Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · Satya itself is life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Satya itself is life
14 October 2002, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 362
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
6 October 1992
Only one who knows himself can know God
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
26 February 1998
The power of saṅkalpas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
26 September 2000
Education and Educare
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
9 April 2005
Divinity is the very nature of man
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యంబునందణగె
సర్వసృష్టి
సత్యమహిమ
లేని
స్థలమేది
కనుగొన్న
శుద్ధసత్త్వమదియె
చూడరయ్య!
ప్రాణులను
సృష్టించి,
ఆహారమును
అందించి,
పెంచి
పోషించడమే
సత్యముయొక్క
అంతరార్థము
“సత్యం
బ్రూయాత్,
ప్రియం
బ్రూయాత్,
నబ్రూయాత్
సత్యమప్రియం”;
“సత్యంవద,
ధర్మంచర”
-
ఇవి
వేదముయొక్క
ప్రధాన
ప్రమాణ
వాక్యములు.
జగత్తులో
జన్మించిన
ప్రాణులన్నిటికీ
ఆహారము
మొట్టమొదట
అవసరము.
ఆహారమే
లేకుండిన
గతించిపోతుంది,
జీవి.
ఈ
ఆహారమునకు
మూలాధారము
సూర్యుడు.
సూర్యుని
ప్రకాశముచేతనే
వర్షము
కురుస్తుంది.
వర్షముచేతనే
పంటలు
పండుతాయి.
ఈ
పంటలే
మానవులకు
ఆహారముగా
రూపొందుతాయి.
ఉపనిషత్తులు
చెప్పినట్లుగా
ప్రతి
వాక్యమునందు
మూడు
ప్రధానమైన
పదములు
ప్రమాణములుగా
ఉంటున్నాయి.
అదేవిధముగా
“సత్యము”
అనే
పదములో
కూడా
మూడు
అక్షరములు
ఉన్నాయి.
ఇవి
ఆహారము,
ఆకలి,
తృప్తికి
ప్రతీకలుగా
ఉంటున్నాయి.
‘సత్’
అనగా
ప్రాణము;
‘యీ’
అనగా
అన్నము,
‘మ్’
అనగా
సూర్యుడు.
ఈ
సూర్యప్రకాశముచేత
ఆహారము
లభించి
దేహమునకు
తుష్టిని,
సంతుష్టిని
కలిగించి
జీవితానికి
హాయిని
చేకూరుస్తున్నది
-
సత్యము
అనగా
కేవలము
ఉన్నది
ఉన్నట్లు
చెప్పటం;
చూచినది
చూచినట్లు
పలకటం
మాత్రమేకాదు.
ఈ
మూడు
అక్షరములలో
మొట్టమొదటిది
‘సత్’;
అదే
ప్రాణం.
ఈ
ప్రాణములోనే
‘యీ’
అనే
ఆకలి
ఉన్నది.
ఈ
ఆకలిని
‘యమ్’
అనే
సూర్యుడు
తీరుస్తున్నాడు.
ఏతావాతా
సత్యమనగా
ప్రాణము;
ప్రాణమునందలి
ఆకలి;
ఆ
ఆకలిని
తీర్చే
సూర్యుడు
ఈ
మూడింటి
తత్త్వము
సత్యమునందే
ఇమిడి
ఉన్నది.
2
▾
Meaning
Keep
ఈ
సత్యమే
జగత్తునంతా
కాపాడుతూ
ఆకలితీరుస్తూ,
పుష్టినందిస్తూ,
ఆరోగ్యమును
చేకూరుస్తూ
ఉన్నది.
సత్యము
అనగా
ప్రాణులను
సృష్టించటము,
ప్రాణులకు
తగిన
ఆహారము
అందించటము,
ఈ
ఆహారముచేత
జీవితమును
పోషించుకోవటం,
ఇదియే
సత్యముయొక్క
అంతరార్థము.
యమనియమాదులతో
కూడిన
తపశ్శక్తియే
సత్యము
ఇంక
రెండవ
అర్థము
‘సత్య’
అనగా
‘స’,
‘త’,
‘య’
అనే
మూడు
అక్షరములతో
కూడినది.
ఈ
మూడు
అక్షరములను
వరుసగా
వెనుకవైపునుండి
చదివితే
యేమి
అర్థము
వస్తుందో
గుర్తించాలి.
‘య’
అనగా
యమనియమాదులచేత
మానవుడు
‘త’
తపస్సుచేసినప్పుడు
‘స’
కారమైన
సత్యము
సాక్షాత్కరిస్తుంది.
ఈ
సత్యమే
దైవము.
అట్టి
సత్యము
ఎక్కడుంది?
సర్వత్రా
ఉంది.
సత్యము
లేని
స్థానములేదు.
సత్యముకాని
వస్తువులేదు.
సర్వము
సత్యమునందే
ఇమిడి
ఉన్నది.
కనుక
సత్యము
త్రికాలాబాధ్యమైనది.
యమనియమాదులతో
కూడిన
తపశ్శక్తియే
సత్యము.
సత్యస్వరూపమైన
సాక్షాత్కారమే
ఈ
తపస్సు.
సత్యము
ఎక్కడున్నదనిన
“సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మ”.
సత్యమే
జ్ఞానము.
జ్ఞానమనగా
ఏమిటి?
“అద్వైత
దర్శనం
జ్ఞానం”.
రెండుకానిది,
ఒక్కటే
అయివున్నది.
అదియే
సత్యం.
ఇట్టి
సత్యము
జ్ఞానముచేత
లభిస్తుందని
అర్థము.
అనంతమైనది
జ్ఞానము
-
ఏదో
అంతో
ఇంతో
గ్రంథములద్వారా
మనం
చదువుకున్న
జ్ఞానము
జ్ఞానముకాదు.
అనంతమైన
తత్త్వమే
జ్ఞానము.
దీనికి
ఆదిలేదు.
అంత్యములేదు.
అటువంటి
అనంతమైన
జ్ఞానతత్త్వాన్ని
బోధించేదే
సత్యము.
కనుక,
సత్యము
అనగా
కేవలం
ప్రాకృతరూపములో
మనం
అనుభవించే,
పలికే
పలుకుల
అంతరార్థము
కాదు.
అనంతమైన
వేదములకు
పుట్టినిల్లు
సత్యము.
వేదములయొక్క
స్వరూపమే
ఈ
సత్యము.
‘సత్యము’
అనే
పదములో
ఎంతైనా
అంతరార్థము
ఉంటున్నది.
సత్యమును
వదిలితిమా,
జగత్తే
లేదు.
అనాదికాలమునుండి
అనేకమంది
మహర్షులు
తపస్సంపన్నులు,
త్యాగులు,
యోగులు
ఈ
సత్యాన్ని
ఆశ్రయించి
ఆనందంతో
జీవితాన్ని
గడుపుతూ
వచ్చారు.
