Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · The ideal of Bali Cakravarti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The ideal of Bali Cakravarti
14 September 1997, Oṇam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఎవరి
హృదయము
దయతో
కూడియుండునో,
ఎవరి
వాక్కు
సత్యంచేత
అలంకరింపబడియుండునో,
ఎవరి
కాయము
పరోపకారానికి
అంకితమగునో
అట్టి
మానవ
జీవితమే
పరిపూర్ణమైనది.
మనోవాక్కాయముల
ఏకత్వమే
పరిపూర్ణత్వం.
మానవ
జీవితం
దేని
నిమిత్తమై
ఏర్పడినది?
“పరోపకారార్థ
మిదం
శరీరం”,
ఈ
శరీరాన్ని
స్వార్థ
నిమిత్తమైగాక
పరార్థ
నిమిత్తమై
ఉపయోగపెట్టాలి.
కాని
ఈనాటి
మానవుడు
స్వార్థం
చేతిలో
కీలుబొమ్మగా
నటిస్తున్నాడు.
మానవునియందు
దివ్యత్వం
అవ్యక్తంగా
ఉన్నది.
కాని
తాను
స్వార్థంలో
మునిగి
పోవడంచేత
తనలో
దివ్యత్వం
లేదని
భ్రమిస్తున్నాడు.
ఈ
స్వార్థాన్ని
ఏనాడు
నిర్మూలించుకుంటాడో
ఆనాడే
తనలో
అవ్యక్తంగా
ఉన్న
దివ్యత్వం
వ్యక్తమవుతుంది.
స్వార్థం
నిర్మూలం
కావాలంటే
నిస్వార్థసేవ,
నామస్మరణ
అత్యవసరం.
ఈ
ప్రపంచంలో
ప్రతి
పదార్థమునకు
ఒక
వెల
ఉన్నది.
అడవిలోని
చిన్న
పక్షికి
కూడా
వెల
ఉన్నది.
జ్ఞానం
లేని
గొఱ్ఱెకు
కూడా
వెల
ఉన్నది.
కాని
మనిషికి
మాత్రం
విలువ
లేకుండా
పోతున్నది.
కారణమేమిటి?
మనిషిలో
ఉండవలసిన
మానవతావిలువలు
లేకపోవడమే!
మన
ఇంట్లో
ఫ్యాన్
వేసుకుంటే
దానికి
ఖర్చయ్యే
కరెంటుకు
డబ్బు
కడుతున్నాము.
ఇంట్లో
బల్బు
తగిలించుకుంటే
దానికి
కూడా
డబ్బు
కడుతున్నాము.
కార్పొరేషన్
వారి
ట్యాప్నుండి
నీరు
తెచ్చుకుంటే
దానికి
కూడా
తగిన
ట్యాక్స్
చెల్లిస్తున్నాము.
ఇట్టి
కల్పితమైన
గాలి,
నీరు,
వెలుతురుకోసం
మనం
ప్రభుత్వానికి
ట్యాక్స్
కడుతున్నప్పుడు
మరి
మనకు
ఉచితంగా
పంచభూతములను
ప్రసాదించిన
భగవంతునికి
కూడా
ట్యాక్స్
కట్టాలి
కదా!
అదే
స్మరణ.
ఆ
స్మరణ
కూడా
కేవలం
శ్రుతి
లయ
రాగ
తాళములతో
మాత్రమే
కాకుండా
హృదయార్పిత
భావంతో
చేయాలి.
రావణుడు
నిరంతరము
శివ
పంచాక్షరీ
నామాన్ని
స్మరిస్తూ
వచ్చాడు.
అయినప్పటికీ
అతనిలోని
రాక్షసగుణములు
పోలేదు.
కారణమేమిటి?
అతడు
కేవలం
టేప్‌రికార్డర్
మాదిరి
ఉచ్చరించాడుగాని,
హృదయపూర్వకంగా
స్మరించ
లేదు.
రాక్షస
కుమారుడైన
ప్రహ్లాదుడు
నిరంతరము
“ఓం
నమో
నారాయణాయ”
అని
హృదయపూర్వకంగా
స్మరిస్తూ
వచ్చాడు.
తండ్రియైన
హిరణ్యకశిపుడు
పెట్టిన
బాధలన్నింటి
నుండి
ఆ
నామస్మరణయే
అతనిని
రక్షించింది.
