Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Kaivalya comes from Jñāna alone
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1.
జ్ఞానాదేవతుకైవల్యం
మానవుడు
పరబ్రహ్మ
స్వరూపుడైనప్పటికి
పంచ
మహా
భూతముల
యొక్క
గుణములతో
కలసిమెలసియుండుటచే
జీవుడనబడుచున్నాడు.
ఆ
జీవి
పంచభూతములచే
కలిసి
యుండుటవలననే
జనన,
మరణ,
సుఖ,
దుఃఖ,
పాప,
పుణ్యములు
కలుగుచూ,
తలంచుచూ,
భ్రమించుచున్నాడు.
పంచభూతములకు
దూరముగా
నుండి
వాటి
నుండి
విడుదల
నొందుటే
“కైవల్య”మనియూ,
“మోక్ష”మనియూ,
“ముక్తి”అనియూ
అనేక
నామములతో
పిలువబడుచున్నది.
మూడునూ
ఒక్కటియే!
నామములు
వేరు.
పంచ
భూతములతో
కలసి
యుండుటవలన,
పంచ
భూతములచే
నిర్మింపబడిన
జీవుల
చేతను,
ధనాది
వస్తు
వాహనముల
చేతను
భయమొందుచున్నాడు.
ఒక్కొక్క
సమయమందు
వాటిపై
మోహముంచి,
వాటిని
పొందుటకై
తపించుచున్నాడు.
మరొకపుడు
వాటినే
ద్వేషించి
నిశ్చింతగా
ఉంటున్నాడు.
2
▾
Meaning
Keep
అన్నింటికి
మూలస్థానం
పరమాత్మయే!
జీవికి
ఆధారము
భూమి;
దానికి
ఆధారము
జలము;
దానికి
జన్మస్థానము
అగ్ని;
అగ్ని
వాయువునుండి;
వాయువు
ఆకాశమునుండి;
ఆకాశము
ప్రకృతినుండి;
అట్టి
మూలప్రకృతి
పరమాత్మనుండీ,
కాన
అన్నింటికినీ
మూలస్థానము
పరమాత్మనే!
3
▾
Meaning
Keep
అట్టి
మూలస్థానమైన
పరమాత్మను
చేరవలెనన్న
పంచభూతములలో
పడిన
జీవి,
నిత్యానిత్య
విచారణచేతను,
అభ్యాస
వైరాగ్యములచేతను
ఒక్కొక్క
భూతమును
క్రమముగా
దాటి
తన
మూలస్థానమైన
పరబ్రహ్మమున
కలసిపోవలెను.
అట్టి
వానినే
జీవన్ముక్తుడందుము.
నిత్యానిత్య
విచారణకు,
నిజరూప
సందర్శనమునకు,
ఆధారభూతములైనవే
ఉపనిషత్తులు.
ఉపనిషత్తులే
వేదాంతములనబడును.
ఇవి
కేవలము
జ్ఞానకాండమును
బోధించును.
జ్ఞానము
వలననే
ముక్తి
లభించును.
అందుకనే
“జ్ఞానాదేవతు
కైవల్యం”
అని
ఉపనిషత్తే
చెప్పింది.
4
▾
Meaning
Keep
“కాండత్రయాత్మకం
వేదం”
అన్నట్లు
వేదమువలెనే
ఉపనిషత్తులు
కూడనూ
కాండత్రయాత్మకమై
యున్నవి.
జ్ఞానకాండ,
ఉపాసనాకాండ,
కర్మకాండములు
ఇందులో
కూడనూ
కలవు.
ఈ
మూడు
పవిత్ర
కాండములూ
ఒక్కొక్క
దృష్ట్యా,
అద్వైత,
ద్వైత
విశిష్టాద్వైత
మతాలను
సమన్వయించుచున్నవి.
“ఉపనిషత్”తో
స్థితిరూప
నిష్ఠను,
“బ్రహ్మవిద్యయాం”తో
నిధిధ్యాసమును,
“యోగశాస్త్రము”తో
మననమును
గ్రహించవలెను.
