లో
ఉండేది
ప్రపంచము.
Real
action,
real
reflection,
real
sound
ఉండేది
ఆత్మయందే!
అదే
‘సత్యం
జ్ఞానం
అనంతం
బ్రహ్మ.’
యివన్నీ
మనలో
ఉంటున్నాయి.
బయట
వెతకటానికి
ప్రయత్నించనక్కరలేదు.
మనలోనే
ఉంటున్నాయి.
దీనిని
మరచిపోయి
మనం
ఎక్కడో
వెతుకుతున్నాము.
ఒక
చిన్న
ఉదాహరణము,
విద్యార్థులకు.
నీవు
భగవద్గీత
చదువుతున్నావు.
నీవు
చదువుతుంటే
నీ
స్నేహితుడుకూడా
వచ్చాడు.
‘ఏమిటి
బాబూ
చదువుతున్నావ’ని
అడిగాడు.
‘నేను
భగవద్గీత
చదువుతున్నాను.
ఆధ్యాత్మికములో
ప్రవేశించాను’
అంటావు.
‘ఏమి
చెబుతున్నది
భగవద్గీత?’
అన్నాడు
నీ
స్నేహితుడు.
‘నువ్వే
చూడు,’
అని
స్నేహితుని
చేతికిచ్చావు.
అప్పుడతడు
పుస్తకం
తెరచిచూచి
‘నీ
బుక్కులో
10
రూపాయలుందే’
అన్నాడు.
‘నేను
ఎప్పుడో
పెట్టి
మరచిపోయాను’
అన్నావు
నీవు.
యిది
ఏమిటి?
మన
హృదయమే
భగవద్గీత.
అందులో
విలువైన
ధనమే
భగవంతుడు.
నీ
నిజమైన
స్నేహితుడు
భగవంతుడే
వచ్చి
ఒక్కొక్క
పేజీ
త్రిప్పి
అక్కడ
నీకు
చూపిస్తాడు,
పదిరూపాయలనోటు.
అప్పుడు
ఈయన
చెప్తాడు,
‘నీ
బోధనలింక
నా
కక్కర
లేదు.
నాకంతా
తెల్సిపోయింది’
అని.
11
▾
Meaning
Keep
‘మర్మ
మెరిగిన
మరు
నిముషంలో
మనసే
మారిపోతుందండీ!’
కోరికలనే
లగేజి
తగ్గించుకుంటే
మన
జీవితప్రయాణం
సుఖంగా
ఉంటుంది
మనస్సును
తెలియకుండా
ఉండినంతకాలము
వీడు
అనేక
విధాలుగా
ప్రయాణాలు
చేస్తుంటాడు.
ప్రయత్నాలు
సలుపుతుంటాడు.
మనస్సుతత్వం
చక్కగా
గుర్తించిన
వాడికింక
సర్వమూ
తెలిసిపోయింది!
మనసంటే
ఏమిటో
అనుకుంటున్నాడు.
ఇది
ఒక
రకమైన
విచారము.
This
is
not
a
cloth.
This
is
a
bundle
of
threads;
not
thread,
it
is
cotton.
Cotton,
thread,
cloth
మూడు
ఒక్కటే!
కనుక
యీ
cotton
లేకపోతే
thread
తీయటానికి
వీలుకాదు,
thread
లేకపోతే
వస్త్రం
నేయటానికి
వీలుకాదు.
కాబట్టి
cotton-thoughts,
threads-desires,
cloth-mind.
కనుక
bundle
of
desires
makes
mind.
ఈ
ఒక్కొక్క
దారం
తీసివేస్తే
ఇంక
వస్త్రం
ఉండదు.
కనుకనే
రైల్వే
డిపార్ట్మెంటువారు
కంపార్టుమెంటులో
Less
luggage,
more
comfort,
make
travel
a
pleasure
అని
వ్రాసి
పెడతారు.
‘జీవితమే
ఒక
ప్రయాణం,
కోరికలే
లగేజి!’
కనుక
యీ
కోరికలనే
లగేజీని
తగ్గించుకుంటే
మన
ప్రయాణం
సుఖంగా
ఉంటుంది.
కనుక
యీ
మనస్సుయొక్క
తత్వాన్ని
చక్కగా
తెల్సుకుంటే
అట్టివాడికి
ఏ
మాత్రం
విచారం
ఉండదు.
వాడు
చాలా
సుఖవంతుడు
అవుతాడు.
చాలామంది
‘నాకు
స్వతంత్రము
ఉంది’
అంటారు.
అన్నింటికంటె
గొప్పబలము
దైవబలమే!
స్వతంత్రము
ఎవ్వరికీ
లేదు,
ఒక్క
దైవానికి
తప్ప!
ఎక్కడుంది
నీకు
స్వతంత్రము?
లేదే!
ఏ
ఒక్క
పని
చేయాలన్నా
నీవు
యింకొకరిపైన
ఆధారపడాలే!
‘నా
యిల్లు,
నా
స్టోర్’
అనుకుంటావు.
కాని,
స్టోరులో
ఉన్న
సామానులన్నీ
నీవే
అనుకున్నప్పటికీ
నీ
ఆకలి
తీరాలంటే
వంటవానిపైన
ఆధారపడాలి!
కనుక,
ఎక్కడుంది
నీకు
స్వతంత్రము?
వాడు
వండితే
తినటం;
లేకపోతే
పస్తే!
కనుక,
నీకు
స్వతంత్రము
అనేది
లేదు!
అన్నీ
బంధాలే!
ఎందువల్ల?
కోరికలవల్ల!
ఆకలిదప్పులుకూడా
ఒక
కోరికే!
ఆకలి
ఒక
రోగం.
అన్నం
ఔషధం.
దప్పిక
ఒక
రోగము.
నీరు
దానికి
ఔషధం.
కాబట్టి
రోగముతో
ఉండేదే
భవము.
భవమే
ఒక
రోగం.
ఆ
రోగమును
నివారణ
చేసే
భవరోగ
వైద్యుడు
భగవంతుడే!
కనుక
అతనికొక్కనికి
మాత్రమే
ఆ
సర్వజ్ఞత్వం
ఉంటుంది.
12
▾
Meaning
Keep
అటువంటి
సర్వజ్ఞుడైన
వానిని
మనం
ఆశ్రయించి,
ఆరాధించి,
అతన్నే
ఆధారంగా
పెట్టుకున్నప్పుడు
జీవితంలో
ఏ
విధమైన
బాధలుండవు.
అవన్నీ
కావలసిందే,
ధనమూ
కావలసిందే!
కాని
అన్నింటికంటే
గొప్ప
బలము,
ధనము,
దైవమే!
మిగిలినదంతా
కూడా
దుర్బలము.
కనుక,
ఆ
దైవబలాన్ని
మీరు
సంపాదించి
తద్వారా
యీ
అశాంతిని,
యీ
దుఃఖమును,
యీ
బాధలను
నివారణ
గావించుకొని
సంతోషమైన
జీవితాన్ని,
ఆనందమైన
జీవితాన్ని,
ఆరోగ్యమైన
జీవితాన్ని
గడపాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
To search for the divinity that is everywhere is Ajñāna!
Next
The divinity all religions teach is one!
→