కనుక
మీరు
కూడా
మీ
హృదయాన్ని
భగవంతునికి
అర్పించి
నామాన్ని
స్మరించాలి.
అదే
నిజమైన
స్మరణ.
జనుల
మెప్పుకోసమో
లేక
పేరు
ప్రతిష్ఠలకోసమో
చేసే
స్మరణ
సరియైనది
కాదు.
ఎవరు
మెచ్చినా
మెచ్చకపోయినా
భగవంతుడు
మెచ్చుకుంటే
చాలు.
“యద్భావం
తద్భవతి”.
హృదయపూర్వకంగా
దైవాన్ని
స్మరించిన
వాడు
తాను
కూడా
దైవంగా
మారిపోతాడు.
కాని
ఈనాటి
మానవుడు
కఠిన
శిలాహృదయుడుగా
మారిపోతున్నాడు.
దుర్మార్గంచేతను,
ఇతరులను
బాధించడంచేతను,
హింసించడం
చేతను
తన
అభీష్టాలను
నెరవేర్చుకోవాలని
ప్రయత్నిస్తున్నాడు.
ఇది
ఎన్నటికీ
సాధ్యంకాదు.
తన
అభీష్టాలు
నెరవేరాలంటే
తాను
ప్రేమ,
శాంతి,
సహనాలతో
జీవించాలి.
అన్ని
దానములను
మించిన
దానం
లోకంలో
కొందరు
భూదానం
చేస్తుంటారు,
కొందరు
గోదానం
చేస్తుంటారు,
కొందరు
అన్నదానం
చేస్తుంటారు,
కొందరు
వస్త్రదానం
చేస్తుంటారు.
కాని
బలిచక్రవర్తి
తనను
తానే
అర్పించుకున్నాడు
భగవంతునికి.
ఇదే
అన్నిదానములను
మించిన
గొప్పదానం.
అతనిలో
మొట్టమొదట
నేను
చెప్పిన
మూడు
గుణములు
సంపూర్ణంగా
నిండియున్నాయి.
అతడు
తన
హృదయాన్ని
దయతో
నింపుకున్నాడు;
తన
మాటలలో
సత్యమును
ఇముడ్చుకున్నాడు;
తన
కాయమును
పరోపకారానికి
అంకితం
చేశాడు.
కనుకనే
భగవంతుడు
అతనిని
అనుగ్రహించాడు.
అతడు
వామనమూర్తికి
తనను
తాను
అర్పించుకోవడానికి
సిద్ధమైనప్పుడు
గురువైన
శుక్రాచార్యుడు
వద్దని
అడ్డు
తగిలాడు.
అప్పుడు
బలిచక్రవర్తి,
“గురూజీ!
పలికి
బొంకుట
కంటె
పాపమున్నె?
2
▾
Meaning
Keep
ఆడిన
మాట
తప్పుటకంటె
మించిన
పాపం
లేదు.
కనుక
ఎన్ని
కష్టాలైనా
కలుగనీ.
నేనాడిన
మాట
తప్పను”
అన్నాడు.
ప్రవర్తన
వేషానికి
తగినట్లుగా
ఉండాలి
ఒకనాడు
భోజరాజు
ఉద్యానానికి
ఒక
పగటివేషగాడు
సన్యాసివేషంలో
వచ్చి
వేదాంతాన్ని
చక్కగా
వివరించి
చెప్పాడు.
భోజరాజు
సంతోషించి
ఒక
తట్టలో
బంగారు
వరహాలను
తెప్పించి
అతని
కివ్వబోయాడు.
అతడు
వాటిని
నిరాకరిస్తూ,
“రాజా!
నేను
సన్యాసిని.
సర్వసంగపరిత్యాగిని.
కనుక
ఇవి
నాకు
అక్కర
లేదు.
రేపటి
దినము
తిరిగి
వస్తాను”
అని
చెప్పి
వెళ్ళిపోయాడు.
మరునాడు
అదే
వ్యక్తి
ఒక
స్త్రీ
వేషంవేసుకొని
వచ్చి
అద్భుతంగా
నృత్యం
చేశాడు.
రాజు
మెచ్చి
అతనికి
కొన్ని
వరహాలను
బహూకరించబోయాడు.
అప్పుడతడు,
“రాజా!
ఇవి
నాకు
చాలవు,
ఇంకా
ఎక్కువ
కావాలి”
అన్నాడు.
