Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · All are embodiments of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
All are embodiments of God
13 October 2002, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
25 May 1991
Kenopanishad
బ్రహ్మ
దర్శన
భాగ్యంబు
పడయగోరి
వెదుక
పోవుదు
వెచటికె
వెఱ్ఱి
మనస
అదియు
నీలోన
నున్నది
వెతుకు
మచట
ఇంతకన్నను
భాగ్యంబు
ఏమికలదు
ప్రేమస్వరూపులారా!
భగవత్సృష్టి
చాలా
చిత్రవిచిత్రముగా
ఉంటుంది.
బ్రహ్మలోకమును
పొందగోరి
అనాదిగా
అనేకమంది
సాధకులు
అనేకరకములుగా
ప్రయత్నిస్తూ
వచ్చారు.
ప్రతి
మంత్రము
కొన్నిపదముల
సముదాయముగా
ఉంటున్నది.
ఈ
మంత్రములకు
అర్థములు
ఎన్నియో
ఉన్నవి.
అయితే,
మనకు
అనుకూలమైన
మంత్రాన్ని
మనం
స్వీకరించాలి.
జీవుడు
వ్యష్టి
స్వరూపుడు,
దేవుడు
సమష్టి
స్వరూపుడు
దక్షిణామూర్తి
ఈ
మంత్రముల
తత్త్వమును
లోకమునకు
ప్రచారము
చేయగోరి
అనేక
మార్గములు
అవలంబించి,
అంతరార్థములు
ప్రబోధించి,
ఆనందముకలిగిస్తూ
వచ్చాడు.
సామాన్యమైన
లౌకికజగత్తునకు
సామాన్యమైన
రీతిగా
ఈ
మంత్రములను
బోధిస్తూ
వచ్చాడు.
మూడు
పదములు
మాత్రమే
ముచ్చటగా
వర్ణిస్తూ
వచ్చాడు.
భూత,
భవిష్యత్,
వర్తమానకాలములని
మూడు
కాలములు
నియమించాడు.
మూడు
రూపములుగా
వర్ణిస్తూ
వచ్చాడు.
ఆత్మ,
మనస్సు
ఈరెండింటికీ
మధ్య
జీవుడు
అని
పెట్టాడు.
జీవుడు,
దేవుడు,
మనస్సు
-
ఈ
మూడుపదములను
ప్రత్యేకముగా
వర్ణిస్తూ
వచ్చాడు.
అయితే,
ఈ
జీవునకు
దేవునకు
మధ్యనున్న
మనస్సు
ఏ
పని
చేస్తూ
వచ్చింది?
జీవుడు
జడము.
దేవుడు
చైతన్యము.
ఈ
జడచైతన్యముల
రెంటిని
కలిపేనిమిత్తమై
మధ్యలో
మనస్సును
నియమిస్తూ
వచ్చాడు.
“జీవేశ్వర
ప్రకృతి”
అని
ఒక
మంత్రము
ఈశ్వరత్వమును
జీవత్వముతో
కూర్చి
దైవత్వంగా
మార్చేనిమిత్తమై
మనస్సును
అక్కడ
సాక్షీభూతంగా
నిలుపుతూ
వచ్చాడు.
అయితే,
మనస్సు
ఈ
జీవుని
దైవముగా
ఏరీతిగా
మారుస్తూ
వచ్చింది?
2
▾
Meaning
Keep
జీవుడు
వ్యష్టిస్వరూపుడు.
దేవుడు
సమష్టి
స్వరూపుడు.
కానీ,
మనస్సు
ఈ
రెండింటియొక్క
అంటే,
సమష్టి
వ్యష్టిలయొక్క
స్వరూపమే.
మనస్సుకు
ఇంత
పవిత్రమైన
శక్తి
ఉండినది.
అయితే,
ఈ
ఆధునిక
యుగములో
మనస్సును
“monkey
mind”
అని
వ్యవహరిస్తున్నారు.
ఇది
“పిచ్చికోతి”
వంటిది
అంటున్నారు.
కాదు,
కాదు,
ఇది
పవిత్రమైన
mankind
కు
ప్రతీక.
ఈ
mankind
ను
దైవముతో
ఏకముగావించే
నిమిత్తము
మనస్సు
ఏర్పడింది.
కనుక,
మనస్సు
చాలా
పవిత్రమైనది.
“మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః”
అంటారు.
మనస్సు
చాలా
శక్తివంతమైనది
అన్నారు.
మనస్సుకు
ఉన్న
శక్తి
మరి
దేనికీ
లేదు.
కానీ,
మనస్సునకు
ఈ
ప్రపంచములోని
వ్యక్తులు
అంతటి
గౌరవము
అందించలేదు.
లౌకికమైన,
భౌతికమైన,
ప్రాకృతికమైన
ఈ
పదమునకు
సరైన
అర్థాన్ని
గుర్తించుకోలేదు.
మనస్సు
చాలా
తీక్షణమైనది.
శక్తివంతమైనది.
ధీరత్వముతో,
వీరత్వముతో,
పరాక్రమముతో,
పవిత్రతతో
కూడినటువంటిది.
ఇలాంటి
మనస్సుయొక్క
తత్త్వము
గుర్తించుకొనుట
చాలా
కష్టము.
మనస్సే
లేకపోతే
జీవుడు,
దేవుడు
అనేవి
జగత్తుకు
కానరావు.
ఉపనిషత్సారమంతా
“తత్త్వమసి”
అనే
ఒక్క
మహావాక్యమునందున్నది
నిన్నటిదినము
చెప్పినట్లు
శ్వాస-ఈశ్వరస్వరూపము,
మనస్సు
-
విష్ణుస్వరూపము
మరియు
వాక్కు
-
బ్రహ్మ
స్వరూపము.
వాక్కునకున్న
శక్తి
మరిదేనికీ
లేదు.
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వర
తత్త్వములతో
కూడిన
దివ్యత్వము
ఇంత
శక్తివంతమైనది.
ఈ
శక్తి
మాటలయందు
మాత్రమే
కాదు,
క్రియా
స్వరూపము
నందు
కూడా
నిరూపింపబడుతూ
వచ్చింది.
మూడు
మూడు
పదములు
చేరి
ఒక్కొక్క
మంత్రముగా
వేదములందు
ఉపనిషత్తులందు
రూపొందాయి.
ఈ
ఉపనిషత్తుల
సారము
సరైన
రీతిగా
అర్థం
చేసుకోవటం
కష్టమౌతుంది.
