Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · The Slander of the Jealous Cannot Move Satya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Slander of the Jealous Cannot Move Satya
25 December 2000, Christmas, Brindavan
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులైన
విద్యార్థినీ
విద్యార్థులారా!
ప్రాచీన
కాలమునుండి
ఈ
పవిత్రమైన
భారతీయ
సంస్కృతిని
యావత్ప్రపంచమునకు
చాటి
ప్రఖ్యాతి
గాంచిన
మహనీయుల
చరిత్రను,
ఆధ్యాత్మిక
తత్త్వమును
భారతీయులీనాడు
విస్మరిస్తున్నారు.
భారతదేశం
ఒక్క
ఆధ్యాత్మిక
సంపత్తిపైన
ఆధారపడిఉన్నది
గాని,
అన్యశక్తులపై
కాదనే
సత్యాన్ని
మీరు
గుర్తించాలి.
అన్ని
కాలములందూ
ప్రపంచములోని
అన్ని
దేశములకూ
దివ్యమైన
కాంతులను
ప్రసరింపచేసిన
పవిత్ర
భారతదేశముయొక్క
స్థితి
ఈనాడేవిధంగా
ఉన్నదో
మీరే
యోచించుకోవచ్చును.
ప్రాచీనకాలంలో
అనేకమంది
మహనీయులు
ప్రపంచానికి
ఆదర్శమును
అందించుటకు
అనేక
బాధలనుభవించారు.
ఎన్ని
కష్టనష్టము
లెదురైనను
వారు
తమ
దీక్ష
విడనాడలేదు.
అట్టి
ఆదర్శమూర్తులలో
ఒకడైన
జీసస్యొక్క
తత్త్వాన్ని
ఈనాడు
మీరు
జ్ఞాపకం
చేసుకోవాలి.
జీసస్
జన్మించిననాటినుండి
అనేక
విధములైన
కష్టములకు,
నష్టములకు
గురియౌతూ
వచ్చాడు.
తరతరాలనుండి,
యుగయుగాలనుండి
ఇలాంటి
మహనీయులు,
మహత్తరమైన
శక్తిసంపన్నులు
దివ్యమైన
భావములచేత
ప్రజలకు
ఉపదేశములు
చేస్తూ
ఉపకారములు
సల్పుతూ,
జగత్తును
ఉద్ధరించుటకు
పాటుపడ్డారు.
కాని,
మూర్ఖులైన
మానవులు
వారి
చర్యలలోని
అంతరార్థమును
గుర్తించలేక
ఆ
మహనీయులను,
వారి
ఆధ్యాత్మిక
తత్త్వమును
అవమానపరుస్తూ
వచ్చారు.
ఆనాడు
జూడాస్
ఒక్కడే,
ఈనాడు
ఎంతమందో!
ఉత్తమపురుషులయొక్క
దివ్యత్వం
జగద్వ్యాప్తి
అయినప్పుడు
అనేకమందికి
అసూయ
బయల్దేరుతుంది.
అసూయ,
అనసూయ
ఇరువురూ
అక్కచెల్లెళ్ళు.
అసూయయొక్క
పుత్రులు
కామ,
క్రోధ,
ద్వేషములు.
అనసూయయొక్క
పుత్రులు
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వరులు.
అసూయయొక్క
పుత్రులు
జీసస్‌ను
అనేక
విధములుగా
హింసించారు.
సమాజానికి
శాంతిభద్రతల
నందించగోరి
జీసస్
అనేక
పాట్లుపడ్డాడు.
బీదసాదలను,
కష్టజీవులను
కరుణతో
ఆదుకున్నాడు.
2
▾
Meaning
Keep
జీసస్
చేసే
పవిత్ర
కార్యములను
చూసి
సహించుకోలేక
కొంతమంది
అతనిని
అనేక
ఇక్కట్లకు
గురిచేస్తూ
వచ్చారు.
దినదినమునకూ
అతనిపై
ద్వేషం
పెంచుకున్నారు.
అతని
పేరు
ప్రఖ్యాతులు
పెరిగిపోతున్నాయన్న
అసూయతో
అర్చకులుకూడా
అతనికి
విరుద్ధంగా
ప్రచారం
చేస్తూ
వచ్చారు.
బెస్తవారు
మాత్రం
అతనికి
శిష్యులై,
అతనిని
ప్రేమిస్తూ,
ఆరాధిస్తూ
వచ్చారు.
ఓర్వలేనివారు
అతనికి
అనేక
ఆటంకములు
కలిగించి
బాధలు
పెట్టారు.
కట్టకడపటికి
అతని
ప్రాణం
తీయటానికికూడా
ప్రయత్నించారు.
ఇందులో
జూడాస్
అనే
శిష్యుడుకూడా
పాల్గొన్నాడు.
జీసస్కు
పన్నెండుమంది
శిష్యులుండేవారు.
వారిలో
పన్నెండవవాడు
జూడాస్.
ఆనాడు,
ఒక్క
జూడాసే
ఉండినాడు.
ఈనాడు
అనేకమంది
జూడాస్లు
బయల్దేరినారు.
కనుకనే
జగత్తులో
అశాంతి
పెరిగిపోయింది.
కొంతమంది
అసూయాపరులు
అల్పబుద్ధి
గల
జూడాస్కు
ధనాశ
కల్పించి
అతనిని
లోబర్చుకున్నారు.
కేవలం
కొన్ని
వెండి
నాణెములను
ఆశించి
జూడాస్
తన
గురువుకు
ద్రోహం
చేశాడు.
“ధనమూల
మిదం
జగత్”
అనే
భావన
ప్రజలలో
రెండువేల
సంవత్సరములకు
పూర్వమే
ప్రారంభమైంది.
అసూయతోనే
సాయికి
విరుద్ధంగా
దుష్ప్రచారం
ధనంకోసం
పరులకు
అపకారం
చేయటం,
అన్యాయ,
అక్రమ,
అనాచారములకు
పాల్పడటం,
లేని
చెడ్డను
సృష్టించి
పవిత్రమైన,
నిత్యమైన
సత్యమునకు
విరుద్ధంగా
ప్రచారం
చేయటం
-
ఇది
ఆనాడే
కాదు,
ఈనాడూ
జరుగుతూనే
ఉన్నది.
ఇది
లోక
సహజం.
దీనికి
ఎవ్వరూ
వెఱువకూడదు.
మనలో
లేని
దోషాలకు
మనమెందుకు
భయపడాలి?
మనలో
లేని
తప్పులకు
మనమెందుకు
వెఱవాలి?
సత్యనిత్యమైన
భావములచేత
ప్రపంచ
ప్రఖ్యాతి
గాంచిన
దివ్యపురుషులకు
విరుద్ధంగా
దుర్మార్గులు,
అసూయాపరులు
దుష్ప్రచారం
చేయటం
అనాది
కాలమునుండి
జరుగుతూనే
ఉన్నది.
