Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · God's Name in the Heart, Service to Society with the Hands
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God's Name in the Heart, Service to Society with the Hands
5 March 2000, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
చందనపు
చెక్కను
అరగదీసిన
కొలది
అది
సుగంధమునే
అందిస్తుంది.
చెఱకును
నమిలిన
కొలది
అది
మధురమైన
రసమునే
అందిస్తుంది.
బంగారమును
అగ్నిలో
కాల్చిన
కొలది
అది
మరింత
కాంతివంతంగా
ప్రకాశిస్తుంది.
అదేవిధంగా,
సజ్జనుడైన
మానవుడు
తనకు
ఎన్ని
కష్టములు
సంభవించినప్పటికీ
పరమశాంతంగా,
ఆనందంగా
గొప్ప
మనస్సుతో
జీవితాన్ని
గడుపుతుంటాడు.
కష్టనష్టములలోకూడా
మంచితనాన్ని
కాపాడుకోవటమే
నిజమైన
మానవత్వం.
ప్రేమస్వరూపులారా!
సూర్యుడు
ప్రపంచమంతా
వెలుతురును
వెదజల్లుతున్నాడు.
ఆ
వెలుతురునందు
అనేకమంది
అనేక
రకములైన
కర్మలను
ఆచరిస్తున్నారు.
అనేక
కష్టసుఖములను
అనుభవిస్తున్నారు.
కాని
ఎవరెన్ని
కర్మల
నాచరించినప్పటికీ,
ఎవరే
కష్టసుఖములను
అనుభవించినప్పటికీ
వాటితో
సూర్యునికి
ఏమాత్రము
సంబంధం
లేదు.
అదేవిధంగా
మానవుడు
అనుభవించే
కష్టసుఖములు
శరీరేంద్రియ
మనోబుద్ధులకు
సంబంధించినవే
గాని,
వాటితో
ఆత్మచైతన్యమునకు
ఏమాత్రము
సంబంధం
లేదు.
ఈ
లోకంలో
అనేకమంది
భగవంతుణ్ణి
అన్వేషిస్తున్నామని
అంటున్నారు.
కాని
సర్వత్ర
ఉన్నది
భగవంతుడొక్కడే.
అట్టి
భగవంతుణ్ణి
వెతకడమెందుకు?
కనుక,
భక్తుడు
భగవంతుని
వెదకనక్కర్లేదు.
భగవంతుడే
నిజమైన
భక్తుని
కొఱకు
వెదకుతున్నాడు.
వేడిగా
ఉన్న
ఇనుపగుండును
చేతితో
ముట్టుకున్నప్పుడు
“చేయి
కాలింది”
అంటావు.
కాని
కాల్చినది
గుండు
కాదు,
గుండులో
దాగియున్న
అగ్నియే
నీ
చేతిని
కాల్చింది.
అదేవిధంగా
ఈ
ప్రపంచమొక
పెద్ద
ఇనుప
గుండు
వంటిది.
దీనిలోపల,
వెలుపల
సర్వత్ర
దైవశక్తియే
ఆవరించియున్నది.
కాని
ఆశక్తిని
మీరు
గుర్తించుకోలేక
ఈ
ప్రపంచము
మీకు
అనేక
కష్టసుఖములను
కలుగజేస్తున్నదని
భావిస్తుంటారు.
కాని
మీరు
అనుభవించే
కష్టసుఖములకు
కారణం
ఈ
ప్రపంచం
కాదు.
ఇది
కేవలం
ఒక
‘ఇనుప
గుండు’
మాత్రమే.
ఇందునుండి
వచ్చే
కష్టసుఖములనే
ప్రతిబింబములు
ఆత్మచైతన్యంయొక్క
ప్రభావములే.
కనుక,
ఏది
జరిగినా
అది
ఆత్మయొక్క
ప్రతిబింబమేనని,
ఆత్మయొక్క
ప్రకాశమేనని,
ఆత్మయొక్క
ప్రభావమేనని,
ఆత్మ
యొక్క
ప్రసాదమేనని
భావించాలి.
2
▾
Meaning
Keep
ఈనాటి
మానవునికి
లోపల
ఒకటి,
బయట
మరొకటి.
ఏడుపు
వస్తే
నవ్వుతాడు.
నవ్వు
వస్తే
ఏడుస్తాడు!
ఆకారం
మానవాకారమేగాని,
బుద్ధి
వానరబుద్ధి!
