Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Only When the Tāmasika and the Rājasika Are Crossed Does the Sāttvika Emerge
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only When the Tāmasika and the Rājasika Are Crossed Does the Sāttvika Emerge
3 July 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 438
తామసంబు
విడక
తత్వంబు
కనరాదు
రాజసంబు
విడక
రాదు
భక్తి
సాత్వికంబె
భక్తిసాధనం
బగునయా
వినుడు
భారతీయ
వీరసుతుడ!
దృశ్యకల్పితమైన
ఈ
జగత్తంతయు
త్రిగుణములయొక్క
ప్రభావమే.
ప్రతి
మానవుడు
త్రిగుణస్వరూపుడే.
ఇట్టి
త్రిగుణములందు
నిత్యజీవితమును
గడుపుతున్న
మానవుడు
త్రిగుణరహితుడు
ఏవిధంగా
కాగలడు?
కాన
త్రిగుణ
తత్వములో
నున్న
మంచి
చెడ్డలను
గుర్తించినప్పుడే
మానవుడు
త్రిగుణాతీతుడు
కాగలడు.
సామాన్య
మానవులకు
తామసికము,
రాజసికము,
సాత్వికము
ఈ
మూడు
అవసరమే
నిద్ర
లేక
మానవుడు
జీవించలేడు.
విచారణ
చేయక
మానవుడే
క్రియలోను
పాల్గొనడు.
ఆలోచించక
ఏ
మానవుడు
ఏ
కార్యములో
ప్రవేశించడు.
కనుక
ఈ
నిద్ర,
విచారము,
సంప్రదింపులు
ఇవన్ని
తామసిక
సంబంధమైన
గుణమంతే.
ఇంక
నిత్యజీవితములో
రాజసికము
లేక
క్షణమైనా
మానవుడు
జీవించలేడు.
కోరికలన్నీ
రాజసికమే.
దైవము
కావాలని
ఆశించటం
కూడా
రాజసికమే.
కామి
గాక
మోక్షగామి
కాడు.
లోకసంబంధమైన
వాంఛలు,
దైవ
సంబంధమైన
వాంఛలు
మానవునిలో
రాజసికము
లేక
ఆవిర్భవించవు.
వాంఛలు
వివిధమైనవిగా
ఉండవచ్చుగాని
వాంఛల
స్వభావము
ఒక్కటే.
కనుక
క్రోధము,
ద్వేషము,
అసూయ,
అహంకారము,
ఆడంబరము
ఇత్యాది
గుణములన్ని
రాజసిక
సంబంధమైన
గుణములే.
ఈ
రాజసికమునందు
సాత్వికము
అంతర్భావముగా
ఉంటున్నది.
గంగా
యమునల
మధ్య
సరస్వతి
అంతర్వాహినిగా
ప్రవహించినట్లుగా
ఈ
రజోగుణ
తమోగుణముల
మధ్య
సాత్వికము
అంతర్వాహినిగా
ఉంది.
క్రమక్రమేణా
ఒక్కొక్క
గుణమును
ఒక్కొక్క
రీతిగా
విశ్లేషించినప్పుడు
ఒక్కొక్క
మార్గములో
ప్రవేశించి
నడచుకున్నప్పుడు
సాత్వికము
మనలో
ఆవిర్భవిస్తుంది.
సాత్వికం
కావాలంటే
తామసికం
ఒక
సోపానము.
రాజసికము
కూడా
ఒక
సోపానమే.
ఈ
రెండింటిని
దాటినప్పుడే
సాత్వికము
మనలో
ఆవిర్భవిస్తుంది.
2
▾
Meaning
Keep
తామసికము.
మొట్టమొదట
రత్నాకరుడు
దారులు
కొట్టే
దొంగగా
ఉండి
తన
స్వార్థ
స్వప్రయోజనముల
నిమిత్తమై
దయా
దాక్షిణ్యములు
లేక
బాటసారులను
హింసిస్తూ
బాధిస్తూ
వారి
దగ్గరనున్న
ధనమును
అపహరిస్తూ
తన
జీవితము
గడుపుతూ
వచ్చాడు.
దయాదాక్షిణ్యములు
లేకపోవటం
చేత
తామసికుడుగా
ఉన్నాడు.
అట్టి
స్థితిలోనున్న
రత్నాకరుడు
సప్తబుషుల
దర్శనము
చేత,
స్పర్శనం
చేత,
సంభాషణ
చేత
మహాతపస్విగా
మారిపోయాడు.
కేవలం
తపస్సు
మాత్రమే
కాదు
గొప్ప
కవిగా
రూపొందాడు.
