Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · To earn the love of God, love all
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
To earn the love of God, love all
1 May 2008, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 165
Also in his talks
(1)
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
ప్రాచీన
ఋషులకు
పాఠముల్
నేర్పించ
జాలిన
వేదాంత
సారమతులు
నిర్జీవ
శిలలచే
నృత్య
మాడించంగ
నేర్పు
గల్గిన
కళా
నిపుణమతులు
పరవీర
శిరములు
బంతులాడించుచు
క్రీడింపగల్గిన
వాడి
మగలు
సర్వ
సర్వంసహాచక్ర
పాలన
చేసి
నడిపించగల్గిన
నాయకులును
కలరు
భారతభువిని
పెక్కండ్రు
నేడు
ఉండి
ఫలమేమి
వారిలో
నొక్కడైన
అనుదినంబును
వినిపించు
ఆర్తరవము
ఆలకింప
దలంపరో
ఆర్యులార!
ఖండ
ఖండాంతర
ఖ్యాతినార్జించిన
మహనీయులను
గన్న
మాతృభూమి
మన
భారత
దేశము.
పాశ్చాత్య
వీరులను
పారద్రోలి
స్వాతంత్ర్యమును
పొందినవారు
భారతీయులు.
పర
దేశములవారికి
వేద
శాస్త్ర
పురాణములయొక్క
మర్మాలను
విప్పి
చెప్పినవారు
భారతీయులు.
అట్టి
భారతీయులు
నేడు
ఆధ్యాత్మిక
తత్త్వమును
పూర్తిగా
మరచిపోయి
అన్నివిధములుగా
చెడిపోతున్నారు.
వేదము
‘మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ,
అతిథిదేవో
భవ”
అని
బోధించింది.
‘సత్యం
వద,
ధర్మం
చర’
అని
చెప్పింది.
కాని,
ఈనాడు
అవి
ఎక్కడకూడను
కనిపించడం
లేదు,
వినిపించడం
లేదు.
2
▾
Meaning
Keep
ఎక్కడ
చూసినా
ఆశ,
ఆశ,
ఆశ...
దురాశలు
ఎక్కువైపోయినవి.
ఇంద్రియాల
దుర్వినియోగంవల్ల
అనేకరకములైన
పాపాలకు
పాల్పడుతున్నారు,
మానవులు.
ఆశలు
ఉండవలసిందే.
కాని,
వాటికి
ఒక
పరిమితి
ఉండాలి.
కాని,
ఈనాడు
ఆశలు
పరిమితం
లేకుండా
పెరిగి
పోతున్నవి.
అంతేకాదు.
తినేతిండి,
త్రాగేనీరు,
పీల్చేగాలి
అన్నీ
కలుషితమైనాయి.
ఈ
పంచభూతాలవల్లనే
మానవుడు
బ్రతుకగలుగుతున్నాడు.
ఇవి
విషమయమైనప్పుడు
తాను
జీవితాన్ని
ఏరీతిగా
గడుపగలడు?!
మానవుడు
ఎందుకోసం
పుట్టాడు?
అసలు
మానవుడంటే
ఎవరు?
దైవస్వరూపుడు.
ఇటువంటి
పవిత్రమైన
జన్మనెత్తి
దోషమయమైన
మార్గంలో
ప్రయాణం
చేస్తుంటే
తాను
మానవుడు
ఎట్లవుతాడు?
ఎంత
చదువు
చదివినా,
ఎన్ని
డిగ్రీలు
తీసికొన్నా,
ఎంత
గొప్ప
హోదాలో
ఉన్నా
సత్యము,
ప్రేమ
లేనివాడు
మానవుడే
కాదు.
ఈనాటి
చదువులో
ఏమాత్రము
సారము
లేదు.
ధనమును,
కాలమును
వ్యర్థం
చేసి
ఇలాంటి
చదువులు
చదివి,
ఇలాంటి
గ్రంథాలు
పఠించి
ఏమి
ప్రయోజనం?
జపము,
ధ్యానము,
యోగము,
యజ్ఞము
మొదలైన
సాధనలు
ఎన్ని
చేసినప్పటికీ
సత్యము,
ప్రేమ
రెండూ
లేకపోతే
అన్నీ
వ్యర్థమే!
ఈనాటి
మానవుడు
సత్యమును,
ప్రేమను
పూర్తిగా
మరచిపోతున్నాడు.
అతని
మాటలు
చూస్తే
తీయగా
ఉంటాయి,
మనస్సు
చూస్తే
చేదుగా
ఉంటుంది.
పైకి
నవ్వినట్లుగా
కనిపిస్తాడుకాని,
లోపలంతా
విషం
నింపుకుంటున్నాడు.
ఇలాంటి
పరిస్థితిలో
మానవునికి
శాంతి
ఏరీతిగా
లభిస్తుంది?
“సత్యాన్నాస్తి
పరో
ధర్మః”
కాబట్టి,
మనము
సత్యమును
పాటించినప్పుడే
దాని
నుండి
ధర్మము
ఆవిర్భవించి
మనకు
అన్నివిధాలుగా
శాంతి
చేకూర్చుతుంది.
