Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Highest Truth
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జీవితమునకు
పరమార్థము
ఆత్మ.
ఇది
సర్వత్రా
ఉన్నదన్న
విషయము
భారతీయులకు
విదితమే.
కొందరు
వేదములు
ఆధారముగాను,
మరి
కొందరు
శాస్త్రములను
ఆధారముగాను,
ఇంకా
కొందరు
యతీశ్వరుల
అనుభవములను
ఆధారముగానూ
తీసికొని
వారివారి
బుద్ధి
కుశలతతో
ఈ
విషయమును
బుజువు
పరచిరి.
అనేకమంది
మహనీయులు
సర్వవ్యాపకమైన
ఆత్మాన్వేషణలో
తమ
శక్తి
సామర్థ్యములను
ఉపయోగించి
ఆ
దివ్యత్వాన్ని
కనుగొనిరి.
ప్రవక్తలు,
శాస్త్రజ్ఞులు
ఎవరెవరు
ఏయే
సంకల్పములు
చేసి
దేనికొరకు
ప్రయత్నించిరో
వారు
వారివారి
సంకల్పములను
సిద్ధి
చేసికొనినట్లు
భారతదేశమున
ఎన్నియో
ప్రమాణములు
కలవు.
కోట్లమంది
మానవులలో
ఇట్టి
ఆత్మ
సందర్శనము
ఏ
కొంత
మందికో
లభించెను.
అట్టి
పవిత్రప్రాప్తి
మానవునిలోని
బుద్ధి
వివేకము
పరాకాష్ట
చెందినట్లు
మిగిలిన
జీవరాసులలో
చెందలేదు.
అందువలన
సృష్టిలో
మానవుడు
ఉత్తముడనియూ
మానవజన్మ
దుర్లభమైనదనియూ
శాస్త్రములు
చాటెను.
మానవుడు
సృష్టి
హేతువును
వెదుకుటలో
అధికారి.
మానవుని
శాంతి
భద్రత
కొరకు
ఈ
సృష్టిని
వినియోగించుకొనుచున్నాడు.
ఇది
వేద
ప్రమాణము.
వైదిక
మతమునకు
ఆధార
భూతములగు
వేదములు
ఈశ్వరవాణి
రూపములైనవి.
వేదములు
ఆద్యంత
రహితములని
హిందువుల
సిద్ధాంతము.
వేదములనగా
గ్రంథములుకావు.
అవి
వివిధ
జిజ్ఞాసువులచే
వివిధ
కాలములందు
కనిపెట్టబడిన
పరమార్థ
ధర్మ
సూత్రములు.
ఇవి
మానవులు
ఎరుగక
పూర్వము
ఎట్లు
ప్రవర్తిల్లుచుండెనో
మానవులు
వాటిని
మరచిన
తరువాత
కూడాను
అట్లే
ప్రవర్తించుచుండును.
2
▾
Meaning
Keep
అట్లే
పరమార్థ
లోక
ధర్మములు
కూడా
శాశ్వతములు.
ఈ
రహస్యమును
కనుగొన్నవారు
ఋషులు.
ఈ
ఋషులు
కనుగొన్న
ధర్మములకు
అంతము
లేకపోయిననూ
అది
ఉండి
తీరవలయునుకదా
అని
కొందరు
తలంచవచ్చును.
సృష్టి
ఆద్యంత
రహితమని
వేదసిద్ధాంతము.
విశ్వశక్తి
యొక్క
సమష్టి
పరిణామము
ఎప్పుడును
సుస్థిరమై
హెచ్చు
తగ్గులు
లేక
నిలిచి
యుండును.
సృష్టియూ,
సృష్టికర్తయూ
రెండూ
సమానరేఖలు.
అవి
ఆద్యంత
రహితములై
సుస్థిరమగు
సమదూరమునే
సాగుచున్నవి.
భగవంతుడు
నిత్య
కార్యశీలుడు.