ఈనాడుకూడా
అలాంటి
దుష్ప్రచారాల
కేమీ
తక్కువలేదు.
సాయియొక్క
పేరు
ప్రతిష్ఠలు
దినదినమునకూ
పెరిగిపోవటం
చూసి
అనేకమందికి
అసూయ
కల్గుతోంది.
పోనీ
వారేమైనా
మంచి
పనులు
చేస్తున్నారా
అంటే,
కనీసం
ప్రయత్నమైనా
చేయటం
లేదు.
3
▾
Meaning
Keep
సాయి
చేస్తున్న
స్వార్థరహిత
సేవ
ప్రఖ్యాతి
గాంచిన
రాయలసీమకు
బ్రిటీషువారి
కాలమునుండి
ఒక్కరైనా
త్రాగునీరు
అందించలేకపోయారు.
ఎంతమందో
శ్రీమంతులు,
నాయకులు
ఉండినారు.
కాని
ఒక్కరైనా
ఈ
మంచి
కార్యమునకు
పూనుకోలేదు.
మనిషికి
నీరే
ప్రాణం
కాబట్టి,
ఇంటింటికీ
నీరు
అందించాడు
సాయిబాబా.
ఈనాడు
ఒక
హార్ట్
ఆపరేషన్
చేయించుకోవాలంటే
లక్షల
రూపాయలు
కావాలి.
సూపర్
స్పెషాలిటీ
హాస్పటల్స్‌ను
కట్టించి
లక్షలాదిమందికి
ఉచితంగా
హార్ట్
ఆపరేషన్లను
చేయిస్తున్నాడు
సాయిబాబా.
ఈ
రోజుల్లో
పసిపిల్లవానిని
స్కూల్లో
చేర్చాలంటే
మొట్టమొదట
20
వేల
డొనేషన్
కట్టాలి.
కాని,
సాయిబాబా
కె.జి
మొదలు
పి.జి
వరకు
ఉచిత
విద్యనందిస్తున్నాడు.
ఇందులో
వేయింట
ఒక
భాగమైనా
ఎవరైనా
చేస్తున్నారా?
ఏ
గవర్నమెంటు
అయినా
విద్య,
వైద్యమును
ఉచితంగా
అందిస్తున్నదా?
లేదు,
లేదు,
ఒక్క
సత్యసాయిబాబా
మాత్రమే
స్వార్థమనేది
లేకుండా
పరార్థం
కోసం
పాటు
పడుతున్నాడు.
కాని,
అయోగ్యులైన
మానవులు
కొందరు
సాయికి
విరుద్ధంగా
దుష్ప్రచారమును
ప్రారంభించారు.
సాయి
చేస్తున్న
పనులెలాంటివి,
అనే
జ్ఞానం
వారికి
లేకుండా
పోతున్నది.
మహా
అల్పజ్ఞులైపోతున్నారు,
ఈ
విద్యావంతులంతా.
సాయిది
చాలా
పవిత్రమైన
హృదయం,
నిర్మలమైన
భావం,
నిస్వార్థమైన
ప్రేమ.
Purity
(పవిత్రత),
Patience
శాంతము,
Perseverance
(పట్టుదల)
ఈ
మూడు
P
లు
సత్యసాయిబాబాలో
ఉన్నాయి.
ఈ
మూడింటిద్వారా
స్వార్థ
రహితసేవ
చేస్తున్నాడు
సత్యసాయిబాబా.
సత్యసాయిబాబాలో
కాలిగోటినుండి
తలవెంట్రుకవరకు
ఎక్కడా
స్వార్థమనేది
లేదు.
తలలున్నవారు
ఇంతమాత్రం
యోచించుకొనలేరా?
ఎందుకోసం
వీరి
దుష్ప్రచారములు?
ధనంకోసమే!
ఈ
దుర్బుద్ధులంతా
ధనంకోసమే.
ఈ
దురాలోచనలంతా
ధనం
కోసమే.
ఇంతేకాకుండా,
డబ్బులు
ఇచ్చి
ఒక
మతమునుండి
మరొక
మతములోకి
మార్పిడి
చేస్తున్నారు.
కాషాయ
వస్త్రములను
ధరించిన
స్వాములుకూడా
ఒకరి
గురించి
మరొకరు
దుష్ప్రచారమునకు
పాల్పడుతున్నారు.
4
▾
Meaning
Keep
Also in his talks
(3)
7 January 1988
Life is fulfilled only when every action is done to please God
19 October 1988
The Chief Goal of Man Is Bhakti for God Itself!
28 January 1992
The good fortune of seeing one's own svarūpa is Jñāna
“కాషాయ
వస్త్రంబు
కట్టిన
మాత్రాన
కరతలామలకంబు
కాదు
ముక్తి
నోటితో
మంత్రంబు
నుచ్చరించినయంత
చేసిన
పాపంబు
చెదరిపోదు
గీతను
చేబట్టి
కేకలు
వేసిన
పుణ్యము
మన
ఇంట
ప్రోవుపడదు”
కొందరు
స్వాములుకూడా
దుర్మార్గంలో
ప్రవేశించి
దుష్ప్రచారం
చేస్తున్నారు.
ఇంక,
పీఠాధిపతుల
సంగతి
చెప్పనక్కర్లేదు.
ఎవ్వరినీ
మనం
విమర్శించకూడదు
గాని,
సమయం
వచ్చింది
కాబట్టి
చెబుతున్నాను.
ఈ
దుష్ప్రచారం
గురించి
మీరు
ఎలాంటి
భయమూ
పెట్టుకోకండి.
బలహీనతకు
లోనయ్యేవారు
భక్తులు
కాజాలరు
ఇప్పుడు
బెంగుళూరులో
కూడా
300
కోట్ల
రూపాయలు
ఖర్చుపెట్టి
సూపర్
స్పెషాలిటీ
హాస్పిటల్
కడుతున్నాము.
ఇలాంటి
పవిత్రమైన
కార్యంలో
ఏ
నాయకుడైనా
ప్రవేశిస్తున్నాడా?
లేదు.
పైగా,
గొప్పలు
చెప్పుకుంటూ
కూర్చుంటున్నారు.
సిగ్గుచేటు!
కొందరు
అసూయతో
దుష్ప్రచారానికి
పాల్పడుతున్నారు.
ఇతరులు
చేసే
పవిత్రకార్యాలకు
అసూయతో
అడ్డు
తగిలేవారు
రాక్షసులేగాని,
మానవులు
కారు.
ఇలాంటి
రాక్షసులు
లోకమంతా
బయల్దేరినా
సాయిప్రతిజ్ఞ
ఎప్పటికీ
మారదు.
అసూయాపరులు
దుష్ప్రచారంచేత
సాయిబాబా
గౌరవమును
తగ్గించాలని
ప్రయత్నం
చేస్తున్నారు.
