Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · A mother's Prema and God's grace
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
A mother's Prema and God's grace
6 May 1997, Easwaramma Day, Kodaikanal
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
ప్రతి
మానవుడు
తల్లిగర్భము
నుండియే
జన్మించుచున్నాడు,
తల్లిఆదరణచేతనే
అభివృద్ధి
నొందుతున్నాడు,
తల్లిప్రేమచేతనే
సిరిసంపదలను,
సర్వసౌఖ్యములను
అనుభవిస్తున్నాడు.
తల్లి
ఇతర
విషయములలో
ఏమైనా
పెడమార్గం
పట్టవచ్చునేమోగాని
కుమారుని
విషయంలో
మాత్రం
ద్వేషమునుకాని,
అయిష్టతనుకాని
పొందదు.
ఎటువంటి
పరిస్థితిలోనైనా
కుమారుని
యోగక్షేమములనే
కోరుతుంది.
తల్లి
దేహాన్ని
అందిస్తుంది,
తండ్రి
పోషిస్తాడు,
గురువు
తెలివితేటలను
చేకూర్చుతాడు.
కనుక
ప్రతి
వ్యక్తి
తన
తల్లిదండ్రులను,
గురువును
ప్రేమించాలి,
గౌరవించాలి.
ప్రాచీనకాలంలో
అనేకమంది
మహనీయులు
తల్లిఆశీర్వాదము
తీసుకున్న
తరువాతనే
తమ
కర్తవ్యకర్మలను
ఆచరించడానికి
పూనుకునేవారు.
యుద్ధమునకుగాని,
తపస్సుకుగాని
బయలుదేరే
ముందు
కుమారుడు
తల్లిపాదములపై
పడి
ఆశీర్వదించుమని
ప్రార్థించినప్పుడు,
“తారకాఖ్యాసుర
దోర్దర్ప
మణచు
వేళ
గౌరి
తనయుని
కిడ్డ
వీరరక్ష
శంభరాసుర
వీర
జంపగా
జనువేళ
భార్గవ
సుత
కిడ్డ
భవ్యరక్ష
మాతృదాసీత్వంబు
మాన్ప
నఱుగు
వేళ
వినత
పుత్రున
కిడ్డ
విమలరక్ష
జనకు
యానతి
పాలింప
వనికేగెడున్
వేళ
తల్లి
రాఘవు
కిడ్డ
ధన్యరక్ష
అట్టి
శ్రీరక్ష,
ధీరక్ష,
అంగరక్ష
రక్షలందున
దివ్యమౌ
రామరక్ష
తోడు
నీడయై
నిన్ను
కాపాడుగాక!”
అని
తల్లి
ఆశీర్వదించి
పంపేది.
ఇట్టి
ఆశీస్సులచేతనే
కుమారులు
యుద్ధములో
పోరాడి
విజయాన్ని
సాధించగల్గేవారు,
అరణ్యంలో
కఠోరమైన
తపస్సు
చేసి
దైవానుగ్రహాన్ని
పొందగల్గేవారు.
తల్లి
ఆశీస్సులు
పొందలేనివారు
అనేక
జన్మల
నెత్తవలసి
వస్తుందని
శంకరులవారు
అన్నారు.
తల్లిఆశీస్సులు
పొందినవారికి
పునర్జన్మ
లేదని
కూడా
అన్నారు.
కనుక
మొట్టమొదట
తల్లి
యొక్క
అనుగ్రహానికి
పాత్రులు
కావాలి.
అయితే
ఇది
ప్రాకృతమైన
జీవితానికి
మాత్రమే
సంబంధించినది.
ఆధ్యాత్మిక
మార్గంలో
వేదాంతము
మరొకవిధంగా
బోధించింది.
“నాయనా!
నీ
హృదయ
మనేది
సింగిల్చైర్.
ఇది
డబుల్సోఫా
కాదు,
మ్యూజికల్
చైర్
కాదు.
కనుక
ఇందులో
ఒక్క
భగవంతునికి
మాత్రమే
చోటివ్వు.
అయితే
తల్లిదండ్రులను
ప్రేమించు,
వారికి
తగిన
కృతజ్ఞత
నందించు.
కాని
వారు
శాశ్వతం
కాదు”
‘మాతా
నాస్తి
పితా
నాస్తి,
నాస్తి
బంధు
సహోదరః
అర్థం
నాస్తి
గృహం
నాస్తి,
తస్మాత్
జాగ్రత
జాగ్రత’
ఈ
దేహములన్నీ
కదలిపోయే
మేఘములవంటివి.
