Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · Unity is possible only through Educare
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Unity is possible only through Educare
20 July 2008, World Education Conference, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
ప్రత్యేకంగా
నేను
చెప్పునది
ఏమియు
లేదు.
చెప్పవలసినవి
అన్నికూడను
గోల్డ్‌స్టీన్
(శ్రీ
సత్యసాయి
వరల్డ్
ఫౌండేషన్
ఛైర్మన్),
శ్రీనివాసన్
(అఖిల
భారత
సాయిసంస్థల
అధ్యక్షులు)
మీకు
తెలిపారు.
ఈనాటి
ఎడ్యుకేషన్
కేవలం
భౌతికమైనది,
బాహ్యమైనది,
ప్రాపంచికమైనది.
ఇట్టి
చదువులు
చదివినటువంటివారు
భారతదేశంలో
కోటానుకోట్లు
కలరు.
కాని,
వారివల్ల
ఈనాడు
సమాజమునకు
జరిగే
ఉపకారముగాని,
సహాయముగాని
ఏమీ
లేదు.
ఎవరి
స్వార్థ,
స్వప్రయోజనములను
వారు
చూసుకుంటున్నారేగాని,
ప్రజలయొక్క
సుఖమును,
ఆనందమును
కోరువారు
ఎవ్వరూ
కానరావడం
లేదు.
ఈనాడు
సమాజం
ఏ
పరిస్థితిలో
ఉన్నది?
ప్రజలు
ఎట్టి
బాధలు
అనుభవిస్తున్నారు?
అనే
విషయం
ఎవ్వరికీ
అర్థం
కావడం
లేదు.
ఏదో
పబ్లిక్‌లో
మాట్లాడేటప్పుడు
మాత్రం
“బీదలకు
సహాయం
చేయాలి”
అని
చెపుతున్నారేగాని,
చేసేవారు
ఎవ్వరూ
కనిపించడం
లేదు.
అసలు
ఎవరు
బీదలు?
ఎవరు
ధనవంతులు?
చెప్పినది
చేసి
చూపించినటువంటివారే
ధనవంతులు.
చెప్పినది
చేయనటువంటివారందరుకూడను
బీదవాళ్ళే!
“మనస్స్యేకం
వచస్స్యేకం
కర్మణ్యేకం
మహాత్మనాం”.
అటువంటి
మహాత్ములు
ఈనాడు
నూటికో
కోటికో
ఒక్కరున్నారు.
మొట్టమొదట
మనం
బీదలను
కాపాడాలి
ఈనాడు
ప్రపంచం
ఎలాంటి
పరిస్థితిలో
ఉన్నదో
మీకు
తెలుసు.
ఎక్కడ
చూసినా
కష్టములు,
దుఃఖములే
తప్ప
ఆనందమనేది
కంటికి
కనిపించడం
లేదు.
ప్రతి
ప్రాంతమువారు,
ప్రతి
దేశమువారు
తాము
సాధించిన
అభివృద్ధినిగురించి
గొప్పగా
చెప్పుకుంటున్నారు.
ఆ
గొప్పతనం
కేవలం
వారు
చెప్పుకునేదేగాని,
నిజంగా
గొప్పతనం
ఎక్కడా
కనిపించడం
లేదు.
2
▾
Meaning
Keep
His songs 75
ఎవరి
కష్టములు
వారు
అనుభవిస్తూనే
ఉన్నారు.
బీదల
పరిస్థితిని
ఎవరూ
అర్థం
చేసుకోవడం
లేదు.
గొప్పగొప్ప
దేశములనిపించుకున్నవికూడా
ఇతర
దేశాలకు
ఎన్ని
విధములైన
అపకారములో
చేస్తున్నాయి.
దానికి
వారు
పశ్చాత్తాపముకూడను
పడటం
లేదు.
