Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · The Body Is the Temple, the Jīva Is God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Body Is the Temple, the Jīva Is God
5 April 2000, Ugadi, Brindavan
1
▾
Meaning
Keep
మానవునియందు
అహంకార,
ఆడంబరములు
ఉండినంతవరకు
ఎవ్వరూ
అతనిని
ప్రేమించరు;
కన్న
బిడ్డ,
కట్టుకున్న
భార్యకూడా
ప్రేమించరు.
ఇవి
మానవునినుండి
ఏనాడు
తొలగునో
ఆనాడు
విశ్వమంతా
అతనిని
ప్రేమిస్తుంది.
ఏ
మానవునియందు
క్రోధము
నిండియుండునో
అతడు
నిరంతరము
శోకిస్తూనే
ఉంటాడు.
అంతర్ముఖంగానో,
బహిర్ముఖంగానో
క్రోధము
యొక్క
ఫలితము
శోకమే
తప్ప
అన్యము
కాదు.
కోరికలున్నంతవరకు
మానవునికి
సుఖం
లేదు.
కోరికలను
నిర్మూలించుకున్నప్పుడే
మానవుణ్ణి
సర్వ
సౌఖ్యములూ
వరిస్తాయి.
అట్లే
లోభం
ఉండినంతవరకు
మానవునికి
శాంతి
లేదు.
ప్రేమస్వరూపులారా!
నూతన
సంవత్సరం
ప్రారంభమైనదంటే,
ఈ
సంవత్సరంలో
జగత్తుయొక్క
పరిస్థితి
ఏవిధంగా
పరిణమిస్తుందో
అని
మానవుడు
యోచిస్తుంటాడు.
అయితే,
దేశ
సౌభాగ్యము
మానవుని
చర్యలపైన
ఆధారపడియున్నది
గాని,
క్రొత్త
సంవత్సరముపైన
కాదు.
మానవుని
చర్యలు
మనస్సుపై
ఆధారపడియున్నవి.
మనస్సు
సంకల్పములపై
ఆధారపడియున్నది.
సంకల్పములు
ఎట్టివో
చర్యలు
అట్టివి.
కనుక,
విశ్వ
శ్రేయస్సును
కోరే
మానవుడు
తన
సంకల్పములను
సత్యసంకల్పములుగా
తీర్చిదిద్దుకోవాలి.
సత్యసంకల్పములు
కలిగిన
మానవునిద్వారానే
జగత్తు
శాంతి,
భద్రతలనందుకొంటుంది.
ఈ
నూతన
సంవత్సరము
ఏవిధమైన
కష్టసుఖాల
నందిస్తుందో
అని
మీరు
యోచించనక్కర్లేదు.
మీ
కర్మలు
మంచివైతే
మీ
భవిష్యత్తంతా
మంచిగానే
ఉంటుంది.
భగవంతుడు
ఎవ్వరినీ
రక్షించడు.
ఎవ్వరినీ
శిక్షించడు.
ఎవరిని
వారే
రక్షించుకుంటారు;
ఎవరిని
వారే
శిక్షించుకుంటారు.
భగవంతుడు
అన్నింటికీ
‘తథాస్తు!
తథాస్తు!’
అని
ఆశీర్వదిస్తుంటాడు.
మీరు
మంచి
పలికినా
‘తథాస్తు!’
అంటాడు;
చెడ్డ
పలికినా
‘తథాస్తు!’
అంటాడు.
కనుక
మీ
మంచిచెడ్డలకు
మూలకారణం
మీరే.
కర్మకు
మొట్టమొదట
నమస్కరించాలి
“కర్మానుబందీని
మనుష్య
లోకే”
మానవుడు
కర్మచేత
బంధింప
బడియున్నాడు.
మానవుని
పుణ్యపాపములు,
సుఖదుఃఖములన్నీ
కర్మలపైనే
ఆధారపడియున్నవి.
ఇట్టి
సత్యాన్ని
మానవుడు
గుర్తించుకోలేక
తనకు
తోచినట్లుగా
దుష్కర్మలను
ఆచరిస్తుంటాడు.
2
▾
Meaning
Keep
ఆచరించే
సమయంలో
ఆనందంగా
ఆచరిస్తాడుగాని,
తరువాత
చేసిన
కర్మకు
ఫలితంగా
కొండంత
దుఃఖాన్ని
అనుభవిస్తాడు.