2
▾
Meaning
Keep
నిజమైన
మాతృమూర్తి
ఒక్క
దైవమే.
తల్లి
గృహవాసి,
తండ్రి
గృహవాసి,
గురువు
ఆశ్రమవాసి.
దైవ
మొక్కడే
హృదయవాసి.
ఈ
సత్యాన్ని
గుర్తించాలి.
ఈ
లోకసంబంధమైన
రీతిగా
తల్లిని
దైవంగా
భావించి
గౌరవించవచ్చును.
కాని,
హృదయంలో
నిల్పుకోవలసింది
ఒక్క
భగవంతుణ్ణి
మాత్రమే.
హృదయంలో
ఉండే
అర్హత
ఒక్క
భగవంతునికి
మాత్రమే
ఉన్నది.
జడచైతన్యములు
దేహము
-
దేహి,
లేక
క్షేత్రము
-
క్షేత్రజ్ఞుడు,
లేక
శరీరము
-
శరీరి
అనే
రెండు
తత్వములతో
కూడినవాడు
మానవుడు.
శరీర
మనగా
ఏమిటి?
“శీర్యతీతి
శరీరః”
అనగా,
జీర్ణించిపోవునది
శరీరము.
ఇది
పెరుగుతూ
ఉన్నప్పటికీ
జడమైనదే!
ఎట్లా?
ప్రతి
నిత్యము
మన
గృహమును
ఊడ్చి
ఆ
చెత్తను
ఒక
గుంతలో
వేస్తే
కొంతకాలానికి
అదొక
దిబ్బమాదిరి
పెరిగి
పోతుంది.
అదేవిధంగా
మన
దేహంలో
ఇడ్లీ,
దోస,
చపాతీవంటి
పదార్థాలను
ప్రతి
దినము
వేస్తూ
ఉంటే
ఇది
కూడా
దిబ్బమాదిరి
పెరుగుతూ
పోతుంది.
సున్నము,
నీరు,
సబ్బు,
ఇనుము,
సీసము
మున్నగు
జడమైన
పదార్థములతో
తయారైనది
ఈ
దేహము.
కనుక
ఇది
జడమైనదే.
ఇది
పెరుగుతుంది,
తరుగుతుంది.
కాని
దేహి
పెరగడు,
తరగడు.
దేహము
-
క్షేత్రము,
దేహి
-
క్షేత్రజ్ఞుడు.
క్షేత్రమని
దేనికి
పేరు?
దైవత్వమున్న
ప్రదేశానికే
క్షేత్రమని
పేరు.
కనుకనే
తిరుపతి,
అమర్నాథ్,
బదరీనాథ్మున్నగువాటిని
క్షేత్రములని
పిలుస్తాము.
ఈ
దేహము
కూడా
ఒక
క్షేత్రమే.
ఎందుకోసం?
ఇందులో
భగవంతుడనే
క్షేత్రజ్ఞు
డున్నాడు.
క్షేత్రజ్ఞుని
వల్లనే
క్షేత్రమునకు
విలువ
ఉంటుంది.
ప్రతి
దేహము
దేవాలయమేకాని,
జీవాలయము
కాదు.
ఇట్టి
దివ్యమైన
శక్తితో
కూడిన
దేహాన్ని
అందించినందులకు
తల్లికి
మనం
కృతజ్ఞులమై
ఉండాలి.
వైజ్ఞానికుల
అజ్ఞానం
అన్నింటికీ
భగవంతుడే
మూలకారకుడైనప్పటికీ
ఈ
దేహానికి
మూలాధారం
తల్లియే.
విత్తనము
మంచిదే
అయినప్పటికీ
దానిని
మట్టిలో
పెట్టి
నీరు
పోసినప్పుడే
మొలకెత్తుతుంది
కాని,
టిన్నులో
పెడితే
మొలకెత్తదు
కదా!
కాబట్టి
ప్రకృతియే
తల్లి,
పరమాత్ముడే
తండ్రి.
ప్రకృతీపరమాత్మల
సంయోగమువల్లనే
జీవతత్వము
ఏర్పడుచున్నది.
ప్రతి
దానికి
భగవంతుడే
మూలాధారం.
ఈనాటి
సైంటిస్టులు
హైడ్రోజన్,
ఆక్సీజన్లను
కలిపి
నీటిని
సృష్టించామని
విఱ్ఱవీగుతున్నారు.
