Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · As the thought, so the result
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
As the thought, so the result
1 January 2001, New Year, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 522
సుఖమునందున
దుఃఖంబు
చొచ్చియుండు
వీని
విడదీయ
ఎవ్వరి
వశము
కాదు
ఎద్ది
సుఖమును
ఇచ్చునో
దుఃఖమును
ఇచ్చు
సుఖము
దుఃఖము
రెండును
కలిప్రభావము
ప్రేమస్వరూపులారా!
సంవత్సరములు
జరుగుతున్నవి
కాని
మానవుని
యందు
సద్భావములు
పెరగటం
లేదు.
మంచి
మనస్సు
కలవాడే
మానవుడు.
సూర్యుని
వంటి
తేజస్సుతో,
చంద్రుని
వంటి
చల్లదనముతో
కూడిన
వాక్కును
పవిత్రంగావించి
సమాజానికి
శాంతి
చేకూర్చటమే
మంచి
మనస్సు
యొక్క
లక్షణము.
దయ,
ప్రేమ,
సహనం,
సానుభూతి,
త్యాగము
ఇత్యాది
పవిత్ర
గుణములతో
కూడినవాడే
మానవుడు.
కాని
ఈనాటి
మానవుని
యందు
ఇట్టి
సద్గుణములు
లోపించినవి.
మానవత్వాన్ని
కోల్పోయినవాడు
మానవుడు
కాజాలడు.
మానవుడు
ప్రకృతినుండి
ఆవిర్భవించిన
జీవి.
భూమి
ప్రాణమును
పోస్తున్నది,
సూర్యుడు
తేజస్సునందిస్తున్నాడు,
వృక్షములు
వాతావరణమును
పరిశుద్ధంగావిస్తున్నవి.
జలము
దాహార్తిని
తీర్చుతోంది.
గాలి
ప్రాణవాయువును
అందిస్తోంది.
ఈ
పంచభూతములందు
జన్మించి,
పంచభూతములనే
ఆధారము
చేసుకొని
జీవిస్తున్న
మానవునికి
పంచభూతములయొక్క
గుణములు
ఎందుకు
అలవడటంలేదు?
ప్రకృతినుండి
ఉద్భవించి,
ప్రకృతి
ఒడిలో
జీవించే
మానవుడు
ప్రకృతియొక్క
ఆదర్శాలను
అనుసరించాలి.
వృక్షములు
పవిత్రమైన
ప్రాణవాయువు
నందించి
విషవాయువును
తాము
స్వీకరిస్తున్నాయి.
పక్షులు,
మృగములు,
వృక్షములు
ప్రకృతిని
అనుసరిస్తూ,
తమ
కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తూ
జగత్తుకు
ఎంతో
ఉపకారం
చేస్తున్నాయి.
కాని
మానవునిగా
జన్మించి,
మానవుడని
పేరు
పెట్టుకొని
మానవతా
గుణములను
ఎందుకు
ఆచరణలో
పెట్టటంలేదు?
మానవుడు
మానవతా
గుణములను
కోల్పోయినాడు.
కనుకనే
వాటిని
ఆచరణలో
పెట్టుటకుగాని,
ప్రచారం
చేయుటకుగాని
తగిన
స్థితిలో
లేడు.
మానవతా
విలువలే
మానవుణ్ణి
దైవత్వస్థాయికి
తీసికొనిపోతాయి.
కనుక
మానవతా
విలువలను
అభివృద్ధిపరచుకోవాలి.
2
▾
Meaning
Keep
దైవానుగ్రహముంటే
దేనినైనా
సాధించవచ్చు
ప్రేమస్వరూపులారా!
ప్రతి
మానవుడు
నూతన
సంవత్సరం
తనకు
నూతనమైన
సుఖసంతోషాలను
అందించాలని
ఆశిస్తుంటాడు.
మన
సుఖసంతోషాలను
నూతన
సంవత్సరం
తీసికొనిరావటంలేదు.
నిన్నటి
దినమువలెనే
ఈరోజు
ఉన్నది;
ఈ
రోజువలెనే
రేపు
ఉంటుంది.
దినములలో
మార్పు
లేదు.
ఎవరు
చేసిన
కర్మలయొక్క
ఫలితమును
వారు
అనుభవిస్తారు.
మంచి
చేస్తే
దుఃఖము
రాదు;
చెడ్డ
చేస్తే
సుఖమును
అనుభవించలేము.
