Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Develop the Feeling of the One Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop the Feeling of the One Ātma
17 October 2004, Dasara
1
▾
Meaning
Keep
His poems 398
Also in his talks
(4)
13 April 2002
Follow the path of Sai and win a good name
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
6 September 2004
God Delights in Song, the Lover of Song
25 December 2004
Pray for the Sake of God's Prema
క్రమము
తప్పక
మింట
ప్రతిదినంబును
భాను
డుదయాస్తమయముల
నొందనేల!
గగనంబునకు
కాంతి
కైసేయు
తారలు
పగలు
మాత్రము
దాగు
భంగియేల!
క్షణమైన
విశ్రాంతి
గొనక
తా
పవనుండు
జీవకోటుల
బ్రోవ
వీవనేల!
అనిశంబు
కలకల
ధ్వనుల
నవ్వుచు
నది
సలిలమై
ప్రవహించు
చందమేల!
ప్రకృతిలో
ఎందుచూచిన
అందు
పంచభూతములు
సంచరించు
చున్నవి;
ఒక్క
మానవునియందు
మాత్రమే
కాదు.
పంచభూతముల
వికాసమే
యీ
ప్రపంచము.
‘ప్ర
-
పంచము’.
‘ప్ర’
అనగా
విశాలమైనది.
కాబట్టి,
పంచభూతములు
సర్వత్రా
నిండియున్నవి.
ఈ
ప్రపంచములో
పంచభూతముల
ప్రకాశమే
సర్వత్రా
గోచరించు
చున్నది.
ఏది
జరిగినా
మన
మంచికొరకే
ప్రేమస్వరూపులారా!
సర్వ
కర్మలకు,
సర్వ
సృష్టికి,
పోషణకు
భగవంతుడే
మూలకారణము.
‘దైవము
ఎందుకీవిధంగా
చేస్తాడు?’
అని
ప్రశ్నించుటకు
ఎవ్వరికీ
అధికారము
లేదు.
తన
ఇష్టప్రకారము
తాను
సృష్టించవచ్చును.
తన
ఇష్టానుసారము
సంచరించ
వచ్చును.
ఈ
ప్రపంచములో
ప్రతి
చిన్న
కార్యము
కూడా
దైవసంకల్పముచేతనే
జరుగుచున్నది.
మీ
స్థాయిలో
మీకు
దుఃఖమనేది
కనిపించ
వచ్చునుగాని,
భగవంతుని
స్థాయిలో
దుఃఖమనేది
లేదు.
భగవంతుడు
ఏది
చేసినా
అది
ప్రజలయొక్క
మేలుకోసమే!
ప్రపంచముయొక్క
సుక్షేమముకొరకే!
“దైవం
ఎందుకు
నన్నీరీతిగా
బాధపెడుతున్నాడు?”
అని
కొంతమంది
వాపోతుంటారు.
2
▾
Meaning
Keep
ఆయనకు
ఎట్టి
భేదమూ
లేదు.
మీకు
కష్టము
కల్గినా,
సుఖము
కల్గినా,
‘అంతా
నా
మంచికే’
అని
భావించండి.
ఏది
జరిగినా
తన
మంచికోసమే
అన్న
సత్యాన్ని
గుర్తించుకోలేకపోవడంచేతనే
మానవుడు
అనేక
రకములైన
బాధలకు
గురి
అవుతున్నాడు.
దైవసృష్టియందు
అంతర్భూతమై
ఉన్న
సత్యమును
గుర్తించుటకై
మనం
ప్రయత్నించాలి.
ఈనాటి
మానవుడు
కేవలం
తెలివితేటలను
పెంచుకోవాలని
ప్రయత్నిస్తున్నాడుగాని,
గుణమును
పెంచుకోవటం
లేదు.
ప్రాచీన
ఋషులు
గుణమే
ప్రధానమైనదని,
గుణమును
పెంచుకొనే
నిమిత్తమై
ప్రయత్నించవలెనని
బోధిస్తూ
వచ్చారు.
కాని,
మానవుడు
గుణమును
పెంచుకొనుటకు
ప్రయత్నించక
తాను
గొప్ప
తెలివితేటలు
గలవాడినని,
గొప్ప
డిగ్రీలు
పొందినవాడినని
గర్విస్తున్నాడు.
తనకు
అన్నీ
తెలుసుననే
ఉద్దేశ్యంతో
అహంకార
పడుతున్నాడు.
ఈ
అహంకారం
ఏమీ
తెలియనివానియొక్క
అజ్ఞానమే!
చెట్టుకొమ్మలు
ఒకదాని
కొకటి
రాసుకొన్నప్పుడు
అగ్ని
పుడుతుంది.