“తత్త్వమసి”,
“అయమాత్మా
బ్రహ్మ”,
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”,
“ప్రజ్ఞానం
బ్రహ్మ”,
“బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి”
మొదలగు
ఉపనిషద్వాక్యములన్నీ
మహామంత్రములే.
ప్రతి
పదము
మంత్ర
స్వరూపమే.
ఈ
మంత్రములకు
కూడ
అనేకవిధములైన
అర్థములు
ఉన్నాయి.
ఋగ్వేదము,
యజుర్వేదము,
సామవేదము,
అధర్వణవేదము
ఈ
నాలుగు
వేదములలో
ఒక్కొక్క
వేదమునకు
ఆ
వేదసారమును
తెలిపే
ఒక్కొక్క
మంత్రము
(మహావాక్యము)
ఉన్నది.
3
▾
Meaning
Keep
వాటన్నింటిని
మనం
నేర్చుకోనక్కరలేదు.
అన్నింటిని
మనం
తెలుసుకోనక్కర
లేదు.
అన్నింటిని
మనం
చెప్పనక్కరలేదు.
ఈ
మహావాక్యములన్నింటి
సారము
“తత్
త్వం
అసి”
అనే
ఒక్క
మంత్రమునందే
ఉన్నది.
‘అసి’
అనగా
ఏమిటి?
చేర్చటము
‘తత్’,
‘త్వం’
దానితో
నేను
చేర్చటము
“అహం
బ్రహ్మాస్మి”
నేనే
బ్రహ్మగా
ఉండినాను.
బ్రహ్మలో
చేరినాను.
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”
అంతయు
బ్రహ్మమే.
ఈ
మంత్రముల
అర్థములన్నీ
కూడ
ఒక్క
ఏకార్థమును
బోధించేవే.
ఇటువంటి
ఏకత్వాన్ని
గుర్తించుకోవటమే
ఈ
మంత్రములయొక్క
నిజమైన
సాధన.
“బ్రహ్మవిత్
బ్రహ్మైవభవతి”
-
దాన్ని
నేర్చుకున్నవాడు,
తెలుసుకున్నవాడు
బ్రహ్మయే
అవుతాడు.
ఇది
ఉపనిషత్తులయొక్క
సరైన
సందేశము.
భగవదనుగ్రహమనే
సంస్కారముచేత
జీవుడు
దేవుడుగా
మారిపోతాడు
ప్రేమస్వరూపులారా!
మీరు
ముఖ్యముగా
“నేనే
దైవము”
అని
తెలుసుకోవాలి.
ఎవరికి
వారే
దైవస్వరూపులు.
“ఎవరికి
వారే
దైవస్వరూపులైనప్పుడు
ఇంక
దైవమును
ఎందుకు
కొలవాలి?”
అనే
ప్రశ్న
వస్తుంది.
అయితే,
దైవాన్ని
కొలిచే
శక్తి
సామర్థ్యములు
మీలో
ఉన్నవని
గుర్తించుకోలేరు.
మీరు
సామాన్యమైన
వ్యక్తులుగా
ఉంటుండి
లౌకిక
జగత్తులో
సామాన్యమైన
జీవితము
గడుపుతూ
ఉన్నారు.
అలాంటి
జీవితాన్ని
గడిపేవారికి
దివ్యత్వము
ఎలా
అర్థమవుతుంది?
మీరు
వ్యష్టి
స్వరూపులు.
భగవంతుడు
సమష్టి
స్వరూపము.
వ్యష్టి,
సమష్టి
స్వరూపాన్ని
ఏవిధంగా
గుర్తించగలదు?
నేనే
సమష్టి
స్వరూపుడననే
సత్యాన్ని
గుర్తించుకున్నప్పుడే
వ్యష్టి
సమష్టి
స్వరూపుడౌతాడు.
అందువలన,
“నేనే
దేవుడను”
(I
am
God)
అనే
సత్యాన్ని
మీరు
గుర్తించాలి.
అయితే
ఇలా
మీరు
ఎట్లా
చెప్పగలరు?
అందుకొరకు
I
am
God
అనే
విశ్వాసమును
మీరు
పూర్తిగా
అభివృద్ధిచేసుకోవాలి.
ఒక
కుమ్మరి
చెరువుకు
పోయి
ఇంత
మట్టిని
తీసుకువచ్చాడు.
ఇంటి
ముందు
వేసుకున్నాడు.
రెండవదినము
ఆ
మట్టిలో
నీరు
కలిపి
ముద్దగా
చేశాడు.
దానిని
చక్రముపై
వేసి
కుండమాదిరి
చేశాడు.
అయితే,
ఆ
కుండలో
నీరు
పోస్తే
నిలవటంలేదు.
క్రమక్రమేణా
ఇంకిపోతూ
వస్తున్నది.
అందువలన
ఆ
మట్టి
కుండను
అగ్నిలోవేసి
కాల్చి
దానికి
అగ్ని
సంస్కారము
చేయాలి.
అగ్ని
సంస్కారము
చేసినపుడే
ఆ
కుండ
గట్టిపడి
అందులో
పోసిన
నీరు
నిలుస్తుంది.
4
▾
Meaning
Keep
అదేవిధంగా
మనము
కూడా
మట్టివంటి
వారము.
ఈ
మట్టిని
దివ్యత్వము
ఒక
కుండగా
మారుస్తున్నది.
ఆ
కుండను
జ్ఞానమనే
అగ్నిలో
వేసి
కాల్చాలి.
ఏమిటి
ఈ
జ్ఞానము
అనేది?
“అద్వైత
దర్శనం
జ్ఞానం”.
“జీవుడు,
దేవుడు
ఒక్కరే”
అనే
ఏకత్వ
జ్ఞానమును
సంపాదించుకున్నప్పుడే,
ఇది
పూర్తిగా
కాలినప్పుడే,
దీనిలో
వేసిన
పదార్థము
నిల్చిపోతుంది.
సృష్టిలో
ప్రతిఒక్క
వస్తువు
సంస్కారముచేత
సర్వవిధమైన
శక్తులను
సంపాదించుకుంటున్నది.
అగ్ని
సంస్కారముచేత
కుండలు
ఏవిధంగా
గట్టి
పడుతున్నాయో,
అదేవిధంగా
భగవదనుగ్రహమనే
సంస్కారముచేత
జీవుడు
దేవుడుగా
మారిపోతున్నాడు.
సంస్కారము
చేసుకుంటూ
రావటంచేత
వస్తువుయొక్క
శక్తికూడను
పెరుగుతున్నది.
విలువకూడను
పెరుగుతున్నది.
నేను
మీ
అందరినీ
“బంగారూ”!
