Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because Prāṇa Follows in the Same Way
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
కార్యజ్యోతి
ఉపాధిగా
గల
బ్రహ్మమునందే
ఆ
పదములన్వయించుచున్నవి.
ఒకదానిని
ప్రకాశింపజేయునది
'దీప్యతే'
అని
తెలుపుచున్నది.
అయితే,
సమస్త
జగత్తునకు
ప్రకాశము
నొసగు
బ్రహ్మమును
జ్యోతి
అని
తెలుపుట
శ్రుతి
వాక్యము.
కదిలే
జగత్తుకు
ఆధారమై,
మూలమై,
కీలకమై,
స్థిరముగా
కదలక
సత్యమై
యుండునది,
అదే
బ్రహ్మ,
అదే
జ్యోతి.
కదిలే
జగత్తుకు
ఆధారమైన
బ్రహ్మ
కూడా
కదిలిన
అదే
ప్రళయము.
చిన్న
ఉదాహరణము
-
రైలు
కదలిపోతూ
ఉంటుంది.
దానితోపాటు
పట్టాలుకూడా
కదలిన
ప్రయాణీకుల
గతి
ఏమవుతుంది?
అటులనే
మనము
కదలుచుండినను
మనము
నడిచే
దారులు
కదలవు.
అందువలననే
మనము
క్షేమముగా
ఉండగలుగుతున్నాము.
సమస్త
జ్యోతులను
అనగా
ఒక్కొక్కదానికి
వెలిగించే
జ్యోతిని
దీపమని
యందురు.
సమస్తమునూ
వెలిగించి,
నిరూపించే
దానిని
జ్యోతి
అందురు.
లోకములోని
అగ్నిని,
జఠరములోని
అగ్నిని,
కన్నులలోని
చూపును,
చంద్రునిలోని
కాంతిని
వెలిగించేది
సూర్యుడు.
ఆ
సూర్యుని
వెలిగించేది
బ్రహ్మ.
అట్టి
బ్రహ్మయే
జ్యోతి
అని
చెప్పబడినది
కాని,
పదార్థములను
వెలిగించేదానిని
కాదు.
జగత్తునే
వెలిగించేదానిని
జ్యోతి
అని
చెప్పనగును.
ప్రాణస్తథాఽనుగమాత్
ఇక్కడ
ప్రాణ
శబ్దమున
చెప్పబడినది
ప్రాణ
వాక్యము
బ్రహ్మమే
అగునుకానీ,
అన్య
అర్థములు
అనగా
ఇంద్రుడు,
రుద్రుడు,
వాయువు
ఇత్యాది
అర్థములు
కావు.
ఒకానొక
సమయమున
ప్రతర్దనుడు
మనుష్యునకు
అత్యంత
హితము
కలిగించునదేదో
తెలుపమని
ఇంద్రుని
ప్రార్థించగా,
అపుడు
ఇంద్రుడు
ప్రాణము
నేను,
నన్ను
నీవు
ఆయువనియు
తలంపుమని,
ఉపాసింపుమని
అంటాడు.
ఇంకనూ
అనేకవిధముల
ప్రాణమును
వర్ణించుచు
-
"స
ఏష
ప్రాణ
ఏవ
ప్రజ్ఞాత్మానందోఽజరోఽమృతః"
అన్నాడు.
అనగా
ఆ
ప్రాణము
ఆనంద
2
▾
Meaning
Keep
స్వరూపము,
అజరము,
అమృతము
అని
ప్రబోధిస్తాడు.
ఈ
వాక్యమునందు
కూడా
ప్రత్యక్షముగా
బ్రహ్మ
లక్షణములే
చెప్పబడినవి.
ఏతావాతా
చక్కగా
పరిశీలించి
చూచిన
ప్రాణ
వాక్యమునకు
ప్రాణ
శబ్దమును,
బ్రహ్మమనే
(పరబ్రహ్మమనే)
అర్థము
వివరమగుచున్నది.
కానీ,
అన్య
అర్థములు
కనిపించవు.
అన్య
అర్థములు
కావు.
మరొక
విధముగా
విమర్శించి
చూచిన
మనుష్యునికి
హితమైనది,
ప్రధానమైనది
యేది
అంటే
ప్రాణము
అని
స్థూలార్థము
కాగలదు.
కానీ,
ఆ
ప్రాణము,
బ్రహ్మ
వాచకమగుటచేత
పరబ్రహ్మ
ప్రాప్తి
మనుష్యునికి
హితము,
ప్రధానము
అని
తేలుచున్నది.
లోకములోని
సామాన్య
మానవులు,
వ్యావహారిక
రీతిని
ధన,
కనక,
వస్తు
వాహనాదులు
ప్రధానములని
భావింతురు.
అవియే
జీవిత
లక్ష్యములని
వాటి
వెంటబడి
వాటిని
సంపాదించుకొనుటకు
ప్రయత్నింతురు.
ఈ
ప్రయత్నములో
మానవుడు
తన
అమూల్యమైన
మానవత్వమును
వ్యర్థము
గావించుకొనుచున్నాడు.
జీవితమును
వ్యర్థము
గావించుకొనుటయేగాక
పూర్ణ
అజ్ఞానమును
పెంచుకొనుచున్నాడు.
తన
స్వరూపాన్ని
విస్మరించుచున్నాడు.
మరొక
సమయమున
ఇంద్రుడు
'మామేవ
విజానీహి'
అన్నాడు.
అనగా,
నన్నే
బాగా
తెలుసుకొమ్మని
అర్థము.