ఆ
బీదలు
ఎంత
కష్టపడుతున్నారో,
ఎంత
బాధపడుతున్నారో
వారికి
ఏమాత్రం
కనిపించడం
లేదు.
అన్ని
దేశములయందు
కూడను
బీదలు,
ధనికులు
ఉన్నారు.
అయితే,
ధనికులకు
మాత్రమే
సహాయం
లభిస్తున్నదిగాని,
బీదలకు
ఎట్టి
సహాయమూ
లభించడం
లేదు.
మనం
మొట్టమొదట
బీదలను
కాపాడాలి.
ప్రతి
భక్తునికీ
ప్రేమ,
దయ
రెండూ
ఉంటుండాలి.
త్యాగగుణము
గలవానికే
దివ్యమైన
ఆనందం
కలుగుతుంది.
‘నేను,
నాది’
అనే
సంకుచితమైన
భావంతో
జీవించేవానికి
ఎప్పటికీ
ఏనాటికీ
దైవసహాయం
లభించదు.
‘ఐ’
(నేను)
అనే
సంకుచితమైన
భావం
ఉన్నచోట
అహంకారం
వచ్చి
చేరుతుంది.
‘నాది,
నావారు’
అని
భావించేవారిదగ్గర
అభిమానం
వచ్చి
చేరుతుంది.
అభిమానం
తోడైనప్పుడు
మనిషికి
అహంకారం
మరింత
ఎక్కువవుతుంది.
విశాలమైన
ఈ
ప్రపంచంలో
‘నేను,
నాది’
అనే
సంకుచితమైన
భావంతో
ఎవరు
అహంకారపడుతుంటారో
వారికి
కష్టములు
తప్పవు.
దీనికంతటికీ
కారణమేమిటి?
ఈనాడు
అందరూ
కేవలం
భౌతిక
విద్యను
అభ్యసిస్తున్నారు.
భౌతిక
విద్య
ప్రభావంచేత
మానవుడు
కేవలం
తన
స్వార్థం
గురించి
తప్ప
ఇతరుల
సౌఖ్యం
గురించి
ఆలోచించడం
లేదు.
మనం
అందరినీ
ప్రేమించాలి.
ఈనాడు
ప్రపంచంలో
గొప్పగొప్పవారికందరికీ
పాపభీతి,
దైవప్రీతి
రెండూ
లేకుండాపోయాయి.
దినదినమునకూ
స్వార్థ
స్వప్రయోజనములు
పెరిగిపోతూ
హృదయ
విశాలత
తగ్గిపోతున్నది.
స్వార్థమును
త్యజించాలి.
ఎంతవరకు
వీలైతే
అంతవరకు
మన
శక్తిని
బీదలకొరకు
ఉపయోగించాలి.
బీదలే
గనుక
కష్టపడి
పని
చేయకపోతే
ఎవరికీ
ఏవిధమైన
ఆహారమూ
లభించదు
కదా!
“భూమిని
దున్ని
విత్తులు
నాటి
పంటలు
పండిస్తే
వీరు
మేడలనుండి
మెట్లే
దిగక
మ్రింగి
కూర్చుంటే
అన్నము
వీరిది,
అంబలిగంజి
వారిది!
దేవుడిచ్చిన
ధరణిరా
ఇది
ఎవడి
అబ్బ
సొమ్ము?
వారికి
లేని
హక్కులు
వీరికెట్లు
కలిగె?
బలవంతులమని
పైబడ
వస్తే
భగవంతుడే
లేడా?”
3
▾
Meaning
Keep
కనుక,
మనం
బీదలను
ఆదరించాలి.
వారితో
సేవలు
చేయించుకొంటున్నందుకు
వారికికూడా
మనం
సేవలు
చేయాలి.
ఈనాడు
పెద్దపెద్ద
చదువులు
చదివిన
వారందరూ
నూటికి
నూరు
శాతం
స్వార్థంలో
మునిగి
ఉన్నారు.
