Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శాస్త్రములన్నింటికీ
వేదములే
ప్రమాణములు.
వేదములు
అపౌరుషేయములు.
అనగా
మానవమాత్రులు
రచించినవికావు
వేదములు.
అవి
పరమేశ్వరుని
నుండి
బహిర్గతములైనవి.
తరువాత
గురు
శిష్య
పరంపరగా
మన
వరకూ
వ్యాపించినవి.
వేదముల
సారమే
ఉపనిషత్తులు,
ఉపనిషత్తుల
సారమే
బ్రహ్మ
సూత్రములు.
భగవద్గీతతో
కలిపి
ఈ
మూడింటికీ
ప్రస్థాన
త్రయములు
అని
పేరు.
గురువులనుండి
వినబడి
శిష్యులచే
గ్రహింపబడినవగుటచేత
ఉపనిషదాదులు
శ్రుతులనబడుచున్నవి.
కాన
మంచి
చెడు
కర్మల
నిర్ణయమునకు
శాస్త్రములే
ప్రమాణములు.
జన్మ
సార్థక్యతకు
జ్ఞానమే
ముఖ్యమైనది.
అనగా
తాను
శరీరాది
జడపదార్థము
కాక
చైతన్యమైన
సచ్చిదానంద
స్వరూపమగు
ఆత్మయని
గుర్తించుట
-
ఇట్టి
జ్ఞానముదయించి
అనుభవ
సిద్ధమైన
తరువాతనే
జీవన్ముక్తి
దశ
లభించును.
కైవల్యోపనిషత్తునందు
"నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వమానశుః"
అని
తెలిపినట్లుగా;
నకర్మణా
అనగా
యజ్ఞయాగాదులు,
వ్రతములు,
దానధర్మాదులు,
తీర్థయాత్రలు,
నదీ
సాగర
స్నానములు
మున్నగు
కర్మలవల్ల
మోక్షము
కలుగదు.
అనగా
అజ్ఞానం
నివృత్తి
కాదు.
నప్రజయా
అనగా
అధికార
సంపదలు,
బుద్ధి
చాతుర్యము,
కీర్తి
ప్రతిష్ఠలు,
సౌందర్యం,
పుష్టి,
పుత్రులు
మున్నగువాటివల్ల
ముక్తి
పొందజాలరు.
ధనేన
-
పైన
తెలిపిన
కర్మలన్నియు
ధన
సహాయముతో
జరుపబడునవి.
ధనము
లేనియెడల
అట్టి
కర్మలు
జరుపబడజాలవు.
అయితే
జ్ఞానమును
ధనముతో
కొనలేరు.
ధనమునకూ
జ్ఞానమునకూ
2
▾
Meaning
Keep
సంబంధము
లేదు.
కాబట్టి,
ధనమువలన
ముక్తిని
సంపాదించుకొనజాలరు.
ఇది
ధన
సాధనము
కాదు.
అట్లయిన
ముక్తికి
సాధనమేమి?
"త్యాగేనైకే
అమృతత్వమానశుః"
జగత్తు
లేనే
లేదను
జ్ఞానమువల్లను,
ఉన్నట్లు
కనబడినను
అది
మిధ్య
మాత్రమేనని
తెలుసుకొనుటవల్లను,
ఇహ
పరములలో
గల
భోగములపై
ఆశలు
వదలుకొనుటవల్లను
-
అనగా
సర్వం
త్యాగము
-
సర్వ
త్యాగమువల్లను
ముక్తి
కలుగునని
దీని
అర్థము.
అనగా
ఆత్మతత్త్వ
జ్ఞానముచేత
మాత్రమే,
దాని
ఫలమైన
సంసారము,
దుఃఖము
నశించును.
కేవలము
కర్మలవల్ల
అవి
నాశనము
కావు
అని
ఉపనిషత్తు
చెప్పుచున్నది.
తెలుసుకొనుట
అనగా
జ్ఞానమును
సంపాదించుకొనుట.
మానవుడు
తన
నిజస్వరూపమును
మరచి,
దేహేంద్రియాదులనే
తాననని
భావించి
వాటికి
కావలసిన
విషయ
భోగములు
సంపాదించుకొంటే
ఆనందము
కలుగుతుందని
వాటి
వెంట
పడ్డాడు.
కాని,
ఈ
ప్రయత్నమువలన
ఆనందము
కలుగదు.
ఆనందానికి
బదులు
అనర్థములే
కలుగుచుండును.
సుఖానికి
బదులు
దుఃఖములే
ప్రాప్తించుచున్నవి.
విషయ
భోగములు
దుఃఖ
పర్యవసానములుగనే
ఫలించుచున్నవి.
ఇట్టి
మానవునకు
సరియైన
ఆనందమార్గము
కావలసియున్నది.
ఆనందము
ఎచట
లభించును?
ఇది
బయట
వస్తువులలో
లేదు.
బయట
వస్తువులయందలి
ఆనందము
విపరీత
ఫలము
నిచ్చును.
ఆనందము
నీ
స్వరూపమే
అన్న
సత్యమును
తెలుపుచున్నవి
బ్రహ్మసూత్రములు,
ఉపనిషత్తులు,
గీత.