ఏ
చిన్న
కర్మ
చేసినా
మానవుడు
దాని
ఫలితాన్ని
అనుభవించక
తప్పదు.
ఈ
సత్యాన్ని
గుర్తించి
వర్తించటం
అత్యవసరం.
కనుక,
ఏ
కర్మనైనా
ఆచరించటానికి
ముందు
దాని
మంచిచెడ్డలను
విచారణ
చేయాలి.
తొందరపాటుతో
కర్మలో
ప్రవేశించకూడదు.
తొందరపాటు
దుష్ఫలితాలకు
దారి
తీస్తుంది.
కనుకనే
మానవుడు
ఏ
కర్మనైనా
ఆచరించటానికి
ముందు
ఆ
కర్మకు
నమస్కరించి
తదుపరి
దానిని
ప్రారంభించాలని
ఉపనిషత్తులు
బోధించాయి.
దీనిని
పురస్కరించుకొనియే
“తస్మై
నమః
కర్మణే”
అన్నాయి.
ఎందుకోసం
నమస్కరించాలి
కర్మకు?
కర్మదేవత
మీచేత
పవిత్రమైన
కర్మలను
ఆచరింపచేయటం
కోసమే
మొట్టమొదట
కర్మకు
నమస్కరించాలి.
“ఓ
కర్మదేవతా!
నీవు
నాచేత
పవిత్రమైన,
పరోపకార
సంబంధమైన
కర్మలను
మాత్రమే
ఆచరింపజేయి”
అని
ప్రార్థించి
తదుపరి
కర్మాచరణకు
పూనుకోవాలి.
ఇదే
భారతీయ
సంస్కృతికి
మూలాధారమైన
సూత్రం.
చిన్న
ఉదాహరణ:
సాధారణంగా
డ్యాన్సర్లు
(నృత్యకారులు)
తమ
నృత్య
ప్రదర్శనను
ప్రారంభించే
ముందు
తాము
కాలికి
కట్టుకునే
అందెలను
కళ్ళకు
అద్దుకుని
నమస్కరిస్తారు.
అదేరీతిగా
తబలా,
హార్మోనియం
వాద్యకారులుకూడా
ఆయా
సంగీత
పరికరాలకు
నమస్కరించిన
తరువాతనే
వాటిని
వాయించటం
ప్రారంభిస్తారు.
ఏతావాతా
దీని
అంతరార్థ
మేమనగా,
మానవుడు
తాను
చేసే
ప్రతి
కర్మకు
మొట్టమొదట
నమస్కరించి,
తద్ద్వారా
సత్కర్మల
నాచరించి
జన్మను
సార్థకం
గావించుకోవాలి.
ప్రాచీన
కాలమునుండి
భారతీయ
సంస్కృతి
కర్మకు
ప్రధానమైన
స్థానమును
అందిస్తూ
వచ్చింది.
కర్మను
చేయటం
సులభమేగాని,
కర్మఫలితమును
మోయడం
చాల
కష్టం.
కర్మఫలితం
మానవుణ్ణి
నిరంతరం
వెంటాడుతూనే
ఉంటుంది.
కనుక
మానవుడై
పుట్టినందుకు
సత్కర్మలలో
ప్రవేశించాలి.
సత్కర్మలు
చేయకుండిన
మానవ
జీవితమే
వ్యర్థమైపోతుంది.
సత్యమే
నీతి,
ధర్మమే
రీతి,
త్యాగమే
ఖ్యాతి.
ఈ
మూడింటి
సమ్మిళిత
స్వరూపమే
మానవజాతి.
ఈనాటి
మానవుడు
ఈ
మూడింటినీ
మంటగలిపాడు.
కనుక
మానవత్వమే
మరుగున
పడిపోయింది.
ఈనాడసలు
మానవుడనేవాడు
జగత్తులో
ఉన్నాడా?
అని
సందేహం
కలుగుతోంది.
తలచిన
తలపుకు,
చెప్పిన
మాటకు,
చేసిన
పనికి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యముండాలి.
అలాంటివాడే
మహాత్ముడనిపించుకుంటాడు.
3
▾
Meaning
Keep
Also in his talks
(5)
24 November 1990
Share in Bhagavan's love
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
17 July 1997
The principle of the Ātma and divinity
14 January 1998
Satya is heaven
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
కాని,
ఈనాటి
మానవుడు
తలచేది
వేరు,
చెప్పేది
వేరు,
చేసేది
వేరు.
కనుకనే
తాను
దురాత్మునిగా
మారిపోతున్నాడు.
