Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · The Foolish Pāduṣā
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Foolish Pāduṣā
20 March 1998, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
ఆధ్యాత్మికరంగంలో
చాల
ముందంజ
వేసిన
వారు
భారతీయులు.
దైవభక్తి,
దైవవిశ్వాసం
భారతీయులలో
చాల
అధికంగా
ఉంటుంది.
ఇల్లు
కట్టాలన్నా,
బావి
త్రవ్వాలన్నా,
పెండ్లి
చేయాలన్నా
ఏ
చిన్న
కార్యక్రమమునైనా
మొట్టమొదట
పూజతో
ప్రారంభిస్తారు.
పూర్వం
విజయనగర
సామ్రాజ్యాన్ని
శ్రీ
కృష్ణదేవరాయలు
పరిపాలిస్తున్న
రోజులలో
ఢిల్లీ
సింహాసనాన్ని
అధిష్టించిన
పాదుషాకు
భారతీయ
సంస్కృతీ
సాంప్రదాయములపట్ల
సరియైన
అవగాహన
లేదు.
“ఈ
భారతీయులు
భూమిని
పూజిస్తారు,
బావులను
పూజిస్తారు,
రాళ్ళను
పూజిస్తారు,
చెట్లను
పూజిస్తారు.
ఇదంతా
పెద్ద
మూర్ఖత్వం.
కనుక
వీళ్ళకెలాగైనా
గుణపాఠం
చెప్పాలి”
అని
సంకల్పించుకొని
అర్థం
లేని
ప్లాన్లు
వేస్తూ
వచ్చాడు.
తన
రాజ్యంలో
ఒక
పెద్ద
బావిని
త్రవ్వించి
దానికి
వివాహం
జరుపనున్నట్లు
ప్రకటించాడు.
శ్రీ
కృష్ణదేవరాయలుతో
సహా
భారతీయ
రాజులందరికీ
ఆహ్వాన
పత్రాలు
పంపించాడు.
ఏమని?
“నా
రాజ్యంలో
నేనొక
పెద్ద
బావిని
త్రవ్వించాను.
దానికి
వివాహం
చేయదల్చుకొన్నాను.
ఈ
వివాహానికి
మీ
రాజ్యంలో
ఉన్న
బావులన్నింటినీ
ఆహ్వానిస్తున్నాను.
కనుక
మీరు
మీ
బావులను
వెంటపెట్టుకొని
ఈ
వివాహానికి
విచ్చేయవలసిందిగా
కోరుతున్నాను”
అని
వ్రాశాడు.
సరే,
ఈ
ఆహ్వానపత్రం
శ్రీ
కృష్ణదేవరాయలకు
కూడా
చేరింది.
ఆయన
దీనిని
చదువుకొన్నాడు,
పాదుషా
తెలివితక్కువతనంతో
భారతీయ
సంస్కృతిని
అవహేళన
చేయడానికి
ప్రయత్నిస్తున్నట్లు
గుర్తించాడు.
దీనికి
సరియైన
సమాధానం
చెప్పి
పాదుషానోరు
మూయించాలని
సంకల్పించుకొని
తక్షణమే
ప్రధానమంత్రి
తిమ్మరుసును
పిలిపించాడు.
ఇరువురూ
కలసి
పాదుషాకు
ఏమి
జవాబిస్తే
బాగుంటుందని
అర్ధరాత్రి
రెండు
గంటల
వరకు
దీర్ఘంగా
ఆలోచించారు.
కానీ
వారికే
ఉపాయమూ
తట్టలేదు.
అప్పుడు
రాయలవారు,
“మహామంత్రీ!
తెనాలి
రామకృష్ణుడొక్కడే
దీనికి
సరియైన
సమాధానమివ్వగల
సమర్థుడు.
మీరొక్కసారి
అతని
ఇంటికి
వెళ్ళి
ప్రయత్నించండి”
అన్నాడు.
రాత్రి
రెండు
గంటలకు
తిమ్మరుసు
వెళ్ళి
రామకృష్ణుని
ఇంటి
తలుపు
తట్టాడు.
2
▾
Meaning
Keep
తలుపు
తెరిచే
సరికి
ఎదురుగా
తిమ్మరుసు
కనిపించడంతో
ఆశ్చర్యపోయాడు
రామకృష్ణుడు.
అయితే
ఇంత
రాత్రివేళ
మహామంత్రి
తన
ఇంటికి
వచ్చాడంటే
తప్పకుండా
మహారాజు
ఏదో
సమస్యలో
చిక్కుకొని
యుండవచ్చునని
గుర్తించాడు.
తక్షణమే
తిమ్మరుసును
లోనికి
ఆహ్వానించి
అతని
రాకకుగల
కారణమడిగాడు.