ఈ
అగ్ని
ఎక్కడినుండి
పుడుతున్నది?
ఆ
కఱ్ఱనుండే
పుడుతున్నది.
కఱ్ఱనుండి
పుట్టిన
అగ్ని
ఆ
కఱ్ఱనే
కాల్చివేస్తున్నది.
అదేవిధముగా,
మానవుని
యందు
పుట్టినటువంటి
అహంకారము
మానవుడినే
భస్మము
గావిస్తున్నది.
మానవునియందు
గుణము
లేనిచో
తెలివితేటలు
ఎన్ని
ఉన్నప్పటికీ
అవి
వ్యర్థమే!
గుణమును
పెంచుకొనే
నిమిత్తమై
మనం
నవరాత్రులను
జరుపుకుంటున్నాము.
మొట్టమొదట
మనం
మంచి
గుణములను,
మంచి
ఆలోచనలను,
మంచి
అభీష్టములను
కలిగి
ఉన్నామా
లేదా
అని
మనల్ని
మనం
ప్రశ్నించుకోవాలి.
ఆత్మవిశ్వాసమును
పెంచుకోండి
ఈ
కలియుగ
ప్రభావముచేత
మానవునిలో
నమ్మక
మనేది
క్షీణించిపోతున్నది.
తాను
తెలివితేటలలో
ఎంత
గొప్పవాడైనప్పటికీ
నమ్మకము
లేకపోతే
దుష్టుడై
పోతాడు.
‘నమ్మకము
గలవాడు’
అనే
గొప్ప
బిరుదును
మానవుడు
సంపాదించుకోవాలి.
‘నమ్మకమను
రెండు
నయనమ్ములే
లేని
అంధులైరి
జనులు
అవనియందు’.
తనపై
తనకు
నమ్మకము
ఉండినప్పుడే
మానవుడు
దైవమునుకూడా
నమ్మగల్గుతాడు.
చాలామంది
‘నాకు
దైవముపై
నమ్మకము
లేదు’,
అంటారు.
3
▾
Meaning
Keep
His poems 549
Also in his talks
(6)
28 January 1990
The end of Education is Character
22 November 1990
Towards a value based education
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
22 November 1992
Only when each fulfils his own duty well does the world prosper
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
దైవముపై
నమ్మకము
లేకపోతే
యింక
దేనిపై
ఉండాలి?
దీనికి
అర్థమే
లేదు.
నమ్మకము
లేక
మానవుడు
దేనినీ
సాధించలేడు.
నమ్మకము
కలిగినప్పుడే
అన్నిటియందు
తాను
విజయమును
సాధించగలడు.
కాన,
మానవుడు
మొట్టమొదట
నమ్మకమును
పెంచుకోవాలి.
దైవమును
నమ్మినటువంటివాడు
సర్వులయందు
దైవమున్నాడని
విశ్వసిస్తాడు.
‘ఈశావాస్యమిదం
సర్వం’,
‘ఈశ్వరస్సర్వ
భూతానాం’.
ఈశ్వరుడు
సర్వభూతములయందు
నమ్మకమనే
పేరుతో
ప్రతిష్ఠితుడై
ఉన్నాడు.
సకల
వేదశాస్త్రములూ
బోధించే
విషయమిదే
-
నమ్మకమును
పెంచుకోవాలి.
“యద్భావం
తద్భవతి”
అన్నట్లుగా,
మన
నమ్మకముపైననే
ఫలితం
ఆధారపడి
ఉంటుంది.
‘రష్యాలో
ఈవిధంగా
జరిగింది’
అని
న్యూస్
పేపర్లో
వచ్చిన
వార్తను
మనం
నమ్ముతున్నాము.
కాని,
సత్య
ప్రభావమైన
ఆచరణనుండి,
అనుభూతినుండి
వచ్చిన
విషయాలను
చెబితే
నమ్మటం
లేదు.
గుణమువలననే
నమ్మకము
అభివృద్ధి
అవుతుంది.
కాని,
యీనాడు
మనం
గుణమును
ప్రక్కకు
నెట్టుతున్నాం;
ఇతరులు
చెప్పిన
మాటలను
నమ్మి
చెడిపోతున్నాం.
మొట్టమొదట
మనం
ఆత్మవిశ్వాసమును
పెంచుకోవాలి.
అప్పుడే
భగవంతునియందు
మనకు
నమ్మకము
ఏర్పడుతుంది.
ఈనాడు
మనకు
ముఖ్యంగా
కావలసినది
నమ్మకము.
నమ్మకమును
పెంపొందింపజేయడమే
విద్య
లక్ష్యం
విద్యార్థులారా!
విద్యావంతులారా!
విద్యాబోధకులారా!
