Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Paths of Worship
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వేదము
సనాతన
శాస్త్రము;
శాస్త్రమనగా
అజ్ఞాత
జ్ఞాపకము:
అనగా,
లోకసిద్ధము
కాని
అతీంద్రియములైన
అర్థముల
దర్శింప
జేయుటకు
ప్రవృత్తమైనది,
పురుష
బుద్ధికి
గోచరము
కానిదగుటచే,
"పరమంవ్యోమ,
పరమంపదమ్,
అక్షరమ్,
తత్,
సత్"
అని
ఈ
రీతిగా
ఋగాది
శ్రుతులన్నియు
తెలిపెను.
ఒక
వేదమును
తెలియజేయుటకై
అనేక
వేదములావిర్భవించెను.
వేదశబ్దము
మొదట
సర్వజ్ఞుడగు
పరమేశ్వరునకు
వాచకమగుచు,
(వేత్తతీతి
వేదః)
తరువాత
తత్స్వరూప
నిరూపణాపరమై
(వేదయతీతి
వేదః)
సర్వజ్ఞ
కల్పమగు
ఋగాది
శబ్దరాశికినీ
వాచకమైనది.
తరువాత
తదనుగుణముగ
ప్రవృత్తములయ్యెడి,
ధర్మ,
అర్ధ,
కామములకు
నుపలక్షకమగుచున్నది.
మొదట
(సర్వద్రష్ట)
యగు
పరమేశ్వరుని
బోధించుచు,
తరువాత
ఆ
పరమేశ్వరుని
దర్శింపజేసెడి
(దర్శనాత్)
ఈ
వేదము,
ఋషి
శబ్దరాశికికూడా
వాచకమై
వరలినది.
తరువాత
ఋషులు
దైవ
వేదములను
ఆరాధించి
తదనుగ్రహముచే
ద్రష్టలయి
వెలసి,
ప్రసిద్ధములైరి.
దీనిని
పురస్కరించుకొని
పరమేశ్వరునకు
"మహర్షి"
అని
కూడా
నామము
ప్రసిద్ధమైనది.
బ్రహ్మసూత్రమున
"మహర్షిః
ముఖ్యర్షిః
శివః"
అని
కూడా
సహస్రనామములు
కలవు.
పరమేశ్వరుని
దర్శింపజేయునదగుటచేత,
వేదమునకు
ఋషి
అనియు
నామము
సార్ధకము.
బ్రహ్మ
అని
వేదమునకు
2
▾
Meaning
Keep
నామము.
అందుచే
బ్రహ్మను
పొందుటకై
చేయు
ఫలత్యాగ
కర్మలకు,
బ్రహ్మయజ్ఞమని,
ఋషియజ్ఞమని
కూడా
చెప్పుతూవచ్చిరి.
శుద్ధ,
శుభ,
సాత్విక,
నిస్వార్థకర్మలన్నియూ
యజ్ఞములే.
ఈ
విధములైన
ఫలత్యాగ
కర్మలలో,
పదే
పదే
స్వాహ
అనుచు
అర్పితము
గావించుచుందురు.
ఈ
స్వాహ
శబ్దసాంప్రదాయములకు
గతమలైన
శబ్దముల
అర్థములను
చూతము.
కేశవాయ
స్వాహ,
ప్రాణాయస్వాహ,
ఇంద్రాయస్వాహ,
ఇత్యాది
స్వరములయందు,
'స్వాహ'
పదమునకు
సామాన్యముగ
"హవిస్సు
సుహుతమగు
గాక"
అని
అర్థము
చెప్పుదురు.
"సుహుత"
మననేమి?
అగ్నియందు
విడువబడిన
యజ్ఞాది
ద్రవ్యములు
దగ్ధమగు
గాక!
జీర్ణమగుగాక!
అని.
ఇక్కడ
ఒక
సందేహము
కలుగవచ్చు.
అగ్నిలో
వేసిన
సమస్త
పదార్థములు,
సహజంగానే
దగ్ధమగును,
జీర్ణమగును
కదా!
ఇక
స్వాహాకారము
చేయుటచేత
కలుగు
ప్రత్యేకత
ఏమి?
స్వాహుతి
అనగా
వస్తువులను
దగ్ధము
చేయుట,
జీర్ణము
చేయుట
మాత్రమే
శ్రుతితాత్పర్యము
కాదు.
దగ్ధమగుట
ప్రత్యక్షగోచరము
మాత్రమే;
వైదిక
దృష్టివేరు.
కుమారసంభవ
కావ్యమందు,
కాళిదాసు,
హిమాలయమును
వర్ణించుచూ
"దేవతాత్మా"
అని
అన్నాడు.
అనగా,
దేవతా
శరీరము,
భౌతిక
శరీరము
అని
ప్రతిదానికి
రెండు
శరీరములు
కలవు.
ఇది
శ్రుతి
సమ్మతము.
దేవతాశరీరము
అతీంద్రియం,
భౌతిక
శరీరం
ఇంద్రియములతో
కూడినది.
దేవతా
శరీరమున
అగ్ని
ప్రాణాగ్ని
అగుచున్నది.
అందులో
ఆహుతి
హవిస్సు
అగుచున్నది.
ఆహుతియొక్క
స్వరూపమును
శ్రుతి
ఇట్లు
వివరించుచున్నది.