తిమ్మరుసు
జరిగిన
సంగతి
అంతా
వివరించి
పాదుషా
పంపిన
లేఖను
చూపించాడు.
దానిని
చదువుకొని
రామకృష్ణుడు
ఫక్కున
నవ్వాడు.
“ఇంతమాత్రానికి
మీరింత
శ్రమపడి
అర్ధరాత్రివేళ
మాఇంటికి
రావలెనా!
మీరేమీ
విచారించకండి.
దీనికి
తగిన
సమాధానం
రేపు
నేను
చెబుతాను”
అన్నాడు.
మరునాడు
ఉదయం
రామకృష్ణుడు
రాయలవారిని
కలుసుకొన్నాడు.
అతనిని
చూస్తూనే
రాయలవారికి
ప్రాణం
లేచివచ్చినట్లైనది.
“రామకృష్ణా!
పాదుషాకు
పంపవలసిన
సమాధానం
గూర్చి
ఆలోచించావా?”
అని
అడిగాడు.
“ఆఁ,
ఆలోచించాను
ప్రభూ!”
అన్నాడు.
రాయలు
చాల
ఆనందించి
ఏమని
వ్రాయాలో
చెప్పమన్నాడు.
రామకృష్ణుడు
ఈవిధంగా
వ్రాయమన్నాడు:
“ఢిల్లీ
పాదుషా
గారికి
నమస్కారములు.
మీరు
పంపిన
ఆహ్వానం
మాకు
చేరింది.
ఈ
విషయాన్ని
మా
రాజ్యంలో
ఉన్న
బావులన్నిటికీ
చెప్పి
వివాహానికి
రావలసిందని
కోరాము.
కానీ
అవి
మేము
పిలిస్తే
రావట.
మీ
రాజ్యంలో
వివాహం
చేసుకొంటున్న
ఆ
పెద్దబావియే
స్వయంగా
వచ్చి
తమను
ఆహ్వానించాలట.
కనుక
త్వరలో
మీ
పెద్దబావిని
మా
రాజ్యానికి
పంపే
ఏర్పాటు
చేయవలసిందిగా
కోరుతున్నాను.”
ఈ
జవాబు
చూసేసరికి
పాదుషా
బుఱ్ఱ
గిర్రున
తిరిగింది.
తక్షణమే
కొన్ని
అనివార్యకారణములవల్ల
వివాహం
రద్దైనదనీ,
కనుక
ఎవ్వరూ
రానవసరం
లేదనీ
కబురు
పెట్టాడు.
మరొక
పర్యాయం
పాదుషా
మహాభారతం
గురించి,
పాండవుల
శౌర్యపరాక్రమాల
గురించి
విని
ముగ్ధుడై
తన
చరిత్రను
కూడా
మరో
మహాభారతంగా
వ్రాయిస్తే
బాగుంటుందనుకొన్నాడు.
వెంటనే
ఒక
పండితుణ్ణి
పిలిపించి
తన
కోరికను
వెల్లడించాడు.
ఆ
పండితుడు
గొప్ప
తెలివితేటలు
గలవాడు.
పాదుషా
యొక్క
మూర్ఖత్వానికి
తనలో
తాను
నవ్వుకొని
పైకి
మాత్రం
వినయంగా,
మహారాజా!
మీరు
కోరినట్లు
తప్పకుండా
వ్రాస్తాను.
అయితే
మహాభారతంలో
కౌరవులు,
పాండవులు
ప్రధానమైనవారు.
మరి
మీ
చరిత్రలో
పాండవులెవరో,
కౌరవులెవరో
మీరే
తెలియజేస్తే
బాగుంటుంది”
అన్నాడు.
పాదుషా
“నాకు
అనేక
మంది
శత్రువులున్నారు.
3
▾
Meaning
Keep
వారందరినీ
కౌరవులుగా
తీసుకో,
పాండవాగ్రజుడైన
ధర్మజునితో
నన్ను
పోల్చు”
అన్నాడు.
దానికా
పండితుడు
“మహారాజా!
ధర్మరాజు
సోదరులైన
భీమార్జున
నకులసహదేవులు
చాల
గొప్పవారు.
భీముడు
భుజబలం,
బుద్ధిబలం
గలవాడు.
వట్టి
చేతులతో
పెద్ద
పెద్ద
వృక్షాలను
వేర్లతో
సహా
పెకిలించివేయగల
శక్తిగలవాడు.
అర్జునుడు
మహా
పరాక్రమశాలి;
అర్జున,
ఫల్గుణ,
పార్థ,
కిరీటి,
బీభత్స,
సవ్యసాచి,
ధనుంజయ
మున్నగు
అనేక
బిరుదులను
సాధించినవాడు.