నాకు
గౌరవం
కావాలనే
ఆశ
లేదు.
కాని
అది
పెరుగుతూనే
ఉన్నది.
మన
భారతదేశమంత
అక్షరాలతో
ఈ
ప్రపంచమంతా
ప్రచారం
చేసినా
నా
గౌరవం
కించిత్తైనా
తగ్గిపోదు.
ఈ
దుష్ప్రచారం
చూసి
కొంతమంది
భక్తులు
బలహీనతకు
లోనవుతున్నారు.
వారు
సరియైన
భక్తులు
కారు.
సాయిశక్తులను
ఇన్ని
గమనించికూడను
ఈ
పిచ్చి
పిచ్చి
కాకికూతలకు
ఎందుకు
భయపడాలి?
గోడలపై
వ్రాసే
వ్రాతలను,
వేదికపై
వేసే
కేకలను,
పేపర్లలో
వ్రాసే
బూతుకూతలను
మీరు
లెక్క
చేయనక్కరలేదు.
మన
సత్యాన్ని,
మన
ధర్మాన్ని,
మన
ప్రేమను
మనం
ప్రచారం
చేస్తూ
రావాలి.
5
▾
Meaning
Keep
ప్రేమయే
నా
ప్రాణం,
జ్ఞానమే
నేనందించే
ఫలం
సత్యసాయిబాబా
ఏ
క్షణమైనా
స్వార్థమనేది
ఎఱుగనే
ఎఱుగడు.
నా
ప్రతిజ్ఞ
ఒక్కటియే.
ఎన్ని
కోట్లైనా
ఖర్చుపెట్టి
బీదల
కష్టములను
నివారణ
గావించాలి.
వారి
పొట్టకింత
అన్నం
పెట్టాలి.
వారి
పిల్లలకు
చదువు
చెప్పించాలి.
గొప్ప
గొప్ప
కోటీశ్వరులుకూడా
ఇలాంటి
సత్కార్యములకు
పూనుకోవటం
లేదు.
“అమ్మా,
ఆకలి”
అంటూ
తమ
ఇంటిముందుకు
వచ్చినవారిపై
కొంతమంది
శ్రీమంతులు
నిర్దాక్షిణ్యంగా
కుక్కను
విడిచిపెట్టి
వారిని
తరిమివేస్తున్నారు.
ఇలాంటివారా
అధికారులు?
ఛీ,
ఛీ,
ఇలాంటివారు
మానవులనుకోవటంకూడా
అవమానమే!
నేడు
సాయిబాబా
గురించి
దుష్ప్రచారం
చేస్తున్నవారు
సాయిబాబా
చేస్తున్న
సత్కార్యములలో
వేయింట
ఒక
భాగమైనా
చేయగల్గుతున్నారా?
ఇంకవారు
ఏ
మొహం
పెట్టుకొని
దుష్ప్రచారానికి
ముందుకు
వస్తున్నారు?
అది
వారికే
అవమానం!
సత్యసాయిబాబాను
అనుసరించి
లోకానికి
సరియైన
మార్గాన్ని
చూపించండి.
నాకు
ఎట్టి
ఆశలూ
లేవు,
ఎట్టి
వాంఛలూ
లేవు,
ఏమాత్రమూ
అసూయ
లేదు.
నాకు
ఎప్పుడూ
ప్రేమయే,
ప్రేమయే!
ప్రేమయే
నా
ప్రాణం,
జ్ఞానమే
నేనందించే
ఫలం.
వీటినే
నేను
ఆధారం
చేసుకున్నాను.
కనుక,
ధనమును
ఆశ
చూపి
దుష్ప్రచారం
చేయించినవారు
ఎప్పటికైనా
పతనమైపోతారు;
ఇంక
చేసినవారి
సంగతి
చెప్పనక్కర్లేదు.
ధనమును
దానధర్మాల
నిమిత్తం
వినియోగించాలిగాని,
ఇలాంటి
దుష్ప్రచారాలకోసంకాదు.
ఎవరు
ఏవిధమైన
దుష్ప్రచారం
చేసినా
నేను
భయపడను.
సత్యానికి
భయమెందుకు?
ధర్మానికి
భయమెందుకు?
ప్రేమకు
భయమెందుకు?
ఏమీ
భయపడనక్కర్లేదు.
నాదెప్పుడూ
సత్యమార్గమే,
ధర్మమార్గమే,
ప్రేమమార్గమే!
నా
ప్రేమతత్త్వాన్ని
మీకీనాడు
పూర్తిగా
వివరించి
చెబుతున్నాను.
ప్రతి
అవతారమూ
ఇలాంటి
దుర్మార్గులను
ఎదుర్కొనక
తప్పలేదు.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించటానికి
అవతరించిన
కృష్ణునిపట్ల
దుర్మార్గులైన
కంస,
శిశుపాల,
దంతవక్త్రాదులు
ద్వేషం
పూనారు.
ధర్మసంస్థాపన
నిమిత్తం
అవతరించిన
రాముడు
అరణ్యవాసం
చేయవలసివచ్చింది.
రావణుడు
అతని
ధర్మపత్నిని
అపహరించి
అనేక
కష్టాలకు
గురి
చేశాడు.
అయితే,
వీరిని
బాధపెట్టినవారు
ఎవరైనా
ఏమైనా
సాధించారా?
ఏమీ
లేదు.
దైవాన్ని
దూషించటం,
దైవాన్ని
బాధపెట్టటం
మహాపాపం.
పుణ్యం
చేయడానికి
చేతకాకపోతే
నోరుమూసుకొని
కూర్చోవటం
మంచిది;
ఇలాంటి
పాపకార్యములో
ప్రవేశించకూడదు.
6
▾
Meaning
Keep
మా
పిల్లలు
బంగారం
వంటివారు
సత్యంతో
జీవించండి.
ధర్మంతో
జీవించండి.
ప్రేమతో
అందరూ
ఏకం
కండి.
ప్రతి
మానవునియందున్న
ప్రేమ
ఒక్కటే!
మీయందున్న
ప్రేమయే
పరులయందుకూడా
ఉన్నది.
అందరియందున్న
ప్రేమ
ఏకమైనప్పుడు
విశ్వకుటుంబం
ఏర్పడుతుంది.
ప్రేమను
ముక్కలు
చేసి,
ద్వేషాన్ని
పెంచేవారికి
ఏమీ
సుఖముండదు.
నేను
అహర్నిశలు
ప్రేమతోనే
కాలం
గడుపుతున్నాను.
ఎంతోమంది
విద్యార్థులకు
విద్యను
ఉచితంగా
నేర్పిస్తున్నాను.
ఉచిత
విద్య
మాత్రమే
కాదు,
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందిస్తున్నాను.
కాని
కొంతమంది
తమ
దుర్భావములను
ఈ
పిల్లలపైన
రుద్ది
వారినికూడా
పాడుచేయటానికి
ప్రయత్నిస్తున్నారు.