శారీరకంగా,
మానసికంగా,
ఆధ్యాత్మికంగా
సమస్త
కర్మలయందును
మనము
శాంతిని
అనుభవించవచ్చును.
శాంతివల్లనే
మనలో
ప్రేమ
అభివృద్ధి
అవుతుంది.
ప్రేమ
వచ్చినప్పుడు
హింస
అన్నదే
ఉండదు.
కనుక,
ప్రేమ
లభించాలంటే,
మొట్టమొదట
సత్యాన్ని
పాటించాలి.
కాని,
ఈనాడు
ప్రతి
చిన్న
విషయమునందుకూడను
అసత్యము,
అసత్యము,
అసత్యము!
ఇంతియేకాకుండా,
దీనిపైన
క్రోధము
ప్రవేశించి
సత్యాన్ని
పూర్తిగా
మాలిన్యపరుస్తున్నది.
మానవుడు
తరించే
నిమిత్తమై
వచ్చాడుగాని,
ఆలుబిడ్డలతోనూ,
అన్నపానాదులతోనూ
కాలం
గడపటానికి
రాలేదు.
3
▾
Meaning
Keep
ఇది
కాదు
మానవత్వము.
మానవత్వమనగా
ఏ
ఆశలూ
లేనటువంటి
దివ్యత్వము.
ప్రేమస్వరూపులారా!
ఈ
ప్రపంచంలో
ఎక్కడ
చూసినా
శాంతి
అన్నది
మనకు
కనిపించదు.
అసలు
శాంతి
ఎక్కడ
ఉంది?
శాంతికి
స్థానము
బయటి
ప్రదేశం
కాదు.
శాంతి
మనలో
ఉంది;
మన
మాటలో
ఉంది;
మన
హృదయంలో
ఉంది.
జపములు,
తపములు,
యోగములు,
యాగములు,
యజ్ఞములు
ఎన్ని
చేసినప్పటికీ
వాటిలో
మనకు
శాంతి
చిక్కదు.
మొట్టమొదట
హృదయాన్ని
చల్లబరచుకోవాలి.
ఈనాడు
లోకములో
ఎక్కడ
చూసినను
కలహములే,
కలహములే!
ఎంతో
సన్నిహితంగా
ఉండే
స్నేహితుల
మధ్యకూడను
ఏదో
ఒక
చిన్న
విషయంలో
కలహము
ఏర్పడుతున్నది.
నిజమైన
స్నేహితుడు
ప్రపంచంలో
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఈ
కలహములకు
కారణం
మానవుని
హృదయంలో
ఉన్న
చెడు
గుణములే!
మన
హృదయం
పవిత్రంగా
ఉండాలి.
దానియందు
చిన్న
చీమంత,
ఈగంత
మాలిన్యముకూడా
చేరకుండా
చూసుకోవాలి.
నైతిక
విలువలు
లేనివాడు
మానవ
రాక్షసుడు
మానవుడు
ఎంతో
ధనము
సంపాదిస్తున్నాడు.
కాని,
ఈ
ధనము
దేనికోసం?
పోయేటప్పుడు
ఏమి
తీసికొనిపోతున్నాడు?
ఏమీ
లేదు.
వట్టి
చేతులతోనే
పోతున్నాడు;
తన
దేహమునుకూడను
వదలిపెట్టి
పోతున్నాడు.
పంచభూతములు
పంచభూతములలో
చేరిపోతున్నాయి;
ఖాళీ
తోలుతిత్తివంటి
దేహాన్ని
అగ్గిపెట్టి
కాల్చివేస్తున్నారు.
కాబట్టి
దేహాన్ని,
ధనాన్ని
చూసుకొని
అహంకారంతో
విఱ్ఱవీగటం
మంచిది
కాదు.
Money
comes
and
goes,
morality
comes
and
grows.
కాబట్టి,
నైతిక
విలువలను
మనం
పెంచుకోవాలి.
ఎంతటి
విద్యావంతుడైనప్పటికీ
నైతిక
విలువలు
లేనివాడు
మానవుడే
కాదు,
వాడు
మానవ
రాక్షసుడు!
పెద్దలను
గౌరవించాలి.
తల్లిదండ్రులపట్ల
కృతజ్ఞత
చూపాలి.
కాని,
ఇలాంటి
కృతజ్ఞతగాని,
గౌరవ
భావముగాని
మానవునియందు
కనిపించడం
లేదు.
ఈనాటి
మానవుడు
తన
తల్లినీ
ప్రేమించడం
లేదు,
తండ్రినీ
ప్రేమించడం
లేదు.
ఎవ్వరినీ
ప్రేమించడం
లేదు.
“వీరినెందుకు
గౌరవించాలి?
వీరినెందుకు
ప్రేమించాలి?”
అని
ఈవిధంగా
ఆలోచిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
ఎక్కడ
పోయినప్పటికీ
ధనము,
ధనము,
ధనము!