చదువుకున్నవారి
యందే
చిల్లర
బుద్ధులు
బయల్దేరుతున్నాయి.
అందరూ
తమ
స్వార్థంకోసమని
పరాయివారిపై
పడుతున్నారేగాని,
పవిత్రమైన
భావంతో,
సహాయం
చేయాలనే
సద్బుద్ధితో
ఎవ్వరూ
ప్రవర్తించడం
లేదు.
మానవతా
విలువలే
మనయొక్క
నిజమైన
సంపద
మానవునికి
ఉండవలసినవి
ఏమిటి?
సత్యము,
ధర్మము,
న్యాయము,
శాంతి,
ప్రేమ,
అహింస.
ఈ
మానవతా
విలువలు
లేనివాడు
మానవుడనని
ఏరీతిగా
చెప్పుకోగలడు?
మానవతా
విలువలు
లేకుండా,
రాక్షస
గుణములు
పెట్టుకున్నవాడు
మానవుడెట్లవుతాడు?
తన
ప్రక్కనున్న
వ్యక్తి
బాధపడుతుంటే
పట్టించుకోకుండా
ఆనందంగా
ఉండడానికి
మానవునికి
ఏమాత్రము
అధికారం
లేదు.
ఈ
జగత్తులో
అందరూ
భగవంతునియొక్క
బిడ్డలే.
ఆ
బిడ్డలలో
ఎవరికి
బాధ
కలిగినా
ఆ
బాధ
మనదిగా
భావించాలి.
“వాళ్ళు
బాధ
పడితే
నాకెందుకు!”
అని
అనుకోకూడదు.
ఈవిధమైన
ప్రేమతో,
భక్తితో
మనం
ఈ
జగత్తులో
జీవించాలి.
ఈవిధమైన
సమానత్వమును
మనం
పోషించుకోవాలి.
అందరూ
ఏకం
కావాలి.
‘యూనిటీ’
(ఏకత్వం)
ఉన్నప్పుడే
హృదయంలో
‘ప్యూరిటీ’
(పవిత్రత)
వస్తుంది.
హృదయంలో
‘ప్యూరిటీ’
ఏర్పడినప్పుడే
‘డివినిటీ’
(దివ్యత్వం)
మన
దగ్గరకు
వస్తుంది.
కనుక,
‘యూనిటీ,
ప్యూరిటీ,
డివినిటీ’
-
ఈ
మూడింటినీ
దృష్టిలో
పెట్టుకొని
మనం
జీవితాన్ని
గడపాలి.
“ఈశ్వరస్సర్వ
భూతానాం.”
అందరి
హృదయంలో
ఉన్నది
ఒకే
భగవంతుడు.
చీమలయందు,
దోమలయందుకూడను
భగవంతుడున్నాడు.
వాటినికూడను
మనం
రక్షించాలి.
ఫ్లిట్
కొట్టి
దోమలను
చంపకూడదు.
వాటివలన
నీకు
బాధ
లేకుండా
చేసుకోవాలనుకుంటే
ఒక
దోమతెర
కట్టుకో.
ఈవిధంగా,
‘కంపేషన్’
(దయ)
గలిగినటువంటి
హృదయం
ధర్మమార్గంలో
ప్రవేశిస్తుంది.
4
▾
Meaning
Keep
కాని,
‘కంపేషన్’
అనేది
ఇప్పుడు
కనిపించడం
లేదు;
ఎక్కడ
చూసినా
‘కమ్
-
ఫ్యాషన్’!
ఇంక
సమత్వం
ఎట్లా
ఏర్పడుతుంది?
మనలో
కించిత్తయినా
మానవత్వమనేది
చూపించాలి.
మానవతా
గుణములు
ఉన్నప్పుడే
మానవుడు
దయా
హృదయుడవుతాడు.
కామము,
క్రోధము,
ద్వేషము,
అసూయ,
డంబము
ఇవన్నీ
మృగ
లక్షణాలు.
