Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Now, Therefore, the Inquiry into Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
స్వల్ప
అక్షర
పదాలతో
సారభూతమైన
అనంత
అర్థాన్ని
చాలా
తక్కువగా
సూచించేవి
సూత్రాలు.
సర్వోపనిషద్వాక్య
సుమములను
కూర్చిన
చేర్చిన
వేదాంత
శాస్త్రము
ఈ
బ్రహ్మసూత్రము.
ఒక్కొక్క
సూత్రము
ఒక్కొక్క
విధముగా
వ్యాఖ్యానింపబడినది.
ఒక్కొక్కరు
తమతమ
విశ్వాసములను,
అభిరుచులను,
అనుభవాలను,
ఆనందాన్ని
పురస్కరించుకొని
ఈ
సూత్రాలకు
వ్యాఖ్యానాలు
వ్రాశారు.
ఇందులో
మొదటి
సూత్రము:
'అథాతో
బ్రహ్మ
జిజ్ఞాసా'.
'అథ'
శబ్దమునకు
ఎన్నియో
అర్థములు
కలవు.
ఇచ్చట
'తరువాత'
లేక
'అనంతరము'
అను
అర్థమునే
మనము
తీసుకోవలసి
వచ్చును.
అయితే,
'దేని
తరువాత'
అని
మరొక
ప్రశ్న
వేసుకొన్న
'బ్రహ్మను
గురించి
జిజ్ఞాస
కలిగిన
తరువాత'
అని
తెలియును.
అట్టి
జిజ్ఞాసకు
ఎట్టివాడు
అధికారి?
అని
తిరిగి
మనము
ప్రశ్నించుకొన్న
ఆ
అధికారములు
ఏవి
అను
విచారణ
వచ్చును.
వీటినే
'అథ'
శబ్దము
సూచించుచున్నది.
ఇట్టి
జిజ్ఞాస
కేవలము
వేదాధ్యయనము
కాజాలదు.
ఇది
కేవలము
ధర్మజ్ఞానమునకు
అవసరమైనది.
అయితే
వేదాంత
అధ్యయనము
వలననే
బ్రహ్మజిజ్ఞాస
కలుగును.
బ్రహ్మజిజ్ఞాసకు
పూర్వాంగములలో
మొదటిది
వివేకము.
అనగా
నిత్య
అనిత్య
వస్తు
విచారణ.
అంటే,
ఆత్మ
మాత్రమే
నిత్యమనియూ,
దృశ్య
కల్పితమైనవన్నీ
అనిత్యమనియూ,
అన్నియూ
మార్పు
చెందునవేకాని
ఏదియూ
శాశ్వతమైనది
లేదనియూ,
వీటన్నింటికీ
ఆధారమైన
ఆత్మ
నిత్య
సత్యమనియూ,
దీర్ఘ
విచారణవలన
నిర్ణయము
గావించుకొని
సత్యాసత్యములను
విడదీయునదే
వివేకము.
ఇంక
రెండవది
ఇహాముత్ర
ఫలభోగ
విరాగము.
అనగా
మాలిన్యమునూ
దుఃఖమునూ
అనిత్యతను
విచారించి,
అంతా
అస్థిరత్వమేనని
భావించి,
సర్వం
2
▾
Meaning
Keep
దుఃఖం,
సర్వం
క్షణికం
అను
సత్యమును
గుర్తించిన
వైరాగ్యము
ఉదయించును.
వైరాగ్యమనగా
ఇల్లూ
వాకిలి,
ఆలుబిడ్డలను
వదలి
అడవికేగుట
కాదు.
జగత్తు
యొక్క
అనిత్యత్వమును
గుర్తించి
అభిమాన
మమకారములను
త్యజించుట.
ఇక
మూడవది
శమ
దమాది
గుణసంపత్తి.
ఇవి
ఆరు.
1.
శమము
2.
దమము
3.
ఉపరతి
4.
తితీక్ష
5.
శ్రద్ధ
6.