కాని
అసలు
హైడ్రోజన్,
ఆక్సీజన్లను
సృష్టించిం
దెవరని
ప్రశ్నించుకోవడం
లేదు.
నీటిని,
పాలను
వేరు
చేయగల
శక్తిని
భగవంతుడు
హంస
కిచ్చాడని
మన
ప్రాచీనులు
అంటే
ఈనాటి
సైంటిస్టులు,
“నాన్సెన్స్!
ఇదంతా
వట్టి
దగా!
హంస
ముక్కుపైన
ఒక
యాసిడ్
ఉంది.
అదే
పాలను,
నీటిని
వేరు
చేస్తుంది”
అంటారు.
నిజమే!
కాని
దాని
ముక్కుపైన
యాసిడ్‌ను
వీరేమైనా
తెచ్చి
పెట్టారా?
ఇది
దైవసృష్టి,
దైవసంకల్పము.
ఇట్టి
దైవసంకల్పాన్ని
అర్థం
చేసుకోలేక
కొంతమంది
మూర్ఖత్వంతో
వాదిస్తారు.
ఆధ్యాత్మికాన్ని
విమర్శించడం
సులభంకాని,
అర్థం
చేసుకోవడం
చాల
కష్టం.
ఆధునిక
విద్యార్థికి
గుణపాఠం
ఒకానొక
సమయంలో
ఒక
పండితుడు
తన
ఇంటివరండాలో
కూర్చుని
సంధ్యావందన
మాచరిస్తున్నాడు.
ఆధునిక
విద్యార్థియైన
ఆయన
మనుమడు
కూడా
అక్కడే
కూర్చుని
ఒక
ఇంక్బాటిల్లో
మాటిమాటికి
పెన్నును
అద్దుతూ
హోమ్‌వర్క్
చేసుకుంటున్నాడు.
3
▾
Meaning
Keep
ఈ
పండితుడు
ఒక
టంబ్లర్
నుండి
పదేపదే
స్పూన్‌తో
నీరు
తీసుకుంటూ,
“ప్రాణాయస్వాహా,
అపానాయ
స్వాహా...”
అంటూ
సంధ్య
వార్చుతున్నాడు.
తాతగారు
చేస్తున్న
పని
చూసి
మనుమనికి
ఆశ్చర్యం
కల్గింది.
“తాతగారూ!
మీకంత
దప్పిగా
ఉంటే
ఒకేతూరి
టంబ్లర్
నెత్తుకొని
నీరంతా
త్రాగవచ్చు
కదా!”
అన్నాడు.
తాతగారు
నవ్వి,
“నాయనా!
నీవు
మాటిమాటికి
ఆ
పెన్నును
ఇంక్బాటిల్లో
అద్దడ
మెందుకు?
ఒకేతూరి
ఆ
బాటిల్లో
ఉన్న
ఇంక్నంతా
పేపర్
మీద
పోయవచ్చు
కదా!”
అన్నాడు.
“అట్లా
పోస్తే
అక్షరాలు
రావు
తాతగారూ!”
అన్నాడు
మనుమడు.
“అట్లే
నేను
కూడా
ఒక్కొక్కతూరి
భగవంతుని
పేరు
చెప్పి
స్పూన్‌తో
నీళ్ళు
తీసుకొనకపోతే
అవి
భగవంతునికి
చేరవు
నాయనా!”
అని
తాతగారు
సమాధాన
మిచ్చాడు.
మనం
ఎవరికైనా
ఉత్తరం
వ్రాసినప్పుడు
అడ్రస్సు
సరిగా
లేకపోతే
అది
డెడ్-లెటర్స్
ఆఫీసుకు
పోతుంది.
అదేరీతిగా,
“ప్రాణాయస్వాహా,
అపానాయస్వాహా...”
అని
ఒకదాని
తరువాత
ఒకటి
“అడ్రస్సు”
సరిగా
ఉచ్చరించకపోతే
అది
పంచప్రాణములకు
చేరదు.
దైవసంబంధమైన
విషయాలలో
కొన్ని
పద్ధతులను
సక్రమంగా
అనుసరించినప్పుడే
సరియైన
ఫలితం
వస్తుంది.
తల్లిదీవెనకు
దైవానుగ్రహం
తోడు
కావాలి
ఆధ్యాత్మిక
మార్గంలో
ప్రవేశించడానికి
నీ
తల్లి
నీ
కేమైనా
అడ్డు
చెపితే
ఆమెకు
చక్కగా
అర్థమయ్యేటట్లు
సమాధానం
చెప్పు.