ప్రేమ,
దయ,
ధర్మము,
త్యాగము,
సత్యము
-
ఇవే
మానవుని
యొక్క
నిజమైన
సంపద.
ఈనాడు
ఆకారం
చూస్తే
మానవాకారం,
లోపల
చూస్తే
పశు
గుణాలు!
మనం
మానవాకారాన్ని
చూస్తున్నాముకాని,
దానియొక్క
విశిష్టతను
ఏమాత్రం
విచారించడం
లేదు.
రూపం
కాదు
ప్రధానం,
మానవతా
గుణము
కావాలి.
మనం
ఏ
దేశమువారినైనా
బాధపెడితే,
ఇంకొక
దేశం
మనలను
బాధిస్తుంది.
అది
తప్పింది
కాదు.
ప్రతి
కర్మకూ
‘రియాక్షన్,
రీసౌండ్,
రిఫ్లెక్షన్’
ఈ
మూడూ
ఉండే
తీరుతాయి.
ఈ
సత్యాన్ని
గుర్తించి
వర్తించినప్పుడే
మీరు
మానవతా
గుణములను
పోషించుకోగలరు.
మా
విద్యాసంస్థలలో
చిన్నపిల్లలుకూడా
మానవతా
గుణములంటే
ఏమిటో
సుస్పష్టంగా
చెపుతారు.
వారిని
చూసి
పెద్దవారుకూడను
నేర్చుకోవలసివస్తుంది.
ముఖ్యంగా
మనం
చిన్నపిల్లలలో
మానవతా
విలువలను
పెంచుకుంటూ
రావాలి.
బాలబాలికలు
మానవతా
విలువలను
అనుసరిస్తూ
పెద్దవారు
కావాలి.
మానవతా
విలువలలో
మొట్టమొదటిది
సత్యము.
ఇది
ఎక్కడినుంచి
వస్తుంది?
భూమినుంచి
రాదు;
ఆకాశమునుండి
ఊడిపడదు;
నార్త్,
ఈస్ట్,
వెస్ట్,
సౌత్లనుండి
రాదు.
మన
హృదయమునందే
ఉన్నది
సత్యము.
నీవు
చక్కగా
లోదృష్టితో
విచారించి
చూచినప్పుడు
నీకు
తప్పక
సత్యము
తెలుస్తుంది.
సత్యము
ఎప్పుడు
వస్తుందో
అప్పుడే
ధర్మము
ఏర్పడుతుంది.
సత్యము,
ధర్మము
రెండూ
చేరినప్పుడు
శాంతి
వస్తుంది.
శాంతినుండి
ప్రేమ
ఆవిర్భవిస్తుంది.
శాంతి,
ప్రేమ
రెండూ
చేరినప్పుడు
అహింస
పుడుతుంది.
కనుక,
ఇవన్నీ
మనలోనే
ఉంటున్నాయి.
అన్నీ
మనమే
చక్కచేసుకోవాలి.
పుస్తకాలను
చదివో,
లేక
పెద్దలను
అడిగో
మనం
తెలిసికోనక్కర్లేదు;
అన్నీ
మనయందే
ఉంటున్నవి.
మానవుడే
దేవుడు.
కనుకనే,
భగవంతుణ్ని
మానవాకారంలోనే
చిత్రిస్తున్నారు.
మీరు
ఎవరైనా
వెళ్ళి
భగవంతుణ్ని
అడగండి,
“నీవెవరు?”
అని.
“అహం
బ్రహ్మాస్మి”,
“నేను
బ్రహ్మను”
అని
చెపుతాడు.
5
▾
Meaning
Keep
అంతేగాని,
“నేను
ఫలానా”
అని
ఏదో
ఒక
పేరు
చెప్పడు.
పేరు
తల్లిదండ్రులు
పెట్టినదేకాని,
భగవంతుడు
ఇచ్చినది
కాదు.
