Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · Love of God, fear of sin, morality in society
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Love of God, fear of sin, morality in society
7 May 2001, Buddha Pūrṇimā, Brindavan
1
▾
Meaning
Keep
From
the Nirvāṇaṣaṭkam, verse 4
Also in his talks
(5)
11 July 1987
The world is the very form of the Lord of the world
27 May 1990
Egoism and Attachment
27 September 1992
Worship Prakṛti and win the grace of the Paramātma
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
26 March 2001
The principle that is the root and base
న
పుణ్యం
న
పాపం
న
సౌఖ్యం
న
దుఃఖం
న
మంత్రో
న
తీర్థం
న
వేదా
న
యజ్ఞాః
అహం
భోజనం
నైవ
భోజ్యం
న
భోక్తా
చిదానంద
రూపః
శివోఽహం
శివోఽహం
ప్రేమస్వరూపులారా!
ఈ
జగత్తునందు
పుణ్యముగాని,
పాపముగాని,
సుఖముగాని,
దుఃఖముగాని
ఏదియు
లేదు.
మంత్రము,
యజ్ఞము,
యాగము
మున్నగునవన్నియు
కేవలం
భ్రాంతులే.
సర్వత్ర
నిండినది
భగవంతుడొక్కడే.
మీరందరూ
భగవత్స్వరూపులే.
సత్యధర్మముల
సమ్మిళిత
స్వరూపం
మానవత్వం.
సత్యమే
నీతి,
ధర్మమే
రీతి,
త్యాగమే
ఖ్యాతి.
ఈ
మూడింటితో
కూడినదే
మానవజాతి.
కాని,
దురదృష్టవశాత్తు
ఈనాడు
జగత్తులో
ఈ
మూడూ
కనిపించటం
లేదు.
గౌతమబుద్ధుడని
పేరు
గాంచిన
సిద్ధార్థుడు
తన
సత్యస్వరూపాన్ని
గుర్తించే
నిమిత్తం
అనేక
సాధనలు
సల్పాడు;
వేదశాస్త్రాలను
పఠించాడు;
జప
ధ్యానాదులనాచరించాడు;
అనేకమంది
పెద్దలను
దర్శించాడు.
కట్టకడపటికి
ఇవేవీ
సరియైన
సాధనలు
కావనే
సత్యాన్ని
గుర్తించాడు.
జపము,
ధ్యానము,
యోగము,
యజ్ఞము
ఇవన్నీ
కేవలం
భౌతికమైన
క్రియలు
మాత్రమేననీ,
భగవంతుడు
ప్రసాదించిన
పంచేంద్రియాలను
పవిత్రమైన
మార్గంలో
ప్రవేశపెట్టటమే
నిర్వాణమనీ
గుర్తించాడు.
దేహాభిమానం
కలవానికే
సాధనలవసరం.
ఆత్మాభిమానం
కలవానికి
సాధనలేవీ
అక్కరలేదు.
1.
సమ్యక్దృష్టి
2.
సమ్యక్భావం
3.
సమ్యక్వాక్కు
4.
సమ్యక్
శ్రవణం
5.
సమ్యక్
క్రియ
-
ఈ
ఐదింటినీ
అలవర్చుకోవటమే
నిర్వాణమని
బోధించాడు
బుద్ధుడు.
అతడు
చేయని
సాధన
లేదు;
చివరికి
సర్వసంగ
పరిత్యాగం
చేశాడు.
త్యాగమే
సరియైన
మార్గమని
గుర్తించాడు.
వేదముకూడా
దీనినే
బోధించింది
-
“న
కర్మణా
న
ప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్త్వ
మానశుః”
త్యాగంవల్లనే
అమృతత్త్వం
చేకూరుతుంది.
అదే
నిర్వాణం.
2
▾
Meaning
Keep
Also in his talks
(1)
21 February 2001
‘I’ itself is God
నిర్వాణప్రాప్తికి
మొట్టమొదట
కావల్సింది
సమ్యక్
దృష్టి.
ఈనాటి
మానవుడు
తన
దృష్టిని
అపవిత్రమైన
మార్గంలో
ప్రవేశపెట్టి
మనస్సును
మలినపరచుకుంటున్నాడు.
మనస్సు
మలినమైనప్పుడు
మనిషి
ఏరీతిగా
నిర్వాణము
నొందగలడు?
కనుక,
మొట్టమొదట
సమ్యక్దృష్టిని
అనగా
మంచిచూపును
అభివృద్ధిపరచుకోవాలి.
దృష్టియందు
ఎలాంటి
దోషమూ
ప్రవేశించకుండా
చూసుకోవాలి.
చెడుదృష్టివల్లనే
మానవుడు
అనేక
బాధలకు
గురి
అవుతున్నాడు.
