Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · Śānti is found only in Prema that is full
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śānti is found only in Prema that is full
1 June 2001, All India Conference, Mumbai
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈ
ప్రపంచమునందు
ఎంత
గొప్పవారైనప్పటికీ
అందరూ
తల్లిగర్భము
నుండి
పుట్టినవారే.
తల్లిగర్భం
భూదేవివంటిది.
మనమెట్టి
విత్తనములు
నాటుదుమో
భూదేవి
అట్టి
ఫలములనే
అందిస్తుంది.
సంకల్పములే
విత్తనములవంటివి.
మాతృహృదయం
సత్సంకల్పాలతోకూడి
పవిత్రంగా
ఉన్నప్పుడే
ప్రకృతి
లోకానికి
మంచి
బిడ్డలను
అందిస్తుంది.
ఈనాడు
ప్రపంచంలో
పవిత్రమైన,
త్యాగశీలురైన
వ్యక్తులు
జన్మించటం
లేదంటే
కారణమేమిటి?
మాతృహృదయం
పవిత్రంగా
ఉండటం
లేదు.
తల్లిహృదయం
ప్రశాంతంగా
ఉన్నప్పుడు
లోకమంతా
ప్రశాంతంగానే
ఉంటుంది.
మాతృహృదయం
అమృతమయంగా
ఉన్నప్పుడు
జగత్తంతా
అమృతమయంగానే
ఉంటుంది.
కనుక
పవిత్రమైన
మాతృమూర్తులు
ప్రపంచానికి
ఈనాడు
అత్యవసరం.
గుణవంతులైన
మాతృమూర్తులవల్లనే
భారతదేశం
త్యాగభూమి,
యోగభూమి,
కర్మభూమిగా
ప్రసిద్ధికెక్కింది.
మాతృభావమును
మించిన
భావం
మరొకటి
లేదు.
ఈనాటి
పిల్లలు
తమ
తల్లిదండ్రులకు
తగిన
తృప్తిని
అందించటం
లేదు.
ఇదే
వారిలో
ఉన్న
పెద్ద
దోషం.
తల్లిదండ్రులను
సంతృప్తిపరచినప్పుడే
జగత్తంతా
సంతృప్తి
చెందుతుంది.
మాతాపితరులు
దైవస్వరూపులు.
కనుక
మొట్టమొదట
వారిని
సంతోషపెట్టాలి.
అప్పుడే
ప్రపంచం
శాంతి
భద్రతలతో
తులతూగుతుంది.
తల్లిదండ్రులను
విస్మరించి
దైవాన్ని
పూజించటం
అర్థం
లేని
చర్య.
ప్రేమస్వరూపులారా!
మీరు
సమాజంనుండియే
పుట్టారు,
సమాజంలో
పెరుగుతున్నారు,
సమాజం
నుండియే
సకల
సిరిసంపదలను
పొందుతున్నారు.
కాని,
మీరు
సమాజాన్ని
తగిన
రీతిగా
గౌరవించటం
లేదు.
ఇదే
మీలో
ఉన్న
పెద్ద
దోషం.
మీరు
సమాజానికి
తగిన
కృతజ్ఞత
చూపాలి.
సమాజ
క్షేమమే
మీ
క్షేమమని
భావించాలి.
స్వార్థాన్ని
ప్రక్కకు
నెట్టి,
పరార్థాన్ని
చేపట్టాలి.
భగవద్భక్తిని
పెంపొందించుకోవాలి.
అప్పుడే
ప్రపంచం
శాంతి
భద్రతలతో
తులతూగుతుంది.
ప్రపంచం
శాంతిమయం
కావాలంటే
మొట్టమొదట
మీలో
శాంతిని
నింపుకోవాలి.
2
▾
Meaning
Keep
శాంతి
మీ
హృదయంలోనే
ఉన్నది.
ఇట్టి
హృదయాన్ని
మరచిపోయి
శాంతికోసం
బజార్లో
వెతికితే
ఎట్లా
లభిస్తుంది?
Peace
అనేది
బజార్లో
చిక్కదు.
బజార్లో
చిక్కేది
Pieces
మాత్రమే.
ఏ
పని
చేసినా
పరిపూర్ణమైన
ప్రేమతో
చేయాలి.
ఎవరితో
మాట్లాడినా
మృదుమధురంగా
మాట్లాడాలి.
ఇతరులపట్ల
అసూయాద్వేషాలను
కల్గియుండకూడదు.
ఇది
మీరు
మొట్టమొదట
నేర్చుకోవాలి.
ప్రేమస్వరూపుడు
ప్రేమకు
మాత్రమే
వశుడౌతాడు
ఈనాటి
మానవుడు
ఆపాదమస్తకం
దుర్గుణాలను
నింపుకొని
పశువుమాదిరి
తయారౌతున్నాడు.
పశువుకైనా
ఒక
రీజన్
ఉంటుంది,
ఒక
సీజన్
ఉంటుంది.