ఇన్నింటి
మూలమున
చేయునదేది?
తెలిసికొనునదేది?
అది
తన
నిజస్థితినే!
తన
స్వరూపమునకు
ఏయే
ప్రాప్తిని
చేకూర్చునో,
యెట్లు
చేకూర్చునో
సంపూర్ణ
అర్థముతో
చేరుటవలననే
“ఉపనిషత్”
అని
పేరు
వచ్చినది.
5
▾
Meaning
Keep
అద్వైతామృతమే
ఉపనిషత్సారం
అసలు
ఉపనిషత్
యొక్క
అర్థము
కడుసారవంతము.
“ఉప”
అనగా
సమీపములో,
“ని”
అనగా
నిష్ఠతో
శ్రవణము
చేసినవారి
అజ్ఞానమును
శిథిలము
చేసి,
“షద్”
అనగా
పరమాత్మ
ప్రాప్తిని
చేకూర్చుట.
అట్టి
కారణములను
బట్టి
ఉపనిషత్తులని
పేరు
వచ్చినది.
ఉపనిషత్
అంటే
కేవలము
విద్యను
బోధించుటే
కాక
ఆ
బోధించిన
విద్యను
ఆచరణలో
పెట్టే
ప్రక్రియను
కూడా
బోధించుచున్నది.
ఏ
కర్మ
ఏ
విధి
ధర్మముగా
చేయవలెనో
అట్లు
తెలుపుటయేకాక,
ఏ
కర్మ
చేయదగినదో,
ఏ
కర్మ
చేయరానిదో
అను
విషయమును
కూడా
తెలుపుచున్నది.
6
▾
Meaning
Keep
అసలు
గీతను
తీసికొన్న
ఉపనిషత్
సారమే
కదా!
ఉపనిషత్
శ్రవణముద్వారా
కలుగవలసిన
ఫలితము
గీతాబోధ
ద్వారా
అర్జునునకు
కలిగినది.
ఉపనిషత్లోని
“తత్త్వమసి”
గీతలో
“పాండవానాం
ధనంజయ”
అను
వాక్యముగా
బోధింపబడినది.
అనగా
పాండవులలో
ధనంజయుడవైన
నీవే
నేను
అని
కృష్ణపరమాత్మ
జీవేశ్వర
ఐక్యాన్ని
తెలిపెను.
7
▾
Meaning
Keep
కాన
గీత
కానీ,
ఉపనిషత్తులు
కానీ
అద్వైతామృతమే
కాని
ద్వైత,
విశిష్టాద్వైతములు
కావు.
అల్పక్రిములను,
అణువులను,
సూర్యగోళములను
పరిశీలించుటకు
మానవ
నేత్రములకు
అట్టి
శక్తి
సామర్థ్యములు
లేనందున
టెలిస్కోపు,
మైక్రోస్కోపు
అను
యంత్రములను
ఏ
రీతిగా
సహాయకారిగా
శాస్త్రజ్ఞులు
ఉపయోగింతురో
అటులనే
నైతిక,
ఆధ్యాత్మిక,
ధర్మములను
అనుసరించి
చిత్తశుద్ధి
కలిగిన
మహనీయులు
జ్ఞాన
చక్షువుల
ద్వారా
పరమేశ్వరుని
చూడగలుగుచున్నారు.
8
▾
Meaning
Keep
అల్ప
క్రిములను,
అణువస్తువులను
చూడజాలని
మానవ
నేత్రములు
యంత్రసహాయము
ఆశించగా,
సర్వవ్యాపియగు
పరాత్పరుణ్ణి
చూడగోరుటకు
మంత్ర
సహాయము
ఆశించక
ఎట్లు
చూడగలరు?
జ్ఞాననేత్రమును
పొందుట
సులభమైనది
కాదు.
దీనికి
ప్రత్యేకాగ్రత
యవసరము.
ఏకాగ్రతను
అలవఱచుకొనుటకు
చిత్తశుద్ధి,
నైతిక,
ఆధ్యాత్మిక,
వివేకము
ముఖ్యము.