సమస్త
సిరిసంపదలూ,
భోగభాగ్యములూ
ఈ
సత్యమునందే
ఇమిడి
ఉన్నవి.
కనుక,
సత్యమనగా
కేవలము
లౌకికమైన
అర్థములో
సంభాషించుకోవటం
కాదు.
3
▾
Meaning
Keep
భగవంతుడు
పానకములోని
చక్కెరవలె,
పాలలోని
వెన్నవలె
ఉంటున్నాడు.
ప్రాచీనకాలమునుండి
అనేకమంది
ఋషులు
సత్యాన్వేషణ
నిమిత్తమై
సర్వసంపదలను
పరిత్యజించి
అరణ్యమునకేగి
తపస్సునాచరించి
సత్యము
యొక్క
నిజస్వరూపాన్ని
గుర్తిస్తూ
వచ్చారు.
‘సత్’
అనగా
‘శాశ్వతమైనది’
అని
మరొక
అర్థము.
ఈ
‘సత్’
అనేది
మారేదికాదు.
అదియే
బ్రహ్మస్వరూపము.
ఇదే
fundamental
life.
అన్నింటికీ
ఆధారమైన
స్వరూపమే
ఈ
‘సత్’.
ఈ
‘సత్’
అనేదే
లేకపోతే
‘చిత్’
అనబడే
చైతన్యశక్తి
ఉండే
అవకాశంలేదు.
ఈ
‘సత్’
గొప్ప
powerful
శక్తి.
దీనినే
positive
అన్నారు.
‘చిత్’
అనేది
దీన్ని
ఆశ్రయించి,
దీని
ఆధారముచేత
కర్తవ్యకర్మలాచరించేది.
ఇది
negative.
సత్,
చిత్తో
చేరినప్పుడు
ఆనందము
ఏర్పడుతుంది.
‘సత్’
అనేది
భగవత్తత్త్వము,
మధురమైన
చక్కెర
వంటిది.
‘చిత్’
అనేది
మానవుని
దాహము
తీర్చే
జలమువంటిది.
ఈ
‘చిత్’
అనే
జలములో
‘సత్’
అనే
చక్కెర
చేర్చినామంటే
మధురమైన
పానకము
తయారవుతుంది.
‘సత్’,
‘చిత్’
ఈ
రెండూ
కలిసిన
పానకమును
సేవించినప్పుడు
ఆనందము
ఏర్పడుతుంది.
జలమును
పానకమని
చెప్పరు.
చక్కెరను
పానకమని
చెప్పరు.
చక్కెర,
జలము
రెండూ
చేరినప్పుడే
‘పానకము’
అంటారు.
కాబట్టి,
భగవంతుడు
ఏ
స్వరూపములో
నున్నాడు?
పానకములోని
చక్కెరవలె
ఉంటున్నాడు.
ఈ
చక్కెర
లేక
పానకము
ఉండటానికి
వీలులేదు.
చక్కెరను
వదలి
పానకము
ఉండటానికి
వీలులేదు.
కనుక
పాలలోని
వెన్నవలె,
వెన్నలోని
నేయివలె
ఇవన్నీ
అవినాభావ
సంబంధముతో
కూడినవి.
అనాదికాలమునుండి
ఋషులు
అనంతమైన
తపస్సులు
ఆచరించి
ఈ
‘సత్’,
‘చిత్’
అనే
పదార్థములను
గుర్తించి
ప్రపంచానికి
అందించడానికి
ప్రయత్నం
చేశారు.
అంతఃస్వరూపమును
గోచరింపజేసేదే
జ్ఞానచక్షువు
ఒకానొక
సమయములోపల
వేదసభలు
జరుగుచుండగా
అందులో
ఈ
విషయమును
చర్చించారు.
ఈ
విధముగా
‘సత్’,
‘చిత్’
ఆనందమును
వెదికే
నిమిత్తమై
అనేక
విధాల
కృషి
చేశారు.
ఎంత
తపస్సు
చేసినప్పటికి,
ఎంత
దీక్షపూనినప్పటికిని
ఈ
‘సత్’
స్వరూపము
గుర్తించటానికి
ఎవరికీ
వీలుకాలేదు.
ఇంతలో
‘సత్యస్వరూపు’
డనే
ఒక
మహర్షి
వచ్చి
“వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్”
అని
ప్రకటించాడు.
4
▾
Meaning
Keep
భగవత్తత్త్వము
ఇట్టిది
అట్టిది
అని
చెప్పటానికి
వీలుకాదు.
ఇది
అన్నింటియందు
పానకములోని
చక్కెరవలె
ఉంటున్నది.
అయితే
ఎట్లా
ఉంది?
‘తమస్సు’
అనగా
చీకటికి
ఆవల
సూర్యునికాంతివలె
ఉంటున్నది.
అందులో
సూర్యుని
తేజస్సుకూడా
ఉంటున్నది.
ఈవిధంగా
ఉంటున్నాడు
భగవంతుడు.
“సూర్యుని
కాంతితో
కూడినవాడు
భగవంతుడు”
-
“ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్”.
అయితే,
‘ఇది
ఎక్కడ
చూచారు
మీరు?’
అని
ఒక
ప్రశ్న.
పగలు
చూచారా?
లేక
రాత్రి
చూచారా?
ధ్యానములో
చూచారా?
జాగ్రత్తలో
చూచారా?
తురీయావస్థలో
చూచారా?
ఇన్ని
ప్రశ్నలు
ఉదయించాయి.
భగవంతునికి
అవస్థల
త్రయములు,
కాలత్రయములు,
స్థానత్రయములు
లేవు.
అప్పుడు
ఆ
సత్యస్వరూపుడు
“దీనికి
కాలభేదములు
లేవు.
వయః
భేదములు
లేవు.
ఏ
మాత్రము
స్వరూపాలు
రావు.
దీనికి
పగలు,
రాత్రి
అనే
వ్యత్యాసమే
కనిపించదు.
ఇలాంటి
పరిస్థితిలో
నేను
ఈ
సత్యాన్ని
చూచాను”
అని
జవాబు
చెప్పాడు.
“ఈ
సత్యమును
ఏవిధంగా
చూచారు?
ధ్యానావస్థలో
చూచారా?
జాగ్రదవస్థలో
చూచారా?”
అనే
ప్రశ్నకు
జవాబుగా
ఆ
మహర్షి
“ఋషులారా!
చర్మచక్షువులు
జాగ్రదవస్థకు
సంబంధించినవి.
చర్మచక్షువులతో
మనం
ఎన్నియో
చూస్తున్నాము.
ఈ
చర్మచక్షువులు
మానవులకే
కాదు,
పశుపక్షిమృగాదులకు
కూడా
ఉన్నాయి.
క్రిమికీటకాదులకు
కూడా
ఈ
చర్మచక్షువులు
ఉన్నాయి.
జగత్తులోపల
చర్మచక్షువులతో
చూస్తున్నారు.
చూడటం
గొప్పతనం
కాదు.