"అత్తా",
"అద్యము"
అనగా
భోక్త,
భోగ్యరూపమగు
ఈ
జగత్తు
ఏకీభూతమయినప్పుడు,
రెంటినీ
కలిసి
అత్తా
అనియే
అనగా
భోక్త
అనియే,
వ్యవహారము.
ఆ
భోక్త
ఎవరు?
అదే
అగ్ని.
అది
దైవికముగ
ఆదిత్యుడు;
ఆధ్యాత్మికముగ
ప్రాణము.
అట్టి
ప్రాణాగ్నియందు
సమంత్రముగ
నుంచబడెడి
అన్నాది
హవిస్సులకు
"అహితయః"
అని
పేరు.
3
▾
Meaning
Keep
స్వాహో
శబ్దము
కేవలము
హోమ
సూచకమైన
సాంకేతిక
పదము
మాత్రమే
కాదు.
సార్థకమగు
వాఙ్మయము.
ఛందయతి:
ఆహ్లేద,
చాదనమనగా
బలవంతుడగుట,
ప్రాణశక్తి
వంతుడగుట,
ఆచ్ఛాదించుట.
ఇట్టి
ధర్మబలముండుటచేతనే
వేదములకు
ఛందస్సులని
పేరు.
ఇట్టి
వేదమునాచ్ఛాదించు
వారలను
సుశక్తి
వంతులను
తైత్తరీయ
శ్రుతి
ఎంతయో
విపులపరచినది.
ఇట్టి
క్రతువు
ఒక
వ్యక్తికే
కాక
లోకోత్తరాహ్లాదమునే
కలిగించునదై
యున్నది.
"యజ్ఞాంగః
యజ్ఞ
వాహనః
వృషరథః"
ఇత్యాది
నామములు
శ్రుతి,
స్మృతులయందు
పరమేశ్వరునకు
చెప్పబడినవి.
హిరణ్యగర్భుడు
సువర్ణ
ఛందోమయుడు.
సువర్ణమనగా
గరుత్మంతుడు.
ఛందోమయమును
గరుడునివాహనముగా
స్వీకరించినవాడు.
వృష
అనగా
ధర్మస్వరూపము.
ధర్మమునే
వాహనముగా
చేసుకొనుట.
విష్ణు
ఆలయములందు
గరుడ,
శివాలయములందు
వృషభం
స్తంభములను
ద్వారములముందు
ఉంచి
యుండుటలో
ఇదే
అంతరార్థము.
ఛాదనమనగ
సంసారవృక్ష
రక్షణము.
ఫలకాములై
కర్మలయందు
చరించు
వారికి
తత్త్వమునాచ్ఛాదించి,
ధర్మనిష్టులగావించి,
సంసార
వృక్షమును
రక్షించుచుండును.
కర్మిష్టులన
ధర్మరూపమృత్యువునుండియు
జ్ఞానులను
సంసారరూపమృత్యువునుండియు
నాచ్ఛాదించి
రక్షించును.
అట్లు
రక్షించునట్టి
వానినే
ఛందస్సులనియు,
అవే
వేదములనియు
చెప్పబడెను.
"ఛాదనాత్
ఛందాసి"
మృత్యువునుండి
రక్షించగలుగునదని
ఛందస్సులు
శర్మ
హేతువులు.
యజ్ఞము
దేవతలనుండి
తొలగి
పోయి
కృష్ణమృగరూపమై
సంచరించుచుండ
దేవతలు
వెన్నంటి,
కడకు
దాని
చర్మమును
గ్రహించగల్గిరి.
యజ్ఞశరీరమే
కృష్ణాజినము.
దానియందలి
శుక్ల,
కృష్ణ,
బభ్రువర్ణములు
ఋగ్వేద,
యజుః
సామములయొక్క
రూపములు.
కనుక
కృష్ణాజినము
ఋగ్,
యజుర్,
సామవేదస్వరూపమనే
నిర్ణయము
గావించిరి.
దీనిని
త్రయీ
విద్యారూపమనిరి.
త్రయీ
విహిత
కర్మ
సాధ్యమగుటచే
యజ్ఞముకూడా
త్రయీస్వరూపము.
4
▾
Meaning
Keep
ఇట్టి
కృష్ణాజినమును
గ్రహించుటచేతనే,
యజ్ఞదీక్షితుడగు
యజమానుడు,
ఛందస్సుల
ప్రేరేపించును.
శుక్ల,
కృష్ణ,
బబ్రు
వర్ణములుకల
కృష్ణాజినము
లోకత్రయా
రూపము,
కాన
కృష్ణాజినము
ధరించి
యజమానుడు
లోకత్రయ
దీక్షితుడగుచున్నాడు.
దీక్షితుడైన
యజమాని
గర్భస్థశిశుతుల్యుడు.
గర్భస్థ
శిశువు
ఏరీతిగ
వ్రేళ్ళుముడిచి
గుప్పిలిపట్టి
మాతృశరీరచ్ఛాదితుడై
యుండునో
యజమానుడును
అట్లే
గుప్పిలిపట్టి
త్రయీ
విద్యారూప
ఛందోమాతృ
శరీరచ్ఛాదితుడై
కృష్ణాజినధారుడై
యుండవలెను.