చెడుదృష్టిని
విడనాడి
ఎల్లప్పుడు
మంచినే
చూడాలి.
దేనిని
చూసినా
దైవసమానంగా
చూడాలి.
సమ్యక్దృష్టియే
సర్వులయందున్న
దైవత్వాన్ని
గుర్తింపజేస్తుంది.
ప్రేమమయమైన
దృష్టియే
మానవత్వాన్ని
సార్థకం
గావిస్తుంది.
అందరూ
ఒక్కటే
అని
గుర్తించి,
అందరిపట్ల
సమత్వంతో
వ్యవహరించాలి.
ఈనాటి
మానవుడు
దేహదృష్టితో
లౌకికమైన
సంబంధ
బాంధవ్యాలను
పెంచుకుంటున్నాడు.
మాతా
నాస్తి
పితా
నాస్తి
నాస్తి
బంధుస్సహోదరః
అర్థం
నాస్తి
గృహం
నాస్తి
తస్మాత్
జాగ్రత
జాగ్రత
అందరూ
ఒక్కటే,
అందరూ
దైవస్వరూపులే.
ఇట్టి
ఏకత్వానికి
ప్రయాణించాలంటే
అనేకత్వాన్ని
త్యజించాలి.
ఇదియే
వేదాంత
ప్రబోధ.
అనేకత్వంలో
ఉన్న
ఏకత్వమే
ఆత్మతత్త్వం.
బల్బులు
వేర్వేరుకాని,
కరెంటు
ఒక్కటే.
అట్లే,
రూపనామాలు
వేర్వేరుకాని,
అందరిలోని
ఆత్మతత్త్వం
ఒక్కటే.
ఇట్టి
ఏకత్వాన్ని
అనేకత్వంగా
భావించటంచేతనే
మానవుడు
అజ్ఞానంలో
మునిగిపోతున్నాడు.
అనేకత్వంలోని
ఏకత్వాన్ని
దర్శించటమే
నిజమైన
మానవత్వం.
ఏకత్వాన్ని
దర్శించాలంటే
సమ్యక్దృష్టిని
అలవర్చుకోవాలి.
ఇదే
బుద్ధుడు
బోధించినది.
“అనుద్వేగకరం
వాక్యం...”
మానవునికి
సమ్యక్దృష్టితోపాటు
సమ్యక్వాక్కు
కూడా
అత్యవసరం.
పరులను
దూషించటం,
విమర్శించటం,
కఠినమైన
మాటలచేత
పరుల
హృదయాన్ని
బాధపెట్టటం
మంచిది
కాదు.
పవిత్రమైన
వాక్కే
దైవత్వము.
అదే
శబ్దబ్రహ్మము.
“అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియ
హితం
చ
యత్”
మీ
వాక్కు
సత్యమైనదిగా,
ప్రియమైనదిగా,
హితమైనదిగా,
ఉద్వేగరహితమైనదిగా
ఉండాలి.
అందరూ
ఒక్కటే
అన్న
సత్యాన్ని
గుర్తించినప్పుడు
ఉద్వేగానికి
అవకాశమే
ఉండదు.
3
▾
Meaning
Keep
దేహములన్నీ
అద్దములవంటివి.
అన్ని
అద్దములలోనూ
మీరు
మీ
ప్రతిబింబాన్నే
చూస్తున్నారు.
మీ
ప్రతిబింబాన్ని
మీరు
ప్రేమిస్తారేగాని,
ద్వేషించరు
కదా!
అదేరీతిగా,
అందరినీ
ప్రేమించాలి.
ప్రేమను
మించిన
దైవం
లేదు.
హృదయాన్ని
ప్రేమతో
నింపుకున్నప్పుడు
మీ
తలంపులు,
మాటలు,
చేతలు,
చూపులు
అన్నీ
ప్రేమమయమౌతాయి.
లేకపోతే
హృదయంలోకి
అనేక
దుర్గుణాలు
ప్రవేశించి
మానవత్వాన్ని
మంట
గలుపుతాయి.
సమ్యక్దృష్టి,
సమ్యక్వాక్కులతోపాటు
సమ్యక్
శ్రవణంకూడా
అత్యవసరం.
భగవంతుడు
చెవుల
నిచ్చినది
ఊరివారి
సుద్దులను
వినటానికి
కాదు.
కేవలం
ఆత్మసంబంధమైన
విషయాలను
మాత్రమే
శ్రవణం
చేయాలి.
హృదయమనేది
ఒక
పాత్ర
వంటిది.
దానిని
ప్రేమతోనూ,
త్యాగంతోనూ
నింపుకోవాలి.
అప్పుడు
మీరు
శాంతిని
ప్రత్యేకంగా
కోరనక్కర్లేదు,
అది
మీనుండియే
ఆవిర్భవిస్తుంది.
