Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Set Aside the Outward and Nourish the Inner Feeling
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Set Aside the Outward and Nourish the Inner Feeling
23 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 534
మాను
దిద్దగవచ్చు
మరి
వంపు
లేకుండ
దిద్దవచ్చు
రాయి
తిన్నగాను
మనసు
దిద్దగలర
మరి
వంపు
లేకుండ
వినుడు
భారతీయ
వీరసుతుడ!
విద్యార్థులారా!
మనసు
చాలా
విచిత్రమైనది.
మనసు
చాలా
వేగమైనది.
మనసు
చాలా
చంచలమైనది.
మహా
బలమైనది
మనస్సు.
ఇక్కడ
మనిషి
ఉండగా
కొన్ని
వేలమైళ్ళ
దూరము
పరిగెత్తుతుంది
మనసు.
ఒక
క్షణములో
వేల
మైళ్ళు
ప్రయాణము
చేసి
అక్కడ
దృశ్యములను
చూడగలుగుతుంది.
‘చంచలం
హి
మనః
కృష్ణ
ప్రమాది
బలవదృఢం.
మహా
దృఢమైన
మనస్సును
మహా
చంచలమైన
మనస్సును
మహా
బలమైన
మనస్సును
ఏరీతిగా
అరికట్టగలము.’
అన్నాడు
అర్జునుడు.
ఈ
మనస్సుకు
రెండు
తత్వములుంటున్నవి.
ఒకటి
పశుత్వము.
రెండవది
మనుష్యత్వము.
పశుత్వము,
మనుష్యత్వము
అనగా
ఏమిటో
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
కామక్రోధలోభమద
మాత్సర్యములనే
అరిషడ్వర్గములకు
లోనై
అనేక
వాసనలకు
లొంగి
తద్వారా
కేవలము
పశువువలె
ప్రవర్తిస్తూ
మానవత్వము
విస్మరించి
పెడమార్గము
పట్టి
పశువుగా
దిగజారిపోతుంది
మనసు.
రెండవది.
భగవంతుడు
ప్రసాదించిన
మతిని,
స్థితిని,
గతిని,
సంపత్తిని
సద్వినియోగ
పరచుకొని
తద్వారా
దివ్యత్వమైన
మానవత్వము
వహించి,
తద్వారా
దేశమునకు
అనేక
ఉపకారములు
సల్పుతూ
వస్తుంది.
ఈ
మంచి
చెడ్డలకు
మనసే
మూలకారణము.
మనసు
నందున్న
మంచితనము
మరొక
దానియందు
లేదు.
మనసు
నందున్న
చెడ్డతనము
కూడా
మరొకదాని
యందు
లేదు.
ఎంత
మంచిదో
అంత
చెడ్డది.
మనసు
చాలా
పరిశుద్ధమైనదే.
ఇది
సంగ
దోషమును
పురస్కరించుకొని
మనస్సు
మంచి
చెడ్డలుగా
రూపొందుతుంది.
ఒక
పరిశుద్ధమైన
న్యూస్
పేపరు
ఒకటి
ఉంటున్నాది.
ఈ
న్యూస్
పేపరులో
మంచి
సుగంధమునందించే
మల్లెపూలు
పొట్లము
కట్టినప్పుడు
ఈ
మల్లెపూల
సుగంధము
న్యూస్
పేపరుకు
అందుతుంది.
2
▾
Meaning
Keep
ఈ
న్యూస్
పేపరుకు
ఈ
సుగంధము
రావటానికి
కారణము
ఏమిటి?
ఈ
సుగంధము
గల
మల్లెపూలను
చుట్టపెట్టటం
చేత
సుగంధము
నందించింది.
ఆ
న్యూస్
పేపరునందు
కొన్ని
పకోడాలు
పొట్లము
కట్టినప్పుడు
న్యూస్
పేపరుకు
కూడా
పకోడా
వాసన
వస్తుంది.
పకోడా
సంపర్కము
చేత
న్యూస్
పేపరుకు
కూడ
అట్టి
వాసనే
వచ్చింది.
ఆ
న్యూస్
పేపరులో
dry
fish
పొట్లం
కట్టినప్పుడు
ఈ
పేపరుకు
dry
fish
వాసనే
వస్తుంది.
ఈ
పేపరుకు
స్వతసిద్ధమైన
వాసన
ఏమీ
లేదు.
ఎట్టి
పదార్థమును
ఈ
న్యూస్
పేపరులో
చుడతామో
అట్టి
పదార్థము
యొక్క
వాసన
పొందుతుంది.
అదే
విధంగా
మనస్సును
మంచి
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
అది
మంచిదిగా
రూపొందుతుంది.
ఎట్టిది
మంచి
మార్గము?
సద్భావములు,
సచ్చింతలు,
సత్ప్రవర్తన,
సదాలోచనలు
సత్సంగము
ఇలాంటి
పవిత్రమైన
దివ్యమైన
భావముల
చేత
ఆధ్యాత్మిక
సంబంధమైన
వృత్తుల
చేత,
నైతిక
భావముల
చేత,
ధార్మిక
కర్మల
చేత
సంపర్కము
చెందినప్పుడు
ఈ
మనస్సు
ఎంత
మంచిగా
రూపొందుతుంది.
దుర్గుణముల
చేత,
దురాలోచనల
చేత,
దుస్సంగము
చేత,
దుష్ప్రవర్తన
చేత
ఇది
మహా
దుర్గుణముగా
మారిపోతుంది.