కృష్ణాజినము
మానుషదృష్టిలో
చర్మము.
ఇది
దేవతాః
ప్రీతికరమైనదగుటచేత,
యజ్ఞకర్మలయందు
శర్మమగుచున్నది.
అందువలననే
యజమానుడు,
యజ్ఞసమయమున
"నీవు
శర్మస్వరూపివి.
నాకు
శర్మనిమ్ము"
అని
సంబోధించును.
శర్మమనగా
సుఖము,
ఆనందము.
ఆనందస్వరూపుడు
విష్ణువు.
విష్ణువు
యజ్ఞస్వరూపుడు.
"యజ్ఞోవైవిష్ణుః"
ఆ
విష్ణువు
త్రయీ
విద్యా
స్వరూపుడు.
5
▾
Meaning
Keep
వైదికోపాసన:-
ఇది
నాలుగు
విధములుగ
నున్నది.
1.
సత్యవతి
2.
అంగవతి
3.
అన్యవతి
4.
నిదానవతి
అని.
"సర్వవ్యాపిన
మాత్మానం
క్షీరేసర్పిరివార్పితమ్"
పాలలో
నెయ్యి
కలిసియున్నట్లే
ఆత్మ
సర్వవ్యాప్తమై
ఉన్నదనే
భావముతో
చేసే
సాధనే
"సత్యవతీ
ఉపాసన"
అంటారు.
"మాయాతీతమిదం
సర్వ
జగదవ్యక్తమూర్తినా"
నేనీ
సమస్తంలో
అవ్యక్తంగా
వ్యాపించియున్నాను.
నన్ను
అంతటా,
నాలో
అంతటినీ
చూస్తూ
ఉండే
సత్యవతి
ఉపాసనకు
నేను
కనిపించకుండా
ఉండను.
నాకు
ఆ
ఉపాసకుడు
కనిపించకుండా
ఉండడు
అంటూ
ఉన్నాడు
మాధవుడు.
ఆ
సర్వాత్మనే
నిప్పు.
గాలి,
సూర్యుడు,
చంద్రుడు
(మొదలైన
వన్నీ)
అనే
భావముతో
చేయబడేదే
"అంగవతీ
ఉపాసన".
ప్రాణరూపమై
అందరికీ
ఆత్మీయమైన
ఆ
గాలి
అన్నింటినీ
వెలిగించు
అగ్ని
ప్రాణములకు
వివిధ
6
▾
Meaning
Keep
జీవనాధారములైన
అన్నము
ఉత్పాదనచేయటానికి
కావలసిన
వరుణ
(వర్షము)
అని
పరమాత్మను
పొగడుట
అంగవతీ
ఉపాసన.
"శంఖచక్రగదాపాణి"
అని
విష్ణువును,
"ఏకదంతగజాననా"
అని
విఘ్నేశ్వరుని.
"శూలపాణి"
అని
ఈశ్వరుని,
"కోదండపాణి"
అని
రాముణ్ణి,
"శిఖిపించమౌళి,
మురళీధర"
అని
కృష్ణుని,
"వీణావాణి"
అని
సరస్వతిని
ఇలా
ఆయా
దేవతల
చిహ్నములను
ధ్యానపూర్వకంగా
మనస్సును
తన్మయము
చేసుకొని
హృదయంలో
ఆరాధిస్తూ
ఉండటం
"అన్యవతీ
ఉపాసన"
అని
అందురు.
"శ్రవణం,
కీర్తనం,
విష్ణోఃస్మరణం,
పాదసేవనం,
అర్చనం,
వందనం,
దాస్యం,
సఖ్యం,
ఆత్మనివేదనం
తన్మయాసక్తి,
పరమ
విరహాసక్తి"
అని
పదకొండు
భక్తిసాధనలు
కూడా
నిదానవతీ
ఉపాసనలో
చేరును.
సత్యవతీ,
అంగవతీ,
అన్యవతీ,
నిదానవతీ
ఉపాసనలు
అనుక్రమేణా
ఒకదానికంటే
ఒకటి
అత్యుత్తమ
స్థితికి
కారణాలై
విశ్వనియంతతో
తాదాత్మ్యాన్ని
ప్రసాదిస్తాయి.
ప్రతీకోపాసన
అని
మరొకటి
ఉన్నది.
అది
అంగవతీ
ఉపాసన
లాగానే,
ప్రతిరూపోపాసన:
"సర్వతః
పాణిపాదం
తత్
సర్వతోక్షి
శిరోముఖమ్",
సర్వాత్మయైన
మాధవునికి
అంతటా
చేతులూ,
కళ్ళూ;
చూస్తాడు,
ఆలోచిస్తాడు,
తింటాడు.
వింటాడు.
సర్వోన్నత
ఆదర్శభావముతో
ప్రతిరూపోపాసన
జరుగుతూ
ఉంటుంది.
7
▾
Meaning
Keep
భావోపాసన:-
మంచి
గుణములన్నిటినీ
మాధవునిలో
అమితంగా
ఉండినట్లు
చూడటమే.
8
▾
Meaning
Keep
గీతోపాసన:-
భారతం
పంచమ
వేదం.
అది
ఐహిక
ఆముష్మిక
ధర్మాల
నిధి.
