Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Īśāvāsya Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2.
ఈశావాస్యోపనిషత్
లోకోద్ధారకుడైన
పరమాత్మ
లోక
కల్యాణ
నిమిత్తమై
హిరణ్యగర్భుని
ద్వారా
వేదములను
అందించెను.
ఆ
పవిత్ర
పరమాత్మ
ప్రసాదమైన
వేదములను
హిరణ్యగర్భుడు
తన
మానస
పుత్రులైన
అత్రి,
మరీచి
మొదలగు
పదిమందికి
బోధించెను.
వారినుండి
శిష్య
ప్రశిష్య
పారంపర్యముగా
వేదములన్నియూ
లోకమున
ప్రసిద్ధి
గాంచెను.
2
▾
Meaning
Keep
ఇట్లు
కాలము
గడచుచూ,
యుగములు
నడచుచూ,
జగములు
కదలుచూ
వచ్చుచుండగా
కొన్ని
వేదములు
మరుగుపడుచు,
మరికొన్ని
కఠినమగుచు,
ఇంకనూ
కొన్ని
వదిలివేయుచూ
కడకు
నాలుగు
మాత్రము
నేటికి
మన
అందుబాటుకు
మిగిలియున్నవి.
ఆ
మిగిలిన
నాలుగు
వేదములను
ద్వాపర
యుగమందు
వేద
విస్తరణ
కర్తలలో
అగ్రగణ్యుడు,
మహా
ఋషి
అయిన
వేద
వ్యాసులవారు
తన
శిష్యులకు
బోధించెను.
3
▾
Meaning
Keep
ఈ
విధముగా
వ్యాసులవారు
వేదాధ్యయనము
చేయుచుండగా
శిష్యులలో
ఒకడైన
యాజ్ఞవల్క్యుడను
అతను
గురువుగారి
ఆగ్రహమునకు
గురియయ్యెను.
ఆ
కారణముచే
శిష్యుడు
తన
కలవడిన
యజుర్వేదమును
తిరిగి
తన
గురువైన
వ్యాసులవారికి
వాపసు
ఇచ్చుటకై
వెళ్ల
గ్రక్కి,
వేదనిధియగు
సూర్యభగవానుని
శరణు
వేడెను.
అదే
సమయమున
వేదాభిమానులగు
మహాఋషులు
తిత్తిరి
పక్షి
రూపమును
ధరించి
యాజ్ఞవల్క్యుడు
వెళ్ళగ్రక్కిన
ఆ
వేదములను
భుజించి
వెళ్ళిరి.
అందువలననే
ఆ
వేదశాఖకు
“తైత్తరీయ”మని
పేరు
వచ్చినది.
4
▾
Meaning
Keep
ఆ
తరువాత
యాజ్ఞావల్క్యుని
భక్తి
శ్రద్ధలకు
సూర్యభగవానుడు
సంతసించి,
వాజి
రూపమున
వచ్చి
యజుర్గణములను
యాజ్ఞవల్క్యునికి
బోధించెను.
ఆ
యజుర్గణములనే
యాజ్ఞవల్క్యుడు
తన
శిష్యులకు
బోధించెను.
ఈ
కారణము
చేతనే
ఈ
శాఖకు
కూడనూ
“వాజసనేయి”
అని
పేరు
వచ్చెను.
వేదవ్యాస
ప్రవర్థితమగు
యజుర్వేదశాఖ
కృష్ణ
యజుర్వేదమనియు,
యాజ్ఞవల్క్య
సంవర్థితమగు
యజుశ్శాఖ
శుక్ల
యజుర్వేద
మనియు
పిలువబడినవి.
5
▾
Meaning
Keep
బ్రహ్మాండమంతయు
ఈశ్వర
స్వరూపము
వీనియందలి
మొదటి
కొన్ని
అధ్యాయములు
కర్మకాండ
సంబంధమగు
మంత్రములును
చివరి
అధ్యాయములందు
జ్ఞానకాండమందునూ
సమన్వయింపబడినవి.