ఇలాంటి
కుటిలబుద్ధులను,
కపటనాటకాలను
వీడి
మానవుడు
మానవుడుగా
జీవించాలని
భగవంతుడు
ఆశిస్తుంటాడు.
మానవుడు
తనయందు
సహజంగా
ఉన్న
పవిత్రభావములనే
ప్రకటించాలిగాని,
కల్పితమైన,
కృత్రిమమైన,
గుణాలను
ప్రకటించకూడదు.
కాని
మానవుడు
నైతికంగా
దిగజారిపోతున్నాడు.
భౌతికంగా
పతనమైపోతున్నాడు.
ధనం
పోతే
తిరిగి
సంపాదించుకోవచ్చు.
ఆరోగ్యం
క్షీణిస్తే
తిరిగి
అభివృద్ధి
గావించుకోవచ్చు;
కాని
కాలం
పోతే
తిరిగి
రాదు.
కనుక
కాలాన్ని
సద్వినియోగపర్చుకోవాలి.
ధనం
ఖర్చు
పెట్టినప్పుడు
మాత్రమే
ఖర్చవుతుంది.
కాని
ఆయుష్షు
ఖర్చుపెట్టినా
పెట్టకపోయినా
క్షీణించిపోతూనే
ఉంటుంది.
మానవుని
శిరస్సుపైన
కాలము
కఠినమైన
కరవాలమును
త్రిప్పుతూనే
ఉన్నది.
ఆ
కరవాలమునకు
ఎర
కాకుండా
తాను
అతి
జాగ్రత్తగా
వ్యవహరించాలి.
కాలమును
సద్వినియోగం
గావించుకునే
నిమిత్తమై
సత్కర్మల
నాచరించాలి;
సద్భావములను
అభివృద్ధి
పర్చుకోవాలి.
బ్రహ్మకు
మొట్టమొదటి
పేరు
‘నేను’
ఈ
సృష్టికి
భగవత్సంకల్పమే
మూలాధారం.
మానవుడు
భగవత్సంకల్పము
నుండియే
ఆవిర్భవించాడు.
కాబట్టి
తాను
భగవద్భావములనే
కలిగియుండాలి.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యాది
దుర్గుణాలు
ఆహారవిహారముల
నుండి
ఆవిర్భవించినవే
గాని,
మానవునికి
సహజమైనవి
కావు.
మీరు
‘నేను’
అనే
పదాన్ని
ఉచ్చరిస్తున్నారు
కదా!
ఈ
‘నేను’
అనేదే
మూలాధారమైన
మంత్రము.
‘నేను’
అనే
మంత్రము
పుట్టిన
తరువాతనే
మిగిలిన
మంత్రములన్నీ
ఆవిర్భవించాయి.
వేదం
“అహం
బ్రహ్మాస్మి”
అన్నది.
అనగా
‘నేను’
అనేదే
బ్రహ్మ.
బ్రహ్మకు
మొట్టమొదటి
పేరు
‘నేను’
కాని,
ఈ
పదముయొక్క
సరియైన
అర్థాన్ని
మీరు
గుర్తించుకోలేక
దీనిని
దేహభావంతో
ఉచ్చరించి
దుర్వినియోగపర్చుతున్నారు.
ప్రేమస్వరూపులారా!
నిత్యజీవితంలో
మీరు
సత్యమైన
మార్గాన్ని
అనుసరించాలి.
అట్లు
చేయకుండా
జపము,
ధ్యానము
మున్నగు
సాధనల
నెన్ని
చేసినా
ప్రయోజనం
లేదు.
3
▾
Meaning
Keep
ఈ
సాధనలతో
పాటు
మీ
మనస్సును
పరిశుద్ధపర్చుకోవాలి.
హృదయంలో
నున్నది
మాటలో
చెప్పాలి;
మాటలో
చెప్పింది
ఆచరణలో
చూపించాలి.
ఇదియే
నిజమైన
మానవత్వం.
ఇట్టి
త్రికరణశుద్ధి
కల్గిన
మానవుని
కోసమే
భగవంతుడు
అన్వేషణ
సల్పుతున్నాడు.
బుద్ధి
పరిశుద్ధమైన
అద్దమువంటిది
మానవుడు
తనను
తాను
గుర్తించుకునే
నిమిత్తమై
భగవంతుడు
అతనికి
పవిత్రమైన
బుద్ధిని
అనుగ్రహించాడు.