మాధవుడు
భారతదేశ
ధర్మక్షేత్రరంగస్థలంలో
తన
నాటక
సామగ్రిని
దింపుకొని
ఆడిన
అద్భుతమైన
ఆట,
మహాభారతము.
భారత
నాటకానికి
పాత్రధారులను,
మాటలను,
పాటలను
సమకూర్చిన
రచయిత,
నటకుడు,
9
▾
Meaning
Keep
దర్శకుడు,
నిర్మాత
అంతా
ఒక్క
మాధవుడే.
ఒకవైపున
అధర్మ
వృద్ధమైన
అపార
భౌతిక
బలం,
మరొకవైపున
ధర్మవృద్ధమైన
పరిమిత
ఆత్మబలం.
ఈ
రెంటి
ఘర్షణలో
పర్యవసాన
రూపమైన
ధార్మిక
విజయ
జ్యోతిగా
తనను
నిర్దేశించుట.
ఇదే
భారతామృత
సర్వస్వం,
అదే
భగవద్గీత.
మహాభారత
సారాంశమంతయూ
భగవద్గీతలో
ఉన్నది.
"కరిష్యే
వచనం
తవ"
నీవు
చెప్పినట్లే
చేస్తాను,
"స్వధర్మే
నిధనం
శ్రేయ"
ఇదే
ఐహిక
తత్త్వానికి
గీటురాయి.
సర్వశ్రేయస్సులను
ప్రవహించే
భక్తిని
నిర్లక్ష్యము
చేసి
కళ్ళుమూసుకొని
"అహం
బ్రహ్మాస్మి"
అనే
అహంకారముతో
బాధపడే
నకిలీ
బ్రాహ్మలకు
క్లేశమే
ఫలితము.
పొట్టుదంచితే
బియ్యము
రాదుకదా!
అసలు
బ్రహ్మమే
కృష్ణుడు.
10
▾
Meaning
Keep
అద్వైతోపాసన
ఆదిశంకరులు
ఆవు
శరీరములో
పాలు
ఉన్నాయి.
ఆ
పాలలో
నెయ్యి
ఉన్నది.
అయినా
ఆ
నెయ్యితో
ఆవుకు
బలము
రాదు.
ఆ
పాలను
పితికి,
కాచి,
తోడుపెట్టి,
చిలికి,
వెన్నతీసి,
కాచి,
ఆ
నెయ్యిని
మళ్ళీ
ఆవుకు
త్రాపించిన
బలము
కలుగుతుంది.
అలాగే
సర్వేశ్వరుడు
సర్వాంతర్యామి
అయినా,
సాధనోపచారములు
లేకుండా,
మానవులలో
హితం
చేయజాలడు.
నువ్వులలో
నూనె,
పెరుగులో
వెన్న,
భూమిలో
నీరు,
కట్టెలో
నిప్పు
కలిసి
ఉండునటుల
సర్వాంతర్యామి
మానవుల
శరీరములలోను
మనసులలోను
కలిసిఉన్నాడు.
వాటిని
వేరుచేయాలంటే
ప్రయత్నం,
సాధన
చేయాలి.
అపుడు
ఆ
రెంటి
అభేదత్వం,
అద్వైతం
తెలుస్తుంది.
అదే
మోక్షం.
11
▾
Meaning
Keep
విశిష్టాద్వైతం
:-
రామానుజుడు:
ఉపాసించదగిన
పరమాత్మను
తనకు
వేరుగా
ఉన్నట్లు
భావించాలా?
లేక
తనలో
కలిసియుండినట్లు
భావించాలా?
సాధకునిది
ప్రశ్న.
12
▾
Meaning
Keep
ఇక
జవాబు:-
జీవుడు
శరీరానికి
ఆత్మ.
అలాగే
దేవుడు
జీవునకు
ఆత్మ.
అలా
భావించి
ఉపాసించుటే
రామానుజాచార్యుల
విశిష్టాద్వైతోపాసన.
ఈ
సమస్తభూతజాలము
ఎవనిలో
ఉన్నాయో
ఎవరు
ఈ
సమస్తానికి
అంతర్యామిగా
వ్యాపించి
యున్నారో
ఆ
పరమపురుష
పరమాత్మ
అనన్యభక్తి
(ప్రపత్తి)తోనే
13
▾
Meaning
Keep
లభ్యమవుతారు
అని
పరజ్ఞాన
ప్రపత్తిపూర్వకంగా
పరమ
పురుషోపాసన
చేయటమే
విశిష్టాద్వైతం.
"త్వమేవ
సర్వం
మమ
దేవ
దేవ",
నీవే
నాగతి,
పతి
అనే
అనన్యభావంతో
ఉపాసించుటే.
14
▾
Meaning
Keep
ద్వైతోపాసన:-
మధ్వాచార్యులు
పతిపత్ని
సంబంధమే
జీవాత్మ
పరమాత్మ
సంబంధంకూడా.
అవ్యయుడైన
విష్ణుభగవానుని
భర్తగా
ద్వైత
భావముతో
ఉపాసించుట.
15
▾
Meaning
Keep
చైతన్యోపాసన:
శ్రీకృష్ణ
చరణాసక్తి,
భక్తిలేనిదే
జీవన్ముక్తి
మాట
అటుంచి
కనీసం
బుద్ధిశుద్ధంకావటంకూడా
అసంభవము
అని
అంటాడు
చైతన్యుడు.
