Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · The Significance of Vināyaka Caturthī
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Significance of Vināyaka Caturthī
7 September 1997, Vināyaka Caturthī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
ప్రేమాత్మస్వరూపులారా!
శివుడే
జీవుడు,
జీవుడే
శివుడు.
ఈ
ఏకత్వాన్ని
ఎవరు
గుర్తింతురో
వారే
పరిపూర్ణజ్ఞానులు.
పవిత్రమైన
భారతీయ
పర్వదినములన్నీ
ఆధ్యాత్మిక
అంతరార్థముతో
కూడినవేగాని
కేవలం
బాహ్యాచార
సంబంధమైనవి
కావు.
భారతీయులు
వినాయకుణ్ణి
పార్వతీ
తనయుడనీ,
గణాధిపుడనీ
స్తుతిస్తూ
ఉంటారు.
పార్వతి
శక్తిస్వరూపిణి
అనీ,
ఆమెకు
జన్మించినవాడే
గణపతి
అనీ
భావిస్తున్నారుకాని,
దీని
అంతరార్థమును
గుర్తించడానికి
ఎవ్వరూ
ప్రయత్నించడం
లేదు.
పార్వతి
అనగా
పృథ్వి.
కనుక
పార్వతీ
తనయుడనగా
పృథ్వీ
పుత్రుడని
అర్థం.
అర్జునునికి
పార్థుడనే
పేరున్నది.
పార్థుడనగా
పృథ్వీ
పుత్రుడు.
ప్రతి
మానవుడు
ఈ
పృథ్వి
నుండి
జన్మించినవాడే
కనుక
ప్రతి
మానవుడు
పార్థుడే;
ప్రతి
మానవుడు
గణపతియే.
గణపతి
అనగా
అర్థమేమిటి?
ఏమిటీ
గణములు?
ఎక్కడున్నవి?
పంచేంద్రియములు,
మనస్సు,
బుద్ధి
-
ఈ
ద్వాదశాదిత్యులే
గణములని
పేరు.
వీటికి
అధిపతియైనవాడు
గణపతి.
గ
-
అనగా
బుద్ధి,
ణ
-
అనగా
విజ్ఞానము.
కనుక
బుద్ధి,
విజ్ఞానములకు
అధిపతియైనవాడే
గణపతి.
ఇతడు
ప్రతి
మానవునియందు
బుద్ధిజ్ఞానస్వరూపుడై
జీవిస్తున్నాడు.
గణపతి
ఆరాధన
నిన్న
మొన్న
ఏర్పడినది
కాదు,
వేదకాలము
నుండి
ఇది
జరుగుతూ
వస్తున్నది.
ఋగ్వేదమునందు,
నారాయణోపనిషత్తునందు,
తైత్తిరీయోపనిషత్తునందు
కూడా
అనేకచోట్ల
గణపతి
స్తుతి
కనిపిస్తున్నది.
“తత్పురుషాయ
విద్మహే
వక్రతుండాయ
ధీమహి
తన్నోదంతిః
ప్రచోదయాత్”
గణపతి
సర్వశక్తి
స్వరూపుడనే
సత్యాన్ని
నిరూపించింది
వేదము.
ఇతనికి
వేరే
నాయకుడు
లేడు.
కనుక,
వినాయకుడని
ఇతనికి
పేరు
వచ్చింది.
నాయకుడు
లేనివాడు
వినాయకుడు.
ఇతడు
మానవునియందు
ఆత్మస్వరూపమును
ధరించాడు.
ఆత్మకు
మరొక
నాయకుడు
లేడు
కదా!
ఇట్టి
వినాయక
తత్త్వమును
గుర్తించాలంటే
మన
దృష్టిని
అంతర్ముఖం
గావించుకోవాలి.
ఈనాటి
విద్యార్థులు
వినాయకుణ్ణి
అనేక
విధాలుగా
ప్రార్థిస్తున్నారు.
దేనికోసం?
ఈ
ప్రాకృత
విద్యలందు
తాము
ఉత్తీర్ణులు
కావాలని,
గొప్పడిగ్రీలు
అందుకోవాలని.
అసలు
విద్య
అనే
పదము
చాల
పవిత్రమైన
అంతరార్థంతో
కూడినది.
కనుక
ఈ
లౌకిక
చదువును
విద్య
అని
చెప్పకూడదు.
సకల
శక్తి
సంపన్నమైన
తత్త్వమునకే
విద్య
అని
పేరు.
దీనినే
అవేర్నెస్
(Awareness)
అన్నారు.
‘అవేర్నెస్’
అనగా
అంతో
ఇంతో
తెలుసుకోవడం
కాదు,
పరిపూర్ణ
జ్ఞానమే
‘అవేర్నెస్’.
ఇట్టి
జ్ఞానంకోసమే
వినాయకుణ్ణి
ప్రార్థించాలి
కాని,
ప్రాకృతమైన
డిగ్రీలకోసం
కాదు.
విద్య
అనేది
Way
of
life.
నడవటం
విద్యనే,
మాట్లాడటం
విద్యనే,
తినటం
విద్యనే,
ఆలోచించటం
విద్యనే,
కట్టకడపటికి
మన
శ్వాసను
ఏవిధంగా
వదలాలనే
విషయాన్ని
తెలుసుకోవడం
కూడా
విద్యనే.