ఈ
కవిత్వము
దైవసంబంధమైనదిగా
రూపొందింప
చేసుకున్నాడు.
కవి
అనగా
ఎవరు?
త్రికాలములందు
తన
తత్వాన్ని
గుర్తించినవాడు
నిజమైన
కవి.
భూత,
భవిష్యత్
వర్తమానములను
గుర్తించినవాడే
కవి.
ఈనాటి
కలియుగ
ప్రభావము
చేత
కొన్ని
పదములు
పొర్లించినంత
మాత్రమున
కవిగా
రూపొందుతున్నాడు.
వీరందరు
కవులుకారు.
వాల్మీకి,
వ్యాసుడు
వీరందరు
తపశ్శక్తి
చేత
త్రికాలములు
దర్శించి,
త్రిగుణాత్మక
స్వరూపుడైన
దైవత్వాన్ని
దర్శించి
వారు
కవులుగా
రూపొందారు.
పరిపూర్ణ
తామసంతో
నున్న
వాల్మీకి
సాత్వికుడుగా
మారటానికి
ప్రధాన
కారణం
సత్సంగమే.
కనుక
తామసికమును
మార్చుకుందుకు
వీలుకాదని
మనం
బలహీనులు
కారాదు.
అన్నింటికి
దైవానుగ్రహం
మూలకారణము.
ఎప్పుడు
ఎక్కడ
ఏ
నిముషములో
దైవానుగ్రహము
మనకు
ప్రాప్తించునో!
ఈ
తామసికము
తామసికంగా
ఎప్పటికీ
ఉండదు.
తామసికము
directగా
సాత్వికములో
ప్రవేశిస్తుంది.
తామసికము
రాజసికములోకి,
రాజసికము
సాత్వికములోనికి
ఇలా
ఒక్కొక్క
క్లాసు
మారనక్కర
లేదు.
ఈ
తామసికం
కూడా
దైవానుగ్రహము
చేత
పెద్దల
యొక్క
ప్రబోధల
చేత
directగా
సాత్వికములోనికి
ప్రవేశించవచ్చు.
తామసికుడైన
రత్నాకరుడు
తపస్సాచరించి
మహర్షుల
ప్రబోధల
చేత
శుద్ధ
సాత్వికుడుగా
మారిపోయాడు.
రెండవది
రాజసికము.
ఇది
క్షాత్రము,
ద్వేషము,
అసూయ,
ఆడంబరము,
అహంకారము,
క్రోధము
ఇత్యాది
గుణములతో
కూడి
ఉన్నది
రాజసికము.
ఉదాహరణకు
విశ్వామిత్రుడు.
రాజసికములో
జీవించిన
విశ్వామిత్రుడు
గొప్ప
మహర్షిగా
మారిపోయాడు.
వశిష్ఠుల
వారిపై
ద్వేషం
పూని,
వశిష్ఠులవారిని
అనేక
విధములుగా
విమర్శించి
అతనిని
బ్రహ్మర్షిగా
భావించి
తాను
కేవలం
రాజర్షిగా
ఉంటున్నాను
అనే
అసూయ
దీనికి
మూలకారణం.
ఈ
ద్వేషము
ఎంతవరకు
పోయింది!
బ్రహ్మర్షి
అయిన
వశిష్ఠుని
నిర్మూలం
చేసిన
దాకా
తాను
దీక్ష
మానకూడదనే
రీతిలో
ప్రవేశించాడు.
3
▾
Meaning
Keep
ఒకానొక
సమయంలో
వశిష్ఠుల
వారు
తమ
ధర్మపత్ని
అయిన
అరుంధతితో
పూర్ణిమ
వెన్నెలలో
కూర్చుని
అనేక
విధములుగా
చంద్రుని
యొక్క
కళలను
మాట్లాడుకొంటున్నప్పుడు
ఈ
అరుంధతి
చెప్తున్నది.
ఈనాడు
పూర్ణచంద్రుడుగా
ఉంటున్నాడు.
చంద్రునిలో
ఏ
దోషములు
లేవు
అని
ముచ్చటించుకున్న
సమయములో
వశిష్ఠులవారు
చెప్తున్నారు.
‘అవునవును.
ఈనాటి
చంద్రుడు
విశ్వామిత్రుని
తపస్సువలె
ఏవిధమైన
దోషములు
అనే
మచ్చ
లేకుండా
ప్రకాశిస్తున్నాడు.
ఈ
విషయమును
పొదలో
దాగుకొని
వశిష్ఠుల
వారిని
కడతేర్చాలని
సంకల్పముతో
వచ్చిన
విశ్వామిత్రుడే
విషయాన్ని
విన్నాడు.