విద్యాభిమానులారా!
మీలో
నమ్మకమును
పెంపొందింప
జేయడమే
విద్యయొక్క
లక్ష్యం.
విద్య
అంటే
కేవలం
గ్రంథపరిచయం
కాదు.
చదివి
వ్రాయ
నేర్చినవారందరూ
విద్యావంతులేనా?
కాలేజి
డిగ్రీలు
పొంద
విద్యావంతుడగునా?
సుజ్ఞానము
సుకృతములు
లేని
విద్యలు
సద్విద్యలగునా?
తానెవరో
తెలియకున్న
తత్త్వజ్ఞానమెట్లు
కుదురు!
కాబట్టి,
మానవుడు
తానెవరో
తెలుసుకొనుటకు
తగిన
ప్రయత్నం
చేయాలి.
అది
తెలుసుకొనకుండా
ఎన్ని
గ్రంథములు
చదివినా
ప్రయోజనము
లేదు.
ఇలాంటి
సమావేశములందు
పాల్గొన్నప్పుడు
మీరు
ఆధ్యాత్మిక
ప్రబోధలను
చక్కగా
వింటారు.
4
▾
Meaning
Keep
కాని,
యిక్కడినుండి
లేచిపోతూనే,
‘అంతా
యేమిటో
నమ్మటానికి
వీలులేదు’,
అనుకుంటారు.
ఇది
మానవునికి
ఉండవలసిన
గుణము
కాదు.
ఆధ్యాత్మిక
ప్రవచనాలను
చక్కగా
నమ్మాలి.
ఆ
నమ్మినవాటిని
ఆచరణలో
పెట్టి,
ఆనందమును
అనుభవించాలి.
మానవునియందు
అసలు
మొట్టమొదట
పుట్టినది
నమ్మకమే!
మానవుడు
తన
తల్లిని
బాగా
నమ్ముతాడు.
తల్లి
యెంత
తిట్టినా,
కొట్టినా
ఆమెను
సంపూర్ణంగా
విశ్వసిస్తాడు.
తల్లిప్రేమ
అంత
భద్రమైనది.
తల్లిప్రేమయందు
మనకు
ఎట్టి
విశ్వాసమున్నదో
భగవంతునియందుకూడా
అట్టి
విశ్వాసమును
కలిగి
యుండాలి.
కాని,
యిప్పుడు
ఎక్కడ
చూచినా
విశ్వాసమనేది
కనిపించటం
లేదు.
మిమ్మల్ని
మీరు
నమ్మండి
ఈనాటి
మానవుడు
తాను
ప్రత్యక్షముగా
భగవంతుని
చూడాలని
ఆశిస్తున్నాడు.
ప్రత్యక్ష
దైవమంటే
ఎవరు?
తెల్లవారి
లేచినది
మొదలు
ప్రకాశమును
అందించి,
ప్రాణులను
పోషించి
జగత్తును
సంరక్షించే
సూర్యుడే
ప్రత్యక్ష
దైవము.
గాయత్రీ
మంత్రములో
చెప్పినట్లు,
సూర్యుడే
ప్రత్యక్ష
దైవమని
మన
ప్రాచీన
ఋషులు
వర్ణించారు.
ప్రేమ
అనే
కాంతి
సూర్యుని
నుండియే
వస్తున్నది.
ప్రేమ
లేకపోతే
మన
జీవితమంతా
చీకటే!
‘ఒకే
సూర్యుడు
సమస్త
లోకములకు
ఒక్కొక్కడై
తోచు.’
అమెరికాలో
సూర్యోదయమైనప్పుడు
ఇక్కడ
సూర్యాస్తమయమవుతుంది.
సూర్యుడు
ఉదయిస్తున్నాడని
అమెరికన్లు
చెబితే
అదే
సమయంలో
సూర్యుడు
అస్తమిస్తున్నాడని
భారతీయులు
చెబుతారు.
ఇక్కడ
వాదోపవాదములకు
అవకాశము
లేదు;
రెండూ
నిజమే!
ఒక
శిష్యుడు
తన
గురువువద్దకు
వెళ్ళి,
‘గురూజీ!
భగవంతు
డనేవాడు
ఎక్కడున్నాడు?’
అని
ప్రశ్నించాడు.
‘భగవంతుడు
సర్వత్రా
ఉన్నాడు.
సర్వ
జీవులలోను
ఉన్నాడు’,
అని
గురువు
బదులిచ్చాడు.
‘ఎట్లా
ఉన్నాడు?’
అని
ప్రశ్నించగా
ఆయన
కొన్ని
పాత్రలు
తెప్పించాడు.
వాటిని
నీటితో
నింపాడు.