సామాన్య
మానవులకు
ఇది
అంత
సులభము
కాదు.
9
▾
Meaning
Keep
ఉపనిషత్తులు
అపౌరుషేయాలు
కానీ
ఇతర
జంతువులవలె
కాక,
మానవునకు
ప్రత్యేక
విజ్ఞానము
పరమాత్ముడు
ప్రసాదించినాడు.
దానిని
వృద్ధి
చేసుకొనవలెను,
ఆ
విజ్ఞానము
ద్వారా
ప్రత్యగాత్మయను
పరమేశ్వరుని
కనుగొనవలెను.
అటుల
చేయక
భగవంతుడెక్కడున్నాడు?
ఉండిన
కనపడడెందులకు?
అని
వాదించు
వారలను
చూచిన
చాలా
విచారము
కలుగును.
అంతియే
కాక
వారి
అజ్ఞానమును
వారే
వెల్లడి
చేసుకొనుచున్నారే
అని
అనిపించును.
10
▾
Meaning
Keep
ఎ,
బి,
సి,
డిలు
నేర్చుకొనకుండా
బి.ఎ.లు,
ఎం.ఎ.లు
ప్యాసు
కావలెనను
వారి
అజ్ఞానము
ఎట్టిదో,
ఏ
సాధనా
చేయక,
భగవంతుడు
కనిపించలేదే?
అని
వాదన
చేయువారి
అజ్ఞానమూ
అట్టిదే!
చివరకు
నైతిక
ధర్మమునైననూ
పాటించక
ఈశ్వరుణ్ణి
చూడవలెననుట,
అమాయకుడనే
చెప్పవలెను.
11
▾
Meaning
Keep
ఆధ్యాత్మిక
సాధన,
పవిత్రమైన
శాస్త్రముపై
ఆధారపడియున్నది.
అది
త్రుటిలో
సంపాదించునది
కాదు.
మాటలతో
రాదు.
సకల
శాస్త్రములయొక్క
ముఖ్య
సూత్రములు
వాని
సారములు
ఉపనిషత్తులలో
ఇమిడియున్నవి.
అందువలననే
అన్నింటికిని
ఉపనిషత్తులు
ప్రమాణములైనవి.
ఆ
పవిత్ర
ఉపనిషత్తులు
మానవులచేత
వ్రాయబడనివి
అనగా
(అపౌరుషేయములు)
ఆదికాలమునుండి
వచ్చునవి
ఆయిన
వేదముల
ఉపాంగములే.
అనగా
వేదస్వరూపమునందలి
కొన్ని
అంగములు,
ఇట్టి
అనేక
అంగములతో
విరాజిల్లునదే
వేదము.
కాన
ఇది
ఉపనిషత్తులకు
ఆధారమూ,
ప్రమాణమూ
వేదము.
ఎట్లన
వేదమును
అనంతములైనను,
ఇప్పటికి
మిగిలినవి
ఆచరణలో
ఉన్నవి
నాలుగే!
అవి
ఋగ్వేద,
యజుర్వేద,
సామవేద,
అధర్వణ
వేదములు.
12
▾
Meaning
Keep
అట్టి
ఒక్కొక్క
వేదమునుండి
అనేక
ఉపనిషత్తులుగా
విభజించిరి.
అట్లు
విభజించినవి
మొత్తము
(1180)
వెయిన్ని
నూటా
ఎనుబది
ఉపనిషత్తులు
కలవు.
కానీ
కాల
మార్పు
చేత
ఉపనిషత్తులు
క్రమేణా
తరుగుతూ
వచ్చి
(108)
నూటయెనిమిదికి
దిగినవి.
మిగిలినవి
కనిపించకున్నవి.
వానిలోనా
నేటి
ఆచరణలో
నున్నవి
విచారించిన
పది
మాత్రమే
తేలినవి.
మిగిలినవి
నామములు,
తప్ప
నామిని
పొందలేకున్నవి
పాపము.