సమాధానము.
శమమనగా
మనో
నిగ్రహము.
ఇది
చాలా
కష్టముతో
కూడినది.
బంధమోక్షములకు
కారణమైనది
మనసు.
రజో
తమో
గుణములతో
మిశ్రమమైనది,
మలినమైనది
ఈ
మనసు.
వస్తువుయొక్క
సహజ
స్థితిని
మరుగుపరచునది
మనసు.
కనుక,
మొదలు
ఈ
మనసును
నిగ్రహించుకొన
వలెను.
దీనికి
రెండు
స్వభావములు
కలవు.
ఒకటి
ఇంద్రియముల
వెంట
పరుగిడిపోవుట.
మనసు
ఏ
ఒక్క
ఇంద్రియమునకు
లోబడినను
ప్రతికూలము
కలుగును.
పాత్రలోని
నీరంతయూ
కారిపోవలెనన్న
పాత్రకు
పది
రంధ్రములు
ఉండనక్కరలేదు,
ఒక్క
రంధ్రముండిననూ
చాలు.
పాత్రలోని
నీరంతయూ
కారిపోవును.
అటులనే
ఇంద్రియాదులలో
ఏ
ఒక్క
ఇంద్రియము
వశమునందు
లేకపోయినను
అతనిని
బంధములో
త్రోయును.
కనుక,
అన్ని
ఇంద్రియములనూ
నిగ్రహించుకొనవలెను.
ఇంక
రెండవ
లక్షణము.
సదభ్యాసములతో,
అనగా
ధ్యాన,
జప,
భజన,
పూజాది
సత్కర్మలచే
మనసుయొక్క
శక్తి
అధికమగును.
అట్టి
స్థితిలో
మనసుతో
లోకోపకారమును,
లోకాపకారమునుగానీ
చేయవచ్చును.
అయితే
అట్టి
సాధనలచే
లభించిన
మనశ్శక్తిని
చెడుత్రోవల
పోనీయకుండా
శమము
అనగా
ఇంద్రియములను
నిగ్రహించవలెను.
అంటే
ఇంద్రియములు
మనసును
3
▾
Meaning
Keep
అనుసరించక
బుద్ధిని
అనుసరించిన
శ్రేయస్కరమగును.
మనసనగా
తలంపుల
సమూహమే,
కోరికలయొక్క
మూటయే.
ఈ
కోరికలు
తలయెత్తిన
క్షణమందే
ఇది
మంచిదా
లేక
చెడ్డదా,
దీనివలన
ఉపకారమా,
అపకారమా,
దీని
పర్యవసానమేమి,
అని
విచారణ
చేయవలెను.
అట్లు
విచారణ
చేయని
మనసే
పెడమార్గము
పట్టును.
విచారించి
బుద్ధి
శక్తితో
అనుసరించిన
సరైన
మార్గము
ననుసరించును.
మానవునకు
ముఖ్యమైన
ఉపకరణములు
మూడు.
ఒకటి
బుద్ధి,
రెండవది
మనసు,
మూడవది
ఇంద్రియములు.
మనసు
ఇంద్రియముల
వశమైన
బంధప్రాప్తి.
ఇదే
మనసు
బుద్ధి
వశమైన
ఆత్మప్రాప్తి.
అందువలననే
మనసు
బంధమోక్షములకు
కారణమని
తెలుపబడెను.
ఇంక
రెండవది
దమము.
అనగా
శరీరమును,
ఇంద్రియములను
స్వాధీనము
చేసుకొనుట.
కేవలము
సాధనవలననే
శరీరమును
అదుపులో
ఉంచుకొనవచ్చునే
గాని,
వేరు
మార్గము
లేదు.
వృథా
కాలయాపనకుకానీ,
అజాగ్రత్తకుకానీ
అవకాశము
నివ్వకూడదు.