చేతిలోనున్న
కత్తిని
పారవేశాడు.
తన
ధర్మపత్ని
దగ్గర
తన
తపఃశక్తిని
ఇంతగా
వర్ణిస్తున్నాడు.
ఇలాంటి
వాని
మీద
ద్వేషము
పూనటం
నాయొక్క
దోషం.
ఇది
రజోగుణము
యొక్క
ప్రభావము.
ఛీ!
ఈ
రజోగుణము
ఎంత
కార్యమునైనా
చేయిస్తుంది.
పరుగెత్తిపోయి
వశిష్ఠులవారి
పాదములపై
పడ్డాడు.
ఎప్పుడు
వశిష్ఠుల
వారి
పాదములపై
పడ్డాడో
వశిష్ఠులవారు
తన
ముఖమైనా
చూడక
ఆశీర్వదించి
విశ్వామిత్రా!
బ్రహ్మర్షీ!
లెమ్ము.
అన్నాడు.
ఇంతకాలము
రాజర్షి
అని
పిలుస్తున్న
వశిష్ఠుల
వారు
సహజముగా
ఏ
విధమైన
ఇది
లేకుండా
బ్రహ్మర్షి
అనే
పదం
ఆయన
నోటినుండి
వచ్చింది.
ఈ
ఆనందమును
భద్రపరచుకోలేక
విశ్వామిత్రుడు
నేను
బ్రహ్మర్షి
కావటానికి
కారణమేమిటి?
మీరు
ఎందువల్ల
నన్ను
బ్రహ్మర్షియని
పిలుస్తున్నారని
అడిగాడు.
‘విశ్వామిత్రా!
ఇంతకాలము
నీవు
అహంకారములో
మునిగావు.
అహంకారములో
పుట్టావు.
అహంకారములో
పెరిగావు.
అహంకారములో
జీవించావు.
ఎవరికీ
నీవు
శిరస్సు
వంచినవాడవు
కావు.
కాని
ఈనాడు
నీ
అహంకారము
నిర్మూలము
గావించి
నా
పాదములపై
పడ్డావు.
ఇదియే
నిరహంకారమునకు
గుర్తు.
కనుకనే
ఇప్పుడు
నీవు
బ్రహ్మర్షి
అయ్యావు.
అహంకారం,
అభిమానం,
మమకారం,
ఆడంబరం
ఇత్యాది
దుర్గుణములకు
దూరమైనవాడే
బ్రహ్మర్షి.
ఎట్టి
విద్యలుకాని,
చదువులు
కాని,
పాండిత్యముగాని
మనసునందు
తలంచక
నేను
కేవలం
భగవంతుని
చేతిలో
బొమ్మను,
ప్రతి
ఒకటి
భగవంతుని
యొక్క
లీలయే
అతని
చేతిలో
నున్న
బొమ్మలను
ఏవిధంగా
ఆడించవలెనన్న
ఆవిధముగా
ఆడించవచ్చు.
ఇత్యాది
భావములు
మానవునిలో
ఏనాడు
ఆవిర్భవించునో
అదే
నిజమైన
బ్రహ్మర్షికి
సరైన
గుర్తు.
నేను
చేస్తున్నాను,
ఇది
నాది,
ఇది
నీది
అనే
అభిమాన
మమకారముల
వలన
మానవు
డమితంగా
అహంకారములో
మునిగిపోయి
తరువాత
ఇతనుకేవలము
ఒక
రాజర్షిగా
మారుతుంటాడు.
నేను
అహంకారము.
నాది-
మమకారము.
ఈ
అహంకార
మమకారములు
మానవునియందు
ఏనాడు
నిర్మూలమగునో
4
▾
Meaning
Keep
ఆనాడు
తాను
బ్రహ్మర్షిగా
మారతాడు.
బుషి
అనగా
అనేక
విద్యలు
నేర్చటం
కాదు.
తపస్సు
లాచరించటం
కాదు.
మనలో
నున్న
గుణములు
మార్చుకోటమే
బుషిత్వమునకు,
దివ్యత్వమునకు
తగిన
గుర్తులు.
మానవునియందుండవలసిన
సద్గుణములు
పూర్తిగా
ఉండాలి.
అదే
దైవప్రీతి,
పాపభీతి,
సంఘనీతి.
ఈ
మూడు
గుణములు
మానవత్వమునకు
చక్కని
విలువనందిస్తాయి.
