Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Doing Good to Others Is the Highest Goal of Life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Doing Good to Others Is the Highest Goal of Life
19 November 2005, Ladies' Day, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
ఆడవారి
దినమని,
ఆడవారు
అధికమంది
చేరి,
ఎంతో
ఆనందము
అందించి,
ఆనందాన్ని
అనుభవిస్తూ
వచ్చారు.
ఇందులో
ఆడ,
మగ
అనే
భేదమే
లేదు.
కేవలము
ఉపాధిని
బట్టి
ఆడమగ
అని
చెబుతూ
వచ్చారుగాని
అందరియందు
ఉన్నది
బ్రహ్మతత్త్వమే.
సర్వం
ఖల్విదం
బ్రహ్మ.
దైవము
కావాలని
అందరూ
కోరుతూనే
ఉంటారు.
అనేకమంది
ఋషులు,
యోగులు,
సన్యాసులు
తపస్సు
చేసి
దైవాన్ని
దర్శించగోరారు.
కాని,
దైవము
ఎక్కడున్నాడు?
దైవం
మానుష
రూపేణ.
ఏ
అవతారము
చూసినప్పటికి
దైవము
మానుషరూపము
ధరించినప్పుడు
అందరి
మానవులను
రక్షిస్తూ
వచ్చాడు.
ప్రేమస్వరూపులారా!
దైవమునకు
ప్రత్యేకమైన
గుణములు,
ప్రత్యేకమైన
రూపములు
లేవు.
దైవము
అనంతరూపుడు.
ఒక్కటని
చెప్పటానికి
వీలులేదు.
ఒకానొక
సమయమందు
నారదుడు
నారాయణుని
‘మీరు
భూలోకమునకు
వచ్చి
దర్శనము
అనుగ్రహించండి’
అన్నాడు.
అప్పుడు
నారాయణుడు
చెప్పాడు,
‘బ్రహ్మశక్తి
ఉండినప్పటికి,
ఆ
బ్రహ్మశక్తి
యేమాత్రము
పనిచేయదు.
నెగిటివ్,
పోజిటివ్
రెండూ
ఉండినప్పుడే
వెలుతురు
వస్తుంది.
దైవము
పోజిటివ్గా
ఉన్నాడు.
కనుక,
జీవులను
అభివృద్ధి
పరచినప్పుడే
దైవము
అందులో
చేరి
అందరికి
ఆనందమునందిస్తాడు.’
అందువలన
నారదుడు,
ఋషులు
అందరూ
దైవానికి
అర్పితమైపోయి
నెగిటివ్,
పోజిటివ్
రెండూచేరి
మహాశక్తిమంతముగా
దైవము
దిగి
వస్తాడు.
కనుక,
దైవము
బ్రహ్మస్వరూపమే
కాదు
మానవ
స్వరూపము
కూడా.
అందరియందు
ఆ
బ్రహ్మ
ఉన్నాడు.
ఈశ్వర
స్సర్వ
భూతానాం.
సర్వభూతములందు
ఈశ్వరత్వమే
ఉంటున్నాది.
భర్త
అని
భావించినప్పుడు
అతను
భర్తగా
కనిపిస్తాడు.
కుమారుడు
అన్నప్పుడు
కుమారుడుగా
కనిపిస్తాడు.
కుమార్తె
అనుకున్నప్పుడు
కుమార్తెగానే
కనపిస్తుంది.
ఈనాడు
మా
యింటిలో
మనుమడు
పుట్టాడు
అంటారు.
ఆ
మనుమడు
కూడా
బ్రహ్మమే.
ఏది
పుట్టినా
అందులో
బ్రహ్మ
లీనమై
ఉంటాడు.
దైవము
ఒక్కడే
రాడు,
దైవముతోబాటు
జీవుడు,
జీవునితోబాటు
దైవము
రెండూ
ఏకమై
ఉంటారు.
దైవమునకు
ఒక
స్వరూపమనేది
లేదు.
రూపనామములు
జీవునికేగాని
దైవమునకు
లేవు.
ఎవరియందు
చూచినా
దైవమే.
మీరంతా
దైవస్వరూపులే.
దైవస్వరూపులై
దైవాన్ని
చూస్తున్నారు.
చిన్న
పక్షులున్నాయి.
ఈ
పక్షులయందుకూడా
దైవమున్నాడు.