కర్మేంద్రియములకు,
జ్ఞానేంద్రియములకు,
శరీరమునకు
అనుకూలమైన,
ఉత్తమమైన
నియమిత
కర్మలను
ఏర్పరచుకొనిన
తామనమునకు
అనగా
సోమరత్వమునకు
తావు
ఉండదు.
తాను
చేయు
సకల
కార్యములను
లోపరహితముగా
చేయవలెను.
స్వధర్మాచరణచే
శరీరమును,
ఇంద్రియములను
స్వాధీనము
చేసుకొనవచ్చును.
మూడవది
ఉపరతి.
అనగా
ద్వంద్వాతీతుడగుట.
సుఖదుఃఖములు,
ఇష్టాయిష్టములు,
మంచిచెడ్డలు,
శీతోష్ణములు,
నిందాస్తుతులు
–
ఇవన్నియు
సామాన్య
మానవులకు
నిత్యానుభవములు.
అయితే,
ఈ
సామాన్యమైన
అనుభవములను
సాధనద్వారా,
విచారణద్వారా
అతిక్రమించి,
వాటికి
లోబడక
అతీతుడై
నిశ్చలుడై
యుండవలెను.
దీనినే
ఉపరతి
అని
అందురు.
సామాన్య
జీవితములో,
బ్రాహ్మణ
క్షత్రియ
వైశ్య
శూద్ర
అను
తెగలను
అనుసరించిన
కుల
గోత్రాది
బంధములయందుకానీ,
లేక
బాల్య
యౌవన
కౌమార
వార్ధక్యములను
అవస్థలందుకానీ,
స్త్రీ
పురుష
లింగ
భేదములందు
తగులుకొనక,
ఆత్మభావమును
మాత్రమే
దృష్టియందుంచుకొనిన
ఉపరతిని
సాధించవచ్చును.
4
▾
Meaning
Keep
ప్రపంచమును
ప్రపంచ
దృష్టితో
చూడక,
ఆత్మదృష్టితో
చూచిన
ద్వంద్వములకు
అతీతుడు
కావచ్చును.
నామ
రూపములను
మనో
కల్పితముగా
భావించవలెను.
అయితే
ఈ
ఉపరతి
నివృత్తికేకాని
ప్రవృత్తి
మార్గమునకు
కాదు.
నివృత్తి
జ్ఞానమార్గము,
ప్రవృత్తి
కర్మమార్గము.
వైదిక
కర్మలు
మోక్ష
సాధనలు
కావు;
కేవలము
చిత్తశుద్ధిని
మాత్రమే
చేకూర్చును.
స్వర్గప్రాప్తి
లభించునని
అందురుకాని,
అదీ
ఒక
బంధనేకాని
మోక్షము
కాదు.
జ్ఞానము
శ్రవణ,
మనన,
నిదిధ్యాసలవలననే
లభించును.
నిష్కామికి
మాత్రమే
శ్రవణమునందు
అధికారము
కలదు.
చిత్తశుద్ధి
కలిగిన
పిమ్మట
కర్మలు
నిరుపయోగము.
కనుక,
ఆత్మాభిమానులై,
సర్వం
ఆత్మమయం
అను
విశ్వాసమును
అభివృద్ధిపరచుకొన్న
ద్వంద్వములను
అతిక్రమించవచ్చును.
నాలుగవది
తితీక్ష.
అనగా,
తనకు
సంభవించిన
దుఃఖమునకు,
లేక
అపకారమునకు,
కీడునకు,
నష్టమునకు
విచారించక,
సంతోష
శాంతులతో,
ఇవన్నియు
తాను
పూర్వము
చేసుకొన్న
కర్మల
ఫలితములేకాని
వేరు
కాదని
తలంచి,
అట్లు
అపకారము
చేసినవారిని
కూడా
ఆప్యాయతతో
చూచుచు,
ఓర్పుతో,
సహనముతో,
సంతోషముతో
ఉండుట.