సత్యము
ఏనాడు
మానవుడు
మరచునో
ధర్మమును
ఏనాడు
నడచుకోలేకపోతున్నాడో
ఆనాడే
మానవుని
విలువ
దిగజారిపోతున్నాది.
ప్రపంచములో
సర్వ
పదార్థముల
విలువ
అట్లనే
పెరుగుతున్నాయి.
కారణం
ఏమిటి?
తమ
సహజ
గుణమును
తాము
అనుసరిస్తూ
వస్తున్నాయి.
మానవుడు
తన
సహజమైన
గుణములు
నిర్మూలము
గావించుకొని
కల్పితమైన
గుణములను
అనుసరిస్తూ
వస్తున్నాడు.
స్వధర్మము,
పరధర్మం.
స్వధర్మమనగా
ఆత్మధర్మము.
పరధర్మమనగా
దేహధర్మము.
దేహ
సంబంధమైన
మార్గములన్నీ
ప్రవృత్తి
మార్గములు.
ఆత్మ
ధర్మమంతా
నివృత్తి
ధర్మములు.
ఈనాటి
మానవుడు
స్వధర్మమును,
పరధర్మమును
విస్మరించి
కల్పిత
ధర్మాన్ని
ఆచరిస్తున్నాడు.
ఈనాడు
వంకాయ,
బెండకాయ
విలువ
పెరుగుతున్నాది
కాని
మానవుని
విలువ
తగ్గిపోతూ
వస్తున్నాది.
కారణం
ఏమిటి?
సత్యమును
విస్మరించాడు.
ధర్మమును
విస్మరించాడు.
ఈ
రెండింటిని
విస్మరించటం
చేత
ధర్మము
విస్మరించింది.
ధర్మో
రక్షతి
రక్షితః.
ధర్మాన్ని
రక్షించువానిని
ధర్మమే
రక్షిస్తుంది.
ధర్మాన్ని
హింసించువానిని
ధర్మమే
హింసిస్తుంది.
ఈనాడు
మానవుని
విలువ
తరిగిపోవటానికి
మూలకారణ
మిదియే.
మానవుడు
సత్యమును
పలకాలి.
ధర్మమును
ఆచరించాలి.
ఈనాడు
ధర్మమును
పలుకుతున్నాడు
ధర్మమును
ఆచరించటం
లేదు.
ఆచరించకుండా
పలికే
పలుకులు
ఎంతకాలం
విలువ
ఉంటాయి.
ఎంతో
ధర్మాన్ని
గురించి
ఉచ్చరిస్తున్నాము.
ఫ్లాట్
ఫారం
దిగేంతవరకు
ఆ
ధర్మము
ఉండదు.
అలాంటి
వానిని
ధర్మము
ఏవిధంగా
రక్షిస్తుంది.
ఈనాడు
ధర్మమును
ప్రబోధ
చేస్తున్నారేగాని,
ప్రచారము
చేస్తున్నారే
గాని
ఆచరణ
లేదు.
ప్రచార
ప్రబోధలు
ప్రధానమైనవి
కాదు.
బుక్కులో
తీపి
పదార్థములు
ఎన్ని
చదివినా
మనకు
కడుపు
నిండుతుందా?
ఒక్కతూరి
నోట్లో
పెట్టుకున్నప్పుడే
తీపి
నీకు
అర్థమవుతుంది.
అదే
విధముగా
గ్రంథ
పరిచయముచే
మానవుడు
సత్యము,
ధర్మము
అని
ఉచ్చరిస్తున్నాడు.
శారీరంగా
ఆచరణలో
పెట్టాలి.
స్మరణ
చేత,
బోధల
చేత,
ఆచరణ
చేత
తామసికుడైన
రత్నాకరుడు
ఒక
బుషిగా
మారిపోయాడు.
శ్రవణం
మాత్రమే
చేయలేదు.
ఆచరణ
చేశాడు.
5
▾
Meaning
Keep
కడపటికి
తన
దేహమునే
తాను
మరచిపోయాడు.
ఆ
దేహముపై
పుట్ట
పెరిగిపోయింది.
పుట్ట
నుండి
రాం
రాం
అని
రామనామము
ఉచ్చరిస్తున్నాడు.
అహంకారముతో
బాటు
దేహాభిమానము
కూడా
మరచిపోయాడు.
దేహాభిమానము,
విద్యాభిమానము,
కులాభిమానము,
ధనాభిమానము
ఇలాంటి
అభిమానములన్నీ
మానవుని
కట్టివేస్తున్నాయి.
ఇవన్నీ
ఏనాడు
వదలెనో
ఆనాడే
తాను
మహర్షిగా
మారిపోయాడు.