మునులూ,
ఆత్మారాములూ
అయినవారికి
లౌకిక
గ్రంథాలు
లేక
పోయినా
సూదంటురాయిలాంటి
శ్రీహరి
కల్యాణ
గుణగణ
విశేషం
వల్ల
నిష్కారణంవల్లా
భక్తిపారవశ్యం
వారికి
కలుగుతూ
ఉంటుందట.
ఆ
పారవశ్యముతో
సిగ్గూ,
బిడియాలు
వదలి
బిగ్గరగా
శ్రీహరి
నామసంకీర్తనం,
చేస్తూ,
గగుర్పాటుతో,
కంటిధారలతో
నృత్యంచేస్తూ
అసలైన
ఆనందాన్ని
అనుభవిస్తూ
ఉంటారు.
శ్రీచరణులు
ఈ
విశ్వాన్ని
పావనంచేస్తూవుంటారు.
ఈ
విధంగా
పరానురక్తితో
నామసంకీర్తన
ప్రధానంగా
కలిగింది,
చైతన్యుల
ఉపాసన.
నామ
సంకీర్తనలలో,
తన్మయత్వంతో
నృత్యంచేస్తూ
తాదాత్మ్యభావముతో
నిలిచి
ఉండుట
ప్రధానలక్ష్యము.
16
▾
Meaning
Keep
గౌడీయోపాసన
:
అవ్యక్త
పురుషోత్తమ
రూపములో
కృష్ణ
పరమాత్మను.
వ్యక్త
పరాశక్తి
ప్రకృతిరూపములో
రాధను
అనుదర్శనము
చేస్తూ
ఈ
కలిలో
రాధామాధవ
నామసంకీర్తన
చేస్తూవుంటే
పొందే
ఆనందమే
కేవలము
మోక్షము
అంటారు
గౌడపాదాచార్యులు.
ఆయన
సనాతన
గోస్వామి.
ఆ
పరమాత్మ
ఆనందరస
స్వరూపుడు.
ఆ
రసాన్ని
పొందితేనే
ప్రాణికి
నిజమైన
ఆనందం
కలుగుతుంది
అనే
శ్రుతి
వచనాను
సారం
ఆ
రసానంద
నిధిని
అనుభవించాలంటే
శ్రీ
రాధామాధవుని
నామమే
శరణ్యం
అంటారు.
17
▾
Meaning
Keep
నింబార్కాచార్యులు
:
ద్వైతోపాసనలో
పురుష
ప్రకృతి
సంబంధం
వలెనే,
జీవాత్మ
పరమాత్మ
సంబంధంగా
భావించి
ఉపాసించాలంటారు
వల్లభాచార్యులు.
శుద్ధాద్వైతోపాసనలో
"కృష్ణస్తు
భగవాన్
స్వయం"
కృష్ణభగవానుడు
స్వయంగా
పరమాత్మ.
ఆ
సర్వాత్మను
పొందుటయే
శుద్ధాద్వైతమోక్షము.
18
▾
Meaning
Keep
శైవోపాస
:
-
"లింగం
సర్వకాలం"
పృథివ్యాది
తత్త్వాల
స్థితి
గతులకు
మూలకారణమైన
లింగము.
అదే
పరమశివస్వరూపం.
ఆ
ఇష్టలింగప్రాప్తినే
మోక్షము
అని
అంటారు.
19
▾
Meaning
Keep
శివాద్వైతోపాసన
:
-
జీవాత్మ
తనను
కర్తగాను,
భోక్తగాను
భావించికొని
ప్రకృతి
బద్ధుడు
అవుతున్నాడు.
శివప్రాప్తి
కలిగితేనే
జీవునకు
మోక్షము
కలుగుతుంది,
అంటే
శివైక్యత
కలుగుతుంది
అంటారు.
వీరశైవోపాసన
(జంగములు)
ఒక
ఈశ్వరుడుతప్ప
వేరు
ఏమీ
లేదంటారు.
ఈశ్వర
విభూతిని
(శక్తి)
పొందుటయే
ముక్తి
అంటారు.
20
▾
Meaning
Keep
పాశుపతోపాసన
:
-
జీవుడు
ప్రకృతి
గుణాలనే
పాశాలతో
కట్టివేయబడిన
పశువు.
ఆ
పశువుకూ,
ఆ
పాశాలకూ,
ఆ
ప్రకృతికీ
నియంత
పరమేశ్వరుడు.
అందుకే
పశుపతిని
పొందటమే
ముక్తి
అంటారు.
21
▾
Meaning
Keep
శాక్తోపాసన:
"సర్వదేవమయీదేవీ"
ఆదిపరాశక్తి
సర్వదేవమయి.
ఈ
వివిధ
విచిత్ర
రూపములకు
నామములకు
కారణమైన
ప్రకృతియే
మాయాశక్తి,
ఈ
శక్తి
కలిగినవాడే
మహేశ్వరుడు.
ఈ
జంట
అవయవాలతో
ఈ
నింగి,
నేల
నిండి
ఉన్నై.