దైవము
లేని
స్థానము,
దైవము
లేని
రూపము
ఎక్కడను
కనిపించదు.
కాని,
మనయొక్క
కోరికలు
ఆవిధంగా
ఉండటంచేత
భగవంతుడు
ఆ
రూపాన్ని
ధరిస్తుంటాడు.
మా
పిల్లవానిని
గొప్పగా
చదివించాలి,
పరదేశములకు
పంపాలి
అని
అనేక
విధములుగా
ఆశపడతారు
తల్లిదండ్రులు.
ఎవరినుండి
వచ్చినప్పటికి
ఆ
మాటలు
భగవంతుని
మాటలే.
శబ్దబ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి,
పరాత్పరమయి,
మాయామయి,
శ్రీమయి
అనే
బిరుదులుంటున్నాయి
భగవంతునికి.
కనుక,
ఎవరు
మాట్లాడినా
దైవమే
మాట్లాడుతున్నాడు
అని
అనుకోవాలి.
దూషణభూషణతిరస్కారములన్నీ
మానవుని
నోటినుండి
వస్తున్నాయి.
ఎవరైనా
మనలను
తిడితే
దైవమే
తిట్టాడు
అని
అనుకుంటే
మనస్సు
యేమాత్రము
చలనము
కాదు.
దైవము
ఈ
రూపములో
వచ్చి
యీవిధంగా
దూషించాడు.
కనుక,
కొట్టినను,
తిట్టినా
అంతా
దైవమే.
ఏది
జరిగినా
యిది
దైవమే
జరిపిస్తున్నాడనే
సత్యాన్ని
దృఢము
చేసుకోవాలి
హృదయములో.
ఎదుటి
వ్యక్తిని
వ్యక్తిగా
మనము
చూడకూడదు.
ఎవరు
మన
ఎదుట
వచ్చి
మాట్లాడినా
దైవమే
ఈ
రూపములో
వచ్చి
మాట్లాడుతున్నాడనే
విశ్వాసము
దృఢముగా
పెట్టుకోవాలి.
అట్లుకాక
యితను
పరాయివాడు,
అతను
పరాయివాడు
అనుకుంటే
మనకు
కోపము,
తాపము,
ఈర్ష్య,
అసూయ,
డంభము
మొదలైన
దుర్గుణములు
బయలుదేరుతాయి.
ఈ
బయటి
వ్యక్తులంతా
వేరు
అనే
భావము
రావటంచేత
యీవిధంగా
కోపము
వస్తున్నాది.
2
▾
Meaning
Keep
కనుక,
ఎవరు
మాట్లాడినా,
ఎవరు
యేమన్నప్పటికి
అంతా
దైవముయొక్క
శబ్దమే
అనే
ఏకత్వమును
అలవరచుకున్నప్పుడే
మానవుడు
ధన్యుడౌతాడు.
ఏ
పెద్దలు
దగ్గరకు
వెళ్ళియేమైనా
బోధించమంటే,
‘
నాయనా!
నిన్ను
నీవు
తెలుసుకో’
అని
చెబుతారు.
వచ్చినవారినందరిని
ఎవరు,
ఎక్కడనుండి
వచ్చావు
అని
ప్రశ్నిస్తుంటారు.
ఇలా
అడుగుతారుగాని
‘నేనెవరు?’
అని
ప్రశ్నించుకోరు.
అది
ప్రశ్నించుకున్నవారికే
సరైన
జవాబు
వస్తుంది.
భగవంతుడు
బోధించే
బోధలు
అట్టివి.
ఈ
దేహము
తానే
యిచ్చాడు,
నోట
పలికించేదీ
తానే,
నడిపించేదీ
తానే,
నవ్వించేదీ
తానే,
ఏడ్పించేదీ
తానే
కనుక,
అంతా
దైవముయొక్క
సంకల్పమేయని
భావించాలి.
ఒకానొక
సమయంలో
ఈశ్వరమ్మ
నాదగ్గరికి
వచ్చి,
‘స్వామీ!
నాకు
ఒక
కోర్కె
ఉంది’
అన్నది.
ఈ
సమయంలో
ఈశ్వరమ్మయొక్క
గుణములు
మనం
చెప్పాలి.
ఆమె
హృదయము
చాలా
మృదుమధురమైనది.
ఎప్పుడూ
సంతోషంగా
ఉండేది.
ఆమె
హృదయం
ప్రేమతో
నిండినటువంటిది.