సమస్త
సాధనల
గమ్యం
ప్రేమస్వరూపులారా!
మానవజన్మ
అత్యంత
ఉత్కృష్టమైనది,
సౌజన్యమైనది,
సౌశీల్యమైనది.
మానవుడు
దైవసమానుడు.
దైవం
ఎక్కడున్నాడు?
మీరందరూ
దైవస్వరూపులే!
“దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవో
దేవస్సనాతనః”
దేహమే
దేవాలయం,
జీవుడే
దేవుడు.
ఈ
సత్యాన్ని
గుర్తించటమే
సమస్త
సాధనల
గమ్యం.
మానవదేహం
కదిలే
దేవాలయం.
ఇందులో
ఆత్మ
అనే
దేవుడు
ప్రతిష్ఠయైయున్నాడు.
అతనిని
వేదము
“నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్యశుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం”
అని
వర్ణించింది.
అట్టి
దేవుడు
మీయందే
ఉండగా
మీరు
ఎక్కడో
దేవుణ్ణి
వెతకటానికి
పోవటం
వెఱ్ఱితనం
కాదా?
ప్రస్తుతం
ఈ
ప్రపంచంలో
600
కోట్ల
దేవాలయములున్నాయి.
ఏమిటా
దేవాలయములు?
మానవ
దేహములే!
ప్రతి
దేహమూ
ఒక
దేవాలయమే.
దేహములో
ఉన్న
చైతన్య
శక్తియే
భగవంతుడు.
కనుకనే
వేదము
“ఈశ్వరస్సర్వ
భూతానాం”
అని
బోధించింది.
సర్వ
భూతములందు
ఈశ్వరత్వం
ఉంటున్నది.
కనుక
మీరు
ఎక్కడే
మనిషిని
చూసినప్పటికీ
ఒక
దేవాలయాన్ని
చూసినట్లుగానే
భావించాలి.
ప్రతి
మనిషిలోను
ఆత్మస్వరూపుడైన
భగవంతుడున్నాడు.
‘దేవాలయము’
యొక్క
అందచందములను
కాదు
మీరు
చూడవలసింది;
అందులో
ఉన్న
ఆత్మస్వరూపుడైన
దేవుణ్ణి
చూసి
ఆనందించాలి.
ఎవ్వరినీ
దూషించకూడదు,
హింసించకూడదు,
బాధించకూడదు.
ఈ
సత్యాన్ని
గుర్తించి
వర్తించేవాడే
నిజమైన
భక్తుడు.
ఇష్టమొచ్చినట్లు
ఇతరులను
దూషించేవాడు,
పరిహసించేవాడు
భక్తుడెలా
అవుతాడు?
అట్టివాడు
పరమ
నీచుడనే
చెప్పవచ్చు.
ఆదర్శప్రభువు
దేహమునొక
దేవాలయంగా
భావించి,
ఆ
దేవాలయమును
మొట్టమొదట
గౌరవించాలి.
4
▾
Meaning
Keep
పరోపకార
సంబంధమైన
పనులను
చేపట్టి
జీవితాన్ని
సార్థకం
చేసుకోవాలి.
అశోకుని
జీవితం
దీనికి
చక్కని
ఉదాహరణ.
అతడు
ధర్మమూర్తి.
న్యాయశీలి.
అతని
పేరు
అ-శోకుడు,
అనగా
శోకము
లేనివాడని
అర్థం.
అతనికి
అనేకమంది
సామంతరాజులుండేవారు.
అశోకుడు
వారి
వద్దనుండి
ప్రతి
సంవత్సరం
కొంత
ట్యాక్సు
(సుంకము)
ను
వసూలు
చేసి,
ఆ
ధనమును
అనేక
ప్రజాహిత
కార్యక్రమాలకు
వినియోగించేవాడు.
ప్రజలవద్దనుండి
ప్రభుత్వం
ట్యాక్సును
వసూలు
చేయకపోతే
రాజ్యమును
పరిపాలించటం
చాల
కష్టం.
ట్యాక్సులు
వేయకుండా
ప్రజలకు
సదుపాయములు
కల్పించాలని
ఆశించటం
వెఱ్ఱితనం.
ప్రజల
అవసరాలను
తీర్చాలంటే
ట్యాక్సులు
వేయక
తప్పదు.
కనుక,
అశోక
చక్రవర్తికూడా
ట్యాక్సులు
వసూలు
చేసేవాడు.