బుద్ధి
పరిశుద్ధమైన
అద్దము
వంటిది.
అద్దమునకు
ఒకవైపున
రసాయనం
పూయబడినప్పుడు
దానిలో
మీరు
మీ
ప్రతిబింబమును
చూసుకోవచ్చు.
రసాయనము
పూయని
అద్దమును
ఎదురుగా
పెట్టుకుంటే
దాని
వెనుక
భాగమున
ఉన్నదేదో
కనిపిస్తుందిగాని,
మీకు
మీరు
కనిపించరు.
అదేవిధంగా,
మీరు
స్వస్వరూపాన్ని
గుర్తించాలంటే
మీ
బుద్ధి
అనే
అద్దమునకు
ఒకవైపున
ప్రేమ
అనే
రసాయనమును
పూయాలి.
అయితే,
మీరు
బుద్ధి
అనే
అద్దమును
మాత్రం
ఎదురుగా
పెట్టుకున్నారు
గాని,
దానికి
ప్రేమ
అనే
రసాయనమును
పూయటం
లేదు.
కనుకనే
మీరు
స్వస్వరూపాన్ని
దర్శించలేకపోతున్నారు.
రసాయనం
పూయని
అద్దంలో
మీకు
ఇతరుల
ముఖం
కనిపిస్తుందిగాని,
మీ
ముఖం
ఎలా
కనిపిస్తుంది!
కనుకనే
ఈనాడు
ప్రతి
ఒక్కరూ
“ఎవరండీ
మీరు?
ఎక్కడి
నుండి
వచ్చారు?”
అని
ఎదుటివారిని
ప్రశ్నిస్తున్నారే
గాని,
“నేనెవరు?
ఎక్కడి
నుండి
వచ్చాను?”
అని
తనను
తాను
ప్రశ్నించుకోవటం
లేదు.
మొట్టమొదట
‘నీవెవరు?’
అనే
ప్రశ్నను
వదలిపెట్టి
‘నేనెవరు?’
అనే
విచారణను
ప్రారంభించాలి.
ఇతరుల
దోషాలను
చూడటం
మానివేసి
మీలోని
దోషాలను
గుర్తించుకోవాలి.
భగవంతుడు
మీకు
బుద్ధిని
అనుగ్రహించినది
మిమ్మల్ని
మీరు
చూసుకోవటానికే
గాని,
పరులయొక్క
దోషాలను
చూడటానికి
కాదు.
ఈనాడు
చిన్న
పిల్లవాడు
మొదలుకొని
పెద్ద
మనిషి
వరకు
ప్రతి
ఒక్కరూ
తమ
బుద్ధిని
ప్రాపంచిక
విషయాలలో
ప్రవేశపెడుతున్నారు.
కనుకనే
తమ
తత్త్వాన్ని
తాము
మరచిపోతున్నారు.
మానవుడు
సముద్రగర్భంలోకి
ప్రవేశిస్తున్నాడు;
ఆకాశంలోకి
ప్రవేశిస్తున్నాడు.
కాని
తనలోకి
తాను
ప్రవేశించటం
లేదు.
4
▾
Meaning
Keep
లక్షల
మైళ్ళు
అంతరిక్షయానం
చేస్తున్నాడు
గాని,
అరయించి
తన
హృదయాంతరాళంలోకి
ప్రవేశించటం
లేదు.
స్వార్థ,
స్వప్రయోజనములలో
మునిగి
స్వస్వరూపాన్ని
దర్శించడానికి
ప్రయత్నించటం
లేదు.
స్వస్వరూపాన్ని
దర్శించటమే
ఆధ్యాత్మికంయొక్క
ప్రథమ
లక్ష్యము.
కేవలం
ఆధ్యాత్మికమునందే
కాదు,
లౌకిక
భౌతిక
వ్యావహారికములందుకూడా
మానవుడు
మొట్టమొదట
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించాలి.
ఈనాటి
మానవుడు
ఇతరులలోని
దోషాలను
చూడటానికి
ఉబలాటపడుతున్నాడుగాని,
తనలోని
దోషాలను
గుర్తించుకోవటానికి
ప్రయత్నించటం
లేదు.
తన
దోషాలను
గుర్తించి
సరిదిద్దుకున్నప్పుడే
మానవుడు
బాగుపడతాడు.