అందువల్ల,
‘
స్వామీ!
చిన్నపిల్లలు
జబ్బుతో
ఉంటే,
తల్లులు
యేడ్చుకుంటూ
ఆ
పిల్లలను
ఎత్తుకొని
ఆసుపత్రికి
వేరే
గ్రామము
వెడుతున్నారు.
ఈ
చిన్న
పల్లెలో
జ్వరము
వచ్చిందా
అని
పలకరించేవారు
లేరు.
అక్కడికి
పోయినా
సరైన
మందు
యిచ్చేవారు
లేరు.
అందువల్ల
ఈ
గ్రామములో
చిన్న
ఆసుపత్రి
పెట్టండి’
అని
చెప్పేది.
‘ఇప్పుడు
కాదమ్మా.
దానికి
సమయం
వస్తుంది.
దేనికైనా
కాల
కర్మకర్తవ్యాలు
ఒక
స్వరూపము
పొందుతుంది.
కట్టి
చూపిస్తాను’
అన్నాను.
మరి
రెండవ
దినము
వచ్చింది.
‘స్వామీ!
మీరూ
బుక్కపట్నం
నడచి
వెళ్లి
చదవుకున్నారు.
అదేవిధముగా
చాలామంది
బీదపిల్లలు
పుస్తకాలు
తీసుకొని
పట్టణాలకు
వెడుతున్నారు.
కనుక,
ఈ
పిల్లలందరు
వేరే
ఊరికి
వెళ్ళకుండా
ఒక
చిన్న
స్కూలు
కట్టించండి’
అంది.
‘అవుతుంది,
అవుతుంది.
ఊరకవుండు,
నిరంతరము
చింత
చేయకు’
అన్నాను.
మరికొన్ని
దినములైన
తరువాత
వచ్చి,
‘
స్వామీ!
నీరుకావాలంటే,
చిత్రావతిలో
నీరు
వచ్చినప్పుడే
నీరుగాని
లేకపోతే
త్రాగటానికి
నీరులేదే.
కాబట్టి,
ఏదైనా
బావి
తవ్వించండి.
చిన్నచిన్న
పిల్లలు
బిందెలు
తీసుకొని
చిత్రావతికి
వెడుతుంటే
నాకు
చాలా
ఏడుపువస్తుంది’
అంది.
అక్కడకూడా
తవ్వితేనేగాని
రాదు.
చిత్రావతి
జీవనది
కాదు.
ఎప్పుడో
వర్షము
వస్తే
వస్తుంది
లేకపోతే
లేదు.
వర్షముపై
ఆధారపడి
ఉంది.
మానవునికి
నిరంతరము
నీరు
ఉండాలి.
నీరు
లేకపోతే
దేహముకూడా
ఎండిపోతుంది.
ఈవిధంగా
కోరికలు
కోరుతూ
వచ్చింది.
‘చూడు!
నీ
కోరిక
చాలా
చిన్నది.
కాని,
పెద్దగా
చేస్తాను’
అన్నాను.
ఆమె
పోయేముందుగానే
చెప్పాను,
‘నీవు
కోరినవన్నీ
తెప్పిస్తాను.
కనుక,
నీవేమీ
చింత
పెట్టుకోకు.
గ్రామము
వారందరికి
చదువులు
చెప్పిస్తాను.
వారందరికి
ఆరోగ్యము
నందిస్తాను.
ఏమీ
యోచన
చేయకు’
అని.
ఆమెకు
చెప్పినట్లుగానే
పుట్టపర్తిలో
ఒక
స్కూలు
కట్టించాను.
‘అయ్యో!
పాపం
కొంతమంది
మాత్రమే
పోతున్నారే
అందరూ
పోవటం
లేదే’
అనింది.
తరువాత
నేను
కాలేజీ
కట్టించాను.
‘స్వామీ!
నాకు
యిప్పుడు
సంతోషంగా
ఉంది’
అంది.
ఆ
కాలేజీయే
యూనివర్సిటీ
అయింది.
ముందు
నేను
ఈ
కొండపైన
చిన్న
ఆసుపత్రి
కట్టించాను.
ఒక
డాక్టరు
యిద్దరు
నర్సులు.
ఇక్కడా
ఉన్న
ఒక
భక్తుడు
సీతారామయ్య
అందులో
డాక్టరు.