అతని
శక్తి
అవ్యక్తము.
భారతీయుల
పరమార్థము
అత్యంత
విస్తృతరూపమైనది.
మహోన్నత
గగనమార్గమున
కెగిసి
అచ్చట
స్వేచ్ఛగా
విహరించుచున్నది.
ఇది
చారిత్రక
యుగమునకు
పూర్వమే
ప్రకటితమైనది.
దీనికి
అనేకమైన
దెబ్బలు
తగిలినవి.
ఆ
దెబ్బల
నన్నిటికినీ
ఆగి
ఇప్పటికినీ
సజీవమై
నిలిచి
యున్నది.
దీని
నైసర్గిక
బలమునకు
ఇది
నిదర్శనము.
మధ్య
మధ్య
యూదియా,
క్రైస్తవ,
జోరాస్ట్రియన్
మొదలగు
మతముల
పరమార్థములు
తనలో
విలీన
మొనర్చుకొనుటకు
ప్రయత్నించిననూ
సర్వవిజయశీలయగు
ఈ
భారతీయ
పరమార్థవాహిని
తన
జన్మభూమి
నుండి
వేరుకాక
పై
మత
పరమార్థమునకు
సరియైన
అర్థమును
బోధించి,
అన్నింటియొక్క
ఏకత్వమును
ప్రకటించి
సమత్వమును
నిరూపించెను.
దేశము
నందలి
సర్వమతములు
భారతీయ
పరమార్థవాహినికి
సమీపమున
నున్న
చలమలవలే
నిలిచి
పోయెను.
భారత
దేశమున
కూడా
యెన్నియో
మత
శాఖలు
ఒకదాని
వెనుక
ఒకటి
పుట్టగొడుగులవలె
పుట్టెను.
వేద
ప్రతిపాదితమగు
భారతీయ
పరమార్థ
మతమును
నామూలాగ్రముగా
ఉఱ్ఱూతలూగించి
కూలద్రోయ
చూచినవి.
కానీ
ప్రళయకాలమగు
భూకంపముచే
సముద్ర
తీర
జలము
కొంత
తడవు
వెనుకకు
మరలిపోయినను
తదుపరి
తొల్లింటి
కన్న
సహస్ర
గుణాధిక
బలముతో
మరల
మోహరించి
సముద్ర
తీరమును
ముంచి
వైచునట్లు
ఈ
భారతీయ
పరమార్థవాహిని
ఆ
అల్ల
కల్లోల
మొకింత
3
▾
Meaning
Keep
అణగిన
పిదప
మరల
విజృంభించి
ఈ
విభిన్న
మత
శాఖలనన్నింటిని
తన
మహత్తర
స్వరూపములోనికి
ఆకర్షించుకొనెను.
ఇట్టి
సర్వజ్ఞమైన,
సర్వశక్తివంతమైన
ఆత్మతత్త్వమును
పరమార్థ
స్థితిని
ప్రేమించుటే
అతనిని
ఆరాధించుట.
ఆత్మనే
మానవునకు
ఏకైక
ప్రియుడు.
ఇహ
పరములందుగల
సర్వము
కన్ననూ
ప్రియతర
వస్తువుగా
భావించుట
అతనిని
ఆరాధించుట
ఇదియే
వేదప్రబోధ.
వేదములు
ప్రతిపాదించినది
నిష్ఠుర
నియమములయొక్క
ఘోరసందోహము
కాదు.
కార్యకారణరూపమైన
కారాగారముగాదు.
ఈ
నియమముల
కన్నింటికీ
ప్రభువైన
భౌతిక
పదార్థములలోని,
భౌతిక
శక్తులలోని
ప్రతి
అణువునందును
నిలిచి
దీపించుచుండు
వాడు
ఒకడు
కలడని,
అతని
ఆజ్ఞవలననే
పంచభూతములు
తమతమ
పనులు
చేయుచున్నవనియు
ప్రతిపాదించును.