ఈ
చర్మచక్షువులు
కేవలం
భౌతికమైన
రూపాన్ని
మాత్రమే
చూడగలవు.
కానీ,
అందులోనున్న
అంతఃస్వరూపాన్ని
నిరూపింపచేసేదే
నిజమైన
చక్షువు.
అదియే
జ్ఞానచక్షువు.
ఈ
జ్ఞానచక్షువుతో
మీరు
ఎక్కడబడితే
అక్కడ,
ఎప్పుడు
పడితే
అప్పుడు
చూడవచ్చు.
దేశకాలపరిస్థితుల
ప్రభావమునకు
ఇది
చిక్కేదికాదు.
ఎప్పుడు
పడితే
అప్పుడు
“సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర”
చూడవచ్చు.
ఎప్పుడైనా
సరే,
ఒకతూరి
హృదయములోనున్న
తేజోమూర్తిని
చింతించండి.
మీకు
గోచరిస్తాడు”
అని
చెప్పాడు.
ఋషులు
ఆవిధంగా
చింతించిన
తక్షణమే
సత్యస్వరూపుడు
వారి
భ్రూమధ్యమున
బొటనవేలు
పెట్టాడు.
తక్షణమే
వారికి
తెలియకుండానే
వారినోటినుండి
“వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్య
వర్ణం
తమసః
పరస్తాత్”
అనే
మహావాక్యము
వెలువడింది.
ఆ
ఋషులు
కూడా
సత్యస్వరూపుడు
దర్శించినట్లుగానే
కోటిసూర్యకాంతి
తేజస్సుతో
వెలిగిపోతున్న
భగవంతుని,
తమస్సుకు
ఆవల
దర్శించగలిగారు.
ఆనందంతో
పొంగిపోయారు.
5
▾
Meaning
Keep
His poems 539
ఆధ్యాత్మిక
మనగా
కనుపించే
వస్తువులో
కనుపించని
తత్త్వమును
కనుక్కోవటం
భగవత్తత్త్వము
ఒక్క
ప్రదేశమునకే
పరిమితమైనది
కాదు.
సర్వత్రా
వ్యాపించినది.
ఒక
ప్రదేశములో
కనిపించేది
అణుమాత్రమైన
సత్యము.
ఇది
అణువుకాదు.
ఇది
అనంతమైన
సత్యము.
అందువలననే
“అణోరణీయాన్
మహతో
మహీయాన్”
అన్నారు.
“అణువునందున
చూడగ
అణువునగుచు
ఘనమునందు
చూడగ
ఘనమునగుచు
అణువు
ఘనములు
రెండును
కూడినట్టి
ఆనందమే
ఈ
సత్యం”
కనుక,
ఇది
ఆనందముతో
కూడిన
సత్యము.
ఆనందమునకు
రంగు
ఏమిటి?
ప్రకాశవంతమైన
తెలుపే
ఆనందము.
ఇది
చీకటితో
ఉండేది
కాదు.
ఇట్టి
ఆనందము
ఎక్కడనుంచి
వచ్చింది?
సత్యమునుండియే
వచ్చింది.
ఇంతా
జరిగిన
తరువాత
‘మీరు
ఎవరు?’
అని
ప్రశ్నించారు,
ఋషులు.
“తమసః
పరస్తాత్”
అన్నాడు.
“చీకటి
తరువాత
వచ్చిన
వాడిని
నేనే”
అని
జవాబు
చెప్పాడు.
ఈ
చీకటి
ఎక్కడినుండి
వచ్చింది?
ఇది
ప్రకాశమునుండి
ఆవిర్భవించింది.
ప్రకాశమునుండి
వచ్చిన
సత్యము
చీకటిలో
ఉంది.
అనగా
దివ్యత్వమైన
సత్యము
భౌతికమైన
చీకటిలో
సంచరిస్తూ
ఉంటున్నది.
కానీ,
దానికి
అన్నీ
కనిపిస్తున్నాయి.
అది
ఎవరికీ
కనిపించదు.
ఇదియే
ఈనాడు
మనం
తెలుసుకోవలసిన
సత్యము.
ఈనాడు
ఎంతమందో
విద్యావంతులు
జ్ఞానులు,
పండితులని,
ప్రజ్ఞాశాలురని,
సుజ్ఞానశాలురని
పేరుపొందుతూ
ఉన్నారు.
కానీ,
వీరు
తెలుసుకున్నది
ఏమిటి?
తెలుసుకున్నది
చూస్తే
ఏమీలేదు.
తన
తత్త్వమే
తాను
గుర్తించుటకు
వీలుకాదు.
కన్నులు
మూసుకొని
చింతిస్తే
తాను
ఎవరు
అనేది
తనకే
తెలియదు.
తన
స్వరూపాన్ని
తానే
చూడలేడు.
దానికి
కూడా
ఒక
అద్దము
ఉండినప్పుడే
తనస్వరూపాన్ని
తాను
చూడగలడు.
కాబట్టి,
ఇది
సాక్షాత్
స్వరూపముకాదు.
ఇది
ప్రతిబింబ
స్వరూపమే.
మీరందరు
చూచేది
ప్రతిబింబస్వరూపములే.
కాని,
సాక్షాత్
స్వరూపముకాదు.
కనుకనే
“ఆదిత్య
వర్ణం
తమసః
పరస్తాత్”
అని
చెప్పాడు.
“సూర్యప్రకాశముతో
కూడిన
తమస్సును
నేను”.
“తమస్సంటే
చీకటి.
చీకటితో
కూడిన
వెలుగును
నేను.
అనగా
చీకటి,
వెలుగులు
రెండింటియొక్క
ఏకత్వమే.
అదేవిధముగా
మంచి
చెడ్డల
ఏకత్వము.
ఈ
రెండూ
కలిసే
ఉంటాయి.
చెడ్డ
లేకపోతే
మంచికి
విలువలేదు.
6
▾
Meaning
Keep
మంచి
లేక
చెడ్డను
ఏమాత్రము
గుర్తించలేము.
కనుక
నా
స్వరూపాన్ని
మీరు
గుర్తించుటకు
సాధ్యము
కాదు”
అన్నాడు.
అయితే
ఋషులు
మాత్రము
గుర్తించి
తీరాలని
పట్టుపట్టారు.
అప్పుడు
సత్యస్వరూపుడు
“అయితే
చూడండి;
జగత్తంతా
నా
స్వరూపమే
వ్యాపించి
యున్నది”
అని
చూపించాడు.
“సహస్రశీర్షాః
పురుషః
సహస్రాక్ష
స్సహస్రపాత్”
ఇన్ని
తలలు,
ఇన్ని
స్వరూపములు,
ఇన్నివిధములైన
చైతన్యములు
ఉండిన
తత్త్వమును
మానవులు
ఏరీతిగా
గుర్తించగలరు?
ఒక్కొక్క
శరీరమునందు
ఈ
చైతన్యము
ఒక్కొక్కవిధంగా
కన్పిస్తున్నది.