ఎంతటివాడైనా
ప్రారంభ
దశలో
కీడు
చేసినవారికి
తిరిగి
కీడు
చేయవలెననియు,
అపకారము
చేసినవానికి
తిరిగి
అపకారము
చేయవలెననియు,
తనను
అవమానపరిచినవానికి
తిరిగి
ఏదో
ఒక
విధముగా
అపకారము
జరుగవలెననియు
తలంచుట
సహజము.
అయితే
ఇది
ప్రవృత్తి
లక్షణము.
కాని,
నివృత్తి
మార్గమును
అనుసరించువారికి
ఇట్టి
తలంపులు
ఉండరాదు.
ప్రత్యపకారము
మరొక
తీరని
కర్మ
కాగలదు.
ఇట్టిదానినే
'ఆగామి'
అందురు.
ఉత్తరోత్తరంగా
దీనిని
తిరిగి
అనుభవించక
తప్పదు.
ప్రత్యపకారమువల్ల
కర్మ
క్షయము
కాదు,
అభివృద్ధి
అగును.
ప్రత్యపకారమువలన
సాధకునకు
తాత్కాలిక
తృప్తి
కలుగునేమోకాని
మున్ముందు
అది
తనను
బాధించును.
కాన
అపకారికి
ఉపకారము
చేయుట
తితీక్ష
అర్థము,
నివృత్తి
మార్గము.
5
▾
Meaning
Keep
ఐదవది
శ్రద్ధ.
అనగా
శాస్త్రములయందు
లేదా
శాస్త్ర
వాక్యములయందు,
ఆత్మయందు,
గురువులయందు
అచంచలమైన
విశ్వాసము,
నమ్మకము
ఉండవలెను.
నమ్మకమే
శ్రద్ధ
లక్షణము.
గురువులు
పూజనీయులు,
శ్రేయోమార్గమును
చూపువారు.
శాస్త్రములు
లోక
క్షేమమును,
ప్రజా
శ్రేయస్సును
కోరునవి,
చూపునవి.
కనుక,
అట్టి
పవిత్ర
శాస్త్రములపై,
గురువులపై,
పెద్దలపై
నమ్మకము
కలిగి
ఉండవలెను.
గురువులనగా
సర్వ
జీవాత్మైక్య
జ్ఞానమును
మాత్రమే
బోధించవలెను.
దీనిని
తు.చ.
తప్పకుండా
అనుసరించి
నమ్మి
ఆచరించుటలో
శ్రద్ధను
పొందియుండవలెను.
"శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం."
ఆరవది
సమాధానము.
శాస్త్రమునందు
తెలుపబడినది,
గురువు
ఉపదేశించినది
రెండూ
ఒక్కటే
అని
నిశ్చితమును
పొందవలెను.
సర్వకాల
సర్వావస్థలయందును
బుద్ధిని
ఆత్మయందుంచుకొనవలెను.
సాధకుడు
నిత్య
చైతన్యమునే
ఆశ్రయించవలెను.
సర్వకర్మలు
భగవత్ప్రీత్యర్థము
చేయవలెను.
సమస్త
ప్రాణులు
ఈశ్వరాంశమే
అన్న
శాస్త్ర
వాక్యమును
దృఢముగా
విశ్వసించవలెను.
సర్వులయందు
సమదృష్టిని
సాధించుటే
విశ్వాసమునకు
బలము.
పై
ఆరింటినే
సాధన
సంపత్తి
అని
అందురు.
ఇక
ముముక్షుత్వము.
అనగా
మోక్షాపేక్ష
కలిగి
ఉండుట.
ఇది
ధనముచేతగాని,
దానివలన
పొందబడు
చదువుచేతగాని,
సంపదలతోగాని,
సంతతితోకాని,
యజ్ఞ
యాగాది
క్రతువులచే
కాని,
దాన
ధర్మాది
కార్యములచే
కాని
లభించునది
కాదు.
అజ్ఞాన
నివృత్తి
రూపమైనదే
మోక్షము.
