Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Brahmānubhava Upaniṣad (The Essence of All the Upaniṣads)
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12.
బ్రహ్మానుభవ
ఉపనిషత్
(సర్వోపనిషత్సారము)
నిత్య
సచ్చిదానంద
పరిపూర్ణుడే
పరబ్రహ్మ
“ఏకమేవా
అద్వితీయం
బ్రహ్మా”
అని
శ్రుతులు
ఘోషించుచున్నవి.
అనగా
పరబ్రహ్మము
తప్ప
మరియొకటి
ఏదియు
లేదనియు,
సర్వ
కాల
సర్వావస్థలయందును
ఉండువాడనియు
అర్థము.
ఛాందోగ్యోపనిషత్తు
ప్రకారము
ప్రథమమున
ఒక
సత్తు
మాత్రముండెను.
2
▾
Meaning
Keep
అట్లే
శాంతం,
శివం,
అద్వైతం
అని
మాండూక్యోపనిషత్తు
చెప్పెను.
ఈ
లోకములో
వివర్తము
పైకి
కనుబడునది
మాత్రమే!
ద్వివిధ
రూపములు
కాజాలదు.
మనకు
కనబడు
భిన్న
భిన్న
రూపములన్నియు
మనఃకల్పనామయ
మగుట
వలననూ,
వాసనామయ
మగుట
వలననూ
కలుగుచున్నవి.
దీపము
తెచ్చి
చూచిన
తక్షణమే
పాము
అని
భ్రమింపబడుచున్న
త్రాడు
ఎట్లు
బయటపడుచున్నదో,
అట్లే
ద్వంద్వ
రహితుడై
పరబ్రహ్మ
జ్ఞానముతో
చూచిన
వానికి
ప్రపంచము
మీద
భ్రమ
మాయమగుచున్నది.
ద్వివిధములుండు
చోటునే
భయము.
చూచువాడు,
వినువాడు,
చేయువాడు,
ఆనందించువాడు
తానే
అయియుండినపుడు
భయమెట్లు
కలుగును?
నిద్రలో
నున్న
స్థితిని
తెలిసికొందుము.
నిద్ర
పోవుచున్నప్పుడు
ప్రపంచమంతయూ
మాయమగుచున్నది
గదా!
రెండవదనునది
లేకయే
సర్వత్ర
ఏకత్వమునే
అనుభవించుచున్నాము.
3
▾
Meaning
Keep
అట్టి
ఏక
స్వరూపుడైన
పరమేశ్వరునిలో
విశ్రమించుచుంటిమి.
పరమభక్తుడైన
జ్ఞానికి
అట్టి
అనుభవము
కలుగుచున్నది.
పరబ్రహ్మము
సర్వవ్యాప్తమైన
ప్రాణవాయువువలె
చిదాకారుడై
యున్నాడు.
సత్తు,
చిత్తు,
ఆనందము,
పరిపూర్ణము,
నిత్యము,
అనెడి
ఐదు
గుణములచే
పరబ్రహ్మము
బాగుగా
కొనియాడబడుచున్నాడు.
ఈ
గుణములను
తలచుకొనుచు
పరమాత్మను
కనుగొనవలెను.
త్రికాలములలో
నుండునది
సత్;
తన్ను
తాను
తెలిసికొని
ప్రకాశింప
జేసికొని
ఇతరులను
ప్రకాశింప
జేయునదే
చిత్తు.
ప్రతి
వానికిని
పరమ
ప్రీతికరమైనది
ఆనందము.
ప్రాగభావ,
ప్రధ్వంసాభావ,
అన్యోన్యాభావ,
అత్యంతా
భావములు
నుండి
విముక్తి
పొందినవాడే
నిత్యుడు.
ఇచ్ఛారహితుడైన
వాడే
పరిపూర్ణుడు.
4
▾
Meaning
Keep
బంధ
విముక్తులకు
మనస్సే
కారణము
నిప్పున్నచోట
చలి
లేదు.
అంటే
నిప్పులో
చలి
లేదని
అర్థము.
అదియే
అత్యంతాభావము.
అనగా
నిప్పుకు
దూరముగా
చలి
యున్నదని
యున్నది.
దీనిని
అత్యంతాభావమందురు.