భగవంతుడు
ఇచ్చినది
ఒకటే,
అదే
ఆత్మ.
అందుకోసమే,
“మమాత్మా
సర్వభూతాంతరాత్మా”
అన్నాడు,
కృష్ణ
పరమాత్మ.
ఆత్మ
అందరియందు
ఉన్నది;
క్రిమికీటకాదుల
యందుకూడా
ఉన్నది.
చీమలు
లైనుగా
పోతుంటాయి.
తమకు
ఎదురుగా
వచ్చేటటువంటి
చీమలను
ప్రేమతో
పలుకరించి,
ముద్దు
పెట్టుకొని
ఆనందంగా
ముందుకు
పోతుంటాయి.
పశువులయందుకూడను
ఈవిధమైన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యాలు
ఉంటున్నాయి.
ఆవుకు
దూడ
పుట్టిందంటే,
బిడ్డను
విడిచిపెట్టి
తల్లి
మందకు
వెళ్ళదు.
తల్లి
కనిపించకపోతే
బిడ్డ
‘అమ్మా,
అమ్మా’
అని
ఏడుస్తుంది.
తల్లి
‘బిడ్డా,
బిడ్డా’
అంటూ
దగ్గరకు
వస్తుంది.
పక్షులయందుకూడను
ఇట్టి
ప్రేమ
ఉన్నది.
ఒక
చెట్టుపైన
రెండు
పక్షులు
కూడి
ఉన్నప్పుడు
ఒక
బోయవాడు
బాణంతో
మగపక్షిని
చంపాడు.
ఆడపక్షి
ఏడ్చి,
ఏడ్చి
తానుకూడా
ప్రాణం
విడిచింది.
ఈ
దృశ్యాన్ని
చూసిన
వాల్మీకి
నోటినుండి
అప్రయత్నంగా
ఒక
శ్లోకం
వెలువడింది.
ఈ
ఘట్టమే
రామాయణ
మహాకావ్య
రచనకు
నాంది
అయింది.
పశుపక్ష్యాదులుకూడను
ఇటువంటి
ప్రేమను,
సన్నిహిత
సంబంధ
బాంధవ్యాలను
కలిగి
ఉండగా,
మానవునియందు
ఇవి
ఎందుకు
లోపిస్తున్నాయి?
పశువులు,
పక్షులుకూడను
మానవునికి
ఎన్నియో
బుద్ధులు
నేర్పుతున్నాయి.
కాని,
ఎన్నివిధాలుగా
నేర్పినప్పటికీ
మానవుడు
మాత్రం
కళ్ళు
తెరవడం
లేదు.
అదేవిధంగా,
స్వామి
మీకు
ఎన్ని
చెప్పినప్పటికీ
అవి
మీ
మెదడుకు
ఎక్కడం
లేదు.
చెప్పినట్లుగా
మీరు
నడుచుకున్నప్పుడే
ఇవన్నీ
మీకు
బోధపడతాయి.
‘నేనెవరు?’
అని
యోచించు,
అదే
నిజమైన
ధ్యానము
నిన్ను
ఎవరైనా
తిట్టినప్పుడు
నీవు
బాధపడతావు
కదా!
అట్లే,
నీవు
ఇతరులను
తిట్టినప్పుడు
వాళ్ళుకూడా
బాధపడతారని
నీకు
తెలియదా?
అయితే,
ఎవరు
తిట్టినా,
కొట్టినా,
ఏమి
చేసినా
అంతా
భగవంతునియొక్క
లీలయే
అని
మనం
భావించుకోవాలి.
6
▾
Meaning
Keep
ఈవిధమైనటువంటి
దైవభావమును
పెట్టుకున్నప్పుడు
ఎంతైనా
మనం
బాగుపడతాము.
ఈనాడు
ధనమంటే
ధనవంతులుకూడను
ఎంతగానో
ఆశపడుతున్నారు.
కాని,
దైవమంటే
ఆశపడటం
లేదు.