ఏది
చేసినా
దాని
ఫలితాన్ని
అనుభవించక
తప్పదు.
అయితే
దైవానుగ్రహమునకు
పాత్రుడైన
వ్యక్తి
సుఖదుఃఖములను
సమత్వంతో
స్వీకరిస్తాడు.
దైవానుగ్రహం
ఎలాంటి
పాపమునైనా
పటాపంచలు
గావించి
శాంతిని
చేకూర్చుతుంది.
కాని,
ఈ
కలిప్రభావంచేత
మానవుడు
దైవవిశ్వాసమును
కోల్పోయినాడు.
అట్టివానికి
దైవానుగ్రహమేరీతిగా
ప్రాప్తిస్తుంది?
దైవానుగ్రహంచేత
ఎట్టి
కష్టములనైనా
క్షణంలో
నిర్మూలం
గావించుకోవచ్చు;
ఎట్టి
సుఖములనైనా
అనుభవించవచ్చు.
ఎట్టి
శాంతినైనా
పొందవచ్చు.
అయితే,
దైవానుగ్రహం
ప్రాప్తించాలంటే
నిశ్చలమైన
భావంతో,
నిర్మలమైన
హృదయంతో
నిస్వార్థమైన
కర్మలను
ఆచరించాలి.
ఆనందం
పవిత్ర
భావాలనుండియే
ఆవిర్భవిస్తుంది
నూతన
సంవత్సరం
ప్రారంభమైనదంటే
చాలా
మంది
ఉత్తేజపూరితమైన
మాటలతో,
పాటలతో,
ఆటలతో
పండుగ
జరుపుకుంటారు.
కాని
ఆ
ఉత్సాహము,
ఆనందము
తాత్కాలికమైనవి.
మనకు
కావలసింది
శాశ్వతమైన
శాంతి,
శాశ్వతమైన
ఆనందము.
అశాశ్వతమైన,
ప్రాకృతమైన
కర్మలనాచరించి
శాశ్వతానందాన్ని
పొందాలంటే,
ఎలా
సాధ్యమౌతుంది?
శాశ్వతానందాన్ని
అనుభవింపగోరువారు
శాశ్వతమైన,
పవిత్రమైన
కర్మలను
ఆచరించాలి.
సంవత్సరములు
వస్తున్నవి,
పోతున్నవి.
మన
సుఖదుఃఖములుకూడా
వస్తున్నవి,
పోతున్నవి.
ఇవేవీ
శాశ్వతమైనవి
కావు.
శాశ్వతమైన
ఆనందము
కేవలం
ఆత్మానుభవంచేతనే
లభ్యమౌతుంది.
మన
సుఖసంతోషములను
నూతన
సంవత్సరములు
తీసికొనిరావటం
లేదు.
అవి
కేవలం
మనం
చేసిన
కర్మలయొక్క
ఫలితమునే
తీసికొని
వస్తున్నాయి.
హృదయంలో
పవిత్రమైన
భావములతో
కర్మలను
ఆచరించాలి.
అప్పుడే
సుఖశాంతులు
లభ్యం
కాగలవు.
3
▾
Meaning
Keep
మన
ఆనందమును
ఇతరులు
తీసివేయలేరు;
ఇతరులు
మనకు
ఆనందమును
అందించలేరు.
ఆనందము
మనయందే
ఉన్నది;
పవిత్రమైన
భావములనుండియే
అది
ఆవిర్భవిస్తుంది.
కాబట్టి,
మన
ఆనందమును
మనమే
పెంచుకోవాలి.
మన
హృదయాన్ని
కరుణతో
నింపుకోవాలి;
శాంతిని
వెదజల్లాలి;
దివ్యమైన,
భవ్యమైన
భావములను
పెంచుకోవాలి.
మనం
చేయవలసినది
చేయకుండా
కాలము
మనకు
ఆనందమును
అందించాలని
ఆశిస్తే
ఏరీతిగా
సాధ్యమౌతుంది?
మంచి
ఫలితములను
ఆశిస్తే
మంచి
సంకల్పములను
పోషించుకోవాలి.
సంకల్పాలను
బట్టి
ఫలితం
లభ్యమౌతుంది
కష్టమునుండియే
సుఖము
లభిస్తుంది.
రెండు
బాధలమధ్య
గల
విరామమే
సుఖము.
బాధలు
లేకుండా
సుఖము
లభించటం
అసాధ్యం.