హృదయం
సహజంగా
నిర్మలమైనది,
నిశ్చలమైనది,
నిస్వార్థమైనది.
కాని,
ప్రాకృతమైన
భావాలను
అనుసరిస్తూ
మీ
అంతట
మీరే
దానిని
మాలిన్యపరచుకుంటున్నారు.
పవిత్రమైన
హృదయం
పాడుకావటానికి
కారణం
సమ్యక్దృష్టి,
సమ్యక్శ్రవణం
సమ్యక్వాక్కు
లేకపోవటమే.
ప్రేమ,
త్యాగములవల్లనే
అనుగ్రహప్రాప్తి
ప్రతి
మానవుడు
భగవదనుగ్రహం
కావాలని
ఆశిస్తున్నాడు.
అయితే,
దానికోసం
తాను
చేయవలసిన
ప్రయత్నమేమిటి?
ఒక
చిన్న
ఉదాహరణ
:
మీరు
బాగా
కష్టపడి
ధనమునార్జించి
భద్రతకోసం
బ్యాంకులో
డిపాజిట్
చేశారనుకోండి.
ఆ
డబ్బును
మీరు
తిరిగి
తీసుకోవటానికి
బ్యాంకు
మేనేజరు
కొన్ని
నిబంధనలు
పెట్టాడు.
“
ఆ
డబ్బు
నేను
కట్టినది.
నా
డబ్బు
నాకివ్వండి”
అని
మీరు
అడిగితే
బ్యాంకు
మేనేజరు
ఏమంటాడు?
చెక్కుపైన
సంతకం
పెట్టి
తీసుకురమ్మంటాడు.
అదేరీతిగా,
అనేక
జన్మలనుండి
మీరు
సాధించిన
పుణ్యఫలమును
భగవంతుని
ప్రేమబ్యాంకులో
భద్రంగా
డిపాజిట్
చేశారు.
భగవంతుడు
దానికి
వడ్డీకూడా
ఇస్తాడు.
ఆ
‘డబ్బు’ను
తిరిగి
పొందాలంటే
మీరు
త్యాగమనే
చెక్కుపై
ప్రేమ
అనే
సంతకం
పెట్టి
భగవంతుడనే
‘బ్యాంకు
మేనేజరు’కు
అర్పించాలి.
శాంతిని,
పవిత్రతను,
నిర్వాణమును
పొందటానికి
మార్గమిదే.
మీ
జీవితంలో
ఎలాంటి
మార్పులు
కల్గినప్పటికీ
భగవంతునిపట్ల
మీ
ప్రేమ
నిశ్చలంగా
ఉండాలి.
4
▾
Meaning
Keep
అలాంటి
ప్రేమతో
త్యాగమునందించి
అనుగ్రహమును
పొందవచ్చు.
మీరు
సంపాదించవలసిన
ధనమేమిటి?
కరెన్సీ
నోట్లు
కాదు.
జ్ఞానధనమును,
అనుగ్రహధనమును
సంపాదించాలి.
దీనికి
ప్రేమ,
త్యాగములే
ప్రధానమైనవి.
ఈ
రెండూ
ఏకమైనప్పుడే
తగిన
ఫలితం
లభిస్తుంది.
ఇంద్రియాల
సద్వినియోగంవల్లనే
ఆనందప్రాప్తి
బుద్ధుడు
అనేక
సాధనలు
చేశాడు.
కాని
ఫలితం
కనిపించలేదు.
“అయ్యో
ఎంతో
కాలాన్ని
వ్యర్థం
చేశానే”
అని
బాధపడ్డాడు.
భగవంతుడు
ప్రసాదించిన
పంచేంద్రియాలను
సద్వినియోగపరచుకోవటమే
సరియైన
మార్గమని
గుర్తించాడు.
ఈ
సత్యాన్ని
మొట్టమొదటే
గుర్తించి
ఉంటే
ఎంతో
సుఖాన్ని
అనుభవించేవాడిని
కదా
అనుకున్నాడు.
భగవంతుడు
బీద,
గొప్ప
అనే
భేదం
లేకుండా
మానవులందరికీ
పంచేంద్రియాలను
ప్రసాదించాడు.
వాటిని
ప్రేమమార్గంలో
ప్రవేశపెట్టినప్పుడే
దైవత్వం
సాక్షాత్కరిస్తుంది.
కాని,
ఈనాటి
మానవుడు
భగవంతుడు
ప్రసాదించిన
పంచేంద్రియాలను
భౌతికమైన
సుఖసంతోషాల
నిమిత్తం
దుర్వినియోగం
చేస్తున్నాడు.
ఇంద్రియసుఖాలు
వ్యర్థమైనవనీ,
అవి
బంధనకు
దారితీస్తాయనీ
గుర్తించి
బుద్ధుడు
వాటిని
త్యజించాడు.