అట్టివాడే
నిజమైన
మానవునిగా
ఆదర్శమూర్తిగా
రూపొందుతాడు.
ప్రేమస్వరూపులారా!
మీరు
ప్రాపంచికమైన
వాటిని
అన్వేషించడం
మాని
మిమ్మల్ని
మీరు
అన్వేషించటానికి
కృషి
చేయండి;
‘నేను
ఎవరు?’
అని
మిమ్మల్ని
మీరు
ప్రశ్నించుకోండి.
దేహాభిమానంవల్లనే
మీకు
అనేక
ఇక్కట్లు
కలుగుతున్నాయి.
దేహాభిమానం
పెరిగేకొద్దీ
ఆత్మాభిమానం
తరిగిపోతున్నది;
ఆశలు,
దురాశలు
పెరిగిపోతున్నాయి.
ప్రాపంచిక
విషయాలు
బాహ్యదృష్టికి
సంబంధించినవి.
అవి
తాత్కాలికమైన
ఆనందాన్ని
మాత్రమే
అందిస్తాయి
గాని
నిత్యసత్యమైన
ఆనందాన్ని
చేకూర్చలేవు.
కాని,
మీరు
బాహ్యదృష్టిచేతనే
ఆకర్షింపబడుతున్నారు.
బాహ్యదృష్టి
కల్గినది,
పశువు.
కనుక
మీరు
అంతర్దృష్టిని
అభివృద్ధి
పర్చుకోవాలి,
అంతర్భావాన్ని
పరిశుద్ధపర్చుకోవాలి.
నిర్మల,
నిశ్చల,
నిస్వార్థ
బుద్ధిని,
ఆత్మవికాసాన్ని
అభివృద్ధి
పర్చుకోవాలి.
ఆత్మవిశ్వాసమే
Foundation
(పునాది);
ఆత్మసంతృప్తియే
Walls
(గోడలు);
స్వార్థ
త్యాగమే
Roof
(పైకప్పు);
ఆత్మసాక్షాత్కారమే
Life
(జీవితం).
మీరు
ఈ
విశాలమైన
ప్రపంచంలో
జన్మించారు;
విశాలమైన
ప్రపంచంలో
జీవిస్తున్నారు.
కనుక,
మీ
భావములుకూడా
విశాలమైనవిగానే
ఉండాలి.
మానవ
సోదరత్వాన్ని,
దైవపితృత్వాన్ని
విశ్వసించాలి.
కృష్ణుడు
“మమైవాంశో
జీవలోకే
జీవభూత
స్సనాతనః”
అన్నాడు.
అందరూ
భగవంతుని
అంశములే!
ఈ
సత్యాన్ని
మీరు
Understand
(అవగాహన)
చేసుకోండి.
అప్పుడు
Adjustment
(సర్దుబాటు)
సులభం
అవుతుంది.
అనగా,
మీకు
ఎవరిపట్లను
ద్వేషముగాని,
అసూయగాని
కలుగవు.
5
▾
Meaning
Keep
మొట్టమొదట
మీరు
అభివృద్ధిచేసుకోవలసింది
ప్రేమతత్త్వము.
ప్రేమయే
దైవం,
దైవమే
ప్రేమ.
దైవం
ఎక్కడున్నాడని
ఎవరైనా
ప్రశ్నిస్తే,
సర్వులయందు
ఉన్నాడని
చెప్పండి.
ఏవిధంగా
ఉన్నాడని
అడిగితే,
ప్రేమరూపంగా
ఉన్నాడని
చెప్పండి.
కేవలం
ప్రేమ,
ప్రేమ,
ప్రేమ
అని
నోటితో
చెపితే
చాలదు;
దానిని
ఆచరణలో
నిరూపించాలి.
అప్పుడే
మీరు
నిజమైన
మానవులనిపించుకుంటారు.
ఏది
నిజమైన
సేవ?
విద్యార్థులారా!
మీరు
యువకులు.
మీయందు
ఎంతో
శక్తి
ఉన్నది.
భూమియందు
ఎన్ని
శక్తులున్నవో
ఆ
శక్తులన్నీ
మీయందు
కూడా
ఉన్నవి.
ఈ
సత్యాన్ని
విశ్వసించి,
దేశంలో
ఎక్కడ
ఏ
కష్టము
సంభవించినా
అక్కడికి
వెళ్ళి
తగిన
సహాయం
చేయండి.