కాన
శాశ్వతమైనదేది?
దేశ
కాల
వస్తువులను
మూడు
పరిచ్ఛేదములనుండి
ఏది
విముక్తి
జెందియుండునో
అదియే
పరిపూర్ణము.
ఈ
లోకము
మిథ్య.
ఇది
కంటికి
అగుపడునది
మాత్రమే.
ఈ
జీవుడే
సత్తు,
చిత్తు,
ఆనందము,
బ్రహ్మము
అను
నాలుగు
విషయములను
సమకూర్చుకొనునను
భావముతో
ఓంకారము
ధ్యానింపుము.
ఈ
క్షణమే
ఆత్మను
అవగాహన
చేసికొనుము.
అజ్ఞానము
తొలగినపుడు
ప్రతి
యొక్కని
ఆత్మయు
తన
స్వరూపముతో
ప్రకాశించును.
మనకు
కనబడునదంతయూ
ఎడారిలోని
ఎండమావుల
వంటిదే.
వస్తువులకు
ఆద్యంతములు
కలవు.
5
▾
Meaning
Keep
ఒక
విషయమును
గూర్చి
తలచుచున్నపుడుగాని,
దుఃఖించుచున్నప్పుడుగానీ
ఆ
విషయమును
కోరుచున్నప్పుడుగాని,
మనసు
బంధములచే
కట్టుబడిపోవును.
నిశ్చలత్వముతో
తలచకుండగనే,
విచారించకుండగనే,
దుఃఖించకుండగనే
మనసు
నిలిచినపుడు
సంసారబంధములనుండి
విముక్తి
కలుగును.
బంధ
ముక్తులకు
మనసే
కారణము.
రాజసమెక్కువగానున్నచో
మనస్సు
బంధనలో
చిక్కుకొని
పోవును.
సత్వముతో
కూడిన
మనస్సు
విముక్తి
జెందును.
6
▾
Meaning
Keep
స్థూల
శరీరముతో
ఏకీభవించిన
మానవుడు
ఒక్కడే
ఇంద్రియానందము
అనుభవించుటయందు
అత్యాకాంక్ష
కలిగియున్నాడు.
కాయ
దృష్టి
లేని
వానికి
కాంక్షలుండవు.
సంతోషము,
బాధ
అనునవి
సద్గుణ,
దుర్గుణముల
వంటివి.
రాగ
ద్వేషములు
అంతఃకరణము
యొక్క
ధర్మములు.
అవి
జీవునికి
గాని,
ఆత్మకు
గాని
సంబంధించవు.
ఆత్మ
యెల్లప్పుడు
పవిత్రమైనది.
అది
దేనికి
అంటకుండగ
నుండును.
ముండకోపనిషత్తులోని
మూడవ
అధ్యాయమందలి
మొదటి
మంత్రము
ఇట్లు
చెప్పెను.
ఎడబాటులేని
రెండు
పక్షులు
అతి
సున్నితమైన
సూక్ష్మమైన
రెక్కలతో
ఒకానొక
చెట్టుమీద
కూర్చుండియున్నవి.
ఒక
పక్షి
పక్వమైన
ఫలమును
తినుచుండగా,
రెండవ
పక్షి
రుచియైనను
చూడక
తటస్థముగా
కూర్చుని
యుండినది.
ఇచట
శరీరము
వృక్షమునకు,
పక్షులు
జీవాత్మ,
పరమాత్మలకు
పోల్చుకొని
యున్నవి.
ఒక
పక్షి
ఫలములు
రుచి
చూచుచున్నదనగా
జీవాత్మ
సుఖదుఃఖములనెడి
కర్మ
ఫలముల
ననుభవించుచున్నాడు.
పరమాత్మ
సూక్ష్మముగా
సాక్షీభూతముగ
నున్నాడు.
7
▾
Meaning
Keep
పవిత్రమై
స్వయంప్రకాశమై
సాక్షీభూతముగా
నున్న
ప్రత్యగాత్మ
చీము,
రక్తము
మొదలైన
మాలిన్యముతో
చేయబడిన
ఈ
స్థూల
శరీరము
ఎట్లు
కాగలదు?
ఈ
శరీరము
కేవలము
ఆహార
నిర్మితమైనది.