తూర్పు
గోదావరి
జిల్లానుండి
అతనిని
రమ్మన్నాను.
ఆయన
భక్తుడు.
ఆయన
యిక్కడికే
వచ్చి
నిల్చాడు.
కట్టకడపటికి
ఆమె
కోరినదానికంటె
అధికముగా
చేశాను.
ఇప్పుడు
అదే
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రిగా
అయింది.
ఆమె
చిన్నచిన్న
కోరికలన్నీ
పెద్దగా
తీర్చి
ఆమెకు
తృప్తినిచ్చాను.
నేను
ఒక
దినము
చిత్రావతికి
పోయినప్పుడు
ఆడవారు
చేదుకొని
చేదుకొని
నీరు
కొద్దిగా
ఊరితే
ఆ
నీరు
తెచ్చుకుంటున్నారు.
అది
నేనే
చూశాను.
తరువాత
ఆమె
కూడా
ప్రార్థించింది.
అప్పుడు
నేను
400
మైళ్ళనుండి
నీరు
తెప్పించాను.
దానిపేరుకూడా
చిత్రావతే.
అక్కడనుండి
పైపుల
ద్వారా
నీరు
తెప్పించాను.
ఆమె
కోరినవన్నీ
నేను
యిచ్చాను.
ఆమె
స్వార్థము
కోసము
కాదు,
పరులకు
ఉపకారము
చేసే
నిమిత్తమే
ఆమె
ప్రార్థనలు
చేసింది.
3
▾
Meaning
Keep
His poems 456
Also in his talks
(1)
20 July 1997
Human values alone are true kin
ఏ
కించిత్తు
కోరికలు
కోరినా
దానికి
అఖండమైన
కోరికలుగా
రూపొందింపచేస్తారు
స్వామి.
రాజకీయములు
వచ్చిన
తరువాత
ఏ
గ్రామమునకు
అనుకూలములు
చేయలేదు.
గ్రామమునకు
కరెంటు
తెప్పించాను.
పుట్టపర్తిలో
ఎంతో
వెలుగుతో
దీపములుంటున్నాయి
అని
అనుకుంటూ
వచ్చారు.
ఇట్టి
జలసీలు
పెరుగుతూ
వచ్చాయి.
వారికి
కూడా
జలసీ
ఉండకూడదని
అన్ని
గ్రామములకు
సప్లై
చేయించాను.
వారియందు
యీ
దుర్గుణములు
ఉండకూడదని
నేను
తెప్పించాను.
నేను
నా
యిష్టము
వచ్చినట్లు
చేయటంకాదు,
ఇతరుల
యిష్టమును
తెలుసుకొని
సంతృప్తిపరుస్తూ
వచ్చాను.
మీరు
చూడండి,
ఇంత
పెద్ద
హాలులో
యింత
మంది
కూర్చున్నారంటే
ఎవరు
చేసింది?
నాకోసమా
యిది?
‘పరోపకారపుణ్యాయ
పాపాయ
పరపీడనం’
అనేది
అందరికి
ముఖ్యమైనది.
హెల్ప్
ఎవర్,
హర్ట్
నెవర్.
అందరికీ
సహాయము
చేస్తూపోవాలి.
కాని,
నీ
స్వార్థం
కోసం
చేయకూడదు.
మనము
ఎప్పుడూ
స్వార్థముగా
ఉండకూడదు.
Fish
is
better
than
selfish.
ఈనాడు
ఎక్కడ
చూసినా
స్వార్థం.
ఈ
రాజకీయాలు
ఎక్కడనుంచి
వచ్చాయోగాని
దుర్గుణము
ప్రపంచమంతా
ప్రాకుతూ
వచ్చింది.
కనుక,
ఈ
రాజకీయములు
లేకపోతే
అందరూ
సుఖిస్తారు.
చిన్నచిన్నవారంతా
బయలుదేరుతున్నారిప్పుడు.
బీడిలకొట్టువాడుకూడా
రాజకీయములలో
దిగుతున్నాడు.
రాజకీయములు
అంటే
ఏమిటి
అని
దీని
అర్థము
గుర్తించి
వర్తించాలి.
ఎవ్వరూ
గుర్తించటంలేదు.
నేను
ఫైనాన్సు
మినిష్టరు
అన్నాడు.
ఫైనాన్సు
అంటే
యేమిటి?
అర్థమే
తెలియదు.
