Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · From Truth to Truth
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరిపూర్ణతను
సాధించిన
తరువాత
మానవుని
విషయమే
మగును?
అని
అనేక
మంది
ప్రశ్నించవచ్చు
లేక
సందేహించవచ్చు.
అతని
జీవితము
పరిపూర్ణము
నందిన
తరువాత
నిరతిశయానంద
పరిపూర్ణమై
విరాజిల్లును.
ఏకత్వమునందును
జీవితమునకు
సుఖప్రదముగ
నుండదగు
ఏకైక
పదార్థమగు
భగవంతుని
అనంత
త్త్వమును
అనుభవించును.
నిజసుఖము
అదియే.
భగవంతుడే
శాశ్వత
సుఖస్వరూపుడు.
భారతీయులందరూ
అనగా
వివిధ
శాఖల
వారందరూ
ఈ
సిద్ధాంతమునే
పాటింతురు.
ఈ
మతమునే
అభిమతముగా
గైకొందురు.
పరిపూర్ణతత్త్వమనగా
అఖండ
తత్త్వముగదా!
అఖండ
తత్త్వము
ఒక్కటే
కానీ
రెండు
మూడు
ఉండవు
కదా!
వ్యక్తిత్వము
కూడా
ఉండజాలదు
కదా!
ఒక
జీవాత్మ
పరిపూర్ణత్వమును,
అఖండమునూ
అయినపుడు
దీనిని
తిరిగీ
ప్రపంచమునకు
తెలుప
వీలుండదు
కదా?
అని
శంకించవచ్చు.
ఇది
సరియైన
అభిప్రాయము
కాదు.
వ్యష్టి
స్వరూపముగల
జీవతత్త్వము
సమష్టిరూపము
నందించినపుడు
తనకు
వ్యష్టి
భేదము
పోయి
సమష్టిస్థితి
కలుగును.
అపుడు
అన్నింటి
యొక్క
పదార్థము
ఒక్కటే
అని
గ్రహించునే
కానీ
వ్యష్టిభేదమును
నిరూపించదు.
ఒక్కొక్క
వస్తువునందలి
దివ్యత్వము
తనలోని
ఆత్మతత్త్వమునే
తెలిసికొని
మరింత
ఆనందించునే
కానీ
భేదమును
వెలిబుచ్చడు.
ఆ
ఆనందము
యొక్క
కిరణములే
సర్వత్రా
వ్యాపించి
ఆ
అనుభూతిని
అందుకొందురు.
మహాఋషులు,
వారు
2
▾
Meaning
Keep
అనుభవించిన
దివ్య
అనుభూతులను
లోకానికి
అర్థమగు
భావాలలో
తెలిపిరి.
అందని
చందమామను
వ్రేలితో
చూపినట్లు
మహాఋషులు
మనో
వాక్కులకు
అతీతమైన
పరిపూర్ణత్త్వమును
మానవ
మాత్రులకు
తమతమ
స్థాయికి
అందుబాటులో
నుండు
రీతిగా
ప్రబోధించిరి.
చిన్న
ఉదాహరణము:
ఈ
చిన్న
శరీరము
తనదను
జ్ఞానముకన్న
సుఖ
ప్రదమయిన
రెండు
శరీరములు
తనవను
జ్ఞానము
ఇంకను
ఎక్కువ
సుఖకరమై
ఉండును
కదా!
ఈ
విధముగా
తన
శరీరముల
సంఖ్య
అధికమగుకొలది
సుఖానుభూతి
కూడనూ
అధికమగుచూ
పోయి
అది
విశ్వప్రజ్ఞానరూపమొందినపుడు
పరిపూర్ణ
ఆనంద
సిద్ధినందును.
ఇట్టి
అనంత
వ్యక్తిత్వము
లభించవలెనన్న
ఈ
క్షుద్ర
కారాగారముచే
పరిమితమై
ఉండు
వ్యక్తిత్వము
అంతరించవలెను.
నేను
అను
అహంభావము
జీవునితో
ఐక్యము
నొందినపుడే
మరణము
నిలిచిపోవును.
సుఖమునూ
ఐక్యమునందినపుడే
దుఃఖము
నిలిచిపోవును.