అని
పిలుస్తుంటాను.
బంగారు
అనగా
gold.
భగవంతుడు
హిరణ్యగర్భుడు.
హిరణ్యగర్భుడైన
భగవంతుడు
మీ
అందరిలో
ఉంటున్నాడు.
అందువలననే
బంగారు
అనే
పిలుపును
మీరు
సంపాదించుకున్నారు.
అయితే,
సంపాదించుకున్నంత
మాత్రమున
సరిపోదు.
ఆ
బంగారును
అలంకారము
చేసుకునే
నగలుగా
మనము
మార్చుకోవడానికి
ప్రయత్నించాలి.
అందుకొరకు
బంగారును
అగ్నిలోవేసి
కరగించి,
సుత్తితో
కొట్టి
సాగదీసి,
కటింగ్లుచేసి
నగలుగా
రూపొందించాలి.
అదేవిధంగా
మీరుకూడా
సంస్కరింపబడాలి.
భగవత్సంకల్పము
వజ్రసంకల్పము.
హిరణ్యగర్భుడు
భగవంతుడు.
ఆ
హిరణ్యగర్భుడు
ఎక్కడ
ఉన్నాడు?
మనయందే
ఉన్నాడు.
అదియే
మనము
తెలుసుకోవలసినది.
మనము
తినే
ఆహారములో
ఆమ్లముయొక్క
శక్తి
చాలా
చేరి
ఉంటున్నది.
కూరగాయలలోపల
ఆమ్లము
అధికంగా
ఉంటున్నది.
మనము
తినే
ఆకుకూరలలో
ఇనుము
ఉంటున్నది.
అంతేకాదు
మనము
చింతపండు
పులుసుతో
పులుసుకూర
చేస్తాము.
దానిలోకూడ
ఆమ్లము
వస్తుంది.
అంతేకాకుండా
నిమ్మకాయ
రసములో
ఆమ్లముంటుంది.
మనము
భుజించే
ప్రతిపదార్థమునందు
ఒక
లోహము
ఉంటున్నది.
ఇవన్నీ
కూడా
దేహములోని
శక్తిని
బలపరుస్తూవస్తాయి.
మనయందు
దైవశక్తి
ఆహారమునుండే
వస్తున్నది.
ఈ
Food
మన
Head
ను
సంపాయిస్తున్నది.
ఈ
Head,
God
గా
మారిపోతున్నది.
కనుక,
మనం
ఆహారాన్ని
సక్రమమైన
రీతిగా
ఉపయోగపెట్టుకున్నప్పుడు
మన
స్వరూపము
మనకు
అర్థమవుతుంది.
మన
శరీరములో
Acid
అని
అంటున్నారు.
5
▾
Meaning
Keep
కాదు
అది
కూడా
ఒక
లోహమే.
Acid
మాదిరి
కనిపిస్తుంది,
కాని,
క్రమక్రమేణా
లోహము
మాదిరి
మారిపోతుంది.
దీనినుండి
cells
బయలుదేరుతాయి.
మన
శరీరమంతా
కొన్ని
లక్షల
సెల్స్
ఉంటాయి.
అందులో
ఒక్కొక్క
cell
ఒక్కొక్క
రక్తబిందువు.
ఈవిధంగా
సైన్సులోగాని
ఆధ్యాత్మికంలోగానీ
అంతరార్థములు
అనేకంగా
ఉంటున్నాయి.
అయితే
ఆధ్యాత్మికములోపల
ఇది
మంత్రస్వరూపకముగా
రూపొందుతుంది.
ఈ
మంత్రము
ఎట్లా
వస్తుంది?
శబ్దముల
సమ్మిళిత
స్వరూపమే
మంత్రము.
ఈ
మంత్రముచేత
దైవత్వము
ప్రాప్తిస్తున్నది.
మనకు
అనేకవిధములైన
స్వప్నాలు
కలుగుతుంటాయి.
ఇవి
ఆహారవిహారములచేత
ఏర్పడిన
రియాక్షన్లు.
అయితే
ఈ
మానవ
శరీరములోనే
దైవత్వము
అంతర్యామిగా
ఉంటున్నది.
పదార్థము
భౌతికమైనది,
పరార్థము
దివ్యమైనది
పదార్ధమునకు,
పరార్థమునకు
ఎంతో
వ్యత్యాసమున్నది.
మనము
కేవలం
పదార్థముగా
ఉపయోగపెట్టుకొంటున్నాము.
కాబట్టి
మనకు
పదార్థముగానే
గోచరిస్తుంది.
దీనిని
పురస్కరించుకొనియే
వేదాంతమందు
‘యద్భావం
తద్భవతి’
అని
చెపుతారు.
మనయొక్క
భావాన్ని
పురస్కరించుకొని
ఆ
భావము
మారిపోతూ
ఉంటుంది.
చిన్న
ఉదాహరణ
చూడండి.
మానవదేహము
అయస్కాంతము
వంటిది.
అయస్కాంతము
మనలో
ఉండటంచేత
మనదేహము
ఒకవిధమైన
బ్యాటరీలా
తయారౌతున్నది.
ఈ
బ్యాటరీనుండి
కాంతి
వస్తున్నది.
అంతేకాదు,
తేజస్సుకూడా
వెలువడుతున్నది.
సౌండ్వేవ్స్
మనయందు
ప్రారంభమై
వాటినుండి
శబ్దము
వెలువడుతున్నది.
ఈవిధంగా
ప్రతి
మానవునియందు
దైవత్వము
అయస్కాంతము,
తేజస్సు,
శబ్దరూపములలో
గోచరిస్తున్నది.
ఈవిషయం
లోతుగా
విచారించి
చూస్తే
తెలుస్తుంది.
దివ్యత్వమునకు,
పదార్థమునకు
ఎంతో
భేదము
ఉన్నది.
పదార్థము
భౌతికమైనది,
లౌకికమైనది,
ప్రాకృతమైనది
కానీ,
పరార్థము
దివ్యమైన,
భవ్యమైన,
నవ్యమైన
తేజస్సుతో
కూడిన
దివ్యశక్తి.
ఇట్టి
పవిత్రమైన
పరార్థమును
కేవలం
పదార్థముగా
తీసుకోవటంచేత
దానికి
విలువనే
లేకుండా
పోతోంది.
ఈనాడు
ఏ
వస్తువుకైనా
విలువను
ఇచ్చేదీ
మనమే.
విలువను
తీసేసేదీ
మనమే;
కారణం
మనః
ప్రభావమే!
ఈ
మనో
ప్రభావములు
ఈ
రీతిగా
మారుతుంటాయి.