కాని,
మా
పిల్లలు
బంగారంవంటివారు.
మా
పిల్లల
పాదధూళి
తీసుకున్నా
వారికి
ఆ
దుర్బుద్ధులు
పుట్టవు.
మా
విద్యాసంస్థల్లో
చదువుకున్న
పిల్లలు
ఎంతో
పవిత్రమైన,
ఆదర్శవంతమైన
జీవితాన్ని
గడుపుతున్నారు.
ఆడపిల్లలు
“మెస్సెంజర్స్
ఆఫ్
సత్యసాయి”
అనే
పేరు
పెట్టుకొని
ఎన్నో
దేశాల్లో
ఎన్నో
సేవలు
చేస్తున్నారు.
తాము
చేయటమేగాక,
తమ
భర్తలతోకూడా
చేయిస్తున్నారు.
స్విట్జర్లాండ్,
అమెరికా,
జపాన్,
రష్యా,
చైనా
మున్నగు
అనేక
దేశాల్లో
మా
పిల్లలు
పనిచేస్తున్నారు.
ఆ
పిల్లలకు
కొంతమంది
విదేశీయులు
డబ్బు
ఆశ
చూపించి,
సత్యసాయిబాబాకు
విరుద్ధంగా
కొన్ని
స్టోరీలను
వ్రాయమంటున్నారు.
మతప్రచారం
సల్పేవారు
ఇట్టి
దుష్ప్రచారానికి
పూనుకొని,
స్విట్జర్లాండులో
ఒక
అమ్మాయిని
ఈవిధంగా
అడిగినప్పుడు
ఆ
అమ్మాయి
కోపంతో
తాను
కాలికి
తొడుక్కున్న
బూటును
తీసింది.
“ఇదేనా
మీ
మతం
నేర్పే
సత్యము?
ఇదేనా
మీ
మతం
బోధించే
ఆదర్శము?
ఛీ,
పొమ్మ”ని
గట్టిగా
అరిచింది.
కాని,
కొంతమంది
‘జూడాస్’
లు
డబ్బుకోసం
ఆశపడి
ఈ
దుర్మార్గంలో
ప్రవేశిస్తున్నారు.
ఆనాడు
జూడాస్
గతి
ఏమైంది?
“ఛీ,
నా
గురువుకు
నేనింత
ద్రోహం
చేసితినా!
నేను
దైవద్రోహిని”
అని
ఏడుస్తూ
తలకొట్టుకున్నాడు.
అన్ని
ద్రోహములకంటే
దైవద్రోహం
చాలా
చెడ్డది.
ఎన్ని
జన్మలెత్తినా
ఆ
పాపం
తీరదు.
కనుక
దైవద్రోహానికి
ఎవ్వరూ
పూనుకోకూడదు.
7
▾
Meaning
Keep
విమర్శలవల్ల
ఘనత
పెరుగుతుందేగాని,
తరగదు
అందరినీ
ప్రేమించండి.
మిమ్మల్ని
దూషించేవారికికూడా
నమస్కరించండి.
ఎందుకనగా,
అందరియందున్న
దైవత్వం
ఒక్కటే!
అందరియందున్న
ప్రేమతత్త్వం
ఒక్కటే!
క్షణికావేశానికి
గురియై
మీ
మనస్సులను
పాడుచేసుకోకండి.
ప్రేమతో
దైవప్రార్థన
చేయండి.
ఇలాంటి
విమర్శలు
ప్రతి
అవతారమునకూ
వస్తూనే
ఉంటాయి.
‘ఎందుకు
రావాలి?’
అని
కొంతమంది
ప్రశ్నిస్తారు.
అవి
వస్తేనే
వీరి
ఘనత
పెరుగుతుంది.
ఎక్కడ
ప్రకాశం
ఉంటుందో
దాని
ప్రక్కనే
నీడ
కూడా
ఉంటుంది.
నీడ
వచ్చిందని
మనం
భయపడకూడదు.
నీడయందు
కూడా
ఎండ
ఉంది.
ఎండనీడలయొక్క
సంబంధబాంధవ్యము
ఏకత్వమేగాని,
భిన్నత్వం
కాదు.
కనుక
స్వామి
విషయమే
కాదు,
ఏ
పెద్దల
విషయమైనా
ఎవరు
ఏవిధంగా
విమర్శించినా
మీరేమాత్రమూ
చర్య
తీసుకోకండి.
అది
మాకు
సంబంధించింది
కాదని
వదలిపెట్టండి.
వారు
చెప్పే
దోషాలు
మనలో
ఉన్నప్పుడు
మనం
సరిదిద్దు
కోవచ్చు.
ఆ
దోషాలు
మనలో
లేనప్పుడు
వారి
మాటలను
పట్టించుకోనక్కర్లేదు.
“ఆదోషాలు
నావి
కావు,
ఎవరివో”
అని
స్వేచ్ఛగా,
ఆనందంగా
ఉండండి.
వారిలో
వారు
దూషిస్తే
వారికే
చెందుతుంది.
కాబట్టి
మనకెందుకు
బాధ?
“ఏది
జరిగినా
నా
మంచికోసమే”
అనే
సమరస
భావంతో
జీవితాన్ని
గడపండి.
దూషణ,
భూషణలపట్ల
సమత్వం
వహించాలి
ఇంకా
మున్ముందు
ఎన్నో
గొప్ప
కార్యములు
జరగబోతున్నాయి.
సత్యసాయి
చేయలేని
కార్యము
ఏదీ
లేదు.
అందరికీ
ఆశ్చర్యం
కలిగించే
చర్యలు
చేయగలడు.
“లోకాస్సమస్తాః
సుఖినోభవంతు”.
అందరూ
సుఖంగా
ఉండాలి
అన్నదే
సాయి
ఆశయం.
అందరి
సుఖం
కోరేవారికి
ఎట్టి
కష్టములూ
రావు;
వచ్చినా
అవి
వారిని
ఏమీ
చేయలేవు.
ఒక
చిన్న
ఉదాహరణ:
ఒక
పర్యాయం
బుద్ధుడు
ఎక్కడికో
వెళుతున్నప్పుడు
అసూయా
రాక్షసి
అతనికి
ఎదురు
వచ్చి
“బుద్ధా!
నిన్ను
నేను
చంపి
భుజిస్తాను”
అని
బెదిరించింది.
బుద్ధుడు
చిరునవ్వు
నవ్వి
“నాపై
అసూయతో
నన్ను
చంపాలని
వస్తున్నావా?
నిన్నుకూడా
నేను
ప్రేమిస్తున్నాను,”
అన్నాడు.
బుద్ధుడు
ఈవిధంగా
పలికేసరికి
ఆ
అసూయా
రాక్షసి
శాంతి,
ప్రేమలకు
చిహ్నమైన
పావురంగా
మారి
ఎగిరిపోయింది.