13
▾
Meaning
Keep
ఇందులో
ఏ
యే
వేదమునకు
ఎన్నెన్ని
ఉపనిషత్తులో
వ్యాసమహర్షి
విభజించెను
శుక్లయజుర్వేదము
నుండి
మాండూక్య
ఉపనిషత్తు
వ్రాయు
కాలమునకు
ఋగ్వేదమునకు
ఇరువది
ఒక్క
(21)
శాఖలు,
ఒక్కొక్క
శాఖకు
ఒక్కొక్క
ఉపనిషత్తును;
అనగా
ఇరువది
ఒక్క
(21)
ఉపనిషత్తులను;
యజుర్వేదమునకు
109
శాఖలును,
అందుకూడా
ఒక్కొక్క
శాఖకు
ఒక్కొక్క
ఉపనిషత్
అనగా
నూటతొమ్మిది
ఉపనిషత్తులును.
అధర్వణ
వేదమునకు
ఏబది(50)
శాఖలు
కనుక
దానియందును
యేబది
ఉపనిషత్తులును,
సామ
వేదమునకు
వేయి
(1000)
శాఖలు
కనుక
ఒక్కొక్క
శాఖకు
ఒక్కొక్క
ఉపనిషత్తునూ,
ఈ
రీతిగా
నాలుగు
వేదములకూ
ఎన్ని
శాఖలో
అన్ని
ఉపనిషత్తులుగా
విభజింపబడినవి.
అన్నియూ
కలిపి
వేయి
నూట
ఎనుబది
(1108)
ఉపనిషత్తులు
కలవు.
14
▾
Meaning
Keep
ఇప్పుడమలులో
నున్నవి
108
ఉపనిషత్తులే!
నేటికి
అవి
అన్నియు
మరుగుపడి
సర్వ
ఉపనిషత్సారమునూ
చేర్చి
శంకరులవారు
పదిగా
ఆచరణకు
నిలిపిరి.
ఇపుడూ
ఆ
దశోపనిషత్తుల
ఆధారముతోనే
ఈ
ధర
నిలిచియున్నది.
అవి
కూడా
ఏనాడు
మరుగు
పడి
ప్రళయము
సంభవించునో
అను
భయము
ఆస్తికులకూ,
వేదపండితులకూ
లేక
పోలేదు.
కానీ,
అట్లు
ఏనాడూ
చేయడు
పరమాత్మ;
అందు
నిమిత్తమే
భగవంతుడు
అనేక
రూపములతో
అవతరించి
వేదములనూ,
ధర్మములనూ
ఉద్ధరించుచున్నాడు.
కాన
ఆస్తికులకు
అట్టి
భయము
అవసరము
లేదు.
వేదమునకు
హాని
రాదు.
కనుక
ఈ
దశోపనిషత్తులనైనా
లోకమునకు
అందించుటకు
పండితులు,
ఆస్తికులు
కంకణము
కట్టవలెను.
అవియే
ఈశ,
కేన,
కఠ,
ప్రశ్న,
ముండక,
మాండూక్య,
తైత్తిరీయ,
ఐతరేయ,
ఛాందోగ్య,
బృహదారణ్యము
లనబడునవి.