అది
నీ
కర్తవ్యం.
“నే
నింత
పెద్దవాడ
నయ్యాను.
కనుక
నేనింక
తల్లి
నెందుకు
గౌరవించాలి?”
అని
భావించకూడదు.
నీ
వెంత
పెద్దవాడవైనప్పటికీ
నీ
తల్లికి
కుమారుడవే
కదా!
ఏ
తల్లియైనా
తన
కొడుకు
గొప్ప
పేరు
పొందాలనీ,
దైవానుగ్రహానికి
పాత్రుడు
కావాలనే
ఆశిస్తుంది.
కొడుకు
తన
పాదాలకు
నమస్కరించినప్పుడు,
“నాయనా!
ఆయురారోగ్యఐశ్వర్యాలతో,
శాంతిసౌఖ్యాలతో
నిండు
నూరేళ్ళు
వర్థిల్లు”
అని
ఆశీర్వదిస్తుంది.
అయితే
ఈ
ఆశీర్వాదం
ఫలించాలంటే
దైవానుగ్రహం
కూడా
కావాలి.
తల్లి
ఆశీర్వదించేటప్పుడు
భగవంతుడు
కూడా,
“తథాస్తు”
అనాలి.
లేకపోతే
తల్లిఆశీర్వాదము
కూడా
చెల్లదు.
కరెంటు,
బల్బు
రెండూ
ఉన్నప్పుడే
వెలుతురు
లభ్యమౌతుంది
కదా!
అదేవిధంగా
తల్లిఆశీర్వాదమూ
ఉండాలి,
దైవానుగ్రహమూ
ఉండాలి.
ఈ
రెండూ
కల్గినవారు
ఉన్నతస్థితిని
పొందగలరు.
కనీసం
దైవానుగ్రహ
మొక్కటి
ఉన్నా
చాలు,
మీరు
దేనినైనా
సాధించగలరు.
కనుక,
ఎవరిని
నమ్మినా
నమ్మకపోయినా
దైవాన్ని
మాత్రం
నమ్మాలి.
ఈ
లోకంలో
ఎవ్వరూ
మీకు
సుఖశాంతుల
నందించ
లేరు.
తెలుగులో
ఒక
సామెత
చెబుతారు
-
“అమ్మకే
లేక
అటుకులు
నాకుతుంటే
అల్లుడు
దీపాల
పండుగకు
వచ్చాడట!”
అమ్మకే
తినడానికి
లేనప్పుడు
అల్లుడికేమి
పెట్టగలదు?
అట్లే,
ఈ
లోకంలో
ఎవ్వరికీ
సుఖశాంతులు
లేవు.
వారికే
లేనిది
మీ
కేమివ్వగలరు?
శాంతిస్వరూపుడైన
దైవంవద్ద
మాత్రమే
మీకు
శాంతి
లభ్యమవుతుంది.
కాని
కొంతమందికి
ఎప్పుడు
చూసినా
లోకవ్యవహారమే,
సంసార
చింతలే!
ఇంక
దైవానుగ్రహం
ఏరీతిగా
చిక్కుతుంది?
అలాంటి
వారికి
ఎక్కడ
పోయినా
చింతలు
తప్పవు.
తల్లి
ఎంత
గొప్పదైనప్పటికీ
కుమారునిపై
దైవానుగ్రహమే
లేకపోతే
తాను
కూడా
ఏమీ
చేయలేదు.
4
▾
Meaning
Keep
కనుకనే
తల్లి
కూడా
కుమారుని
యోగక్షేమముల
నిమిత్తమై
దైవాన్ని
ప్రార్థిస్తుంది.
శంకరులవారికి
దేవీ
అనుగ్రహప్రాప్తి
శంకరాచార్యుల
వారి
తండ్రి
ప్రతి
దినము
రాజరాజేశ్వరీదేవి
పూజ
చేసి
పాలను
నైవేద్యం
పెట్టి
ఆ
ప్రసాదమును
తెచ్చి
భార్యకు,
కుమారునికి
అందించేవాడు.
ఒకనాడు
అతడు
ఏదో
పనిపై
తప్పనిసరిగా
ప్రక్కగ్రామానికి
వెళ్ళవలసి
రావడంచేత
తన
కుమారుడైన
శంకరుని
పిలిచి,
“నాయనా!
