Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · The Veda, the Wealth of All Knowledge
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Veda, the Wealth of All Knowledge
19 October 2004
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఎవరైనా
గబ్బిలమును
తీసుకువెళ్ళి
కాళ్ళు
క్రిందకి,
తల
పైకి
పెట్టి
చెట్లకొమ్మలకి
తలక్రిందులుగా
వ్రేలాడేటట్లు
చేశారా?
లేదు,
లేదు.
అది
దాని
స్వభావము.
కర్మమునకు
కాళ్ళు
లేవు,
కర్మమునకు
నేత్రములు
లేవు,
కర్మమునకు
నోరు
లేదు.
అట్టిదే
మానవుడు
అనుభవించే
కర్మ.
దీనిని
బట్టి
‘ఎవరి
కర్మ
వారిది’
అని
ప్రాచీనులు
చెబుతూ
వచ్చారు.
ఈ
కర్మ
పొమ్మంటే
పోయేది
కాదు,
రమ్మంటే
వచ్చేది
కాదు.
తన
యిష్టానుసారము
వెళుతుంది.
వారి
వారి
సంకల్పములను
పురస్కరించుకొని
ఈ
కర్మ
రకరకములైన
ఆటలు
ఆడుతుంది.
లోకము
చాలా
చిత్రవిచిత్రములతో
కూడినటువంటిది.
లోకము
పాంచభౌతికము.
ఇది
ఒకరు
పెట్టితే
నిలిచేది
కాదు.
అదే
విధముగా,
మానవదేహముకూడా
పాంచభౌతికమైనది.
పాంచ
భౌతికమైన
ఈ
దేహము
‘కూలక
తప్పదెప్పుడున్.’
కాని,
దేహి
నిరామయుండు.
దేహికి
చలనము
లేదు.
దైవాజ్ఞను
శిరసావహించడమే
మానవుని
కర్తవ్యము
ప్రేమస్వరూపులారా!
దైవముయొక్క
లీలలు
చిత్రవిచిత్రములుగా
ఉంటుంటాయి.
లేనిది
కనిపిస్తుంది.
కనిపించేది
లేకుండా
పోతుంది.
ఇట్టి
చిత్రవిచిత్రములతో
కూడిన
లోకమును
ఎవరు
నమ్మగలరు!
ఈ
పాంచభౌతికమైన
దేహమును
ఎవరు
నిలుపగలరు!
అది
నిలిచినంత
కాలము
నిలుస్తుంది.
తక్షణమే
వెళ్ళిపోతుంది.
ఇది
మానవుని
ఆజ్ఞను
పురస్కరించుకొని
నడవదు.
ఇది
వచ్చే
సమయంలో
దాని
విధివ్రాత
పుట్టినది.
జగత్తుయొక్క
సృష్టిని
మానవుడు
నిర్ణయించుటకు
వీలుకాదు.
ఒక్కొక్కరికి
ఒక్కొక్కవిధమైన
అనుభూతులు
కలుగుతుంటాయి.
గబ్బిలాలు
తల
క్రిందికి
పెట్టి
కాళ్ళు
పైకి
వేసి
నిల్చుకుంటాయి.
ఎందువలన?
దీనికి
కారణమేమీ
లేదు.
ఇట్టి
సృష్టియొక్క
చిత్ర
విచిత్రమునకు
ఎవరు
సాక్షి?
ఎప్పుడెప్పుడు
ఏఏ
కర్మలు
ఏఏ
ప్రదేశములందు
ఎవరెవరు
ఏఏ
విధంగా
చేయాలో
ఆవిధంగా
జరుగక
తప్పదు.
ఇది
మానవుడు
తాను
నిర్మించుకొన్నది
కాదు.
అన్నియు
దైవాజ్ఞను
పురస్కరించుకొనియే
జరుగుతుంటాయి.
2
▾
Meaning
Keep
దైవము
యొక్క
ఆజ్ఞను
శిరసావహించడమే
మానవునియొక్క
కర్తవ్యము.
బహిర్ముఖముగానో,
అంతర్ముఖముగానో
భగవంతునియొక్క
సంకల్ప
ప్రభావముచేత
అన్నీ
జరుగుతుంటాయి.