మంచి
విలువైన
వస్తువునకు
విలువలేకుండా
చేసుకుంటున్నాం.
విలువలేనిదాన్ని
విలువ
ఉండేదిగా
మార్చుకుంటున్నాం.
6
▾
Meaning
Keep
ఈ
మనస్సుచేత
కొన్నికొన్ని
పిచ్చిపిచ్చి
సంకల్పాలంతా
వస్తుంటాయి.
ఈ
సంకల్పములచేత
మనశక్తిని
దుర్వినియోగం
చేసుకుంటున్నాము.
కనుక,
దుష్టసంకల్పములు
రాకుండా
ఉండేనిమిత్తమై
దైవసంకల్పములను
పెంచుకోవాలి.
దైవసంకల్పములంటే
“నా
దేహములోని
ప్రతి
రక్తపుబొట్టు
దైవస్వరూపమే,
ప్రతిశక్తికూడ
దైవశక్తియే
ప్రతి
సంకల్పము
దైవసంకల్పమే”
అని
భావించుకోవడం.
కానీ,
ఈనాటి
మానవులు
ఇలా
భావించుకోవడం
లేదు.
ఇవన్నీ
లౌకిక
సంకల్పము
లనుకుంటున్నారు.
ఇది
సరికాదు.
సంస్కారముచేత
ప్రతివస్తువు
పవిత్రమైపోతుంది
ప్రతిపదార్థమును
పరార్థముగానే
తీసుకోవాలి.
ఒక
చిన్న
విషయము
చూడండి.
ఒకమూట
వడ్లు
తెచ్చాము.
ఈ
మూటకు
మనము
ఎంత
విలువ
ఇస్తున్నాము?
రెండువందల
రూపాయలిస్తాము.
అయితే
ఈ
వడ్లను
బాగా
దంచి,
శుభ్రముచేసి,
బియ్యముగా
మారిస్తే
దానివిలువ
పెరిగిపోతుంది.
వడ్లనుండి
పొట్టు
వేరుచేయటంవల్ల,
తవుడు
వేరుచేయటంవల్ల,
దానినుండి
వచ్చే
బియ్యముయొక్క
వెల
బాగా
పెరిగిపోతుంది.
వడ్లు
వెల
కంటె
బియ్యము
వెల
రెట్టింపు
అయిపోతుంది.
వడ్లను
బియ్యముగా
మార్చటమే
సంస్కారము.
అదియే
దంచటము,
తవుడు
తీయటము,
పొట్టువేరు
చేయటం,
బియ్యం
వేరుచేయటం.
బియ్యమునకు
ఎంతవిలువ
ఇస్తున్నామో,
అంతవిలువ
వడ్లకు
ఇస్తున్నామా?
లేదు
కదా!
ఎందువలన?
వడ్లు
సంస్కరింపబడలేదు.
కనుక,
దానికి
విలువ
తక్కువ.
వడ్లను
సంస్కరింపచేసి
బియ్యముగా
మార్చినపుడు
దానివిలువ
ఎక్కువ
అవుతుంది.
వడ్లను
భుజించుటకు
వీలవుతుందా?
కాదు,
కాదు.
బియ్యమును
భుజించుటకు
వీలవుతుంది.
కాబట్టి
మనం
భుజించుటకు
తగిన
అర్హతను
కలిగించాలి.
దానికి
తగిన
సంస్కారము
చేయాలి.
సంస్కారము
చేయకుండా
నాకు
అన్నీ
సులభంగా
లభ్యము
కావాలంటే
కాదు.
ఎంత
కష్టపడితే
అంత
ఫలితము
దక్కుతుంది.
‘కష్టేఫలే’
మనం
కష్టపడేకొద్దీ
పవిత్రభావములు
వస్తాయి.
కనుక,
మన
కష్టానికి
గురికావాలి.
ఆ
కష్టముతో
మనం
సంస్కరింపబడాలి.
ప్రతి
ఒక్కటి
సంస్కారముచేత
పవిత్రమైపోతున్నది.
మీరు
విద్యార్థులుగా
ఉంటున్నారు.
చదువు
అనేది
సంస్కారముచేత
వస్తుంది.
నేర్చుకోవటంకూడా
ఒక
సంస్కారమే.
తినటం
కూడ
ఒక
సంస్కారమే.
నడవటం
కూడ
ఒక
సంస్కారమే.
కూర్చోవటం
కూడ
ఒక
సంస్కారమే.
7
▾
Meaning
Keep
నవ్వటం
ఒక
సంస్కారమే.
ఏడ్వడం
ఒక
సంస్కారమే.
అన్నీ
సంస్కారముతోనే
లభ్యమవుతున్నాయి.
ఏడుపువల్ల
వచ్చే
సంస్కారము
ఏమిటి?
ఏడుపువల్ల
మనలో
కొన్ని
మార్పులు
కలుగుతాయి.
ఎట్లా?
ఏడుపువల్ల
మనలో
ఉన్న
కొన్ని
చెడ్డభావములు
దూరమైపోతున్నాయి.
మనదేహములోని
చెడ్డనీరంతా
పోతున్నది.
ఈనాడు
చూడండి.
ప్రపంచములో
ఎక్కడికి
పోయినా
జనం
క్రిక్కిరిసి
గాలి
ఆడకుండా
పోతున్నది.
మనపూర్వీకులు
పెండ్లిచేయాలంటే
పందిళ్ళువేసుకొని,
మామిడి
తోరణాలు
కట్టుకొని,
అరిటాకులు
కట్టుకొని
ఎంతో
మంగళకరంగా
చేసుకునేవారు.
పెండ్లికి
అనేకమంది
చేరతారు.
అలా
చేరినవారు
విడిచే
గాలిలోని
carbondioxideను
ఈ
ఆకులు
క్రమక్రమేణా
స్వీకరించి
ఆక్సిజన్‌ను
బయటకు
పంపుతాయి.
oxygen
గాలిని
పవిత్రము
చేస్తుంది.
carbondioxide
గాలిని
పాడు
చేస్తుంది.
కనుక,
ఈవిధమైన
పచ్చదనము
ఎంతగొప్పది!
ఈనాడు
ఇటువంటి
చర్యలలోగల
భావాన్ని
మర్చిపోతున్నాము
మనము.
పెండ్లిండ్లు
జరుగుతున్నాయంటే
plastic
తోరణాలు
కడతారు.
ద్వారాలకు
plastic
అరిటాకులచెట్లు
కడుతున్నారు.
అంతా
ప్లాస్టిక్
మయం.
