Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Akbar and Bīrbal
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Akbar and Bīrbal
19 March 1998, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
పూర్వం
అక్బర్
చక్రవర్తి
వద్ద
బీర్బల్
అనే
మంత్రి
ఉండేవాడు.
అతడు
గొప్ప
తెలివితేటలు
గలవాడు.
అక్బర్
అడిగిన
ప్రశ్నలన్నింటికీ
చక్కని
సమాధానాలు
చెప్పేవాడు.
అందుచేత
అక్బర్
అతనిని
అందరికంటే
ఎక్కువగా
అభిమానించేవాడు,
ఏ
ప్రశ్ననైనా
అతనినే
అడిగేవాడు.
ఇది
చూసి
ఇతర
మంత్రులకు,
సలహాదారులకు,
సైన్యాధిపతికి
బీర్బల్
పై
అసూయ
కల్గింది.
ఎలాగైనా
సరే
తాము
కూడా
అక్బర్
అడిగే
ప్రశ్నలకు
చక్కని
సమాధానాలు
చెప్పి
అతని
మెప్పు
పొందాలనుకున్నారు.
ఒకనాడు
సభలో
బీర్బల్
లేని
సమయం
చూసుకొని
సైన్యాధిపతి
లేచి
నిలబడి,
“మహాప్రభూ!
తమరు
ప్రతి
విషయాన్ని
బీర్బల్నే
ఎందుకు
అడుగుతారు?
మమ్మల్ని
కూడా
అడుగవచ్చు
కదా!
మాకు
అవకాశమిస్తే
మేము
కూడా
మీ
ప్రశ్నలకు
చక్కని
సమాధానాలు
చెప్పగలము”
అన్నాడు.
వెంటనే
ఇతర
మంత్రులు,
సలహాదారులు
కూడా
లేచి
నిలబడి
“ప్రభూ!
దయచేసి
మాకు
కూడా
అవకాశమివ్వండి”
అన్నారు
ముక్తకంఠంతో.
అప్పుడు
అక్బర్
“సరే,
మిమ్మల్ని
కూడా
అడుగుతాను.
ఒక్క
ప్రశ్న
కాదు,
నాల్గు
ప్రశ్నలు
అడుగుతాను.
అయితే
నాకు
సంతృప్తికరమైన
సమాధానాలు
చెప్పాలి”
అన్నాడు.
మొదటి
ప్రశ్న
వేశాడు
అక్బర్:
“ఈ
ప్రపంచంలో
ఉత్తమమైన
పుష్పం
ఏది?”
ఒకరు
గులాబీ
పుష్పమన్నారు,
మరొకరు
మల్లెపువ్వున్నారు.
ఈవిధంగా
ఎవరికి
తోచిన
పేరు
వారు
చెబుతూ
వచ్చారు.
కానీ
అక్బర్
సంతృప్తి
చెందలేదు.
రెండవ
ప్రశ్న
వేశాడు:
“ఏ
పాలు
శ్రేష్ఠమైనవి
?”
ఒకడు
లేచి
గోవు
పాలు
శ్రేష్ఠమైనవి
అన్నాడు.
మరొకడు
లేచి
మేకపాలు
చాల
మంచివి
అన్నాడు.
అక్బర్
వాళ్ళను
కూర్చొమ్మని
చెప్పి
మూడవ
ప్రశ్న
అడిగాడు:
“ఈ
ప్రపంచంలో
ఏది
అత్యంత
మధురమైనటువంటిది?”
చాలమంది
బెల్లము
అన్నారు.
కొందరు
మాత్రం
తేనె
అని
చెప్పారు.
కానీ
ఈ
సమాధానాలు
కూడా
అక్బర్‌కు
తృప్తినివ్వలేదు.
చివరిగా
నాల్గవ
ప్రశ్న
వేశాడు:
“ఏ
ఆకు
ఉత్తమమైనది?”