మానవుని
జీవితమంతా
విద్యాస్వరూపమే!
ఇట్టి
విద్యను
గుర్తించడానికి
ప్రయత్నించే
వాడే
నిజమైన
విద్యార్థి.
2
▾
Meaning
Keep
విద్
అనగా
జ్ఞానము.
కనుక
ఏది
జ్ఞానము
నందించునో
అదియే
విద్య.
“అధ్యాత్మవిద్యా
విద్యానాం”
అన్నాడు
కృష్ణుడు.
ఇట్టి
విద్యను
నేర్పేవాడే
వినాయకుడు.
పక్షపాతం
చూపిన
నందికి
పార్వతి
శాపం
ఒకానొక
సమయంలో
పార్వతీపరమేశ్వరులు
పాచికలాడుతున్నారట.
అందులో
ఎవరు
ఓడారో,
ఎవరు
గెలిచారో
చెప్పడానికి
ఒక
జడ్జి
ఉండాలి
కదా!
పార్వతే
ఎన్నుకుంది
నందీశ్వరుణ్ణి
జడ్జిగా.
ఆటలో
పార్వతి
గెలిచింది.
కాని
నంది
ఈశ్వరుడే
గెలిచాడని
తీర్పు
చెప్పాడు.
పార్వతికి
కోపం
వచ్చింది.
అప్పుడు
నంది,
“తల్లీ!
ఈశ్వరుడు
నా
ప్రభువు.
అతడు
ఓడితే
నేను
కూడా
ఓడినట్లే
కదా!
కనుక,
నా
యజమానే
గెలిచినట్లుగా
చెప్పడం
నాకర్తవ్యం”
అన్నాడు.
అప్పుడు
పార్వతి
మరింత
కోపంతో,
“నందీ!
నీవు
నయంకాని
రోగంతో
పీడింపబడుదువు
గాక!”
అని
శపించింది.
వెంటనే
నందీశ్వరుడు
ఆమె
పాదాలపై
పడి,
“తల్లీ!
నేను
చేసింది
తప్పే!
దయచేసి
నన్ను
క్షమించి
నాకీ
శాపం
నుండి
విముక్తి
పొందే
మార్గాన్ని
తెలియచేయవలసింది”
అని
ప్రార్థించాడు.
వినాయక
పూజతో
నందికి
శాపవిమోచనం
పార్వతి
కనికరించి,
“చూడు
నందీ!
త్వరలో
నా
కుమారుని
పుట్టిన
పండుగ
వస్తున్నది.
ఆ
రోజున
నీకిష్టమైన
పదార్థమును
నా
కుమారునికి
అర్పితం
చేయి.
అతని
అనుగ్రహంతో
నీకు
శాపవిమోచనమవుతుంది”
అన్నది.
అప్పుడు
నంది
బాగా
ఆలోచించి,
తనకిష్టమైనది
పచ్చని
గరిక
కాబట్టి
దానిని
వినాయకునికి
అర్పితంచేశాడు.
నంది
తనకు
ప్రీతికరమైనది
వినాయకునికి
ఇచ్చాడు.
కాబట్టి
వినాయకుడు
కూడా
తనకు
ప్రీతికరమైనది
నందికి
అందించాడు.
అప్పుడు
నందికి
శాపవిమోచనం
కలిగింది.
ఈనాటికీ
మనం
వినాయక
పూజను
…న్నాము.
…
పూజ,
…
పూజ,
మారేడు
పూజ
మొదలైన
…
వినాయకుని
పూజ
చేస్తున్నాము.
ఇది
…
కాదు.
ఇలాంటి
…
సంబంధమైనవి,
…
భగవంతుని
…
మెచ్చుకుంటాడు.
కాని
ఈనాటి
కలిమానవులు,
…
మానవులు
తమకు
ఏది
…
ఏది
ఇష్టం
లేదో
దానిని
మాత్రమే
భగవంతునికి
ఇచ్చి
తమకు
ఇష్టమైన
…
కోరుకుంటున్నారు.
ఇష్టంలేని
కాయకూరలను
దైవానికి
పెట్టి
తీయని
ఫలితములను
అనుభవిస్తున్నారు.
ఇది
సరియైన
అర్పితం
కానేరదు.
వేదాంతము,
“యద్భావం
తద్భవతి”
అన్నది.
మన
భావం
ఎట్టిదో
ఫలం
కూడా
అట్టిదిగానే
ఉంటుంది.
గజాసుర
వృత్తాంతము
ఒకానొక
సమయంలో
గజాసురుడు
గొప్ప
తపస్సు
చేశాడు.
అతని
తపస్సుకు
మెచ్చి
ఈశ్వరుడు
ప్రత్యక్షమై
ఏమి
వరం
కావాలో
కోరుకొమ్మన్నాడు.
ఈశ్వరుడు
సులభప్రసన్నుడు.
ఇతనికి
భోళాశంకరుడని
పేరు.
తనను
పొగిడితే
చాలు.
అన్నింటికీ
సిద్ధమైపోతాడు.
గజాసురుడు
శత్రువులు
తన
సమీపానికి
రాకుండా
ఉండేటట్లు
తన
నుండి
అగ్ని
ఆవిర్భవించాలని
కోరుకున్నాడు.
ఈశ్వరుడు
‘తథాస్తు’
అన్నాడు.
గజాసురుడు
మళ్ళీ
తపస్సు
చేశాడు.