వారెవరో,
నేనెవరో
అనే
భేదభావమునకు
చోటివ్వకండి.
అందరూ
నావారే
అనే
ఏకత్వ
భావనతో
సమాజసేవలో
పాల్గొనండి.
కన్ను,
ముక్కు,
చెవి,
నోరు,
చేతులు,
కాళ్ళు
ఇవన్నీ
దేహానికి
అంగములు.
దేహం
సమాజానికి
అంగము.
సమాజం
మానవత్వానికి
అంగము.
మానవత్వం
ప్రకృతికి
అంగము.
కాబట్టి,
దేహాన్ని
సమాజసేవలో
ప్రవేశపెట్టండి.
ఎవరికి
ఏది
అవసరమో,
ఏది
మంచిదో
గుర్తించి
వారికి
తగిన
రీతిగా
సహాయం
చేయండి.
అదియే
నిజమైన
సమాజసేవ.
ఈనాడు
అనేకమంది
సమాజసేవ
పేరుతో
గ్రామాలలో
ప్రవేశించి
వీథులను
ఊడ్చి,
దేవాలయాలకు
రంగులు
వేసి
అంతటితోనే
తృప్తిపడుతున్నారు.
అది
సేవయే
కాదు.
అది
మీ
కర్తవ్యం.
నిజమైన
సేవ
ఏమిటి?
గ్రామ
ప్రజల
అవసరాలేమిటో,
వారు
పడుతున్న
ఇబ్బందులేమిటో
విచారణ
చేసి,
వారి
అవసరాలను
తీర్చటానికి,
వారి
ఇబ్బందులను
తొలగించడానికి
మీ
శక్తికొలది
పాటుపడాలి.
రాబోయేది
వేసవి
కాలము.
అనేక
పల్లెల్లో
త్రాగటానికి
నీరుండదు.
అలాంటి
చోట్ల
ఒక
బోర్వెల్
వేయాలి;
లేక
ఇతర
ప్రాంతాలనుండియైనా
నీరు
తీసుకువచ్చి
అందించాలి.
ఈవిధంగా
ప్రజలకు
ఉపయోగకరమైన,
అవసరమైన
కార్యాలను
చేపట్టటమే
నిజమైన
సేవ
అని
చెప్పవచ్చును.
అయితే,
మీరు
ఎవరికో
సేవ
చేస్తున్నామని
భావిస్తే
మీలో
అహంకారం
పెరిగే
అవకాశం
ఉంది.
నావారికి
నేను
చేస్తున్నాను
అని
భావించాలి.
అందరిదీ
ఒకే
కులమే
(మానవ
కులం),
అందరిదీ
ఒకే
మతమే
(ప్రేమమతం),
అందరిదీ
ఒకే
భాషయే
(హృదయభాష)
అనే
ఏకత్వ
భావనతో
సేవలో
పాల్గొనాలి.
అప్పుడే
అది
నిజమైన
సేవగా
రూపొందుతుంది.
6
▾
Meaning
Keep
విద్యార్థులారా!
మీరు
చదివిన
చదువులను
సమాజసేవలో
ప్రవేశపెట్టి
సార్థకం
గావించుకోండి.
మీరు
విద్య
నేర్వడం,
విదేశాలకు
పోయి
ధనము
నార్జించడానికి
కాదు.
ఈనాడు
అనేకమంది
విద్యార్థులు
ఇంజనీరింగో,
లేక
డాక్టరు
డిగ్రీనో
పాసైనారంటే
మొట్టమొదట
విదేశాలకు
వెళ్ళడానికి
ప్రయత్నం
చేస్తారు.
ఇదే
మన
భారతీయులలో
ఉన్న
పెద్ద
బలహీనత.
మొట్టమొదట
మీ
దేశంలో
మీ
గ్రామంలో
ఉన్న
రోగులకు
సేవ
చేయండి.
మీ
గ్రామాన్నే
మీరు
సంరక్షించుకోలేకపోతే
విదేశాలకు
వెళ్ళి
ఏమి
సాధిస్తారు?
ధనంకోసం
పాటుపడకండి,
సద్గుణాలను
పోషించుకోండి.
రాముడు
“జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి”
అన్నాడు.
అతడు
పితృవాక్య
పరిపాలన
నిమిత్తం
రాజ్యాన్ని
కూడా
త్యజించి
14
సంవత్సరాలు
అరణ్యవాసం
చేశాడు.