ఒకరు
కొబ్బరాకు
చాల
మంచిదన్నారు,
మరొకరు
అరిటాకు
ఉత్తమమైనదన్నారు.
2
▾
Meaning
Keep
ఒక్కొక్కరు
లేచి
నిలబడి
ఒక్కొక్క
ఆకు
పేరు
చెప్పారు.
కానీ
అక్బర్‌కు
ఏ
జవాబూ
నచ్చక
అందరినీ
కూర్చొమ్మన్నాడు.
ఇంతలో
బీర్బల్
సభలో
ప్రవేశించాడు.
“బీర్బల్
నా
ప్రశ్నలను
విన్నావా?”
అని
అడిగాడు
అక్బర్.
“వినలేదు
ప్రభూ!”
అన్నాడు
బీర్బల్.
“సరే,
ఇప్పుడు
అడుగుతాను,
చెప్పు.
ఈ
ప్రపంచంలో
ఉత్తమమైన
పుష్పం
ఏది?”
అని
ప్రశ్నించాడు.
తక్షణమే
బీర్బల్
“ప్రత్తిపుష్పం
చాల
శ్రేష్ఠమైనది”
అన్నాడు.
దేనివల్ల?
“ప్రత్తిపుష్పం
ద్వారా
మనకు
ప్రత్తి
లభిస్తున్నది.
ప్రత్తితో
మనం
వస్త్రములను
తయారు
చేసుకొంటున్నాము.
వస్త్రములచేత
మన
మాన
మర్యాదలను
కాపాడుకొంటున్నాము.
ఈ
ప్రపంచంలో
మనిషి
జీవించడానికి
వస్త్రం
అత్యవసరమైనటువంటిది.
ఈవిధంగా
శాశ్వతమైన
ఉపయోగం
కల్గిన
ప్రత్తిపుష్పమే
అన్ని
పుష్పములకంటే
శ్రేష్ఠమైనది.
మిగిలిన
పుష్పములు
అప్పటికప్పుడు
సుగంధమునందించినప్పటికీ
ఒక్క
రోజులోనే
వాడిపోయి
నిరుపయోగమైపోతాయి”
అన్నాడు.
ఈ
జవాబు
అక్బర్‌కు
చాల
నచ్చింది.
“ఏ
పాలు
శ్రేష్ఠమైనవి”
అని
రెండవ
ప్రశ్న
వేశాడు.
“తల్లిపాలచేతనే
బిడ్డ
సంరక్షింపబడుతున్నది,
పోషింపబడుతున్నది.
కనుక
తల్లిపాలే
చాల
శ్రేష్ఠమైనవి”
అన్నాడు
బీర్బల్.
అక్బర్
చాల
సంతోషించి
మూడవ
ప్రశ్న
అడిగాడు.
“ఈ
ప్రపంచంలో
ఏది
అత్యంత
మధురమైనది?”
బీర్బల్
చెప్పాడు:
“ప్రభూ!
మంచి
మాట
అత్యంత
మధురమైనది.
మంచి
మాట
చేత
ఎంతటి
ఆనందాన్నైనా
అందించవచ్చును,
ఎంతటి
ఉన్నత
స్థాయినైనా
చేరవచ్చును.
కాకులు
అరిస్తే
రాళ్ళు
విసురుతాము.
కోకిల
కూస్తే
దానినెంతో
గౌరవిస్తాము.
కాకి
మన
సొమ్మేమీ
కాజేయలేదు;
కోకిల
మనకేమీ
కిరీటం
తెచ్చిపెట్టలేదు.
నోరు
మంచిదైనప్పుడే
పేరు
మంచిదవుతుంది.
కనుక
మాట
చాల
ప్రధానమైనది.
మంచి
మాటయే
అన్నింటికన్న
మధురమైనది”
ఈ
సమాధానంతో
సంతృప్తి
చెంది
చివరిగా,
“ఏ
ఆకు
ఉత్తమమైనది?”
అని
నాల్గవ
ప్రశ్న
వేశాడు
అక్బర్.