కనుక,
దైవాజ్ఞకు
ఎవరు
ఏవిధముగా
వ్యాఖ్యానము
చెప్పినప్పటికీ
మనము
దానిని
నమ్ముటకు
వీలులేదు.
దైవాజ్ఞను
శిరసావహించి
నడవవలసినదే
తప్ప
మధ్యలో
కామాలు,
ఫుల్స్టాపులు
పెట్టడానికి
వీలులేదు.
ఇట్టి
చిత్రవిచిత్రమైన
దైవసృష్టిని
ఎవ్వరూ
అర్థం
చేసుకోవడం
లేదు.
గొప్పగొప్ప
సైంటిస్టు
లంతా
తాము
అర్థం
చేసుకున్నామని
నోటితో
చెబుతున్నారుగాని,
దాని
అనుభవము
వారికి
లేదు.
దైవసంకల్పమును
కూడా
మార్చగలిగిన
శక్తి
భక్తునియందున్నది
ప్రేమస్వరూపులారా!
దైవాజ్ఞను
ఒకరు
అవునని,
ఒకరు
కాదని
వాదించుటకు
వీలులేదు.
ఉదాహరణకు,
మార్కండేయుని
ఉదంతము
తీసుకోండి.
ఈశ్వరుడే
మార్కండేయుని
పుట్టించాడు.
పదహారు
సంవత్సరముల
ఆయుష్షును
ప్రసాదించి
సత్పుత్రునిగా
జీవించమని
చెప్పాడు.
అతని
తల్లిదండ్రులు
అల్పాయుష్షు
కలిగినా
సత్పుత్రుడు
కావాలని
ఆశించడంచేత
ఈశ్వర
వరప్రసాదంగా
మార్కండేయుడు
వారికి
జన్మించాడు.
సచ్చింతనలతో,
సదాలోచనలతో,
సత్ప్రవర్తనతో
జీవితము
గడుపుతూ
వచ్చాడు.
పదహారవ
సంవత్సరములో
పడేటప్పటికి
తల్లి
ఒకనాడు
దుఃఖముతో
కంటిధారలు
కారుస్తూ
కనిపించింది.
ఆమె
ఎందుకు
ఈవిధంగా
ఏడుస్తున్నదో
ఆ
పిల్లవానికి
అర్థం
కాలేదు.
తండ్రి
కూడను
అదేవిధముగా
చింతిస్తూ
ఉన్నాడు.
అప్పుడు
మార్కండేయుడు
తల్లిదండ్రులవద్దకు
పోయి,
‘అమ్మా!
ఎందుకు
మీరు
కంటిధారలు
కార్చడం?
నాకేమైనా
ప్రమాద
మున్నదా?’
అని
ప్రశ్నించాడు.
అప్పుడతని
తల్లి,
‘నాయనా!
నిన్ను
భగవంతుడు
మాకు
ప్రసాదించే
సమయమునందు
నీవు
కేవలం
పదహారు
సంవత్సరములు
మాత్రమే
సత్పుత్రుడవై
జీవించగలవు’,
అని
చెప్పాడు.
ఈవిషయం
ఇంతవరకు
తనకు
ఎందుకు
చెప్పలేదని
కుమారునికి
చాలా
ఆశ్చర్యం
కలిగింది.
ఆనాటినుండి
ఆతడు
కాలమును
వ్యర్థం
చేయకూడదని,
కాలము
పవిత్రమైనదని
మరియు
కాలము
భగవత్స్వరూపమని
గుర్తించాడు.
3
▾
Meaning
Keep
తెల్లవారి
లేచిన
తక్షణమే
స్నానము
చేయడము,
ఈశ్వరునిదగ్గరకు
పోయి
అచ్చట
కూర్చుని
‘నమశ్శివాయ,
నమశ్శివాయ...’
అని
పంచాక్షరీ
మంత్రమును
జపించడం
మొదలుపెట్టాడు.
ఆ
మరుసటి
దినమే
అతడికి
పదహారు
సంవత్సరములు
నిండుతాయి.
కనుక,
ఆతడు
ఇంటికి
కూడా
పోలేదు.
శివలింగమువద్ద
కూర్చుని
నామజపము
చేస్తున్నాడు.
అతని
తల్లిదండ్రులు
కంటిధారలు
కార్చుకుంటూ
తలుపు
దగ్గర
కూర్చున్నారు.