ఎట్టి
సంపదలు
కల్గినవారికైనా,
ఎట్టి
సాధనలు
చేసిన
వారికైనా
వారు
చేసిన
కర్మలను
పురస్కరించుకొనియే
ఫలితం
ప్రాప్తిస్తుంది.
వేపచెట్టు
దగ్గరకు
పోయి
మామిడి
పండుకోసం
వెతికితే
చిక్కుతుందా?
మామిడిచెట్టువద్దకు
పోయి
వేపపండు
కావాలంటే
లభిస్తుందా?
ఎట్టి
వృక్షమో
అట్టి
ఫలము.
అట్లే
ఎట్టి
సంకల్పమో
అట్టి
ఫలితము.
కష్టముగాని,
సుఖముగాని
బయటినుండి
లభిస్తున్నాయని
మానవుడు
భ్రమిస్తున్నాడు.
కాని
కష్టసుఖములు
బయట
లేవు,
తన
సంకల్పములయందే
ఉన్నాయి.
కాబట్టి
తన
సంకల్పములను
మార్చుకోవాలి.
తన
మనస్సును
మార్చుకోవాలి.
ఈనాడు
మనిషి
మారుతున్నాడుగాని,
మనస్సు
మారటంలేదు.
దినములు,
సంవత్సరములు
జరిగిపోతున్నవిగాని,
మానవుని
భావములు
ఉత్తమమైనవిగా
మార్పు
చెందటంలేదు.
తన
భావములు
పవిత్రమైనవిగా,
పరోపకార
సంబంధమైనవిగా
మార్పు
చెందినప్పుడే
తనకు
శాంతి
లభ్యమౌతుంది.
తన
భావములు
పవిత్రమైనవిగా
ఉన్నప్పుడే
తనకు
పవిత్రమైన
ఫలితం
లభిస్తుంది.
ఈ
కలిప్రభావముచేత
మానవుడు
తలచేది
ఒకటి,
చెప్పేది
ఒకటి,
చేసేది
ఒకటి.
అయితే
తాను
ఏది
చెప్పినా,
ఏది
చేసినా
తన
సంకల్పములను
పురస్కరించుకొనియే
ఫలితం
లభ్యమౌతుంది.
కనుక,
తన
మనస్సును
పవిత్రంగా
మార్చుకొని
మంచి
మనిషిగా
తయారు
కావాలి.
4
▾
Meaning
Keep
మంచి
మనస్సు
కలవాడే
మంచి
మనిషి.
ఒక్కొక్క
పర్యాయము
మానవుడు
మంచి
మనస్సుతో
పని
చేసినప్పటికీ
చెడ్డ
ఫలితం
వచ్చినట్లుగా
తోస్తుంది.
ఫలితం
ఎలాంటిదైనా
మనస్సు
క్షణక్షణమునకూ
మార్పు
చెందుతోంది.
తన
సంకల్పములు
పవిత్రమైనవిగా,
దృఢమైనవిగా
ఉన్నప్పుడు
ఈవిధంగా
మార్పు
చెందటానికి
వీల్లేదు.
చలించని
మనస్సును,
భ్రమించని
దృష్టిని
కల్గియున్నప్పుడు
తనను
ఎలాంటి
బాధలూ
వెంటాడవు.
దీనికి
భగవదనుగ్రహాన్ని
సాధించటం
తప్ప
మరొక
మార్గం
లేదు.
భావమే
పరిశుద్ధంగా
లేనప్పుడు
ధనముగాని,
వస్తువాహనాదులుగాని
ఏవీ
సహాయం
చేయలేవు.
ఏది
లేకపోయినా
పవిత్రమైన
హృదయమే
ఉంటే
అన్నీ
లభ్యమౌతాయి.
భావం
పరిశుద్ధంగా
ఉంటే
మట్టికూడా
బంగారమవుతుంది.
భావమే
సరిగా
లేకపోతే,
ప్రయత్నమే
సరిగా
లేకపోతే
కఱ్ఱయే
పామై
కాటు
వేస్తుంది.
“సంకల్పమూల
మిదం
జగత్”
జగత్తు
సంకల్పములపై
ఆధారపడియున్నది.
మానవుని
మంచిచెడ్డలన్నీ
కూడా
సంకల్పములలోనే
ఉన్నాయి.