రాజు
ఆశ్చర్యపడి,
“అయ్యా!
నిన్న
నీవు
సన్యాసివేషంలో
వచ్చినప్పుడు
అసలు
వరహాలనే
ముట్టనన్నావు.
ఈనాడు
ఇచ్చినవి
చాలవంటున్నావు.
ఏమిటి
దీని
అంతరార్థం?”
అని
అడిగాడు.
అప్పుడా
వ్యక్తి,
“రాజా!
వేషమునకు
తగిన
ప్రవర్తనుండాలి
కదా!
నిన్న
సన్యాసివేషం
వేశాను.
కాబట్టి
బంగారం
ముట్టనన్నాను.
ఈనాడు
నర్తకి
వేషం
వేశాను.
కాబట్టి
ఇంకా
ఎక్కువ
కావాలంటున్నాను”
అన్నాడు.
ప్రేమస్వరూపులారా!
మీరు
మానవవేషాలు
ధరించారు.
కనుక
మీరు
మానవులుగానే
ప్రవర్తించాలి.
విద్యార్థి
విద్యార్థిగా
జీవించాలి.
గృహస్థుడు
గృహస్థ
ధర్మాలను
పాటించాలి.
సన్యాసి
సన్యాసాశ్రమధర్మాల
ననుసరించాలి.
కాని
ఈనాడు
వేషానికి
తగిన
చర్యలు
ఎక్కడా
కనిపించడం
లేదు.
పైన
కాషాయం,
లోపల
కషాయం
మంచిది
కాదు.
గుడ్డలు
మారితే
సరిపోదు,
గుణములు
మారాలి.
ఎవరిపనులు
వారు
చేసుకోవడం
ఉత్తమం
భోజరాజు
కాలంలో
ఎవరి
పనులు
వారు
చేసుకొనేవారు.
మహారాణి
కూడా
రాజుకు
కావలసినవన్నీ
తానే
స్వయంగా
చూసుకొనేది.
వండటం,
వడ్డించడం,
పాత్రలను
శుభ్రం
చేసుకోవడం
మొదలగు
సమస్తకర్మలను
గృహలక్ష్మియే
చేసేది.
పరులతో
సేవ
చేయించుకోవడం
ఎవ్వరికీ
ఇష్టముండేది
కాదు.
కాని
ఈ
ఆధునిక
యుగంలో
ఒక
ఇంట్లో
భార్యాభర్తలున్నారంటే
నలుగురు
సర్వెంట్స్‌ను
పెట్టుకుంటారు.
ఒక
డ్రైవరుండాలి,
ఒక
క్లీనరుండాలి,
ఒక
వంటవాడుండాలి,
పాత్రలు
తోమే
వాడొకడుండాలి!
దీనివల్లనే
మానవులు
సోమరిపోతులుగా
తయారౌతున్నారు.
ఎవరి
పనులు
వారు
చేసుకోవటంలేదు.
చిన్న
కర్చీఫ్
ఉంటే
దానిని
కూడా
చాకలివానికి
వేస్తారు
కొందరు.
వారే
పిండుకొని
ఆరబెట్టుకోవచ్చు
కదా!
చిన్నచిన్న
విషయాలలో
ఇతరులపై
ఆధారపడటమెందుకు?!
ఎవరి
పనులు
వారు
చేసుకోవడం
ఉత్తమమైన
పద్ధతి.
భగవంతుడు
పంపే
నాల్గు
ఉత్తరాలు
ఒకనాడు
ఒక
రాణీగారు
రాజు
తలకు
చమురు
పెడుతున్నారు.
రాజుతలలో
ఆమెకు
రెండుమూడు
తెల్లవెంట్రుకలు
కనిపించాయి.
వాటిని
చూసి
తన
చీరకొంగుతో
కన్నీరు
తుడుచుకోసాగింది.
ఎదురుగా
అద్దం
ఉండటంచేత
రాజుకు
ఈ
దృశ్యం
కనిపించింది.
“రాణీ!
ఎందుకు
ఏడుస్తున్నావు?”
అని
అడిగాడు.
“నాథా!
భగవంతుడు
మానవుణ్ణి
తనవద్దకు
రప్పించుకొనే
ముందు
నాలుగు
‘ఉత్తరాలు’
పంపిస్తాడు.
తెల్లవెంట్రుకలు
వస్తే
మొదటి
ఉత్తరం
వచ్చినట్లే.