ఆత్మవిశ్వాసం
పూర్తిగా
సన్నగిల్లింది.
ఎక్కడుంది
ఆత్మ?
ఆత్మ
అంటే
ఏమిటి?
అని
అనేక
ప్రశ్నలు
వేస్తారు.
కాని,
ఆత్మ
అనేటటువంటిది
వారిలోనే
ఉన్నదనే
తత్త్వము
వారికి
ఏమాత్రం
అర్థం
కాదు.
“ఇది
నా
కర్చీఫ్”
అంటున్నాను.
కాబట్టి
నేను
వేరు,
కర్చీఫ్
వేరు.
అదేవిధముగనే,
“ఇది
నా
దేహము”
అనుకున్నప్పుడు
దేహము
వేరు,
నీవు
వేరు.
‘ఇది
నాది,
అది
నాది’
అంటున్నావు.
మరి
నీవెవరు?
నీ
విషయం
నీవు
తెలుసుకోవటం
లేదు.
నిన్ను
నీవు
తెలుసుకుంటే
అన్నీ
తెలుసుకున్నటువంటి
వాడవవుతావు.
నిన్ను
నీవు
తెలుసుకోలేకపోయినప్పుడు
ఇంకేమి
తెలుసుకున్నా
ప్రయోజనం
లేదు.
కనుక,
మొట్టమొదట
నీవు
శాంతంగా,
సంతోషంగా
కూర్చొని
“నేనెవరు?”
అని
యోచన
చేయి.
అదే
నిజమైన
ధ్యానము.
‘మెడిటేషన్’
అనగా
దైవాన్ని
చింతించడం
కాదు;
నిన్ను
నీవు
తెలుసుకోవాలి.
God
is
in
you,
with
you,
above
you,
below
you,
around
you.
You
are
God.
కనుక,
ఎవరైనా
“నీవెవరు?”
అని
అడిగినప్పుడు
“ఐ
యామ్
గాడ్”
(నేను
దైవాన్ని)
అని
చెప్పండి.
అంతేగాని,
“నేను
ఫలానా”
అని
మీ
పేరు,
ఊరు
చెప్పుకోకూడదు.
“నేను
దైవాన్ని”
అనుకున్నప్పుడు
నీకెంత
ఆనందం
కలుగుతుంది!
అది
విన్నవారికికూడా
ఎంత
ఆనందం
కలుగుతుంది!
కనుక,
మనం
భగవంతునితో
ఏకత్వాన్ని
అనుభవించాలి.
విద్య
అనగా
గ్రంథములు
బోధించేటటువంటి
లౌకిక
జ్ఞానం
కాదు.
గ్రంథములను
చదవడంద్వారా
వాటిలో
ఉన్న
పదములయొక్క
అర్థములు
మాత్రమే
మనకు
తెలుస్తాయిగాని,
మన
నిజతత్త్వం
గోచరం
కాదు.
“నేనెవరు?
నేనెవరు?”
అని
మొట్టమొదట
మన
గురించి
మనం
ప్రశ్న
వేసుకోవాలి.
అప్పుడే
మనకు
సరియైన
జవాబు
వస్తుంది.
నీవు
దేహమా?
మనసా?
బుద్ధియా?
చిత్తమా?
అహంకారమా?
ఇవేవీ
నీవు
కాదు.
‘ఇది
నా
దేహం’
అంటున్నావు.
కాబట్టి,
దేహం
నీవు
కాదు.
‘నా
మనస్సు’
అంటున్నావు.
కాబట్టి,
మనస్సు
నీవు
కాదు.
7
▾
Meaning
Keep
దేహము,
మనస్సు
ఇవన్నీ
భగవంతునియొక్క
ప్రసాదములే!
కాబట్టి,
వాటిని
కూడా
మనం
గౌరవించాలి.