ఏ
నిమిషములో
ఏ
ప్రమాదము
కలుగుతుందో
అని
వారు
చింతిస్తున్నారు.
సరే,
దైవాజ్ఞ
తప్పదు
కదా!
వానికి
పదహారు
సంవత్సరముల
కాలము
పూర్తయి
శరీరములో
చైతన్యము
నశించి
ఒక
ప్రక్కకు
పడిపోయాడు.
‘అయ్యో,
తమ
కుమారుడు
ఇంక
పోయినాడు
కదా’,
అని
తల్లిదండ్రులు
బాధపడుతూ
వచ్చారు.
ఇక్కడ
బాహ్యంగా
ఈరకంగా
తల్లిదండ్రులు
బాధపడుతుంటే,
ఆంతరముగా
ఆ
జీవుడు
ఈశ్వరునిదగ్గరకు
చేరాడు.
ఇంతలో
పార్వతి
కూడా
అక్కడికి
వచ్చింది.
‘నీ
సంకల్పమును
సఫలము
గావించినాడు
కనుక,
అతనిని
వెనుకకు
పంపు’,
అని
ఈశ్వరునితో
చెప్పింది.
‘అందుకు
నీ
సహాయము
కూడా
కావాలి’,
అని
ఈశ్వరుడు
పార్వతితో
చెప్పాడు.
ఈశ్వరుడు,
పార్వతి
ఇద్దరూ
ఆ
బిడ్డను
తీసుకొని
తల్లిదండ్రుల
దగ్గరకు
వచ్చారు.
అనగా,
అచేతనమైన
మార్కండేయుని
శరీరములో
కదలిక
ఏర్పడింది.
అది
చూచి
అతని
తల్లిదండ్రులు
ఎంతో
సంతోషించారు.
ఈ
పిల్లవాడు
లేచాడు.
‘అమ్మా!
పార్వతీ
పరమేశ్వరులు
నాకు
దీర్ఘాయుష్షును
ప్రసాదించారు.
మీకు
ఎంతకాలము
అవసరమో
అంతకాలము
నాతో
కాలం
గడపండి.
సత్కర్మలు
చేయండి,
సదాలోచనలు
సల్పండి.
నేను
సత్పుత్రునిగా
మీకు
సేవలు
చేస్తాను’,
అని
లేచి
తల్లిదండ్రులకు
నమస్కరించి
వారిని
వెంటపెట్టుకొని
ఇంటికి
చేరాడు.
‘మరణించిన
మార్కండేయునికి
తిరిగి
ప్రాణం
వచ్చిందే’,
అని
ఊరివారందరూ
ఆశ్చర్యపడుతూ
వచ్చారు.
అప్పుడు
ఈ
పిల్లవాడు
బాహ్యలోకము
నందు,
ఆ
దివ్యలోకమునందు
ఈశ్వరునికి,
తనకు
జరిగిన
సంభాషణ
యొక్క
సారమును
చెప్పాడు.
మానవులకు
దైవము
ఏవిధముగా
సహాయము
చేస్తాడంటే,
ప్రార్థనలవల్ల
కాదు.
అంతర్భావము
పరిశుద్ధముగా
ఉండినప్పుడే
ఈవిధముగా
భగవత్సంకల్పములు
నెరవేరుతుంటాయి.
మార్కండేయుడు
ఏవిధమైన
కోరికా
కోరలేదు.
భగవంతుడు
తనకు
ప్రసాదించిన
కాలమును
సద్వినియోగము
చేసుకోవాలని
మాత్రమే
ఆశించాడు.
4
▾
Meaning
Keep
ఈవిధముగా,
సంకల్పములను
పరిశుద్ధం
గావించుకోవడానికి
తగిన
కర్మలు
ఆచరించడమే
భక్తులు
చేయవలసిన
కర్తవ్యం.
అప్పటినుండి
మార్కండేయుడు
చిరంజీవిగా
ఉంటూ
వచ్చాడు.
తల్లిదండ్రులకు
ఆనందాన్ని
అందిస్తూ
వచ్చాడు.
దైవముయొక్క
సంకల్పము
ఎన్నటికీ
మారదు.