ఆకాశంలో
సంచరించే
సూర్యుడు
ఆ
పాత్రలన్నింటియందు
కనిపించాడు.
అదేవిధముగా,
దైవము
సర్వజీవులలోనూ
ఉన్నాడని
గురువు
బోధించాడు.
5
▾
Meaning
Keep
పాత్రలు
ఎన్ని
పెడితే
సూర్యుడు
అన్ని
రూపాలుగా
కనిపిస్తాడు.
పాత్రలు
వేరైనప్పటికీ
జలము
ఒక్కటే.
అయితే,
పాత్రలయందు
జలమే
లేకపోతే
వాటిలో
సూర్యుని
ప్రతిబింబము
కనిపించదు.
మానవదేహం
ఒక
పాత్రవంటిది.
ఇందులో
మనస్సనే
జలము
పరిశుద్ధముగా
ఉన్నప్పుడే
భగవంతుని
ప్రతిబింబము
సుస్పష్టంగా
కనిపిస్తుంది.
మనస్సులో
చెడ్డభావములుంటే
అంతా
చెడ్డగానే
కనిపిస్తుంది.
మంచి
భావము
లుంటే
అంతటా
మంచే
కనిపిస్తుంది.
మంచిచెడ్డలకు
కారణం
మీలో
ఉన్న
భావములేగాని,
బయటి
ప్రభావములు
కావు.
బాధగాని,
సంతోషముగాని
మీనుండి
ఆవిర్భవించినవేగాని,
బయటినుండి
మీకు
లభించినవి
కావు.
దేహమొక
నీటిబుడగ.
మనస్సు
ఒక
పిచ్చికోతి.
కాబట్టి,
దేహమును
గాని,
మనస్సునుగాని
మీరు
నమ్మవద్దు.
ఈ
రెండూ
మీనుండి
వచ్చినటు
వంటివే!
కాబట్టి,
మిమ్మల్ని
మీరు
నమ్మాలి.
ఏకాత్మభావము
లేకపోవడమే
సమస్త
బాధలకు
మూలం
విద్యార్థులారా!
మిమ్మల్ని
మీరు
నమ్ముకుంటే
ఎట్టి
బాధలూ,
కష్టములూ
మీకు
కనిపించవు.
కనీసం
మీ
పెద్దలు
చెప్పిన
విషయాలనైనా
నమ్మి
వాటిని
అనుసరించండి.
మీలోని
భావములను
పవిత్రంగా
ఉంచుకొని
వాటిని
ఆచరణలో
పెట్టండి.
చెడ్డభావము
మీలో
ఉద్భవించిందంటే
ఫలితము
కూడా
అదేరీతిగా
ఉంటుంది.
ఆ
చెడ్డ
సమాజమునుండిగాని,
పరులనుండిగాని
వచ్చినటువంటిది
కాదు.
మంచిచెడ్డలు
మీనుండి
వచ్చినటువంటివేగాని,
ఎవరినుండో
వచ్చి
మీలో
చేరినవని
భావించరాదు.
మనం
మామిడిపండు
తిన్నప్పుడు
మామిడిపండు
త్రేపే
వస్తుందిగాని,
దోస
పండు
త్రేపు
రాదు
కదా!
అదేవిధముగా,
మీ
సుఖదుఃఖములు
మీయందే
పుట్టినవిగాని
బయటినుండి
వచ్చి
మీలో
చేరినవి
కావు.
బయటి
ప్రపంచమునందు
ఉన్నదానిని
మీరేమాత్రము
చింతించవద్దు.
మీనుండి
ఆవిర్భవించిన
సత్యభావమును
మీరు
అనుసరించాలి.
మానవుడు
అనుభవించే
మంచిచెడ్డలన్నీ
తనయొక్క
అంతర్భావము
నుండి
ఆవిర్భవించినటువంటి
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రిసౌండ్’లే!
ఈ
మూడింటి
ప్రభావము
మానవుణ్ణి
ముడివేసి
అనేకరకములుగా
తబ్బిబ్బు
చేస్తున్నది.
ఈ
మూడింటినీ
విస్మరించి
తాను
దేనినో
క్రొత్తగా
కనిపెట్టడానికి
ప్రయత్నం
చేస్తున్నాడు.
6
▾
Meaning
Keep
అది
తన
తెలివితేటల
ప్రభావమని
భావిస్తున్నాడు.
అతని
ప్రభావమేమీ
లేదు.
ఏకత్వముపై
విశ్వాసము
లేకుండా
పోవడమే
అతని
బాధలకు
మూలకారణం.
ఆకారములు
వేరు
కావచ్చు,
ఆచరణలు
వేరు
కావచ్చు.