ఇది
యెల్లప్పుడు
మార్పు
చెందునది.
పుట్టక
ముందును
చచ్చిన
తదుపరియు
ఈ
శరీరము
లేదు.
ఇది
క్షణ
భంగురము.
దాని
యునికి
పరమాత్మ
అను
ప్రాణమున్నంత
వఱకే!
దేహములో
కొన్ని
భాగములు
తీసివేసిననూ
మనిషి
జీవించి
యుండును.
కానీ
ప్రాణము
పోయిన
వెంటనే
దేహము
ఒక
కొయ్యవలె
నేలమీద
కూలును
కాన
ఈ
శరీరమునే
ప్రధానమని
తలంచి
పోషించుటయందే,
దీనిని
కాపాడుటయందే,
ఇదియే
సర్వస్వమని
భావించుచు
నశింపవలదు.
మనోకృతులన్నింటిని
సాక్షీభూతముగా
జూచుచూ,
ఆనందించుచూ,
ఆత్మలో
లీనము
కమ్ము!
8
▾
Meaning
Keep
వాసనా
నాశమే
మనోనిర్మూలన
ఏ
స్థితిలో
సంకల్ప
వికల్పముల
తలంపు
లేకుండా
యుండునో
అదియే
యోగము.
మనస్సు
దాని
పోకడలు
స్వాధీనములో
నుంచునది.
జీవాత్మ
పరమాత్మయొక్క
సమభావమే
యోగము.
యోగ
సాధనము
వలన
ప్రత్యగాత్మ
పరమాత్మలో
కలసి
పోవుచున్నది.
యోగమువలన
సకల
విధములైన
బాధలు,
కష్టములు
నివారణ
యగుచున్నవి.
ఎవడు
నిశ్చలమగు
దృఢాభిప్రాయముతో
యోగము
నభ్యసించునో,
తీవ్రమగు
వైరాగ్యమును
వృద్ధి
చేసికొనునో,
విముక్తి
కొఱకు
కష్టించునో
వానికి
తప్పక
యోగములోని
పాండిత్యము
లభించును.
9
▾
Meaning
Keep
సచ్చిదానంద
స్వరూపుడనగా
సత్యము,
విజ్ఞానము,
ఆనందము
అనెడి
గుణములు
కలవాడు.
విజ్ఞాన
స్వరూపమనగా
ప్రశాంతత,
పరిశుభ్రత
కల
గుణములు
కలవాడు.
విజ్ఞానమనగా
ప్రత్యక్షము
ననుభవింపగల
ఆత్మ
జ్ఞానము.
వాడుక
భాషయందు
విజ్ఞానమనగా
భౌతిక
శాస్త్రమని
పేరు.
స్వరూపమునందు
వాసనలుండవు.
స్వయం
ప్రకాశకుడై
పరిశుద్ధుడైన
పరమాత్మయందు
కోరికలెట్లుండును?
మనస్సు
కోరికల
మూట.
కోరికలే
మనస్సును
అపవిత్రము
చేయుచున్నవి.
వాసనలను
నిర్మూలించుటయే
మనస్సును
నిర్మూలించుట.
ఒంటిగా
కాలము
గడిపిన
కొంత
కాలమునకు
మనోనాశనము
కలుగును.
అందువలననే
యోగులు
ఒక
గుహయందుండి
తపస్సు
నాచరింతురు.
10
▾
Meaning
Keep
శుభ
వాసనలతో
అశుభ
వాసనలను
తీసివేయాలి
వాసనలు
రెండు
విధములు:
శుభమనియు,
అశుభమనియు
శుద్ధ
వాసనలైనచో
అతనికి
త్వరలో
మోక్షప్రాప్తి
చేకూరును.
జపము,
ధ్యానము,
సత్కర్మ,
దానము,
ధర్మము,
నిస్స్వార్థసేవ,
క్షమ,
దయ
మొదలగునవి
మంచి
వాసనలు;
అవే
శుభ్రమైనవి.
క్రోధము,
హింస,
కామము,
దురాశ,
స్వార్థము
మొదలగునవి
అపవిత్ర
వాసనలు.
లేదా
అశుద్ధ
వాసనలు.