అందువలన
ఇటువంటిచర్యలకు
plastic
రిజల్ట్సునే
వస్తుంది.
ఈనాడు
అంతా
సులభంగా
శాశ్వతంగా
ఉండాలని
సులువైన
పద్ధతి
చూస్తున్నాం.
ఇది
చాలా
ప్రమాదకరమైనది.
ఇలాంటి
ఆధునికమైన
మార్గాల్లో
ప్రవేశించి
ఆరోగ్యమును
పాడుచేసుకుంటున్నాం.
మానవుడు
భుజించే
ఆహారములో
ఎంతో
పవిత్రత
ఉంటున్నది.
అటువంటిది,
మనం
భుజించే
ఆహారము
దగ్గరనుంచి
అన్ని
విషయాలలోను
సులభమార్గాలే!
దీనితో
ఆరోగ్యం
పాడవుతుంది.
ఆరోగ్యాన్ని
కాపాడుకోవటానికి
ఎంతో
ధనాన్ని
ఖర్చు
పెడుతున్నాము.
‘కొన్న
కూర
పావలా,
కూలి
అర్థరూపాయి’,
అలా
ఉంది
మన
పరిస్థితి!
ఈనాడు
మానవుడు
సోమరిపోతులా
తయారౌతున్నాడు.
బజారుకువెళ్ళి
కూరగాయలు
తీసుకుంటే
అవి
మోయడానికి
కూలీ
కావాలి.
ఏమి,
నీవు
తీసుకుపోలేవా?
bag
వేసుకొనిపో,
తప్పేమి
ఉంటున్నది?
ఈనాడు
ప్రత్యక్షంగా
దానిని
మోయలేకపోతున్నావు.
రేపటిదినము
ఆహారములో
పరోక్షమైన
స్వరూపము
ధరించినపుడు
ఎంతైనా
మోస్తున్నావు.
ఇలా
ప్రతి
విషయమును
మనం
చక్కగా
అర్థం
చేసుకొని
వర్తించినపుడు
ఎంతయో
సుఖము.
8
▾
Meaning
Keep
దైవత్వములేని
పదార్థము
జగత్తులో
లేదు
ప్రేమస్వరూపులారా!
మీరు
తినే
ఆహారాన్ని
పదార్థమని
కాకుండా
పరార్థముగా
విశ్వసించండి.
అందుకొరకు
పదార్థము
పవిత్రముగా
ఉండాలి.
భోజనపదార్థము
చెడిపోకుండా
చూచుకోవాలి.
పాడైపోయిన
తరువాత
అది
విషంగా
మారిపోతుంది.
ప్రతి
పదార్థమందు
దైవత్వముంటుంది.
దైవత్వములేని
పదార్థము
జగత్తులో
లేదు.
దైవత్వములేని
చోటు
మనము
చూడలేము.
అన్నింటియందు
దైవత్వమే
ఉంటున్నది.
అట్టి
దైవత్వాన్ని
గుర్తించుటకు
తగిన
నిజమైన
మార్గములు
వెతకాలి.
ప్రతి
పదార్థమును
సంస్కరింపచేయటంవల్ల
అదే
పరార్థముగా
మారిపోతుంది.
కనుక,
లౌకికపదార్థములంతా
దైవపదార్థములుగా
మారిపోవాలంటే
ఎంతటి
సంస్కారయుతంగా,
పవిత్రమైనవిగా
ఉండాలి?
అప్పుడే
వీటి
వెల
పెరిగిపోతుంది.
మనలో
పవిత్రతకూడా
అభివృద్ధి
అవుతుంది.
విద్యార్థులారా!
మీరు
అన్నీ
చదువుతున్నారు.
చదువుతున్నారే
కానీ
చదివినవి
ఆచరణలో
పెట్టటంలేదు.
ఏమిటిచదువుతున్నారు?
“Oxygen,
Hydrogen
రెండూ
కలిపితే
నీరు
అవుతుంది”
అని.
ఈవిషయాన్ని
ప్రయోగశాల
లోనికిపోయి
పరిశీలన
చేస్తున్నారు.
ఈ
ప్రయోగశాలలో
పరిశీలనచేస్తే
మనకు
వచ్చిన
ఫలితము
ఏమిటి?
practical
గా
మనం
అనుభవించాలి.
ఈనాడు
నీరు
లేక
ఎంతో
అవస్థ
పడుతున్నాము?
అటువంటప్పుడు
Oxygen,
Hydrogen
రెండూచేర్చి
నీరుగా
తయారుచేయండి,
చూద్దాం!
ఇది
సాధ్యంకాదు.
ఈనాడు
నీటిని
waste
చేస్తున్నారు.
భారతదేశమునందు
ఎన్నో
నదులుంటున్నాయి.
జీవనదులెన్నో
ఉన్నాయి.
ఈ
నదులలో
ఎంతోనీరు
ప్రవహిస్తున్నది.
కాని,
కట్టకడపటికి
ఎవరికీ
ఉపయోగపడకుండా
సముద్రములో
చేరిపోతున్నది.
మరొకప్రక్క
మాకు
నీరులేదని
ఒక
రాష్ట్రము,
మరొక
రాష్ట్రము
పోట్లాడుకుంటున్నాయి.
ఆ
వచ్చిన
నీరు
ఎందుకు
సద్వినియోగము
చేసుకోకూడదు?
అది
సద్వినియోగము
చేసుకోలేని
బలహీనులే
నీరు
లేదని
పోట్లాడుకుంటున్నారు.
భారతదేశములో
నదులలోని
ఎంతో
నీరు
సముద్రములోనికి
ప్రవహించి
వృథా
అయిపోతున్నది.
దానినంతా
కాపాడుకో.
సద్వినియోగము
చేసుకో.
భారతదేశము
గొప్పకల్యాణకరమైన,
మంగళకరమైన
భూమి.
ఇది
“అన్నపూర్ణ”
అని
పేరుపొందిన
దేశము.
అటువంటిది
నేడు
అన్నమే
లేక
అవస్థ
పడుతున్నామంటే
దీనికి
కారణ
మేమిటి?
మనం
ప్రతి
పదార్థమును
దుర్వినియోగము
చేసుకుంటున్నాము.
9
▾
Meaning
Keep
ఇది
చాలా
పొరపాటు.
సద్వినియోగముచేయటానికి
ప్రయత్నం
చేయండి.
ఎంతో
సంతోషమును
మీరు
అనుభవించవచ్చు;
ఇంకా
తోటి
ప్రజలకు
కూడా
అందించవచ్చు.
ఏ
పదార్థమును
వృథా
చేయకూడదు
ప్రేమస్వరూపులారా!