జ్ఞానప్రాప్తికి
ప్రస్థానత్రయములు
త్రిమూర్తి
స్వరూపములు.
బ్రహ్మ
సూత్రములను
అర్థము
చేసుకొనుట
కఠినమైన
విషయము.
ఇది
అధికార
పురుషులకు
తప్ప
అన్యులకందునది
కాదు.
అధికార
పురుషులనగా
సాధనా
చతుష్టయ
సంపన్నులు.
అట్టివారికిది
కరతలామలకము.
మానవుడు
తనను
తాను
ఉద్ధరించుకొనవలెనన్న
మొదట
సాధన
చతుష్టయమును
సాధించి
తీరవలెను.
ఈ
బ్రహ్మసూత్రము
శారీరక
శాస్త్రమనియు,
వేదాంత
దర్శనమనియు
చెప్పబడుచున్నది.
అంటే
శరీర
సంబంధితమైన
ఆత్మ,
జీవుడు,
ఇంద్రియాది
భూతాలనుగూర్చిన
శ్రేష్ఠమైన
పరిశీలన
జరుపుట.
అనగా
బ్రహ్మమే
శరీర
3
▾
Meaning
Keep
ఇంద్రియాలకు
ఆధారమని
గుర్తించుట.
ఏతావాతా
ఆనంద
ఘనమే
నీ
స్వరూపమని
తెలుసుకొనుట.
ఇక
దర్శనము
అనగా
చూపు
అని
అర్థము
నిచ్చుచున్నది.
ఇది
సత్య
దర్శనమునకు
తోడ్పడుచున్నది.
దర్శనములన్నియు
సుప్రసిద్ధులు
ద్రష్టలునగు
మహర్షులచే
ప్రతిపాదింపబడినవి.
న్యాయము
గౌతమునిచేతను,
వైశేషికము
కణాదునిచేతను,
పూర్వమీమాంస
జైమినిచేతను,
ఉత్తర
మీమాంస
వేదవ్యాసులచేతను
ప్రతిపాదింపబడినవి.
వీరిలో
కపిలుడు,
వ్యాసుడు
విష్ణ్వంశలని
మునుల
విశ్వాసము.
వీరేమిటి,
అందరూ
విష్ణ్వంశలే
అని
బ్రహ్మసూత్రము
నిరూపించుచున్నది.
బ్రహ్మసూత్రములద్వారా
ఉత్తర
మీమాంస
వేదవ్యాసమునిచే
ప్రతిపాదింపబడెను.
ఈ
సూత్రము
పూర్వపక్ష
సిద్ధాంతములతోగూడి
బ్రహ్మవిద్యను
ఈవిధముగా
ఆక్షేపణ,
సమాధానములతో
బోధించుచున్నది.
శరీరమును
ఉపాధిగా
చేసుకొని
పురుషునిగురించి
విదితము
చేయును
గనుక
శారీరక
మీమాంస
అనీ,
వేదాంతమును
గురించి
వివరించునది
గాన
వేదాంత
దర్శనమనీ
ఈ
ఉత్తర
మీమాంస
పేరెన్నిగ
గన్నది.
బ్రహ్మ
సూత్రములు
మొత్తము
555
ఉన్నవి.
కొంతమంది
449
అనికూడా
అందురు.
సూత్రమంటే
కొలది
శబ్దములలో
గొప్పదైన
అర్థమును
స్ఫురింపజేయునది
అని.
మీమాంస
అను
పదమునకు
భారతీయ
తత్త్వ
శాస్త్రమునందు
నిర్ణీతార్థమున్నది.
జిజ్ఞాసా
విషయిక
సంశయా
సంభావనా
విపరీత
విభావనాది
నివర్తక
విచారమని
దాని
నిశ్చితార్థము.
వేదార్థములు
రెండు:
ఒకటి
ధర్మము,
రెండవది
బ్రహ్మము.
పూర్వమీమాంస
విషయము
ధర్మము.
ఉత్తర
మీమాంస
విషయము
బ్రహ్మము.
మొదటిదైన
పూర్వమీమాంస
'అథాతో
ధర్మజిజ్ఞాసా'
అని
ప్రారంభమగుచున్నది.
ధర్మము
పూర్వమీమాంస.
దీనికి
కర్మ
ప్రధానమైనది.
ఇట్టి
ప్రాప్తి
ధనముచేత,
దానివలన
పొందబడు
చదువులచేత,
అధికారములచేతలభించదు.
డిగ్రీలు,
డిప్లోమాలు,
యజ్ఞయాగాది
క్రతువులు
మొదలైనవేవియు
అజ్ఞాన
నివృత్తి
నొసగజాలవు.
దేహమనబడు
పుట్టలో,
మనస్సును
బిలములో
దాగుకొనియున్న
అజ్ఞాన
మను
సర్పము
కామ్య
కర్మలచేత
చంపబడదు.
'శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం'.
శాస్త్ర
వచనములందు,
దైవ
వాక్యములందు
విశ్వాసము
కలవారికే
జ్ఞానము
లభించును.
Next
Now, Therefore, the Inquiry into Brahman
→