ఈశావాస్యము
జ్ఞానకాండములో
చేరినది.
ఈ
ఉపనిషత్తునందు
మొదటి
మంత్రమునందు
ఈశావాస్యమను
రెండు
పదములచేత
ప్రారంభించుటచే
ఈ
ఉపనిషత్తుకు
ఈశావాస్యమను
పేరు
వచ్చినది.
6
▾
Meaning
Keep
శ్లో
॥
ఈశావాస్య
మిదం
సర్వం
యత్కించ
జగత్యాం
జగత్
తేన
త్యక్తేన
భుఞ్ఞోధ
మాగృధః
కస్య
స్విద్ధనమ్
॥
7
▾
Meaning
Keep
నశ్వరభావముగల
వస్తువులు
ఏవేవి
కలవో
ఈ
భూమియందు
అవి
అన్నియు
స్వస్వరూపమగు
భగవంతునిచే
ఆచ్ఛాదింపబడియున్నవనియు,
అట్టివానిని
త్యాగబుద్ధితో
అనుభవించవలెననియు,
పరుల
ధనమును
ఏమాత్రము
ఆశించకూడదనియూ,
ధనము
ఎవ్వరిదీ
కాదనియు
పై
శ్లోకము
తెలుపుచున్నది.
అనగా
బ్రహ్మాండమంతయూ
ఈశ్వర
స్వరూపము.
ఈశ్వరుడుకానీ,
అతనిచే
శాసింపబడిన
బ్రహ్మాండముకానీ,
వేరువేరని,
భావించుట
భేదబుద్ధి,
భ్రాంతి.
కేవలము
కల్పితము.
నీటియందు
కనిపించు
ప్రతిబింబము
ఎట్లు
బింబము
కంటే
భిన్నముకాదో
అటులనే
ఈశ్వరుడునూ,
అతనిచే
శాసించబడిన
బ్రహ్మాండమునూ
వేరు
కాదు,
అని
తలువవలెను.
8
▾
Meaning
Keep
నిష్కామకర్మ
చిత్తశుద్ధికి
హేతువు
మానవునకు
భ్రాంతి
ఉన్నంతకాలము
తనలో
ఇమిడియున్న
సత్యత్వమైన
స్వరూప
సందర్శనము
నశించి,
దురాలోచన,
దుర్గుణ,
దుష్కర్మలు
విజృంభించును.
ఎటులన,
పరిమళ
ద్రవ్యమైన
చందనపు
మొద్దును
నీటిలో
నానబెట్టిన
కొంతకాలమునకది
దుర్గంధముగా
మారును.
కానీ
చందనపు
మొద్దును
నీటినుండి
తీసివేసి
సానమీద
అరగదీసిన
పూర్వముండు
దుర్గంధము
నశించి,
దాని
స్వభావమైన
గంధము
జనించును.
9
▾
Meaning
Keep
వేద
శాస్త్ర
ప్రమాణముల
పురస్కరించుకొని
ధర్మ,
కర్మలద్వారా
విచారణ
సల్పిన
దుర్గుణ,
దురాచారములనబడు
దుర్గంధముపోయి
స్వచ్ఛమైన,
స్వరూపమైన
ఆత్మయొక్క
సుగంధము
పరిమళించును.
అప్పుడు
కర్తృత్వము,
భోక్తృత్వములను
ద్వైతభావములు
వీడిపోవును.
ఇదియే
సర్వకర్మ
సన్యాసమనబడుచున్నది.
అందుకనే
ఈ
ఉపనిషత్తునందు
సర్వకర్మ
సన్యాసము
మోక్షోపాయమని
తెలుపబడుచున్నది.
దారా,
పుత్ర,
ధనైషణ,
పరిత్యాగ
రూపమగు
సన్యాసమునకు
చిత్తశుద్ధి
కావలెను.
ఆ
చిత్తశుద్ధి
సిద్ధించుటకు
మార్గము
ఈ
ఉపనిషత్తునందు
రెండవ
మంత్రమున
చూపబడినది.