ఒక
దుష్టురాలిగా
మారిపోతుంది
మనస్సు.
మనస్సుకు
మంచి
చెడ్డలు
ప్రత్యేకంగా
వచ్చేవి
కావు.
ఈ
సంపర్కము
యొక్క
ప్రభావము
చేత
మనస్సు
ఈ
విధమైన
మంచి
చెడ్డలుగా
రూపొందుతూ
వస్తుంది.
మంచి
మనస్సు
మనం
కలిగి
ఉండాలంటే
మంచి
సంగములో
మనం
చేరాలి.
అయితే
ఒక్కొక్క
సమయంలో
మంచి
చెడ్డగా
కనిపిస్తుంది.
చెడ్డ
మంచిగా
కనిపిస్తుంది.
ఎవరు
మంచివారో
ఎవరు
చెడ్డవారో
తెలుసుకోటం
చాలా
కష్టము.
మంచి
సంస్కారం
మంచి
నడత
మంచి
మాటలు
మంచి
ప్రవర్తన
మనకు
కొంతవరకు
గుర్తింప
చేస్తాయి
మంచివారి
క్రింద.
కనుక
ప్రతి
మానవునికి
సంస్కారం
అత్యవసరము.
అనేక
విధములుగా
దుర్గుణములను
దూరము
చేసి
సద్గుణములను
పోషిస్తూ
రావాలి.
ఒకానొక
సమయములో
షిరిడిలో
బాబా
కూర్చొని
ఫక్కున
నవ్వుతున్నాడు.
ఎవరికి
ఏమీ
అర్థము
కాలేదు.
కొంతమంది
పిచ్చివాడని
తలుస్తుంటారు.
కొంతమంది
ఇతనొక
బైరాగియని
భావిస్తుంటారు.
కొంతమంది
ఫకీరు
అని
విశ్వసిస్తూ
ఉంటారు.
పిచ్చివాడనుకున్నవారికి
పిచ్చివాడుగానే
కనిపిస్తాడు.
ఫకీరు
అనుకునే
వారికి
ఫకీరుగానే
కనిపిస్తాడు.
బాబా
నవ్వుతూ
నవ్వుతూ
‘ఒరేయ్
కులకర్ణి
ఆవ్’
అన్నాడు.
3
▾
Meaning
Keep
అక్కడ
ఒక
కులకర్ణి
ఉండేవాడు.
అతని
పూర్తి
పేరు
అప్పాకులకర్ణి.
‘ఏమిటి
బాబా’
అడిగాడు.
తన
జేబులోనుండి
రెండు
కాసులు
తీసి
ఇచ్చి,
‘నీవు
జల్గాం
వెళ్ళి
అక్కడ
నానా
ఉంటాడు
తీసుకొనిరా’
అన్నాడు.
ఈ
నానా
తహసిల్దారుగా
పని
చేస్తూ
ఉండేవాడు.
ఆనాటి
పరిస్థితిలో
తహసిల్దారు
అంటే
చాలా
గౌరవింప
తగినది.
ఈ
రెవెన్యూ
సంబంధమైన
వన్నీ
తహసిల్దారు
దగ్గరకే
పోయేవి.
ఇంతే
కాకుండా
పదవికి
తగినట్టు
కాకుండా
సంస్కృతము
నేర్చినవాడు
ఈ
నానా.
గొప్ప
విద్యావంతుడు.
మంచి
పదవిలో
ఉన్నాడు.
గొప్ప
పెర్సనాలిటి.
ఈ
మూడింటిని
పురస్కరించుకొని
అహంకారం
కూడా
అధికమైపోయింది.
ఈ
కులకర్ణి
వెళ్ళిన
తక్షణమే
ఎందుకోసం
వచ్చావు
అన్నాడు.
‘బాబా
నిన్ను
తీసుకొని
రమ్మన్నాడు.’
అన్నాడు.
ఛీ.
వెళ్ళు
నీకు
బుద్ధి
లేదా.
ఎవరో
ఎక్కడో
ఒక
ఫకీరుంటే
వాని
దగ్గరకు
నేను
పోవాలా?
నేను
తహసిల్దారును.
గొప్పవాడను.
అధికారిని.
విద్యావంతుడను.
నన్ను
వాని
దగ్గరకు
పొమ్మంటున్నావా?
వెళ్ళమన్నాడు.
ఈ
వార్త
బాబాకు
చెబుతే
తిరిగి
వెళ్ళి
తీసుకు
రమ్మని
చెప్పాడు.
అనేక
పర్యాయములు
నేను
నానాను
చూడాలి.
నానాను
చూడాలి
అని
ఒక
పిచ్చివాని
వలె
అరుస్తున్నాడు
బాబా.
ఈ
కులకర్ణి
ఏమిటిది
నన్ను
కూడా
అవమానపరుస్తున్నాడు
ఈ
నానా.
ఇంత
అహంకారియైన
నానాను
చూడటంలో
బాబాకు
గల
ఆప్యాయత
ఏమిటి?
అని
అర్థము
చేసుకోలేక
పోయాడు.
కడపటికి
ఈ
కులకర్ణి
పోయి,
నానా
కాళ్ళు
పట్టుకుని
బాబా
నిన్ను
చూడాలని
ఆశిస్తున్నాడు.
తప్పక
నీవు
రావాలని
గట్టిగా
ఏడ్చాడు.