ఆ
సంకల్పము
జరుగుతూనే
ఉంటుంది.
కాని,
భక్తుని
నిస్వార్థమైన,
నిష్కళంకమైన
ప్రార్థనలవల్ల
కొన్ని
మార్పులు
కలుగుతుంటాయి.
దైవసంకల్పమును
కూడా
మార్చ
గలిగిన
శక్తి
భక్తునియందుంటున్నది.
భక్తి
అనగా
కేవలము
వట్టి
మాటలు
కాదు.
లింగము
ఈశ్వరత్వమునకు
చిహ్నము
ఏడవ
శతాబ్దములో
కేరళ
దేశములో
ఆదిశంకరులవారు
జన్మించారు.
ఆయన
పుట్టి
ప్రపంచములో
ప్రతి
మానవునికి
దైవ
సంకల్పాన్ని
బోధించాలనే
ఉద్దేశ్యంతో
సర్వ
శాస్త్రములయొక్క
అర్థమును
చాటుతూ
వచ్చాడు.
కాని,
అంతటి
శంకరాచార్యులవారు
ముప్పై
రెండు
సంవత్సరముల
స్వల్పకాలము
మాత్రమే
జీవించారు.
తరువాత,
పదకొండవ
శతాబ్దములో
శ్రీరామానుజాచార్యులవారు
జన్మించారు.
‘లోకములో
భక్తిప్రపత్తులు
సన్నగిల్లిపోతున్నాయి
మానవునియందు
భక్తి
అనేది
శూన్యమైపోతున్నది.
భగవంతుని
చింతయే
లేకుండా
పోతున్నది.
దానిని
నిలబెట్టాలి’,
అని
భగవంతుని
నామస్మరణయొక్క
విశిష్టతను,
ప్రాముఖ్యతను
బోధించడానికి
వచ్చారు.
మరి
13వ
శతాబ్దములో
శ్రీ
మధ్వాచార్యులు
వచ్చారు.
ఈయన
జీవుడు,
దేవుడూ
ఇద్దరూ
వేరువేరని
బోధలు
చేస్తూ
వచ్చారు.
అయితే
జీవుడు,
దేవుడు
వేరు
అయినా
ఇరువురియందున్నది
ఒకే
ఆత్మ
తత్త్వము.
సర్వ
జీవులయందున్న
ఆత్మతత్త్వము
ఒక్కటే.
అందరి
యందున్న
ఈశ్వరత్వము
ఒక్కటే.
ప్రపంచములో
ఈశ్వరత్వమనేది
కల్పితము
కాదు.
సహజ
సిద్ధముగా
వచ్చేటటువంటిది.
రాముడు
శరీరధారియై
వచ్చాడు.
కృష్ణుడు
కూడా
శరీరధారియై
వచ్చాడు.
ఈ
దేహతత్త్వము
ఈశ్వరత్వము
కాదు.
తనయొక్క
సత్యతత్త్వమే
ఈశ్వరత్వము.
అనగా,
సృష్టి,
స్థితి,
లయములు
మూడింటియొక్క
ఏకత్వము
ఈశ్వరత్వమునందే
ఉంటున్నది.
దీనిని
పురస్కరించుకొనియే
పండితులు
ఈశ్వరత్వానికి
చిహ్నంగా
లింగాకారమును
చిత్రించారు.
5
▾
Meaning
Keep
అందరియందున్న
ఆత్మతత్త్వము
ఒక్కటే
పరమేశ్వరుడు
కూడా
ఈశ్వరత్వమునకు
చిహ్నమైన
ఇటువంటి
లింగమునే
ఒకదానిని
సృష్టించి
మార్కండేయుని
తల్లిదండ్రులకు
ఇచ్చి,
ఇట్టి
దైవత్వమును
చింతించమని
వారికి
బోధించాడు.
ఆ
లింగాకారమునే
వారు
పూజిస్తూ
తమ
జీవితమును
సార్థకము
చేసుకున్నారు.
ఆత్మతత్త్వము
చలించేది
కాదు.
అందరియందున్న
ఆత్మతత్త్వము
ఒక్కటే.