రేపటి
దినమున
నీవు
రాజరాజేశ్వరికి
పూజ
చేసి
పాలను
నైవేద్యం
పెట్టు.
దానిని
నీవు,
నీ
తల్లి
తీసుకోవచ్చును”
అన్నాడు.
మరునాడు
శంకరుడు
తండ్రిఆజ్ఞను
శిరసావహించి
ఒక
కప్పులో
పాలు
తీసుకొని
రాజరాజేశ్వరీ
విగ్రహం
ముందు
ఉంచి,
“తల్లీ!
దీనిని
స్వీకరించు”
అని
ప్రార్థించాడు.
కాని
ఎంతసేపైనప్పటికీ
తల్లి
రాలేదు,
ఆ
కప్పులో
పాలు
ఖర్చు
కాలేదు.
శంకరుడు
అప్పటికి
ఆరు
సంవత్సరముల
పిల్లవాడు.
“తల్లీ!
ప్రతి
రోజు
నా
తండ్రి
తెచ్చిన
పాలను
త్రాగుతున్నావు
కదా!
మరి
ఈ
రోజు
నేను
తీసుకొని
వస్తే
ఎందుకు
త్రాగటం
లేదు?
నేనేం
పాపం
చేశాను?”
అని
చాల
బాధపడ్డాడు.
కాని
తన
పట్టు
వీడలేదు.
“తల్లీ!
నీవీ
పాలను
త్రాగకపోతే
నేను
నా
తల్లిదండ్రుల
మనస్సును
కష్టపెట్టిన
వాడనవుతాను.
తల్లిదండ్రులను
సంతృప్తి
పర్చలేని
నా
బ్రతుకెందుకు?
కనుక
నేను
ప్రాణత్యాగం
చేస్తాను”
అని
శపథం
చేశాడు.
ఈ
అమాయకుడు
అన్నట్లుగానే
ప్రాణం
తీసుకుంటాడేమోనని
రాజరాజేశ్వరి
ప్రత్యక్షమై,
“నాయనా!
నీ
భక్తికి
మెచ్చాను.
ఇదిగో,
నీవు
తెచ్చిన
పాలను
త్రాగుతున్నాను.
నీ
వింక
సంతోషంగా
ఉండు”
అని
పలికి
ఆ
కప్పులో
ఒక్క
చుక్కైనా
మిగల్చకుండా
పాలన్నీ
త్రాగివేసింది.
శంకరుడు
చూశాడు,
“అమ్మా!
పాలన్నీ
నీవు
త్రాగిపోతే
నా
తల్లికి
ప్రసాదంగా
ఏమివ్వాలి?
అంతా
నేనే
త్రాగివేశా
ననుకుంటుంది.
ప్రతి
రోజు
నా
తండ్రి
నీవు
త్రాగిన
పాలను
తెచ్చి
మాకిచ్చేవాడు.
కనుక
కొన్ని
పాలను
నాకు
తిరిగి
ఇవ్వు”
అన్నాడు.
సముద్రంలో
కలసిన
గంగను
తిరిగి
వేరుచేయడానికి
వీలవుతుందా?
ఒకసారి
త్రాగిన
పాలను
ఆమె
తిరిగి
ఎలా
తెచ్చివ్వగలదు?
కాని
శంకరుడు
తనకు
కొంచెమైనా
పాలను
తిరిగి
ఇవ్వాలని
పట్టుపట్టాడు.
లేకపోతే
తన
తల్లి
దగ్గర
తనకు
చెడ్డపేరు
వస్తుందని
గట్టిగా
వాదించాడు.
అప్పుడు
రాజరాజేశ్వరి
కరుణించి
తానే
స్వయంగా
తన
పాలను
పిండి
అతని
కిచ్చింది.
ఆ
పాలను
త్రాగటంచేతనే
శంకరులవారు
జైత్రయాత్ర
చేసి
ప్రజలచేత
పూజలందుకోగలిగారు.
ఆనాటి
నుండి
అతనికి
సమస్త
వేదములు,
శాస్త్రములు,
ఉపనిషత్తులు
కరతలామలకము
లైనాయి.
హృదయంలో
దైవానికి
చోటివ్వండి
తల్లిప్రేమ,
దైవానుగ్రహం
-
ఈ
రెండింటి
చేరికచేత
మానవత్వం
దివ్యత్వంగా
మారిపోతుంది.
కనుక
తల్లిదండ్రులను
గౌరవించండి,
దైవాన్ని
ప్రార్థించండి.