ఒక
పర్యాయం
అశోకుని
పుట్టినరోజు
సందర్భంగా
ఒక్క
మగధ
దేశపు
రాజు
తప్ప
మిగిలిన
సామంత
రాజులందరూ
ట్యాక్సులు
తీసుకు
వచ్చి
ఖజానా
నింపారు.
అశోకుడు
మగధ
రాజును
వట్టి
చేతులతో
రావటానికి
కారణమడుగగా
అతడు
“ప్రభూ!
ఈ
సంవత్సరం
నా
రాజ్యంలో
అతివృష్టి,
అనావృష్టి
సంభవించిన
కారణంగా
ప్రజలు
తినటానికి
సరియైన
తిండి
లేక,
త్రాగటానికి
నీరు
లేక
అనేక
ఇక్కట్లకు
గురియైనారు;
అనేకమంది
రోగాల
పాలైనారు.
కాబట్టి
నేను
ప్రజలవద్దనుండి
వసూలు
చేసిన
ధనమును
వారి
అవసరాలను
తీర్చటానికే
వినియోగించాను.
వారికి
త్రాగునీటి
సౌకర్యం
కల్పించాను.
అనారోగ్యంతో
పీడింపబడుతున్నవారికోసం
ఆరోగ్య
మందిరాలు
కట్టించాను.
పిల్లలకోసం
విద్యాలయాలు
నెలకొల్పాను.
ఈ
విధంగా
నావద్ద
ఉన్న
ధనమంతా
ఖర్చైపోయింది”
అని
వివరించాడు.
ఈ
మాటలు
విని
అశోకుడు
చాలా
ఆనందించాడు.
అతనిని
దగ్గరకు
పిలిచి
తన
ప్రక్కన
కూర్చోబెట్టుకొని
“మగధ
రాజా!
ఈ
రాజులెవ్వరూ
చేయని
మంచి
పనులు
నీవు
చేశావు.
ప్రజల
నీటికొఱత
తీర్చావు.
విద్యాలయాలను
నెలకొల్పావు.
వైద్య
సౌకర్యాన్ని
కల్పించావు.
ఈ
మూడింటివల్ల
ప్రజల
కెంతో
మేలుచేసిన
వాడివయ్యావు.
ప్రజాక్షేమంకోసం
పాటుపడే
నీలాంటి
ప్రభువుకు
నేనెంతైనా
సహాయం
చేయటానికి
సిద్ధంగా
ఉన్నాను”
అన్నాడు.
విద్య
తలకు
సంబంధించినది,
వైద్యము
గుండెకు
సంబంధించినది,
నీరు
ప్రాణసమానమైనది.
ఈ
మూడు
సౌకర్యాలను
ప్రజలకు
సమకూర్చేవాడే
అందరికంటే
గొప్పవాడు.
అలాంటివాడు
దేవుడనే
చెప్పవచ్చు.
మానవునికి
సత్కర్మలు
చాల
ప్రధానమైనవి.
5
▾
Meaning
Keep
కనుకనే
నేను
మిమ్మల్ని
సమాజసేవలో
పాల్గొనమని
చెపుతుంటాను.
మీరు
సమాజంలో
పుట్టారు,
పెరిగారు,
సమాజం
ద్వారా
విద్యనభ్యసించారు,
సమాజం
ద్వారా
ధనమునార్జించారు,
సమాజంద్వారానే
ఆనందాన్ని
అనుభవిస్తున్నారు.
కనుక,
సమాజానికి
తగిన
కృతజ్ఞత
చూపటం
మీ
ప్రథమ
కర్తవ్యం.
సత్కర్మల
నాచరించినప్పుడే
మీరు
సమాజానికి
కృతజ్ఞత
చూపినవారౌతారు.
ఈనాడు
ప్రపంచ
పరిస్థితి
తారుమారైపోయింది.
మానవత్వమనేదే
కంటికి
కనిపించటం
లేదు.
మానవత్వమనగా
ఏమిటి?
పంచేంద్రియాలను
సన్మార్గంలో
ప్రవేశపెట్టాలి.
భగవంతుడనుగ్రహించిన
దయ,
సత్యము,
సహనము,
శాంతి
మున్నగు
సద్భావములను
అభివృద్ధిపర్చుకోవాలి.
కాని
మీరు
ఈ
సద్భావాలను
ప్రక్కకు
నెట్టి,
కామ,
క్రోధాది
దుర్గుణాలను
అభివృద్ధిపరచుకొంటున్నారు.