అంకెలు
మారినంత
మాత్రాన
అదృష్టం
మారదు
ఈనాడు
నూతన
సంవత్సరం
2001
ప్రారంభమయింది.
వచ్చే
సంవత్సరం
ఇది
2002
గా
మారిపోతుంది.
ఈవిధంగా
అంకెలు
మారినంత
మాత్రమున
అదృష్టం
మారుతుందనుకోవటం
చాలా
పొరపాటు.
ఈ
అంకెలతో
మానవుని
కర్మలుకూడా
పవిత్రంగా
మారాలి.
అప్పుడే
తనకు
పవిత్రమైన
ఫలితం
ప్రాప్తిస్తుంది.
విద్యార్థులు
సంవత్సరం
పొడవునా
కష్టపడి
చదివినప్పుడే
పరీక్షలో
మంచి
మార్కులతో
ఉత్తీర్ణులవుతారు.
కష్టపడి
చదవకపోతే
మంచి
మార్కులు
తెచ్చుకోవటానికి
అవకాశమే
లేదు.
ఎట్టి
సంకల్పములో
అట్టి
కర్మలు,
ఎట్టి
కర్మలో
అట్టి
ఫలితం.
చాలామంది
అనుకుంటారు,
“మేము
మంచి
పనులు
చేస్తున్నప్పటికీ
ఎందుకు
చెడ్డ
ఫలితం
వస్తున్నది?”
అని.
మంచి
జాతి
మామిడి
ఫలమైనప్పటికీ
కాయస్థితిలో
ఉన్నప్పుడు
పుల్లగా
ఉంటుంది.
పరిపక్వస్థితికి
వచ్చినప్పుడే
దానికి
మాధుర్యం
ప్రాప్తిస్తుంది.
దానిని
పరిపక్వస్థితికి
రాక
మునుపే
కోసి,
“మంచిజాతి
విత్తనం
నాటితే
పుల్లని
కాయ
లభించిందే!”
అనుకోవటం
పొరపాటు
కదా!
అదేరీతిగా,
మంచి
పనులకు
చెడ్డ
ఫలితం
లభించింది
అనుకోవటం
పొరపాటు.
మంచి
పనులకు
చెడ్డ
ఫలితం
ఏనాడూ
లభించదు.
5
▾
Meaning
Keep
Also in his talks
(1)
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
ఆ
చెడ్డలోనే
మంచి
ఉంటుంది.
చెడ్డ
లేకుండా
మంచి
ప్రాప్తించటానికి
వీలుకాదు.
మానవత్వంలోని
బలహీనతచేత
మీరు
చెడ్డను
మాత్రమే
చూస్తారుగాని,
మంచిని
గమనించరు.
మంచిచెడ్డలు,
కష్టసుఖములు
రెండూ
కలసి
ఉంటాయి.
వీటిని
విడదీయటానికి
వీలుకాదు.
కష్టము
ఫలించినప్పుడే
సుఖము
లభిస్తుంది.
ప్రవృత్తిని
నివృత్తిగా
మార్చుకోవాలి
ప్రేమస్వరూపులారా!
నూతన
సంవత్సరము
మంచి
ఫలితాల
నందించాలని
మీరు
ఆశిస్తున్నారు.
దానికి
చేయవలసిన
ప్రయత్నములు
మీరు
చేయాలి.
భగవంతుడు
మీకు
ప్రసాదించిన
మతిని,
గతిని,
స్థితిని,
సంపత్తిని
సద్వినియోగపరచుకోవాలి.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యాదులు
మీకు
భగవంతుడు
అందించినవి
కావు;
మీ
ఆహార,
విహారములచేత
ఏర్పడినవి.
ఇవన్నీ
ప్రవృత్తి
లక్షణాలు.
ఉద్యోగాలు
చేయటం,
పదవుల
నేలటం,
ధనమును
సంపాదించటం
ఇవన్నీ
ప్రవృత్తి
లక్షణాలే.
ఇవి
తలనుండి
ఆవిర్భవిస్తున్నాయి;
ఏనాటికైనా
మారిపోతాయి.
కాని,
హృదయంనుండి
ఆవిర్భవించే
నివృత్తి
లక్షణాలు
శాశ్వతమైనవిగా,
స్వచ్ఛమైనవిగా,
యుక్తమైనవిగా,
సరళమైనవిగా
ఉంటాయి.