8
▾
Meaning
Keep
కనుక
అసూయను,
క్రోధమును,
ద్వేషమును
ప్రేమతో
జయించాలి;
శాంతమును
పెంచుకోవాలి.
అప్పుడే
మీరు
నిజమైన
భక్తులవుతారు.
పొగిడితే
ఆనందించడం,
తెగిడితే
ద్వేషించడం
మంచిదికాదు.
రెండింటిపట్ల
మనం
సమత్వం
వహించాలి.
దూషించినారని
వారిపట్ల
ద్వేషం
పెట్టుకోకూడదు;
భూషించినారని
వారితో
స్నేహం
పెంచుకోకూడదు.
దూషణ,
భూషణ,
తిరస్కారములు
వారి
నోటికే
గాని,
మనకు
కాదు.
కనుక
మీరు
ఎవరిపైనా
ద్వేషం
పెట్టుకోకండి.
ఎక్కడైనా
మంచిని
చూడండి,
తీసుకోండి;
చెడ్డ
ఎక్కడున్నా
దానిని
చూడకుండా
వదలిపెట్టండి.
దూషణ,
భూషణ,
తిరస్కారములు
ఎన్ని
కల్గినప్పటికీ
సాయిని
కదిలించేవాడు
లేడు.
సాయి
ఎప్పుడూ
సత్యములో
నిలిచినవాడు.
సత్యాన్ని
ఎవ్వరూ
ఏమాత్రమూ
కదిలించలేరు.
ఈ
విధమైన
దృఢ
నమ్మకంతో
జీవించండి;
దైవ
విశ్వాసాన్ని
దినదినానికి
పెంచుకోండి.
అది
పెరిగితే
ఈ
దుర్మార్గమంతా
భస్మమైపోతుంది.
మీరు
విన్న
విషయాలను
హృదయంలో
పదిలపరచుకొని,
మీరు
చేస్తున్న
సాధనలను
కొనసాగించండి.
భగవంతుడు
సర్వహృదయవాసి
ఆనాడు
జీసస్‌ను
అన్ని
కష్టాలు
పెట్టటం
వల్లనే
కదా
ఈనాడు
లోకమంతా
అతనిని
పూజిస్తున్నది.
ఒకానొక
సమయంలో
ఒక
శిష్యుడు
జీసస్‌ను
అడిగాడు
-
“గురూజీ!
నాకు
ఏవైనా
కష్టాలు
కల్గినప్పుడు
వాటిని
ఏరీతిగా
పరిహారం
గావించుకోవాలి?”
దీనికి
సమాధానంగా
జీసస్
“పిచ్చివాడా!
నీ
కష్టాలు
పరిహారం
కావాలనుకుంటున్నావా?
నీ
హృదయంలో
ఉన్న
భగవంతుణ్ణి
ప్రేమించు.
ఈవిధంగా
నీవు
అందరినీ
ప్రేమిస్తే
ఇంక
నీకు
దుఃఖం
ఎక్కడుంటుంది?
నీ
హృదయం
ఆనందంతో,
ప్రేమతో
నిండిపోతుంది”
అన్నాడు.
ఇదే
విషయాన్ని
ఒకానొక
సమయంలో
కృష్ణుడు
అర్జునునికి
బోధించాడు.
అర్జునుడు
“స్వామీ!
నీతో
సన్నిహిత
సంబంధ
బాంధవ్యం
గలవారు
ఎవరైనా
ఉన్నారా?”
అని
ప్రశ్నించినప్పుడు
కృష్ణుడు
“పిచ్చివాడా!
నాకు
సన్నిహితులు,
ద్వేషులు
అనే
భేదం
లేదు.
నేను
సర్వహృదయవాసిని.
నీ
హృదయంలో
ఉన్నదీ
నేనే,
నన్ను
దూషించేవారి
హృదయంలో
ఉన్నదీ
నేనే.
సర్వహృదయవాసి
అయిన
భగవంతుణ్ణి
ప్రేమించేవారే
నాకు
ప్రియమైనవారు.
అర్జునా!
ఇంతకాలమైనా
నీవీ
విషయాన్ని
తెలుసుకోలేదే!
నన్ను
నీ
రథంలో
కూర్చోబెట్టుకున్నావుగాని,
నీ
హృదయంలో
కూర్చోబెట్టుకోలేదే!”
అన్నాడు.
ప్రేమస్వరూపులారా!
మీ
హృదయంలో
భగవంతుణ్ణి
కూర్చోబెట్టుకోండి.
9
▾
Meaning
Keep
అయితే
భగవంతుడు
మీహృదయంలోనే
ఉన్నాడు;
మళ్ళీ
మీరు
ప్రత్యేకంగా
కూర్చోబెట్టుకోనక్కర్లేదు.
తాను
మీ
హృదయంలోనే
ఉన్నాడనే
సత్యాన్ని
మీరు
గుర్తిస్తే
చాలు.
అప్పుడు
మీరుకూడా
భగవత్స్వరూపులైపోతారు.
సత్యధర్మశాంతి
ప్రేమలే
మనకు
ఆధారములు
ఇప్పుడు
మీరు
ప్రపంచానికి
చాటవలసింది
ప్రేమతత్త్వం
ఒక్కటే.
ప్రేమ
తప్ప
జగత్తులో
మరొకటి
లేదు.
ప్రేమయే
దైవం.
ప్రేమయే
జీవితం.
ప్రేమయే
లోకం.
ప్రేమయే
ప్రాణం.
కనుక
ప్రేమను
పెంచుకోండి.
ఎలాంటి
పరిస్థితి
యందైనా
మీ
మనస్సును
చలించనీయకండి,
చలిస్తే
మనస్సు
చాలా
చెడిపోతుంది.
కనుకనే
ఒకసారి
త్యాగరాజు
“చలించకే
మనసా!
భ్రమించకే
మనసా!”
అని
గానం
చేశాడు.
భ్రమలో
పడి
బాధలకు
గురి
కాకండి.
ప్రేమతో
జీవితాన్ని
గడపండి.
ప్రేమతో
జీవితాన్ని
గడిపేవారే
ధన్యులు.
వారే
నిజమైన
మానవులు.
ప్రేమయే
మానవుడు.
మానవుడే
ప్రేమ,
మానవుడే
మాధవుడు.
మాధవుడే
ప్రేమ.
కనుక
ప్రేమను
పెంచుకొని,
సత్యాన్ని
అనుసరిస్తూ,
ధర్మకార్యాలను
ఆచరిస్తూ
శాంతియుతమైన
జీవితాన్ని
గడపండి.
సత్యధర్మశాంతి
ప్రేమలు
మనకు
ఊతకఱ్ఱలవంటివి.
వీటిని
మించిన
ఆధారములు,
ఆదర్శములు
మనకు
లేవు.