ఇంద్రియాల
దుర్వినియోగం
మానవత్వాన్ని
నిర్మూలం
గావిస్తుందని
తెలుసుకున్నాడు.
కట్టుకున్న
భార్యను,
కన్నకుమారుని
త్యజించి
వైరాగ్యాన్ని
అభివృద్ధిపరచుకున్నాడు.
ఏకాత్మతత్త్వాన్ని
గుర్తించాడు.
అప్పుడే
ఆనందాన్ని
అనుభవించగల్గాడు.
బుద్ధుని
పినతల్లి
కుమారుడైన
ఆనందుడు
నిరంతరము
బుద్ధునిదగ్గరే
ఉండేవాడు.
అతనితో
బుద్ధుడు
“ఆనందా!
నీవు
ఆనందమును
అనుభవించే
నిమిత్తం
పుట్టావు.
భగవంతుడు
ప్రసాదించిన
పంచేంద్రియాలను
సద్వినియోగపరచుకున్నప్పుడే
ఆనందమును
అనుభవించ
గలవు;
ఆ
ఆనందాన్ని
పదిమందికి
పంచగలవు”
అని
చెప్పాడు.
“బ్రహ్మానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగనసదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమలం
అచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం...”
ఇట్టి
ఆనందాన్ని
అనుభవించవలసిన
మానవుడు
ఇంద్రియాలకు
బానిసయై
కుక్కలు,
నక్కలు,
కోతులు
అనుభవించే
ఇంద్రియసుఖాలను
అనుభవిస్తున్నాడు.
అలాంటప్పుడు
తాను
మనిషిగా
పుట్టి
ప్రయోజనమేమిటి?
5
▾
Meaning
Keep
Also in his talks
(1)
14 January 2000
Bhakti and Śaraṇāgati
మానవుడు
క్షణభంగురమైన
ఇంద్రియసుఖాలను
అనుభవించటానికి
పుట్టినవాడు
కాదు.
మొట్టమొదట
“నేను
Monkey
(కోతి)ని
కాదు,
మనిషిని”
అని
గుర్తించాలి;
దయను,
ప్రేమను
పెంచుకోవాలి.
ఏడుస్తూ
పుట్టాడు,
నవ్వుతూ
చావాలి
పుట్టినప్పుడు
ప్రతి
మానవుడు
కెవ్వున
ఏడుస్తాడు.
ఎందుకోసం?
“అయ్యో,
నేను
మళ్ళీ
ఈ
ప్రపంచంలో
పుట్టానే!
ఆనందానికి
దూరమై
పోతున్నానే!
ఆత్మనుండి
వేరైపోతున్నానే!”
అని
ఏడుస్తాడు.
ఏడుస్తూ
పుట్టాడు,
ఏడుస్తూ
జీవిస్తున్నాడు,
చివరికి
ఏడుస్తూ
మరణిస్తున్నాడు.
ఇంక,
తాను
సాధించిన
దేమిటి?
ఏడుస్తూ
పుట్టిన
మానవుడు
నవ్వుతూ
చావాలి.
తన
ఇంద్రియాలను
సరియైనమార్గంలో
పెట్టుకున్నప్పుడే
ఇది
సాధ్యమౌతుంది.
చావు
అంటే
ఏమిటి?
కేవలం
‘డ్రస్సు’ను
మార్చుకోవటమే!
జీవికి
దేహమొక
డ్రస్సు
వంటిది.
ఈ
జన్మలో
ఈ
‘డ్రస్సు’ను
ధరించారు.
మరణించిన
తరువాత
ఇంకొక
‘డ్రస్సు’
వస్తుంది.
భగవంతుడు
దయామయుడు,
ప్రేమ
స్వరూపుడు,
కరుణాసముద్రుడు;
మానవులందరికీ
తన
అనంతమైన
ప్రేమను
అందిస్తున్నాడు.
కాని,
దురదృష్టవంతులు
దానిని
అందుకోలేకపోతున్నారు.
కారణమేమిటి?
భగవంతుని
సంకల్పం
వేరు,
అందుకొనేవాని
సంకల్పం
వేరు.
ప్రాకృతమైన
భావాలను,
ప్రాకృతమైన
చింతలను
తనలో
నింపుకోవటంచేత
తాను
భగవంతుడు
ఇస్తున్నదానిని
పోగొట్టుకుంటున్నాడు.
పవిత్రమైనదానిని
పొందాలని
ఆశించినప్పుడు
మొట్టమొదట
అపవిత్రమైన
దానిని
త్యజించాలి.
ఏమీ
లేని
బుర్రలోన
ఏమైనను
చేర్చవచ్చు
ఏమేమో
నిండియున్న
బుర్రయది
ఖాళియగునా?