ఇక్కడ
కూడా
ఇంద్రుడనగా
అవయవములు
కల
ఒకానొక
దేవత
అని,
ఆ
దేవతయే
ప్రాణశబ్దముచేత
చెప్పినవాడు
కావలయును,
ఇక్కడ
బ్రహ్మమనుటకు
వీలులేదు
అను
తలంపుతో
ప్రాణమనగా
ఇంద్రుడని
చెప్పిరేకాని
అది
సరికాదు.
ప్రాణ
శబ్దము
పరబ్రహ్మమే
అని
తలంచవలెను.
ఇంకా
కొందరు
దేవేంద్రుడు
తనయందున్న
పరబ్రహ్మ
స్వరూపమును
తెలుసుకొమ్మని
చెప్పియుండవచ్చును
అన్నారు.
ఈ
కారణమువలన
ఇచ్చట
ప్రాణ
శబ్దము
పరబ్రహ్మకే
సంకేతమని
గ్రహించిరి.
లౌకిక
దృష్టితో
ప్రాణ
శబ్దమును
ఇంద్రునకు
సంబంధము
కలిగించుచున్నారు.
ఆధ్యాత్మికంగా
భూమా
అనగా
పరబ్రహ్మముతో
మిక్కిలి
సంబంధము
కలిగియున్నది.
దీనిని
పురస్కరించుకొనే
భాష్యకారులు
అనేక
3
▾
Meaning
Keep
విమర్శలు
చేసి
వ్యావహారిక
పారమార్థికంగా
పరిశీలన
జరిపి
రెండింటినీ
సమన్వయపరచి
రెండింటియందూ
ఉన్న
తత్త్వము
ప్రాణమేయనియు,
ఈ
ప్రాణము
బ్రహ్మకే
సంకేతమనియు
నిర్ణయించిరి.
ప్రాణము,
బ్రహ్మమునకు
అవినాభావ
సంబంధమనియు,
రెండు
ముఖములతో
కూడిన
నాణెము
వంటిదనియు,
ఒకదానిని
విడచి
మరొకటి
ఉండలేదనియు,
వీలుకాదనియు
నిర్ణయించిరి.
మొత్తముపై
ప్రాణ
శబ్దము
పరబ్రహ్మమే
అన్నది
పరమ
సత్యము.
ఉపాస్య
దేవత
పరబ్రహ్మమే
కాని
వేరొకటి
కాదు
-
అని
తాత్పర్యము.
"శాస్త్ర
దృష్ట్యాతు
ఉపదేశ
వామదేవవత్",
వామదేవుడను
మహాముని
ఉపదేశించిన
ప్రకారముగా
శాస్త్ర
దృష్ట్యా
"అహం
బ్రహ్మాస్మి",
"తత్
త్వమ్
అసి",
"ప్రజ్ఞానం
బ్రహ్మ",
"అయమాత్మా
బ్రహ్మ"
వాక్యములను
వినుటవలన
కలిగిన
అపరోక్ష
బ్రహ్మజ్ఞానముచేత.
పై
"అహం
బ్రహ్మాస్మి"
అను
వాక్యమును
ధ్యానము
చేయుటచేత,
ప్రాణ
శబ్దమునకు
ఇంద్రుడు
అని
ఉపదేశము
చేయుటలో
తప్పు
లేదని
భావింతురు.
ఇది
అనుభూతికి
రాకమునుపు
తోచిన
భావము,
అనగా
బ్రహ్మజ్ఞానము
కలుగకపూర్వము
వామదేవ
మహాముని,
ప్రాణమనగా
ఇంద్రుడు
అని
తలంచియుండవచ్చును;
బ్రహ్మజ్ఞానము
కలిగిన
తరువాత
"అహం
మనురభవం",
నేనే
సర్వాత్మకుడనని
ఎట్లు
చెప్పెనో
అటులనే
ఇంద్రుడు
పరిపూర్ణ
జ్ఞానము
కలవాడగుటచే
ప్రాణపదము
బ్రహ్మము
అని
చెప్పుటలో
విరోధము
లేదని
మరికొందరు
భావింతురు.
బ్రహ్మమునకు
ఏమైనా
చెప్పవచ్చును.
"సర్వం
బ్రహ్మ,
సత్యం
జ్ఞానమనంతం
బ్రహ్మ,
సత్యం
బ్రహ్మ,
ప్రాణం
బ్రహ్మ,
అనంతం
బ్రహ్మ,
జ్ఞానం
బ్రహ్మ"
-
ఈ
వాక్యములను
ఆధారము
చేసుకొని
అన్నింటినీ
బ్రహ్మవాక్యమునకే
సమన్వయ
పరచవచ్చును.
సర్వం
బ్రహ్మమునుండి
వెలువడినవే.
ఆభరణముల
రూప
నామములు
వేరువేరైనంత
మాత్రమున
బంగారు
స్వభావము
పోదు
కదా!
వ్యావహారిక
జగత్తున
రూప
నామములు
భిన్నముగా
కనిపించి,
వినిపించినంతమాత్రమున
పారపడరాదు.
లక్ష్యార్థమును
గుర్తించిన
అన్నింటికీ
బ్రహ్మమే
కారణము.
ఇదే
మూలాధారము.
మానవుని
లక్ష్యం
బ్రహ్మం
కానీ,
ఇంద్రుడు
కాదు.
Previous
←
Because of the Naming of Light and Feet
Next
Because of the Teaching Well-Known Everywhere
→