అనగా
ఇంక
సంసారసంబంధమైన
వాంఛలకు
దూరంగా
ఉండమని
హెచ్చరించడమన్నమాట.
తరువాత
కన్నులను
క్యాటరాక్ట్
పొర
కప్పుతుంది.
ఇది
రెండవ
ఉత్తరము.
కొంతకాలానికి
నొసలు
ముడతలు
పడతాయి.
ఇది
మూడవ
ఉత్తరం.
ఇంక
చివరికి
కాళ్ళుచేతులు
అదరడం
ప్రారంభమవుతుంది.
ఇది
నాల్గవ
ఉత్తరం.
నాథా!
నీకప్పుడే
మొదటి
ఉత్తరం
వచ్చిందేనని
బాధపడుతున్నాను.
మనం
ఇక
జాగ్రత్తగా
ఉండాలి”
అన్నది.
రాణిమాటలను
రాజు
చక్కగా
అర్థం
చేసుకున్నాడు;
స్నానం
చేసిన
వెంటనే
మంత్రిని
పిలిపించాడు.
“మంత్రీ!
ఇక
ఈ
రాజ్యాన్ని
ఏలవలసిన
బాధ్యత
నీదే.
మేమిరువురం
అరణ్యానికి
పోయి
తపస్సు
చేస్తాము”
అన్నాడు.
‘యథా
రాజా
తథా
ప్రజా’
రాజాజ్ఞ
ప్రకారం
మంత్రి
ఈ
విషయాన్ని
రాజ్యమంతటా
చాటింపు
వేయించాడు.
ఇంక
ప్రజలందరు
గుంపులు
గుంపులుగా
రాజభవనానికి
రాసాగారు.
3
▾
Meaning
Keep
Also in his talks
(19)
25 March 1980
The four brothers
9 January 1988
God in the heart, work in the hands
3 September 1988
The body itself is a temple!
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
10 May 1992
Without a base substance no object takes on form and name
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
27 December 1992
If we can raise the value of man, the value of things comes down
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
1 January 1998
Happiness and sorrow cannot be parted
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
19 November 2000
Noble Sons Are Born Only When There Are Noble Resolves
18 November 2001
Man is the embodiment of Caitanya
11 April 2003
The ideal figures of the Rāmāyaṇa
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
21 March 2004
I am you, you are I
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
“రాజా!
మీరు
మాకు
తండ్రివంటివారు.
ఇంతకాలము
మమ్మల్ని
కంటికిరెప్పవలె
కాపాడుతూ
వచ్చారు.
మీరు
లేకుండా
మేము
జీవించలేము.
కనుక
మేమే
అడవికి
వెళ్ళి
తపస్సు
చేసి
మీ
ఆయుఃప్రమాణాన్ని
పొడిగించమని
భగవంతుణ్ణి
ప్రార్థించి
వస్తాము”
అన్నారు.
రాజు
అంగీకరించక
తప్పలేదు.
ప్రజలంతా
అడవికి
వెళ్ళి
తపస్సు
చేశారు.
వారి
భక్తికి
మెచ్చి
భగవంతుడు
ప్రత్యక్షమై
ఏమి
కావాలో
కోరుకొమ్మన్నాడు.
ప్రజలంతా
ఏకకంఠముతో,
“స్వామీ!
మా
రాజు
బాగుంటేనే
మేము
ఆ
రాజ్యంలో
జీవించడానికి
వీలవుతుంది.
కనుక
మా
రాజుకింకా
నూరుసంవత్సరాల
ఆయుష్షును
ప్రసాదించు”
అని
కోరారు.
“సరే,
ఇచ్చినాను
పొండి”
అన్నాడు
భగవంతుడు.
ఆ
ప్రజలు
పట్టలేని
ఆనందంతో
రాజభవనానికి
పరుగెత్తుకుంటూ
వచ్చారు.
“రాజా!
మీరింకా
నూరు
సంవత్సరాలపాటు
జీవించేటట్లు
భగవంతుని
నుండి
వరం
పొంది
వచ్చాము”
అన్నారు.
ఈ
మాటలు
విన్న
తక్షణమే
రాణీగారు
రాజుకు
నమస్కరించి,
“రాజా!
ఇక
నేను
వెళుతున్నాను
తపస్సుకు”
అన్నది.
ప్రజలందరూ,
“అయ్యో!