దుర్గుణాలు
ఎక్కడినుండి
వస్తున్నాయి?
మీరు
భుజించే
ఆహారం
నుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
కాబట్టి
సాత్వికాహారాన్ని
తీసుకోండి,
అప్పుడు
మీలో
సద్భావములే
ఆవిర్భవిస్తాయి.
భగవంతుడు
అనుగ్రహించిన
సద్భావాలు
మీలోపలే
ఉన్నాయి.
కాని
మీరు
వాటిని
లెక్క
చేయటం
లేదు.
చదవటం,
వ్రాయటం,
ఉద్యోగాలు
చేయటం,
ధనం
సంపాదించటం,
మిద్దెలు,
మేడలు
నిర్మించుకోవటం
ఇవన్నీ
ప్రవృత్తి
ప్రసాదములు.
ఇవన్నీ
మీరు
ప్రయత్నంతో
సంపాదించుకునేవి.
కాని
దయ,
ప్రేమ,
సహనము
మున్నగు
నివృత్తి
లక్షణాలు
మీలోనే
అణిగిఉన్నాయి;
వాటిని
మీరు
సంపాదించుకోనక్కర్లేదు,
అవి
మీ
హృదయంనుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
దుర్భావములన్నీ
తలనుండి
ప్రారంభమౌతున్నాయి.
ప్రేమస్వరూపులారా!
మీరు
తలను
ఆధారం
చేసుకోకండి,
తలను
అనుసరించకండి.
తల
చాలా
ప్రమాదాలకు
దారితీస్తుంది,
కడపటికి
మీతలనే
తీసేస్తుంది!
తలను
అనుసరిస్తే
మీరు
ప్రాకృతమైన
జీవితంలో
బంధింపబడతారు.
కనుక,
హృదయాన్ని
అనుసరించండి.
మీ
దృష్టిని
అంతర్ముఖం
గావించుకోండి.
హృదయమునుండి
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలనే
మానవతా
గుణములు
ఆవిర్భవిస్తున్నాయి.
కరెంటు
వైరుద్వారా
బల్బులో
ప్రవేశించినప్పుడు
అది
ప్రకాశాన్ని
అందిస్తుంది.
అదేరీతిగా
సత్యమనే
కరెంటు
ధర్మమనే
వైరు
ద్వారా
శాంతి
అనే
బల్బులో
ప్రవేశించినప్పుడు
ప్రేమ
అనే
ప్రకాశం
లభిస్తుంది.
6
▾
Meaning
Keep
His songs 62
Also in his talks
(2)
22 September 1997
God delights in the feeling, not in outward show
22 August 2000
The Flowers Dear to God
నిజమైన
భూషణములు
ప్రేమస్వరూపులారా!
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”
మానవజన్మ
మహా
దుర్లభమైనది.
ఇది
భగవంతునియొక్క
వరప్రసాదం.
భగవంతు
డనుగ్రహించిన
పవిత్రమైన
ఈ
మానవ
దేహాన్ని
పరోపకార
సంబంధమైన
పనులలో
ప్రవేశపెట్టాలి.
కొంతమంది
ఎప్పుడు
చూసినా
పరదూషణలోనే
కాలాన్ని
వ్యర్థం
చేస్తుంటారు.
అది
అనేక
జన్మల
పాపఫలం
తప్ప
అన్యం
కాదు.
మంచి
మాటలు
మాట్లాడాలి.
“సత్యం
కంఠస్య
భూషణం”
కంఠమునకు
అలంకారం
ముత్యాలదండ
కాదు,
డైమండ్
నెక్లెస్
కాదు,
సత్యమే
కంఠమునకు
భూషణం.
చేతులకు
అందము
రత్నాల
కంకణాలు
కాదు.
“హస్తస్య
భూషణం
దానం”
దానమే
చేతులకు
అందము.
భగవంతుడు
మీకు
చెవుల
నిచ్చినది
ఎందుకోసం?
కన్ను
నిచ్చినది
ఎందుకోసం?
బజార్లో
ఎక్కడైనా
ఎవరైనా
పోట్లాడుతున్నారని
తెలిస్తే
ప్రజలందరూ
అక్కడికి
గుంపులు
గుంపులుగా
పరుగెత్తి
పోతారు.
ఆ
పోట్లాటలు
చూడటానికా
మీకు
కన్నుల
నిచ్చినది?