తలబుర్రది
ఖాళిగాక
ఇల
సుకృతము
నింపనగునా?
మీ
తలలో
మీరు
ఏమేమో
నింపుకున్నారు.
ఇంక,
భగవంతుడు
అందించే
ప్రేమరసాన్ని
ఏరీతిగా
దాచుకోగలరు?
మొట్టమొదట
మీ
తలను
ఖాళి
చేసుకోండి.
అప్పుడే
అందులో
భగవంతుని
ప్రేమను
నింపుకోవటానికి
వీలవుతుంది.
6
▾
Meaning
Keep
యోగమనగా...
త్యాగమే
నిజమైన
యోగం.
చాలామంది
యోగం
పేరుతో
అర్థరహితమైన,
అనర్థదాయకమైన
మార్గంలో
ప్రవేశిస్తున్నారు.
అసలు
యోగమంటే
ఏమిటి?
“యోగః
చిత్తవృత్తి
నిరోధః”
చిత్త
వృత్తులను
అరికట్టుకోవటమే
నిజమైన
యోగం.
లేకపోతే
అది
పెద్ద
రోగంగా
మారిపోతుంది.
ప్రేమచేత
మనస్సును
పవిత్రం
గావించుకోవాలి.
అప్పుడే
మనిషి
పవిత్రుడౌతాడు.
“యద్భావం
తద్భవతి”
మీ
భావాలు
పవిత్రమైనవిగా
ఉన్నప్పుడే
మీకు
లభించే
ఫలితంకూడా
పవిత్రంగా
ఉంటుంది.
హృదయాన్ని
పవిత్రం
గావించుకోవటానికి
మీరు
చేయవలసిన
సాధన
ఏమిటి?
ధ్యానం
కాదు,
జపం
కాదు,
యోగం
కాదు.
ముక్కు
మూసుకొని
కూర్చున్నంత
మాత్రాన
అది
యోగమౌతుందా?
దానివల్ల
ప్రయోజనం
లేదు.
సద్భావాలనే
ఆక్సిజన్‌ను
పీల్చుకోవాలి,
దుర్భావాలనే
కార్బన్‌డయాక్సైడ్‌ను
విడిచిపెట్టాలి.
‘ఆక్సిజన్’
హృదయం
నుండి
వస్తుంది;
‘కార్బన్డయాక్సైడ్’
తలనుండి
వస్తున్నది.
అనగా
తలనుండి
వచ్చేవన్నీ
పిచ్చిపిచ్చి
భావాలే.
అవి
కార్బన్డయాక్సైడ్వలె
విషమయమైన
గాలులే.
వాటిని
స్తంభింపజేసి,
హృదయంనుండి
వచ్చే
అమృతమయమైన
గాలులను
పీల్చుకోవాలి.
ఎక్కడ
చూసినా
దైవమే!
మీరు
భగవంతుణ్ణి
దర్శించాలనీ,
స్పర్శించాలనీ,
భగవంతునితో
సంభాషించాలనీ
ఆశిస్తున్నారు.
అయితే
మీరు
భగవంతుణ్ణి
చూస్తూనే
ఉన్నారు.
ఏవిధంగా?
మీకు
కనిపించే
ప్రజలందరూ
భగవత్స్వరూపులే.
ఈ
భావాన్ని
మీ
హృదయంలో
స్థిరం
చేసుకోండి.
అప్పుడే
మీ
దృష్టి
పవిత్రమౌతుంది.
ఈ
జగత్తంతా
భగవత్స్వరూపమే.
మీరు
ఈ
జగత్తును
చూస్తూ
ఇంకా
భగవంతుణ్ణి
చూడలేదనుకుంటున్నారు.
భగవంతునికి
ఒక
ప్రత్యేకమైన
రూపం
లేదు,
స్థానం
లేదు.
తాను
సర్వసాక్షిగా
అన్ని
రూపములలోనూ
ఉంటున్నాడు.
ఇట్టి
భావాన్ని
మీరు
పెట్టుకున్నప్పుడే
దివ్యత్వాన్ని
పొందగలరు.
రవివర్మ
గీసిన
విష్ణువు
బొమ్మను,
లేక,
కృష్ణుని
బొమ్మను
చూసి
భగవంతుడంటే
అలాగే
ఉంటాడని
భావించకండి.
అవన్నీ
కేవలం
ఊహాచిత్రములే.
భగవంతుడు
సర్వస్వరూపుడు.
“ఈశ్వరస్సర్వ
భూతానాం”,
“ఈశావాస్య
మిదం
సర్వం”
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”
-
ఎక్కడ
చూసినా
దైవమే!
7
▾
Meaning
Keep
మీ
తల్లినే
దైవంగా
భావించుకోండి,
తండ్రినే
దైవంగా
భావించుకోండి.
అదే
ఉత్తమమైన
మార్గం.