జ్ఞానముతో
ఐక్యమొందినపుడు
పొరపాట్లు
నిలిచిపోవును.
భౌతిక
వ్యక్తిత్వము
కేవల
భ్రాంతి
జనితభావ
మనియు,
నిరవకాశ
వ్యాప్తిగల
భౌతిక
సముద్రమునందు,
ఈ
నీ
శరీరము
ఒక
నిరంతర
పరిణామవశమైయుండు
అణుమాత్రమైన
వస్తువనియు,
నీ
రెండవ
వస్తువైన
ప్రతిరూప
జీవాత్మతో
దీనికి
ఐక్యము
కలుగుటే,
ప్రతిపాదించుటే
భౌతికశాస్త్ర
సమ్మతమని
దీని
నిగూఢభావము.
కాల
పరిపాకమున
సర్వశాస్త్రములు
ఈ
నిశ్చితార్థమునకే
వచ్చుట
తథ్యము.
పండ్లను
పట్టి
చెట్టు
యొక్క
గుణము
నిర్ణయింపవలెను.
నీతి
యందునూ,
పారమార్థికత
యందునూ
లోకమున
అసమానులై
యుండు
గుణశీలురు
కూడనూ
విగ్రహారాధన
ఉత్తమమని
భావించిరి.
భౌతిక
దేహభ్రాంతి
ఉండినంత
వరకూ
భౌతికారాధన
అవసరము.
విగ్రహారాధన
సాధనము.
ఇట్టివి
మూఢ
విశ్వాసములని
అనేకమంది
భావించుచున్నారు.
అది
సరికాదు.
మూఢ
విశ్వాసము
అని
చెప్పుట
మూర్ఖావేశము.
తన
దేహాన్ని
తాను
విశ్వసించుట
మూఢ
విశ్వాసము
కదా?
అది
శాశ్వత
కాయమా?
తుమ్మినంతలో
3
▾
Meaning
Keep
తూలిపోవు
తొమ్మిది
తొఱ్ఱలతోలుబొమ్మ
కదా?
ఈ
జగత్తును
నమ్మి
భావించుట
మూఢవిశ్వాసము
కాదా!
ధనమును,
పదవులను
చూచి
విర్రవీగుట
మూఢవిశ్వాసము
కాదా!
ఆత్మ
విశ్వాసముతో
చేయు
పనులు
మూఢవిశ్వాసములు
కావు.
ప్రతి
విషయమునకు
సహేతుకమైన
కారణము
చూపిన
అందరూ
సంతసింతురే
కానీ
తనకు
నచ్చని
వన్నియూ
మూఢవిశ్వాసములని
చెప్పుట
ఆవేశము,
మూర్ఖత్వము,
స్వార్థపుతత్త్వము.
ఊపిరి
పీల్వక
మన
మెట్టు
జీవింపజాలమో
అటులనే
దైవాన్ని
ప్రేమింపజాలము.
జీవితములో
అదియూ
ఒక
ఆవశ్యక
దశయేయని
అంగీకరించవలెను.
వార్ధక్యమునకు
బాల్యము
జనకప్రాయమైనది,
బాల్యము
పాతకమని
కానీ,
యౌవనము
పాతకమనికానీ,
వృద్ధాప్యమున
పలుకనగునా?
తన
దివ్యతత్త్వమును
అనుభూతమొనర్చుకొనుటకు
విగ్రహారాధనము
తోడ్పడును.
ఆ
సాధకుడు
విగ్రహారాధనదశను
తాను
దాటినపిదప
దాని
నాక్షేపించుటకూడనూ
అనుచితమే.
భారతీయ
పరమార్థ
రంగమున
పురోగమించునది
అసత్యమునుండి
సత్యమునకు
కాదు.
సత్యమునుండి
సత్యమునకు,
అసమగ్ర
సత్యమునుండి
సమగ్ర
సత్యమునకు.
అడవి
జాతుల
వారు
చేయు,
లేక
అనాగరికులు
చేయు
క్షుద్రమగు
ఆరాధనలు
మొదలు
అత్యున్నత
భావసమగ్రమగు
అఖండారాధన
వరకు
పరిపూర్ణతత్త్వము
నందుకొని
దానిని
అనుభూతి
నొనర్చుకొనుటకై
జీవులు
ఒనర్చు
వివిధ
ప్రయత్నములే
సాధనలు.