మనం
రాజుకు
మాత్రమే
నూరు
సంవత్సరాలు
పొడిగించమని
కోరాము
కాని,
రాణికి
కోరలేదు.
అందుకే
ఆమెకు
కోపం
వచ్చిందేమో”
అనుకున్నారు
పాపం!
కాని
రాణీ
భావన
అట్టిది
కాదు.
ఆమె
అరణ్యానికి
వెళ్ళి
తపస్సు
చేసింది.
భగవంతుడు
ప్రత్యక్షమయ్యాడు.
“స్వామీ!
మీరు
మారాజుకు
ఇంకా
నూరు
సంవత్సరాల
ఆయుష్షు
నిచ్చారా?”
అని
ప్రశ్నించింది.
“అవును,
ఇచ్చాను”
అన్నాడు.
“అయితే
రాజు
ఉన్నంతవరకు
ఈ
ప్రజలు
కూడా
ఉండాలి.
ఇలాంటి
ప్రజలు
లేకుండా
అలాంటి
రాజు
ఉండి
ఏమి
ప్రయోజనం?
కనుక
ప్రజలకు
కూడా
నూరేళ్ళ
ఆయుష్షు
ఇవ్వాలి”
అని
కోరింది.
భగవంతుడు
ఆమె
విశాల
భావానికి
సంతోషించి,
“అమ్మా!
మీరాజుకు
నూరేళ్ళు,
ప్రజలకు
నూరేళ్ళు,
నీకు
కూడా
నూరేళ్ళు
ఇచ్చాను,
ఆనందంగా
పోయిరా”
అన్నాడు.
“యథా
రాజా
తథా
ప్రజా”
ఆనాటి
రాజులు
విశాల
హృదయులు
కావడంచేత
ప్రజలు
కూడా
విశాలహృదయులుగా
ఉండేవారు.
కాని
ఈనాడు
అట్టి
రాజులుగాని,
అట్టి
ప్రజలుగాని
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఈనాడు
వామనమూర్తి
అవతరించి
బలిచక్రవర్తికి
మోక్షం
ప్రసాదించిన
దినము.
బలిచక్రవర్తి
మహా
గొప్పవాడు.
కాని
అంత
మంచివాడు
కాదు.
ఎందుకంటే
అతనిలో
అహంకారమనే
దుర్గుణం
ఉంది.
వామనమూర్తి
వచ్చి
ఆ
కాస్త
అహంకారమును
అణగద్రొక్కి
అతడిని
తనలో
చేర్చుకున్నాడు.
బలిచక్రవర్తి
రాజ్యంలో
ఏనాడూ
దుర్భిక్షం
లేదు.
ప్రజలంటే
అతనికి
చాల
అభిమానం.
వారిని
తన
కన్నబిడ్డలవలె
చూసుకున్నాడు.
కనుకనే
తాను
వెళ్ళిపోయే
సమయంలో,
ప్రతి
సంవత్సరం
ఈ
ఓణం
రోజున
వచ్చి
మిమ్మల్ని
చూస్తానని
ప్రజలకు
వాగ్దానం
చేశాడు.
ఓణం
అనగా
అవతరించడమే,
క్రొత్త
జీవితాన్ని
ప్రారంభించడమే.
ఈనాటికి
కూడా
కేరళలో
ఒకవైపున
నాస్తికత్వం
పెరుగుతున్నా
మరొకవైపున
విష్ణుభక్తి
కూడా
చాల
పెరుగుతూ
వస్తున్నది.
“మీటెస్టే
నా
టేస్ట్”
కష్టసుఖాలు
రెండూ
ఒకదానినొకటి
బ్యాలన్సు
చేస్తున్నట్లుగా
ఉంటాయి.
The
pleasure
is
an
interval
between
two
pains.
రెండు
బాధలమధ్యనే
ఒక
సుఖముంటుంది;
రెండు
సుఖములమధ్యనే
ఒక
బాధ
ఉంటుంది.
“కష్టసుఖములు
రెండును
కలసియుండు
వీని
విడదీయ
నెవ్వరి
వశము
కాదు
సుఖము
ప్రత్యేకముగ
ఎందు
చూడబోము
కష్టము
ఫలించెనేని
సుఖంబటంద్రు”
కష్టము
లేక
సుఖము
విలువ
తెలియదు.
కనుకనే
భగవంతుడు
అప్పుడప్పుడు
కొన్ని
కష్టాలను,
బాధలను
కలిగించి
అందరినీ
టెస్ట్
చేస్తుంటాడు.