ఈశ్వరుడు
మళ్ళీ
అతనికి
దర్శనమిచ్చి,
“గజాసురా!
ఇంకా
ఏమి
కావాలి?”
అని
అడిగాడు.
గజాసురుడు,
“ఈశ్వరా!
నీవు
నా
ఉదరంలో
ఉండిపోవాలి”
అన్నాడు.
3
▾
Meaning
Keep
ఈశ్వరుడు
సరేనని
అతని
ఉదరంలో
ప్రవేశించాడు.
అక్కడ
కైలాసంలో
పార్వతి
ఈశ్వరునికోసం
ఎంతగానో
వెతికింది.
కాని
ఈశ్వరుడు
ఎక్కడా
కనిపించలేదు.
వెంటనే
ఆమె
విష్ణువువద్దకు
పోయి,
“మీ
బావగారు
ఎక్కడున్నారో
ఏమో
నాకు
కనిపించడం
లేదు”
అని
బాధపడింది.
విష్ణువు,
“పార్వతీ!
నీ
భర్త
భోళాశంకరుడు,
భక్తసులభుడు;
అడిగినవారికి
లేదనకుండా
వరాలిస్తుంటాడు;
ముందు
వెనుకలు
యోచించడు.
ఈవిధంగా
ఎవరికో
వరమిచ్చి
ఎక్కడో
చిక్కుకొని
పోయుంటాడు.
నీవేమీ
విచారించవద్దు.
నేను
పోయి
తీసుకువస్తాను”
అన్నాడు.
సరే,
జగన్నాటక
సూత్రధారియైన
విష్ణువు
ఇక్కడొక
చిన్న
నాటకాన్ని
ప్రారంభించాడు.
నందిని
ఒక
గంగిరెద్దులా
అలంకరించి
మేళతాళాలు
వాయించుకొంటూ
గజాసురునివద్దకు
తీసుకెళ్ళాడు.
అతని
సమక్షంలో
నంది
వర్ణనాతీతంగా
నృత్యం
చేసింది.
గజాసురుడు
మెచ్చుకొని,
“అయ్యా,
గంగిరెద్దుదాసూ!
నీకేమి
కావాలో
అడుగు”
అన్నాడు.
“నేను
అడిగింది
నీవివ్వగలవా?”
అని
ప్రశ్నించాడు
గంగిరెద్దుదాసు
వేషంలో
ఉన్న
విష్ణువు.
ఏదడిగినా
ఇస్తానన్నాడు
గజాసురుడు.
“ఐతే
నీ
ఉదరంలో
ఉన్న
ఈశ్వరుణ్ణి
ఇవ్వు”
అన్నాడు
విష్ణువు.
అప్పుడు
గజాసురుడు
అతడు
మారువేషంలో
వచ్చిన
విష్ణువేనని
గుర్తించాడు.
విష్ణువనగా
సర్వత్ర
వ్యాపించినవాడు.
కనుక
ఈ
రహస్యం
అతనికి
తప్ప
మరొకరికి
తెలియడానికి
వీల్లేదు.
వెంటనే
గజాసురుడు
విష్ణువుకు
సాష్టాంగ
నమస్కారం
చేసి
ఈశ్వరుణ్ణి
అప్పజెప్పాడు.
అయితే
దానికి
ముందు,
తాను
మరణించినా
తన
శిరస్సును
అందరూ
పూజించేటట్లు
వరమడిగాడు.
కనుకనే
ఈశ్వరుడు
ఆ
గజాసురుని
తలను
తన
కుమారుడైన
గణపతికి
పెట్టాడు.
భారతదేశంలో
ఎక్కడే
చిన్నశుభకార్యం
జరిగినా
మొట్టమొదట
విఘ్నేశ్వరపూజ
జరుగుతుంది.
దీని
అంతరార్థమేమిటి?
గజము
మృగములలో
పెద్దది.
నడవటానికి
కూడా
దారిలేని
ప్రదేశంలో
ఏనుగు
ఒక్కపర్యాయం
నడిస్తేచాలు,
అక్కడ
దారి
ఏర్పడి
పోతుంది.
అందువల్లనే
అందరికీ
మార్గదర్శకమైనది
గజము.
గజతెలివి
చాల
గొప్పది.
మరొక
విశేషమేమిటంటే
ఇది
చాల
కృతజ్ఞత
కలిగిన
జంతువు.
ఎలాంటి
పరిస్థితియందైనా
తన
యజమానిని
మరువదు.
ప్రాణం
పోయే
సమయంలో
కూడా
యజమాని
కంఠము
వింటే
కన్నులు
తెరచి
చూస్తుంది.
అనగా
విశ్వాసం
కలిగిన
జంతువు
ఏనుగు.
ఇదే
మానవునిలో
ఉండవలసిన
ప్రధానమైన
గుణం.
ఆరోగ్యభాగ్యాన్ని
అందించే
నైవేద్యం
ఈనాడు
భారతీయులు
వినాయకునికి
కుడుములు,
ఉండ్రాళ్ళు
నైవేద్యంపెడుతుంటారు.
వీటిని
తైలసంస్కారం
లేకుండా
ఆవిరితో
ఉడికిస్తారు.
బియ్యం
పిండిలో
బెల్లము,
నువ్వులు
కలిపి
పెట్టి
ఆవిరితో
ఉడికించి
కుడుములను
తయారు
చేస్తారు.
