Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of the Teaching Well-Known Everywhere
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"జన్మాద్యస్య
యతః"
అనే
సూత్రములో
ఆకాశాది
సంపూర్ణ
జగత్తుయొక్క
కారణ
రూపము
బ్రహ్మయని
చెప్పబడినది.
సమస్త
జగత్తుయొక్క
కారణ
రూపము
బ్రహ్మమే.
ప్రాణ
శబ్దము
పరబ్రహ్మయందే
వర్తించును.
సర్వత్ర
ప్రసిద్ధోపదేశాత్
వేదాంత
వాక్యములందు
అన్నిచోట్లను
ప్రసిద్ధమగు
బ్రహ్మపదమునే
చెప్పి
యుండుటవలన,
ప్రస్తుత
వాక్యమునకంతటికీ
గుణము
కలవాడు
పరబ్రహ్మమే
కానీ
జీవుడు
కాదని
కొందరు
విమర్శకులు
చెప్పుచూ
వచ్చిరి.
ప్రసిద్ధమగు
బ్రహ్మమే
"సర్వం
ఖల్విదం
బ్రహ్మ".
ఈ
కనబడునదంతయు
పరబ్రహ్మమే
అనునట్టి
ఉపక్రమ
వాక్యమునందు
ప్రయోగింపబడియున్నది.
శ్రుతి
వాక్యానుసారము
జగత్తు
పరబ్రహ్మ
స్వరూపమే.
ఎట్లనగా
దీని
ఉనికి
బ్రహ్మకు
భిన్నముకాదు.
రాగ
ద్వేషాదులకు
దూరముగా
నుండి
చూచిన
సమస్త
హేతు
రూపము
బ్రహ్మమే.
కాని,
రాగ
ద్వేషాల
దృష్టితో
చూచిన
అంతా
భిన్నమే.
రాగ
ద్వేషములు
ఏకత్వాన్ని
అనేకత్వంగా
చూచును.
శాంతి
అనేకత్వమును
ఏకత్వంగా
భావించును.
శాంతిరహితులైనవారు
భిన్నభావములతో
పరికించుటచేత
బ్రహ్మం
వేరు,
జగత్తు
వేరు
అని
భావింతురు.
దృష్టిని
బట్టి
సృష్టి.
ఒకే
యజమానుడు
కొమారునికి
తండ్రిగా,
భార్యకు
భర్తగా,
కోడలికి
మామగా,
మనుమనికి
తాతగా,
తమ్మునికి
అన్నగా
కనిపించును.
యజమానుడు
ఒక్కడే
అన్న
లక్ష్యమును
మరతురు.
కారణం
వారి
దృష్టి;
వారి
సంబంధములు
వేరువేరుగా
తలంచుటే.
అటులనే
విమర్శకుల
దృష్టి,
విమర్శకుల
భావములు
వేరువేరు
స్థితియందుండుటచే
ఒకే
బ్రహ్మను
వేరువేరు
రూప
నామములతో
అనుభవించుచు
వచ్చిరి.
అంతేకాదు.
ఉపాసనా
భావమును
పురస్కరించుకొని
కూడా
జీవ
-
ఈశ్వర,
శక్తి
-
పురుషుడు
అను
భేదములు
ఏర్పడుచున్నవి.
సర్వజ్ఞునకుండు
సత్య
సంకల్పాది
గుణములు
జీవులకుండుటకు
వీలు
లేకపోవుటచేత
జీవ
గుణములు
అనగా
జన్మ
లయత్వాదులు
బ్రహ్మవి
కాదనుకొనుచున్నారు.
Previous
←
Because Prāṇa Follows in the Same Way