ఇదియే
వేదములందు
ప్రతిపాదించిన
ప్రేమ
సిద్ధాంతము.
నీటియందుద్భవించియు
నీటిచేత
తడియక
ఉండు
తామరాకు
వలే
మానవుడు
ఈ
లోకమున
జీవింపవలెను
అని
పరమార్థము;
ఇహముననో
పరముననో
ప్రతిఫల
మపేక్షించి
భగవంతుని
ప్రేమించుట
మంచిదేకానీ,
ఇంతకంటే
ప్రియమైన
వస్తువు
మరొకటి
లేకపోవుటచే
దీనిని
నిష్కామ
ప్రేమగా
ప్రేమించుట
శ్రేష్ఠమని
కూడా
దీని
అంతరార్థము.
అనగా
భగవంతుని
ప్రేమించుటకే
ప్రేమను
కలిగియున్నానని
భావించుట
భారతీయ
పరమార్థము.
దీనికి
భారతములోని
ధర్మజుని
ఆదర్శము
చూడుడు.
ఇతను
భారతదేశ
చక్రవర్తిగా
ఉండి
శత్రువులచేత
పరాజయమునంది
రాజ్యమును
కోల్పోయి
హిమాలయ
ప్రాంతములందు
ద్రౌపదీ
సమేతముగా
కొండగుహలలో
ఉండగా,
ఒకనాడు
ద్రౌపది,
"నాథా!
లోకమునగల
ధర్మనిష్ఠాపరులలో
అగ్రగణ్యులగు
మీకిట్టి
ఘోర
విపత్తు
ఏల
సంభవించెను?"
అని
దుఃఖించగా,
అందుకు
ధర్మజుడు.
"ద్రౌపదీ!
దుఃఖించకు.
ఈ
హిమాలయపర్వతములు
చూడుము.
ఎంత
ఉదాత్త
వైభవముతో,
ఎంత
సౌందర్యమహత్త్వముతో
విరాజిల్లుచున్నవో!
వానియందు
నాకు
అమిత
ప్రీతి.
అవి
నాకేమియూ
ప్రసాదించవు.
కానీ
ఉదాత్తతనూ,
4
▾
Meaning
Keep
సౌందర్యమును
ప్రేమించుట
నాకు
నైజము.
కావుననే
నేను
ప్రేమించి
ఇచ్చట
నివసించుచున్నాను.
ఆ
సౌందర్యస్వరూపుడే
పరమాత్ముడు.
కాన
పరమాత్ముని
ప్రేమించుటలో
పరమార్థమిదేన"ని
అన్నాడు.
ప్రేమార్హమగు
వస్తువు
పరమాత్ముడొక్కడే
అన్న
సత్యాన్ని
భారతీయ
పరమార్థము
ప్రబోధించును.
ఇదే
మానవుని
స్వభావము.
కావుననే
నేను
అతనిని
ప్రేమించునది.
అతని
వద్ద
నేనేమియూ
కోరను.
దేనినీ
ప్రార్థింపను.
అతనికి
నన్నెచట
నుంచుట
ప్రీతియో
అచట
నన్ను
ఉంచనిమ్ము.
నా
ప్రేమకు
ప్రేమయే
పరమార్థము.
నా
ప్రేమ
వాణిజ్య
వస్తువుకాదు
ద్రౌపదీ!"
అని
జవాబిచ్చెను
ధర్మజుడు.
ప్రేమ
దివ్యవస్తువని
ధర్మజుడు
గ్రహించెను.
ఆ
ప్రేమ
ఆత్మస్థాయి
యందున్న
సహజ
లక్షణమని
ద్రౌపదికి
బోధించెను.
ఇట్టి
పవిత్ర
ప్రేమ
స్వభావముతో
కూడిన
ఆత్మ
భౌతిక
పదార్థములచే
బంధింప
బడుటచే
గుర్తించలేక
జీవభావమును
పొంది
పరిపూర్ణతను
పొందజాలకున్నారు
మానవులు.