10
▾
Meaning
Keep
అనగా
శాస్త్రవిహితమగు
అగ్నిహోత్రాది
కర్మలు
ఆచరించవలెననియూ,
మోక్షప్రాప్తికి
కర్మాచరణకంటే
వేరు
మార్గము
లేదనియూ,
అట్టి
విహిత
కర్మలు
ఆచరించునంతవరకు
మానవునకు
ఏ
పాపమూ
అంటదనియు
తెలిసికొనవలెను.
అనగా
నిష్కామ
కర్మ
చిత్తశుద్ధికి
హేతువనియు,
కర్మకాండయందు
మంచి
శిక్షణ
పొందిన
వాని
చిత్తము
స్వచ్ఛముగా,
అనగా
మలినము
లేక
మూసలో
కరిగించిన
బంగారమువలే
మాలిన్యము
తొలగిపోయి
నిర్మలమగును.
11
▾
Meaning
Keep
అట్టి
నిర్మల
చిత్తమే
జ్ఞానము;
నివృత్తి
మార్గము.
అంతియేకాక
అదియే
మోక్షమునకు
కూడా
కారణము.
కర్మాచరణలయందు
ఏ
కోర్కెయూ
లేకుండిన,
వారిని
ఏ
దోషములుకూడనూ
అంటవు.
ఎటులన
మలినమైన
ఒండ్రుతో
చేరిన
నీటిని,
చిల్లగింజ
ఎట్లు
మలినమును
విచ్ఛిన్నము
చేసి
నీటిని
పరిశుభ్రపరచుటేకాక,
ఆ
చిల్లగింజకూడనూ
నీటి
అడుగుభాగమునకు
పోయి
ఎటుల
చేరునో
అటులనే
కర్మకాండయందు
మంచి
శిక్షణ
పొందినవాని
చిత్తము
స్వచ్ఛమగుటయేకాక,
ఆ
కర్మ
ఫలితము
కూడనూ
తనలో
అణగియుండి
అతనిని
ఏమియూ
హింసించలేక
పాపములకు
గురికాకుండా
చేయును.
12
▾
Meaning
Keep
ఈ
ఉపనిషత్తునందుండిన
పదునెనిమిది
మంత్రములందునూ
ఈ
రెండు
మంత్రములే
మోక్షమును
గూర్చిన
సూత్రములు.
మిగిలిన
పదునారు
మంత్రములు
ఈ
రెండు
మంత్రములకు
వివరములనే
తెలుపవచ్చును.
అనగా
భాష్యములనియే
తలువవచ్చును.
13
▾
Meaning
Keep
సర్వ
భూతాత్మలు
సమానమే!
ఇక
ఆత్మ
స్వీయమగు
స్థితినుండి
చలనము
చెందనిదైయున్నది.
అది
మనసును
మించిన
వేగము
గలది.
ఇందులో
విచిత్రము
ఒకటి
కలదు.
ఆత్మ
స్థిరముగా
నుండియూ,
పరుగిడుచుండును.
అన్ని
అవస్థలనూ
అనుసరించును.
అయితే,
దీనికి
వృద్ధి,
క్షయము,
పరిణామములు
లేవు.
ఇది
సర్వ
వ్యాపియై
యుండియూ
మనో
వ్యాపార
వ్యవహితములగు
ఇంద్రియములకు
గోచరించదు.
చైతన్య
స్వరూపమగు
ఆత్మతత్త్వమున్నపుడే
సర్వాస్పదము
సమస్త
కార్య
కరణాది
విక్రయ
జాలమంతయూ
కలుగుచుండును.
అసలు
'ఈశ'
అను
శబ్దమునకు
అర్థమే
ఇదియై
యున్నది.
ఇట్టి
ఆత్మ
తత్త్వము,
దగ్గర
దూరమనునది
లేక
రెండింటియందు
గోచరించును.
చలనముగానూ
ఉండును.
చలనము
లేకనూ
ఉండును.
ఇది
జగత్తునకు,
లోపలా
వెలుపల
కూడనూ
ఉన్నది.