దైవత్వానికి
ఎదగాలి,
దీనత్వానికి
దిగజారవద్దు
Marriage
(వివాహము)
అనేది
Mirage
(ఎండమావి)
వంటిది.
ఎండమావిలో
నీరున్నట్లుగానే
కనిపిస్తుంది.
కాని,
దానివెంట
పరుగులు
తీస్తే
నీ
దాహం
తీరేదెప్పుడు?
వివాహంవల్ల
కలిగే
ఫలితంకూడా
ఇంతే!
పెళ్ళి
చేసుకున్న
తరువాతనే
“ఈమె
నా
భార్య”
అంటున్నావు.
అంతకుపూర్వం
ఆమె
ఎవరు?
నీవెవరు?
పుట్టిన
తరువాతనే
“ఈమె
నా
తల్లి”
అంటున్నావు.
అంతకుపూర్వం
తల్లి
ఎవరు?
బిడ్డ
ఎవరు?
ఈ
సంబంధాలన్నీ
కదిలిపోయే
మేఘాలవలె
వస్తాయి,
పోతాయి.
కాని,
నైతికశక్తి
వచ్చి
పోయేది
కాదు.
అది
వస్తే
అభివృద్ధి
చెందుతుంది.
దానికి
ఇంద్రియనిగ్రహం
చాలా
ప్రధానం.
కాని,
ఈనాటి
మానవుడు
ఇంద్రియనిగ్రహాన్ని
కోల్పోవటంచేత
బలహీనుడైపోయాడు;
దైవత్వాన్ని
చేరవలసినది
పోయి
దీనత్వానికి
దిగజారిపోయాడు.
చిన్నచిన్న
విషయాలకు
కోపం
వస్తుంది,
దుఃఖం
వస్తుంది.
ఇంక
అలాంటివానికి
భగవత్తత్త్వం
ఏరీతిగా
బోధపడుతుంది?
కష్ట
సుఖాలపట్ల
నీవు
సమత్వం
వహించాలి.
కొడుకు
పుట్టాడు,
సంతోషించావు.
కొడుకు
పోయాడు,
దుఃఖిస్తున్నావు.
వచ్చింది
ఎవరు?
పోయింది
ఎవరు?
మధ్యలో
వచ్చిపోయే
వాటిగురించి
చింతించవద్దు.
నీ
కర్తవ్యాన్ని
నీవు
నిర్వర్తించు.
కర్తవ్య
నిర్వహణయే
దైవపూజగా
భావించు.
“ఇది
నా
ఇంటి
పని,
అది
ఆఫీసు
పని,
అది
భగవంతుని
పని”
అని
విభజించుకోవద్దు.
ఏ
పని
చేసినా
అది
దైవకార్యంగా
భావించు.
అదే
సరియైన
మార్గం.
జ్ఞానం
-
అజ్ఞానం
-
ఆత్మతత్త్వం
మానవుడు
ముఖ్యంగా
గుర్తించవలసినవి
మూడే
మూడు
-
ఒకటి
వస్తే
పోదు;
రెండవది
పోతే
రాదు;
మూడవది
రాదు,
పోదు.
మొదటిది
జ్ఞానము.
అది
వస్తే
పోదు.
రెండవది
అజ్ఞానము.
అది
పోతే
రాదు.
మూడవది
ఆత్మతత్త్వము.
అది
రాదు,
పోదు.
అది
ఎప్పటికి
నిశ్చలంగా,
నిర్మలంగా
ఉంటుంది;
మార్పు
చెందదు.
8
▾
Meaning
Keep
అట్టి
ఆత్మజ్ఞానమును
సంపాదించకుండా
లోకజ్ఞానమునెంత
సంపాదించి
ఏమి
ప్రయోజనం?
మీరు
అనేక
పుస్తకాలు
చదువుతున్నారు.
పుస్తకాలలో
ఉన్నది
ఎక్కడినుండి
వచ్చింది?
మానవుని
మస్తకమునుండియే
వచ్చింది.
మస్తకమునుండి
వచ్చినదానిని
తిరిగి
మస్తకమునకు
చేర్చుకుంటున్నారు.
కాని,
ఆత్మజ్ఞానము
పుస్తకము
నుండి
రాదు,
మస్తకమునుండి
రాదు.
అది
హృదయస్థానమునుండి
ఆవిర్భవిస్తుంది.
అట్టి
ఆత్మ
జ్ఞానమును
పొందాలంటే
మనస్సును
అదుపులో
పెట్టుకోవాలి.
మనస్సు
చాలా
పిచ్చిది.
అది
తలంపులయొక్క
చేరికయే.
చెడ్డతలంపులు
మనస్సును
మాలిన్యపరుస్తాయి.
కాబట్టి
మొట్టమొదట
మనస్సును
పరిశుద్ధం
చేసుకోవాలి.