వీటిని
మించిన
బలము
లేదు.
కాబట్టి
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలతో
మీ
నిత్య
జీవనయాత్ర
సాగించండి.
ఎవరు
చేసిన
కర్మ
వారనుభవించక
తప్పదు
ప్రేమస్వరూపులారా!
దేనికీ
మీరు
వెఱువనక్కర్లేదు.
తలపైన
పిడుగు
పడినా
ఫరవాలేదు.
మీరేమి
భయపడకండి.
ప్రాణం
పోతే
ఒక్కతూరి
పోతుందిగాని,
రెండు
తూర్లు
పోదు
కదా!
ఈనాడు
కాకపోయినా
రేపైనా
పోతుంది.
కాబట్టి,
ప్రాణం
పోతుందని
మీరు
భయపడనక్కర్లేదు.
దేనికైనా
సిద్ధంగా
ఉండండి.
సత్యాన్ని
అనుసరించటానికి
మీరు
భయపడకూడదు.
సత్యాన్ని
వదులుకొని,
ప్రేమను
వదలుకొని
ఏదో
ప్రాణం
రక్షించుకోవాలని
జపములు,
తపములు
చేస్తే
లాభం
లేదు.
ఎవరేమనుకుంటారో
అని
భయపడకండి.
ఎవరేమనుకున్నా
మీకు
వచ్చిన
నష్టమేమిటి?
మీ
ఇష్టం
మీది,
వారి
ఇష్టం
వారిది.
మీరేమి
తప్పుచేయటం
లేదు
కదా!
భగవంతుణ్ణి
ప్రేమించటంలో
తప్పేముంది?
ఆ
ప్రేమచేతనే
ప్రాణం
వదలాలి.
అంతే
గాని
పిచ్చి
పిచ్చి
కలహాలకు,
లేనిపోని
సందేహాలకు
అవకాశమందించకండి.
ఎవరి
కర్మను
వారు
అనుభవిస్తారు.
10
▾
Meaning
Keep
His poems 419
ఎవరు
చేసిన
కర్మ
వారనుభవించక
ఎవరికైనను
తప్పదన్నా!
ఏనాడు
ఏతీరు
ఎవరు
చెప్పాగలరు?
అనుభవించుట
సిద్ధమన్నా!
అయితే,
మీరు
నిరంతరము
భగవచ్చింతన
చేస్తూ
ఉంటే
మీకు
ఎలాంటి
బాధలూ
సంభవించవు.
అడవులయందున్న,
ఆకసముననున్న,
పట్టణముననున్న
పల్లెనున్న,
గుట్టమీదనున్న,
నట్టేట
పడియున్న
ఎక్కడున్నప్పటికీ
భగవంతుడు
మీ
వెంటనే,
జంటనే
ఉండి
మిమ్మల్ని
కాపాడుతుంటాడు.
ఎక్కడున్నా
దైవత్వం
మీ
వెంటనే
ఉంది.
జీసస్
అనండి,
రామా
అనండి,
కృష్ణా
అనండి;
ఏ
పేరుతోనైనా
పిలవండి.
కాని
భగవంతుడు
ఒక్కడే.
ఆ
ప్రేమయే
దైవం.
కనుక
దైవత్వాన్ని
విమర్శించటానికి
ఎవ్వరికీ
అధికారం
లేదు;
హక్కు
లేదు.
విమర్శలన్నీ
బూటకపుమాటలే!
అవి
దైవత్వాన్ని
చలింపజేయలేవు.
ఈ
కలిప్రభావంచేత
ప్రజలు
ధనంకోసం
ఎన్నో
పాట్లుపడుతున్నారు.
ధనంకోసం
ప్రాణాలను
కూడా
తీస్తున్నారు.
ఎందుకిలాంటి
తుచ్ఛమైన
ధనము?
ప్రేమధనమును
సంపాదించుకోండి.
ప్రేమయే
అన్ని
బాధలనూ
నివారణ
గావించగలదు.
నేను
కోరేది
మీ
ప్రేమయేగాని,
ధనం
కాదు
ప్రేమస్వరూపులారా!
ఎక్కువసేపు
మాట్లాడి
మిమ్మల్ని
బాధ
పెడుతున్నానేమో!
అయితే
ఇది
బాధ
కానే
కాదు.
ఇది
గొప్ప
బోధ.
అధైర్యంతో
కృంగిపోయేవారికి
ధైర్యమనే
టానిక్‌ను
అందించాలి.
“మెస్సెంజర్స్
ఆఫ్
సత్యసాయి”
సంస్థకు
చెందిన
పిల్లలు
చాలా
గొప్ప
సేవలు
చేస్తున్నారు.
ఒక్కొక్క
పర్యాయం
తిండికూడా
మాని
సేవలలో
పాల్గొంటున్నారు.
కాని
ఆవిధంగా
ఆరోగ్యాన్ని
పాడుచేసుకోకూడదు.
“బెంగుళూరులో
స్వామి
ఇంత
పెద్ద
హాస్పటల్‌ను
కట్టిస్తున్నారు.
కాని
అక్కడ
సేవచేయటానికి
మాకు
శక్తి
చాలదే.
పురుషుల
మాదిరి
రాళ్ళు,
ఇటుకలు
మోసి
సహాయం
చేయటానికి
మాకు
చేతకాదే!”
అని
వారు
బాధపడుతున్నారు.
వారికి
వచ్చే
జీతాలలో
చాలా
మిగిలించుకొని
నాకు
చెప్పకుండా
సత్యసాయి
ట్రస్టు
పేరుతో
మొన్నటి
దినము
75
లక్షలు
పంపించారు.
ఇంక
మన
కాలేజీలో
చదువుకున్న
మగపిల్లలు
బయట
అనేకచోట్ల
పనిచేస్తున్నారు.
11
▾
Meaning
Keep
బయట
ఉండినా
వారు
నావారే?
వారు
ఎంతో
శ్రమ
పడి,
తిండికూడా
సరిగా
తినకుండా
ఇక్కడ
నెలలకొద్దీ
కాచుకొని
ఉంటారు
పాపం!
అదేవిధంగా
మిగిలించుకొని
సత్యసాయి
ఓల్డ్
స్టూడెంట్స్
45
లక్షలు
సెంట్రల్
ట్రస్టుకు
పంపించారు.
విద్యార్థినీ
విద్యార్థులారా!
మేము
మీ
డబ్బును
కోరటం
లేదు;
మీ
ప్రేమను,
మీ
క్షేమాన్ని,
మీ
అభివృద్ధిని,
మీ
ఆనందాన్ని
మాత్రమే
కోరుతున్నాము.
మీరు
ఎక్కడున్నప్పటికీ
ఆదర్శవంతమైన
జీవితాన్ని
గడపండి.
ఏదో
గొప్పగొప్ప
వారందరూ
ఈ
ఆసుపత్రికి
కోట్ల
రూపాయలిస్తున్నారని
కొందరు
భావిస్తున్నారు.