కాని,
మానవుడు
ఒక్కడే!
దైవము
ఒక్కడే!
మానవునికి
నవవిధములైన
శక్తులను
చూపించే
నిమిత్తమై
నవరాత్రులు
వస్తున్నాయి.
నవరాత్రులందు
మనం
నేర్చుకోవలసింది
ఏకాత్మభావము.
నవ
విధములైన
శక్తులందు
అంతర్లీనమై
ఉన్నది
ఒక్కటే
భావము,
ఒక్కటే
సత్యము.
అదే
ఆత్మతత్త్వము.
అది
ఒక్క
మానవునియందు
మాత్రమే
కాదు,
ఎక్కడ
చూసినా
ఉన్నది.
సూర్యుడు
తూర్పున
ఉదయించే
సమయంలో
మీరు
పడమటి
దిశగా
నడుస్తుంటే
మీ
నీడ
మీకు
అడ్డు
పడుతుంది.
అది
మీకంటే
చాలా
పెద్దదిగా
కనిపిస్తుంది.
సూర్యుడు
పైకి
వచ్చేకొద్దీ
దానియొక్క
పరిమాణం
తరుగుతూ
వస్తుంది.
మిట్టమధ్యాహ్నంవేళ
సూర్యుడు
సరిగ్గా
మీ
శిరస్సుపైకి
వచ్చేసరికి
మీ
నీడ
మీ
కాలిక్రింద
పడిపోతుంది.
అదేవిధముగా,
ఆత్మతత్త్వమునకు
విరుద్ధంగా
మీరు
నడుచు
కుంటున్నప్పుడు
మీలో
అహంకారము
పెరిగిపోతుంది.
మీ
దృష్టిని
ఆత్మతత్త్వమువైపు
మరల్చి
సమత్వమును
అభివృద్ధి
పరచుకున్నప్పుడు
అహంకారము
మీ
కాలిక్రింద
పడిన
నీడవలె
అణిగిపోతుంది.
అహంకారమును
విసర్జించాలి,
ఆత్మతత్త్వమనే
ఏకత్వమును
చూడాలి.
‘ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి’,
‘ఏకమేవాద్వితీయం
బ్రహ్మ’.
భగవంతుడు
ఒక్కడే!
సర్వత్రా
ఉన్నది
ఏకత్వమే!
కాని,
మీ
దృష్టికి
భిన్నత్వము
కనిపిస్తున్నదంటే,
అది
మీ
భావములోని
పొరపాటేగాని,
సృష్టిలోని
పొరపాటు
కాదు.
ప్రతి
విషయంలోనూ
ఏకత్వాన్ని
తీసుకోవడానికి
ప్రయత్నం
చేయాలి.
మొట్టమొదట
నిన్ను
నీవు
నమ్ము.
ఎదుటివ్యక్తిలో
మంచినే
చూడు.
ఆత్మనిగ్రహము,
ఆత్మాభిమానము,
ఆత్మశక్తి
ఈ
మూడింటినీ
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈనాటి
మానవునికి
Self-control
లేకపోవడం
వలననే
Self-satisfaction
అనేది
లేకుండా
పోతున్నది.
సర్వత్రా
ఉన్నది
ఏకత్వమే
ప్రేమస్వరూపులారా!
మీరు
ఏకాత్మస్వరూపులు.
మొట్టమొదట
ఏకాత్మభావాన్ని
మీరు
పెంచుకోవాలి.
7
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
మీకున్నది
ఒకే
గుండె.
రెండు
గుండెలుంటే
మిమ్మల్ని
ఆసుపత్రిలో
చేరుస్తారు.
అదేవిధముగా,
ఉన్నది
ఒకే
ఆత్మతత్త్వము.
అదే
సత్యము.
అట్టి
సత్యమును
మీరు
అనుసరించినప్పుడు
మీకు
సర్వత్రా
దానియొక్క
ప్రతిబింబమే
కనిపిస్తుంది.
మీలో
ఉన్న
ప్రేమతత్త్వము
ఒక్కటే!
కాని,
ఆ
ప్రేమను
మీరు
పలువిధములుగా
ప్రసరింపజేయడంచేత
అనేకముగా
ఉన్నట్లు
మీకు
కనిపిస్తున్నది.
ఆవిధముగా
కనిపించడము
మీ
సంకల్పముల
యొక్క
ప్రభావమేగాని,
సత్యము
కాదు.
విద్యార్థులారా!
ఆధ్యాత్మికతత్త్వమును
మీరు
చక్కగా
గుర్తించుటకు
ప్రయత్నం
చేయండి.
‘నేను
ఏకాత్మ
స్వరూపుడను.