అవ్యక్తంగా
పురుషరూపంలో
ఉన్న
పరమేశ్వరతత్త్వమే
వ్యక్తంగా
స్త్రీ
రూపములో
మాయగా
ఉన్న
పరాశక్తి.
ఆమే
జగన్మాత.
అమ్మలగన్న
యమ్మ.
ఆ
పరాశక్తి
మనలో
స్వభావికమై
తెలిపినా
బలముగా,
క్రియగా
అనుభవమౌతుంది.
22
▾
Meaning
Keep
జైనోపాసన
:
జైనులు
(మార్వాడీలు)
వైష్ణవ
ప్రాధాన్యంగా
ఉంటుంది.
శంఖచక్రధారుడైన
విష్ణుభగవానుని
ప్రతిమలు
దేవాలయము
లలో
పూజిస్తారు.
23
▾
Meaning
Keep
ణమో
అరి
హరితాణమ్
ణమో
సిద్దాణమ్!
ణమో
అయిరియాణమ్
ణమో
ఉవర్ఝూయాణమ్!
ణమో
లోప
సబ్య
సాహూణమ్
ఇవే
జైనుల
మంత్రాలు
కామాది
వైరులను
జయించే
మహావీరులకు,
సిద్ధులకు,
ఆచార్యులకు,
ఉపాధ్యాయులకు
లోకములో
ఉన్న
సర్వసాధువులకూ
నమస్కారములు,
ఈ
పంచనమస్కారములూ
పాపపరిహారం
చేస్తాయి.
ఈ
మంత్రధారణే
సర్వశుభం.
ఈ
మంత్ర
భావంలోనే
ముక్తి
పొందాలంటారు
జైనులు.
సిక్కులు
-
సాంప్రదాయోపాసన
ఆత్మతత్త్వోపదేశాన్ని
చేసే
గురువునూ,
ఆయన
ఉపదేశాల
సమ్మేళనమయి
"గ్రంథసాహెబు"
నూ
పూజిస్తూ,
కీర్తిస్తూ
ఉండటమే
పరమధర్మం.
భారతీయ
సంప్రదాయంలో
సిక్కు
సంప్రదాయము
అంతర్భావం.
24
▾
Meaning
Keep
క్రైస్తవోపాసన:
ఏసు
ప్రభువే
రక్షకుడు.
తెలిసియో,
తెలియకనో
పాపాలు
చేయటం
మనిషికి
పరిపాటి.
మానవుల
పాపాలను
తొలగించి
పరిశుద్ధులను
చేయడానికే
ఏసుప్రభువు
శిలువపై
రక్తాన్ని
చిందించాడు.
ఆ
ప్రభువునూ,
ఆయన
ఉపదేశాలనూ,
"బైబులు"
అనే
మతగ్రంథములోని
సూత్రాలను
ఆచరిస్తూ,
ఉపాసిస్తూ
ఉంచటమే
మనిషికి
మంచి
దారి.
క్రైస్తవోపాసనలో
స్తోత్రము
చేయటమే
ముఖ్యంగా
ఉపాసనా
నియమం.
25
▾
Meaning
Keep
మహమ్మదీయోపాసన:
ఈమాన్దారీ
ఖైదామే
తో
-
పైగంబర్
మే
భరోసా.
ఆత్మవిశ్వాసం
కలిగి
ఉండటం,
దైవముపై
సర్వభారము
పెట్టి
ఉండటం,
దైవశక్తి
అడుగడుగునా
గుర్తించుచూ
ఉండటం.
ఇవి
లోకములో
ప్రధాన
నియమాలు.
దేహత్యాగం
చేసిన
తరువాత
పరలోకంలో
దేవుని
దర్బారులో
తన
వాస్తవికతను
నిరూపించుకొనటం.
అంటే
అందుకు
తగిన
ఋజువర్తన
జీవితాంతంవరకూ
కలిగియుండటం.
దైవవాణియైన
ఖురాను
గ్రంథబోధనలను
అక్షరాల
ఆచరించటం.
ఇవి
మహమ్మదీయోపాసనలో
పారలౌకిక
నియమావళి.
26
▾
Meaning
Keep
"అల్లా
హో
అక్బర్"
లా
యిలాహ్"
"ఇల్లల్లాహ్"
ఇవి
మహమ్మదీయుల
ప్రధాన
మంత్రాలు.
(భగవంతుడు
సర్వోత్తముడు.
అంతకంటే
మించిన
విశ్వనియంత
లేడు.
అతడే
ఆరాధించ
తగినాడు
అని
ఈ
మంత్రముయొక్క
అర్థము).
నాకంటే
మించినది
లేదు.
"నా
పరమస్తికించిత్"
అనే
భగవద్గీతార్థము,
మహమ్మదీయ
మంత్రార్థానికి
సామ్యాలే.
అందువలన
మహమ్మదీయ
సాంప్రదాయముకూడా
భారతీయ
హైందవ
సాంప్రదాయములో
అవాంతర
భాగమే.
ఈవిధంగా
మానవుడు
ఆత్మపరిశోధనకు
ప్రారంభించినప్పటి
నుండీ
తరతరాల
నరజాతికి
తారకమైన
అనంత
విజ్ఞాన
నిధిగా
ఎరిగిన
భారతీయుల
సంస్కృతి
అనంతగంభీరం
కావటంవల్ల,
భిన్న
భిన్న
సాంప్రదాయాల
రూపాలలో
నదులెన్ని
వచ్చిననూ,
చేరిననూ
పొంగక,
క్రుంగక
ధర్మసీమలో
నిలచియున్నది.