మహర్షి
మాత్రమే
కాదు.
శ్రీరామచంద్రుని
చరిత్ర
వ్రాసే
మహర్షిగా
అధికారము
సంపాయించాడు.
తమోగుణముతో
జీవిస్తున్న
వాల్మీకి
ఇంతటి
గొప్పవాడవటానికి
పెద్దల
దర్శన
స్పర్శన
సంభాషణలే.
వారి
సంగముచేత
దుర్గుణములన్నీ
పవిత్రము
లైనాయి.
విశ్వామిత్రుడు
కూడా
అంతే.
మొట్టమొదట
మహారాజు
కౌశికుడు.
మహారాజు
రాజసికముగా
ఉండేవాడు.
అలాంటివాడు
త్యాగము
చేసి
రాజ్యము
త్యజించి
సుఖశాంతులను
విస్మరించి
తపస్సు
ఆచరించాడు.
కడపటికి
వశిష్ఠులవారి
ప్రబోధచేత
మహర్షిగా
మారిపోయాడు.
బ్రహ్మర్షిగా
మారాడు.
రాజర్షినుండి
బ్రహ్మర్షి
అయ్యాడు.
సాత్వికము
అంటే
ఏమిటి?
నిరంతరము
శాంతము,
సహనము,
సానుభూతి
సత్యము
ఇలాంటివన్నీ
సాత్విక
గుణములు.
కామ
క్రోధ
లోభ
మద
మాత్సర్యములకు
ఏమాత్రము
అవకాశము
అందించడు.
ఎలాంటి
ద్వేషము
వచ్చినా
ప్రేమగా
మార్చుకుంటుంది.
చిన్న
ఉదాహరణము.
మీరు
ఎవ్వరు
ఏమీ
తలంచకూడదు.
స్వామి
నిరంతరము
ప్రేమతత్వాన్ని
ప్రచారము
చేస్తుంటాడు.
ప్రతి
ఉపన్యాసమందు
ప్రేమ
ప్రేమ
అని
ఉచ్చరిస్తుంటాడు
ఈ
ప్రేమను
మీరు
ఎంతమంది
అనుభవిస్తున్నారు?
ఎంతమంది
ఆచరిస్తున్నారు?
ఎవరైనా
వచ్చి
ఒక
ప్రశ్న
అడుగుతే
ప్రేమతో
జవాబు
చెప్పే
వ్యక్తియే
కనిపించటం
లేదు.
మందిరములో
గానీ
క్యాంటీనులో
గానీ
బుక్స్టాల్లో
గానీ
ఎకామిడేషన్లో
గాని
ఆసుపత్రిలో
గానీ
ఎక్కడికి
పోయినా
ప్రేమ
అనే
పలుకే
లేదు.
ఎందుకు
ఉపన్యాసములు
వినాలి.
ఒక్కరైనా
ప్రేమతో
జవాబు
చెప్పే
వ్యక్తి
కనిపిస్తున్నాడా?
ఎవరైనా
కొత్తవారు
వచ్చి
స్వామి
దర్శనము
టైము
ఎప్పుడంటే
తెలీదు
పోపో.
తెలిసిన
విషయమును
నెమ్మదిగా
శాంతముగా
చెప్పకూడదా.
ఇంక
విద్యావంతులను
అడిగితే
this
is
not
my
duty
go
అంటారు.
దీనికి
duty
కావలెనా?
అడిగిన
దానికి
నెమ్మదిగా
ప్రేమతో
జవాబు
చెప్పటానికి
ఏమి
నష్టము.
ఆడవారియందుగాని
మగవారి
యందుగాని
ఇరవై
సంవత్సరములు
ముప్పై
సంవత్సరములు
ఆశ్రమములో
జీవిస్తున్నారు.
ఒక్కరికైనా
ప్రేమమయమైన
హృదయము
లేదు.
సాధనలు
చేస్తుంటారు.
జపతపములు
చేస్తుంటారు.
దేనికోసం?
ఈ
ప్రేమ
వారిలో
ఏమైపోయింది?
ప్రేమను
చంపుకుంటున్నారు
వీరు.
6
▾
Meaning
Keep
ద్వేషము
పెంచుకుంటున్నారు.
నిజముగా
స్వామి
ప్రబోధలు
వినాలని
సంకల్పించుకుంటే
ఎందుకు
మీరు
ఆచరణలో
పెట్టకూడదు.
నివాసము
ఆశ్రమము.
చర్యలు
చూస్తే
దుర్మార్గములు.
ఏ
పని
అయినా
శ్రద్ధతో
చేస్తున్నారా?