మనం
కోరవలసిన
ధనము
ప్రేమయే!
ఆ
ప్రేమను
సంపాదించుకొన్నప్పుడు
సర్వమూ
మన
హస్తగతమైపోతుంది.
అసలు
మానవుని
హస్తములోనే
సర్వమూ
ఉంటున్నది.
మానవునియందే
సర్వదేవతలూ
సంచరిస్తున్నారు;
ఆపాదమస్తకమూ
ఒక్క
దైవత్వమే
ఉంటున్నది.
అట్టి
దైవత్వాన్ని
విస్మరించి
అప్పటికప్పుడు
వచ్చిపోయే
‘పాసింగ్
క్లౌడ్స్’ను
చూసి
ఆనందించడము,
గర్వించడమూ
చాలా
పొరపాటు.
అదే
పెద్ద
పాపము.
దైవము
తప్ప
లోకములో
ఏదీ
మనకు
సుఖమునివ్వదు
ప్రజలారా!
ప్రపంచములో
మనకు
సుఖము
నిచ్చేది
ఒక్కటీ
లేదు.
కొంతమంది
“ఎప్పుడు
చూసినా
దైవం,
దైవం,
దైవం
అంటావు.
ఆ
దైవం
నీకేం
చేస్తున్నాడు?”
అని
మిమ్మల్ని
అడుగుతారు.
ఒక్క
దైవము
తప్ప
ఏదీ
మనకు
సుఖము
నివ్వదు.
దైవమే
మనకు
సర్వరక్షకుడు.
ఆ
దైవాన్ని
స్మరిస్తూ
ఉంటే
సర్వదుఃఖములూ
నివారణైపోతాయి.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”.
దైవానికి
ఈ
పేరు,
ఆ
పేరు
పెట్టుకోవడం
కేవలం
మన
తృప్తికోసమే!
పేర్లు
ఎన్నైనా
అవన్నీ
ఒక్క
దైవానివే.
అలాంటి
దైవాన్ని
మీ
హృదయంలో
ప్రతిష్ఠించుకోండి.
దైవమే
సర్వమూ
చేస్తున్నాడు.
మిమ్మల్ని
తిట్టేదీ
దైవమే,
పొగిడేదీ
దైవమే,
శిక్షించేదీ
దైవమే,
రక్షించేదీ
దైవమే.
కాబట్టి,
ఏ
కష్టములు
వచ్చినప్పటికీ,
“ఇదంతా
దైవముయొక్క
వరప్రసాదమే.
ఈ
బాధలన్నీ
భవిష్యత్తులో
నా
సుఖంకోసమే
ఇస్తున్నాడో
ఏమో”
అని
భావించాలి.
“నసుఖాత్
లభతే
సుఖం.”
సుఖమునుండి
మనకు
సుఖము
లభించదు,
కష్టమునుండియే
సుఖము
లభిస్తుంది.
Pleasure
is
an
interval
between
two
pains.
రెండు
బాధల
మధ్యలోనే
ఒక
సుఖము
చిక్కుతుంది.
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేక
మనసును
కష్టపెట్టుకుంటే
జీవితంపైన
విరక్తి
పుడుతుంది;
దేహంపైన
విసుగు
వచ్చేస్తుంది;
జీవించడమే
వ్యర్థమనిపిస్తుంది.
దీనికంతటికీ
కారణం
మనస్సే!
మితిమీరిన
వాంఛలే!
ఎవ్వరినీ
మనము
బాధించకూడదు,
హింసించకూడదు.
అందరినీ
ప్రేమించాలి,
అందరికీ
సేవ
చేయాలి.
దానిలో
మనకు
ఎంతో
సత్ఫలితం
వస్తుంది.
ఎవరికైనా
మనం
సహాయం
చేస్తే
ఆ
సహాయమే,
అవసరమైనప్పుడు
మనకు
సహాయం
చేస్తుంది.
5
▾
Meaning
Keep
ఈనాటి
ప్రపంచములో
‘హెల్ప్’
(సహాయం)
అనేది
కనిపించడం
లేదు.
ఎక్కడ
చూసినా
‘సెల్ఫ్,
సెల్ఫ్,
సెల్ఫ్’
(స్వార్థం,
స్వార్థం,
స్వార్థం)!
“నాది,
నావారు”
అనే
సంకుచిత
భావంతో
మానవుడు
పరుల
క్షేమాన్ని
విస్మరిస్తున్నాడు.
అసలు
పరులనేవారే
లేరు.
“విశ్వం
విష్ణు
స్వరూపం”.
“దైవం
మానుషరూపేణ”.
కనుక,
ప్రతి
మానవుని
దైవంగా
భావించాలి.
శారీరకంగాను,
మానసికంగాను
ఎవ్వరినీ
బాధపెట్టకూడదు.
ఒకరిని
బాధపెట్టడంవలన
నీకు
అప్పటికప్పుడు
తృప్తిగా
ఉండవచ్చు.
కాని,
దాని
ఫలితం
మున్ముందు
అనుభవించక
తప్పదు.