ఏ
పదార్థమును
కూడా
మనము
వృథా
చేయకూడదు.
చాలామంది
చేతులు
కడుక్కోవాలని
కుళాయి
తిప్పుతారు.
ఎంతనీరు
waste
చేస్తున్నారు?
నీరు
వృథా
చేయటం
నాకు
ఏమాత్రము
ఇష్టము
లేదు.
ఎంతనీరు
కావాలో
అంత
తీసుకో.
తరువాత
కుళాయి
బిగించివేయి.
ఇలా
చేస్తే
ఎంతోనీరు
మిగులుతుంది.
Do
not
waste
water.
Food
కూడా
అంతే;
ఎంత
కావాలో
అంత
పెట్టించుకొని
భుజించు.
ఎక్కువగా
వేయించుకొని
బయట
పారేస్తున్నావు.
“ఎందుకయ్యా!
పారేస్తున్నావు”?
అంటే
“కుక్కలు
తింటాయి
పారవేయటంవల్ల
తప్పేమి
ఉంది”,
అని
సమాధానము
చెప్పుతారు.
ఇలా
బయటపారేసిన
ఆహారమును
అవి
కూడ
తినకుండా
పోతున్నాయి.
వాటికి
మాత్రము
ప్రాణంలేదా?
ఈ
కలియుగంలో
Animals
కూడ
Modern
animals
గా
ఉంటున్నాయి.
ముందు
వాసన
చూస్తాయి.
సరిగా
ఉంటే
తింటాయి.
లేకపోతే
నీవే
తీసుకోమని
వదిలిపెట్టి
వెళ్ళిపోతాయి.
కాబట్టి
ఆహారమును
waste
చేయకూడదు.
ఇంకా
అనేక
పదార్థములను
ఎన్నిరకములుగానో
waste
చేస్తున్నారు.
మనము
దేనినీ
waste
చేయకూడదు.
నీరును
waste
చేయకూడదు.
తిండిని
waste
చేయకూడదు.
టైమును
waste
చేయకూడదు.
ఈనాడు
టైము
ఎక్కువ
waste
చేస్తున్నారు.
ఈ
Time
waste
చేయటం
వలననే
Life
waste
అయిపోతున్నది.
నిన్నటి
దినము
అనేక
విషయాలన్నీ
చెబుతూవచ్చాను.
దేనికోసం
స్వామి
ఇలా
మాట్లాడారు
అనుకుంటారు
చాలామంది.
ఇంతకాలం
నేను
మాట్లాడకుండా
ఉండటంచేత
గొంతు
కొంచెం
నిల్చిపోతూ
ఉండేది.
గట్టిగా
మాటలాడటానికి
శక్తికూడా
లేకుండా
పోయింది.
ఈ
speeches
వల్ల
గొంతు
చాలా
శుభ్రమైపోతున్నది.
Sound
చాలా
బాగా
వస్తున్నది.
ఇది
నాకెంతో
ఉపయోగము!
మనము
మాటలు
కూడా
తగిన
రీతిగా
ఉపయోగపెట్టుకోవాలి.
Do
not
waste
words.
ప్రతిమానవుడు
ఏ
పదార్థమును
కూడా
waste
చేయకూడదు.
మరొక
విషయం
గుర్తుపెట్టుకోవాలి.
10
▾
Meaning
Keep
మీరు
గట్టిగా
మాట్లాడకూడదు.
మీ
మాటలు
ఎవరు
వినాలో
వారికి
మాత్రమే
వినపడాలి.
మీరు
రోడ్డులో
మాట్లాడుతూపోతుంటే
మీ
మాటలు
ఎక్కడో
వంటగదిలో
ఉన్నవారికి
కూడా
వినబడుతుంటాయి.
దానివలన
మీ
గౌరవము
కూడా
పోతుంది.
“ఏమిట్రా,
ఈయన
ఎవరు?
ఇట్లా
మాట్లాడుతున్నాడు,
పిచ్చివానిమాదిరి”
అని
అనుకుంటారు.
మనగౌరవాన్ని
మాటలలోకూడ
నిలుపుకోవాలి.
మన
మాటలలోపలనే
మన
పవిత్రత
వెల్లడికావాలి.
మన
నడతలో
కూడా
పవిత్రత
పెంచుకోవాలి.
గౌరవము
పోయిన
తర్వాత
ప్రయోజనం
ఏమిటి?
నేను
త్వరత్వరగా
నడవవచ్చు;
కానీ
నాకు
ఇష్టము
లేదు.
నిదానంగా
నడిస్తే
అందరూ
చక్కగా,
తృప్తిగా
నా
దర్శనము
చేసికోగలరు.
వారూ
ఆనందిస్తారు.
నేనూ
సంతోషిస్తాను.
అందువలన
ఇతరులకు
ఆనందము
ఇవ్వాలని
నేను
నెమ్మదిగా
నడుస్తాను.
అలా
చేయటంవల్ల
ఎంతోమంది
ఆనందిస్తున్నారు!
నేను
త్వరగా
నడిస్తే
“స్వామి
వచ్చారు,
వెళ్ళిపోయారు.
నేను
సరిగా
దర్శనము
చేసుకోలేకపోయానే”,
అని
బాధపడతారు.
ఆవిధంగా
వారికి
బాధకలిగించిన
వాడినౌతానే!
Help
ever,
hurt
never
ఈ
రెండింటిని
మీరు
చూసుకోవాలి.
ఇతరులకు
సహాయము
చేయాలి.
మనము
ఈనాడు
ముఖ్యంగా
నేర్చుకోవలసినది
నీరు
వృథా
చేయకండి,
Food
waste
చేయకండి.
ఎంతమందో
ఆకలితో
మరణించేవారున్నారు
లోకములో.
కాబట్టి,
మిగిలితే
వారికికూడా
పెట్టవచ్చును.
నీకు
ఎక్కువ
అయిందని
పార
వేయటానికి
ప్రయత్నించవద్దు.
అలా
పారవేసినది
మట్టిలో
చేరిపోతుంది.
అటువంటి
పదార్థమును
కాకులుకూడా
తినవు.
అలాంటి
దానివల్ల
ప్రయోజనము
ఏమిటి?
భోజన
పదార్థములు
చాలా
పరిశుద్ధంగా,
పవిత్రంగా
ఉండాలి.
అలా
పవిత్రంగా
ఉంటున్నప్పుడు
పవిత్రమైన
మనస్సు
కూడా
వస్తుంది.
ఎట్టి
ఆహారమో
అట్టి
మనస్సుగా
మారుతుంది.