బీర్బల్
“ప్రభూ!
తమలపాకు
చాల
శ్రేష్ఠమైనది.
ఎందుకంటే
వివాహాది
శుభకార్యాలన్నింటిలోను
తాంబూలాలను
పుచ్చుకోవడం
జరుగుతుంది.
అరిటాకునుగాని,
కొబ్బరాకునుగాని
అప్పటికప్పుడు
ఉపయోగించి
తరువాత
పారవేస్తాము.
కనుక
అవి
అంత
శ్రేష్ఠమైనవి
కావు.
ఆకులలో
తమలపాకే
శ్రేష్ఠమైనది”
అన్నాడు.
అక్బర్
చాల
ఆనందించి
అతనిపై
ప్రశంసల
వర్షం
కురిపించాడు.
సైన్యాధిపతి,
సలహాదారులు,
ఇతర
మంత్రులందరూ
సిగ్గుతో
తలలు
దించుకున్నారు.
3
▾
Meaning
Keep
సభ
అంతా
నిశ్శబ్దంగా
ఉండినది.
అప్పుడు
అక్బర్
బీర్బల్‌ను
మరొక
ప్రశ్న
వేశాడు.
“బీర్బల్!
నా
అరచేతిలో
వెంట్రుకలు
లేకపోవడానికి
కారణమేమిటి?”
అని
ప్రశ్నించాడు.
దీనికి
చక్కని
జవాబు
చెప్పాడు
బీర్బల్.
“ప్రభూ!
అందరికీ
ఇవ్వడమే
మీ
స్వభావం.
ఎప్పుడూ
ఇతరులకు
ఏదో
ఒకటి
ఇస్తూ
ఉండడంచేత
మీ
చేతిలోని
వెంట్రుకలన్నీ
ఊడిపోయాయి”
అన్నాడు.
“ఓహో,
అలా
అయితే
మరి
ఈ
సభలో
ఉన్నవారందరి
చేతుల్లోను
వెంట్రుకలు
లేవే!”
అన్నాడు
అక్బర్.
“ప్రభూ!
ఈ
సభలో
ఉన్నవారందరి
చేతులూ
మీరిస్తున్నవి
అందుకొంటున్న
చేతులే.
మీరు
నిరంతరము
ఇస్తూనే
ఉన్నారు.
మేము
అందుకొంటూనే
ఉన్నాము.
కనుక
మా
చేతుల్లోను
వెంట్రుకలు
లేకుండా
పోయాయి”
అన్నాడు.
“మరి
నేనిస్తున్నవి
తీసుకోలేని
వారి
చేతుల్లోను
వెంట్రుకలు
లేవే!”
అన్నాడు
అక్బర్.
“ప్రభూ!
మీరిచ్చినవి
అందుకొనే
ప్రాప్తిలేని
మూర్ఖులు,
దురదృష్టవంతులు
అందుకొనేవారిని
చూసి
అసూయతో
చేతులు
నులుపుకుంటూ
ఉంటారు.
అందుచేత
వారి
చేతుల్లోను
వెంట్రుకలు
ఊడిపోయాయి”
అన్నాడు.
సైన్యాధిపతికి,
సలహాదారులకు,
ఇతర
మంత్రులందరికీ
ఈ
సమాధానంతో
మంచి
దెబ్బ
కొట్టాడు
బీర్బల్.
అతని
తెలివితేటలకు,
వాక్చతురతకు
సభికులు
చాల
ఆశ్చర్యపోయారు.
అక్బర్
అతనిని
ఘనంగా
సత్కరించాడు.
బీర్బల్
చెప్పే
సమాధానాలు
సత్యం
కావచ్చు,
కాకపోవచ్చు.
కానీ
అవి
వినే
వారికి
అప్పటికప్పుడు
తృప్తి
కల్గించేవి,
ఆనందాన్ని
అందించేవి.
Previous
←
The wise and the envious
Next
The Foolish Pāduṣā
→