ఇట్టి
పవిత్రమైన
తత్త్వాన్ని
ఆనాడు
మార్కండేయుడు
మరియు
అతని
తండ్రి
మృకండుడు
చక్కగా
అర్థము
చేసికొని
దైవత్వాన్ని
ఈరకంగా
లింగాకారములో
పూజిస్తూ
వచ్చారు.
ప్రతి
జీవి
శరీరములోనూ
మూడంశములుంటాయి.
స్థూల,
సూక్ష్మ,
కారణ
శరీరములు.
బాహ్యమైన
ఆకారము
స్థూలమైనది.
ఒకే
ఆత్మతత్త్వము
ఈ
స్థూల,
సూక్ష్మ,
కారణశరీరములలో
అంతర్యామిగా
ఉంటున్నది.
ఇది
దారము.
ఈ
దారము
లేకుండా
రుమాలు
కాలేదు.
వెండి
లేక
తట్ట
కాలేదు.
మట్టి
లేకుండా
కుండ
కాలేదు.
బ్రహ్మము
లేకుండా
జగత్తు
లేదు.
ఈ
బ్రహ్మము
దారమువంటిది.
స్థూల,
సూక్ష్మ,
కారణ
దేహములు
మూడూ
సృష్టికర్తయందే
ఉంటున్నవి.
అయితే,
ఆవిధంగా
ఉన్నంత
మాత్రమున
వస్త్రము
కాలేదు.
పడుగు,
పేక
రెండు
వైపులా
చేర్చాలి.
ఇదియే
మానవప్రయత్నము,
దైవానుగ్రహము.
ఈ
రెండూ
చేరినప్పుడే
ఫలితము
అందుతుంది.
మనము
చెప్పే
పదములు,
చేసే
పనులు
మన
సూక్ష్మశరీరములో
ఆవిర్భవించి
బహిర్ముఖమయ్యేటటువంటివే!
వేదము
భగవత్స్వరూపము
ఈనాడు
విద్యార్థులందరూ
వేదము
పఠిస్తున్నారు.
ఈ
వేదమంత్రములలో
ప్రతి
ఒక్కటీ
ఒక్కొక్క
దివ్యత్వ
రూపమునకు
సంబంధించినవే!
మానవుడు
తన
నిజతత్త్వమును
గుర్తించాలంటే,
వేదమే
దానికి
ప్రమాణము.
ఎవరు
నేర్చినది
నేర్చినట్లుగా
చెబుతారో
వారే
నిజమైన
సాక్షాత్కారమునకు
అర్హులౌతారు.
దైవసాక్షాత్కారము
ఎట్లా
అవుతుందంటే,
హృదయము
నుండి
వచ్చినప్పుడే
చక్కగా
ఆకారము
బయలుదేరుతుంది.
ప్రత్యక్ష
ప్రమాణము
అదియే!
పరోక్ష
ప్రమాణము
కూడా
అదియే!
సర్వ
సాధనలకూ
అదియే
ఆధారము.
ఇక్కడ
పిల్లలు
వేదమంత్రాలు
చెబుతుంటే
అక్కడ
ఆడవారు
కూడా
ఆ
మంత్రములను
చక్కగా
చెబుతుంటారు.
6
▾
Meaning
Keep
నిజానికి
ఆడవారు
వేదమంత్రములు
చెప్పకూడదనే
నియమము
ఏమీ
లేదు.
ఇక్కడ
వేదమంత్ర
పఠనము
జరుగుతుంటే,
వారికి
లోపల
ఉన్న
విద్య
బయటికి
వస్తుంటుంది.
మీరందరూ
చూడండి.
ఈ
చిన్నపిల్లలు
ఎక్కడ
నేర్చుకున్నారు
వేదము?
పెద్ద
పిల్లలు
చెబుతుంటే
విని
వారు
చెబుతున్నారు.
అయితే,
కొంతమంది
ఆ
వేదము
చెప్పేవారి
ప్రక్కనే
కూర్చుంటారు.
కాని,
ఆ
మంత్రములను
కొంతవరకైనా
నేర్చుకోరు.
నేను
చూస్తుంటాను.
ఆ
వేదము
చెప్పేవారి
ప్రక్కన
గొప్ప
విద్యావంతులు
కూర్చుంటారు.
ఊరకే
కూర్చుని
ప్రయోజనమేమిటి?
విద్యార్థులు
మంత్రాలు
పఠిస్తుంటే
వాళ్ళు
వింటుంటారు.