వారి
దుర్భాషలను
వినటానికా
మీకు
చెవుల
నిచ్చినది?
ఛీ,
ఛీ,
మీ
కన్నులను
ఎంత
అపవిత్రం
గావించుకుంటున్నారు!
మీ
చెవులను
ఎంత
దుర్వినియోగపర్చుకుంటున్నారు!
“ప్రొద్దుబోక
ఊరివారి
సుద్దులంటే
మీరు
సిద్ధమౌదురే
కడు
శ్రద్ధతోడ;
ముద్దు
ముద్దుగాను
భగవత్
ముచ్చటలుచెప్పువేళ
ఒద్దికగానుండరేల
ఓ
చెవులారా?”
భగవంతుడు
మీకు
చెవులనిచ్చింది
ఊరివారి
సుద్దులు
వినటం
కోసం
కాదు.
పవిత్రమైన
భగవన్నామాన్ని
వినటానికే
మీకు
చెవుల
నందించాడు.
ఇంక
కన్నులను
దేనికోసం
ఇచ్చాడు.
“పనిమాలి
సినిమాలు
పలుమారు
మీరు
చనిచని
కనినను
తనివిలేదే!
క్షణమైన
దైవసన్నిధి
నిలువగ
కనులారా
కడు
కష్టమౌగా?”
కన్నుల
నిచ్చినది
భగవంతుని
సుందర
రూపాన్ని
దర్శించటానికేగాని,
సినిమాలు,
టీవీలు
చూడటానికి
కాదు.
టీవీలు,
సినిమాలు
చూసి
పవిత్రమైన
కన్నులను
దుర్వినియోగపర్చుకోవటంచేత
ఈనాడు
చిన్న
చిన్న
పిల్లలకు
కూడా
కంటి
జబ్బులు
వస్తున్నాయి.
మధ్యవయస్సులోనే
కన్నులను
క్యాటరాక్టు
పొర
కప్పివేస్తున్నది.
ఈ
దేహానికి
75
సంవత్సరాలు
వస్తున్నాయి.
కాని,
నా
కన్నులకు
క్యాటరాక్టు
అనేదే
లేదు.
కారణమేమిటి?
నేను
టీవీలు,
సినిమాలు
చూడను.
మీరు
చూడవలసింది
ఏమిటి?
టీవీలు,
సినిమాలలోని
వేషాలను
కాదు;
దైవస్వరూపాన్ని
చూడాలి.
7
▾
Meaning
Keep
Also in his talks
(10)
22 May 1978
The Great Task of the Guru
10 December 1986
Faith in the Ātma alone gives all strength
6 May 1987
To seek out the road is the noble intellect
9 January 1988
God in the heart, work in the hands
7 July 1988
Divinity forgotten: that is the state of the jīva
26 February 1995
Make Sacred Use of Your Youth
16 July 1996
Develop Virtues and Contemplate on God
30 August 1996
The Body Must Be Set on the Sacred Path!
4 March 2000
The Ātma: The Five Kośas
14 January 2002
Only when attachment to the body is given up does the knowledge of the Ātma dawn
పవిత్రత,
సహనం,
పట్టుదల
ఈనాటి
యువకులు
తమ
యౌవనాన్ని
చూసుకొని
గర్విస్తున్నారు.
వారు
తమ
శక్తిని
ఎంత
పాడుచేసుకుంటున్నారో
చెప్పటానికి
వీలుకాదు.
మానవత్వాన్నే
నాశనం
చేసుకుంటున్నారు.
అందము,
ప్రాయము,
ఇంద్రియ
శక్తియు
ఉందని
నిక్కకురోరన్నా!
ముందున్నదిరా
తొందరలోనే
ముసలితనమ్మను
ముసళ్ళ
పండుగ
మసల
లేవు,
కను
మసకలు
మోమున
ముడుతలు
పడె
తల
నెరిసె
కదా!
ముసలి
కోతియని
పసివారలు
నిన్
ముసిముసినవ్వగ
కసరే
బొమ్మా!
తై
తై
తై
తై
తై
బొమ్మా!
దీని
తమాష
చూడర
తోలుబొమ్మా!
వృద్ధాప్యంలో
కన్నులు
సరిగా
కనిపించవు.
మొహంపై
ముడతలు
పడతాయి,
తల
నెరిసిపోతుంది.
ఇంద్రియశక్తి
సన్నగిల్లిపోతుంది.