ఈవిషయము
ప్రతిదీ
కొంత
పురోగమించి,
ఒక
దిశను
చేరును.
ప్రతి
జీవుడూ
ఒక
చిన్న
పక్షి
వంటివాడే.
అది
పైకి
పైకి
యెగసి
క్రమాధికము
చేకూర్చుకొనును.
చివరకు
పరిపూర్ణ
తేజో
వైభవముతో
దీప్తించుచుండును
సూర్యబింబము
వరకూ
యెగురవచ్చును.
నానాత్వములోని
యేకత్వమే
ప్రకృతియొక్క
మూలసూత్రము.
భారతీయులు
ఈ
సూత్రములను
గ్రహించిరి.
ఇతర
దేశీయులు
కొన్ని
సిద్ధాంతముల
నేర్పరచి,
వాటినే
అంగీకరించి,
అనుసరింపుడని,
తమతమ
సంఘములను
బలాత్కరింప
జూచును.
మానవ
సమాజము
లందు
వారొక
చొక్కానే
ఉంచి
ఇదియే
ప్రతివానికి
సరిపోయి
4
▾
Meaning
Keep
తీరవలెనని
అందురు.
తమకది
పట్టలేదను
వారికి
వేరొక
చొక్కాను
ఇవ్వరు.
కడకు
చొక్కా
లేక
ఉండుటే
వారి
గతి.
కానీ,
భారతీయుల
సిద్ధాంతములు
అట్లుకాక
ఆయా
భావములకు
తగినట్లు
ఆయా
రూపనామములను
యేర్పరచి,
భక్తులభావ
రూపమునకు
అనుగుణ్యముగా
ఆరాధించుకొనుటకు
అవకాశములను
ఏర్పరచినవి.
ఇట్టి
ఆధారములు
కొందరికి
అవసరము
లేకపోయిననూ
అనేకులు
ఇట్టి
ఆధారమునే
ఎన్నుకొనిరి.
ఇంతకూ
విగ్రహారాధన
చేసియే
తీరవలెనని
నిర్బంధముగా
బోధించదు
భారతీయ
పరమార్థము.
కానీ
ఒక
సంగతి
మాత్రము
ప్రతి
ఒక్కరూ
జ్ఞప్తి
యందుంచుకొనవలెను.
ఏమన,
భారతీయులు
సదేహాభిమానులు
కావచ్చును.
స్వజీవనోద్ధారకులు
కావచ్చును.
కానీ
ఇతరుల
గొంతు
కోయ
తలంపరు.
స్వమత
భావోన్మత్తుడగు
భారతీయుడు
తన
శరీరమును
అగ్ని
జ్వాలలకు
అర్పించుకొని
మరణించును
గానీ,
తమ
మతమును
అంగీకరింపని
వారి
సజీవ
శరీరములను
నిలువునా
తగుల
బెట్టడు.
ఆత్మహత్యలను
నిరసించుట
భారతీయ
పరమార్థము.
ఏలయన
ఆత్మనే
పరమాత్మగా
విశ్వసించిన
మతము
భారతీయ
మతము.
నానాజాతులు,
స్త్రీ-పురుషులు
నానావిధములుగా
నానాస్థితులకు
లోబడి
ప్రయాణ
మొనర్చుచున్నట్లు,
మతములన్నియూ
చేయు
పని
భౌతిక
మానవుని
వికాసమునకు
తోడ్పడి,
తుదకతనిలోని
ఈశ్వర
తత్త్వము
లేక
దివ్యత్వము
దీప్తించునట్లు
చేయుటయే.
భారతీయ
పరమార్థము
పైకి
విరుద్ధముగా
తోచిననూ
పద్ధతులన్నియూ
నిజమునకు
విరుద్ధములు
కావు.
ఒక్క
సత్యమే
వేర్వేరు
స్వభావములు
గలవారి
వేర్వేరు
స్థితిగతులకు
అనుగుణ
పడుటలో
ఏర్పడిన
వైరుధ్యములే
అని
గ్రహించవలెను.