టెస్ట్
చేసినప్పుడే
మిమ్మల్ని
ఉన్నతస్థాయికి
పంపించడానికి
వీలౌతుంది.
లేకపోతే
మీరు
ఉన్న
స్థానంలోనే
ఉంటారు.
కాని
అదేమి
దురదృష్టమో
ఈనాటి
భక్తులు
తమను
టెస్ట్
చేయవద్దని
భగవంతుణ్ణి
కోరుతుంటారు.
పిచ్చి
భక్తులారా!
అట్లాకోరకండి.
మీ
టెస్టే
నా
టేస్ట్!
భక్తులు
నిరంతరము
తమకు
టెస్టులు
పెట్టమని
భగవంతుణ్ణి
కోరాలి.
ఎన్ని
కష్టాలు
పెట్టినా
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగిపోవాలి.
అప్పుడే
మీలో
దివ్యత్వం
ఆవిర్భవిస్తుంది.
4
▾
Meaning
Keep
పాండవులు
మహారాజులుగా
ఉన్నంతకాలం
తమలోని
దివ్యశక్తిని
వారు
ఏనాడూ
దర్శించలేక
పోయారు.
పన్నెండు
సంవత్సరాలు
అరణ్యవాసం,
ఒక
సంవత్సరము
అజ్ఞాతవాసం
చేసిన
తరువాతనే
వారిలోని
దివ్యభావములన్నీ
బయటికి
వచ్చాయి.
బావిలో
నీరు
పైవరకు
ఉంటే
అడుగునున్న
వస్తువు
మనకు
కనిపించదు.
నీరు
తగ్గితే
అడుగుభాగం
కనిపిస్తుంది.
అదేవిధంగా
మనను
కప్పియున్న
అహంకార
మమకారములను
తొలగించుకునేంత
వరకు
అట్టడుగునున్న
దివ్యత్వం
మనకు
అర్థం
కాదు.
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
అందరిలోను
ఉన్నాడనే
సత్యాన్ని
గుర్తించి
మీ
ప్రేమను
పదిమందికి
పంచండి.
అదే
జీవితలక్ష్యం.
మానవ
జన్మ
దుర్లభమైనది.
ఇది
ఏనాటికైనా
జారిపోతుంది,
ఏనాటికైనా
కూలిపోతుంది.
కాబట్టి
మమత్వాన్ని
త్రెంచుకొని
త్యాగాన్ని
పెంచుకోండి.
త్యాగమంటే
ఏమిటి?
ఆస్తి,
ఆలి
వీడి
అడవికేగుట
కాదు;
దుష్టభావములను
వీడుటే
త్యాగము,
అదియే
యోగము.
కనుక
మీ
భావములను
మార్చుకోండి.
రామానందతీర్థులవారు
సన్యాసం
స్వీకరించి
అరణ్యంలో
ఉన్న
సమయంలో
అతని
బోధలు
వినాలని
ప్రజలు
గుంపులు,
గుంపులుగా
వెళుతున్నారు.
ఆ
గుంపులో
అతని
భార్య
కూడా
ఉన్నది.
రామానందులవారు
ఆమెను
చూస్తూనే
తలను
ప్రక్కకు
త్రిప్పుతున్నాడు.
అప్పుడామె
చెబుతుంది:
“స్వామీ!
నేనిక్కడికి
వచ్చినది
మీరు
నా
భర్త
అనే
భావంతో
కాదు.
మీరు
మహనీయులనే
భావంతో
మీ
ప్రబోధను
వినాలనే
ఆశతో
వచ్చాను.
కాని
మీరు
నన్ను
చూడగానే
తలత్రిప్పుతున్నారు.
అంటే
నేను
మీ
భార్యననే
భావం
మీకింకా
పోలేదన్నమాట.
భావమును
మార్చుకోకుండా
సన్యాసం
తీసుకుంటే
ప్రయోజన
మేమిటి?
ముందు
మీ
భావాన్ని
మార్చుకోండి”
అన్నది.
మనలోని
దుర్గుణాలను,
దురాలోచనలను
విసర్జించాలి.
అప్పుడు
ప్రేమ
మనలో
దానంతటదే
ఆవిర్భవిస్తుంది.
మానవుడు
సహజంగానే
ప్రేమస్వరూపుడు.
