Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Divine Form
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రపంచములోని
వారి
వారి
స్వభావములనుబట్టి
మానవులు
నాలుగు
విధముల
విభజింపబడెను.
అవే
బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య,
శూద్రులు
అని.
ఇవి
కేవలము
అధికులు
అనధికులను
అణగద్రొక్కడానికై
ఏర్పడిన
స్వార్థ
కుతంత్రమైన
పన్నాగముకాదు,
లేక
మానవ
అభ్యుదయానిని
ఆటంకపరచే
అసూయకాదు.
సర్వ
మానవకోటి
వారి
వారి
స్వభావ,
సంస్కారములననుసరించి
వికాసాన్ని
పొందేనిమిత్తమై
ఏర్పడిన
ప్రణాళికగా
భావించుట
ఉత్తమము.
ఇది
మానవాభ్యుదయమునకు
రాజబాట.
జీవిత
సామరస్య
స్వరూపకమైన
స్వధర్మ
కర్మనిరతి
మాత్రమే.
గుణకర్మ
విభాగానుసారము
బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య,
శూద్రాదులు
నాలుగు
నాచే
సృజింపబడినవి
అని
గీతాచార్యుడు
చెప్పియేయున్నాడు.
"చాతుర్వర్ణ్యం
మయా
సృష్టం
గుణకర్మ
విభాగశః,
తస్యకర్తార
మపి
మాం
విధ్య
కర్తార
మవ్యయమ్"
ఇట్లు
వీటికి
కర్తయైన
నేను
అకర్తనూ,
అవికారుడనూ
అని
భగవంతుడే
తెలుపుట
పాఠకులకు
విదితమే.
వర్ణవ్యవస్థ
గుణకర్మలచేతనే
ఏర్పడుచున్నది.
ఈ
ప్రపంచము
ప్రప్రథమములో
కేవలము
సత్వగుణప్రధానమై
ఉండుటచేత
సర్వులూ
బ్రాహ్మణులుగనే
ఉండిరి.
తదుపరి
కర్మలచే,
గుణములచే
వర్ణములు
ఏర్పరచవచ్చెను.
ఆ
ఏకైక
జాతి
ఋషిజాతిగా
ఉన్న
బ్రాహ్మణజాతి.
గుణభేదములు
కలుగుటచే
సమాజక్షేమమునకై
ఈరీతిగా
విభజించవలసి
వచ్చెనని
భృగుమహర్షికూడా,
భారద్వాజ
మహర్షికి
జవాబు
చెప్పినట్లు
2
▾
Meaning
Keep
మహాభారతమున
శాంతిపర్వములో
విపులముగా
తెలుపబడెను;
ఎట్లన
యే
బ్రాహ్మణుడు
భోగప్రియుడై
అహంకారములతో,
క్రోధ
కామాదులకు
పాలువడునో
అట్టివాడు
రజోగుణ
మిశ్రమ
సాత్వికుడుగా
పరిగణింప
బడుటచేత
అతనిని
క్షత్రియుడని
నిర్ణయించుట
ఏర్పడెను.
బ్రాహ్మణులు
అందరూ
సాత్విక
ప్రధానులుగా,
కర్మప్రియులుగా
ఉండరు
కదా!
బ్రాహ్మణులు
అసత్యప్రియులై
రజోమిశ్రితమైన
తమోగుణ
స్వభావులగుటచే
రెండు
గుణములతో
వ్యవహరించు
వారలు
వైశ్యులని
పిలువబడిరి.
ఇక
మిగిలిన
హింసా
కర్మోపజీవితం
చేయుచు
శౌచరహితులై
కేవలము
తమోగుణ
ప్రధాన
ప్రవర్తనలలో
జీవించువారలను
శూద్రులనియూ
నిర్ణయించబడెను.
ఈ
విధంగా
గుణకర్మలననుసరించి
బ్రాహ్మణులే
వివిధ
వర్ణములుగా
నేమించి
లోకసంరక్షణ
గావించుచుందురని
శ్రుతి
ప్రమాణము.