ఈ
ప్రపంచంలో
రెండవ
వ్యక్తి
లేడు’,
అని
దృఢంగా
విశ్వసించండి.
బాహ్యమైన
విషయాలను
మనం
నమ్మకూడదు.
తల్లిదండ్రులు,
భార్యాబిడ్డలు...
ఈవిధమైన
సంబంధబాంధవ్యములన్నీ
కేవలం
మీ
సంకల్పముల
నుండి
ఆవిర్భవించినటువంటివేగాని,
ఎవరో
కల్పించినటువంటివి
కావు.
ఇట్టి
Relationship
తాత్కాలికమైనది.
ఇదే
సత్యమని
నమ్మకూడదు.
మనలో
ఉన్న
ఆత్మతత్త్వమును
విశ్వసించాలి.
దైవము
ఆత్మస్వరూపుడై
సర్వత్రా
ఉన్నాడు.
సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
సర్వత్రా
ఉన్నది
ఏకత్వమే!
కేవలం
భ్రమలచేతనే
మీరు
అనేకత్వాన్ని
కల్పించుకుంటున్నారు.
ప్రేమస్వరూపులారా!
ప్రేమ
మీయందే
ఉన్నది.
దానిని
ఎక్కడో
బయటినుండి
సంపాదించుకోనక్కర్లేదు.
మీరు
ఎవరిని
ప్రేమించి
నప్పటికీ
మీ
ప్రతిబింబమునే
మీరు
ప్రేమిస్తున్నారు.
మీ
ప్రతిబింబమునే
మీరు
ప్రేమిస్తూ
ఎవరినో
ప్రేమిస్తున్నామని
అనుకోవడం
ఎంత
పొరపాటు!
దైవము
ఒక్కడే
నిజమైన
స్నేహితుడు.
అతను
మీకెట్టి
మోసమూ
చేయడు.
అటువంటి
నిజమైన
మిత్రుణ్ణి
మీరే
కొన్నికొన్ని
సందర్భాల్లో
సందేహిస్తున్నారుగాని,
భగవంతుడు
మిమ్మల్ని
ఏనాడూ
సందేహించడు.
అన్నీ
మీలో
కలిగే
మార్పులేగాని,
దైవములో
ఎట్టి
మార్పూ
కలుగదు.
ఈ
లోకంలో
శాశ్వతమైన
మిత్రుడు
ఒక్కడే.
అతనే
దైవము.
దైవానికి
ఎప్పుడూ
ఏకాత్మభావమే!
అట్టి
ఏకాత్మ
భావము
కలిగిన
దైవాన్ని
మీ
మిత్రునిగా
విశ్వసించండి.
8
▾
Meaning
Keep
అప్పుడు
ఈ
ప్రపంచంలో
అందరూ
మీకు
మిత్రులవుతారు.
అసలు
శత్రువనేవాడే
లేడు
లోకంలో.
ఎక్కడున్నాడు
రెండవవాడు?
రెండవ
వ్యక్తి
ఉన్నప్పుడే
కదా
‘ఇతను
నాకు
శత్రువు’
అని
చెప్పడానికి
వీలౌతుంది.
రెండవ
వ్యక్తియే
లేడు.
అన్నీ
కదలిపోయే
మేఘాలే.
అట్టి
కదలిపోయే
మేఘాలను
మీరు
విశ్వసిస్తున్నారుగాని,
నిశ్చలమైన,
నిర్మలమైన,
నిస్వార్థమైన
దైవత్వాన్ని
విశ్వసించలేకపోతున్నారు.
‘డివైన్
లవ్’
(దైవప్రేమ)ను
మీరు
మరచిపోయి
ప్రాపంచిక
విషయాలనే
‘డీప్
వైన్
లవ్’
మత్తులో
పడి
మీ
జీవితాన్ని
వ్యర్థం
గావించుకుంటున్నారు.
ప్రేమస్వరూపులారా!
మీరు
దైవత్వాన్ని
తెలుసుకోవాలంటే
ఏకాత్మభావాన్ని
పెంచుకోండి.
అప్పుడే
మీకు
దైవము
ప్రత్యక్షంగా
కనిపిస్తాడు.
దైవమునే
మీ
తల్లిగా,
తండ్రిగా,
మిత్రునిగా
భావించండి.
దైవమును
వదలిపెట్టి
తాత్కాలికమైన
సుఖాల
నిమిత్తం
ప్రాకులాడ
కండి.
మీరు
నిజమైన
ప్రేమను
తెలుసుకోవాలంటే
దైవమును
విశ్వసించండి.
ఆ
దైవముయొక్క
ప్రేమ
చలించేటటువంటిది
కాదు.
ఎల్లప్పుడూ
నీవు
అతనివాడవే!