ఒక
ముల్లును
మరొక
ముల్లుతో
తీసి
రెండును
పారవేయు
విధముగా,
అపవిత్రమైన
వాసనలను
పవిత్ర
వాసనలతో
తీసి
తదుపరి
మంచి
వాసనలను
కూడ
నిర్మూలము
చేయవలెను.
మోక్ష
సాధనకు
పవిత్ర
వాసనలు
తోడ్పడునే
కానీ,
పవిత్ర
వాసనలు
బహుజన్మలను
బంధించుచున్నవి.
జీవన్ముక్తులకున్న
పవిత్ర
వాసనలను
కూడా
నిర్మూలనము
చేయవలెను.
11
▾
Meaning
Keep
కాల్చిన
గింజవంటివి
జీవన్ముక్తుని
యందు
ఇంద్రియానందము,
తృష్ణ,
మోహము.
ఆత్మ
సందర్శనముచే
మాయమగుచున్నవి.
తనకు
ప్రియమైన
దేదియూ
ఉండదు.
ఎచ్చట
సూర్యుడస్తమించునో
అచట
నిద్రించును.
తనను
గుఱించి
ఇతరులకు
తెలియకుండునట్లు
సంచరించును.
12
▾
Meaning
Keep
నిరంతర
ఆత్మ
చింతన
వలన
జ్ఞాన
ప్రాప్తి
చూచువాడు,
చూచినది,
ఒకడే
అయినప్పుడు
పొందెడి
ఆనందము
తురీయావస్థ
అని
చెప్పబడును.
దాని
తరువాత
వాని
ఆత్మనే
ప్రతి
చోటనూ
చూడగలడు.
ఆత్మచింతన
వలన
క్రమేణా
ప్రపంచ
వ్యవహారములనుండి
బయట
పడగలడు.
దీనికి
ఎక్కువ
ఓర్పు,
ఎడతెగని
సాధన,
నిరంతరాధ్యాత్మిక
చింతన
కావలెను.
బలహీనులగు
వారిచే
ఆత్మ
తెలిసికొనబడదు.
నిజమైన
సాధకుడు
తన
యావచ్ఛక్తిని
ప్రపంచ
విషయములనుండియు,
ఇంద్రియముల
భోగములనుండియు
మరల్చి
శాశ్వత
బ్రహ్మను
గురించి
తపస్సు
చేయుటకై
వినియోగించును.
తామసిక
సంకల్పము
కష్టము
తెచ్చును.
సాత్త్విక
సంకల్పము
ధర్మము,
మోక్షము,
జ్ఞానము
నిచ్చును.
రాజసిక
సంకల్పము
ప్రాపంచిక
ధోరణియందే
కాలమును
గడుపును.
త్రిగుణాత్మకమైన
సంకల్పములను
విడనాడినపుడే
బ్రహ్మస్థానమలంకరించును.
బ్రహ్మజ్ఞానిగా
మారును.
13
▾
Meaning
Keep
కొలతకు
అలవికాని
అగాధమైన
లోతుగల
బ్రహ్మను,
స్వల్పమైన
మనస్సుతో
ఎట్లు
కొలువగలడు?
అప్రమేయమనగా
వెడల్పు,
పొడవు
కొలతను
తీసికొనుటకు
అలవి
కానిది.
అపరిచ్ఛిన్నంగా
అంతులేనిది.
అవ్యపదేశ్యమనగా
వర్ణింప
నలవి
కానిది
అని
అర్థము.
ఇట్టి
పరమాత్మను
సామాన్య
భౌతిక
ఇంద్రియములచే
చూచుటకాని,
తెలిసికొనుటకాని
దుర్లభము.
వేదాంతమందు
చెప్పబడిన
భాగత్యాగ
లక్షణమైన
బ్రహ్మను,
నేతి-నేతి
యనబడు
వ్యతిరేక
భావ
సిద్ధాంతము
సూచించిన
బ్రహ్మము
నేనే!
హృదయ
గుహయందుండెడి
బ్రహ్మను
నేనే.
14
▾
Meaning
Keep
సాధకులు
శమము,
దమము,
తపస్సు,
సత్యము,
బ్రహ్మచర్యము
మొదలైనవాని
అభ్యాసము
వలన
కనుగొన
గోరెడి
బ్రహ్మము
నేనే!