ఎవరికి
కావలసినా
నా
దగ్గరకే
రావాలి
అనే
అహంకారముతో
మెలగుతుంటారు.
కనుక,
ఏమీ
తెలియని
మూర్ఖులుకూడా
రాజకీయములలో
దిగుతున్నారు.
ఉపకారము
చేసే
వారందరు
వారికి
అపకారము
చేస్తున్నారు.
కనుక,
మీరెవ్వరూ
రాజకీయములలో
చేరకండి.
నీ
స్వశక్తిపైన
నీవు
ఆధారపడి
ఉండు.
ఇంటియింటికీ
ఓటుకోసమై
పోతుంటే
మీరు
చిన్న
అయిపోతున్నారు.
దైవముపైన
ఆధారపడండి.
దైవముపై
ఆధార
పడినప్పుడు
అందరి
మనస్సులు
తానే
తిప్పుతాడు.
గాడ్
ఈజ్
ఎవ్విర్థింగ్.
కనుక,
దైవముపై
ఆధారపడండి.
అప్పుడే
మీరు
జయాన్ని
పొందుతారు.
మీరు
దేనిని
మీకోసమై
ఆశించకూడదు.
స్వార్థము
వుంటే
సహాయము
చేయలేవు.
పదిమందికి
ఉపకారము
చేయాలనే
భావన
మీలో
రావాలి.
కనుక,
మీకు
మంచి
గుణములు
రావాలి.
త్యాగమయమైన
సేవ
చేయాలి.
అందుకోసమే,
‘కర్మణ్యేవ
అధికారస్తే
మా
ఫలేషు
కదాచన’
అని
చెప్పింది
గీత.
మీకు
యేది
కావలసినా
స్వయంగా
ప్రయత్నం
చేయండి.
మీపైనే
ఆధారపడిన
మీ
కుటుంబాన్ని
చక్కగా
చూడండి.
వారిని
వీరిని
వర్ణించటానికి
నేను
చెప్పటం
లేదు.
మీకు
మీరు
అభివృద్ధికండి.
మీ
కుటుంబము
మంచి
అభివృద్ధిలోకి
రావాలంటే
దైవాన్ని
అర్థించాలి.
ఎక్కడ
చూచినా
దైవమున్నాడు.
చుక్కలన్నియు
బ్రహ్మ
సూర్యుండు
అది
బ్రహ్మ
చంద్రుడన్నను
బ్రహ్మ
జలము
బ్రహ్మ
స్వర్గమన్నను
బ్రహ్మ
వైకుంఠమది
బ్రహ్మ
తల్లియన్నను
బ్రహ్మ
తండ్రి
బ్రహ్మ
భాగ్యమన్నను
బ్రహ్మ
వాల్లభ్యమది
బ్రహ్మ
జీవరాసులు
బ్రహ్మ
జీవి
బ్రహ్మ
పుట్టించుటది
బ్రహ్మ
పోషించుటది
బ్రహ్మ
గిట్టించుటది
బ్రహ్మ
గృహిణి
బ్రహ్మ
కర్మలన్నియు
బ్రహ్మ
కాలంబు
బ్రహ్మ
ప్రకృతంతయు
బ్రహ్మ
ఆదిశక్తి
బ్రహ్మ
సర్వమును
బ్రహ్మ
మరియు
ఈ
సభయు
బ్రహ్మ
సత్యమును
తెల్పు
ఈ
సత్యసాయి
బ్రహ్మ.
4
▾
Meaning
Keep
Also in his talks
(2)
28 October 2003
Loving the Ātma principle is spirituality itself
6 October 2005
My Children Are My Life
గుంత
తవ్వితే
గుట్ట
అవుతుంది.
ఈ
తీసిన
మట్టంతా
గుట్టగా
మారిపోతుంది.
ఆ
మట్టి
గుంతలో
పోయండి.
గుట్ట
పోతుంది.
గుంతకు,
గుట్టకు
యేమి
భేదము?
మట్టే
భేదము.
అదేవిధముగా
మీ
హృదయమును
దైవముతో
నింపుకుంటే
అదే
ఒక
గుట్టగా
ఉంటుంది.
హార్టు
అంటే
ఈ
గుండె
కాదు.
హృదయము.
అందుకోసమే
భగవంతుని
హృదయవాసి
అని
పిల్చారు.
హృదయము
అందరియందు
ఉంటున్నది.