ఎక్కడైనా
సత్యమును
ఉచ్చరిస్తున్నారా?
ఏ
పలుకైనా
ప్రేమతో
అందిస్తున్నారా?
ఎక్కడా
కనిపించటం
లేదు.
వినిపించటం
లేదు.
ప్రేమతో
జవాబు
చెప్పు.
ఎవరైనా
నిన్ను
మాట్లాడిస్తారు.
ఏమిటి
సమాచారము
అంటారు.
నాకు
మాట్లాడుటకు
ఇష్టము
లేదు.
స్వామికి
అధికముగా
మాట్లాడుటకు
ఇష్టము
లేదు
నేను
స్వామి
ఆజ్ఞను
పాటిస్తున్నాను
అని
మంచిగా
నమస్కరించి
చెబుతే
తప్పేముంది?
విద్యార్థులైనా,
టీచర్సు
అయినా,
డాక్టర్సు
అయినా
ప్రేమతో
జవాబు
చెప్పే
వ్యక్తియే
కనిపించటం
లేదు.
ఎందుకు
మీరు
ఉపన్యాసములు
వినాలి.
విన్నందుకు
ఏదైనా
గుర్తుండాలికదా!
కుంభవర్షము
కురుస్తే
క్రింద
తేమ
ఉండాలికదా.
ఉపన్యాసములకు,
భజనలకు
ముందు
సీటులో
వచ్చి
కూర్చుంటారు.
భజనలో
చూస్తే
భజనకు
ఈ
ఆడవారు
జగడము
ముందు
సీటు
నాది
ముందు
సీటు
నాది
అని.
ఎందుకు
వీరికీ
అహంకారము.
ఎక్కడైతేనేమి
భగవంతుని
నామస్మరణ
వింటున్నారు
అదే
చాలు
అని
ఆనందపర్చుకో.
కావలసినంత
దయ
ఉంటున్నాది.
కావలసినంత
ప్రేమ
ఉంటున్నాది.
కాని
మీరు
హృదయాల్లో
నింపుకోటం
లేదు.
కుంభవర్షము
కురుస్తున్నాది.
కుండను
వర్షమునకు
మూతిపెడితే
దానిలో
ఏకొంచమైనా
నీరు
నిలుస్తుంది.
కాని
కుండను
బోర్లించి
పెడితే
ఎంత
కుంభవర్షమైనా
చుక్క
నిలవదు.
ఈనాటి
ఉపన్యాసములు
వినేవారు
హృదయమనే
కుండను
బోర్లించి
పెడుతున్నారు.
అందువలనే
కించిత్తైనా
మీ
హృదయములో
పడటం
లేదు.
ఎందుకోసం
మీరు
రావాలి
ఇక్కడకు.
ఎందుకోసం
జీవించాలి
ఇక్కడ.
ఇంకెక్కడా
స్థలము
లేదా!
వచ్చినందుకు
ఏమి
ప్రయోజనము!
ఏమి
సాధించారు?
ఏమి
సాధిస్తున్నారు?
ఏమి
అనుభవిస్తున్నారు?
ఏమి
ఆనందిస్తున్నారు?
ఏమీ
లేదు.
కాలము
వ్యర్థమైపోతున్నాది.
నేటికైనా
సత్యము
గుర్తించుకొని
ఎవరైనా
ఏమైనా
అడిగితే
ప్రేమతో
జవాబు
చెప్పండి.
public
connection
ఉంటుంటాయి.
మీకందరికి
తెలుసు
accommodation,
information
office,
canteen,
bookstall
ఎన్నెన్నో
ఉన్నాయి.
ఎక్కడికి
పోయినా
వీరు
bull
dogs,
alsatian
dogs
తయారౌతున్నారేగాని
సరైన
మంచి
హృదయము
కల్గిన
వ్యక్తులుగా
కనిపించటం
లేదు.
ఎందుకోసం
జీవించాలి.
హాస్పటలు
కోట్లకు
కోట్లు
ఖర్చుపెట్టి
కట్టించాము.
ఎందుకు
వారిని
ప్రేమతో
చూడకూడదు.
కొంతమంది
ఉన్నారు.
చూస్తారు.
కాని
వారు
ఎంతో
బాధతో
వచ్చినప్పుడు
తీయని
మంచి
మాట
చెబుతే
వారి
రోగము
నివారణ
అవుతుంది.
7
▾
Meaning
Keep
వారిని
యుద్ధము
చేసి
తరుమకొట్టినట్టు
తరమకొడుతుంటారు.
ఇప్పుడు
టైము
లేదు
పో
అంటారు.
get
out
అంటే
ఫరవాలేదు.