అప్పుడు
చెప్పాడు
నానా.
‘నీకోసమై
నేను
వస్తున్నాను.
కాని
బాబాను
చూడటానికి
రావటం
లేదు.
అతనికి
నాకు
ఏవిధమైన
పోలికలు
లేవు.
అతనిని
చూడనక్కర
లేదు.’
అన్నాడు.
‘నా
ప్రార్థన
మన్నించి
మీరు
తప్పక
రావాలి’
అని
కులకర్ణి
కోరాడు.
నానా
షిరిడీ
వచ్చాడు.
నమస్కారం
కూడా
చేయలేదు.
ఎందుకండి
పిలిపించారు.
నీకు,
నాకు
ఏమి
సంబంధము?
నేను
పెద్ద
అధికారి.
నీవు
ఫకీరువి.
నాతో
నీకేమి
పని.
నీతో
నాకేమి
పని.
దగ్గరకు
వచ్చాడు
బాబా.
బేటా.
బైఠో.
ఉద్రేకము
మంచిది
కాదు.
అహంకారము
మంచిది
కాదు.
నీ
అహంకారము
వలన
నాకేమి
నష్టం
లేదు.
నీ
అహంకారము
నీకే
నష్టము.
కూర్చో
నేను
చెబుతాను.
నానా
కూర్చున్నాడు.
ప్రస్తుత
పరిస్థితిలో
నీకు,
నాకు
ఎట్టి
సంబంధము
లేదు.
కానీ
పోయిన
జన్మలో
నీకు
నాకు
చాలా
సన్నిహిత
సంబంధము
ఉంది.
ఆ
విధమైన
సంబంధ
బాంధవ్యము
ఉండటం
చేత
నిన్ను
చూడాలని
ఆశించాను.
అప్పుడు
నానాకు
మరింత
కోపం
వచ్చింది.
ఏమిటి
present
పరిస్థితిలోనే
ఏమి
సంబంధం
లేనప్పుడు
ఎప్పుడో
past
నాకు
నీకు
ఏమి
సంబంధం
ఉంది.
తెలియని
కాలగర్భంలో
కలసిపోయింది.
ఇలాంటి
విషయాలలో
నాకు
నమ్మకము
లేదన్నాడు.
4
▾
Meaning
Keep
బాబా
లేచి
దగ్గరకు
వచ్చి
తన
హస్తమును
కన్నులపైన
పెట్టాడు.
కన్నులు
తెరిచాడు
నానా.
past
life
చరిత్ర
కన్పించింది.
ఇది
నా
భ్రమ.
దీనిని
నేను
నమ్మను.
నా
past
నాకు
కనిపిస్తున్నాది.
నీ
past
నాకు
కన్పించాలి
కదా?
తిరిగి
బాబా
తన
కన్నులు
ముట్టుకొని
తిరిగి
నానా
కన్నులు
ముట్టుకున్నాడు.
బాబా
పూర్వం
ఎవరో
నానా
పూర్వం
ఎవరో
ఈ
రెండు
కూడా
కన్పించాయి
నానాకు.
సాష్టాంగ
నమస్కారము
చేశాడు.
బాబా!
తెలియక
మేము
చాలా
మూర్ఖత్వాన్ని
పొందుతాము.
తెలియనప్పుడు
తెలియనివానిలా
ఉండము.
తెల్సినవానిగా
మేము
నటిస్తాము.
మీరు
తెలిసి
కూడా
తెలియని
వారిలా
ఉంటారు.
ఇదే
భేదము
భగవంతునికి
భక్తునకు.
తెలియక
పోయినా
తెలిసినట్లు
నటించేవాడు
భక్తుడు.
తెలిసి
కూడా
తెలియని
వాడుగా
ప్రవర్తించేవాడు
భగవంతుడు.
ఏమీ
తెలియనివాడులా
ఉంటాడు
అన్నీ
చేస్తాడు.
ఏమీ
చేయని
వానిలా
ఉంటాడు.
అన్నింటిని
ఆకర్షిస్తాడు.
ఏమీ
ఆకర్షించని
వానిలా
ఉంటాడు.
ఇదే
దైవత్వమునకు
జీవత్వమునకు
ఉన్న
భేదము.
ఇవన్నీ
మనకు
ప్రాప్తించాలంటే
నిశ్చలమైన
మనస్సు,
నిర్మలమైన
భావము,
చలించని
మనస్సును
భ్రమించని
దృష్టిని
మనం
అభివృద్ధి
గావించుకోవాలి.
ఎలాంటి
పరిస్థితియందు
సందేహమునకు
అవకాశము
ఇవ్వకూడదు.
దానికేమాత్రము
లొంగకూడదు.
ఆ
doubts
కు
మనం
కృంగకూడదు.
అనుగ్రహమునకు
పొంగకూడదు.
పొంగి
కృంగని
సమత్వము
వహించుటకు
తగిన
కృషి
చేయాలి.
ఇది
పరిపూర్ణమైన
విశ్వాసమునందు
మాత్రమే
ప్రాప్తిస్తుంది.
దివ్యత్వము
ఒక
ప్రత్యేక
రూపము
ధరించి
రాదు.
ఇటువంటి
దివ్యత్వము
మానుషాకారము
ధరించి
మాత్రమే
వస్తుంది.
దైవం
మానుషరూపేణా.
మానుషాకారము
లేక
మనుష్యులను
సమీపించుటకు
వీలుకాదు.