ఇంక
నకుల
సహదేవులు
కూడా
గొప్ప
తెలివితేటలు
గలవారు,
మహావీరులు,
శూరులు.
అలాంటివారితో
సరితూగగల
సోదరులు
నీకుండాలి
కదా”
అన్నాడు.
ఈ
మాటలు
విని
పాదుషా
కొంతసేపు
ఆలోచించి
‘కింగ్‌కాంగ్’
మాదిరి
ఉండే
తన
సైన్యాధిపతిని
చూపించి
అతనిని
భీమునిగా
తీసుకొమ్మన్నాడు.
తన
ప్రధానమంత్రిని
అర్జునునిగాను,
మరో
ఇద్దరు
మంత్రులను
నకుల
సహదేవులుగా
తీసుకొమ్మన్నాడు.
పండితుడు
“మహారాజా!
ఇంత
వరకు
బాగానే
ఉంది.
అయితే
మహాభారత
యుద్ధం
జరగడానికి
ప్రధాన
కారణం
ద్రౌపది.
ఆమె
పాండవులైదుమందికీ
భార్య.
అట్టి
పాంచాలిగా
ఎవరిని
పోల్చుకోవాలో
తెలియజేస్తే
ఇంక
వ్రాయడం
ప్రారంభిస్తాను”
అన్నాడు.
యోచనలో
పడ్డాడు
పాదుషా.
తన
పట్టపు
రాణినే
ద్రౌపదిగా
తీసుకొమ్మని
చెబుదామంటే
ఆమె
మిగిలిన
నల్గురికీ
భార్య
కావలసివస్తుంది
కదా!
దానికి
అతని
మనసొప్పలేదు.
అప్పుడు
తన
పొరపాటును
గుర్తించి
ఆ
ఆలోచనకు
స్వస్తి
చెప్పాడు.
ఈవిధంగా
భారతీయ
పండితులు
సందర్భోచితమైన
సమాధానాలతో
విమర్శకుల
నోళ్ళు
మూయించిన
సంఘటనలు
చరిత్రలో
కోకొల్లలు.
ప్రాచీన
కాలంలో
భారతీయులు
తమ
సంస్కృతీ
సాంప్రదాయములపట్ల
అచంచల
గౌరవ
విశ్వాసములను
కలిగియుండేవారు.
కానీ
ఈనాడు
భారతీయులే
భారతీయ
సంస్కృతిని
అలక్ష్యం
చేస్తున్నారు.
ప్రతి
విద్యార్థికి
భారతీయ
వేదాంతము
తల్లివంటిది,
భారతీయ
సంస్కృతి
తండ్రివంటిది.
మనిషి
పుట్టిన
తరువాత
మొట్టమొదట
తల్లిని,
తదుపరి
తండ్రిని
గుర్తిస్తాడు.
అదేవిధంగా
ప్రతి
విద్యార్థి
మొట్టమొదట
భారతీయ
వేదాంతమును,
భారతీయ
సంస్కృతిని
గుర్తించాలి.
ఈ
‘తల్లిదండ్రుల’
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించి
వర్తించినప్పుడు
ఇంకేవిధమైన
పొరపాటూ
జరగదు.
భారతదేశం
చాల
విశాలమైనది,
అనంతమైన
జీవనదులతో
కూడినది.
సాగు
చేయాలంటే
కావలసినంత
భూమి
ఉన్నది.
భారతదేశంలో
ఉన్న
కులమతములు,
వేషభాషలు,
ఆచారపద్ధతులు
ఏదేశంలోను
లేవు.
4
▾
Meaning
Keep
రంగురంగుల
పుష్పములతో
వికసించిన
బృందావనం
వంటిది
మన
భారతదేశం.
ఈ
దేశంలో
విద్యకుగాని,
ధనమునకుగాని,
మేధాశక్తికిగాని
ఏ
మాత్రము
కొదువలేదు.
కానీ
ఎన్ని
ఉండీ
ఏమి
ప్రయోజనం?
ఈనాడు
యూనిటీ
లేకుండా
పోయింది.
యూనిటీ
లేనప్పుడు
ప్యూరిటీ
రాదు,
ప్యూరిటీ
లేనప్పుడు
డివినిటీ
ఉండదు.
ఈనాడు
ప్రతి
ఒక్కరి
హృదయంలో
యూనిటీ
(ఐక్యత)
బదులు
ఎనిమిటీ
(ద్వేషభావం)
చోటు
చేసుకొన్నది.
కనుకనే
దేశం
ఇన్ని
అవస్థలకు
గురి
అవుతున్నది.
Previous
←
Akbar and Bīrbal
Next
God fills every place
→