ఇలాంటి
నివృత్తి
లక్షణాలను
మీయందే
పెట్టుకొని,
వాటిని
మూసిపెట్టి,
మీరు
ప్రవృత్తికోసం
ప్రాకులాడుతున్నారు.
ప్రవృత్తికోసం
ప్రాకులాడటంచేతనే
మీకు
సద్గతి
ప్రాప్తించటం
లేదు.
చేసేవన్నీ
ప్రవృత్తి
పనులు,
ఆశించేవి
మాత్రం
నివృత్తి
ఫలితాలు!
ఇదెలా
సాధ్యం?
ప్రవృత్తిని
నివృత్తిగా
మార్చుకోవాలి.
ప్రవృత్తిమార్గంలో
ఎంత
ప్రయత్నించినా
మీకు
శాంతి
లభించదు.
ఒక
చిన్న
ఉదాహరణ
చూడండి
-
మీరెన్నో
సంవత్సరముల
నుండి
తిన్నకడుపుకే
తింటున్నారు
కదా!
“అబ్బ!
ఇన్ని
దినాలు
తిన్నాము!
ఇంకెలా
తింటాం”
అని
మీకు
ఏనాడైనా
విసుగు
పుడుతున్నదా?
ఈనాడు
తిని
తిరిగి
రేపటికోసం
ప్రయత్నం
చేస్తున్నారు.
రుచులు
మారుతున్నాయి
గాని,
ఆకలి
మారటం
లేదు.
అన్నములవి
వేరు,
ఆకలి
ఒకటే
శృంగారములు
వేరు,
బంగార
మొక్కటే
పశుల
వన్నెలు
వేరు,
పాలు
ఒకటే
జీవజాతులు
వేరు,
జీవుండు
ఒక్కడే
దర్శనంబులు
వేరు,
దైవంబు
ఒక్కడే
తెలియలేకను
మానవుల్
తెలివి
దప్పి
బ్రతుకుకోసము
బహుబాధ
బద్ధులైరి
6
▾
Meaning
Keep
బ్రతుకుకోసం
మానవుడు
అనేక
భ్రమలకు
గురి
అవుతున్నాడు.
క్షణభంగురమైన
బ్రతుకుకోసం
ఎందుకిన్ని
బాధలు
పడటం?
ఉన్నంతవరకు
సత్యమార్గమును
అనుసరించాలి.
అప్పుడే
మానవత్వం
సార్థకమవుతుంది.
ఎంత
కాలమైనా
అనిత్యమైన,
అసత్యమైన
కర్మలనే
ఆచరిస్తూ
ఉంటే
నిత్యసత్యమైన
శాంతి
ఏరీతిగా
లభిస్తుంది?
నిత్యసత్యమైన
కర్మలను
ఆచరించినప్పుడే
నిత్యసత్యమైన
శాంతి
లభిస్తుంది.
చెడ్డ
విషయాలను
పట్టించుకుంటే
నెత్తినెక్కుతాయి
ఏవైనా
చెడ్డ
విషయాలు
మీచెంతకు
వస్తే
వాటికి
ఏమాత్రమూ
మనసివ్వకూడదు.
మనసిస్తే
అవి
మీలో
నిలిచిపోతాయి.
పట్టించుకోకపోతే
వాటిదారిన
అవి
వెళ్ళిపోతాయి.
ఒక
చిన్న
ఉదాహరణ
:
ఎవరో
మీ
బంధువు
సూట్‌కేసు
పట్టుకుని
మీ
ఇంటిముందుకు
వచ్చాడు.
వస్తూనే
అతనికి
ఎదురు
వెళ్ళి
“ఏమండీ!
ఎలా
ఉన్నారు?”
అంటూ
కుశల
ప్రశ్నలు
వేస్తే
చాలు,
తక్షణమే
అతడు
తన
పెట్టెతో
సహా
మీ
ఇంట్లోకి
వచ్చేస్తాడు.
అట్లుగాకుండా
అతడు
ద్వారం
దగ్గరకు
వచ్చినప్పుడు
అతనితో
మాట్లాడకుండా
ఊరుకుంటే,
అతడు
ఏ
లాడ్జికో,
హోటల్‌కో
వెళ్ళిపోతాడు.
మీరు
పలకరిస్తేనే
అతడు
మీ
ఇంట్లోకి
ప్రవేశిస్తాడు,
లేకపోతే
మరోచోటికి
వెళ్ళిపోతాడు.