దానికంటె
అధికముగా
అంటారు.
ఇలాంటి
వారు
డాక్టర్సే
కాదు.
ఇలాంటి
వారు
వ్యక్తులే
కాదు.
ఇలాంటి
వారు
భక్తులే
కాదు.
నిజముగా
స్వామికోసం
వచ్చిన
వారైతే
ఈనాటి
నుంచి
ప్రేమను
పెంచుకోవాలి.
స్వామి
దగ్గర
కాలినుంచి
తలవరకు
ప్రేమ
ఒక్కటే.
నేను
ఇచ్చేది
ప్రేమ.
మీరు
పుచ్చుకుంటున్నారు
గాని
వాడుకోటం
లేదు
ఎవరూ
శాంతముగా
ప్రేమతో
జవాబు
చెప్పేవారే
లేరు.
ప్రేమ
స్వరూపులారా!
మీకు
ప్రేమ
లేకపోయినా
నేను
ప్రేమ
స్వరూపులారా
అంటాను.
మీరు
దేనిని
పెంచుకోనక్కర
లేదు.
ఒక్క
ప్రేమ
పెంచుకోండి.
ఆ
ప్రేమ
పెంచుకుంటే
ఎంతో
తపశక్తిని
సాధించిన
వారౌతారు.
వశిష్ఠులవారు
ఏమి
చెప్పారు
అరుంధతితో.
ఆహా
చంద్రుడు
ఎట్టి
మచ్చలు
లేక
ప్రకాశిస్తున్నాడు
విశ్వామిత్రుని
తపశక్తివలె.
విశ్వామిత్రుడు
ఎదురుగా
లేకపోయినా
వర్ణించాడు
వశిష్ఠుడు.
ఆ
ప్రేమ
శ్రవణము
చేసినంత
మాత్రమున
విశ్వామిత్రుని
మనస్సు
కరిగిపోయింది.
ఎవరైనా
కొత్త
భక్తులు
వచ్చినప్పుడు
ఆశ్రమములో
ఉండినవారు
air
hostess
మాదిరి
ఎంతో
మర్యాదగా
స్వాగతం
చేయాలి.
Institute
లో
కొత్త
పిల్లలు
వచ్చిచేరినప్పుడు
మన
brothers
మాదిరి
వారిని
స్వాగతము
చేయాలి.
వారు
తల్లిదండ్రులను
వదలి
వచ్చిన
బాధ
మరపింప
చేయాలి.
బయట
కాలేజీలుంటున్నాయి.
కొత్తగా
చేరిన
పిల్లలను
ragging
అని
మొదలుపెట్టి
ప్రాణాలు
తీస్తున్నారు.
వీరు
రాక్షసులే.
వారి
సోదరులైతే
అట్లా
చేస్తారా?
కొత్తగా
చేరిన
పిల్లలకు
భయము
పోగొట్టి
ధైర్యమును
ఆనందమును
అందించవలసిన
విద్యార్థులు
వీరికి
భయము,
ఆందోళన
అభివృద్ధి
పరుస్తున్నారు.
ఇది
విద్య
కాదు.
అవిద్య.
వివేకము
కాదు.
అవివేకము.
ఇది
దయాతత్వము
కాదు.
క్రూరత్వము
కొత్తగా
వచ్చిన
వారిని
ప్రేమతో
చూడాలి.
అదే
విధముగా
హాస్టలులో
కొత్తగా
చేరిన
వారిని
ప్రేమతో
పక్కన
కూర్చోపెట్టుకోవాలి.
కాదుకాదు.
రిజర్వేషనులు.
ఇక్కడొక
పీఠం.
అక్కడొక
పీఠం.
ప్రక్కన
కూర్చోనివ్వరు.
ఇది
మంచిది
కాదు.
ఒకరికొకరు
కలిసి
మెలిసి
ఉండాలి.
స్వామి
ప్రేమతత్వాన్ని
ఆనాడు
మీరు
అర్థము
చేసుకున్న
వారౌతారు.
ఏ
మాట
మాట్లాడినా
ప్రేమతో
మాట్లాడండి.
తెలియకపోతే
నాకు
తెలియదండి
దయచేసి
మన్నించండి
అని
చెప్పండి.
నాకు
తెలియదు
పో
అని
మృగములను
తరిమినట్టు
తరుముతున్నారు.
8
▾
Meaning
Keep
అది
మంచిది
కాదు.
అందరు
మానవులమే.
అందరిని
గౌరవించాలి
అందరిని
ప్రేమించాలి.