ఈ
సత్యాన్ని
నీవు
గుర్తించలేకపోతున్నావు.
దోసకాయ
తింటే
మామిడిపండు
త్రేపు
రాదు.
ఏది
తింటామో
అదే
త్రేపు
వస్తుంది.
అదేరీతిగా,
నీవు
చేసినటువంటిది
ఏనాటికైనా
అనుభవించక
తప్పదు.
కనుక,
నీవు
మంచి
చేసి,
మంచి
చూసి,
మంచి
చెప్పి
మంచి
అనుభవించి
మంచిగా
ఉండు.
భగవంతుడు
చెప్పినది
అనుసరిస్తే
నీకు
అంతా
మంచే
జరుగుతుంది.
కష్టములన్నీ
అద్దములవంటివి.
వీటియందు
మన
ప్రతిబింబాలు
కనిపిస్తుంటాయి.
ప్రేమస్వరూపులారా!
మీరు
నిరంతరము
ఏవో
కొన్ని
ఆశలు
పెట్టుకొని
అవి
తీరకపోతే
ఊరకే
బాధపడిపోతున్నారు.
ఈ
బాధలకు
ఏమాత్రము
అవకాశమివ్వకండి.
“ఏదో
కారణంచేతనే
మనకీ
బాధలు
కలుగుతున్నవి.
విత్తనము
లేకుండా
మొక్క
రాదు.
అట్లే,
కారణము
లేక
కార్యము
జరుగదు”
అని
గుర్తించండి.
ఎవరిని
చూసినా
“వీరు
మనవారే”
అనే
భావన
పెట్టుకోండి.
వారిలో
మిమ్మల్ని
మీరు
చూసుకోండి.
“నీవెవరు?”
అని
అడిగితే
“నేను
ఫలాని
వాణ్ని”
అని
అంటావు.
“నీ
పేరేమి?”
అని
అడిగితే
“నా
పేరు
నాగప్ప”
అంటావు.
ఈవిధంగా
అందరూ
వేర్వేరు
పేర్లు
పెట్టుకుంటున్నారు.
కాని,
ప్రపంచమంతా
వచ్చి
భగవంతుణ్ని
అడగండి,
“నీవెవరు?”
అని.
“నేను
నేనే”,
“అహం
బ్రహ్మాస్మి”
అని
అంటాడు.
ఈ
విశ్వమంతా
బ్రహ్మమయమే.
బ్రహ్మ
లేనటువంటి
స్థానము
ఎక్కడా
కనిపించదు.
కాబట్టి,
మనం
ఎవరిని
దూషించినా,
భూషించినా,
తిరస్కరించినా
అన్నీ
దైవానికే
చెందుతాయి.
6
▾
Meaning
Keep
ప్రతి
ఒక్కటీ
మన
సంకల్పములయొక్క
ఫలితమే!
మనం
మాట్లాడే
మాటలు
గాలిలో
చేరిపోతున్నాయి.
అటువంటి
మాటలు
మాట్లాడి
ప్రయోజనమేమిటి?
హృదయానికి
చేరేటటువంటి
ప్రేమమయమైన
మాటలు
మాట్లాడాలి.
మన
సంకల్పములన్నీ
సత్యమయమైనవిగా
ఉన్నప్పుడే
మన
జీవితము
ప్రేమమయంగా
మారుతుంది.
జీవితాన్ని
ప్రేమమయం
గావించుకొని,
ప్రేమతోనే
అంత్యము
చేసుకోవాలి.
ఎవరైనా
తిడితే,
తిట్టుకోనీయండి.
తిట్టినవి
గాలికి
పోతాయి.
“నన్ను
కాదు,
తనను
తాను
తిట్టుకుంటున్నాడు”
అని
భావించండి.
ఏది
చేసినా
మనకు
మనమే
చేసుకొంటున్నాము.
మనకు
జరిగే
కీడుగాని,
మేలుగాని,
మంచిగాని,
చెడ్డగాని
ప్రతి
ఒక్కటీ
మన
సంకల్పముల
యొక్క
ఫలితమే.
కాబట్టి,
ప్రతి
ఒక్కరినీ
మనము
ప్రేమించాలి.
ప్రేమించకపోతే
ఊరకే
ఉండాలిగాని,
ఎవ్వరినీ
దూషించకూడదు.
ఎవ్వరినీ
విమర్శించడానికి
మనకు
అధికారమే
లేదు.
అందరియందు
ఉన్నది
ప్రేమ
ఒక్కటే.
ప్రేమను
ప్రేమ
విమర్శిస్తుందా?
‘నో,
నో’!
ఎప్పటికీ
విమర్శించదు.
ప్రేమ
అందరినీ
ప్రేమిస్తుంది.
పశువుకూడను
తన
బిడ్డను
ప్రేమిస్తుంది.
పక్షికూడను
తన
బిడ్డను
ప్రేమిస్తుంది.
ఇన్ని
మంచి
గుణములు
కలిగిన
మానవుడు
సాటి
మానవుణ్ని
ప్రేమించకూడదా?