ఇది
ఆయుర్వేదంలో
చాల
ప్రధానమైనది.
ఆవిరితో
ఉడికిన
కుడుములవల్ల
అనేక
రోగాలు
నివారణ
అవుతాయి.
బెల్లము
వాత
పిత్త
దోషాలను
పరిహారం
గావిస్తుంది,
నువ్వులు
రక్తాన్ని
పరిశుద్ధం
చేస్తాయి.
అంతేకాదు,
దృష్టిని
అభివృద్ధి
పర్చుతాయి.
ఆవిరితో
ఉడికిన
పదార్థం
ఎవరికైనా
సరే,
సులభంగా
జీర్ణమవుతుంది.
ఆసుపత్రిలో
కూడా
హార్ట్
ఆపరేషన్
జరిగిన
పేషంట్‌కు
రెండవదినమే
ఇడ్లీలు
పెడతారు;
ఉప్మా,
బోండా,
పకోడాలు
పెట్టరు.
అనగా
వినాయకునికి
పెట్టే
నైవేద్యం
మానవునికి
ఆరోగ్యభాగ్యాన్ని
చేకూర్చుతుంది.
ఆరోగ్యం,
ఆనందం,
శాంతి,
జ్ఞానం
మున్నగు
వాటిని
చేకూర్చే
తత్త్వమే
వినాయక
తత్త్వం.
దీనినెవ్వరూ
పూర్తిగా
అర్థం
చేసుకోవడం
లేదు.
ఏదో
ఇంత
మట్టి
తెచ్చి
వినాయకుని
బొమ్మచేసి
దానిపై
పనికిరాని
పుష్పములనువేసి
దానిని
ముంచి,
తేల్చి
చాల
ఘనంగా
పూజ
చేశామని
సంతృప్తి
పడుతున్నారు.
4
▾
Meaning
Keep
ఇది
కాదు
మనం
చేయవలసింది,
మనకు
ప్రీతికరమైనది
మనం
అర్పితం
చేయాలి.
ఇదే
పార్వతి
నందీశ్వరునికి
బోధించినది.
“ఓ
నందీశ్వరా!
నీకు
ప్రీతికరమైన
దేదో
దానిని
నా
కుమారునికి
నీవు
అర్పించు.
అప్పుడు
తనకు
ప్రీతికరమైనది
తాను
నీకు
అందిస్తాడు”
అన్నది.
మూషికవాహనుడనగా...
వినాయకుడు
మూషికవాహనుడు.
అతని
కీ
పేరు
ఎందుకు
వచ్చింది?
మూషికము
చీకటికి
గుర్తు.
చీకటి
అనగా
అజ్ఞానం.
చీకటిలో
ప్రయాణం
చేసేది
మూషికము,
లైటు
ఉంటే
అది
ప్రయాణం
చేయదు.
కనుక
మూషికవాహను
డనగా
అజ్ఞానమనే
చీకటిని
అణగద్రొక్కినవాడని
అర్థము.
దీనికి
మరొక
అర్థం
కూడా
ఉన్నది.
మూషికమునకు
వాసన
చాల
ప్రధానమైనది.
వాసనను
బట్టి
ఏ
పదార్థం
ఎక్కడున్నదో
కనుక్కోగలదు.
జన్మాంతర
వాసనలవల్లనే
మానవుడు
ఈ
ప్రాకృత
జీవితంలో
అనేక
పెడమార్గములు
పడుతుంటాడు.
వాసనలనగా
కోరికలు.
కనుక
కోరికలనణగ
ద్రొక్కినవాడు
మూషిక
వాహనుడు.
చూశారా!
మూషికవాహనుడనగా
ఎంత
పవిత్రమైన
అంతరార్థాలున్నవో!
వీటిని
గుర్తించకుండా
పెద్ద
పొట్ట
కలిగిన
వినాయకుడు
చిన్న
ఎలుకపై
ఎందుకు
ప్రయాణించాలి?
అని
యోచిస్తారు
కొందరు.
మూషికము
అతని
వాహనం
కాదు;
అతడు
అజ్ఞానము
నణగ
ద్రొక్కినవాడు,
వాంఛలనరికట్టినవాడు
అని
దీని
అర్థం.
వివేకానందునికి
కనువిప్పు
భగవంతుడు
ఏమి
చెప్పినా,
ఏది
చేసినా
మీ
కోసమేగాని
తనకోసం
కాదు.
భగవంతునిలో
ఏనాడూ
స్వార్థం
ఉండదు.
మీ
గుణతత్త్వమును
బట్టి
భగవంతుడు
ఇలాంటివాడు,
అలాంటివాడు
అని
మీరు
యోచన
చేస్తారేగాని
నిజంగా
భగవంతుని
ప్రేమ
తత్త్వాన్ని
ఎవ్వరూ
అర్థం
చేసుకోలేరు.
వివేకానంద
చరిత్రలో
దీనికొక
చిన్నకథ
ఉన్నది.
వివేకానందుడు
తన
తండ్రి
మరణించగా
రామకృష్ణ
పరమహంసవద్ద
నుండి
ఇంటికి
వచ్చాడు.
ఒకనాడు
సరుకులు
తీసుకు
రావడానికి
పక్క
గ్రామంలో
సంతకు
వెళ్ళాడు.