దేహము,
మనస్సు,
ప్రాణము,
మేధస్సు
కాక
మిగిలినది
పరబ్రహ్మము.
ఇదియే
నేతి,
నేతి
అనెడి
సిద్ధాంతము.
ఇది
వ్యతిరేక
సిద్ధాంతము
యొక్క
తపస్సు.
భాగత్యాగ
లక్షణములకే
జాగ్రతాజాగ్రత
లక్షణమని
పేరు.
జీవ
బ్రహ్మ
ఏకత్వమును
చూపెడి
లక్షణము
ఇదియే!
“తత్త్వమసి”
మహావాక్యము
యొక్క
అర్థమును
“సోయందేవదత్తః”
(ఇతడే
దేవదత్తుడు)
అని
చూపించినట్లు
పై
చెప్పిన
సిద్ధాంతము
చూపగలుగుచున్నది.
జీవునికి
కప్పిన
ఆవరణము
తొలగింపగనే
జీవుడే
పరమాత్మగా,
పరబ్రహ్మముగా
చూపబడుచున్నాడు.
బ్రహ్మయొక్క
స్థానమే
జీవాత్మ.
(దహరాకాశమనగా
హృదయమందుండు
ప్రాణ
వాయువు;
తపస్సు
అనగా
ఇంద్రియనిగ్రహముచే
చేయబడు
ఆరాధన,
దమమనగా
మనోనిగ్రహము)
15
▾
Meaning
Keep
ఇంద్రియ
నిగ్రహం,
వాసనా
నిర్మూలన,
సత్యాన్వేషణ
కావాలి
నేను
అను
పదము
సత్తు
చిత్తానందమునకు
అన్వయించునపుడు
భౌతిక
శరీరము
“నేను”
ఎట్లు
కాగలదు?
అజ్ఞానము
వల్లనే
భౌతిక
శరీరము
మహత్తరమనే
నేననెడి
పరమాత్మగా
నెంచుచున్నాము.
ఈ
అజ్ఞానమే
అనేక
జన్మల
సుఖదుఃఖములకు
హేతువగుచున్నది.
కావున
నేను
అనే
పదమును
వివేకముతో
పరబ్రహ్మ
కన్వయింప
గల్గినచో
వెంటనే
ఆత్మజ్ఞానము
పొందుదురు.
ఆత్మ
సాక్షాత్కారమునకు
ఇంద్రియ
నిగ్రహము,
దేహవాసనా
నిర్మూలనము,
సత్యము
చాల
అవసరము.
శాశ్వత
బ్రహ్మయే
బుద్ధికి
బృహస్పతి,
మనస్సునకు
మనస్సు,
చెవికి
చెవి,
కన్నుకు
కన్ను,
సర్వముపైన
స్వయంప్రకాశకుడు.
అతని
తేజస్సు
వలననే
ఇతరములన్నియు
ప్రకాశించుచున్నవి.
సంపూర్ణుడయిన
పరమాత్మయే
అన్నిటికి
ఆధారము.
బ్రహ్మము
మనస్సునందు
జ్ఞాన
స్వరూపుడుగా
నున్నాడు.
మనస్సు
బుద్ధి
యనెడి
ఇంద్రియముల
నావరించియుండును.
అతడు
లేనిది
మనోబుద్ధు
లాలోచింపజాలవు.
మరల
అందులోనే
లయమగుచున్నవి.
గడ్డి
భూమిలో
పుట్టి,
భూమిలోనే
నశించునట్లు
బ్రహ్మయందు
బుద్ధి
జనించి,
బుద్ధియందే
నశించుచున్నది.
ఎట్లు
ఇనుము
నిప్పులో
పెట్టగానే
ఎఱ్ఱరంగు
పొందునో,
నీరు
పాల
సాంగత్యము
వలన
ఎట్లు
తెల్లబడునో,
అట్లే
జ్ఞానస్వరూపుడైన
పరబ్రహ్మ
సాంగత్యము
వలన
బుద్ధి
కూడ
జ్ఞానము
పొందుచున్నది.
16
▾
Meaning
Keep
ప్రేమ
చక్షువును
తెరిస్తే
బ్రహ్మ
దర్శనం
సులభం
తల్లి
గర్భమందున్న
శిశువువలె
పరమాత్మ
అన్నింటిలోను
దాగియున్నాడు.