అతను
నీవాడే!
అన్నీ
నీ
భ్రమలే!
ఎవ్వరూ
నీవెంట
రారు.
నీకు
నీవే
తోడు.
కాబట్టి,
నిన్ను
నీవు
విశ్వసించు.
అప్పుడే
నీకు
సత్యమును
గుర్తించడానికి
వీలౌతుంది.
ప్రేమయే
దైవము
ప్రేమస్వరూపులారా!
ప్రేమయే
దైవము.
కాబట్టి,
ప్రేమలో
జీవించండి.
అప్పుడే
మీకు
సరియైన
తత్త్వము
అర్థమౌతుంది.
ఇంక,
ఎవరేమి
చెప్పినప్పటికీ
మీరు
వారి
మాటలను
విననక్కర్లేదు.
మీ
అంతరాత్మను
మీరు
అనుసరించండి.
ఎట్టి
పరిస్థితులందైనా
దైవముపట్ల
విశ్వాసాన్ని
మాత్రం
కోల్పోకండి.
మీరు
దైవమార్గంలో
ప్రవేశించినప్పుడు
మీ
తల్లిదండ్రులు
కూడా
మీకు
అడ్డు
చెప్పవచ్చు;
మిమ్మల్ని
నిరుత్సాహపరచవచ్చు.
మన
తల్లి,
తండ్రి,
గురువు,
మిత్రుడు
అంతా
భగవంతుడేనని
వారికి
అర్థమయ్యే
రీతిగా
చెప్పండి.
మిమ్మల్ని
కని
పెంచి
పెద్దచేసింది
మీ
తల్లి.
మిమ్మల్ని
పోషించి
విద్యాబుద్ధులు
చెప్పించేవాడు
మీ
తండ్రి.
మీకు
జ్ఞానబోధ
చేసేవాడు
గురువు.
ఒకరు
తల్లి
అని,
ఒకరు
తండ్రి
అని,
ఒకరు
గురువు
అని
మీరు
లౌకికమైన
అనుభవాన్ని
బట్టి
చెబుతున్నారేగాని,
ఈవిధమైన
సంబంధ
బాంధవ్యములు
సత్యమైనవి
కావు.
9
▾
Meaning
Keep
Also in his talks
(14)
25 December 1986
Prema is God, God is Prema
7 July 1990
The Guru within
10 May 1992
Without a base substance no object takes on form and name
18 January 1996
The Ātmatattva alone is freedom
16 August 1996
‘Love all, worship all’
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
20 July 1997
Human values alone are true kin
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
18 November 1998
Samyak Dṛṣṭi
18 September 2004
Parents Are the Visible Embodiments of God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
6 May 2008
Honour your parents, love them, serve them!
సినిమా
తెరపై
కనిపించే
బొమ్మలమాదిరి
ఇవన్నీ
వస్తుంటాయి,
పోతుంటాయి.
ఈ
కదలిపోయే
‘పిక్చర్’ను
చూసి
మీరు
ఇదే
సత్యమని
భ్రమించవద్దు.
దైవత్వమును
మీ
హృదయంలో
స్థిరంగా
నిలుపుకోండి.
దృఢమైన
విశ్వాసమును
పెంచుకోండి.
అప్పుడే
మీకు
దైవము
సాక్షాత్కరిస్తాడు.
పొద్దున్న
ఒక
రష్యన్
మహిళ
వచ్చింది.
మాటల
సందర్భంలో
‘నాకొక
ఫ్రెండున్నాడు’,
అని
చెప్పింది.
‘ఎవరు
నీ
ఫ్రెండు?’
అని
అడిగాను.
ఆమె
తన
పర్సులో
నుండి
ఒక
ఫోటోను
తీసి
చూపించింది.
అప్పుడు
నేను,
‘అమ్మా!
ఇతను
నీ
మిత్రుడేగాని,
భర్త
కాడు.
భర్త
భర్తయే,
మిత్రుడు
మిత్రుడే!
భగవంతుడు
ఒక్కడే
నీ
మిత్రుడు”,
అని
చెప్పాను.
“అయితే
నేనింత
కాలము
చేస్తున్నది
తప్పేనా?”
అని
అడిగింది.
“నీవు
చేస్తున్నది
తప్పు,
తప్పు,
తప్పు”,
అని
చెప్పాను.
“ఇతనిని
నీవు
చూసి
ఎన్నాళ్ళైంది?”
అని
అడిగాను.
ఆమె,
“మూడు
సంవత్సరాలైంది”
అని
చెప్పింది.
“ఈవిధమైన
సంబంధం
ఊడిపోయేటటువంటిదేగాని,
నిలిచేది
కాదు.