శుద్ధ
సాత్వికులైనవారలు
బ్రాహ్మణులనియు,
రాజసిక
గుణ
ప్రధానులై
శౌర్య
సాహస
సంపన్నులై
ప్రవర్తించు
వారలను
క్షత్రియు
లనియు,
ఇట్టివారు
బలపరాక్రమములద్వారా
లోకసంరక్షణ
గావించవచ్చు
ననియూ,
తదుపరి
పరాక్రమ
స్వభావముకానీ,
భుజబల
శౌర్యములుకానీ
లేక
యుక్తి
బలం,
వాణిజ్య
కౌశలము
మాత్రమే
కలిగి
వాటిని
సక్రమముగా
వినియోగించే
ఆసక్తిగల
రజో,
తమోగుణ
మిశ్రమ
తరగతిని
వైశ్యులుగను,
పేర్కొనబడుట
జరిగెను.
మిగిలినవారికి
తాపసశక్తిలేక,
పరాక్రమము
లేక
వాణిజ్య
ప్రతిభ
లేక
వ్యవహరించువారలను,
అనగా
కేవలము
తామసిక
తమోగుణ
ప్రధానులైన
వారలను
శూద్రాదులుగా
పేర్కొనబడెను,
తమ
కాయకష్టములను
లోకకల్యాణార్థమై
వినియోగించి
సార్థకమునందిరి.
పై
నాలుగు
వర్ణములు
వేరువేరుగాక
ఒక్క
దేహముగనే
నిరూపించి,
ఒకటి
ఉత్తమము
మరొకటి
అధమము
అను
భేదములకు
స్థానము
లేక
తమ
తమ
స్థానములందే
ఉండి
ప్రతి
మానవుడు
తన
స్థితికి
తగినరీతి
వర్తించి
పరమస్థితిని
అందుకొనవచ్చునన్న
విశాలభావముతో
ఈ
ప్రాచీన
వైదికవర్ణవ్యవస్థ
3
▾
Meaning
Keep
...దైవనిర్ణయముగా
ఏర్పడెను.
ఈ
వర్ణములు
సాక్షాత్
దైవస్వరూపము
నందలి
అంగములే
అన్న
సత్యాన్ని
కూడనూ
మరొక
విధముగా
నిరూపించెను.
బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య,
శూద్రాదులను
చతుర్విధ
వర్ణములు,
విరాడ్రూపుని
అనగా
భగవంతుని
వివిధ
అవయవములుగా
దర్శించిరి.
ఋగ్వేదమున
పురుషసూక్తమునందు
తెలుపబడిన
భగవద్వాక్యమును
పట్టి
చూచిన
సత్యము
స్పష్టము
కాగలదు.
"బ్రాహ్మణోస్య
ముఖమాసీత్,
బాహూ
రాజన్యః
కృతః
ఊరూతదస్య
యద్వైశ్యః,
పద్భ్యాం
శూద్రో
అజాయత"
ఇట్లు
శుద్ధ
సాత్విక
స్వభావులు,
జ్ఞానప్రధానులు
అయినవారు
అనగా
బ్రాహ్మణులు
భగవంతుని
ముఖంగా,
శౌర్యప్రధానులు
భుజబలముతో
సాత్విక,
రాజసిక,
మిశ్రమ
స్వభావులగువారు
క్షత్రియులు.
భగవంతుని
బాహువులుగను,
రజోగుణ
మిశ్రితమై
తమోగుణ
స్వభావులైన
వాణిజ్యకుశలులైనవారు
వైశ్యులు,
వీరు
భగవంతుని
ఊరువులుగను,
దైహిక
కృషి
ప్రధానులై,
అనగా
శారీరశ్రమికులైన,
తమోగుణ
సంపన్నులైన
శూద్రులు
భగవంతుని
పాదములుగను
నిర్ణయించి
ఈ
అద్భుత
అలంకార
స్వరూపుడు
భగవంతుడే
అని
ఋగ్వేదము
అభివర్ణించుచూ
వచ్చెను.
అయితే
ఈ
పవిత్రమైన,
గంభీరమైన
అర్థమును
అందించే
ఈ
వర్ణములు
స్వార్థ
పరుల
చేత
చిక్కుటచేత,
సంకుచిత
హృదయుల
భావములలో
పడుటచేత,
వివేకహీనులు
దీనికి
తమకు
తోచినట్లు
వ్యాఖ్యానములు
వ్రాసి
లోకమునకు
మహా
అపకారము
చేయుటచేత
ఈనాడు
వర్ణములంటే,
అధికులు
అల్పులను
అణగద్రొక్కుటకై
కల్పించిన
కల్పనలని
దువ్వదీయుచున్నారు.
వర్ణములు
సాక్షాత్
జనతారూప
జనార్దనుని
దివ్యమూర్తి
అనియూ,
సర్వాంగ
సుందరుడైన
పరమేశ్వరుని
ప్రత్యక్ష
స్వరూపమనియూ
గుర్తించుకోలేక
పోవటం
చాలా
విచారము.