హృదయంలో
సత్పరిణామం
కలిగినప్పుడే
సచ్చరిత్ర
చదివినందుకు
సార్థకత
మనం
గ్రంథాల్లో
వ్రాసినవన్నీ
చదివి
ఆనందిస్తే
సరిపోదు.
వాటిని
ఆచరణలో
పెట్టాలి.
నిన్న
ఒక
పిల్లవాడు
వచ్చి,
“స్వామీ,
నేను
శిరిడీ
బాబా
సచ్చరిత్ర
పూర్తిగా
చదివినాను”
అన్నాడు.
“ఓహో...
సచ్చరిత్ర
పూర్తిగా
చదివినావా?”
అని
అడిగితే,
“ఒక్క
అక్షరం
కూడా
వదలకుండా
చదివినాను,
స్వామీ”
అన్నాడు.
“ఎన్ని
నీవు
ఆచరణలో
పెడుతున్నావు?”
అని
అడిగితే,
“ఏ
ఒక్కటీ
నేను
ఆచరణలో
పెట్టలేదు”
అన్నాడు.
ఇంక
చదివింది
ఎందుకు?
కేవలం
కాగితాలు
త్రిప్పివేయటం
కోసమా?
కాదు,
నీ
హృదయాన్ని
త్రిప్పివేయాలి.
నీ
హృదయంలో
సత్పరిణామం
కలగాలి.
అప్పుడే
నీవు
చేసిన
సచ్చరిత్ర
పారాయణం
సార్థకమవుతుంది.
మనం
అనేకరకములైన
సాధనలు
చేస్తున్నాము.
కాని,
ఇవన్నీ
మన
భ్రమతోకూడినవేగాని
నిజమైన
సాధనలు
కావు.
‘రియాలిటీ’ని
చూడాలంటే
నీ
దృష్టిని
అంతర్ముఖం
గావించుకోవాలి.
నీవు
కన్నులు
తెరచి
బయటి
ప్రపంచాన్ని
చూసినప్పుడు
ఇన్ని
తలలు
కనపడుతుంటాయి.
కన్నులు
మూసుకొని
నీ
లోపల
నీవు
చూసుకో,
నీవు
తప్ప
నీకు
మరొకరెవ్వరూ
కనిపించరు.
మొట్టమొదట
నిన్ను
నీవు
చూసుకో.
‘నేనెవరు?’
‘నేను
నేనే’
(ఐ
యామ్
ఐ).
ఇదే
సరియైన
జవాబు.
‘నేను
రామయ్యను’,
‘నేను
అమెరికన్‌ను’
-
ఇవి
సరియైన
జవాబులు
కావు.
అవన్నీ
బాహ్యమైన,
లౌకికమైనటువంటి
పేర్లు.
అవి
ముఖ్యం
కావు.
నీ
హృదయాన్ని
నీవు
పరిశీలన
చేసుకో!
పరీక్ష
చేసుకో!
అదే
నీకు
ముఖ్యం.
అప్పుడే
నీకు
సత్యం
గోచరిస్తుంది.
‘నేను
నేనే’
అనే
సత్యాన్ని
గ్రహించడానికి
తోడ్పడేది
‘ఎడ్యుకేర్’
ముఖ్యంగా
ఈనాడు
చదువు
విషయమై
గోల్డ్‌స్టీన్,
శ్రీనివాసన్
ఎంతో
గొప్పగా
చెప్పారు.
ప్రపంచమునకు
సంబంధించినటువంటిది
‘ఎడ్యుకేషన్’
అన్నారు.
కాని,
‘ఎడ్యుకేర్’
అనేది
ప్రపంచమునకు
సంబంధించింది
కాదు.
అది
నీకు
సంబంధించినటువంటిది.
దానివల్లనే
“నేను
నేనే”
(ఐ
యామ్
ఐ)
అనే
సత్యాన్ని
గ్రహించడానికి
వీలవుతుంది.