కాని
ఆ
ప్రేమను
ప్రాపంచిక
విషయాలలో
ప్రవేశపెడుతున్నాడు.
దానిని
దైవంపై
మరల్చి
సర్వకర్మలను
భగవత్ప్రీత్యర్థం
ఆచరించాలి.
అదే
నిజమైన
త్యాగము.
ఇల్లువాకిళ్ళను
వదలిపోవడం
ఆడంబరమే
అవుతుందికాని,
త్యాగమనిపించుకోదు.
అంతా
భగవత్స్వరూపమే
అన్న
భావముతో
జీవించాలి.
“ఈమె
నా
తల్లి,
ఈమె
నా
బిడ్డ,
ఇతను
నా
కుమారుడు”
అనే
భావాలు
పెట్టుకొని
మీరు
ఏమి
విసర్జించినా
ప్రయోజనం
లేదు.
అభిమానమే
దుఃఖానికి
మూలం
ఒకానొక
వ్యక్తి
ఇల్లువాకిళ్ళను
వదలి
హృషీకేశ్కు
వెళ్ళి
సన్యాసం
స్వీకరించాడు.
ఒకనాడు
అక్కడ
నది
ఒడ్డున
ఒక
చెట్టు
క్రింద
కూర్చుని
భగవచ్చింత
చేస్తున్నాడు
పాపం!
ఇంతలో
అక్కడొక
యాత్రికుల
బస్సు
ఆగింది.
బస్సులోని
వారు
తెలుగులో
మాట్లాడుకోవడం
విన్నాడు.
ఇతడు
కూడా
తెలుగువాడే
కావడంచేత
భాషాభిమానంతో
వారివద్దకు
వెళ్ళి,
“అయ్యా!
మీరెక్కడి
నుండి
వచ్చారు?”
అని
అడిగాడు.
“మాది
అనంతపురం
జిల్లాలోని
పుట్టపర్తి
గ్రామమండీ”
అన్నారు.
ఇతనిది
కూడా
పుట్టపర్తే
కావడంచేత
ఇంక
గ్రామాభిమానం
వచ్చేసింది.
“పుట్టపర్తిలో
మీరెక్కడుంటారండీ?”
అని
అడిగాడు.
“మా
ఇల్లు
చిత్రావతీ
నదికి
పోయే
త్రోవలో
ఉన్నదండీ”
అన్నారు.
ఇతని
తండ్రి
కూడా
అదే
ప్రాంతంలో
ఉండటంచేత,
“మీ
ఇంటి
నెంబర్
ఎంతండీ?”
అని
అడిగాడు.
“మాది
పదవ
నెంబర్
ఇల్లు”
అని
చెప్పారు.
ఇతని
తండ్రిది
12వ
నెంబర్
ఇల్లు.
“మా
నాన్న
12వ
నెంబర్
ఇంట్లో
ఉంటున్నాడండీ.
ఆయన
బాగున్నాడా?”
అని
అడిగాడు.
“పాపం,
ఆయన
నెల
క్రిందటే
చనిపోయాడండీ”
అన్నారు.
“అయ్యో!
నా
తండ్రి
పోయాడా!”
అని
ఇతడు
ఏడుస్తూ
కూర్చున్నాడు.
ఈ
ఏడుపుకు
కారణమేమిటి?
మొదట
భాషాభిమానం
వచ్చింది.
భాషాభిమానం
వస్తూనే
జిల్లాభిమానం,
జిల్లాభిమానం
వస్తూనే
గ్రామాభిమానం,
గ్రామాభిమానం
వస్తూనే
ఇంటిఅభిమానం,
ఇంటిఅభిమానం
వస్తూనే
దేహాభిమానం
కలిగాయి.
దేహాభిమానంచేత
దుఃఖం
ఏర్పడింది.
సమస్త
దుఃఖములకు
మూలకారణం
దేహాభిమానమే.
దేహాభిమానమును
వీడక
ఏ
హృషీకేశ్కు
పోయినా,
ఏ
హరిద్వార్‌కు
పోయినా,
ఏ
బదరీకి
పోయినా
ప్రయోజనం
లేదు.
దేహాభిమానమును
తగ్గించుకొని
ఉన్నచోటే
ఉండండి
అదే
మీకు
మోక్షము
నందిస్తుంది.
Previous
←
The Significance of Vināyaka Caturthī
Next
God delights in the feeling, not in outward show
→