ఇవన్నీ
ఇంద్రియాలను
దుర్వినియోగం
చేసుకోవటం
వల్ల
కలిగే
బాధలు.
కాబట్టి
మంచి
పనులు
చేయండి,
సమాజ
సేవలో
పాల్గొనండి,
పరోపకారంలో
ప్రవేశించండి.
ఇట్టి
సత్కర్మలచేత
ఎన్ని
సంవత్సరాలైనా
మీ
దేహశక్తి
క్షీణించకుండా
ఉంటుంది.
అనేకమంది
“స్వామీ!
75
సంవత్సరాల
వయస్సులోకూడా
మీరెంత
గట్టిగా
ఉన్నారు!
ఎంత
కళకళలాడుతున్నారు!”
అని
ఆశ్చర్యాన్ని
ప్రకటిస్తుంటారు.
అప్పుడు
నేను
చెబుతుంటాను.
“దీనికి
కారణం
నాలో
ఉన్న
మూడు
P
లు.
మొదటి
P
-
Purity
(పవిత్రత),
రెండవ
P
-
Patience
(సహనం),
మూడవ
P
-
Perseverance
(పట్టుదల)”.
ఈ
మూడూ
మీలో
ఉంటే
మీరుకూడా
ఎంత
వయస్సు
వచ్చినా
గట్టిగా
ఉంటారు.
అందమనేది
దేహానికి
సంబంధించినది
కాదు;
గుణానికి
సంబంధించినది,
పవిత్రతకు
సంబంధించినది.
8
▾
Meaning
Keep
పరదూషణకు
మించిన
పాపం
లేదు
పరులను
నిందించేవారు
పరమ
పాపులనే
చెప్పవచ్చు.
“పాపము
లన్నిటికంటే
మించినది
పరులను
నిందించేదన్నా”.
కాబట్టి
ఎవ్వరినీ
నిందించకూడదు.
అందరియందున్నది
భగవంతుడే.
ఒకవేళ
ఎదుటివారిలో
మీకేదైనా
దోషం
కనిపిస్తే,
ఆ
దోషాన్ని
వారికి
తెలియజేసి
మంచి
మాటలతో
సరిదిద్దాలేగాని,
వారిని
దూషించటానికి
పూనుకోకూడదు.
ఆధ్యాత్మికమంటే
సర్వమును
త్యజించి
ముక్కు
మూసుకుని
జపమాల
త్రిప్పుతూ
కూర్చోవటం
కాదు.
మొట్టమొదట
మీలో
సద్భావములు
ఆవిర్భవించాలి.
నిరంతరము
మీమోముపై
చిరునవ్వులు
చిందులాడాలి.
ఎలాంటి
పరిస్థితి
యందైనా
‘కేస్ట్రాయిల్
ఫేస్’
(ఏడుపు
ముఖం)
పెట్టుకోకూడదు.
Happiness
is
union
with
God
భగవంతునితో
చేరినప్పుడే
ఆనందం
ప్రాప్తిస్తుంది.
భగవచ్చింతన
చేసేవాడు
ఎప్పుడూ
ఆనందంగా
ఉంటాడు.
లోకంలో
అనేక
కష్టాలు
వస్తూనే
ఉంటాయి.
ఎన్ని
వచ్చినప్పటికీ
మీరు
లెక్కచేయకూడదు.
నిజంగా
మీరు
నమ్ముతారో
లేదో
గాని,
నాకు
ఉన్నన్ని
దూషణ,
భూషణలు
ఎవ్వరికీ
లేవు.
కోరికలు
నెరవేరినవాడు
గొప్పగా
వర్ణిస్తుంటాడు;
కోరికలు
తీరనివాడు
దూషిస్తుంటాడు.
ఈ
దూషణ,
భూషణలు
రెండూ
వారి
పెదవులకే
పరిమితంగాని,
అవి
నావరకు
ఏమాత్రం
చేరవు.
Sri
Sathya
Sai
(శ్రీసత్యసాయి)
అనే
పేరులో
మూడు
S
లున్నాయి.
Yes
అనువారికి
Yes
అనురా
సాయి
No
అనువారికి
No
అనురా
సాయి
No,Yes
లు
మీ
నోటికెగాని
సాయికి
సర్వం
Yes,
Yes,
Yes!
గట్టిగా
దూషిస్తే
అది
గాలిలో
కలిసిపోతుంది.
తనలో
తాను
దూషించుకుంటే
అది
తనకే
చెందుతుందిగాని,
నావరకు
రాదు.