“ఐ
యామ్
సో
అండ్
సో”
అని
చెప్పుకోకూడదు;
“ఐ
యామ్
ఐ”
అని
చెప్పగల్గాలి.
8
▾
Meaning
Keep
నిత్యజీవితంలో
మీకు
కలిగే
సందేహాలకు
రేపటి
దినం
నేను
తగినటువంటి
సమాధానాలిస్తాను.
వాటిని
మీరు
గుర్తించి
వర్తించండి.
తప్పక
మీకు
దైవత్వం
సాక్షాత్కరిస్తుంది;
అతిత్వరలోనే
మీరు
దైవత్వాన్ని
అనుభవిస్తారు.
ఈనాటి
చదువునుగూర్చి
నేను
చెప్పటం
లేదు.
అది
అందరికీ
తెలిసిందే!
అక్షరాలు
చదవటం,
వాటి
అర్థం
తెలుసుకోవడం
గొప్పతనం
కాదు.
ఇది
కేవలం
బుకిష్
నాలెడ్జి.
నీవు
హృదయ
సంబంధమైన
నాలెడ్జిని
సంపాదించుకో!
అదే
నిజమైన
నాలెడ్జి.
అదే
సత్యము.
అది
ఎప్పటికీ
మారదు.
సత్యమనేటటువంటిది
ఒక్కటేగాని,
రెండు
కాదు.
కనుక,
సత్యమే
దైవత్వము.
ధర్మమే
దైవత్వము.
శాంతమే
దైవత్వము.
ప్రేమయే
దైవత్వము.
అది
మీరు
తప్పక
తెలుసుకోవాలి.
Love
is
God,
live
in
love.
ఆ
దైవప్రేమను
మీరు
పెట్టుకుంటే
ఎంతైనా
సాధించగలరు.
“ఇది
నా
ప్రేమ.
వారిని
నేను
మాత్రమే
ప్రేమిస్తున్నాను”
అని
అనుకోవడం
అహంకారము.
అది
నీ
ప్రేమ
కాదు,
దైవప్రేమనే!
“గాడ్
ఈజ్
వన్.
గోల్
ఈజ్
వన్.”
(దేవుడు
ఒకడే,
గమ్యం
ఒకటే).
ఈ
సత్యాన్ని
దృఢంగా
నమ్ముకుంటే
మనకు
అన్నీ
అర్థమవుతాయి.
మనం
ఈ
ప్రపంచంలో
అనుభవించే
ఆనందము
నిజమైనది
కాదు.
నిజమైన
ఆనందము
మనలోనే
ఉన్నది.
మానవతా
విలువలు
మనలోనే
ఉన్నాయిగాని,
బయట
లేవు.
‘ఎడ్యుకేర్’
అనగా
ఏమిటి?
మనలోపల
ఉన్నటువంటి
విలువలను
బయటికి
తీయడమే!
మనం
చదివేటటువంటి
పుస్తకములన్నీ
‘ఎడ్యుకేషన్’కు
సంబంధించినవి.
ఇప్పుడు
మనకు
‘ఎడ్యుకేర్’
కావాలి.
‘ఎడ్యుకేర్’
వచ్చిందంటే,
అందరూ
ఏకమైపోతారు.
ఈనాడు
మానవత్వంలో
అనేకరకములైన
భేదాలు
ఏర్పడుతున్నాయి.
అది
పోయి
ఏకత్వం
రావాలి.
ఈనాడు
మీకు
తెలుపుతున్నాను
:
ఇంక
ఇరవై
అయిదు,
ముప్ఫై
సంవత్సరాలలో
ప్రపంచమంతా
ఒకటిగా
అవుతుంది.
ఒకే
కులం,
ఒకే
మతం,
ఒకే
దైవం
-
అలాంటి
ఏకత్వం
రావాలి.
దీనినే
వేదము,
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”
అన్నది.
Previous
←
God alone is the true Guru
Next
Parents and teachers must give children an exemplary life
→