కానీ
అన్నింటియందు
ఒకే
చైతన్యము
ఉంది.
ఇటువంటి
ఆధ్యాత్మిక
తత్త్వమును
తెలుసుకోవటం
చాలా
కష్టము.
ఆధ్యాత్మికమనగా
తనకు
తెలియని
సత్యస్వరూపాన్ని
తెలుసుకోవటం.
తనకు
కనిపించే
వస్తువులో
కనుపించని
ఆనందమును
కనుక్కోవటం.
త్రికాలములందు
మార్పుచెందనిదే
సత్యము
ఈనాడు
దీనిని
ఎవరు
దర్శించటానికి
ప్రయత్నిస్తున్నారు?
ధ్యానానికి
కూర్చుంటున్నారు.
ఏదో
కన్నులు
మూసుకుంటున్నారు.
ఏదో
ఒక
స్వరూపాన్ని
మనస్సులో
నిర్మించుకుంటున్నారు.
ఇవన్నీకూడ
ప్రతిబింబ
స్వరూపములే.
కానీ,
ప్రత్యక్షస్వరూపములు
కాదు.
ఈ
reflection
reaction
and
resound
ఎంతకాలము
ఉంటుంటాయి?
ఈ
resound
ఎక్కడినుండి
వస్తున్నది?
నేను
మాట్లాడుతున్నాను.
నేను
మాట్లాడే
శబ్దమంతా
మీరు
వింటున్నారు.
ఈ
శబ్దమునకు
మూలాధారమేమిటి?
నాయొక్క
నోరు
అంటున్నారు
మీరు.
కాదు
కాదు.
ఇది
నిశ్శబ్దమైనది
కాదు.
ఇంక
reaction
ఏమిటి?
నేను
చేతులు
తిప్పటం,
నోరు
కదిలించటం
ఇది
reaction
అవుతుందా?
reaction
కూడా
ఆ
resound
యొక్క
ప్రతిబింబమే.
resound
యొక్క
ప్రతిబింబము
reaction
గా
వచ్చి
reality
కప్పిపుచ్చుతున్నది.
దేహాభిమానాన్ని
మీరు
మరచిపోవాలి.
ఆత్మాభిమానమును
లక్ష్యమునందు
ఉంచుకోవాలి.
ఇదియే
నిజమైన
సత్యము.
కానీ
సత్యమంటే
ఈనాడు
ఏరీతిగా
ఉంటున్నది
తెలుసునా?
ఎవరిముందు
వారికి
తగినట్లుగా
మాట్లాడి
సత్యమంటారా?
కానేకాదు.
వానిదగ్గర
వాని
మాటలు,
వీని
దగ్గర
వీనిమాటలు,
తనలో
తనమాటలు
ఇది
సత్యము
కానేకాదు.
త్రికాలములందు
మార్పుచెందనిది
ఏదో
అదే
సత్యము.
Past,
Present,
and
Future
మూడింటియందు
మార్పు
చెందనిదే
సత్యము.
7
▾
Meaning
Keep
మార్పుచెందేది
సత్యమేకాదు.
ఒక
నిముషములో
ఒకటి
చెబుతున్నావు.
మరొక
నిముషములో
మరొకటి
చెబుతున్నావు.
అది
సత్యముకాదు.
సత్యము
ఎప్పటికీ
ఒక్కటే.
not
two
రెండుకానిది.
ఇది
ఏవిధంగా
ఒక్కటే
అవుతుంది?
ఎప్పుడు
చూచినా
ఒకే
దృష్టి
ఒకే
sound,
ఒకే
రూపము,
ఒకే
ఆనందముతో
కూడినది
నిజమైన
సత్యము.
ఇట్టి
సత్యమునే
ఉపనిషత్తులు
బోధిస్తున్నాయి.
ఈ
సత్యమునకు
వర్ణనే
లేదు,
రూపమే
లేదు.
త్రికాలాబాధ్యమైన
సత్యమునకు
ఆనందము
ఒక్కటే
ప్రమాణము.
ఆ
సత్యాన్ని
నీవు
స్మరిస్తూ
ఉండినప్పుడు
నీకు
తెలియకనే
నీ
వదనంలో
చిరునవ్వులు
చిందులు
తొక్కుతూ
ఉంటాయి.
ఆ
చిరునవ్వు
ఎక్కడినుండి
వస్తున్నది?
అది
నీనుండే
వస్తున్నది.
ఆ
ఆనందమునకు
కారణము
ఏమిటి?
నిశ్చలమైన,
నిర్మలమైన
మనస్సు.
Dual
mind
ఉండినప్పుడు
ఆనందము
రాదు.
ఈ
ఆనందము
దైవమునుండే
వస్తున్నది.
కాని,
నీనుంచి
వచ్చినట్లుగా
నీవు
భావిస్తున్నావు.
Happiness
is
union
with
God.
భగవంతునితో
కలసిపోయిన
ఆనందమే
ఆనందము.
అట్టి
దైవముతో
కూడిన
ఆనందము
ఎప్పుడూ
శాశ్వతముగానే
ఉంటుంది.
ప్రకృతిద్వారా
లభించిన
ఆనందము
ఒక
దినము
ఆనందము,
మరొక
దినము
దుఃఖముగాను
ఉంటుంది.
ఆవిధంగా
మార్పుచెందే
ఆనందమును
ఆనందమనే
చెప్పరు.
ఎప్పటికీ
మార్పుచెందని
సత్యము
ఒకటి
ఉన్నది.
ఒక
విషయము
మీరు
గుర్తించినారో,
లేదో?
నేను
ఎప్పుడూ
ఆనందముగా
ఉంటాను.
ఎప్పుడూ
నవ్వుతూనే
ఉంటాను.
మీరు
ఎప్పుడైనా
నాలో
castor
oil
face
చూశారా?
నాకు
ఎప్పుడూ
అలాంటి
face
రాదు.
ఎప్పుడూ
ఆనందముతోనే
ఉంటుంది.
ఈ
ఆనందము
ఎక్కడినుండి
వస్తున్నది?
అంతర్భావము
నుండి
ప్రతిబింబించేది
ఆనందము.
కొంతమంది
ఒక
నిముషములో
ఆనందముగా
ఉంది
అంటారు.
మరొక
నిముషములో
సీరియస్గా
కనిపిస్తారు.
అది
చూచినవారు
‘ఓహో!
ఇతనిలో
మార్పు
ఉందప్పా!’
అంటారు.
కనుక,
ఇతరులకు
ఈవిధంగా
మనలో
మార్పు
ఉందని
తెలియనిస్థితిలో
ఉండాలి
మనము.
ఇది
నిజమైన
సత్యము.
సత్యము
మార్పు
చెందనిది.
ఇది
దాచితే
దాగేది
కాదు.
నొక్కి
పెట్టితే
ఉండేది
కాదు.
పట్టితే
చిక్కేది
కాదు.
అదియే
నిజమైన
ఆనందము.