భగవంతుడు
నీవు
మరచినా
నిన్ను
మరువడు;
నిరంతరం
నీవెంట,
జంట
ఉంటాడు”,
అని
చెప్పాను.
దైవము
ఒక్కడే
మీ
మిత్రుడు
ప్రేమస్వరూపులారా!
దైవాన్ని
మీ
నిజమైన
స్నేహితునిగా
విశ్వసించండి.
ఏకాత్మభావాన్ని
అభివృద్ధిపరచుకోండి.
అప్పుడు
మీరు,
దైవము
ఇరువురూ
ఒక్కటైపోతారు.
ఈనాడు
లోకములో
అనేకమంది
దివ్యత్వమనగా
ఏమిటో
గుర్తించుకోలేక
అపార్థాలను
పెంచుకొని,
యథార్థమును
మరచిపోతున్నారు.
దైవము
ఒక్కడే
మీ
మిత్రుడు.
అదే
యథార్థము.
అతనే
మీ
తల్లి,
అతనే
మీ
తండ్రి,
అతనే
మీ
సర్వస్వం.
త్వమేవ
మాతాచ
పితా
త్వమేవ
త్వమేవ
బంధుశ్చ
సఖా
త్వమేవ
త్వమేవ
విద్యా
ద్రవిణం
త్వమేవ
త్వమేవ
సర్వం
మమ
దేవదేవ
ఇటువంటి
పవిత్రమైన
భావాన్ని
మీరు
పెట్టుకోండి.
అప్పుడు
ఈ
జగత్తుకే
మీరు
ఆదర్శప్రాయులుగా
రూపొందగలరు.
10
▾
Meaning
Keep
ఏకాత్మభావాన్ని
విశ్వసిస్తే
మీకు
మరణము
లేదు,
మీకు
శిక్ష
లేదు,
మీకు
ఏవిధమైన
బాధలూ
ఉండవు.
మీరు
మీరుగానే
ఉంటారు.
‘నీవెవరయ్యా?’
అని
మిమ్మల్ని
ఎవరైనా
ప్రశ్నిస్తే,
దేహభావముతో
‘నేను
ఫలానివాడను’,
అని
చెప్పుకో
కూడదు.
ఆత్మభావముతో
‘నేను
నేనే’
అని
చెప్పుకో
కలగాలి.
ఇట్టి
ఏకాత్మభావమును
ఎవరు
అభివృద్ధి
పరచుకుంటారో
వారే
ధన్యులు.
మీకు
గురువైనా,
దైవమైనా
ఒక్కడే;
ఇద్దరు,
ముగ్గురు
లేరు.
‘ఫలాని
వ్యక్తి
నా
గురువు’,
అని
మీరనుకుంటారు.
కాని,
అతను
కేవలం
తాత్కాలికమైనటువంటివాడు;
కొద్ది
దినములలో
మార్పు
చెందుతాడు.
అప్పుడు
మీకు
గురువు
ఎవరు?
ఇవన్నీ
కేవలం
భ్రమలే!
మీకు
నిజమైన
గురువు
భగవంతుడు
ఒక్కడే!
అట్టి
దైవత్వమును
మీరు
పూర్తిగా
విశ్వసించండి.
“దైవం
మానుషరూపేణ”.
కాబట్టి,
మిమ్మల్ని
మీరు
దైవస్వరూపులుగా
భావించుకోండి.
ఇట్టి
దివ్యమైన
భావముతో
మీరు
జీవితాన్ని
గడిపినప్పుడు
దైవత్వము
తప్పక
మీలోనే
ఆవిర్భవిస్తుంది.
దైవము
బయట
ఎక్కడో
ఉన్నాడనే
భావమును
మార్చుకోండి.
దైవము
ఎల్లప్పుడు
మీలోనే
ఉన్నాడని
విశ్వసించండి.
మీచేత
ఆటలు
ఆడించి,
పాటలు
పాడించి,
ఎన్నో
విధములుగా
నాటకములాడించే
భగవంతుడు
ఒక్కడే!
అతనికి
పేర్లు
ఎన్నైనా
పెట్టుకోవచ్చు.
పేర్లు
మారినంత
మాత్రమున
దివ్యత్వము
మారదు.
ప్రేమస్వరూపులారా!
మీకు
నిజంగా
భగవంతుడు
కావా
లనుకుంటే,
ఏకాత్మభావమును
పెంచుకోండి.
అప్పుడే
మీరు
భగవంతుణ్ణి
చూస్తారు;
భగవంతుని
ప్రేమను
అనుభవిస్తారు.
Previous
←
Parents Are the Visible Embodiments of God
Next
The Veda, the Wealth of All Knowledge
→