గొప్ప
గొప్పవారిని
మేము
అడగటమూ
లేదు.
వారు
మాకు
ఇవ్వటమూ
లేదు.
ప్రేమతో
ఇచ్చేది
చిన్నదైనా
గొప్పదే.
జీసస్కు
గొప్పగొప్పవారు
గొప్పగొప్ప
బహుమతులను
అందించటానికి
ప్రయత్నించారు.
కాని
అతను
వాటిని
స్వీకరించలేదు.
ఒక
నిరుపేద
వృద్ధురాలు
ప్రేమతో
ఇచ్చిన
చిన్న
కాసును
ఆనందంగా
స్వీకరించాడు.
తాను
మరణించేంతవరకు
ఆ
కాసును
తనదగ్గరే
పెట్టుకున్నాడు.
అదేవిధంగా
నాకు
కావలసింది
ప్రేమయేగాని,
ధనం
కాదు,
మున్ముందు
ఇలాంటి
హాస్పటల్స్
ఇంకా
ఎన్నో
నెలకొల్పబడతాయి.
కాని
నేను
ఎవ్వరినీ
అడగటం
లేదు.
నాది
సత్యసంకల్పం.
కనుక,
అది
తప్పక
నెరవేరుతుంది.
మనం
చేసేది
మంచి
పని,
మంచి
పనులకు
మంచియే
జరుగుతుంది.
నా
మంచితనమే
నాకు
సహాయం.
విద్యార్థినీ
విద్యార్థులారా!
మీరిచ్చిన
డబ్బును
వాపస్
తీసుకోండి.
మీ
ప్రేమను,
మీ
క్షేమమును
మీ
అభివృద్ధిని
మాత్రమే
మేము
కోరుతున్నాము.
మీరు
మీ
ప్రవర్తనలో
ఆదర్శాన్ని
చూపినప్పుడే
నాకు
ఆనందము.
సత్యసాయి
స్టూడెంట్స్
చాలా
మంచి
ప్రవర్తన
కలిగినవారనే
పేరు
తెచ్చుకోండి.
నేనీనాడు
కాదు,
ఏనాడూ
ధనమును
ఆశించను.
ధనం
వస్తుంది,
పోతుంది.
నైతికశక్తిని
పెంచుకోండి.
శీలమును
అభివృద్ధిపరచుకోండి.
ధైర్యాన్ని
పెంచుకోండి.
ప్రేమను
అందరికీ
పంచండి.
స్వామిపట్ల
భక్తులకు,
పిల్లలకు
గల
ప్రేమ
ఎలాంటిదో
బయటివారికి
తెలియదు.
మీ
ఆరోగ్యాన్నికూడా
లెక్కచేయక
మీరు
స్వామిసేవ
చేస్తున్నారు.
కాని
అలాంటి
సేవ
నాకక్కర్లేదు.
జీవుడే,
దేవుడు.
జీవుణ్ణి
హింసించకూడదు.
కాబట్టి
మీరు
బాగా
భుజించి,
ఆరోగ్యంగా
ఉండి
తరువాత
సేవలో
ప్రవేశించండి.
మీరు
పల్లెపల్లెకూ
పోయి
సేవ
చేస్తున్నారు.
ఇట్టి
సేవాధనము
ఎన్నో
కోట్ల
రూపాయలతో
సమానం.
12
▾
Meaning
Keep
కాబట్టి,
మీరు
సేవాధనమును
పెంచుకోండి.
పల్లెపల్లెకూ
వెళ్ళి
సేవలు
చేయండి.
బీదవారిని
ఆదరించండి,
ఆకలితో
అలమటించేవారికి
పట్టెడన్నం
పెట్టండి.
దీన
జనోద్ధరణకు
దివ్య
పథకం
పోయినతూరికూడా
నేనీ
విషయం
చెప్పినాను.
ఇటీవల
ఒక
చిన్న
పేపర్లో
ఒక
విచారకరమైన
వార్త
కనిపించింది.
తండ్రి
మరణించాడు.
తల్లి,
ఒక
బిడ్డ
ఉండినారు.
ఆ
బిడ్డను
సాకే
శక్తి
తల్లికి
లేకపోయింది.
ఏదో
భిక్షమెత్తి
ఆ
బిడ్డను
పోషిస్తూ
వచ్చింది.
కాని,
15
దినములు
ఏకధాటిగా
కుంభవృష్టి
కురవటంచేత
ఆమెకు
బయటికి
వెళ్లటానికి
వీలుకాలేదు.
తెల్లవారుతూనే
బిడ్డ
లేచి
“అమ్మా!
నాకు
ఆకలౌతోంది.
అన్నం
పెట్టు”
అని
ఏడుపు
ప్రారంభించాడు.
ఆమె
అన్నం
ఎక్కడి
నుండి
తెచ్చి
పెట్టగలదు?
కన్నీరు
కార్చింది.
“నాయనా!
నీకు
అన్నం
పెట్టే
శక్తి
భగవంతుడు
నాకివ్వలేదు”
అని
లోలోపల
బాధపడింది.
ఎక్కడి
నుండో
ఇంత
విషం
సంపాదించి,
దానిని
నీటిలో
కలిపి
పిల్లవానికిచ్చి,
తానూ
త్రాగింది.
ఇరువురూ
మరణించారు.
అన్నపూర్ణ
అని
పేరొందిన
ఈ
పవిత్ర
భారతదేశంలో
పిల్లలకు
పట్టెడన్నం
పెట్టే
శక్తి
తల్లిదండ్రులకు
లేకపోతున్నాదా,
అని
బాధపడ్డాను.
ఆనాటినుండి
నేనొక
దీక్ష
పూనాను.
చిన్న
పిల్లలకు
కడుపునిండా
అన్నం
పెట్టాలి,
చక్కగా
చదువు
చెప్పించి
వారిని
జ్ఞానవంతులుగా
తీర్చి
దిద్దాలి.
కనుక
తల్లి,
బిడ్డ
ఉండేవారి
పేరుతో
బ్యాంకులో
లక్ష
రూపాయలు
ఫిక్స్డ్
డిపాజిట్
పెట్టించాను.
లక్ష
రూపాయలు
బ్యాంకులో
పెట్టుకొని
ఏమి
చేస్తావు?
వ్యాపారం
చేస్తే
దండిగా
లాభం
వస్తుంది”
అని
యుక్తిగా
వారితో
వ్యాపారం
చేయిస్తారు.
కనుకనే
ఎవరు
వచ్చి
అడిగినా
అసలు
మొత్తం
ఇవ్వకూడదనీ,
ఒకటవ
తేదీన
పేరెంట్
వచ్చి
సంతకం
పెడితే
వడ్డీ
డబ్బు
మాత్రమే
ఇవ్వాలని
బ్యాంకు
మేనేజర్‌కు
గట్టిగా
చెప్పాము.