అందుకై
ఈశ్వరకృప
బడసిన,
ఆ
కృపవలన
భౌతిక
దేహభావము
వీడి,
జీవుడు
ఆత్మ
భావమును
పొందును.
దీనినే
బంధవిచ్ఛేదనమనియు,
ముక్తి
అనియూ
వేదములు
చెప్పుచున్నవి.
భౌతిక
భావము
కలిగిన
జీవులు
ఇట్టి
స్థితిని
పొందుటకే,
ఈశ్వర
కృపను
అందుకొనుటకే
తత్త్వవిచారణ,
శమదమాది-షడ్విధసాధనలు
ఏర్పడెను.
వాటివలన
చిత్తశుద్ధి
ఏర్పడి,
పరిశుద్ధ
అద్దమున
ప్రతిబింబము
సుస్పష్టముగా
కనిపించునట్లు,
చిత్తశుద్ధి
జీవులయందు
ఆత్మ
దర్శనము
అతి
సులభముగ
చేయవచ్చు.
జ్ఞానసిద్ధికి
చిత్త
శుద్ధియే
రాజమార్గము.
ఇదియే
భారతీయ
పరమార్థములోని
కేంద్రభావము.
ఇదియే
దానికి
ప్రాణప్రాయము.
కేవలము
మాటలను,
సిద్ధాంతములను
నమ్ముకొని
కాలమును
వ్యర్థము
చేయువారు
కాదు
భారతీయులు.
సముద్రతీరమున
నెట్టి
వేయబడిన
నత్త
చిప్పలను
చూచి
ఆనందించువారు
కారు
భారతీయులు.
సముద్ర
గర్భమున
మునిగి
శోధించి
ముత్యములను
మాత్రమే
గైకొన
గోరువారు
భారతీయులు.
5
▾
Meaning
Keep
ఇంద్రియగోచర
ప్రపంచమునకు
అతీతమైన
పరమతత్త్వమును
పరికించుటలో
వేదములు
ఆదర్శప్రాయములై
మార్గమును
నిరూపించుచున్నవి.
భౌతికము
కానట్టి
ఆత్మ
తనయందు
భౌతికంగా
ఉన్నదన్న
సత్యాన్ని
నిరూపించునవి
వేదములు.
ఆ
సత్యస్వరూపుడే
పరమాత్ముడు.
ఆ
ఒక్కటే
నిత్యమైన
వస్తువు.
మిగిలినవన్నియూ
క్షణభంగురములు.
భగవంతుని
ఉనికిని
గూర్చి
నిరూపించుటకు
గాను
ఏర్పడినవే
వేదములు;
వేద
మార్గమున
పయనము
చేసి,
పరిశోధనలు
సలిపినవారే
హైందవసిద్ధ
పురుషులు.
వారు
అనుభవించి,
ఆనందించి,
మేము
ఆత్మను
చూచితిమని
పలికిన
పలుకులే
శాస్త్రములు,
ఉపనిషత్తులు.
హిందువులు
కేవలము
ఒక
సిద్ధాంతముతో,
అభిప్రాయముతో
పోరాడుట
కాదు.
వారి
విశ్వాసము
దానిని
ప్రత్యక్షముగా
అనుభవించుటే.
వారికి
లక్ష్యము
నిర్దేశించునది
విశ్వాసము
కాదు.
స్థితియు,
సిద్ధియు
భారతీయుల
యొక్క
ఉద్దేశము.
నిరంతర
సాధనాభ్యాసము
చేత
పరిపూర్ణత
నొందుట,
సాధించుట,
కడకు
భగవంతునిలో
చేరుట,
పరిపూర్ణులగుట
—
ఇదియే
భారతీయ
పరమార్థము.
Next
From Truth to Truth
→