15
▾
Meaning
Keep
మిగిలిన
తొంబది
ఎనిమిది
ఉపనిషత్తులు
ఏవనగా
బ్రహ్మ,
కైవల్య,
శ్వేతాశ్వ,
జాబాలి,
హంస,
గర్భ,
అరుణి,
పరమహంస,
అమృతనాద,
నారాయణి,
అమృతబిందు,
అమృతశిఖ,
అధర్వశిర,
కాశీతార,
మైత్రాయిణి,
నృసింహతాపిని,
బృహజ్జాబాల,
మైత్రేయి,
కాలాగ్ని
రుద్ర,
సులభ,
మాంత్రిక,
క్షితి,
నిరాలంబ,
సర్వహర,
వజ్రసూచిక,
శుభరహస్య,
తేజోబిందు,
నాదబిందు,
ధ్యానబిందు,
బ్రహ్మవిద్య,
ఆత్మబోధక,
యోగతత్త్వ,
నారదపరివ్రాజక,
బ్రాహ్మణ,
సీత,
యోగచూడామణి,
నిర్వాణ,
మండల,
దక్షిణామూర్తి,
స్కంధ,
శరభ,
అద్వైతతారక,
మహానారాయణ,
సౌభాగ్యలక్ష్మీ,
సరస్వతీ
రహస్య,
ముక్తిక,
బావరిచ,
రామతపన,
రామ
రహస్య,
ముద్గలి,
వాసుదేవ,
పింగళ,
శాండిల్య,
మహా,
భిక్షుక,
యోగశిక్ష,
సన్యాస,
తురియాతీత,
పరమహంస
పరివ్రాజక,
అవ్యక్త,
నృశింహ,
అక్షమాలిక,
అన్నపూర్ణ,
ఏకాక్షర,
అక్షిక,
అధ్యాత్మ,
సూర్య,
కుండికాఖ్య,
ఆత్మ,
సావిత్రి,
పరబ్రహ్మ,
పాశుపత,
త్రిపురతపన,
అవధూత,
త్రిపుర,
దేవీ,
భావన,
కథ,
యోగకుండలి,
రుద్ర
హృదయ,
రుద్రాక్ష,
భస్మ
దర్శన,
గణపతి,
తాహశర,
మహావాక్య,
పంచ
బ్రహ్మ,
గోపాల
తపిని,
ప్రాణాగ్ని
హోత్ర,
గరుడ,
కృష్ణ,
దత్తాత్రేయ,
వరాహక,
యాజ్ఞవల్క్య,
సత్యయాయన,
హయగ్రీన,
కలిసంతరణ
ఇంకనూ
అనేకములున్నవి
కానీ
“వినియోగములేని
విందుకు
విస్తర్ల
చేటు”
అన్నట్లు
నేడు
ఆచరణలో
లేని
వాటిని
అందించిన
అర్థము
చేసికొనలేరు.
ఊరక
వర్ణించిన
కాలము
వృథా.
తరించువారలకు
ఒక్కటి
చాలు.
అనుభవించనివారికి
అన్నీ
ఒక్కటే,
సారము,
తినరు,
భారము
దింపరు.
16
▾
Meaning
Keep
వేదోపనిషత్తులే
సనాతన
మతములు
అసలు
ఈ
ఉపనిషత్తుల
నుండే
భూగోళము,
జ్యోతిష్య,
అర్థ
శాస్త్రములునూ,
స్కంధ,
శివ,
గరుడ
మున్నగు
18
పురాణములునూ,
తాంత్రిక,
మాంత్రిక,
భక్తి,
జ్ఞాన,
కర్మయోగములునూ
మహా
ఋషులచే
లోకమునకు
అందింపబడినవి.
వేదోపనిషత్తులే
సనాతన
మతములు.
17
▾
Meaning
Keep
ఇందులో
ఒక
విచిత్రము,
ఇతర
మతములవలె
మన
భారతదేశమున
మతస్థాపకులు
కనిపించరు.
ఆ
కనిపించని
మత
గురువే;
స్థాపకుడే;
జ్ఞానస్వరూపుడగు
ఈశ్వరుడు.
అతడే
మన
ప్రవక్త.
అతని
అనుగ్రహమును
పొంది
అతని
అంశవలె
ఐక్యమైన
మహాఋషులే
మన
ప్రవక్తలు.
కాని
మానవ
నైతిక
ధర్మములు
క్షీణించుట
చేతనే,
మన
భారత
దేశమున
అనేకచోట్ల
ఈశ్వరుడు
మానవరూపమున
ప్రవక్తగా
నుద్భవించుచున్నాడు.
ఈ
సత్య
జ్ఞానమును
మానవుడు
ఉపనిషత్తుల
ద్వారానే
తెలిసికొన
సాధ్యమగును.
Next
Īśāvāsya Upaniṣad
→