8
▾
Meaning
Keep
శ్రీకృష్ణుని
భక్త
సంరక్షణాదీక్ష
ప్రేమస్వరూపులారా!
నిజమైన
ఆనందము
ఉపనిషత్తులలోనే
ఉంటుంది.
‘షత్’
అనగా
ఉండటం.
ఎట్లా
ఉండటము?
కదలిక
లేనట్లుగా
ఉండాలి.
‘ఉప’
అనగా
సమీపములో
అని
అర్థము.
vibration
తో
అది
ఏ
మాత్రము
కదలదు.
అలాంటి
సత్యమే
నిజమైన
సత్యము.
ఎట్టి
reaction,
resound,
reflection
లేక
నిశ్చలమైన,
నిర్మలమైన,
నిజమైన
ఆనందమునందించేది.
అట్టి
ఆనందము
ఒక్క
ఉపనిషత్తుద్వారానే
మనకు
లభిస్తుంది.
ఒకానొక
సమయములో
పాండవులు
అరణ్యవాసము
చేస్తున్నప్పుడు
ధర్మరాజు,
ద్రౌపది
అరణ్యములో
నడచివెళుతున్నారు.
ఆ
సమీపములో
రోమఋషి
ఆశ్రమము
నిర్మించుకొని,
తపస్సు
చేసుకుంటున్నాడు.
ఆయన
రోమములన్నీ
ఆశ్రమమంతా
పరచుకొన్నాయి.
ఆయన
ఆశ్రమానికి
ఎదురుగా
ఒక
పెద్దవృక్షము
ఉంటున్నది.
ఆ
వృక్షములో
అమృత
ఫలము
ఒకటి
కాసింది.
ఆ
ఫలమునిమిత్తమై
ఆ
మహర్షి
అనేక
దినములు
తపస్సు
చేశాడు.
అదేమార్గములోపల
అరణ్యములో
సంచరిస్తున్న
ద్రౌపదియొక్క
దృష్టి
ఆ
ఫలముపై
పడింది.
తక్షణమే
ఆమె
ధర్మరాజుతో
“మీరు
ఆ
ఫలమును
కోస్తే
మనము
మూడు,
నాలుగుదినములు
భుజించవచ్చు,”
అని
చెప్పింది.
ధర్మజుడు
ఆమెను
సంతోషపెట్టేనిమిత్తమై
బాణముతో
కొట్టాడు
ఆ
ఫలమును.
అది
క్రింద
పడింది.
దానిని
తీసుకోవడానికి
ప్రయత్నము
చేస్తున్నాడు
ధర్మజుడు.
సాధ్యము
కాలేదు.
ఇంతలో
ద్రౌపది
అక్కడికి
వచ్చింది.
ఆమె
మహాశక్తిస్వరూపిణి.
ఆమెకు
కూడ
చేత
కాలేదు.
ఇంతలో
ఫలములు,
కందమూలాదులు
తెచ్చేనిమిత్తమై
బయటకుపోయిన
అర్జునుడు,
నకులుడు,
సహదేవుడు
వచ్చారు.
వారుకూడా
ఎంతో
ప్రయత్నము
చేశారు.
కానీ
ఆ
ఫలము
కదలలేదు.
దానిని
చూచి
భీముడు
వచ్చాడు.
ఆ
ఫలము
కంటికి
కనిపించింది.
కంటికి
కనిపించేటప్పటికి
“దానిని
ఎత్తటానికి
ఇంతమంది
కావలెనా?
అన్నా!
ఇటు
రండి,
నేను
ఎత్తుతాను”
అన్నాడు.
వెళ్ళి
ఎడమచేతితో
ఆ
ఫలమును
ఎత్తడానికి
ప్రయత్నము
చేశాడు.
అది
కదలలేదు.
తర్వాత
రెండు
చేతులతో
ఎత్తడానికి
ప్రయత్నించాడు.
ఈవిధంగా
పాండవులందరూ
రోమఋషి
ఆశ్రమప్రాంతములో
తిరుగాడడంవలన
వారి
పాదములు
ఆ
రోమములపైపడి
అవి
పైకి
లేస్తూ
వచ్చాయి.
దీనివలన
రోమఋషికి
కోపం
వచ్చే
అవకాశం
ఉంది.
ఆ
కారణంచేత
ఆయన
పాండవులను
శపించవచ్చు.
ఆ
సమయములో
ద్రౌపది
కృష్ణుని
“కృష్ణా!
అనాథ
రక్షకా!
9
▾
Meaning
Keep
ఇన్ని
సమయములలోపల
మమ్మల్ని
రక్షిస్తూ
వచ్చావు.
ఈనాడు
కూడా
నీవేతప్ప
మాకు
అన్యము
లేదు.
నీవే
తప్ప
ఇతఃపరంబెరుగ
మన్నింపన్
దగున్
మమ్ము
దీనులన్”
అని
ప్రార్థించింది.
నవ్వుకుంటూ
వచ్చాడు
కృష్ణుడు.
పరిస్థితిని
గమనించాడు.
“ఎక్కువ
సమయము
మీరు
ఇక్కడ
ఉండుటకు
వీలులేదు.
ఒక
యుక్తి
నేను
చెపుతున్నాను.
సత్యానికి
తగిన
మార్గము
ఇది.
దీనిని
మీరు
అనుసరిస్తూ
రండి”
అని
చెప్పాడు.
దానికి
పాండవులు
“స్వామీ!
మీ
ఆజ్ఞ
మేము
ఏనాడూ
అనుసరించకుండా
ఉండలేదు.
ఎప్పుడూ
అనుసరిస్తూనే
ఉన్నాము.
మీరు
ఏమి
చెప్పినా
చేస్తున్నాము.
ఇప్పుడుకూడా
మీరు
చెప్పినపని
తు.చ.
ఆచరిస్తాము”
అని
చెప్పారు.
అప్పుడు
కృష్ణుడు
“ధర్మజా!
మీరందరూ
ఇక్కడే
ఉండండి.
నేను
రోమఋషి
ఆశ్రమానికి
వెడతాను.
ఐదు
నిముషములు
అయిన
తర్వాత
మీరుకూడా
ఆశ్రమానికి
రండి,
వచ్చి
నేను
ఏవిధంగా
ప్రవర్తిస్తానో
మీరూ
అదేవిధంగా
ప్రవర్తించాలి.
ఎట్లా
చేస్తానో
అట్లా
చేయాలి”
అన్నాడు.
కృష్ణుడు
ఆశ్రమానికి
వెళ్ళేటప్పటికి
అక్కడ
రోమఋషి
వీరిని
శపించుటకు
సిద్ధంగా
ఉన్నాడు.
కృష్ణుడు
సరిగ్గా
అదేసమయములో
లోపలకు
వెళ్ళాడు
ఆశ్రమం
లోకి.
“స్వామీ!
మీరు
మా
ఆశ్రమానికి
వచ్చారా!