నీవు
ముక్తి
కావాలని
ఆశిస్తున్నావు.
ముక్తి
అంటే
ఏమిటి?
నీకు
ఆకలౌతున్నది.
భోజనం
చేస్తే
ఆకలి
తీరింది.
శరీరానికి
రోగం
వచ్చింది.
మందు
తీసుకుంటే
రోగనివారణ
అయింది.
ఇది
శారీరకమైన
ముక్తి.
మనస్సుకుకూడా
ముక్తి
కావాలి.
చంచలంగా
ఉన్న
మనస్సును
స్థిరం
చేసుకోవటమే
మానసిక
ముక్తి.
అయితే,
ఇవి
భౌతికమైనవి.
మరి
నిజమైన
ముక్తి
ఏమిటి?
రాకపోకలు
లేని
ఆత్మతత్త్వాన్ని
గుర్తించటమే
నిజమైన
ముక్తి.
ధ్యానమనగా...
మూర్ఖులైన
మానవులు
దైవత్వాన్ని
సరిగా
అర్థం
చేసుకోవటం
లేదు.
ధ్యానం
చేస్తే
దైవసాక్షాత్కారం
కల్గుతుందని
భావిస్తున్నారు.
అసలు
ధ్యానమంటే
ఏమిటి?
అది
Way
of
life.
మన
జీవితమంతా
ధ్యానంతో
కూడినదే.
ఉదాహరణకు,
మీరు
రోడ్డుపైన
నడిచేటప్పుడు,
లేక,
కారు
డ్రైవ్
చేసేటప్పుడు
మీ
దృష్టి
రోడ్డుపైనే
ఉండాలి.
లేకపోతే
మీరు
ప్రమాదానికి
గురి
కావచ్చు.
మీరు
చేసే
ప్రతి
పనికీ
ఏకాగ్రత
అవసరం.
అయితే,
ఏకాగ్రత
ధ్యానమౌతుందా?
కాదు,
కాదు.
ఏకాగ్రతకు
అతీతంగా
పోవాలి.
అనగా,
మనో
భావాలను
స్తంభింపజేయాలి.
ఎలాంటి
ఆలోచనలూ
లేకుండా
చూసుకోవాలి.
అదే
నిజమైన
ధ్యానము.
అలనాడు
గోపికలు
ఇదే
మార్గాన్ని
అనుసరిస్తూ
వచ్చారు.
వారి
దృష్టి
నిరంతరం
కృష్ణునిపైననే.
గోపికలు
ప్రతి
రోజూ
యశోద
ఇంటికి
వెళ్ళి
దీపం
ముట్టించుకునేవారు.
కృష్ణుడున్న
ఇంటినుండి
దీపం
తెచ్చుకుంటే
తమ
ఇల్లుకూడా
పవిత్రమౌతుందని
వారి
భావం.
ఒక
పర్యాయం
ఆ
గ్రామానికి
సుగుణ
అనే
క్రొత్త
కోడలు
వచ్చింది.
9
▾
Meaning
Keep
ఆమె
దీపం
ముట్టించుకోవటానికి
యశోద
ఇంటికి
వెళ్ళింది.
దీపం
ముట్టించుకునే
సమయంలో
ఆ
జ్యోతిలో
ఆమెకు
కృష్ణుడు
కనిపించాడు.
కృష్ణుని
దివ్య
మంగళస్వరూపాన్ని
చూస్తూ
ఆమె
తనను
తాను
మరిచిపోయింది.
తన
చేయి
కాలిపోతున్నప్పటికీ
ఏమాత్రం
చలించకుండా
నిలబడింది.
ఏదో
వాసన
వస్తున్నదని
పసిగట్టి
యశోద
పరుగెత్తుకొని
వచ్చింది.
“అమ్మా!
ఏమిటిది?
చేయి
కాలిపోతున్నా
అలాగే
నిలబడ్డావెందుకు?”
అంటూ
ఆమె
చేయిపట్టుకొని
ప్రక్కకు
లాగింది.
సుగుణ
చెప్పింది
-
“అమ్మా!
ఆ
జ్యోతిలో
నాకు
కృష్ణుడు
కనిపించాడు.
కృష్ణుణ్ణి
చూస్తూ
నన్ను
నేను
మరచిపోయాను.”
అక్కడున్న
గోపికలు
ఈ
మాటలు
విని
ఆనందంతో
పొంగిపోయారు.
“మన
సుగుణకు
కనిపించెనంట,
నందుని
ఇంట
గోపాలుడంట
దీపాన
కనిపించె
నంట...”
అని
పాడుకుంటూ
తమ
ఇళ్ళకు
వెళ్ళారు.
దీని
అంతరార్థమేమిటి?