ఎట్టి
మనస్సో
అట్టి
పవిత్రత
వస్తుంది.
ఎట్టి
పవిత్రతో
అట్టి
దివ్యత్వాన్ని
పొందుతాము.
కనుక
మనము
దివ్యత్వము
కావాలనుకుంటే
పవిత్రతను
పెంచుకోవాలి.
పవిత్రత
కావాలనుకుంటే
పదార్థము
పరిశుద్ధముగా
ఉండాలి.
పరిశుద్ధమునుండి
పవిత్రత
ఏర్పడుతుంది.
పవిత్రతనుండి
ప్రాప్తిని
పొందుతాం.
కనుక
మనము
ప్రతిపదార్థము
పరిశుద్ధమైనదిగా
భుజించాలి.
11
▾
Meaning
Keep
నీవు
అందరినీ
ప్రేమించు;
అందరూ
నిన్ను
ప్రేమిస్తారు
విద్యార్థులారా!
మీరు
విద్యను
అభ్యసిస్తున్నారు.
గొప్ప
ఉత్తమ
క్లాసులోపల
మీరు
ఉత్తీర్ణులౌతున్నారు.
సంతోషమే!
కానీ,
మీరు
ఉత్తమమైన
మార్గములో
ప్రవేశించాలి.
“ఊరికే
ఏదో
చదివినాము,
డిగ్రీ
తీసుకున్నాము,
ప్రైజువచ్చింది”
అనుకుంటే
ప్రయోజనంకాదు.
మీ
కాన్షియన్సుకి
తృప్తిగా
ఉండేటట్లు
చూసుకోవాలి.
అప్పుడే
మీరు
చదువుతున్న
చదువుకు
ఎంతోవిలువ.
మనం
ప్రతివ్యక్తిని
గౌరవించాలి.
మీ
కందరికి
తెలుసు.
గతంలో
అమెరికా
ప్రెసిడెంటుగా
పనిచేసిన
అబ్రహాంలింకన్
గురించి.
లింకన్
చాలా
బీద
కుటుంబములో
పుట్టాడు.
ఆ
కుటుంబములో
తినటానికి
తిండి
కూడా
సరిగా
ఉండేదికాదు.
అతడు
చదువుకునే
రోజుల్లో
చిరిగిపోయిన,
మురికిగానున్న
దుస్తులు
ధరించి
స్కూలుకు
పోతుంటే
శ్రీమంతుల
పిల్లలు
అతనిని
గేలిచేసేవారు.
ఒకనాడు
ఆ
అవమానం
భరించలేక
స్కూలు
నుండి
తిరిగివచ్చి
తల్లి
ఒడిలోచేరి
ఏడ్చాడు
లింకన్.
“ఎందుకు
నాయనా!
ఏడుస్తున్నావు?”
అని
అడిగింది
తల్లి.
“అమ్మా!
నాకు
మంచి
వస్త్రాలులేవని,
నేను
మురికిగా
ఉన్నానని,
నేను
చాలా
బీదవాడినని
నన్ను
వాళ్ళంతా
అవమానపరుస్తున్నారు”
అన్నాడు.
“వారు
ఏమైనా
అనుకోనీ,
నీవు
అందరిని
గౌరవించు.
వారిని
నీవు
ద్వేషించవద్దు.
మన
పరిస్థితి
నీవు
తెలుసుకో.
ప్రతి
దినము
బట్టలు
శుభ్రంగా
ఉతికి
ఆరవేసి
ధరించు.
వారు
ఏమైనా
అనుకోనీ
మనస్థితిని
మనం
చూసుకోవాలి.
మనగౌరవాన్ని
మనం
పెంచుకోవాలి
నాయనా!
నేటినుండి
ఆత్మగౌరవముకోసం
పాటుపడు.
నీవు
కొంచెం
బీదరికమైన
వస్త్రాలు
ధరించినా
తప్పులేదు.
కానీ
అవి
శుభ్రమైనవిగా
ఉండాలి”
అని
తల్లి
చెప్పుతూ
పోయింది.
తల్లిచెప్పిన
మాటలను
హృదయంలోనికి
తీసుకున్నాడు
లింకన్.
ఆత్మగౌరవాన్ని
పెంచుకోవడానికి
కృషిచేశాడు.
ఆవిధంగా
నడుచుకుంటూ
చిన్నఉద్యోగంతో
జీవితం
ప్రారంభించాడు.
కట్టకడపటికి
అమెరికా
దేశానికి
ప్రెసిడెంటు
అయ్యాడు.
అంబలిగంజికి
కూడా
శక్తిలేనివాడు
ఇతరులను
గౌరవిస్తూ
మర్యాదచేస్తూరావటంచేత
ఇంత
గొప్పస్థితికి
వచ్చాడు.
కనుక,
మనం
అలంకారం
కోసమని,
డబ్బును
వృథాచేసేకోసమని
గొప్పహోదాగా
పోకూడదు.
యథార్థముగా
నేను
చెబుతున్నాను.
నాయొక్క
విషయమే.
పూర్వము
నేను
చిన్నవాడిగా
ఉండినప్పుడు
మూడవతరగతి,
నాల్గవతరగతి
చదివే
రోజుల్లో
ఒక
నిక్కరు,
ఒక
చొక్కాయే
ఉండేవి.
12
▾
Meaning
Keep
స్కూలునుంచి
వస్తూనే
టవలు
కట్టుకోవటము
నిక్కరు-
చొక్కా
ఉతుక్కోవటము,
చెంబులో
నిప్పులు
వేసి
వాటిని
చక్కగా
ఇస్త్రీ
చేయటం
ఇలా
ప్రతిదినం
చేసేవాడిని.
చాకలివానికి
ఇస్త్రీకి
వేస్తే
అణాయో
రెండు
అణాలో
అడుగుతాడు.
అలా
ఇవ్వటానికి
నాదగ్గర
డబ్బులు
ఉండేవి
కావు.
“నాచొక్కాను
నేనే
ఎందుకు
ఉతుక్కోకూడదు?
నేనే
ఎందుకు
ఇస్త్రీ
చేసుకోకూడదు?
అంతకంటె
నాకు
వేరేపని
ఏమున్నది”,
అని
ఆలోచించి,
ఆవిధంగా
చేసేవాడిని.
స్కూలునుండి
వస్తూనే
ఉతుక్కొనేది.
ఇంట్లో
అగ్ని
ఉంటుంది.
పొయ్యిలో
ఉన్న
అగ్ని
యింత
చెంబులోకి
తీసుకొని
ఇస్త్రీ
చేసుకునేవాడను.