మా
అదృష్టము
పండింది.
ఆశ్రమము
పవిత్రమైంది”
అని
ఏమేమో
చెప్పుకుంటున్నాడు
రోమఋషి.
కొంచెం
దూరంలోపల
ధర్మజుడు,
భీముడు,
అర్జునుడు
వీరందరూ
వస్తున్నారు.
రోమఋషితో
మాట్లాడుతున్నప్పటికీ
కృష్ణుని
దృష్టి
వారిపై
ఉంది.
ఇదియే
భగవంతుని
యొక్క
దృష్టి.
భగవంతుడు
ఏకార్యము
నెరవేరుస్తున్నా,
ఆయన
దృష్టి
దేనిపైన
పోవాలో
దానిపైన
పోతుంది.
ఇంతలో
ఆశ్రమం
లోనికి
పాండవులు
వచ్చి
నిల్చుకున్నారు.
వెంటనే
కృష్ణుడు
వరుసగా
ధర్మరాజుకి,
భీమునికి,
అర్జునునికి,
నకులునికి,
సహదేవునికి,
ద్రౌపదికి
నమస్కారం
చేశాడు.
కృష్ణుడు
ముందుగానే
“ఎంతమాత్రము
నోరు
ఎత్తకూడదు.
నేను
చెప్పినట్లు
మీరు
చేయవలసిందే”
అని
చెప్పాడు
కదా!
దానితో
తమ
పాదములపైపడిన
కృష్ణుని
అందరూ
ఆశీర్వదించినట్లుగా
చేతులు
పెట్టారు.
ఆ
దృశ్యమును
చూచాడు
రోమఋషి.
“ఏమిటి?
ఈ
కృష్ణుడు!
సాక్షాత్
శ్రీమన్నారాయణుడే
వీరి
పాదాలకు
నమస్కారము
చేస్తున్నాడే!
అంతటివాడు
నమస్కరిస్తున్న
వీరి
భక్తిప్రపత్తులు
ఎలాంటివో!”
అని
ఆశ్చర్యపోయాడు.
కృష్ణుడు
ఎప్పుడైతే
పాండవులకు
నమస్కారము
చేశాడో
వెంటనే
రోమఋషి
కూడా
వచ్చి
నమస్కారము
చేశాడు.
వారిపాదములపై
పడేటప్పటికి
ఆ
మహర్షి
కోపమంతా
చల్లారిపోయింది.
రోమఋషి
కోపాగ్నికి
బలి
కాకుండా
కాపాడేనిమిత్తమై
కృష్ణుడు
ఇన్ని
విధములైన
నాటకములు
ఆడుతూ
వచ్చాడు.
10
▾
Meaning
Keep
మహర్షి
పాండవుల
పాదములకు
నమస్కరించి
లేచిన
తరువాత
కృష్ణుడు
“వీరు
మహారాజులు,
చక్రవర్తులు.
పాండురాజు
కుమారులు.
ప్రస్తుతము
అరణ్యవాసముచేస్తూ
ఈ
ఫలము
నిమిత్తమై
ప్రాకులాడుతున్నారు”
అని
పాండవులకు
మహర్షిని
పరిచయం
చేశాడు.
అప్పుడు
రోమఋషి
“నా
ఆశ
అల్పమైనది.
మహాచక్రవర్తులు
ఆశించే
ఫలమును
నేను
కోరుతున్నాను.
ఇది
తగదు.
నాతో
రండి”
అని
చెప్పి
మంత్రమును
జపిస్తూ
ఆ
అమృతఫలమును
ఆయన
చేత
తాకినాడు.
వెంటనే
ఆ
ఫలము
పైకిలేచి
ఆయన
చేతిలో
వచ్చి
పడింది.
అప్పుడు
దానిని
మహర్షి
పాండవులకు
అర్పితము
చేశాడు.
“ఈ
అమృతఫలము
భుజించినవారికి
జననమరణాలు
లేవు.
అలాంటి
మహిమాన్వితమైన
ఫలము
ఇది”,
అని
ఆ
ఫలముయొక్క
విశిష్టతను
పాండవులకు
వివరించాడు.
ద్రౌపది
ఆ
ఫలమును
తీసుకొని
అందులో
ఒక
ముక్క
కోసి
కృష్ణునికి
ఇచ్చింది.
కృష్ణుడు
“అయ్యో!
నేను
ఫలము
తినను
అని
మీకు
తెలియదా?
ఎట్టిఫలమును
నేను
ముట్టను.
ఈ
ఫలము
మీకోసము
వచ్చింది,
మీరే
భుజించాలి”
అని
చెప్పాడు.
అప్పుడు
ద్రౌపది
ఆ
ముక్కను
కృష్ణుని
చేతికిస్తూ
“మీరు
దీనిని
తాకి
పవిత్రము
చెయ్యండి,
తరువాత
మేము
దాన్ని
ప్రసాదంగా
తీసుకుంటాము”
అని
ప్రార్థించింది.
ద్రౌపది
ప్రార్థనను
మన్నించి
కృష్ణుడు
ఆ
ఫలమును
తాకిన
తర్వాత
పాండవులందరూ
దానిని
శ్రీకృష్ణుని
ప్రసాదముగా
స్వీకరించి
భుజించారు.
చూశారా!
స్త్రీలలో
అట్టి
పరమభక్తి
ఆవిర్భవించి
ఉంది.
ప్రాచీనకాలమునుండి
స్త్రీల
ప్రవృత్తివల్లనే
పురుషులు
మహావీరులై,
గంభీరులై
పరమభక్తులుగా
మారుతూ
వచ్చారు.
ప్రతి
చక్రవర్తి
పరమపవిత్రమైన
మార్గములో
ప్రవేశించాడంటే
స్త్రీయే
దీనికి
ఆధారము.
తన
భక్తులైన
పాండవులు,
ద్రౌపది
ఆ
అమృతఫలమును
ఎంతో
భక్తితో,
ప్రీతితో
ఆరగిస్తుంటే
కృష్ణుడు
పరమానందము
ననుభవిస్తూ
కూర్చున్నాడు.
ఆ
ఆనందమును
చూస్తుంటే
రోమఋషికి
కంటిధారలు
కారుతున్నాయి.
ఆ
దృశ్యమును
చూచిన
కృష్ణుడు
“నాయనా!
నీవు
కార్చేది
కన్నీటిధారలు
కావు.
ఆనందబాష్పములు.
ఇదిగో;
నీ
జన్మసార్థకమైపోయింది”
అని
రోమఋషి
శిరస్సుపై
తన
దివ్యహస్తము
ఉంచి
ఆశీర్వదించాడు.
రోమఋషి
ప్రాణము
కృష్ణునిలో
చేరిపోయింది.
అప్పుడు
దీనిని
చూచి
పాండవులంతా
ఇట్టి
భాగ్యము
తమకు
కూడా
లభించాలని
కోరుతూ
వచ్చారు.
వారంతా
కలసి
“స్వామీ!