దైవప్రేమను
మనము
సంపాదించాలంటే
సర్వులను
ప్రేమించాలి.
సత్యముచేతనే
ప్రేమ
లభిస్తుంది.
సత్యము,
ప్రేమ
రెండూ
చేరితే
శాంతి
లభిస్తుంది.
శాంతిచేతనే
అహింస
ఏర్పడుతుంది.
కనుకనే,
సత్యమును,
ప్రేమను
ప్రధానంగా
పెట్టుకోవాలి.
ఏ
తపములు
చేసినా,
జపములు
చేసినా,
యజ్ఞములు
చేసినా,
యాగములు
చేసినా
అన్నీ
ప్రేమతోనే
చేయాలి.
దేహ
ప్రేమ
కాదు,
మనకు
హృదయ
ప్రేమ
ప్రధానం
భగవంతుడే
నీకు
పుత్రుడై
పుడుతున్నాడు;
పుత్రికయై
పుడుతున్నాడు;
సోదరుడుగా
ఉంటున్నాడు.
భగవంతుడే
నీకు
సర్వవిధములైన
బంధువుగా
ఉంటున్నాడు.
అన్ని
ఆపదలలోనూ
మనలనాదుకొనే
నిజమైన
బంధువు
భగవంతుడే!
అందుకోసమే
భగవంతుణ్ని
‘ఆపద్బాంధవుడు’
అని
అంటారు.
భగవంతునితో
మనకుగల
బంధము
దేహసంబంధమైనది
కాదు.
దేహ
సంబంధమైన
ప్రేమ
క్షణక్షణమునకూ
మార్పు
చెందుతుంది.
7
▾
Meaning
Keep
పెండ్లి
అయిన
తొలిరోజుల్లో
భార్యాభర్తలు,
“నీవు
నేనే,
నేను
నీవే”
అనే
భావంతో
ఒకరినొకరు
ఎంతో
ప్రేమగా
చూసుకొంటారు.
ఆ
తరువాత
“నేను
నేనే,
నీవు
నీవే”
అన్నట్లుగా
ఉంటారు.
పెండ్లి
అయిన
ఒక
వారం
రోజుల
తరువాత
భార్యాభర్తలు
బజార్లో
నడుస్తూ
పోతుంటే
దోవలో
భర్తకు
ఒక
ముల్లు
కనిపించిందంటే,
‘ముల్లు,
ముల్లు,
ముల్లు’
అంటూ
ఆమె
చేయి
పట్టుకొని
ప్రక్కకు
లాగుతాడు.
అంత
ప్రేమ
అన్నమాట!
మరొక
వారం
రోజుల
తరువాత
మళ్ళీ
ఇద్దరూ
కలసి
బజార్లో
వెళుతున్నప్పుడు
ఇంకొక
ముల్లు
కనిపిస్తే,
“అక్కడ
ముల్లుంది,
చూసుకో”
అని
హెచ్చరిస్తాడు.
మరికొన్ని
దినాల
తరువాత
మళ్ళీ
దారిలో
ముల్లు
కనిపిస్తే
“నీకు
కళ్ళు
కనిపించడం
లేదా?
అక్కడ
ముల్లుంది”
అంటాడు
కోపంగా.
ఈవిధంగా
దేహసంబంధమైన
ప్రేమ
కొద్దిరోజులలోనే
మార్పుచెందుతుంది.
ఈ
ప్రేమను
నమ్ముకొని,
ఈ
ప్రేమలోనే
బ్రతుకుతూ
ఉంటే,
ఎంతకాలం
ఆనందంగా
ఉండగలము?
ఇట్టి
దేహసంబంధమైన
ప్రేమ
ప్రేమ
కాదు.
ఈ
రెండు
దేహాలుకూడను
కేవలం
నీటిబుడగలవంటివి.
అది
ఎప్పుడు
పగులుతుందో!
ఇది
ఎప్పుడు
పగులుతుందో!
దాంట్లో
గాలే
ఉంది,
దీంట్లో
గాలే
ఉంది.
ఈ
గాలి
గాలిలో
చేరిపోతుంది.
కనుక,
మనకు
దేహ
ప్రేమ
కాదు,
హృదయ
ప్రేమ
ప్రధానం.
ఈ
ప్రేమ
డైరెక్టుగా
భగవంతునికి
చేరిపోతుంది.
సామూహిక
భజన
విశిష్టత
ఇప్పుడు
ఇంతమంది
భజన
చేస్తున్నారు.
అందరూ
భక్తి,
శ్రద్ధలతో
చేస్తున్నారా?
అందరికీ
ముక్తి
లభిస్తుందా?
లేదు,
లేదు.
ఐతే,
ఇంతమంది
ఒకేచోట
చేరి
భజన
చేస్తే,
వీరిలో
ఏ
కొంతమంది
ప్రార్థనలైనా
భగవంతునికి
చేరిపోతాయి;
ఏ
కొంతమందియొక్క
ప్రేమ
అయినా
భగవంతునికి
అందుతుంది
అనే
ఆశ
చేతనే,
సమష్టి
ప్రేమను
పెంచడంకోసమనే
భజనలు
చేస్తున్నాము.