సర్వ
శాస్త్రములనూ
వ్యాఖ్యాన
సహితముగా
పఠించిననూ,
సత్కర్మలచే
దేవతలను
తృప్తిపరచినంతమాత్రముననూ
ఈ
కామ్య
కర్మలు
మోక్ష
మార్గములు
కావు.
"జ్ఞానాదేవతు
కైవల్యమ్".
ఆత్మజ్ఞానము
తప్ప
మరే
మార్గములూ
మోక్షమును
అందించలేవు.
వంటకు
కావలసిన
పదార్థములనన్నింటిని
సమకూర్చుకొన్నను
అగ్ని
లేకపోయినచో
వంట
ఎట్లు
వండలేమో
అటులనే
పొట్టకూటి
విద్యలెన్ని
నేర్చినను,
కామ్య
కర్మలెన్ని
చేసినను
ఆత్మజ్ఞానము
లేకుండిన
ముక్తి
లభించదు.
6
▾
Meaning
Keep
పుణ్యనదీ
జలములో
స్నానము
చేసినంతమాత్రమున
ముక్తి
లభించునన్న,
నిరంతరం
ఆ
నదిలోనే
జీవించు
జల
చరముల
స్థితి
ఏమి?
గుహలలో
జీవించినంతమాత్రమున
ముక్తి
లభించునన్న,
అందులోనే
వాసము
గావించుకొని
జీవించుచున్న
ఎలుకలు,
క్రూర
మృగములకు
లభించునదేమి?
కందమూలాదులతో
జీవించి,
ఆకులలములు
మేసి
తపించిన
మోక్షమన్న,
ఆకులను,
తుంగగడ్డలనే
తిని
జీవించు
మేకలు,
పందులు
ముక్తికి
పోవలసినదేనా?
ఒడలు
నిండా
బూది
పూసుకొనుటయే
తపస్సన్న,
బూడిదలో
పొర్లాడు
కుక్కలూ
గాడిదలూ
మోక్షార్హత
కలిగినవే
కదా!
ఈ
మూర్ఖత
మోక్షాపేక్ష
కాదు.
ఆత్మజ్ఞానం
సంపాదించాలి.
'అథ'
అను
శబ్దమునకు
అనంతరమని
తెలుపబడెను.
అయితే
దేని
అనంతరం
అని
విచారించిన,
పై
చెప్పిన
సాధన
చతుష్టయ
సంపత్తి
కలిగిన
తరువాత.
'అతః'
-
ఈ
కారణముచేత.
అంటే
ఏ
కారణమువలన?
శాస్త్రములను
పరిశోధించి
విచారణ
సలిపిననూ,
కర్మలవలనకానీ,
వస్తువులవలనకానీ,
వ్యక్తులవలనకానీ
మోక్షము
లేదా
బ్రహ్మప్రాప్తి
లభించదు.
కారణమేమన,
వస్తువులు,
వ్యక్తులు,
కర్మలు
అనిత్యములు.
అన్నియూ
నశించునవే.
చిత్తశుద్ధిని
కలిగించు
కర్మద్వారా
ముక్తి
లభించదని,
బ్రహ్మప్రాప్తి
చేకూరదని
తెలుసుకొన్న
కారణము
వలన
బ్రహ్మజిజ్ఞాసకు
అధికారి
కాగలదు.
మొత్తమున
ఈ
సూత్రము
ముఖ్యముగా
బోధించునదేమన
అధ్యాత్మజ్ఞానమును,
తన
జీవితములో
అభ్యసించు
మానవుడు
శీల
పవిత్రుడైయుండవలెను.
అతని
ప్రవర్తన
పవిత్రమై
యుండవలెను.
గుణమునకు
మించిన
జ్ఞానము
మరొకటి
లేదనియు,
గుణమే
నిజమగు
బలమని,
జ్ఞానాన్వేషణకు
అర్పితమైన
మానవునకు
శీల
సంపత్తి
ప్రధానమని
నిరూపించుచున్నది.
సమస్త
శాస్త్రముల
సారము,
సర్వధర్మమయమైన
శీలము
ప్రధాన
సాధనము.