కాని
మానవునికి
మాత్రం
రీజన్
లేదు,
సీజన్
లేదు.
కనుక
మానవునికంటే
పశువే
నయమనిపిస్తోంది.
దుర్గుణాలతో
నిండినవాడు
మానవుడెట్లవుతాడు?
మానవుడనని
చెప్పుకొనేవాడు
మానవత్వాన్ని
ప్రకటించాలి.
కేవలం
మానవదేహాన్ని
ధరించినంత
మాత్రాన
మీరు
మానవులు
కాజాలరు.
దేహానికి
తగిన
మానవతావిలువలను
పోషించుకోవాలి.
ప్రేమను
అభివృద్ధిపరచుకోవాలి.
ప్రేమచేతనే
ప్రేమమయుడైన
భగవంతుడు
మీకు
మిత్రుడౌతాడు.
భగవంతుడొక్కడే
మీ
నిజమైన
మిత్రుడు.
అతడు
పరిపూర్ణ
ప్రేమస్వరూపుడు.
మీరు
భగవంతుణ్ణి
పొందాలనుకుంటే
పరిపూర్ణమైన
ప్రేమతో
భగవంతునికి
అర్పితం
కావాలి.
భగవంతుణ్ణి
కేవలం
వస్తువాహనాదులకోసం
ప్రేమించవద్దు;
ప్రేమకోసం
ప్రేమించాలి.
ప్రేమచేతనే
ప్రేమస్వరూపుడు
మీకు
దక్కుతాడు.
భగవంతునికి
ప్రత్యేకమైన
రూపనామములు
లేవు.
“ఏక
ప్రభు
కే
అనేక
నామ్”
పేర్లు
ఎన్నైనా
ఉండవచ్చుగాని
భగవంతుడొక్కడే.
ఇట్టి
ఏకత్వాన్ని
విశ్వసించి
మీరు
దైవప్రేమను
పెంచుకోండి.
మీకు
కనిపించే
మంచిచెడ్డలు
మీలోనే
ఉన్నాయి
హృదయమొక
ట్యాంకువంటిది,
ఇంద్రియాలన్నీ
ట్యాప్స్వంటివి.
హృదయాన్ని
ప్రేమతో
నింపుకున్నప్పుడు
ఏ
‘ట్యాపు’
త్రిప్పినా
ప్రేమయే
వస్తుంది.
అనగా
మీ
దృష్టి,
వాక్కు,
శ్రవణము
అన్నీ
ప్రేమమయమౌతాయి.
మీ
హృదయాన్ని
ద్వేషంతో
నింపుకున్నప్పుడు
మీ
దృష్టిలోకూడా
ఆ
ద్వేషం
ప్రవేశిస్తుంది.
ఇతరులలో
మీరు
ద్వేషాన్ని
చూస్తున్నారంటే,
అది
మీలో
ఉన్న
ద్వేషంయొక్క
ప్రతిబింబమే.
3
▾
Meaning
Keep
మీలో
ఉన్న
దోషాలే
ఎదుటివ్యక్తిలో
ప్రతిబింబిస్తున్నాయి.
బయట
ఉన్నదంతా
“రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండే.”
“రియాలిటీ”
మీయందే
ఉన్నది.
ఈ
సత్యాన్ని
మీరు
మొట్టమొదట
గుర్తించాలి.
మీరు
ఏ
రంగు
అద్దాలను
ధరిస్తారో
ప్రపంచమంతా
అదే
రంగుతో
కనిపిస్తుంది.
అట్లే
మీరు
మంచివారైతే
ప్రపంచమంతా
మీకు
మంచిదిగానే
కనిపిస్తుంది.
ప్రేమయే
మీకు
ప్రధానమైన
ఆస్తి.
ద్వేషాన్ని
నిర్మూలించుకోండి,
క్రోధాన్ని
చంపివేయండి.
ప్రేమను
పెంచుకోండి.
ప్రేమలో
ఉన్న
మాధుర్యం
మరి
దేనియందూ
లేదు.
ఈనాడు
లోకంలో
అందరూ
శాంతి
కావాలని
ఆశిస్తున్నారు.
కాని
శాంతి
ఎక్కడో
బజార్లో
లేదు.
హృదయాన్ని
ప్రేమతో
నింపుకున్నప్పుడు
జగత్తంతా
శాంతిమయమౌతుంది.
ఈనాడు
జగత్తులో
శాంతి
లేకపోవటానికి
కారణం
మానవునియందు
పరిపూర్ణమైన
ప్రేమ
లేకపోవటమే.
మానవుడు
పరిపూర్ణమైన
ప్రేమను
సాధించినప్పుడే
జగత్తులో
తాను
పరిపూర్ణమైన
శాంతిని
అనుభవించగలడు.
రక్షించేది
ధనం
కాదు,
నీతినియమాలు
ప్రేమస్వరూపులారా!
మీ
అందరియందున్న
తత్త్వమొక్కటే.