సామూహిక
భజన
గురునానక్
ప్రారంభించాడు.
“ఇంతమంది
భజన
చేస్తున్నారు.
దీనిని
భగవంతుడు
వింటున్నాడా?”
అని
ఎవరో
ప్రశ్నించేటప్పటికి
ఆయన,
“ఇంతమందిలో
ఏ
ఒకరిద్దరి
ప్రేమ
అయినా
భగవంతునికి
చేరుతుంది.
ఆ
ఒకరిద్దరి
ప్రేమనే
చాలు,
అందరినీ
రక్షిస్తుంది”
అని
అన్నాడు.
కనుకనే,
మనము
సమష్టిగా
భజన
చేయాలి.
సమష్టితో
చేరినప్పుడే
వ్యష్టికి
తగినటువంటి
పుష్టి
చేకూరుతుంది.
8
▾
Meaning
Keep
భగవంతుడు
ఈ
జగత్తును
తమాషా
కోసం
సృష్టించలేదు;
అందరియొక్క
ఏకత్వంకోసం
సృష్టించాడు.
భగవంతుని
సృష్టిలో
ఉన్నది
ఏకత్వమే!
భగవంతుడు
సృష్టించడం
అందరియొక్క
ప్రేమను
చేర్చాలనే!
కాని,
నేడు
దురదృష్టవశాత్తు
రాజకీయాలు
బయలుదేరి
భిన్నత్వాన్ని
పెంచుతున్నాయి.
ఒకే
ఇంట్లో
ఉన్న
నలుగురూ
నాలుగు
మార్గాలు
పడుతున్నారు.
ఒకే
ఇంటిని
నాలుగు
భాగాలుగా
విడదీస్తున్నారు.
ఇది
చాలా
చెడ్డది.
ఇంట్లో
నాలుగు
వందలమంది
ఉన్నా
అంతా
ఒక్కటి
కావాలి.
ఒకరికొకరు
సహాయం
చేసుకోవాలి.
అప్పుడే
మనం
సృష్టిని
సరియైనరీతిగా
అనుభవించినవారమవుతాము.
అర్ధనారీశ్వర
స్వరూపం
భజనలో
అందరూ
పాల్గొనాలి.
భగవన్నామాన్ని
స్మరించాలి.
మీరు
ఏ
సాధనలూ
చేయకపోయినప్పటికీ
భగవన్నామాన్ని
స్మరిస్తే
చాలు.
“భజన
బినా
సుఖ
శాంతి
నహీ”,
శాంతి
అనేది
భజనవల్లనే
లభిస్తుందిగాని
మరొకదానివల్ల
లభించదు.
“హరి
నామ
బినా
ఆనంద
నహీ.
జపధ్యాన
బినా
సంయోగ
నహీ”.
యోగమంటే
ఏమిటి?
ధ్యానమంటే
ఏమిటి?
ఏదో
కళ్ళు
మూసుకొని
భగవంతుణ్ని
స్మరిస్తూ
కూర్చోవడం
కాదు.
ధ్యానమంటే
నీ
హృదయాన్ని
భగవంతునితో
చేర్చడం.
నీవూ,
దైవమూ
ఏకమైపోవాలి.
దీనిని
పురస్కరించుకొనియే
అర్ధనారీశ్వర
స్వరూపాన్ని
సృష్టించారు.
ఒకటి
ప్రకృతి,
రెండవది
పురుషుడు;
ఒకటి
జీవత్వము,
రెండవది
దైవత్వము.
జీవబ్రహ్మైక్యానుసంధానమే
నిజమైన
ముక్తి.
జీవుడున్నచోటే
దేవుడున్నాడు.
కాబట్టి,
దేవునికోసం
నీవు
ఎక్కడికో
పరుగెత్తనక్కర్లేదు.
‘నేను
జీవుడను’
అని
నీవనుకోవద్దు;
‘దేవుడను’
అని
అనుకో.
నిజంగా
నీవు
జీవుడవు
కాదు.
దేహాన్ని
బట్టి
నీవు
జీవుడనని,
దేవుడు
వేరే
ఉన్నాడని
భావిస్తున్నావు.
కాదు,
కాదు.
ఆత్మను
బట్టి
ఇరువురూ
ఒక్కటే.
ఈ
హాలులో
ఇన్ని
దేహాలు
ఉండినప్పటికీ
అందరిలోనూ
ఆత్మ
ఒక్కటిగానే
ఉన్నది.
ఆకాశంలో
సూర్యుడు
ఒక్కడే
ఉన్నాడు.
ఆ
ఒక్క
సూర్యుడే
ఇంత
లోకానికి
వెలుతురునందిస్తున్నాడు
కదా!
అదేరీతిగా,
భగవంతుడు
సూర్యునివంటివాడు.
ఆయనే
అందరికీ
వెలుగు
నందిస్తాడు.