ఇట్టి
నిజ
తత్త్వమునకు
తెలుసుకొనువారే
జ్ఞానులు.
14
▾
Meaning
Keep
అజ్ఞానులకు
ఇది
సాధ్యము
కాదు.
ఎటులన
స్మృతిగలవారికి
ఏవస్తువైనను
చెంతనే
కనిపించును.
చెంతనే
యుండును.
విస్మృతి
గలవారు
ఒంటిపై
నగలున్నను
అవి
లేనట్లే
తలచి
దూరమున
వెతుక
ప్రయత్నింతురు.
అటులనే
అజ్ఞానికి
అన్ని
సత్యములు
అందుబాటులోనున్నను
విస్మృతి
వలన
అట్టి
సత్యాత్మ
అతీతమైన
స్థానమందున్నదని
తలంచుచున్నాడు.
జ్ఞాని
అట్లుగాక
స్మృతి
గలిగియుండుటచే
సర్వభూతములందు
తన
ఆత్మను,
తన
ఆత్మయందు
సర్వ
భూతములను
చూడ
గలుగుచున్నాడు.
సర్వ
భూతాత్మలు
సమానమని
తలంచుచు
తరించుచున్నాడు.
15
▾
Meaning
Keep
ఇట్టి
మహా
సత్యమును
చూపునదే
ఈశావాస్యోపనిషత్.
అట్టి
పవిత్ర
సత్యాన్ని
తెలిసికొనిన
వాడే
జ్ఞాని.
అతనికి
శోక
మోహకారణమగు
విరక్తి
కలుగదు.
అట్టి
సాక్షాత్కారమును
పొందినవారికి
సమస్త
భూతములు
స్వస్వరూపముగానే
దర్శించును.
అతడు
ఇతరులపై
విముఖత
చూపలేడు.
అతనిని
ధర్మాధర్మములుకానీ,
శరీరనాడులుకానీ
బంధించవు.
స్వయం
ప్రకాశకుడగుటచే
ఈ
జీవ
రూపము
అతని
వాస్తవిక
రూపము
కాదనియూ,
అంతియేకాక
స్థూల,
సూక్ష్మరూపములు
కూడనూ
అతనివి
కావనియూ
స్థిరమొనర్చును.
16
▾
Meaning
Keep
జ్ఞాననిష్ఠకు,
కర్మనిష్ఠకు
సముచ్చయం
కుదరదు
అందువలననే
ఈశావాస్యమను
ప్రథమమంత్రమునందు
సర్వైషణా
పరిత్యాగమే
లక్షణముగా
గల
జ్ఞాననిష్ఠను
తెలిపినది.
ఇది
మొదటి
వేదార్థము.
కాని
జీవితమునందు
కోర్కె
గలవారికి
ఈ
నిష్ఠ
సంభవించదు.
అట్టివారికి
రెండవ
శ్లోకమునందు
కర్మనిష్ఠ
విధింపబడినది.
ఇది
రెండవ
వేదార్థము.
ఈ
జ్ఞాననిష్ఠ,
కర్మనిష్ఠ
విభాగమునకు
మిగిలిన
ఉపనిషత్తులు
ప్రోద్బలము
నిచ్చుచున్నవి.
కామ,
అజ్ఞానములు
రెండునూ
కర్మనిష్ఠలు.
ఈ
లోకము
ఆత్మ
కాదనియు,
అనగా
సత్యము
కాదనియు,
సత్యము
కాని
లోకముతో
సంబంధముంచుకొన్న
ప్రయోజనమేమనియూ
తలంచి,
కర్మనిష్ఠకు
సంబంధమైన
సంసారమునందు
వైరాగ్యము
చూపువారు
జ్ఞాననిష్ఠులు.
వైరాగ్యము
జ్ఞాననిష్ఠకు
సింహద్వారము
వంటిది.
ఈ
ఉపనిషత్తునందు
మూడవ
మంత్రము
మొదలు
ఎనిమిదవ
మంత్రము
వరకూ
అవిద్యానిందా
పూర్వకముగా
ఆత్మయొక్క
యథార్థ
స్వరూపము
తెలుపబడినది.