మీరు
రామనామాన్ని
స్మరిస్తున్నారు
కాని
రాముని
ఆదర్శాల
నేమైనా
అనుసరిస్తున్నారా?
ఆదర్శాలే
మనకు
ముఖ్యం.
భోగంవలన
రోగం,
త్యాగం
వలన
యోగం
విద్యార్థులారా!
మీరెంతో
తెలివితేటలు
గలవారు;
గొప్ప
విద్యావంతులు.
కాని,
మీలో
స్వార్థం
ప్రవేశించటంచేత
మీ
విద్య,
తెలివితేటలు
వ్యర్థమైపోతున్నాయి.
కడివెడు
పాలలో
అణుమాత్రం
విషం
కలిసినా
ఆ
పాలన్నీ
విషంగా
మారిపోతాయి.
అదేవిధంగా,
మీరెంత
గొప్ప
విద్యావంతులైనప్పటికీ
మీలో
స్వార్థానికి
చోటిచ్చారంటే,
మీ
విద్య
అంతా
నిరర్థకమైపోతుంది.
కాబట్టి
మీలో
ఎలాంటి
దుర్గుణాలకూ
చోటివ్వకుండా
ప్రేమతో
సమాజసేవలో
పాల్గొనండి.
మీ
శక్తి
కొలది
ఏ
చిన్న
సేవ
చేసినా
చాలు.
“నేను
గొప్ప
సేవ
చేయలేకపోతినే”
అని
నిరాశకు
గురి
కావద్దు.
పల్లెపల్లెలో
ప్రవేశించి
అక్కడి
ప్రజలకు
ఏది
అవసరమో
గుర్తించండి.
ఒకవేళ
వారి
అవసరం
తీర్చడానికి
మీ
దగ్గర
తగినంత
ధనం
లేకపోతే,
వారికి
సేవ
చేయటానికి
మీశక్తి
చాలకపోతే
అందరూ
కలిసి
మెలసి
పనిచేయండి;
విద్యార్థులందరూ
ఏకం
కండి.
ఐకమత్యంచేత
మీరు
సాధించలేనిది
జగత్తులో
ఏదీ
లేదు.
భారతీయులు
స్వాతంత్ర్యమును
సాధించారు
గాని,
ఐకమత్యమును
కోల్పోయారు.
కనుకనే
దేశం
అనేక
కష్టాలకు
గురి
అవుతోంది.
మొట్టమొదట
ఐకమత్యాన్ని
సాధించండి.
అప్పుడే
మీరు
చదివిన
చదువు
సార్థకమౌతుంది.
మీతల్లి
కురూపియని
ఆమెను
త్యజించి
అందంగా
ఉన్న
పరాయి
స్త్రీని
తల్లియని
పిలవటం
ఎలాంటిదో
ధన
వ్యామోహంతో
మాతృదేశాన్ని
విస్మరించి
విదేశాలకు
వెళ్ళటం
అలాంటిదే.
7
▾
Meaning
Keep
ఈనాడు
అనేకమంది
విద్యార్థులు
భారతదేశం
బీదదేశమని
భావిస్తున్నారు.
ఇదే
మన
పిల్లల్లో
ఉన్న
పెద్ద
బలహీనత.
భారతదేశం
బీదది
కాదు.
భారతదేశంలో
లేనిది
ఏ
దేశంలోను
లేదు.
సమస్త
శక్తులూ
భారతదేశమునందే
ఉంటున్నాయి.
ఇది
త్యాగభూమి,
ఇది
యోగభూమి,
ఇది
కర్మభూమి.
ఇలాంటి
భూమిని
కొందరు
భోగభూమిగా
మార్చడానికి
ప్రయత్నం
చేస్తున్నారు.
మనకు
భోగమే
వద్దు.
భోగం
రోగానికి
దారి
తీస్తుంది.
త్యాగమే
యోగాన్ని
చేకూర్చుతుంది.
కాబట్టి,
త్యాగభావంతో
మీ
సర్వస్వాన్ని
సమాజానికి
అర్పితం
చేయండి.
నడుం
వంచి
పని
చేయండి.
చేతి
నిండుకు
పని
చేయాలి,
మనస్సు
నిండుకు
మంచి
భావములుండాలి.
అలాంటివాడే
నిజమైన
మానవుడు.
అట్టి
మానవునికోసమే
భగవంతుడు
వెదకుతున్నాడు.