అంతేకాక
విశ్వాత్మకమై
సార్వభౌతికమై
సర్వకారకమైన
పెంజీకటికవ్వల
నేకాకృతియై
విజ్ఞాన
విజయ
జ్యోతియై
వెలుగుచున్నది.
ఇట్టి
పవిత్రమహా
సంస్కృతిక
క్షేత్రమైన
భారత
ధాత్రిమీద
మనిషిగా
పుట్టుటకంటే
సుకృతములేదని
తెలిసికోగలిగిన,
మనిషికి
కలిగే
ఆనందం
అపారం.
అగ్నినుండి
విస్ఫులింగములు
భిన్నములును,
నభిన్నములును
ఎట్లు
కావో,
అటులనే
జీవుడు
బ్రహ్మమునుండి
భిన్నుడును.
అభిన్నుడును
కాడు.
జీవ
బ్రహ్మముల
సంబంధము
కేవలము
ఏకత్వము
కాదు.
కానీ
అది
కార్య
కారణసంబంధము.
మోక్షము
పొందువరకూ
జీవుడు
పరమాత్మకంటే
భిన్నుడు.
ముక్తుడు
భేదకారణ
శూన్యుడగుటవలన
పరమాత్మతో
నభిన్నుడు.
జీవ
బ్రహ్మముల
భేదాభేదములు
రెండును
బంధమోక్షావస్థలపై
ఆధారపడును.
బ్రహ్మము
స్వయంప్రభ,
స్వప్రకాశము.
అదియే
ఇతర
చైతన్యమునకు
విషయము
కాదు;
బ్రహ్మము
సకల
విషయముల
నెరుగు
చున్నది.
ఇతర
27
▾
Meaning
Keep
పదార్థములన్నియు
దృశ్యములు
లేక
చైతన్యమునకును
విషయములు.
"దృగేన
నతు
దృశ్యతే"
రూపము
దృశ్యమగునపుడు
కన్ను
దృక్కు,
కన్ను
దృశ్యమగునపుడు
మనస్సు
దృక్కు,
మనస్సు
బుద్ధి
వృత్తులలో
దృశ్యమయినపుడు
సాక్షిచైతన్యమే
దృక్కు.
ఈ
సాక్షిని
ఎవరునూ
చూడజాలరు.
దృశ్య
విషయమంతయూ
ఆత్మయే,
శరీరము
ఆత్మకాదు.
ఏలయన
ఘటాదులవలె
ఎరుగబడుచున్నది.
ఆత్మ
కానిదంతయూ
శుక్తి
రజతమువలె
దృశ్యమాత్రమే.
ఆత్మ
తనకోసం
తానున్నది.
విషయ
ప్రపంచం
మరొకరికోసం.
జగము
స్వయం
సత్తావంతము
కాదు.
అది
బ్రహ్మమునుండి
జన్మించి
బ్రహ్మముపైనే
ఆధారపడియున్నది.
కనుక
అది
బ్రహ్మముకంటే
తక్కువ
సత్యము.
ఇంద్రజాలికునిచే
ఇతరులకొరకు
కల్పింపబడిన
మాయ
ఇంద్రజాలికుని
బాధింపనటుల
ఈ
జగత్తు
బ్రహ్మముచే
కల్పింపబడినదగుటచేత
బ్రహ్మమును
బాధింపదని
తెలియ
వచ్చును.
జగముయొక్క
అవస్థాత్రయములతో
బ్రహ్మమునకు
సంబంధ
మున్నట్లు
తోచుట
రజ్జువునందు
సర్పదృశ్యమువలె
భ్రాంతి.
మాయను
అసత్తని
చెప్పజాలము.
సర్పముగా
చూడబడిన
రజ్జువు
ఆ
దృశ్యమంత
రింపగనే
సర్పముకాదని
తెలియును
కానీ,
ప్రపంచము
అట్లు
అంతరించుటలేదు.
జగద్దృశ్యము
అనిర్వచనీయము.
అనగా
దానికదే
సాటి
అని
భావము.
దానిని
అసత్తనికానీ,
సత్తనికానీ
వర్ణింపజాలము.
జగత్తు
సదసత్
విలక్షణమని
చెప్పబడును,
అసత్తని
చెప్పబడలేదు.
కొంతకాలముండును
కాన
జగము
సద్రూపము.
ఎల్లకాలమూ
ఉండదుకాన
అది
అసద్రూపము.
ఒకవస్తువు
ఆ
వస్తువు
కాదని
వ్యతిరేకించునంతవరకు
మాత్రమే
సత్యము.
వ్యవహారిక
దశలో
జగము
లేదని
వ్యతిరేకింపబడుట
లేదు.
ఇది
వ్యవహారికము,
సత్యమేవ
స్వరూపము.
అనేక
రూపమగు
జగత్తు
అసత్యము.
శంకరులు
కూడా
జగమును
మాయ
అని
తలంచును.
పారమార్థిక
సత్యమున
అధిష్ఠానమగు
బ్రహ్మముకంటే
వేరుగా
28
▾
Meaning
Keep
జూచిన
జగమసత్యము.