17
▾
Meaning
Keep
హిరణ్యగర్భోపాసన
ద్వారా
క్రమముక్తి
లభించును
ఈవిధముగ
ఈశావాస్యోపనిషత్తు
సర్వ
సన్యాస
పూర్వకమగు
జ్ఞాననిష్ఠ
మొదటి
మంత్రమందును,
రాగ
ద్వేష
హేతుడగువానికి
కర్మాచరణము
ద్వితీయ
మంత్రమునందును
తెలుపబడినది.
నాలుగైదు
మంత్రములందు
ఆత్మ
తత్త్వ
విచారమును,
తదుపరి
ఆత్మజ్ఞాన
ఫల
వివరములను,
సర్వ
కర్మ
సన్యాసమునకు
అశక్తులైన,
జ్ఞాన
సహిత
విహిత...
కర్మాచరణ
ప్రవీణులగు
వారికి
కర్మోపాసనా
సముచ్చయ
పూర్వకమగు
క్రమముక్తి
మార్గము
తొమ్మిదవ
మంత్రమున
తెలుపుతూ
ఎవరు
విద్యకు
విరుద్ధమగు
కర్మ
నాచరించెదరో,
వారు
దృశ్యాత్మకమగు
అజ్ఞానమున
ప్రవేశించెదరనియు,
ఎవరు
కేవలము
దేవతా
స్వరూప
జ్ఞానమందు
మాత్రము
ఆసక్త
చిత్తులగుదురో
వారు
అజ్ఞానము
కంటెనూ
హీనతరమగు
అంధకారమున
పడుదురని
కూడనూ
తెలిపినది.
18
▾
Meaning
Keep
విద్య
అనగా
జ్ఞానమునకు,
దేవ
లోకము
ప్రత్యేక
ఫలముగా
చెప్పబడినది.
కనుక
ఆజ్ఞానము
ఆత్మజ్ఞానము
కానేరదు.
కర్మనిష్ఠకు
పితృలోకము
ప్రత్యేక
ఫలముగా
చెప్పబడినది.
కనుక
ఆత్మసాక్షాత్కార
నిమిత్తమగు
జీవన్ముక్తికి
హేతుభూతమగు
జ్ఞానమునకు
తదితరములకును
సముచ్చయము
కుదరదు.
అవిరుద్ధములగు
దేవతా
జ్ఞాన
కర్మనిష్ఠల
సముచ్చయము
ప్రకృతమని
అర్థము.
జ్ఞానమునకును,
కర్మనిష్ఠకును
ప్రత్యేక
ప్రత్యేక
ఫలితములు
తెలుపబడినవి.
19
▾
Meaning
Keep
శాస్త్ర
విరుద్ధమైనది
ఏదియూ
అనుష్ఠేయము
కానేరదు.
అవిద్యా
శబ్దమునకు
కర్మాచరణమర్థము.
ఈ
విధముగా
కర్మచే
చిత్తశుద్ధి
కలిగిన
తరువాత
దేవతా
జ్ఞాన
సాధనమగు
ఉపాసనముచే
చిత్తైకాగ్రత
సిద్ధించుచున్నది.
ఇట్టి
ఉపాసనము
హిరణ్య
గర్భోపాసనమై
అంత్యమునకు
పూర్వము
పరిపక్వమైనచో
జీవన్ముక్తి
హేతువగును.
20
▾
Meaning
Keep
ఆ
లోకమున
బ్రహ్మోపదేశముచే
ముక్తి
సంప్రాప్తమగును.
ఎవరు
దేవతా
జ్ఞానమును,
కర్మను,
సముచ్చయముచేసి
తెలిసికొనునో
అతడు
కర్మానుష్ఠానముచే
మృత్యువును
దాటి,
దేవతా
జ్ఞానము
చేత
దైవత్వమును
పొందును.
Previous
←
Kaivalya comes from Jñāna alone
Next
Kaṭha Upaniṣad
→