సరుకులు
తీసుకొని
ఇంటికి
తిరిగి
వస్తుండగా
కుంభవృష్టి
ప్రారంభమైనది.
వర్షం
ఆగే
సూచనలు
కనిపించకపోవడంతో
ఆ
రాత్రి
తలదాచుకోవడానికి
ఒక
పూలమ్మువారి
ఇంటివరండాలో
ప్రవేశించాడు.
కొంతసేపటికి
ఇద్దరు
చేపలమ్మే
స్త్రీలు
కూడా
వచ్చి
ఆ
వరండాలో
పడుకున్నారు.
కాని
వారికి
ఎంతసేపటికీ
నిద్ర
పట్టలేదు.
అక్క
లేచి
కూర్చుంది.
“ఏమే
చెల్లెలా!
ఈ
పాడు
పూలవాసనవల్ల
నాకు
నిద్రపట్టడం
లేదు”
అన్నది.
అప్పుడా
చెల్లెలు,
“అక్కా!
నీ
చేపలబుట్టను
తలక్రింది
పెట్టుకో,
పూలవాసన
పోతుంది.
మంచి
నిద్ర
పట్టుంది”
అని
సలహా
ఇచ్చింది.
ఇదియంతయు
సంభాషణను
వివేకానందుడు
చక్కగా
విన్నాడు.
“ఓహో!
సుగంధము
నందించే
పూలకంటే
దుర్గంధముతో
కూడిన
చేపలంటే
వీరు
ఇష్టపడుతున్నారు.
వీరి
సంస్కారమును
బట్టి
వారి
భావములు
ఉంటాయి
కదా!”
అని
తనలో
తాను
అనుకున్నాడు.
మరునాడు
తెల్లవారుజామున
లేచి
తన
గ్రామానికి
ప్రయాణమయ్యాడు.
దారిలో
ఒక
వ్యక్తి
కాలువ
గట్టుపై
స్పృహతప్పి
పడియుండటం
చూశాడు.
ఇంతలో
ఇద్దరు
దొంగలు
అదే
మార్గంలో
వస్తూ
ఆ
వ్యక్తిని
చూశారు.
“వీడెవడో
మనవలె
రాత్రంతా
దొంగతనంచేసి
తప్పత్రాగి
మత్తులో
పడిపోయాడురా”
అని
నవ్వుకుంటూ
వెళ్ళిపోయారు.
5
▾
Meaning
Keep
ఇంకొకవ్యక్తి
అటువైపుగా
వచ్చి,
“అయ్యో
పాపం!
ఇతనికి
నావలె
ఫిట్స్
వచ్చి
పడిపోయాడేమో!”
అని
జాలి
పడ్డాడు.
కొంతసేపటికి
ఒక
సన్యాసి
వచ్చి,
“ఆహా!
ఇతడెవరో
మహనీయునివలె
ఉన్నాడు.
ఏమి
ఇతని
అదృష్టం!
హాయిగా
నిర్వికల్ప
సమాధిలో
ఉన్నాడు.
ఇలాంటి
మహనీయుని
సేవ
చిక్కడం
నా
అదృష్టం”
అని
అతని
పాదములు
వత్తుతూ
కూర్చున్నాడు.
ఇదంతా
వివేకానందుడు
దూరంగా
నిలబడి
గమనిస్తూ
వచ్చాడు.
మంచిచెడ్డలు
మానవుని
భావములోనే
ఉన్నాయికాని,
బయట
లేవని
గుర్తించాడు.
“అయ్యో!
నే
నింతకాలము
రామకృష్ణునిపై
అనేకవిధాలుగా
సందేహ
పడుతూ
వచ్చాను.
ఇదంతా
నా
దోషమే;
రామకృష్ణునిలో
ఎట్టి
దోషమూ
లేదు”
అని
పశ్చాత్తాపపడ్డాడు.
తక్షణమే
ఇంటికి
వెళ్ళాడు.
తల్లికి
నమస్కరించి,
“అమ్మా!
పరమపవిత్రుడైన
నా
గురువును
నేను
అనవసరంగా
వదలి
పెట్టి
వచ్చేశాను.
ఇది
నా
బుద్ధి
దోషమేగాని
మరొకటి
కాదు.
కనుక
నాకు
సెలవిస్తే
నేను
మళ్ళీ
ఆ
మహనీయుని
వద్దకు
పోయి
సేవ
చేసుకుంటాను”
అన్నాడు.
“నీ
ఇష్ట
ప్రకారమే
చేయి
నాయనా!”
అని
తల్లి
అంగీకరించింది.
మానవునికి
బయట
కనిపించేదంతా
తన
అంతర్భావము
యొక్క
ప్రతిబింబమే.
తన
భావములనే
భగవంతునియందు
కూడా
ప్రతిబింబింపజేసుకొని,
భగవంతుడు
కూడా
తనవలె
ఉన్నాడేమో
అని
భ్రమిస్తుంటాడు.
ఇది
తన
దోషమేగాని
భగవంతునిలో
ఏమాత్రము
దోషము
లేదు.
భగవంతుడు
నిర్వికల్పుడు,
నిరాకారుడు,
నిర్గుణుడు.
ఎట్టి
ప్రమాణములకు
చిక్కనివాడు
కనుకనే
భగవంతుణ్ణి
అప్రమేయుడని
కూడా
అన్నారు.