పురందర
దాసు
చెప్పాడు.
రాతి
నాగును
చూచి
కండ
చక్కెర
పెట్టి
అనేక
ప్రదక్షిణాలు
చేసి
నమస్కరిస్తుంటారు.
కాని
అదే
నాగుపాము
ప్రత్యక్షమైనప్పుడు
రాళ్ళతో
కొట్టి
హింసిస్తున్నాడు.
భగవంతుడు
సామీప్యాన్ని,
సారూప్యాన్ని,
సాయుజ్యమును
అనుగ్రహించటానికి
మానుష
రూపము
ధరిస్తాడు.
మనిషికి
మనిషి
సమీపముగా
ఉండటానికి
అవకాశముంది.
మనిషిని
మనిషి
అర్థము
చేసుకోటానికి
తెలివి
తేటలుంటాయి.
మానవుని
మనస్సు
పరిమితముగా
ఉంటుంది.
ఇది
below
senses.
భగవత్తత్త్వము
beyond
senses.
దానికి
దీనికి
యేమాత్రము
అర్థము
చేసుకోటానికి
వీలులేదు.
కనుక
మానవుని
సన్నిహితము
పెంచుకోటానికి,
స్నేహము
పెంచుకోటానికి,
సమీపత్వము
కావటానికి,
సంభాషణలు
సల్పటానికి,
సాక్షాత్కారము
ఇవ్వటానికి
మనుష్యత్వమే
ప్రధానమైనది.
5
▾
Meaning
Keep
అట్లు
కాకుండా
నేను
భగవంతుడనని
శంఖు
చక్ర
గదాధారిగా
వస్తే
భక్తుడు
పరుగెత్తిపోతాడు.
ఇవన్నీ
అసహజమైనవి.
సహజమునకు
సహజమే
కావాలి.
అందువలన
భగవంతుడు
మానవాకారము
ధరించి
మానవాకారములో
నున్న
భగవత్
తత్వము
అభివృద్ధి
పరుస్తాడు.
రావటం
అంటే
పైనుంచి
క్రిందకు
దిగటం
కాదు.
దివ్యమైన
స్థాయి
నుండి
మానవ
స్థాయికి
రావటం.
నీ
స్థాయికి
వచ్చినంత
మాత్రమున
భగవత్
తత్వము
ఏమాత్రము
కించిత్
పరచటానికి
వీలుకాదు.
నేలపైనున్న
పిల్లను
తల్లి
ఎత్తుకోవాలంటే
తల్లి
వంగి
ఆ
బిడ్డను
చేతులలో
ఎత్తుకుంటుంది.
తల్లి
వంగినంత
మాత్రమున
బిడ్డకు
లొంగినట్లు
కాదు.
అదే
విధముగా
భక్తులను
ఉద్ధరించాలని,
భక్తుల
క్షేమాన్ని
గుర్తించాలని
భగవంతుడు
వస్తుంటాడు.
ఈ
భక్తోద్ధారణ
నిమిత్తమై
వారి
స్థాయికి
దిగుతుంటాడు.
ఈ
దిగినంత
మాత్రమున
మానవుడు
భ్రమిస్తుంటాడు.
దైవమంటే
ఇట్లా
ఉంటాడా.
సామాన్య
మానవునిగా
సంచరిస్తున్నాడు.
సామాన్య
మానవునిగా
పలకరిస్తున్నాడు.
ఇదంతా
దైవమునకు
తగిన
స్థాయి
కాదే.
అతీతమైనదిగా
ఉండాలని
భావిస్తాడు.
మానవాకారములో
నున్న
తత్వమునే
మీరు
అర్థము
చేసుకోలేనప్పుడు
మానవాతీతమైన
తత్వాన్ని
మీరు
ఏరీతిగా
అర్థము
చేసుకోగలరు?
అసాధ్యము.
కనుక
మీరైనా
ఆ
స్థాయికి
రావాలి.
దైవమైనా
మీ
స్థాయికి
రావాలి.
అప్పుడే
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
గుర్తించటానికి
వీలవుతుంది.
దైవము
సామాన్య
మానవుని
వలె
సంచరించిన
మాత్రమున
దైవముగా
భావించుకోకుండా
ఉండకూడదు.
సర్వులు
దైవస్వరూపులే.
ఆకారములు
వేరువేరుగా
ఉన్నాయిగాని
ఆత్మతత్వము
ఒక్కటే.
ఈ
విధమైన
సత్యతత్వము
గుర్తించటానికి
మొట్టమొదట
ప్రయత్నించాలి.
అనేక
జన్మల
సంస్కారము
ఒక్క
జన్మలో
పరిహారము
గావిస్తుంది.
ఏ
జన్మములో
ఎవరు
ఏవిధమైన
రూప
నామములను
ధరించారో
ఆ
నామ
రూపములను
వారికి
నిరూపించినా
నమ్మలేక
పోతుంటారు.
కారణం
ఏమిటి?
ఆ
జన్మములో
ఆ
రూపములో
నున్నారు.
ఆ
జన్మము
మరచిపోయారు
వీరు.
రెండు
తెలిసినా
ఒక్కొక్కసారి
విశ్వసించలేకపోతుంటారు.
ఒక
చిన్న
ఉదాహరణ.
నీకు
తెలుగు
ఇంగ్లీషు
తెలుసు.