మాకు
కావలసింది
ఏముంది?
అనుభవించవలసినవన్నీ
అనుభవించాము.
11
▾
Meaning
Keep
జన్మసార్థకమయ్యేటట్లు
అనుగ్రహించండి”
అని
ప్రార్థించారు.
అప్పుడు
కృష్ణుడు
మళ్ళీ
“కాదు,
కాదు.
ఇంకా
జరుగవలసినవి
ఎన్నో
ఉన్నాయి.
ఒక
నాటకములోపల
ఒకవ్యక్తి
ఒక
వేషం
వేశాడు.
అతడు
నటించవలసిన
అంకములు
ఎన్నో
ఉంటాయి.
ఒక్క
అంకములో
నటించివచ్చి
నా
వేషము
అయిపోయిందంటే
కుదరదు.
నీ
కథ
పూర్తీ
అయ్యేంతవరకు
ఉండవలసిందే”
అని
చెప్పాడు.
“మీరు
ఇంకా
చేయవలసినవి
ఎన్నో
ఉన్నాయి.
జగత్తుకు
చాటవలసిన
సత్యాలు
ఎన్నో
ఉన్నాయి.
ఇవన్నీ
పూర్తి
కాకుండా
మరణిస్తే
మీ
జీవితములకు
ప్రయోజనము
ఏమిటి?
ప్రతి
మానవుడు
ఒక
సత్యాన్ని
సాధించే
నిమిత్తమై
జన్మమెత్తుతున్నాడు.
ఈ
జన్మము
ఎత్తినందుకు
దానిని
సాధించే
తీరాలి.
‘మనం
పుట్టాము,
పెరిగాము,
పోయాము’
అనుకుంటే
ప్రయోజనము
లేదు.
సాధించ
వలసింది
సాధించిన
తరువాతనే
పోవాలి.
కాబట్టి
మీరు
ఇంకా
కొంతకాలం
ఈ
భూమిమీద
ఉండవలసిన
అవసరము
ఉన్నది”
అని
చెప్పి
కృష్ణుడు
అంతర్థాన
మయ్యాడు.
అప్పుడు
ధర్మరాజు
కృష్ణునియొక్క
తత్త్వమును
గుర్తించుకొని,
“కృష్ణుని
ఆజ్ఞను
మనము
తు.చ.
తప్పకుండా
నడచుకోవలసి
యున్నది”
అని
భీమార్జున,
నకుల
సహదేవులకు,
ద్రౌపదికి
బోధించాడు.
వారందరూ
“స్వామీ!
మీరు
ఏవిధంగా
నడిస్తే
దానినే
అనుసరించటానికి
మేము
సంసిద్ధముగా
ఉన్నాము”
అని
ధర్మజుని
ఎదుట
ప్రమాణము
చేశారు.
లీలామానుష
వేషధారియైన
శ్రీకృష్ణుని
ఒక
లీలను
ఈ
సందర్భములో
చెప్పాలి.
కృష్ణుడు
కంసుని
వధించిన
తర్వాత
శిశుపాలుడు,
జరాసంధుడు
మొదలగు
చాలామంది
దుష్టరాజులు
ఆయనపై
ద్వేషముపూని
ప్రతీకారము
తీర్చుకోవాలి
అనుకున్నారు.
కృష్ణుని
భక్తులైన
యాదవులను
ఎన్నో
హింసలకు
గురిచేశారు.
అప్పుడు
యాదవులు
“స్వామీ!
క్షణక్షణము
భయభ్రాంతులతో
జీవితము
గడుపుతున్నాము.
మమ్ములను
భయము
లేని
స్థానానికి
చేర్చండి”
అని
కృష్ణుని
ప్రార్థించారు.
అప్పుడు
కృష్ణుడు
వ్రేపల్లెకు
పోతూ
“మీరందరూ
ఒక్కతూరి
కన్నులు
మూసుకొని
నన్ను
స్మరించండి”
అని
చెప్పాడు.
ఆ
రాత్రి
వారు
కన్నులు
మూసుకున్నారు.
తెల్లవారి
లేచేటప్పటికి
తమ
కుటుంబాలు,
తమ
సామానులతోసహా
వారు
ద్వారకలో
ఉన్నారు.
కేవలం
కృష్ణుని
దివ్య
సంకల్పముచేత
ఈ
అద్భుతము
జరిగింది.
కృష్ణుని
దివ్యతత్త్వము
ఎవరూ
వర్ణించలేనిది.
ఆయన
ఇటువంటి
మహాద్భుతమైన
దివ్యలీలలు
ఎన్నో
చూపాడు.
12
▾
Meaning
Keep
ధర్మమును
వదలిపెట్టడానికి
యమధర్మరాజుకూడా
ఇష్టపడడు
మహాభారతయుద్ధము
తర్వాత
అర్జునుడు
శ్రీకృష్ణుని
దర్శనం
చేసుకోవడానికి
ద్వారకకు
వెళ్ళి
చాలారోజులవరకు
తిరిగి
రాలేదు.
“అతడు
ద్వారకనుండి
రాలేదే!”
అని
కుంతీదేవి
చాలా
బాధపడుతున్నది.
ఎట్టకేలకు
అతడు
తిరిగి
వస్తున్నాడనే
వార్త
తెలిసింది.
అర్జునుడు
తిరిగి
వచ్చి
శ్రీకృష్ణుడు
దేహమునువీడి
తన
దివ్యధామమునకు
వెళ్ళిపోయాడనే
విషాదవార్తను
తెలియజేశాడు.
ఆవార్తను
విన్న
తక్షణమే
కుంతీదేవి
ప్రాణాలు
విడిచింది.
కృష్ణుని
విడిచి
ఉండలేక
ఆయనను
వెతుక్కొని
రావటానికి
పోయినట్లుగా
పోయింది.
ధర్మజుని
తొడపైన
తలపెట్టి
ప్రాణం
విడిచింది.
ధర్మజుడు
లేవటానికి
వీలులేదు.
భీముని
పిలిచి
“మనమందరం
అరణ్యమునకు
పోయేటందుకు
కావలసిన
సామగ్రి
సిద్ధము
చేయ”మన్నాడు.
అర్జునుని
పిలిచి
పరీక్షిత్తుయొక్క
పట్టాభిషేకమునకు
అవసరమైన
ఏర్పాట్లు
చేయమని
చెప్పాడు.
నకుల,
సహదేవులను
పిలిచి
కుంతీదేవికి
అంత్యక్రియలు
చేయుటకు
ఏర్పాటు
చేయమని
చెప్పాడు.
ఈవిధంగా
ఒకవైపున
కుంతీదేవికి
శ్రాద్ధకర్మలు
జరుగుతూనే,
మరొకవైపున
పాండవులు
అరణ్య
ప్రయాణానికీ,
వేరొకప్రక్క
పరీక్షిత్తుయొక్క
పట్టాభిషేకమునకు
ఏర్పాట్లు
జరిగిపోయాయి.