భగవంతుని
గూర్చి
ఎవరికి
తోచినట్లు
వారు
భావించుకోవచ్చు.
దానివల్ల
ఆయనకు
ఆదాయంగాని,
నష్టంగాని
ఏదీ
లేదు.
ఈనాడు
ఎవరికి
వారు
తమ
భావములపై
ఆధారపడుతున్నారుకాని,
దైవసంకల్పంపై
ఆధారపడటం
లేదు.
ఎవరు
భగవంతుని
సంకల్పమును,
భగవంతుని
ఇష్టమును
అనుసరిస్తారో
వారే
నిజమైన
భక్తులు.
ఇచ్చుకొనేవారికే
పుచ్చుకొనే
అర్హత
ఉంటుంది
ఇంతకు
ముందు
చిట్టిబాబు
తన
ప్రసంగంలో,
“స్వామీ!
మాకు
చక్కని
తెలివిని,
చక్కని
బుద్ధిని
ఇవ్వండి”
అని
కోరాడు.
మాకు
అదివ్వండి,
ఇదివ్వండి
అని
కోరినాడేగాని
మీరు
ఏమిచ్చుకుంటారనేది
చెప్పలేదు.
ముందు
మనం
భగవంతునికి
ఇచ్చుకునేదాని
గురించి
చెప్పుకోవాలి.
భగవంతుడు
ఏమైనా
ఇస్తాడు,
ఏది
కావాలన్నా
ఇస్తాడు.
కాని
పుచ్చుకొనే
అధికారం
మీలో
ఉండాలి
కదా!
బ్యాంకులో
క్యాషియర్
చేతిలో
బోలెడు
డబ్బు
ఉందికదా
అని
అతనివద్దకు
పోయి,
“అయ్యా!
కొంత
డబ్బు
ఇవ్వండి”
అంటే
ఇస్తాడా?
ఇవ్వడు.
మీ
పేరు
మీద
ఎంత
డిపాజిట్
చేశారో
దానికి
మీరొక
చెక్కు
వ్రాసి
ఇస్తే
మీకు
డబ్బిస్తాడు.
అసలు
మీరు
డిపాజిట్టే
చేయకపోతే
మీకు
డబ్బు
ఎలా
ఇస్తాడు?!
అదేవిధంగా
మీరు
భగవంతునివద్ద
ప్రేమను,
పవిత్రతను
డిపాజిట్
చేయాలి,
ప్రార్థన
అనే
చెక్కును
ఇవ్వాలి.
అప్పుడే
మీరు
భగవంతుని
నుండి
పవిత్రమైన
ఫలితమును
అందుకోగలరు.
కవరుపై
స్టాంపు,
అడ్రసు
సరిగా
ఉంటే
అది
ఎక్కడికైనా
ఎంతదూరమైనా
పోయి
చేరుతుంది.
అదేవిధంగా
మీ
ప్రార్థన
అనే
కవరుపై
విశ్వాసమనే
స్టాంపు,
ప్రేమ
అనే
అడ్రసు
సరిగా
ఉండాలి.
మీ
మనస్సులో
ఎట్టి
కల్మషమూ
లేకుండా
చూసుకోవాలి.
ఇనుప
ముక్కను
మట్టిలో
పెడితే
దానికి
‘డస్ట్’
(దుమ్ము)
చేరి
రస్ట్
(తుప్పు)
…
ఆ
రస్ట్‌ను
తొలగించాలంటే
దానిని
అగ్నిలో
వేయాలి.
6
▾
Meaning
Keep
అదేవిధంగా
మీ
మనస్సులో
తుచ్ఛమైన
కోరికలనే
డస్టు
చేరటంచేత
దానికి
కల్మషమనే
రస్టు
పడుతుంది.
ఈ
కల్మషమనే
రస్టును
తీసివేయాలంటే
దానిని
టెస్టు
(పరీక్ష)
అనే
అగ్నిలో
వేయాలి.
టెస్టు
చేసినప్పుడే
మీ
జీవితానికి
రెస్టు
చేకూరుతుంది.
విద్యార్థులు
పై
క్లాసులకు
పోవాలనుకుంటే
పరీక్షలన్నింటికీ
సిద్ధంగా
ఉండాలి.
పరీక్షలో
మంచిమార్కులు
వచ్చినప్పుడే
పై
క్లాసులో
చేరడానికి
వీలవుతుంది.
ఎంత
ప్రియమైన
వైస్‌చాన్స్‌లర్
అయినా
విద్యార్థులకు
పరీక్షలు
పెట్టకుండా
ప్రమోషన్
ఇవ్వడు.
భగవంతుడు
పెట్టే
పరీక్ష
అదేవిధంగా
భగవంతుడు
కూడా
మీకు
ఉన్నత
స్థాయిని
అందించడానికే
మీకు
అప్పుడప్పుడు
పరీక్ష
పెడుతుంటాడు.
టెస్ట్
పెట్టడమే
భగవంతునికి
మంచి
టేస్ట్
(రుచి)
గా
ఉంటుంది.
ఆ
టెస్ట్‌లను
అందుకోవడం
మీకు
కూడా
మంచి
టేస్ట్‌గా
ఉండాలి.
“ఓ
భగవంతుడా!
నీవు
నాకు
ఎంత
త్వరగా
పరీక్షలు
పెడితే
అంత
త్వరగా
నేను
ఉన్నత
స్థాయికి
చేరుకుంటాను.