కాని,
మనం
ఎవరినైనా
దూషిస్తే
మనలో
చీకటి
బయలుదేరుతుంది.
కనుక,
నీవు
అందరినీ
ప్రేమించు.
అందరినీ
సేవించు.
అప్పుడు
దైవమే
నిన్ను
కాపాడుతాడు.
9
▾
Meaning
Keep
అట్టి
దైవవిశ్వాసాన్ని
గట్టిగా
పట్టుకోవాలి.
చాలామంది
దైవం
లేడని
అంటూంటారు.
కాని,
“దైవమే
లేకపోతే
నేనెక్కడినుండి
వచ్చాను?
నాకేది
స్థానము?”
అని
తమను
తాము
ప్రశ్నించుకోరు.
దైవవిశ్వాసమే
లేకపోతే
అన్నీ
వ్యర్థమైపోతాయి.
ప్రేమస్వరూపులారా!
ప్రేమను
పెంచుకోండి.
సత్యమును
పోషించుకోండి.
సత్యము,
ప్రేమ
రెండూ
మనలో
చేరినప్పుడు
శాంతి
ఏర్పడుతుంది;
మన
జీవితమంతా
సంతోషంగా
జరుగుతుంది.
అప్పుడు
ఎవరిపైనను
మనకు
ద్వేషము
రాదు.
అందరినీ
ప్రేమిస్తాము.
అందరినీ
ఆనందింపజేస్తాము.
కనుక,
సత్యమును,
ప్రేమను
హృదయంలో
ప్రతిష్ఠించుకోండి.
స్వప్నమునందుకూడను
వీటిని
మరువకూడదు.
స్వప్నమనేది
జాగ్రదవస్థయొక్క
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండ్’
మాత్రమే.
పగటివేళ
చేసినవన్నీ
రాత్రిపూట
స్వప్నాలుగా
వస్తాయి.
అవి
కదలిపోయే
మేఘాలు.
వాటిని
పట్టుకొని
మనము
పరుగెత్తకూడదు.
స్థిరమైన,
సత్య,
నిత్యమైనటువంటి
దైవాన్ని
పట్టుకోవాలి.
దైవాన్ని
పట్టుకొంటే
ఎన్నైనా
మనం
సాధించవచ్చును;
దేనికీ
భయపడనక్కర్లేదు,
చింతించనక్కర్లేదు;
ఎవరేమన్ననూ
లెక్కచేయనక్కర్లేదు.
ఎవరేమి
అన్నప్పటికీ
“ఈ
దేహము
నంటున్నారుగాని,
నన్ను
కాదు”
అని
భావించాలి.
దేహము
‘నేను’
కాదు.
This
is
my
body.
Then
who
am
I?
(ఇది
నా
దేహము.
అయితే
నేనెవరిని?)
అని
మిమ్మల్ని
మీరు
ప్రశ్నించుకోవాలి.
ఈ
'I'
(నేను)
అనేది
కేవలం
individual
'I'
కాదు,
ఇది
fundamental
'I'.
అనగా,
ఈ
‘నేను’
అనేది
ఒక్క
వ్యక్తికి
మాత్రమే
సంబంధించినది
కాదు;
అందరికీ
సంబంధించినది.
కనుక,
మనలో
ఉన్న
individual
'I'
ని,
అనగా
‘నేను’
అనే
అహంకారాన్ని
పూర్తిగా
ఖండించాలి.
క్రైస్తవ
మత
చిహ్నమైన
‘క్రాస్’
అంతరార్థమిదే!
'I'
(నేను)
అనే
దానిని
ఖండించడమే
దైవత్వం.
‘నా
పుత్రుడు,
నా
బిడ్డ’
అంటాము.
ఈవిధమైన
‘నా’
అనే
మమకారాన్ని
కూడా
విడిచిపెట్టాలి.
‘నా’
అంటే
లేదు
అని
అర్థము.
‘నా’
అనేది
nothing!
Everything
is
God.
అన్నింటికీ
ఉన్నది
దైవమే.
కనుక,
దైవాన్ని
స్మరిస్తూ
రావాలి.
ఒక్క
క్షణమైనా
వ్యర్థం
చేయకూడదు.
క్షణం
వ్యర్థం
చేస్తిమా,
ఎంతో
కాలాన్ని
వ్యర్థం
చేసినట్లవుతుంది.
ఒక్క
క్షణమైనా
నీవు
భగవంతుని
తలచితివా,
నీకు
ఎంతో
ఆనందం
కలుగుతుంది.
నీకు
దుఃఖం
వచ్చినప్పుడు
కన్నులు
మూసుకొని
దైవాన్ని
స్మరించు,
తప్పక
నీకు
శాంతి
చిక్కుతుంది.
10
▾
Meaning
Keep
మనము
దేనికీ
దుఃఖించకూడదు,
బాధపడకూడదు.
అన్నింటికీ
ధైర్యంగా
ఉండాలి.
ధైర్య,
సాహసములే
మనకు
నిజమైన
బలము.
(“రామ
రామ
రామ
సీతా...”