భారతీయుల
భాగ్యము
అన్నట్లు
భగవంతుడు
వర్ణాంగములతో
లోక
సంరక్షణ
గావించుచున్నాడన్న
రహస్యాన్ని
గుర్తించ
లేని
పాశ్చాత్యులు
కూడనూ
4
▾
Meaning
Keep
ఈ
సత్యాన్ని
గర్తించక
వర్ణములు
మానవుల
కల్పితములనియు
అందరూ
ఒక్కటేననియూ,
బాహ్య
స్వరూపములను
ఆధారము
చేసుకొని
మానవులందరూ
ఒక్క
కులమునకు
చెందినవారలని
రెచ్చకొట్టుచున్నారు.
నిజమే!
మానవులందరూ
ఒక్క
కులమునకు
చెందినవారే.
కానీ
గుణకర్మలను
పట్టి
తెగలు
ఏర్పడుట
ఎవ్వరునూ
కాదనలేరు.
ఈ
భేదములు
తప్పినవి
కావు.
లోకమున
అందరూ
సాత్వికులు
లేరు,
ఏ
కొద్దిమంది
మాత్రమో
కలరు.
అట్లని,
అనగా
మానవులందరూ
ఆకారమును
బట్టి
ఒక్కటే
అని
చెప్పుటకు
వీలుకాదు.
సాత్వికులు,
రాజసికులు,
తామసికులు
మిశ్రమ
తరగతి,
అని
చెప్పక
తప్పదు
కదా!
వీటినే
వర్ణములని
చెప్పబడెను.
దీనిని
ఎవరు
కాదందురు?
లోకసామాన్యముగా
శూద్రులని
చెప్పు
శుద్ధ
తమోగుణ
ప్రధానులలో
ఎంతమంది
శుద్ధ
సాత్విక
స్వభావులు
లేరు?
శుద్ధ
సాత్వికులమని
చెప్పబడు
బ్రాహ్మణులలో
శుద్ధ
తమోగుణ
ప్రధానులు
ఎందరు
లేరు?
కాన
కేవలము
ఆకారమును
పట్టి
మాత్రమే
కాక
వారి
జన్మలను
పట్టి
మాత్రమే
కాక,
కర్మ,
గుణములనుపట్టి
నిర్ణయించునవే
వర్ణములన్న
విషయాన్ని
భారతీయ
వైదిక
మతము
విపులముగా
వివరించుచున్నది.
చాతుర్వర్ణములు
ఏకైక
భగవంతునియొక్క
వివిధాంగములు.
ఏ
వర్ణమైనా
దాని
స్థానములో
అది
ఘనమైనదే.
అన్ని
వర్ణముల
ఆశయము
తమ
తమ
ధర్మములద్వారా
జనసేవ
రూపములో
జనార్దనుని
సేవచేయుటే.
కొందరు
శూద్రులకు
తపో
అధికారము
లేదనియూ,
బ్రాహ్మణునకు
తపోఅధికారము
ఉన్నదనియూ
కొంత
వాదన.
ఇక్కడ
ముఖ్యంగా
మనము
గమనించదగిని
విషయము.
శూద్రుడనగా,
శూద్రజన్మకు
కాదు;
శూద్రత్వమునకు.
బ్రాహ్మణుడనగా
బ్రాహ్మణ
జన్మకుకాదు;
బ్రాహ్మణత్వమునకు.
ఆవు
స్వారి
చేయుటకు
పనికిరాదనియు,
గుఱ్ఱము
పాలు
పితుకుటకు
పనికిరాదంటే
అది
జాతిద్వేషం
కాదు,
గుణభేదములను
బట్టి
చెప్పబడుచున్నది.
5
▾
Meaning
Keep
ఆవు,
గుఱ్ఱము
జంతుజాతే.
కానీ
గుణములను
బట్టే,
ఒకటి
పాలకు
పనికివచ్చును.
మరొకటి
స్వారికి
పనికివచ్చును.
ఇటులనే
మనుష్యుల
జాతిని
బట్టి
కాక,
జన్మను
బట్టి
కాక,
గుణ
కర్మలను
బట్టి
విభజించినవే
బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య,
శూద్రాదులు.
ఇవి
దైవనిర్ణయములే
అని
చెప్పకతప్పదు.
Previous
←
Paths of Worship