కాబట్టి
నాకు
పరీక్షలు
పెట్టు”
అని
ప్రార్థించాలి.
కాని
ఈ
కలి
ప్రభావము
చేత
మానవుడు,
“ఓ
భగవంతుడా!
నాకు
పరీక్షలు
పెట్టవద్దు”
అని
ప్రార్థిస్తున్నాడు.
పరీక్షలు
లేకపోతే
పై
క్లాసులకు
పోవడానికెలా
వీలౌతుంది?!
అసలు
ఏమిటీ
భగవంతుడు
పెట్టే
పరీక్ష?
మీకు
అశాశ్వతమైన
ఈ
జగత్తుపై
ఎంత
విశ్వాసముంది?
దైవంపై
ఎంత
విశ్వాసముంది?
అనేది
పరీక్షిస్తాడు.
మీకు
భౌతిక
జగత్తుపై
ఉన్న
విశ్వాసంలో
నూరింటి
ఒక
భాగమైనా
భగవంతునిపై
లేకపోతే
మిమ్మల్ని
భగవంతుడెలా
అనుగ్రహిస్తాడు?!
భగవంతుడు
నమ్మకానికి
తగిన
ఫలితం
ఇస్తాడు
మీరు
పుత్రమిత్రధరణ
వ్యాపారముల
నిమిత్తమై,
ధనధాన్యభోగయశస్సుల
నిమిత్తమై
ఎంతో
కాలమును
వ్యర్థంచేస్తున్నారు.
అందులో
నూరింట
ఒక
భాగమైనా
భగవంతుని
నిమిత్తమై
వినియోగిస్తున్నారా?
ముందు
భగవంతునిపై
విశ్వాసమును
అభివృద్ధి
పర్చుకోవాలి.
తనపై
తనకు
అనుమానం
కలవాడే
భగవంతుణ్ణి
అనుమానిస్తుంటాడు.
కనుక
ముందు
మానవుడు
తనను
తాను
నమ్మాలి;
తరువాత
భగవంతుణ్ణి
నమ్మాలి.
అలాంటి
వాడే
ఉన్నతస్థాయికి
చేరుకోగలడు.
తనను
తాను
నమ్మలేనివాడు
దైవాన్ని
ఎలా
నమ్మగలడు?
ఒకానొక
సమయంలో
ఒక
గ్రుడ్డివాడు
జీసస్వద్దకు
వచ్చి
తనకు
కనులివ్వమని
అడిగాడు.
“నేనివ్వగలనని
నమ్మకం
నీకున్నదా?”
అని
అడిగాడు
జీసస్.
గ్రుడ్డివాడు,
“ఆ
నమ్మకంచేతనే
నేను
వచ్చాను”
అన్నాడు.
అప్పుడు
జీసస్
అతని
కళ్ళను
స్పృశించి
చూపును
ప్రసాదించాడు.
అదే
విధంగా
అనేకమంది
నావద్దకు
వచ్చి,
“స్వామి!
నాకు
అదిస్తావా?
ఇదిస్తావా?”
అని
అడుగుతారు.
ముందు
నేనివ్వగలననే
నమ్మకం
మీలో
ఉన్నదా?
మీ
నమ్మకమును
బట్టి
నేనిస్తాను.
అల్పబుద్ధితో
అధికులను
అంచనా
వేయకూడదు
జీసస్
దగ్గర
‘డౌటింగ్
థామస్’
ఉండినట్లుగా
గురువులందరి
దగ్గర
అనేకమంది
‘డౌటింగ్
థామస్’లు
ఉంటారు.
ఒక
పర్యాయం
వివేకానందుడు
రామకృష్ణునికి
ధనంపై
ఆశ
ఉన్నదా?
అని
పరీక్షించడానికి
అతని
బెడ్
క్రింద
కొన్ని
కాసులు
వేశాడు.
రామకృష్ణుడు
వచ్చి
ఆ
బెడ్‌పైన
కూర్చోబోయి
ముళ్ళు
గ్రుచ్చుకున్నట్లుగా
ఎగిరి
పడ్డాడు.
అప్పుడు
వివేకానందుడు
తన
అల్పబుద్ధికి
సిగ్గుపడ్డాడు.
మీరు
మహనీయులను
సరిగా
గుర్తించాలనుకుంటే
మీరుకూడా
మహనీయుల
స్థాయికి
పోవాలి.
విమానం
ఆకాశంలో
సంచరిస్తుంటే
భూమిపై
సంచరిస్తున్న
మీకు
విమానం
కనిపిస్తుందిగాని,
అందులోని
పైలట్
ఎవరనేది
మీకు
తెలుస్తుందా?
7
▾
Meaning
Keep
ఆ
పైలట్‌ను
చూడాలని
ఆశగా
ఉంటే
మీరు
టికెట్
కొనుక్కొని
విమానంలో
కూర్చోవాలి.
అంతేగాని
మీరు
క్రింద
కూర్చుని
పైనున్న
పైలట్
ఎవరని
ఆలోచిస్తే
ప్రయోజన
మేమిటి?!
ఈనాటి
మానవులంతా
క్రింది
స్థాయిలో
కూర్చుని
ఉన్నత
స్థాయిలో
ఉన్న
భగవంతుణ్ణి
అర్థం
చేసుకోవడానికి
ప్రయత్నిస్తుంటారు.