మనస్సు
భగవంతునిపై
లగ్నమైతే
భగవంతుడు
సర్వత్ర
కనిపిస్తాడు.
అందునిమిత్తం
మీ
దృష్టి,
తలంపులు,
వాక్కు,
చర్యలు
పవిత్రమైనవిగా
ఉండాలి.
అట్టి
పవిత్రమైన
జీవితాన్ని
గడిపినప్పుడు
మీరు
దైవాన్ని
వెదుకనక్కరలేదు,
దైవమే
మిమ్మల్ని
వెదుక్కుంటూ
వస్తాడు.
ఒకానొక
సమయంలో
అనిబిసెంటు
చెప్పింది
-
“మానవులు
భగవంతుని
వెతుకుతున్నా
మంటున్నారు.
ఏమిటీ
పిచ్చి!
భగవంతుడు
సర్వత్ర
ఉన్నాడు.
కనుక,
భగవంతుని
వెదుకనక్కరలేదు.
భగవంతుడే
మంచి
మనిషిని
వెదుక్కుంటూ
వస్తున్నాడు.”
భగవత్ప్రేమకు
పాత్రుడైనవాడే
Good
man.
అతడే
నిజమైన
Godman.
మీరు
భగవత్ప్రేమకు
పాత్రులైనప్పుడే
మీ
జీవితం
సార్థకమౌతుంది.
ప్రేమస్వరూపులారా!
మీయందున్న
ప్రేమ
పరిశుద్ధమైనదేకాని,
మధ్యమధ్య
కొన్ని
భ్రాంతుల
చేత
మీరు
దానిని
మాలిన్యపరచుకుంటున్నారు.
దానివల్లనే
మీ
విలువ
తగ్గిపోతున్నది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణ
చెప్పి
ముగిస్తాను.
పరిశుద్ధమైన
బంగారం
చాలా
ప్రకాశవంతంగా
ఉంటుంది.
దాని
వెలకూడా
అధికంగా
ఉంటుంది.
దానికి
కొంత
రాగి
కలిపారనుకోండి.
దాని
ప్రకాశం
తగ్గి
పోతుంది;
విలువకూడా
తగ్గిపోతుంది.
కొంత
ఇత్తడినికూడా
చేర్చితే
దాని
ప్రకాశము,
విలువ
మరింత
క్షీణించిపోతాయి.
మానవుడు
పరిశుద్ధమైన
బంగారంవంటివాడు.
10
▾
Meaning
Keep
కాని,
తనలో
కోరికలనే
రాగిని,
ఇత్తడిని
చేర్చుకోవటం
చేత
తన
పవిత్రతను,
విలువను
కోల్పోతున్నాడు,
ఈనాడు
మానవత్వానికి
విలువ
లేకుండా
పోవటానికి
కారణమిదే.
సత్యధర్మశాంతి
ప్రేమలనే
మానవతావిలువలను
పోషించుకున్నప్పుడే
మానవునియొక్క
విలువ
పెరుగుతుంది.
ఎక్కడికి
వెళ్ళినా
తనను
గౌరవిస్తారు,
ఉన్నత
స్థానమందిస్తారు.
ప్రేమస్వరూపులారా!
మనస్సును
మాలిన్యం
చేసుకోకండి.
ఎన్నో
జన్మల
పుణ్యఫలంచేత
మీకు
మానవత్వం
ప్రాప్తించింది.
మానవత్వం
చాలా
విలువైనది.
అయితే,
మీరు
మానవతావిలువలను
పోషించుకున్నప్పుడే
మీ
విలువను
కాపాడుకోగలరు.
బుద్ధుడు
బోధించినది
ఇదియే.
దైవప్రీతిని,
పాపభీతిని,
సంఘనీతిని
పోషించుకోండి.
పాపానికి
దూరంగా
ఉండండి.
దైవాన్ని
ప్రేమించండి.
సంఘంలో
అందరితో
కలసిమెలసి
ఉండండి.
అదే
నిజమైన
నిర్వాణం.
పశువుకు
పాపమంటే
ఏమిటో
తెలియదు.
కనుక
దానికి
పాపభీతి
ఉండదు.
కాని
మీకు
ఏది
పాపమో
తెలుసు.
కాబట్టి
మీకు
పాపభీతి
ఉండాలి.
ఇంద్రియాలను
అరికట్టుకోండి.
సత్సంగంలో
చేరండి.
ఇక్కడ
విన్న
విషయాలను
మననం
చేసుకుంటూ,
వాటిని
అనుసరించండి.
అప్పుడే
మీరు
ఆదర్శప్రాయులుగా
తయారవుతారు.
జీవితంలో
ఎంతో
అభివృద్ధికి
వస్తారు.
Previous
←
The sweetness of a mother's Prema is beyond words
Next
Śānti is found only in Prema that is full
→