భగవంతునికోసం
మానవుడు
వెదకనక్కర్లేదు.
ఎందుకంటే
భగవంతుడు
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
కాబట్టి
మీరు
దైవాన్వేషణకోసం
ప్రయత్నించకండి.
మంచి
మనస్సుకోసం
ప్రయత్నించండి.
మీరు
మంచివారు
కావాలిగానీ,
గొప్పవారు
కానక్కర్లేదు.
గొప్పవారివల్ల
లోకానికి
జరుగుతున్న
ఉపకారమేమిటి?
ఏమీ
లేదు.
ఉపకారానికి
బదులు
ఎక్కువగా
అపకారమే
జరుగుతున్నది.
విద్యార్థులారా!
ఉన్న
సత్యాన్ని
చెపుతున్నాను.
మీరు
మరోలా
భావించకూడదు.
ఈనాడు
దేశం
అనుభవిస్తున్న
కష్టనష్టములకు
మూలకారణం
ఎవరు?
విద్యావంతులే!
ఎందుకంటే
వారు
తమ
విద్యను
దేశశ్రేయస్సుకోసం
ఉపయోగించకుండా
కేవలం
స్వార్థంకోసం
ఉపయోగపెడుతున్నారు.
మన
భారతదేశంలో
ఎంతోమంది
విద్యావంతులున్నారు;
ఎంతో
గొప్ప
మేధావులున్నారు.
కాని
వారిలో
పరోపకార
బుద్ధి
లేకపోవటంచేత
దేశం
దురవస్థలపాలవుతున్నది.
వారందరూ
ఏకమై
ప్రజాక్షేమంకోసం
పాటుపడితే
దేశం
ఎంత
బాగుపడుతుంది!
కాని,
వారు
తమ
మేధాశక్తిని
విదేశాలలో
ఉపయోగపెడుతున్నారు.
మనదేశంలో
పదివేల
రూపాయల
జీతం
తీసుకొని
కనీసం
పది
రూపాయల
పనికూడా
చేయకుండా
దేశద్రోహానికి
పాల్పడుతున్నారు.
కాని
విదేశాలకు
పోతే
అక్కడ
రాత్రింబవళ్లు
పని
చేస్తారు.
అక్కడ
చేసే
పని
స్వదేశంలో
ఎందుకు
చేయకూడదు?
మొట్టమొదట
స్వదేశంపై
ప్రేమను
ప్రకటించాలి.
8
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
భక్తి
అంటే
ఏదో
దేవుని
పటం
పెట్టి
పూజ
చేయటం
కాదు.
పూజలు,
వ్రతములు
మొదలైనవన్నీ
కేవలం
సత్కర్మలుగా
భావించవచ్చు.
ముఖ్యంగా
సద్భావములను
పెంచుకోవాలి.
సద్భావములు
లేకుండా
సత్కర్మలు
చేసి
ప్రయోజనం
లేదు.
రాత్రంతా
భజన
చేశారు;
చాల
ఆనందంగా
చేశారు.
అయితే,
శ్రవణానందముతో
పాటు
హృదయానందముకూడా
చేరాలి.
బాహ్యంగా
మాత్రం
పాజిటివ్
పనులు
చేస్తూ
లోపల
నెగెటివ్
భావాలు
నింపుకుంటే
ఏమి
ప్రయోజనం?
మొట్టమొదట
నెగెటివ్
భావాలను
నెట్టివేసి
పాజిటివ్
భావాలను
నింపుకోవాలి.
అప్పుడే
మీరు
బాగుపడతారు;
మీ
గృహం
బాగుపడుతుంది.
ప్రపంచమంతా
బాగుపడుతుంది.
ఈనాడు
చాలమంది
విద్యావంతులు
తగిన
ఉద్యోగాలు
చిక్కక
చాల
అవస్థపడుతున్నారు?
తమకు
ఉద్యోగాలు
ఇవ్వటం
లేదని
ప్రభుత్వంపై
నిందలు
వేస్తున్నారు.
ప్రభుత్వం
మాత్రం
ఎంతమందికని
ఉద్యోగాలు
ఇవ్వగలదు?
ఇంతేకాదు.
ఉద్యోగస్థులుకూడా
తమ
జీతాలను
పెంచాలని
ప్రభుత్వంపై
వత్తిడి
తెస్తున్నారు.