కాని
తెలుగు
మాట్లాడే
సమయంలో
ఇంగ్లీషు
పదాలు
రావు.
ఇంగ్లీషు
పదాలు
రాకుండా
పోయినంత
మాత్రమున
ఇంగ్లీషు
రాదనా
అర్థం.
ఇప్పుడు
అనిల్
కుమార్
ఇంగ్లీషులో
ట్రాన్సులేషన్
చేస్తున్నాడు.
ఇంగ్లీషులోకి
తర్జుమా
చేయాలంటే
తెలుగు
తెలుసుండాలి
కదా!
అతనికి
తెలుగు
తెలుసు.
కాని
translation
లో
ఇంగ్లీషు
మాత్రమే
ఉపయోగపెడుతున్నాడు.
6
▾
Meaning
Keep
అదే
విధముగా
past
life
తెలుసు.
present
life
తెలుసు
కాని
present
మీద
concentrate
చేయటం
వలన
past
life
మరచిపోతుంటారు.
తిరిగి
దాన్ని
దర్శించినప్పుడు
అది
గుర్తు
వస్తుంది.
past
is
past
forget
the
past.
future
is
not
sure
dont
brood
over
the
future.
Present.
This
is
very
important.
This
is
not
ordinary
present
omnipresent.
దీనిని
మొట్టమొదట
గుర్తించాలి.
ఇది
ఎట్లా
omnipresent.
Past
results
present
లో
ఉంటున్నాయి.
Future
result
present
లో
ఉంటున్నాయి.
ఉదయం
ఏమి
తిన్నామో
అదే
ఇప్పుడు
త్రేపు
వస్తుంది.
ఇప్పుడు
ఏమి
తింటామో
future
లో
అదే
త్రేపు
వస్తుంది.
Past
వృక్షము
future
వృక్షము.
Present
seed.
seed
లేక
వృక్షము
లేదు.
Past
వృక్షమునకు,
future
వృక్షమునకు
present
seed
మూల
కారణము.
దీనిని
పురస్కరించుకొనియే
భగవద్గీతయందు
‘బీజం
మాం
సర్వ
భూతానాం’
అన్ని
భూతములందు
విత్తనము
నేనే.
ఈ
దివ్యత్వమునకు
జన్మమే
లేదు.
అన్నీ
జన్మములే.
అన్ని
రూపములు
తనవే.
నిన్న
చెప్పాను
లక్ష్మీబాయి
చపాతీలు
తీసుకువచ్చినప్పుడు
కుక్క
తింటే
నేనే
తిన్నాను
అన్నాడు
బాబా.
భగవంతునికి
అధికము,
హీనము
అనే
భేదము
లేదు.
ఆకారములు
వేరు
రూపనామములు
వేరు
ఉన్న
దైవత్వము
ఒక్కటే.
అదే
ఏకాత్మ
భావము.
మనస్సు
ఒక్కటే
అనేక
రూపములు
ధరిస్తుంది.
దీనికి
కారణం
ఏమిటి?
అనేక
సంకల్పముల
చేరిక
చేతనే
రూపములు
తాను
మార్చుకుంటుంది.
ఏ
ఏ
రూపములు
ధరిస్తుందో
ఆయా
రూపమునకు
తగినట్లు
act
చేయవలసి
వస్తుంది.
రూపము
వేరు
action
వేరు
వీలుకాదు.
పూర్వము
నాగయ్య
అని
గొప్ప
actor
ఉండేవాడు.
ఈ
నాగయ్య
త్యాగయ్య
వేషము
వేశాడు.
ఈ
త్యాగయ్య
వేషము
వేసినప్పుడు
త్యాగయ్య
వలె
నటించాలి
గాని
త్యాగయ్య
వేషము
వేసి
నాగయ్య
వలె
నటిస్తే
రాళ్ళు
పడతాయి.
స్టేజిపై
త్యాగయ్య
స్టేజి
వెనుక
నాగయ్య.
ఈ
ప్రకృతి
దృష్టిలో
మీరు
ప్రత్యేకమైన
వారే.
ప్రకృతికి
అతీతమైపోతే
మీరు
నేను
ఒక్కటే.
మంచి
చెడ్డలకు
మూలకారణం
మనసే.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
అనేక
సమయములలో
పిల్లలకు
చెప్పాను.
ఒక
lock
and
key
ఉంటున్నది.
key
తీసుకొని
lock
లో
పెట్టి
right
side
కి
turn
చేస్తే
open
అవుతుంది.
left
side
కి
turn
చేస్తే
lock
అవుతుంది.
ఒకే
lock
ఒకే
key
కాని
turn
చేయటం
వేరు.
మన
హృదయమే
lock
మన
మనస్సే
key.
హృదయములో
మనస్సు
పెట్టి
దైవము
వైపు
తిప్పినప్పుడు
detachment.
మనస్సు
హృదయంలో
పెట్టి
జగత్తువైపు
చూడు
attachment.
7
▾
Meaning
Keep
నీ
కన్నులు
ఒక్కటే
జగద్భావముతో
చూచినప్పుడు
ఇది
ప్రకృతిగా
మారిపోతున్నాది.
ప్రకృతిని
దైవ
భావముతో
చూచినప్పుడు
ఇదే
దైవముగా
రూపొందుతుంది.
పిచ్చివాడా
దైవమును
చూడాలని
ఆశిస్తున్నావు.
నీవు
చూస్తున్నావు
దైవమును.
చూచేదంతా
దైవమే.