బ్రహ్మమునకు
సంబంధించినదిగా
గాంచిన
సర్వమునూ
బ్రహ్మముగా
గాంచగలము
"సర్వం
ఖల్విదం
బ్రహ్మ".
వాస్తవముగ
మాయ,
బ్రహ్మములకు
సంగతియే
లేదు.
ఏలయన
కూటస్థ
సత్యమెప్పుడును
ఛాద్యముకాదు.
మాయ
సత్పదార్థము
కాదు.
దృశ్యమును
కలిగించునది
మిథ్యాజ్ఞానము
మాత్రమే,
అవిద్యయే.
అవిద్య
ఉన్నంత
కాలముండును.
సత్యమును
గురించిన
జ్ఞానము
కలుగగనే
అది
అంతరించును.
మాయను
సత్తనికాని,
అసత్తనికాని
చెప్పుటకు
వీలులేదు.
మనమెట్లు
చూతుమో
అది
అట్లనే
ఉండును.
ఈ
దృశ్యముకంటే
మరే
స్వతంత్రమగు
ఉనికియు
దానికి
లేదు.
దానికి
బ్రహ్మమే
అధిష్ఠానము.
బ్రహ్మము
మార్పుచెందని
(కూటస్థ)
కారణము,
మాయ
మార్పును
పొందునట్టి
కారణము.
బ్రహ్మము
జగద్దృశ్యమునకు
అధిష్ఠానమైన
పరమ
సత్యము.
పరివర్తనమును
నానాత్వమును
మాయవలన
కలుగుచున్నవి.
అవిద్యా
సహితమైన
బ్రహ్మము
జగత్తునకు
ఉపాదాన
కారణము.
జగత్తునందే
ఉండి
అందే
లయించుచున్నది.
బ్రహ్మము
జగత్తునకు
నిజమగు
విరక్తి
కారణము.
మాయ
సహకారి
కారణము.
కార్యకారణములకు
అతీతమైన
బ్రహ్మముపాదాన
కారణము
కాజాలదు.
అయితే
జగద్దృశ్యమును
చిత్రపటముతో
పోల్చిన
శుభ్రమగు
పటము
శుద్ధ
బ్రహ్మము.
అన్య
విలేపనమువలన
ఘట్టితనమైనదే
పటము,
అంతర్యామి.
నల్లని
రంగు
మనుష్యాకారము.
ప్రపంచానుభవముల
వలన
వేదనను,
దుఃఖమునుచెందు
దృశ్యాత్మయే
జీవుడు.
జీవుడు
దృశ్యము.
బ్రహ్మము
సత్యము.
జగము
బ్రహ్మముయొక్క
లీల.
విలాసము
అనేకత్వమునందవలయునన్న
బ్రహ్మమునందలి
సంకల్పముయొక్క
అభివ్యక్తియే
అది.
బ్రహ్మమును
పరమాత్మ
సత్యముగా
ఎరుగుటయే
మోక్షము.
ధ్యాన,
పూజ,
కర్మ,
కలాపములు,
మందాధికారులకుద్దేశింపబడినవి.
జ్ఞానము
ఇహాముత్ర
ఫలభోగ
విరాగులగు
నుత్తమాధికారులను
అనుసరించబడినవి.
వేదాంతము
అధ్యయనము
29
▾
Meaning
Keep
చేయగోరువారలకు
1.
నిత్యానిత్యవివేకము
2.
ఇహపర
అపరభోగ
విరాగము
3.
శమ,
దమ,
ఉపరతి,
తితీక్ష,
శ్రద్ధ,
సమాధాన,
సంపత్తి.
4.
ముముక్షత్వము
ఈశ్వర
నిర్మితములని
మనము
గాంచుచున్న
వస్తువుల
ప్రయోజన
మెరుగవలెనను
చిత్తమును
జ్వలింపజేయును.
కర్మ
జ్ఞానములు
వేరువేరు
సాధకులకు
ఉద్దేశింపబడినవి.
ఈ
రెండింటినీ
కలిపి
అనుసరించుట
సాధ్యము
కాదు.
ధర్మానుష్ఠానము
మాతన
జన్మములకు
మాత్రమే
కారణమగును.
అభ్యుదయమే
ధర్మజ్ఞాన
ఫలము.
నిశ్రేయసమే
మోక్షము.
బ్రహ్మజ్ఞాన
ఫలము.
బ్రహ్మజ్ఞాన
మితరమగు
అనుష్ఠానమునపేక్షింపదు.
నిత్యసద్రూపమగు
బ్రహ్మమును
గురించిన
జ్ఞానము
పురుష
వ్యాపారముపై
ఆధారపడినది
కాదు.
మోక్షము
రెండు
రకములు.
1.
సద్యోముక్తి
2.
క్రమముక్తి.
మొదటిది
జ్ఞానఫలము,
రెండవది
ఉపాసన
ఫలము.
జ్ఞానము
శుద్ధాద్వైతము.
భక్తి
పరమప్రేమతో
కూడినదై
ప్రేమనిమిత్తమే
భగవంతుని
ప్రేమించునట్టిదైయుండవలెను.
Previous
←
Eternal Truths
Next
The Divine Form
→