మన
విద్యా
సంస్థలలో
ఫీజులు
లేవుగాని,
బయటి
విద్యా
సంస్థలలో
ఫీజులు
పెంచినప్పుడల్లా
విద్యార్థులు
సమ్మె
చేస్తుంటారు;
టీచర్లను
చూద్దామా
అంటే,
జీతాలు
పెంచాలని
వాళ్ళుకూడా
ప్రభుత్వంపై
వత్తిడి
తెస్తుంటారు.
ఈ
డబ్బంతా
ప్రభుత్వం
మాత్రం
ఎక్కడినుండి
తేగలదు?
ప్రజలనుండి
సేకరించినదే
ప్రజలకు
అందిస్తుంది
కదా!
కనుక
ప్రజలపై
ట్యాక్సులు
వేస్తే
ప్రజలను
పీడిస్తోందని
ప్రభుత్వాన్ని
నిందిస్తారు.
ట్యాక్సులు
వేయకపోతే
ఉద్యోగుల
జీతాలు
పెంచటానికిగాని,
విద్యార్థుల
ఫీజులు
తగ్గించటానికిగాని
వీలుకాదు.
కనుక,
ప్రభుత్వ
నిర్ణయాలను
విశాల
భావంతో
అర్థం
చేసుకోవాలి.
ప్రభుత్వంపైన
వత్తిడి
తేవటం,
ప్రభుత్వాన్ని
నిందించటం
చాల
తప్పు.
ఎవ్వరినీ
నిందించకూడదు.
ప్రేమస్వరూపులారా!
మీ
హృదయాన్ని
కడిగి
పరిశుద్ధపర్చుకొని,
పవిత్ర
భావములతో
నింపుకొని
సత్కర్మల
నాచరించండి.
హృదయంలో
భగవన్నామాన్ని
నింపుకోండి;
చేతులతో
సేవ
చేయండి.
“దిల్
మే
రామ్,
హాత్
మే
కామ్”
-
ఇదే
సరియైన
మార్గము.
అప్పుడు
మీకు
దైవమే
సహాయం
చేస్తాడు.
పూలు,
సూది,
దారముంది.
పుష్పమాల
తానగునా?
కూర్చేవాడొకడుండాలి
కదా!
ప్రమిద,
నూనె,
వత్తి
కలవు.
దీపపు
వెలుగు
కలుగునా?
వెలిగించేవాడొకడుండాలి
కదా!
అదే
రీతిగా,
దేహమును,
మనస్సును,
బుద్ధిని,
చిత్తమును
పనిలో
ప్రవేశపెట్టటానికి
ఒక
యజమాని
ఉండాలి
కదా!
9
▾
Meaning
Keep
ఆ
యజమానియే
ఆత్మ.
అదియే
మీ
Conscience
(అంతరాత్మ).
దేహమొక
నీటి
బుడగ,
మనస్సొక
పిచ్చికోతి.
కాబట్టి,
దేహాన్ని,
మనస్సును
అనుసరించకండి.
అంతరాత్మను
అనుసరించండి.
అంతరాత్మ
సలహాను
పాటించండి,
ఇతరుల
సలహాలు
మీకక్కర్లేదు.
విద్యార్థులారా!
మీరు
విద్యను
పూర్తి
చేసుకొని
మీ
తల్లిదండ్రుల
అనుమతి
తీసుకొని
పల్లెల్లో
ప్రవేశించి
సేవలు
చేయండి.
కలిమి,
బలిమి,
చెలిమి
కోసం
పాటుపడకండి.
అవి
ఈనాడు
వస్తాయి.
రేపు
పోతాయి.
కాని,
నైతిక
శక్తి
వస్తే
పోదు.
పైగా
అభివృద్ధి
చెందుతుంది
కూడా.
కాబట్టి
నైతిక
శక్తిని
పోషించుకోండి.
మీలో
మానవతా
విలువలు
లేకపోతే
మీరు
ఎన్ని
చదువులు
చదివినా
ప్రయోజనం
లేదు.
మనిషికి
చావున్నదిగాని,
ఆదర్శానికి
చావు
లేదు.
కాబట్టి,
ఆదర్శవంతమైన
జీవితాన్ని
గడపండి.
మీది
‘గోల్డెన్
ఏజ్’.
దీనిని
పాడు
చేసుకోకండి,
సార్థకం
చేసుకోండి.
Previous
←
The Ātma: The Five Kośas
Next
The Body Is the Temple, the Jīva Is God
→