శిరస్సులన్నీ
విరాటు
స్వరూపమే.
ప్రతి
పదార్థము
దైవ
స్వరూపమే.
ప్రతి
వ్యక్తి
దైవ
స్వరూపమే.
ప్రతి
విషయము
దైవ
స్వరూపమే.
దైవ
స్వరూపము
చూస్తూ
నేను
దైవమును
చూడాలనుకోటం
ఎంత
సంకుచిత
మనస్సు
నీది.
దైవమంటే
ఎట్లా
ఉంటాడని
నీవు
అనుకున్నావు.
ఏ
దానిని
చూస్తే
దైవమని
విశ్వసిస్తావు.
దైవమంటే
ఎట్లా
ఉంటాడో
నీకే
తెలియదు.
అలాంటప్పుడు
నీవు
దేనిని
చూచి
దైవమని
విశ్వసిస్తావు.
అదే
మూర్ఖత్వము.
సర్వము
దైవత్వమే.
ఆ
దైవ
విశ్వాసము
గాఢంగా
పెట్టుకొన్నప్పుడు
దీనికి
మించిన
విశ్వాసము
మరొకటి
లేదు.
ఒకానొక
సమయంలో
పరీక్షిత్
మహారాజు
శుకుని
ప్రశ్నిస్తున్నాడు.
ఏడు
దినములలో
తన
జీవితము
గతిస్తుంది.
అది
ఋషి
శాపము.
ఈ
ఏడు
దినముల
కాలము
ఎందుకు
వ్యర్థము
చేయాలి?
దైవ
చింతనలో
సార్థకము
గావించుకుంటానని
శుక
మహర్షిని
పిలిపించుకొని
అనేక
బోధలు
వింటున్నాడు.
శుకుడు
బ్రహ్మచారి.
అలాంటివాడు
గోపికల
తత్వము
చక్కగా
వర్ణిస్తూ
వచ్చాడు.
పరీక్షిత్తుకు
సందేహము
కలిగింది.
స్వామి!
గోపికలు
ఏ
విద్యలు
తెలియనివారు.
ఎట్టి
సాధనలు
చేయని
వారు.
ఎట్టి
వేద
శాస్త్ర
ఇతిహాస
పురాణములు
వారికి
తెలియవు.
ఇలాంటి
గోపికలకు
భగవంతుడు
ఏ
విధముగా
వశమైపోయాడు.
పిచ్చివాడా!
వేదశాస్త్ర
ఇతిహాస
పురాణములు
తెలిసినంత
మాత్రమున
దైవాన్ని
చూడగలుగుతున్నారా
అందరు.
వేదశాస్త్ర
ఇతిహాస
పురాణములు
వర్ణించటమేగాని
దర్శించుటకు
హృదయ
పవిత్రత
ఉండాలి.
శాస్త్రములు
చదివినంత
మాత్రమున
ప్రాపంచిక
సంబంధమైన
జ్ఞానము
లభించవచ్చు.
ఇది
ప్రాకృత
జ్ఞానమే
గాని
దివ్యజ్ఞానము
కాదు.
దివ్యజ్ఞానము
కావాలంటే
ఈ
శాస్త్రము
కాదు
ప్రధానము.
ఈ
శాస్త్రము
మానసిక
తత్వమును
మారుస్తుంది.
రామాయణము
పెట్టుకొని
ఒక
పిల్లవాడు
పేజీ
పేజీ
తిప్పుతున్నాడు.
అదే
రీతిగా
ఒక
పండితుడు
ఒక్కొక్క
పేజీ
తిప్పుతున్నాడు.
ఇతను
గొప్ప
పండితుడు.
పిల్లవాడు
అజ్ఞాని.
కాని
పేజీలు
తిప్పటం
ఒకటే.
పిల్లవాడు
బొమ్మలు
చూస్తున్నాడు.
పండితుడు
విషయము
చూస్తున్నాడు.
ఇదే
వ్యత్యాసము.
ఒకానొక
ఆఫీసరు
ఆఫీసులో
ఉన్నాడు.
ఇంటిలో
పిల్లవాడు
రోదన
చేస్తుంటే
భార్య
పంపించింది
తండ్రి
దగ్గర
పోయి
కూర్చోమని.
తండ్రి
ఆఫీసులో
ఉన్నాడు.
పిల్లవాడు
అక్కడ
కూడా
పేపర్లు
లాగి
అల్లరి
చేస్తున్నాడు.
8
▾
Meaning
Keep
పక్కన
map
ఉంది.
map
ను
ఇచ్చి
కత్తిరించి
సరిచేయమన్నాడు
పని
పెట్టాలని.
world
map
లో
ఏ
దేశము
ఎక్కడుంటుందో
తెలియదు.
తిప్పి
చూచాడు
వెనుక
ఒక
మనిషి
బొమ్మ
ఉంటున్నాది.
సులభంగా
మనిషిని
అర్థము
చేసుకున్నాడు.
చేతులు
ఎక్కడ
ఉండాలి
తల
ఎక్కడుండాలి.
కత్తిరించిన
పేపరంతా
కూర్చుతూ
వచ్చాడు.
మనిషిని
కూర్చేటప్పటికి
తిప్పి
చూస్తే
world
map
గా
వచ్చేసింది.
తనకు
తెలియని
world
map
correct
గా
వచ్చింది.
ఎందుకు
correct
గా
వచ్చింది.