తల్లిదండ్రులకు
జగత్తులో
కీర్తిని
తెచ్చి
పెట్టండి,
దైవానికి
హృదయంలో
స్థానమివ్వండి.
ఇదే
మీరు
చేయవలసింది.
మీరు
మంచివారైతే
తల్లిదండ్రులకు
ఎంతో
కీర్తి
వస్తుంది.
లవకుశులు
గొప్పవారు
కావడంచేత
సీతాదేవికి
ఎంతో
కీర్తి
వచ్చింది.
రామునితో
యుద్ధం
చేస్తున్నప్పుడు
లవుడు,
“జనని
మా
జానకీదేవి
సాధ్వియేని,
ఇతను
ఈ
అస్త్రమున
మూర్ఛ
నొందుగాక!”
అని
తల్లిని
తల్చుకొని
అంబును
విడిచేసరికి
రాముడు
కూడా
మూర్ఛపోయాడు.
5
▾
Meaning
Keep
చూశారా!
చిన్న
పిల్లవాడు
కూడా
తల్లిని
అంతగా
స్మరించాడు.
తల్లిని
మనస్సులో
చింతించి,
దైవానికి
హృదయంలో
స్థానమిస్తే
తల్లిమహాత్మ్యము
కూడా
అధికమై
పోతుంది.
ప్రాచీనకాలంలో
కుమారులు
దైవచింతనలో
మునిగితే
తల్లి
ఎంతగానో
మురిసి
పోయేది.
“నా
కుమారుడు
సన్మార్గంలో
నడుచుకుంటున్నాడు,
సత్కీర్తి
నార్జిస్తాడు”
అని
ఎంతగానో
ఆనందించేది.
కాని
ఈనాడు
అలాంటి
తల్లులు
చాల
అరుదు.
కుమారు
డేమైనా
ఆధ్యాత్మిక
మార్గంలో
ప్రవేశిస్తే,
“అయ్యో!
వీడేమైపోతాడో!”
అని
భయపడతారు.
ఇది
చాల
పొరపాటు.
ఈనాటి
పరిస్థితుల
దృష్ట్యా
తల్లిదండ్రులు
విశాలహృదయులై
కుమారుడు
ఆధ్యాత్మిక
మార్గంలో
ప్రవేశించాలని
కోరుకోవాలి.
విద్యార్థులారా!
మీ
దేహానికి
మూలాధారం
తల్లిదండ్రులే.
కాని,
మీ
జీవితానికే
మూలాధారం
భగవంతుడు.
ఈ
సత్యాన్ని
దృష్టియందుంచుకొని
జన్మ
సార్థకం
గావించుకొనే
మార్గాన్ని
అవలంబించాలి.
ప్రాణాన్నైనా
త్యాగం
చేసి
సాధించవలసిన
కార్యము
లెన్నో
ఉన్నాయి.
కట్టకడపటికి
దైవాన్నే
సాధించాలి.
అదే
ఫైనల్
గోల్!
దైవానుగ్రహం
పొందినవానికి
ఎట్టి
కొరతయు
ఉండదు.
ఇదే
ఆర్యాంబ
ఆనాడు
శంకరునితో
చెప్పింది.
“నాయనా!
దేవీ
అనుగ్రహాన్ని
పొందిన
నీ
కింకేమి
కొరత?
యావత్ప్రపంచమునకే
నీవు
ఆదర్శప్రాయుడవై
సత్కీర్తిని
పొందగలవు”
అని
ఆశీర్వదించింది.
సత్కీర్తి
ఒక్కటే
కాదు
ముఖ్యం,
శంకరుడు
శాంతిని
కూడా
పొందగలిగాడు,
నిరంతరము
ఆనందంగా
జీవించాడు,
ముప్పైరెండేళ్ళ
వయస్సులోపలనే
జైత్రయాత్ర
సల్పాడు.
దీనికి
కారణం
దేవీ
అనుగ్రహమే!
ఒక్క
దైవానుగ్రహాన్ని
సాధిస్తే
ఇంక
సాధించలేనిది
ఏదీ
ఉండదు.
కనుక
మీరు
దైవవిశ్వాసాన్ని
పెంచుకొని
దైవానుగ్రహాన్ని
పొంది
మీ
జీవితాలను
సార్థకం
గావించుకుంటారని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Pray To God Only For Eternal Peace And Bliss
Next
Equanimity Is True Freedom
→