అదియే
ఆత్మ,
అదియే
ప్రేమ,
అదియే
దైవము.
అట్టి
ప్రేమను
మీరు
విస్మరించి
లౌకికమైన
భోగభాగ్యములను
ఆశిస్తున్నారు.
అవి
ఎంతకాలం
నిలువగలవు?
ధనం
కాదు
మిమ్మల్ని
రక్షించేది,
నీతినియమాలే
రక్షిస్తాయి.
పోయే
సమయంలో
ధనం
మీ
వెంట
వస్తుందా?
ఎన్నటికీ
రాదు.
అలెగ్జాండర్
ఎంతో
సంపాదించాడు.
కాని
ఏమి
తీసుకువెళ్ళగల్గాడు?
వట్టి
చేతులతోనే
పోయాడు.
ఎంత
సంపాదించినప్పటికీ
చివరికి
ఒక్క
కాసైనా
తీసుకుపోవటానికి
వీలుకాదు.
పోయే
సమయంలో
మీ
పుణ్యపాపములే
మీవెంట
వస్తాయి
గాని,
ధనం
రాదు.
కాబట్టి,
పుణ్యధనాన్ని
మీరు
ప్రోగుచేసుకోవాలి.
పవిత్రమైన
ప్రేమను
మీవెంట
తీసుకొనిపోవాలి.
ప్రేమను
మీరు
పెంచుకున్నారంటే,
మిమ్మల్ని
మించిన
శ్రీమంతుడు
లోకంలో
మరొకడుండడు.
మితిమీరిన
కోరికలు
గలవాడే
ఈ
లోకంలో
అందరికంటే
బీదవాడు.
తృప్తి
గలవాడే
అందరికంటే
ఐశ్వర్యవంతుడు.
కోరికలున్నంతవరకు
మీకు
సుఖశాంతులుండవు.
4
▾
Meaning
Keep
మీరే
విశ్వవిరాట్స్వరూపులు
ప్రేమస్వరూపులారా!
మీరు
కోరికలను
విసర్జించి
చూడండి,
మీకెంత
శాంతి
లభిస్తుందో!
జీవితంలో
మీరెన్నడూ
అనుభవించని
ఆనందాన్ని
అనుభవించగలరు.
శాంతి,
ఆనందములు
వస్తువాహనాదులలో
లేవు,
మీయందే
ఉన్నాయి.
మీయందున్న
ఆనందాన్ని
మీరే
గుర్తించుకోలేక
పోతున్నారు.
మీయందున్న
మాధవత్వాన్నే
మీరు
గుర్తించుకోలేకపోతే
సర్వవ్యాపకమైన
మాధవత్వాన్ని
మీరేరీతిగా
గుర్తించగలరు?
మాధవుడు
మీయందే
ఉన్నాడు.
మీరే
విశ్వవిరాట్స్వరూపులు.
కాని,
మీ
నిజస్వరూపాన్ని
విస్మరించి
తుచ్ఛమైన
దేహాభిమానాన్ని
పెంచుకుంటున్నారు.
అనిత్యమైన
దేహంపై
భ్రాంతి
ఎందుకు?
ఇది
ఎప్పుడు
కూలిపోతుందో,
ఎప్పుడు
రాలిపోతుందో!
కనుక
దేహాభిమానమును
దూరం
నెట్టి
నిత్యసత్యమైన
ఆత్మాభిమానమును
పెంచుకోండి.
ఆత్మానందమే
అమృతానందము.
అది
బయట
చిక్కేది
కాదు,
మీనుండియే
ఆవిర్భవింపజేసుకోవాలి.
దీనికి
ప్రేమయే
ప్రధానం.
ప్రేమను
పెంచుకుంటే
మీరే
దైవస్వరూపులౌతారు.
దైవం
మీకంటే
వేరుగా
ఉన్నాడని
భావించకండి.
“నేనే
దైవం”
అని
దృఢంగా
విశ్వసించండి.
మీరు
కేవలం
ఆకారంలో
మాత్రమే
మానవులుగాని,
నిజంగా
మీరే
దైవం.
ఈ
విశ్వాసాన్ని
మీ
హృదయంలో
స్థిరం
చేసుకోండి.
తల్లిదండ్రులను
ప్రేమించండి.
వారిని
సంతృప్తి
పరచండి.
దానిని
మించిన
భక్తి
లేదు.
అదే
నిజమైన
భక్తి.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
నేను
కేవలం
ఒక్క
పూటకోసం
ముంబైకి
వచ్చాను.
ఇది
నాకంత
తృప్తిగా
లేదు.
నేను
మళ్ళీ
వస్తాను.
మీరు
ప్రేమమయులు
కండి.
మీ
తల్లిదండ్రులను
సంతోషపెట్టండి.
మానవతా
విలువలను
పోషించుకోండి.
అప్పుడు
నేను
మీవెంటనే
ఉంటాను.
Previous
←
Love of God, fear of sin, morality in society
Next
He who serves in a spirit of sacrifice is the true doctor
→