మనిషి
correct
గా
వచ్చేటప్పటికి
world
map
correct
గా
వచ్చింది.
మొట్టమొదట
మనిషి
మనిషిగా
మారితే
ప్రపంచమంతా
మంచిగా
ఉంటుంది.
మొట్టమొదట
మనిషి
మనిషిగా
మారు.
మనిషి
మనిషిగా
ప్రవర్తించు.
మనిషి
మనిషిగా
జీవించు.
ఇదే
మాధవత్వము.
మనిషి
కూడా
పశువుగా
మారిపోతే
ఇంక
ఏ
విధముగా
ప్రపంచము
చూడగలరు?
ఇది
అసాధ్యము.
మొట్టమొదట
నీవు
మనిషిగా
జీవించు.
పశువుగా
దిగజారవద్దు.
రాక్షసుడుగా
రూపొందవద్దు.
మనిషి
మనీషిగా
బ్రతకాలి.
అదే
చాలు.
అదే
నీ
దివ్యత్వమునకు
మార్గము.
ఈనాడు
మానవుడు
మానవుడుగా
కావటానికి,
పశువుగా
మారటానికి,
మాధవుడుగా
రూపొందటానికి
మనసే
కారణము.
మానవత్వము
ప్రత్యేకంగా
లేదు.
పశుత్వము
ప్రత్యేకంగా
లేదు.
దివ్యత్వము
ప్రత్యేకంగా
లేదు.
మూడింటి
ఏకత్వమే
మానవత్వము.
మంచి
ప్రేమతత్వముతో,
దయాకరుణలతో
జీవించినప్పుడు
నీవే
దైవత్వముగా
మారిపోతావు.
నీవు
ఇంద్రియలోలుడై
ఇంద్రియములకు
స్వాధీనమై
వాటి
చెప్పుచేతలలో
బ్రతుకుతుంటే
నీవు
ఒక
రాక్షసుడుగా
మారిపోతావు.
క్షణములో
కోపము
రావటము,
క్షణములో
ఉద్రేకము
రావటము
అన్ని
క్షణాలలోనే
రూపొందుతుంటాయి.
ఇది
రజోగుణ
లక్షణము.
మంచిని
చెడ్డగా
చెడ్డను
మంచిగా
మార్పు
చేసేది
తమోగుణ
లక్షణము.
కాబట్టి
మానవుడు
త్రిగుణాత్మక
స్వరూపుడు.
ప్రపంచము
కూడా
త్రిగుణాత్మక
స్వరూపమే.
త్రిగుణాత్మకమైన
ప్రపంచములో
త్రిగుణాత్మకుడైన
మానవుడుగా
రూపొందాలి.
త్రిగుణాత్మక
మానవుడు
త్రిగుణాతీతంగా
మారిపోవాలి.
అప్పుడే
బ్రహ్మానందము
ప్రాప్తిస్తుంది.
భగవదాజ్ఞను
శిరసా
వహించు.
భగవంతుని
ఆజ్ఞను
మనం
పాటించాలి.
భగవంతుని
ఇష్టము
మనం
అర్థం
చేసుకోవాలి.
దైవత్వము
అందరియందు
ఉండినప్పటికి
రూపనామముతో
నాకు
సాక్షాత్కరించింది
అనే
సద్భావము
కలగాలి.
రెండు
దేహములు
ఒక్కటే
అనే
భావము
పెట్టుకుంటే
ఏమాత్రము
సాధ్యము
కాదు.
దేహములు
సమానము.
భావములు
ప్రత్యేకమే.
భగవంతుడు
భావప్రియుడుగాని
బాహ్యప్రియుడు
కాదు.
9
▾
Meaning
Keep
మానవుడు
బాహ్యప్రియుడేగాని
భావప్రియుడు
కాదు.
బాహ్యమును
విస్మరించి
భావమును
పోషించుకోటానికి
కృషి
చేయాలి.
అవే
ఆనాడు
నానాకు
కల్గిన
doubts.
అలాంటి
నానా
కట్టకడపటికి
ఒక్క
క్షణమైనా
బాబాను
వదలలేకపోయేవాడు.
బాబా
హుక్కా
పీల్చాలనుకుంటే
ముందు
నానా
పీల్చి
బాబాకు
అందించాలి.
అంత
సన్నిహితుడుగా
మారిపోయాడు
నానా.
నానా
లేక
బాబా
భోజనము
చేసేవాడు
కాదు.
బాబా
లేక
నానా
భోజనము
చేసేవాడు
కాదు.
అట్టి
సంబంధ
బాంధవ్యము
ఏర్పడిపోయింది.
కాని
అది
సామాన్య
మానవులు
అర్థము
చేసుకోలేరు.
ఆయన
లేక
ఈయన
ఎందుకు
భోజనం
చేయకూడదని
కొంతవరకు
విమర్శిస్తారు.
అది
నా
ఇష్టము
నీవెవరు
చెప్పేందుకు.
నా
భావము
అట్లుంది.
నానా
ఉంటేనే
భోజనము
చేస్తాను.
ఇంత
దయామయుడుగా
ఉంటున్నాడు
దైవము
100%
compassion
100%
love.
దీనికంటె
మించినది
మరొకటి
లేదు.
ఈ
ప్రేమ
తత్వము
అందరు
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
ఈ
ప్రేమయే
సర్వులయందు
ఉన్నది.
కాబట్టి
సర్వులను
ప్రేమించండి.