కాని,
తాము
మాత్రం
చెప్పడం
లేదు.
ఇంకా
కొంతమంది
కేవలం
యాంత్రికంగా
వేదమంత్రాలు
పఠిస్తుంటారు.
కాని,
సరిగా
శ్రవణం
చేయరు.
ఈ
రెండింటి
ఏకత్వము
జరిగినప్పుడే
నిజమైన
సాక్షాత్కారమవుతుంది.
ప్రతి
మానవుడూ
వేదము
నేర్చుకొన్నదానిని
ఉచ్చరిస్తూ
రావాలి.
వేదమే
భగవత్స్వరూపము.
ఈనాడు
అనవసరమైనవన్నీ
మనస్సులో
చేర్చుకుంటున్నాముగాని,
అవసరమైన,
ప్రాణసమానమైన
వేదములను
వదలిపెడుతున్నాము.
ప్రతి
మానవుడు
వేదాన్ని
నేర్చుకోవలసినదే!
ఉచ్చరించవలసినదే
మరియు
స్మరించవలసినదే!
ఉచ్చరించకుండా
ఉండేవారు
నేర్చుకుని
ప్రయోజనం
లేదు.
ఒకవేళ
ఇక్కడ
ఉచ్చరించినా
కొంతమంది
బయటికి
పోతూనే
వదలిపెడతారు.
ఈవిధంగా
విద్యా
ద్రోహులు
కాకూడదు.
విద్యాద్రోహులే
దైవద్రోహులు.
ఈ
దైవ
ద్రోహము
వలన
వారు
ప్రాప్తికి
దూరమైపోతున్నారు.
ప్రతి
మానవుడు
తెలుసుకోవలసినది
‘సృష్టిలో
కనిపించేదంతయు
దైవముయొక్క
సంకల్ప
ప్రభావమే’,
అని.
ప్రతి
మానవుడు
వేదము
నేర్చుకోవాలి
ప్రేమస్వరూపులారా!
పిల్లలు
తెలియక
పొరపాటు
చేయవచ్చు.
కాని,
ఒకతూరి
పొరపడిన,
రెండవతూరి
పొరపడకూడదు.
ఈనాడు
విన్నటువంటి,
నేర్చుకున్నటువంటి
వేదమంత్రములను
రేపటినుండి
ఉచ్చరించాలి.
అందరూ
ఏకశబ్దముతో
ఉచ్చరించినప్పుడే
బ్రహ్మతత్త్వం
గోచరమౌతుంది.
ఆవిధంగా,
బ్రహ్మతత్త్వమును
తెలుసుకోవడమే
‘వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్...’
అనే
మంత్రమునకు
అర్థము.
7
▾
Meaning
Keep
వేదముయొక్క
శబ్దము
ఎంతయో
పవిత్రమైనది.
అది
‘శబ్దబ్రహ్మమయి
చరాచరమయి
జ్యోతిర్మయి
వాఙ్మయి
నిత్యానందమయి
పరాత్పరమయి
మాయామయి
శ్రీమయి’
అని
కీర్తింపబడేది.
అదియే
నిజమైన
విద్యాసంబంధము.
కనుక,
ప్రతి
మానవుడు
వేదము
నేర్చుకోవాలి.
అది
సాధ్యపడకపోతే
ఏదో
ఒక
భగవన్నామాన్ని
నిత్యం
స్మరించడం
నేర్చుకోవాలి.
మనము
ఏమి
నేర్చుకున్నా
దానిని
ఉచ్చరిస్తూ
రావాలి.
ఉచ్చరించకపోతే
నేర్చుకో
వలసిన
అవసరం
లేదు.
చాలామంది
విద్యార్థులను
నేను
చూస్తూనే
ఉన్నాను.
వేదము
నేర్చుకున్నవారు
ఇక్కడ
పఠించడం,
తీరా
బెంగుళూరుకు
వెళ్ళాక
దానిని
వదలిపెట్టడం!
వేదాధ్యయనమంటే,
ఎవరైనా
వచ్చినప్పుడు
రెండు
మంత్రములు
చెప్పడం,
తరువాత
వదలి
పెట్టడం
కాదు.