ఇది
చాల
పొరపాటు.
మొట్టమొదట
మీ
గురించి
మీరు
విచారణ
చేసుకోవాలి;
మిమ్మల్ని
మీరు
పరీక్షించుకోవాలి;
మిమ్మల్ని
మీరు
శిక్షించుకోవాలి.
ఈనాడు
అందరూ
పరులను
శిక్షించడానికి
ప్రయత్నం
చేస్తుంటారుగాని,
ఎవ్వరూ
తమను
తాము
శిక్షించుకోరు.
గణపతిపూజలో
అంతరార్థం
ఏ
ఇబ్బందులూ
కలుగకుండా
మనం
నిరంతరం
సుఖసంతోషాలలో
ఉండాలంటే
సర్వవిఘ్నములు
దూరం
గావించే
విఘ్నేశ్వరుని
ప్రార్థించాలి.
అంతే
విఘ్నేశ్వరుని
గుడికి
పోవలెనా?
కాదు,
కాదు.
“దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవోదేవస్సనాతనః”
దేహంలోనే
ఉన్నాడు
వినాయకుడు.
మన
బుద్ధియే
వినాయకుడు,
మన
విజ్ఞానమే
వినాయకుడు,
మన
తెలివే
వినాయకుడు.
వీటిని
సరియైన
రీతిగా
ఉపయోగపెట్టుకున్నప్పుడు
మన
కోరికలు
అన్నీ
నెరవేరుతాయి.
పంచేంద్రియాలకు
అధిపతి
గణపతి.
కనుక
ఏనాడు
నీవు
నీ
పంచేంద్రియాలను
వశం
చేసుకుంటావో
ఆనాడు
నీవే
గణపతివి.
పది
దినములు
గణపతిని
పెట్టుకొని
పూజించడంలో
అంతరార్థ
మేమిటి?
ఒక్కొక్క
దినము
ఒక్కొక్క
ఇంద్రియమును
అరికట్టుకోవాలి.
విద్యార్థులారా!
ఇంద్రియనిగ్రహం
చాల
సులభమైనది.
కాని
మీకు
తెలియకపోవడంచేత
మీరు
చాల
అవస్థ
పడిపోతున్నారు.
మొట్టమొదట
ఇంద్రియనిగ్రహానికి
అనుకూలమైన
వాతావరణాన్ని
మీరు
ఏర్పర్చుకోవాలి.
ఎట్లా?
మీ
ద్వేషి
ఒకడు
మీ
కెదురుగా
వచ్చాడనుకోండి.
అప్పుడు
మీరు
కూడా
వానిని
ద్వేషిస్తే
ఇంక
పెద్ద
యుద్ధం
ప్రారంభమౌతుంది.
అట్లుగాకుండా,
“హలో
బ్రదర్!
ఎలా
ఉన్నావు?”
అని
పలకరించి
చూడండి;
తప్పక
వాని
ద్వేషం
తగ్గిపోతుంది.
ఒకానొక
సమయంలో
బుద్ధుని
చంపడానికి
ఒక
రాక్షసుడు
కత్తి
పట్టుకొని
వచ్చాడు.
అతడిని
చూసి
బుద్ధుడు
చిరునవ్వుతో,
“సోదరా!
నన్ను
చంపాలనుకుంటున్నావా?
నేను
సిద్ధమే”
అని
తల
వంచాడు.
ఆ
రాక్షసునికి
ఆశ్చర్యం
కలిగింది.
తక్షణమే
కత్తిని
క్రింద
పారవేసి
బుద్ధుని
పాదాలపై
పడ్డాడు.
కనుక
మనం
ఎవ్వరినీ
ద్వేషించకూడదు.
అందరితోను
స్నేహంగా
మెలగాలి.
ఎవరో
ఏదో
తప్పు
చేశాడని
వానిని
శిక్షించడానికి
ప్రయత్నించకూడదు;
వానిని
సరిచేయుటకు
తగిన
మార్గమును
వెతకాలి.
అప్పుడు
వానిలో
తప్పక
పరివర్తన
కలుగుతుంది.
విద్యార్థులారా!
వినాయకచవితి
జరుపుకోవడమంటే
ఏవో
బాహ్యమైన
పూజలు
చేయడం
కాదు.
అవి
కూడా
మనకు
అవసరమే.
కాని,
అంతర్భావము
లేని
ఆచరణవల్ల
ప్రయోజనం
లేదు.
మీలోనే
దైవత్వం
నిండి
నిబిడీకృతమైయున్నదనే
సత్యాన్ని
గుర్తించి
వర్తించండి.
మీ
బుద్ధియే
గణపతి
స్వరూపం.
దానిని
మీరు
సద్వినియోగం
చేసుకోండి.
దాని
నిమిత్తమై
భగవంతునికి
ప్రీతికరమైన
పనులు
చేస్తూరండి.
భగవంతునికి
ఏది
ప్రీతికరమైనది?
మితభాష
ప్రీతికరమైనది;
ద్వేషము,
అసూయవంటి
దుర్భావములు
ప్రీతికరమైనవి
కావు.
కనుక
ముందు
వాటిని
అణగద్రొక్కండి.
Previous
←
Mamaivāṃśo jīvaloke...
Next
The ideal of Bali Cakravarti
→