అనే
పాట
పాడి
భక్తులచేత
భజన
చేయించిన
తరువాత
భగవాన్
తమ
దివ్యోపన్యాసాన్ని
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు)
రోమరోమంలోనూ
రామనామాన్ని
నింపుకోవాలి
రామావతారంలో
ఐదుమంది
రామునియొక్క
ప్రత్యేక
అనుగ్రహానికి
పాత్రులైనారు.
“కౌసల్యాత్మజ
రామచరణ్,
వైదేహీ
ప్రియ
రామచరణ్,
హనుమత్సేవిత
రామచరణ్,
భరతార్చిత
శ్రీరామచరణ్,
అహల్యోద్ధారక
రామచరణ్.”
దీనిని
మనం
పాటగా
పాడుకుంటాము.
ప్రతి
అవతారముకూడను
ఈవిధంగా
కొంతమందిని
ప్రత్యేకంగా
‘సెలెక్ట్’
చేసుకోవడం
జరుగుతుంది.
వీళ్ళందరూ
ఆత్మార్పితం
చేసినటువంటివారు.
కౌసల్య
ఆత్మనే
శ్రీరాముడు.
“కౌసల్యవల్లనే
నేను
పుట్టాను.
కనుక,
నా
తల్లియే
నా
దైవం”,
అని
అన్నాడు.
“వైదేహీ
ప్రియ
రామచరణ్”,
వైదేహి
అనగా
దేహభ్రాంతి
లేనటువంటిది.
“హనుమత్సేవిత
రామచరణ్”.
హనుమంతునికి
నిరంతరం
రామచింతనే.
ఒకానొక
సందర్భంలో
హనుమంతుడు,
“స్వామీ!
నా
ప్రతి
రోమమూ
నీ
నామమునే
స్మరిస్తున్నది”
అని
పలుకుతూ
ఒక
వెంట్రుక
తీసి
రాముని
చెవి
దగ్గర
పెట్టాడు.
ఆ
వెంట్రుకకూడా
‘రామ్,
రామ్,
రామ్’
అని
అంటూ
ఉండినది.
ఈవిధముగా
మనం
స్మరించేటటువంటి
దైవమును
మన
దేహమంతా
అణువణువులోనూ
నింపుకోవాలి.
మన
సంకల్పములోనూ,
వాక్కులోనూ,
క్రియలోనూ
అన్నింటియందు
దైవనామమే
నిండి
ఉండాలి.
అప్పుడు
మనమే
దైవమైపోతాము.
ఎల్లప్పుడు
రామనామమైనా,
మరే
దైవనామమైనా
స్మరిస్తూ
ఉండేవాడే
నిజమైన
మానవుడు.
నాస్తికుడుకూడను
తనకు
ఏదైనా
దెబ్బ
తగిలి
బాధ
కలిగితే,
“అయ్యో,
రామా”
అంటాడు.
కాబట్టి,
ఎలాంటి
నాస్తికుడైనా
ఎప్పుడో
ఒకతూరి
భగవన్నామాన్ని
స్మరించక
తప్పదు.
నిరంతరము
మనలో
నిండుగా
ఉండవలసినది
దైవనామమే.
రామా
అను,
కృష్ణా
అను,
అల్లా
అను,
జీసస్
అను....ఏ
పేరుతో
పిలిచినప్పటికీ
దైవము
ఒక్కడే.
మైసూర్పాక్,
గులాబ్జామ్,
బర్ఫీ,
పాలకోవా,
మిఠాయి,
జిలేబీ
వీటన్నింటిలో
ఉన్నది
చక్కెర
ఒక్కటే
కదా!
11
▾
Meaning
Keep
అదేరీతిగనే,
అన్ని
నామములలోనూ
ఉన్నది
ఒక్క
దైవమే!
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి.”
నేను
ఒక్కడినే
అందరియందు,
అన్ని
రూపములలో
కనిపిస్తుంటాను.
మీ
దృష్టి
భిన్నత్వాన్ని
చూస్తున్నదిగాని,
నా
సృష్టిలో
ఉన్నది
మాత్రం
ఏకత్వమే!
ఆ
ఏకత్వాన్ని
మీరు
చూడాలి.
మీ
దృష్టిని
మీరు
ఆధారం
చేసుకోకూడదు.
మీ
కన్ను
మంచినీ
చూస్తుంది,
చెడ్డనూ
చూస్తుంది.
అంతేకాదు.
కన్ను
చెడిపోయినప్పుడు
ఒకరిని
ఇద్దరిగా
చూస్తుంది.
అదేవిధంగా,
దోషం
మీ
దృష్టిలోనే
ఉంది.
నిజానికి
దైవం
ఒక్కడే.
ఏ
నామమైనా
ఉచ్చరించండి.
కాని,
ప్రేమతో
ఉచ్చరించండి.
దైవ
నామాన్ని
మీరు
ప్రేమతో
భజించినప్పుడు
ఈ
సృష్టి
అంతా
ప్రేమమయమైపోతుంది.
Previous
←
Fundamental Principles Of Indian Culture