ప్రతి
రోజూ
క్రమం
తప్పకుండా
వేదమంత్రపఠనం
జరుగవలసిందే!
అదే
ఆనందదాయి,
అదే
ఆనందమయి.
ఈవిధంగా,
ఆనందములో
మునిగిపోవాలి.
కాని,
ఆ
ఆనందము
ఎక్కడా
నాకు
కనిపించడం
లేదు.
మనం
వేదమంత్రములను
క్రమం
తప్పకుండా
ఉచ్చరించినప్పుడే
మన
జీవితము
సార్థకమైపోతుంది.
ఈనాడు
వారూ,
వీరూ
చెబుతున్నారు
కదా
అని
ఉచ్చరిస్తున్నారు.
ఆవిధంగా
బలవంతంగా
ఉచ్చరించడం
వలన
ప్రయోజనం
లేదు.
వేదార్థమును
లోపల
జీర్ణించుకోవాలి.
అన్నము
తినేది
దేనికోసం?
కడుపులో
పెట్టడానికా?
కడుపులో
పెట్టినది
జీర్ణించుకొని
సర్వాంగములకు
సప్లై
చేయడమే!
అదేవిధముగా,
మనం
నేర్చుకొన్న
విద్యను
తప్పక
జీర్ణింపజేసుకొని
సర్వాంగములకూ
సప్లై
చేయాలి.
వాక్కునందును,
క్రియలందును
వేదప్రచారము,
ప్రబోధలను
ఆనందంగా
అనుభవించాలి.
దైవం
సర్వత్రా
ఉన్నాడని
అంటుంటారు.
ఏవిధంగా
ఉంటున్నాడు?
పంచభూతస్వరూపుడై
ఉంటున్నాడు.
ఒక్కొక్క
భూతము
ఒక్కొక్క
దైవస్వరూపమే!
సకల
విజ్ఞానము
వేదమునుండి
ఆవిర్భవించినదే!
ప్రేమస్వరూపులారా!
విద్యార్థులారా!
మీరు
నేర్చుకున్న
విద్యను
పదిమందికి
తగినరీతిగా
పంచాలి.
మీరు
కూడా
జీర్ణించుకోవాలి.
ఇంటిలో
వంటలు
చేస్తాము.
వచ్చిన
వ్యక్తులకు
వడ్డిస్తాము.
తరువాత
మనము
కూడా
భుజించాలి
కదా!
అదేవిధముగా,
ఉచ్చరించే
నామమును
మనముకూడా
జీర్ణించుకోవాలి.
8
▾
Meaning
Keep
వేదము
యొక్క
ప్రశస్తి
ఈవిధముగా
ఉంటున్నది.
వేదము
ప్రమాణపూర్వకమైనది.
సకల
విజ్ఞానము
వేదమునుండి
ఆవిర్భవించినదే!
కనుకనే,
‘సర్వ
విజ్ఞాన
సంపత్తి’
అన్నారు
దీనిని.
ఇటువంటి
సర్వ
విజ్ఞాన
సంపత్తిని
మనము
ఎంత
వ్యర్థము
చేస్తున్నామో!
నీవు
ఎంత
వరకు
నేర్చుకున్నావో
అంత
వరకు
తప్పక
చెప్పు.
మరచుటకు
ప్రయత్నించవద్దు.
అప్పుడే
తగిన
సాక్షాత్కారము
తప్పక
నీకు
లభిస్తుంది.
మార్కండేయునికి
ఏవిధంగా
కలిగింది?
పంచాక్షరి
మంత్రాన్ని
స్మరిస్తూ,
స్మరిస్తూ
మైమరచిపోవడం
చేతనే
పంచభూతములయొక్క
స్వరూపముగా
ఉన్న
ఈశ్వరుడు
అతనికి
ప్రత్యక్షమయ్యాడు.
అందువలన,
భగవత్సాక్షాత్కారమును
పొందా
లనుకున్న
వ్యక్తులు
వేదమును
జీర్ణింపజేసుకొని
పదిమందికి
అందించాలి.
ఆవిధముగా
చేసినప్పుడే
మీరు
నేర్చుకున్న
విద్య
సార్థక
మౌతుంది.
Previous
←
Develop the Feeling of the One Ātma
Next
The Whole World Is Full of Brahman
→