శీలము
ఒక్క
జాతికి,
మతమునకు,
సంప్రదాయమునకు
సంబంధించినది
కాదు.
దీనిని
సర్వ
సమన్వయ
పద్ధతిలో
బోధించాలి.
దీనిని
ఆశ్రయించినవారు
ఏనాటికైననూ
7
▾
Meaning
Keep
చెదరు,
పుణ్యాత్ములు
కాగలరు.
జీవుల
అంతఃకరణ
శుద్ధికి
గుణములు
ప్రధాన
మార్గము.
ఈ
గుణము
ఏది
చేయవలెను,
ఎట్లు
చేయవలెను
అని
చక్కగా
విచారించును.
నొసటివ్రాత
మంచిదయినవారికే
ఈ
గుణము
ప్రాప్తించును.
ఈ
గుణమే
భవసాగరమును
దాటించు
భద్రమైన
నావ.
గుణమును
ఆశ్రయించిన
వారికి
మోక్షమున
స్థలము
కలదు.
ఎంతటి
ప్రారబ్ధ
కర్మలనుభవించువాడైననూ
శీలపోషణ
కలవానిని
కర్మఫలమంటదు.
ఇతను
పరమానంద
రూపమైన
బ్రహ్మను
చేరును.
ఎన్ని
యజ్ఞ
యాగాది
కర్మల
నాచరించి,
ఎన్ని
విధములైన
శాస్త్రములను
చదివి
వివరములను
బోధించు
మహామహా
పండితులైననూ,
వేదాధ్యయనము
గావించు
విప్రుడైననూ,
ధన
ధాన్య
యశస్సులతోకూడిన
శ్రీమంతుడైననూ,
వేద
వేదాంగములను
అర్థ
సహితంగా
బోధించువాడైననూ
శీలమే
లేకుండిన
అట్టివానికి
బ్రహ్మవిచారమున
స్థానమే
లేదు
-
అని
ఈ
సూత్రము
బోధించుచున్నది.
మోహ
పంకిలములనుండి
బుద్ధి
ఎప్పుడు
విముక్తి
చెందునో,
అప్పుడే
సమత్వ
స్థితి
కలుగును.
సమత్వ
స్థితి
కలిగినంతనే
బుద్ధి
ఆత్మానుసారము
నడచుకొనును.
ఆత్మానుసారము
అనుసరించు
బుద్ధికే
గుణము
అని
పేరు.
అట్టి
గుణవంతునకే
ఆత్మప్రాప్తి
లభించును.
ఒక్కమారు
ఆత్మజ్ఞానము
లభించెనా
తిరిగి
అట్టివాడు
మోహమున
ప్రవేశించడు,
మోహము
అంటదు.
ఆశ
పాశాది
గుణములు
జీవ
లక్షణములేకానీ
ఆత్మగుణములు
కావు.
మమకార
అభిమానములు,
కామక్రోధాది
ఆవేశములు
శరీర
మనోవ్యాపారములచే
ఆవిర్భవించునవి.
ఇవి
అణచిన
తరువాతనే
సద్గుణములు
ప్రారంభమగును.
పైన
తెలిపిన
కర్తృత్వ,
భోక్తృత్వ
లక్షణములు
ఆత్మయందు
ప్రతిబింబించినంత
మాత్రాన
అవి
ఆత్మగుణములు
కావు.
అద్దములో
వస్తువులు
ప్రతిబింబించినంత
మాత్రమున
అద్దముయొక్క
పారిశుద్ధ్యమునకు
ఎట్లు
భంగము
ఉండదో
అటులనే
గుణవంతునిలో
పూర్వపు
ప్రారబ్ధముచే
కొన్ని
దోషములు
ప్రతిబింబించిననూ
వాటివలన
అతని
ప్రస్తుత
శీలమునకు
భంగము
కలుగదు.
Previous
←
Sūtra Vāhini
Next
That from Which This World Is Born
→