ఉదాహరణము:
భిన్న
వర్ణములు
గల
గాజు
ముక్కల
ద్వారా
దీప్తించు
ఒకే
జ్యోతి
అది.
అనుగుణ్యార్థము
ఈ
స్వల్ప
భేదములు
ఆవశ్యకములే
కానీ
సర్వమునకు
మూలమై,
ఆధారమై,
గమ్యమై,
కీలకమై,
కేంద్రమై
ఒక్క
సత్యమే
వెలుగుచున్నది.
ముత్యాలహారములోని
సూత్రము
వలె
సర్వమతములయందు
పరమాత్ముడు
సూత్రరూపుడై
ఉన్నాడు.
ఈ
ప్రపంచ
జనులందరును
భారతీయ
సంస్కృతి
ఆధ్వర్యాన
శాస్త్రము
లన్నింటిని
గాలించి
5
▾
Meaning
Keep
చూచి
అందెచ్చటైననూ
మోక్షము
భారతీయునకు
మాత్రమే
లభించును,
ఇతరులకు
లభించదు
అని
చెప్పబడి
ఉన్నదేమో
చూపనిండు.
చూపగలరా?
చూపలేరని
గట్టిగా
చెప్పవచ్చు.
భారతీయ
పరమార్థము
మహావిశాల
భావాలతో,
ఉన్నత
ఆశయములతో,
పవిత్ర
తలంపులతో
ప్రవహించిన
వాహిని.
మలుపులేక,
కలతకాక
అనుగ్రహ
సాగరమునకు
చక్కని
బాటగా
యేర్పడిన
రాజబాట.
ఇంకొకటి:
భారతీయుల
యొక్క
మత
నిర్మాణ
మంతటికినీ,
భగవంతుడే,
ఈశ్వరుడే
మూలస్తంభమై
యుండగా
మరొక
దానిని
విశ్వసించనక్కరలేదు.
అన్ని
మతములకు
అధిష్ఠానమైన
స్థాయిలో
ఉన్నత
శిఖరమున
నిలచిన
మతము
భారతీయ
మతము.
ఈ
మతమునకు
విరుద్ధమయిన
ఆశయములు
గల
ఇతర
మతములను
భారతీయ
మతము
అనేక
స్థాయిలయందు,
అనేక
రీతుల
ఖండించినది.
భారతీయులు
మరొక
మతముల
ననుసరింప
పనిలేదు.
ఇందులో
లేనివి
మరే
మతమునందు
కానరావు.
భారతీయ
మతము
నందలి
భావములనే
ఇతర
మతములు
ఆదర్శముగా
వేరువేరు
రూప
నామములతో
అనుభవించుచున్నారు.
ఇతర
మతముల
వారు
భారతీయ
వైదిక
మతమును
అనుసరించిన
అనుసరించ
వచ్చును.
కానీ
భారతీయులు
ఇతర
మతముల
ననుసరించు
నవసరములేదు.
మనము
ముఖ్యముగా
గమనింప
వలసినది
ఆత్మను
గూర్చియు,
ఈశ్వరుని
గూర్చియూ,
ఆస్తిక
ధర్మమును
గూర్చియూ
జరిగిన
విచారము.
ప్రపంచ
వాఙ్మయమున
గూడా
ప్రాచీన
తమమైనది
ఆర్యవాఙ్మయము.
ఇంతకన్నా
ప్రాచీనరచనలు
ఏదేశమందునూ
ఎచ్చటనూ
లేవు.
ఒక
వేళ
ఉన్ననూ
వాటికి
వాఙ్మయ
నామము
చెల్లదు.
ఇంత
పురాతనమైన
గ్రంథము,
వాఙ్మయము
ప్రపంచముననే
ఎందునూలేదు.
ఆర్యుల
చిత్త
వృత్తులు,
వారి
వాంఛలు,
వారి
వ్యవహార
విషయములు,
వారల
నెదుర్కొన్న
సమస్యలు
మున్నుగు
సంగతులు
ఇందు
చిత్రింపబడినవి.
Previous
←
The Highest Truth
Next
Monotheism
→