అదేరీతిగా
మీ
దగ్గరకు
ఏవైనా
చెడ్డవిషయాలు,
చెడ్డభావాలు
వస్తే
వాటితో
స్నేహం
చేయకుండా,
వాటిని
చూసిచూడనట్లు
వదలిపెట్టండి.
అవి
ఎక్కడికి
పోవాలో
అక్కడికి
వెళ్ళిపోతాయి,
మీలో
ప్రవేశించవు.
అట్లుగాకుండా
వాటిని
చూసి
‘హలో,
హలో...’
అని
పలకరిస్తూ
వాటితో
స్నేహం
చేసుకుంటే,
అవి
వచ్చి
మీ
నెత్తినెక్కి
కూర్చుంటాయి.
కనుక,
చెడ్డను
ఏమాత్రమూ
పలకరించకూడదు,
చూడకూడదు,
వినకూడదు.
అదే
నిజమైన
మానవత్వం.
మీరొక
ఇల్లు
కట్టుకున్నారు.
ఆ
ఇంటికి
అనేక
ద్వారములు
పెట్టుకున్నారు.
వాటిద్వారా
మీ
బంధుమిత్రులను
లోపలికి
రానిస్తారుగాని,
బజార్లో
పోయే
గాడిదలను,
పందులను
రానివ్వరు
కదా!
7
▾
Meaning
Keep
అదేరీతిగా
మీ
దేహమునకు
నవద్వారము
లున్నాయి.
వాటి
ద్వారా
పవిత్రమైనవాటినే
ప్రవేశపెట్టుకోవాలి.
ఏది
అవసరము,
ఏది
కాదు,
అనే
విచక్షణను
ఉపయోగించాలి.
అప్పుడే
మీరు
ధన్యులౌతారు,
పుణ్యులౌతారు,
పవిత్రులౌతారు;
పరమ
పావనులౌతారు;
అమృతత్త్వాన్ని
పొందుతారు;
ఆనందాన్ని
అనుభవిస్తారు.
నూతన
సంవత్సరం
క్రొత్త
విషయాలనేమీ
తీసికొనిరాదు.
అన్నీ
పాతదినములే
వస్తుంటాయి;
పాత
ఫలితములే
వస్తుంటాయి.
మీలో
నూతనమైన,
పవిత్రమైన
భావములు
ఏనాడు
ఆవిర్భవిస్తాయో
ఆనాడే
నూతన
సంవత్సరానికి
నాంది.
మీరు
అనేక
సంవత్సరాలుగా
భజనలు
చేస్తున్నారు,
పూజలు
చేస్తున్నారు,
సేవలు
చేస్తున్నారు.
కాని,
మీ
హృదయంలో
ఏమైనా
మార్పు
వచ్చిందా?
మీలో
దయాదాక్షిణ్యములు
కల్గుతున్నాయా?
దయగల
హృదయమే
దైవమందిరం.
దయ
లేని
హృదయం
దయ్యాల
మందిరమే!
మీరు
దయాహృదయులు
కావాలి.
దీనిని
మీరు
నూతన
సంవత్సరంగా
భావిస్తున్నారు
కనుక,
ఈ
నూతన
సంవత్సరంలో
మీలో
నూతనమైన,
ఆదర్శవంతమైన
భావాలు
కలగాలని,
మీరు
శాంతిసంతోషాలను
అనుభవించాలని
ఆశిస్తున్నాను,
ఆశీర్వదిస్తున్నాను.
మీరు
ఏది
మంచిదని
విశ్వసిస్తారో
దానిని
పదిమందికి
బోధించి,
ఆదర్శప్రాయులుగా
నిలవాలని
కోరుతున్నాను.
ఈ
నూతన
సంవత్సరంలో
పాత
భావాలను,
రోతభావాలను
ప్రక్కకు
నెట్టివేయండి.
పాతభావాలను
పారవేస్తేగాని
నూతన
భావాలు
ప్రవేశించవు.
ఒక్క
దైవభావమును
మీలో
చేర్చుకోండి.
ఇంకే
దుర్భావమూ
ప్రవేశించటానికి
వీలుండదు.
అప్పుడే
మీకు
శాంతి
లభిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
అందరూ
కూడా
రేపటి
నుంచి
శాంతి
సౌభాగ్యముగా
సంతోష
సదుపాయముగా
జీవిస్తారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
The Slander of the Jealous Cannot Move Satya
Next
Doctors must serve the poor in a spirit of sacrifice
→