ఎప్పుడైనా
పెద్ద
వెంకమరాజు
వచ్చి
“నీకు
ఏమి
కావాలి?
బట్టలు
కుట్టించాలా?”
అని
అడిగేవాడు.
నేను
మాట్లాడేది
లేదు.
“నా
కెందుకు,
నాకున్నాయి.
నాకు
బట్టలు
కుట్టించవద్దు”
అని
చెప్పేవాడిని.
డబ్బులు
వృథా
చేయకూడదు.
ఆ
రోజుల్లో
ఒక
అణా
ఇస్తే
రెండు
గజాలగుడ్డ.
ఒక
అణాలో
ఒక
చొక్కా,
ఒక
అణన్నరలో
నిక్కరు
వచ్చేవి.
అప్పటికికూడను
కొనేవాడిని
కాదు.
ఎప్పుడూ
నాపని
నేనే
చేసుకునేవాడిని.
ఈనాడు
కూడా
నాపని
నేనే
చేసుకుంటాను.
మీరు
అనుకుంటారు
“స్వామి
గదిలో
ఎంతమంది
పనిచేస్తుంటారో!,
ఎంతమంది
సేవకులున్నారో!”
అని.
ఎవరినీ
నేను
సేవచేయనివ్వను.
ఆవిధంగా
నేను
అందరిని
గౌరవిస్తూ
వస్తున్నాను.
అందువలన
ఈనాడు
ప్రపంచమే
నన్ను
గౌరవిస్తూ
ఉన్నది.
నిన్న
కూడా
చెప్పాను.
“నీవు
అందరిని
ప్రేమించు.
అందరూ
నిన్ను
ప్రేమిస్తారు”
అని.
జాతిమతకులభేదములు
లేకుండా
అందరినీ
ప్రేమిస్తే
అందరూ
నిన్ను
ప్రేమిస్తారు.
నీవు
ఎంత
త్యాగంచేస్తే
అంత
గొప్పతనం
నీకు
వచ్చేస్తుంది.
నీవు
ఎంత
కష్టపడి
ఇతరులకు
సేవచేస్తే
అంత
గొప్పతనము
నీకు
వస్తుంది.
ఈనాటి
పిల్లలు
ఇంటికి
ఎవరైనావచ్చి
“మీ
ఫాదర్
ఎక్కడ?”
అని
అడిగితే,
“ఫో!
నాకు
తెలియదు”
అంటారు.
ఈనాటి
పిల్లలకు
గౌరవముగానీ,
మర్యాదలుగానీ,
వినయముగానీ
ఏమీ
తెలియదు.
మీరందరూ
వినయంగా
మాట్లాడాలి,
గౌరవంగా
మాట్లాడాలి,
ప్రేమతో
మాట్లాడాలి.
అప్పుడే
మీకు
కీర్తి
వస్తుంది.
అప్పుడే
మిమ్మల్ని
అందరూ
ప్రేమిస్తారు.
13
▾
Meaning
Keep
ఉపనిషత్తులు
వినయ,
విధేయతలు
బోధించాయి
మంచితనము
కావాలంటే,
మంచి
కీర్తి
రావాలంటే
మంచి
ప్రవర్తనతో
నీవు
మెలగాలి.
నేను
ఈనాడు
ప్రపంచములో
అందరిచేత
గౌరవింపబడుతున్నానంటే
దానికి
కారణం
నేను
అందరిని
గౌరవించడమే
కదా!
ఆనాడే
కాదు,
ఇప్పుడైనా
నా
పద్ధతి
అంతే.
ఎవరైనా
వస్తే
“బంగారూ!
కూర్చో”,
అంటాను.
ఇంత
మంచి
మాటలు
మీరుకూడా
ఎందుకు
నేర్చుకోకూడదు?
నోరు
విప్పితే
కఠినమైన
పదములు
రావటం?
వద్దు.
వద్దు.
మృదుమధురమైన
సంభాషణం
నేర్చుకోండి.
అప్పుడు
మీరు
కూడా
గౌరవాన్ని
పొందుతారు.
నిరుపేదగా
పుట్టి
ఎన్ని
కష్టములో
అనుభవించిన
అబ్రహాం
లింకన్
తరువాత
ఎంతో
గొప్పవాడైపోయాడు.
అమెరికాకు
ప్రెసిడెంటు
అయ్యాడు.
చిన్నప్పుడు
బజార్లో
స్ట్రీటు
లైటుక్రింద
చదువుకున్నాడు.
ఇంతేకాదు.
బజార్లో
ఇతరుల
బూట్లు
పాలీష్‌చేసి
డబ్బు
సమకూర్చుకున్నాడు.
ఇక
అతని
తల్లి
పరిస్థితి
ఎలాంటిదో
తెలుసునా?
ఆడవారి
పాతవస్త్రాలు
కుట్టేది
తద్వారా
వచ్చిన
ధనముతో
పిల్లవానిని
సాకేది.
ఆ
తల్లీ
కొడుకులు
ఎంతో
వినయంగా,
విధేయతగా
తమ
గౌరవాన్ని,
ఆత్మవిశ్వాసాన్ని
పెంచుకొనేకోసం
పాటుపడేవారు.
ఈనాడు
గౌరవమే
లేదు.
ఇష్టము
వచ్చినట్లుగా
మాట్లాడటం.
అది
మనకు
మంచిది
కాదు.
ఉన్నదానితో
మనం
తృప్తిపడదాము.
లేనిదానికోసం
ఎందుకు
మనం
ప్రాకులాడాలి?
విద్యార్థులారా!
ఉపనిషత్తులన్నీ
వినయవిధేయతలను
నేర్పుతూ
వచ్చాయి.
మృదుమధురంగా
మాట్లాడమని
చెప్పాయి.
ఇతరులను
కష్టపెట్టని
మాటలు
ఉపయోగపెట్టమన్నాయి.
అలాంటిరీతిలో
జీవితాన్ని
గడిపితే
మీ
జీవితము
ఎంతో
గౌరవాన్ని
పొందుతుంది.
మీరు
మంచిపేరు
తెచ్చుకోండి.
గొప్పపేరు
తెచ్చుకోండి.
ఆ
గొప్పపేరు
కూడా
మంచివల్ల
రావాలి.
ఉపనిషత్తులలో
చెప్పబడిన
పవిత్రమైన
బోధలను
మీరు
ఆచరిస్తూ
జీవితాలను
సార్థకంచేసుకోండి.
Previous
←
The So'ham principle itself is the principle of the Trimūrti
Next
Satya itself is life
→