కనుక,
ప్రతి
ఒక్కరియందున్న
హృదయము
విశాలము
చేసుకోవాలి.
అప్పుడు
మనలో
విశాలమైన
భావాలే
వస్తాయి.
చిన్న
హృదయమైతే
చిల్లర
బుద్ధులే
వస్తాయి.
మనం
చిల్లర
మానవులం
కాదు.
దైవం
మానుష
రూపేణ.
కనుక,
మంచి,
పవిత్రమైన
హృదయము
కల్గిన
మానవులుగా
కావాలి.
కనుక,
నేను
భజన
చేయించేదిగాని,
ఉపన్యాసములు
యిచ్చేదిగాని
హృదయం
పెరగాలని.
తెల్లవారి
నగర
సంకీర్తనలో
పోయినప్పుడు
హృదయము
ఉప్పొంగుతుంది.
ఊరకే
పాడటం
కాదు.
సంకీర్తన.
విశాలమైన
భావముతో
కీర్తన
చేయాలి.
నీవు
ఒక్కడే
అనుభవించకుండా
పదిమందికి
పంచాలి.
అందరికి
ఈ
నామాన్ని
పంచితే
ఎంతయో
హృదయము
ఉప్పొంగిపోతుంది.
నీవు
ఏది
చేసినా,
ఏది
చెప్పినా,
ఏది
చూసినా
హృదయం
పెరగాలి.
అప్పుడే
నేను
‘
గొప్పహృదయుడు’
అని
పిలువవచ్చును.
అప్పుడే
మీరు
మానవత్వాన్ని
సార్థకము
చేసుకున్నవారౌతారు.
కనుక,
మీరు
హృదయమును
అభివృద్ధి
పరచుకొని,
పెద్ద
మనస్సు
చేసుకొని
ఆ
పెద్దమనస్సును
ప్రజలందరికి
పంచాలి.
కాని,
ఇప్పుడు
స్వార్థం,
తన
హృదయాన్ని
తాను
బాగుచేసుకోకుండా,
తన
హృదయములో
యెన్ని
దోషములున్నా
మర్చిపోయి
తానే
పెద్దగా
ఉండాలి,
నా
కుటుంబమే
క్షేమంగా
ఉండాలి,
ఒక్క
నా
కుటుంబము
మాత్రమే
సంపదతో
ఉండాలి.
ఇది
చాలా
చెడ్డది.
నీవలెనే
అందరూ
కోరుకుంటారు
కదా!
నీకున్న
కోరికే
వారికి
కూడా
ఉంటుంది.
కనుక,
love
is
one,
live
in
love.
ఇదే
నిజమైన
ప్రేమ.
ప్రేమ
అంటే
నా
భర్త,
నా
బిడ్డలు,
నా
భార్య,
నా
బంధువులు
మాత్రమే
క్షేమంగా
ఉండాలని
సంకుచిత
భావం
రాకూడదు.
అందరూ
ఒక్కటిగానే
ఉండాలి.
అందరూ
ఒక్కటిగానే
ఉండాలంటే
ఎట్లా
ఉండాలి.
అందరియందు
నాయొక్క
దేవుడే
ఉన్నాడు.
అతను
లేక
నేను
ఉండటానికి
వీలులేదు
అని
సర్వత్రా
భగవచ్చింతన
గావించాలి.
నాకు
బాధ
కలిగితే
నేను
యెంతబాధపడతానో,
యితరులను
బాధపెడితే
అంత
బాధ
పడతారు
అనే
భావముతో
ఉండాలి.
ఈ
అన్నింటికి
ప్రేమ
ఒక్కటే.
కనుక,
అందరూ
ప్రేమను
పెంచుకోండి.
ఆ
ప్రేమ
నీది
మాత్రమే
కాదు.
నాకు
వచ్చిన
బాధలు
యెవరికీ
కలగకూడదు.
నా
వలె
యితరులు
బాధ
పడకూడదు.
అందరూ
సంతోషంగా
ఉండాలి.
అందరూ
అభివృద్దిగావాలి.
కనుక,
ఇది
రావాలంటే
ప్రేమను
పెంచుకున్నప్పుడు
యేవిధమైన
సంకుచిత
భావమూ
రాదు.
ప్రేమ
ముదిత
మనసె
కహో
రామరామరాం.........
Previous
←
Sāttvic Food and Good Company Are Essential
Next
True Education Fosters Selfless Prema
→