అప్పుడే
సర్వభూతాంతరాత్మ
అయిన
పరమాత్మప్రేమకు
పాత్రుడౌతావు.
జీవులను
చూస్తే
బాధించటము
దేవుని
చూస్తే
పూజించటము.
ఏమి
పూజ
ఇది.
పనిచేసే
ఎద్దులు
రాత్రింబవలు
పని
చేస్తాయి.
వాటిని
చేతికోలను
తీసుకొని
కొడతారు.
రాతినందిని
చూసి
ప్రదక్షిణ
చేసి
నమస్కరిస్తారు
ఎప్పుడు
ఒకరిని
బాధించటమే.
ఇది
మంచిది
కాదు.
ఎన్నో
దినముల
నుండి
ఆశ్రమములో
ఉంటున్నారు.
శ్రమ
లేకుండా
ఉండేదే
ఆశ్రమము.
అందరు
స్వామి
ఇంటర్వ్యూ
పిలుస్తే
ఆ
ఇంటర్వ్యూ
రూములోనైనా
కొంచెము
సేపు
ఆనందముగా
ఉండవచ్చు
బయట
అంతా
కుక్కలవలె
తరుమగొడుతుంటారు
అని
చాలా
బాధ
పడుతున్నారు
భక్తులు
నేను
మాత్రం
ఎంతమందికి
ఇంటర్వ్యూ
ఇవ్వటానికి
వీలవుతుంది.
ఇదే
పెద్ద
ఇంటర్వ్యూ.
అందరికి
సమానమైన
ఇంటర్వ్యూ
ఇస్తున్నాను.
ప్రేమను
పెంచుకోండి.
ప్రతి
ఒక్కరు
ప్రేమతో
మాట్లాడాలి.
ప్రేమతో
జవాబు
చెప్పాలి.
తెలిసినది
తెలిసినట్లు
చెప్పు.
లేకపోతే
నాకు
తెలియదండి
క్షమించండి
అని
చెప్పు.
మాటలు
తగ్గించుకోండి.
అప్పుడే
నీలోని
మృగ
లక్షణములు
దూరమైపోతాయి.
ఈ
పశులక్షణాలు
మనలో
ఉంచుకొని
మనిషిలా
ప్రవర్తించాలంటే
ఎలా
సాధ్యమవుతుంది.
దానిని
మొట్టమొదట
తరిమివేయాలి.
ప్రేమించు.
ప్రేమించు.
అందరిని
ప్రేమించు.
ఇదే
నిజమైన
సాత్వికము.
జీవితమంతా
రాజసికము.
రాజసికము
రాక్షసత్వము
ఇది
మంచిది
కాదు.
మనము
మానవులము.
నేను
పశువు
కాదు.
రాక్షసుడను
కాదు,
దుర్మార్గుడను
కాదు
నేను
మానవుడను.
మానవుడే
దేవుడుగా
మారతాడు.
ఈనాడు
ఏమాత్రము
దయా
ప్రేమలు
లేకుండా
ఉంటున్నారు.
ఎవరికెవరు
ఏవిధమైన
ప్రశ్నలకు
జవాబులు
లేవు.
నేటినుండి
చక్కని
జవాబు
ఇవ్వండి.
వచ్చిన
పేషెంట్లను
ప్రేమతో
చూడండి.
వారి
స్థితిగతులను
విచారించి
చక్కగా
మందులివ్వండి.
కలి
ప్రభావము
ఏమిటోగాని
ఈ
చదువుకొన్నవారికి
మరింత
క్రూరత్వము
ఎక్కువైపోతున్నది.
దీనికి
కారణం
ఏమిటి?
చదువు
పశువుగా
మార్చివేస్తున్నది.
చదువులేని
పల్లెవారే
ఎంతో
వినయ
విధేయతలతో
ఉంటున్నారు.
వారిలోనే
సంస్కారము
ఉంటున్నది.
ఈనాడు
చదువుకొన్న
వారిలో
సంస్కారమే
లేదు.
కలతలుంటున్నాయి.
వారిలో
అలాంటివి
మనం
దూరం
చేయాలి.
భక్తి
అంటే
భజించటము
కాదు
భగవత్ప్రేమను
పెంచుకోవాలి.
9
▾
Meaning
Keep
ఆ
ప్రేమ
నీలో
ప్రవేశించెనా
నీ
మానవత్వమే
మారిపోతుంది.
స్వామి
దయను
తెలుసుకోటానికి
ఈ
ప్రేమ
ఒక్కటే
రాజమార్గము.
Previous
←
Satya Alone Is God
Next
Spiritual Sādhana in Everyday Life
→