ఈవిధంగా
ఎక్కడా
జరుగలేదు.
ఒకేసమయంలో
ఒకవైపు
అంత్యక్రియలు,
మరొకచోట
పట్టాభిషేకము;
మూడవది
సర్వసంగపరిత్యాగులై
అరణ్యానికి
పయనం
కావడం,
అన్నీ
ఒకే
దినము
ఒకే
క్షణములో
జరుగుతూ
వచ్చాయి.
ఆ
మహాప్రస్థానములో
ధర్మజుడు
ముందు
నడుస్తున్నాడు.
ద్రౌపది,
భీమార్జున
నకులసహదేవులు
ధర్మరాజు
వెనుక
నడుస్తున్నారు.
అందరు
ఒకరి
వెనుక
ఒకరు
నడుచుకుంటూ
పోతున్నారు.
ఒకరితో
ఒకరు
మాట్లాడుకోవటం
లేదు,
ఒకరినొకరు
చూడటంలేదు.
కొంతదూరం
పోతూనే
నకులుడు
పడిపోయాడు.
తరువాత
సహదేవుడు
పడిపోయాడు.
తరువాత
భీముడు
పడిపోయాడు.
అర్జునుడు
పడిపోయాడు.
ద్రౌపదికూడా
పడిపోయింది.
చివరకు
ధర్మరాజు
ఒక్కడే
ప్రయాణము
సాగిస్తున్నాడు.
అతను
సత్యవాక్కులో
బ్రతికినవాడు.
సత్యధీరుడు.
అట్టి
సత్యాన్ని
వరించిన
యమధర్మరాజు
అతని
ముందు
సాక్షాత్కరించి
“అయ్యా!
నీవు
ధర్మజుడవు;
నేను
యమధర్మరాజును”
అని
చెప్పి
ఒక
కుక్కరూపము
ధరించి,
ధర్మరాజునే
అనుసరించాడు.
ధర్మాన్ని
వదలిపెట్టడానికి
యమధర్మరాజుకు
కూడా
ఇష్టము
లేదు
“ధర్మమే
మా
ప్రాణము.
13
▾
Meaning
Keep
అట్టి
ధర్మమును
వదలి
మేము
ఎట్లా
ఉండగలము?”
అనుకొని
యముడుకూడా
ధర్మజునివెంట
ప్రయాణమైపోతున్నాడు.
అలా
కొంతదూరము
పోయి
వారిద్దరూ
యమలోకము
చేరారు.
అక్కడ
పాపాలు
చేసినవారంతా
భయంకరమైన
బాధలు
అనుభవిస్తున్నారు.
ఆ
దృశ్యములు
చూచిన
ధర్మరాజుకు
ఎంతో
దుఃఖము
కలిగింది.
ప్రతి
ఒక్కటి
కర్మానుసారము
జరిగే
తీరుతుంది.
ధర్మజుడు
తన
జీవితములో
ఎన్నడూ
అబద్ధము
చెప్పలేదు.
కానీ,
మహాభారత
యుద్ధములో
ఒక్కసారి
మాత్రం
“అశ్వత్థామ
హతః
కుంజరః”
అని
ఒక
చిన్న
అబద్ధము
చెప్పాడు.
అదికూడ
అబద్ధము
కాదు.
ఎవరికీ
వినిపించకుండా
మెల్లగా
“కుంజరః”
అన్నాడు.
అలా
చెప్పడంలో
అతని
ఉద్దేశ్యము
“అశ్వత్థామ”
అనే
పేరుగల
ఏనుగు
చచ్చిపోయింది
అని
చెప్పడం.
కాని,
“అశ్వత్థామ
హతః”
అన్నమాట
విన్న
ద్రోణాచార్యుడు
తన
కుమారుడు
చనిపోయాడనుకొని
తానుకూడా
ప్రాణత్యాగం
చేశాడు.
ఈవిధంగా
ధర్మరాజు
ఆడిన
ఈ
చిన్న
అబద్ధమునకు
ఈ
యమలోకములో
కొంతసేపు
ఉండవలసి
వచ్చింది.
ధర్మరాజు
యమలోకములో
ప్రవేశించగానే,
అక్కడ
బాధలు
పడుతుండేవారంతా
అతనిని
చూచి
‘ఆనందం,
ఆనందం’
అన్నారు.
“స్వామీ!
మీ
యొక్క
దర్శనంచేత
మీయొక్క
స్పర్శనంచేత
మీ
ప్రవేశముచేత
మా
బాధలంతా
తీరిపోయాయి”
అని
చెప్పారు.
ఇంతలో
యమధర్మరాజు
అక్కడికి
వచ్చి
ధర్మజుని
గుణగణాలను
కొనియాడుతూ
“యమనియమాదులతో
కూడిన
సత్యమే
నీయొక్క
స్వరూపము.
ఆ
సత్యమే
ధర్మరూపము”
అని
చెప్పి
అతన్ని
స్వర్గానికి
పంపించాడు.
సత్యాన్నాస్తి
పరోధర్మః
సత్య,
ధర్మములయొక్క
స్వరూపములు
ఇంతగొప్పవి,
ఇంతఘనమైనవని
ఎవరికీ
తెలియదు.
సత్యముచేతనే
సర్వమును
సాధిస్తూ
వచ్చారు.
కనుక,
ఇట్టి
సత్యాన్ని
తీసుకున్నప్పుడు,
సత్యాన్ని
మనము
అనుసరించినప్పుడు
ఎలాంటి
పరిస్థితులలోను
మనకు
బాధలే
కలుగవు.
విద్యార్థులారా!
మీకు
అనేక
విధములైన
సమస్యలందు
అసత్యములాడ
వలసివస్తుంది.
కాని,
అసత్యము
ఏమాత్రము
చెప్పవద్దండి.
ప్రాణంపోయే
పరిస్థితి
వచ్చినప్పటికీ
సత్యాన్నే
చెప్పాలి.
“సత్యాన్నాస్తి
పరోధర్మః”
అన్నారు.
సత్యాన్ని
మించిన
ధర్మములేదు.
మీ
జీవితమంతా
సత్యమార్గములోనే
ప్రవేశపెట్టండి.
భారతదేశముయొక్క
ఔన్నత్యమును
సత్యవ్రతముతో
పునరుద్ధరించండి.
14
▾
Meaning
Keep
ఈ
అన్యాయ,
అక్రమ,
అసత్య,
అనాచారములంతా
కూడా
దూరము
చేయండి.
సత్యమార్గములోపల
ప్రవేశించి
ఆనందంగా
జీవితాన్ని
గడపండి.
సత్యముచేత
ఎన్నియో
మనము
సాధించవచ్చును.
సత్యమే
మీప్రాణంగా
జీవించండి.
ఇదియే
మీరు
నేర్చుకోవలసిన
చదువు.
Previous
←
All are embodiments of God
Next
Know for Certain: I Am Sai
→