నేనెప్పుడూ
ఆనందంగానే
ఉంటాను.
ఆనందమే
నా
స్వరూపం.
దేహాభిమానం
కలవాడే
సుఖఃదుఃఖాలకు
గురి
అవుతుంటాడు.
కాని,
నాకు
సుఖము
లేదు,
దుఃఖము
లేదు.
ఎందుకంటే,
నాకు
దేహాభిమానమే
లేదు.
దేహానికి
సంబంధించినది
Conscious.
ఆత్మకు
సంబంధించినది
Consciousness.
నేను
Conscious
ను
కాదు,
Consciousness
ను
అనగా
చైతన్య
స్వరూపుడను.
9
▾
Meaning
Keep
మీరందరూ
చైతన్య
స్వరూపులే!
అందరూ
దైవస్వరూపులే.
“నేను
దైవస్వరూపుణ్ణి”
అనే
సత్యాన్ని
మీరు
గుర్తిస్తే
మీరింక
దుర్మార్గంలో
ప్రవేశించరు.
జ్ఞానము
ఒక్కతూరి
వస్తే
తిరిగి
పోదు,
అజ్ఞానము
ఒక్కతూరిపోతే
తిరిగి
రాదు.
బ్రహ్మతత్త్వము
రాదు,
పోదు,
అదే
చైతన్య
స్వరూపము.
అది
రాకపోకలు
లేనిది.
శాశ్వతంగా
ఉండేది.
అనుభవ
జ్ఞానమే
నిజమైన
శక్తి
విద్యార్థులారా!
మీరు
తెలుసుకోవలసిన
ముఖ్యమైన
విషయం
ఒకటుంది.
మీరు
చదివే
చదువులన్నీ
పూర్తి
విద్యలో
నాల్గవభాగము
మాత్రమే.
మిగిలిన
మూడు
భాగములనుకూడా
మీరు
సంపాదించినప్పుడే
సంపూర్ణ
విద్యావంతులైతారు.
మొదటి
భాగము
భౌతికమైన
చదువు.
ఇది
పుస్తకాలలో
లభిస్తుంది.
కాని,
మిగిలిన
మూడు
భాగములు
పుస్తకాలద్వారా
లభించేవి
కావు.
అవి
ఆచరణకు
సంబంధించినవి.
కనుక
చదవటం
ఒక
భాగము,
ఆచరించటం
మూడు
భాగములు.
ఈ
నాల్గింటినీ
సంపాదించినప్పుడే
మీరు
పరిపూర్ణ
విద్యావంతులౌతారు.
కేవలం
చదవటం,
వ్రాయటం
నేర్చినంత
మాత్రాన
మీరు
విద్యావంతులు
కాజాలరు.
అది
కేవలం
గ్రంథ
పరిచయానికి
సంబంధించినది.
గ్రంథపరిచయంతోపాటు
మీరు
అనుభవ
జ్ఞానాన్ని
కూడా
సంపాదించాలి.
అనుభవ
జ్ఞానమే
మీ
నిజమైన
శక్తి.
అట్టి
శక్తిని
మీరు
సంపాదించుకున్నప్పుడే
మీ
చదువు
సార్థకమౌతుంది;
మీకు
సత్కీర్తి
కలుగుతుంది.
ఈనాడు
నూతన
సంవత్సరం
ప్రారంభమైంది.
ఈ
నూతన
సంవత్సరంలో
నూతనమైన,
పవిత్రమైన
భావాలను
అభివృద్ధి
పర్చుకోండి.
దివ్యమైన
ఆనందాన్ని
మీరు
అనుభవించండి,
ప్రజలకు
పంచండి.
సంవత్సరంయొక్క
మంచిచెడ్డలన్నీ
మీ
సంకల్పములపైన,
చర్యలపైన
ఆధారపడియున్నవి.
మీ
సంకల్పములు,
చర్యలు
మంచివైతే
భవిష్యత్తుకూడా
మంచిగానే
ఉంటుంది.
కనుక,
మిమ్మల్ని
మీరు
సరిదిద్దుకోండి.
ఎవరిని
వారు
సరిదిద్దుకుంటే
అందరూ
బాగుపడతారు;
దేశమంతా
అభివృద్ధి
చెందుతుంది.
Previous
←
God's Name in the Heart, Service to Society with the Hands
Next
The Subtleties of Dharma in the Rāmāyaṇa
→