ఎవరిని
ద్వేషించకూడదు.
కారణం
ఏమిటి?
మనము
ఎవరినైనా
ద్వేషిస్తే
వారు
మనలను
ద్వేషిస్తారు.
reaction
resound
and
reflection.
దైవత్వములో
మూడూ
ప్రతిబింబిస్తూ
ఉంటాయి.
ఎవరి
జన్మము
ఏనాడు
ఎట్టిదిగా
ఉండేదో
ఈనాడు
ఈ
జన్మము
ఏరీతిగా
ఉంటుందో
ఎవరు
చెప్పలేరు.
అలాంటి
వారికే
ఎట్టి
కారణము
లేకుండా
కార్యము
జరుగుతుంది.
వారు
ఆశించకపోయినా
భగవంతుడే
వారిని
ఆశించి
వారిని
లాగుతూ
ఉంటాడు.
కారణం
ఏమిటి?
past
life
ప్రాప్తియే
మూల
కారణము.
పూర్వపు
విత్తనమే
ఈనాడు
మొక్కగా
వస్తుంది.
విత్తనము
లేక
మొక్క
ఎట్లా
వస్తుంది.
ఒక
దినము
సాయంకాలము
బీచ్
లో
తిరుగుతుంటే
అంతా
ఇసుకయే
కనిపించింది.
రెండవ
దినము
వర్షము
కురిసింది.
మరుసటి
దినము
బీచ్
కి
పోయి
చూస్తే
పచ్చగా
మొలకలు
వచ్చాయి.
నిన్న
ఏ
మొక్కలు
లేవు.
ఈనాడు
పచ్చగా
కనిపిస్తున్నాదంటే
నిన్నటి
దినము
కూడా
ఉంటున్నాది.
నిన్న
విత్తన
రూపములో
ఉంటున్నాది.
ఈనాడు
మొక్క
రూపములో
కనిపిస్తున్నది.
నిన్న
విత్తనము
లేక
ఈనాడు
మొక్క
రావటానికి
వీలు
కాదు.
ఈ
విత్తనము
కనిపించదు.
మొక్క
కనిపిస్తుంది.
కనిపించనిదే
మీకు
వినిపిస్తుంది.
వినిపించినదే
తలపిస్తుంది.
తలపించినదే
మురిపిస్తుంది.
మురిపించినదే
మరపిస్తుంది.
మనకు
కనిపించనిది
మురిపిస్తున్నాది.
నీవు
past
life
ఏమాత్రము
విచారించవద్దు.
సమయం
వస్తే
రెండు
ఏకమైపోతాయి.
10
▾
Meaning
Keep
దైవం
కోసం
వేచి
ఉండు.
Don't
waste
time.
time
waste
is
life
waste.
ఒక్కొక్కదానికి
ఒక్కొక్క
సంబంధము
ఉంటుంది.
ఈ
సంబంధ
బాంధవ్యములు
ఒకరు
చెబుతే
వచ్చేవి
కాదు.
అది
దైవత్వమునకు
తప్ప
మరొక
దానికి
వీలుకాదు.
free
will
అంటారు
యువకులు.
ఏమిటి
అర్థము
ఎవరికుంది
ఈ
free
will.
ఎవరికి
లేదే.
నేను
ఏదో
ఒక
పని
చేయాలి
కనుక
free
will
అంటారు.
తక్షణమే
సందేహాలు
వస్తాయి
అవుతుందో
కాదోనని.
ఇంక
free
will
ఎక్కడుంది?
ఆ
యోచనకే
అవకాశము
ఉండకూడదు.
ఆ
free
will
Divine
power
తప్ప
మరొకటి
కాదు.
ఎవరికీ
free
will
లేదు.
ప్రపంచమునకు
ప్రెసిడెంటు
కావచ్చు.
ఏ
పని
చేయాలన్నా
కొన్ని
నిబంధనలకు
కట్టుబడి
ఉండాలి.
కాని
దైవమునకు
ఎట్టి
కట్టుబాటు
లేదు.
ఏమైనా
చేయవచ్చు.
అది
free
will.
ఆ
పదములు
ఉపయోగపెట్టకూడదు.
ఒక్క
దైవత్వమునకు
మాత్రమే
free
will.
అదే
నిజమైన
శక్తి.
మానవుడు
మానవుడుగా
జీవించటానికి
ప్రయత్నించాలి.
తోటి
మానవునితో
మానవుని
వలె
ప్రవర్తించాలి.
మానవుల
మధ్యలో
మృగము
వలె
నీవు
ప్రవర్తించవద్దు.
ఎవరికైనా
నమస్కారమంటే
వారు
నమస్కారమంటారు.
ఎలాంటి
భావముతో
పలకరిస్తామో
అలాంటి
భావముతో
ఎదురు
పలుకు
వస్తుంది.
మంచిగా
మాట్లాడండి.
మంచిగా
ప్రవర్తించండి.
మంచిగా
నడచుకోండి.
మంచి
పేరు
తెచ్చుకోండి.
ఆదర్శ
వ్యక్తులుగా
మీరు
తయారు
కావాలి.
వ్యక్తిత్వము
పోషించుకోటానికి
పూనుకోవాలి.
అప్పుడే
మన
జీవితము
జై
అనిపించుకుంటుంది.
Previous
←
Service to Society Is the Mark of True Humanness
Next
A Life without Character Is a Lifeless Life
→