వారు
మాకు
దూరంగా
ఉన్నట్లైతే
పిల్లవానికి
చదువు
చెప్పించటానికి
వీలు
కాదు.
కాబట్టి
వారిని
మాకు
దగ్గరగా
పెట్టుకోవాలని
ప్రభుత్వాన్ని
భూమి
అడిగితే
ఇవ్వలేదు.
మేము
వారిని
అడగటం
మానివేశాము.
మాదే
ఒక
పండ్లతోట
ఉన్నది.
పండ్లతోటకంటే
పండ్లవంటి
పిల్లల
భవిష్యత్తే
నాకు
ముఖ్యం.
కనుక,
ఆ
స్థలంలో
వారికోసం
ఇళ్ళు
కట్టిస్తున్నాం.
ఒక్కొక్క
ఇంట్లో
రెండు
గదులు,
ఒక
వంటిల్లు,
ఒక
స్నానాలగది
ఉంటాయి.
జీవితమంతా
వారు
ఆ
ఇంట్లో
ఉండి,
బ్యాంకునుండి
వచ్చే
వడ్డీతో
జీవితాన్ని
గడపవచ్చును.
13
▾
Meaning
Keep
ఆ
పిల్లలకు
చదువు
నేను
చెప్పిస్తాను.
మా
విద్యా
సంస్థల్లో
ఎంతోమంది
మగపిల్లలు,
ఆడపిల్లలు
ఉన్నారు.
వారు
వెళ్ళి
చదువు
చెప్పవచ్చును.
మా
పిల్లలు
ఏ
సేవకైనా
సిద్ధంగా
ఉన్నారు.
మా
పిల్లలను
నేను
పొగుడుకోకూడదు
గాని,
ఇలాంటి
మంచి
పిల్లలు
ఎక్కడోగాని
చిక్కరు.
ఇలాంటి
సద్గుణవంతులను
తయారుచేసి
లోకానికి
అందించాలని
నేను
ఆశిస్తున్నాను.
అందరూ
నావారే,
నేను
అందరివాడనే!
నేను
త్వరలో
పుట్టపర్తికి
వెళుతున్నాను.
అక్కడ
మా
పిల్లల
స్పోర్ట్స్‌మీట్
జరుగనున్నది.
కాబట్టి
వారికి
తగిన
ఉత్సాహ,
ప్రోత్సాహముల
నందించాలి.
బీదవారికోసం
అక్కడ
ఇళ్ళు
కట్టించడంకూడా
ప్రారంభించాలి.
మళ్ళీ
19
వ
తేది
నాటికి
సూపర్
స్పెషాలిటీ
హాస్పటల్
ప్రారంభోత్సవంకోసం
ఇక్కడికీ
రావాలి.
ఈ
హాస్పటల్
కర్ణాటక
రాష్ట్రానికి
ఎంతో
ఆనందాన్ని
అందిస్తుంది.
కర్ణాటక
రాష్ట్రంలోని
హార్ట్
పేషంట్స్
అందరికీ
జబ్బులు
నయం
కావాలి.
దినానికి
30,40
ఆపరేషన్లు
చేయిస్తున్నాను.
అందుకోసమని
గొప్ప
జీతాలిచ్చి
30
మంది
డాక్టర్లను
నియమిస్తున్నాము.
దినానికి
25,
30
గుండె
ఆపరేషన్లు
జరగాలి.
అది
నా
గట్టి
సంకల్పము.
నాకు
ఈ
రాష్ట్రం,
ఆ
రాష్ట్రం
అనే
భేదం
లేదు.
అన్నీ
నా
రాష్ట్రాలే;
అందరూ
నావారే.
నేను
అందరివాడనే.
నేను
ఎక్కడుంటానో
అది
మీదే;
మీరెక్కడుంటారో
అది
నాదే.
ఏమాత్రమూ
సందేహించకండి.
ఏది
తక్కువైనా
ఇవ్వటానికి
నేను
సిద్ధంగా
ఉన్నాను.
బలహీనతకు
అవకాశమే
ఇవ్వకండి.
ధైర్యంగా
ఉండండి.
నేనుండగా
మీకెందుకు
భయం?
Why
fear
when
I
am
here?
ప్రేమ
స్వరూపులారా!
కొద్ది
నిమిషాలలో
‘మెస్సెంజర్స్
ఆఫ్
సత్యసాయి’
(అనంతపురం
క్యాంపస్
పూర్వ
విద్యార్థినుల
సంస్థ)
ఒక
డ్రామాను
ప్రదర్శిస్తారు.
అది
చాలా
ఆదర్శవంతమైన
డ్రామా;
టీవీలో
ప్రసారమయ్యే
పిచ్చి
పిచ్చి
డ్రామాలవంటిది
కాదు.
ఈ
ప్రభుత్వానికి
ఏమి
పిచ్చో
ఏమిటోగాని,
టీవీ
ద్వారా
పిల్లలను
పాడుచేస్తున్నది.
ఇది
ప్రభుత్వం
చేయవలసిన
పని
కాదు.
ప్రజలను
సత్యమార్గంలో,
ధర్మమార్గంలో
నడిపించాలి.
టీవీలో
ఏవైనా
మంచివి
చూపిస్తే
ఫరవాలేదు.
కాని,
చాలా
చెడ్డవి
చూపిస్తున్నారు.
మోసాలు,
దగాలు
నేర్పించేవి
చూపిస్తున్నారు.
ఏదో
వారి
స్వార్థంకోసం
వారు
పాటుపడుతున్నారు.
వారికి
అది
అలవాటైపోయింది.
దానిని
మీరు
అలవాటు
చేసుకోకండి.
14
▾
Meaning
Keep
విద్యార్థినీ
విద్యార్థులారా!
మీ
తల్లిదండ్రుల
ఆజ్ఞను
శిరసావహించి
వారిని
ఆనందపరచండి.
వారు
ఆశిస్తే
పెళ్ళి
కూడా
చేసుకుని
ఆదర్శవంతులైన
గృహస్థులుగా
జీవితాన్ని
గడపండి.
రాజకీయాల్లో
ప్రవేశించకండి.
సేవలో
ప్రవేశించండి.
పల్లెపల్లెకూ
పొండి.
ప్రతి
వ్యక్తికి
సేవ
చేయండి.
అందరినీ
ప్రేమించండి.
అందరినీ
సేవించండి.
అప్పుడే
మీరు
భగవంతుణ్ణి
ప్రేమించినవారౌతారు.
“హరే
రామ
హరే
రామ
రామరామ
హరే
హరే
హరే
కృష్ణ
హరే
కృష్ణ
కృష్ణ
కృష్ణ
హరే
హరే”
Previous
←
Sacrifice Itself Is the Supreme Purpose of Life
Next
As the thought, so the result
→