అవ్యక్తము,
గోచరము
కానిది
అయిననూ
సామాన్యముగా
ప్రపంచ
ధోరణిలో
“దేవుని
చూపుము.
అప్పుడు
నేను
నమ్మెద”
అనుచుందురు.
కానీ
ఇది
అసంభవము;
భౌతిక
చక్షువులతో
సూక్ష్మాతి
సూక్ష్మమైన
పరమాత్మను
చూచుట
సంభవము
కాదు.
అణువులను
క్రిములను
చూచుటకు
కూడ
శక్తిమంతమైన
భూతద్దముయొక్క
సహాయము
కావలెను
కదా!
అట్లే
పరమాత్మను
చూచుటకు
జ్ఞాన
చక్షువు
లేదా
ప్రేమ
చక్షువు
కావలయును.
తద్వారానే
చూడ
సాధ్యము.
నేను
ఒక
కఱ్ఱతో
కొట్టిన
నీవు
నొప్పిని
చూడగలవా?
తీపిని
తినునపుడు
ఆ
తీపియొక్క
రుచిని
చూపగలవా?
ప్రేమ,
కరుణ,
సద్గుణము,
నమ్మిక
మొదలైనవి
కళ్ళకు
చూపగలవా?
చూపబడవు.
అట్లే
ప్రేమ
హృదయములో
నున్నది.
పైకి
పనుల
ద్వారా,
మాటల
ద్వారా
కన్పించుట
వలన
ఆ
వ్యక్తి
ప్రేమ
కలవాడని
ఊహించగలము.
అలాగుననే
దివ్య
బ్రహ్మము
యొక్క
ఉనికి
లేక
స్థిరత్వమును
అతని
ఘనతను
బట్టి
గ్రహింపగలరు.
దివ్య
జ్ఞానము,
దైవిక
సంపద,
ప్రకృతి
సౌందర్యము
దాని
సృష్టి
వలన
అతనిని
శ్లాఘించగలము,
గుర్తించగలము
కూడ.
జ్ఞాన
లేదా
ప్రేమ
చక్షువును
తెఱచుటకు
ప్రయత్నించవలెను.
అప్పుడే
సర్వత్ర
అతిసూక్ష్మముగా
నున్న
శాశ్వత
బ్రహ్మను
దర్శించవచ్చును.
17
▾
Meaning
Keep
తలంపు
ఎట్లనో
మనిషి
అట్లనే
ఎట్లు
చెఱకు
రసమందంతటిలోను
చక్కెర
వ్యాపించియున్నదో
అట్లే
పరమాత్మ
ప్రపంచము
యావత్తును
వ్యాపించియున్నాడు.
పరబ్రహ్మమే
ప్రతి
జీవరాశికి
అంతరాత్మ.
అది
సర్వత్ర
వ్యాపించెడి
గుణము
కలది.
అందువలన
తెలిసికొనుట
కష్టము.
ఆత్మ
అనునది
రూపరహితమైన
అమృతము.
అది
“అతను”
అనగా
తనువు
లేనిది.
అందువలననే
పురుషుడు
అనబడుచున్నది.
ఎపుడు
దేహసంబంధము
వదలి
శుద్ధ
అంతఃకరణయందు
లీనమగుట
సాధ్యమగునో,
ఆ
క్షణమే
శాశ్వతానందము,
ఉన్నత
ప్రశాంతి,
ఉత్కృష్ట
విజ్ఞానము
పొందగలము.
అప్పుడు
గాని
జనన
మరణములనుండి
విముక్తి
దొరదు.
18
▾
Meaning
Keep
“ద”
అను
పదమునందే
“దేహ”ము
పుట్టినది.
“ద”
అనగా
దహింపబడునది
అని
అర్థము.
సామాన్యముగా
మరణానంతరము
దహింపబడుచున్నది.
కానీ
జ్ఞానియందు
కారణ
సూక్ష్మ
శరీరములు
మూడు
విధముల
హృదయ
కాష్ఠమునందు
దహింపబడును.
అనగా
ఆధ్యాత్మికము,
ఆదిదైవికము,
ఆదిభౌతికము
అనెడి
మూడు
హృదయ
కాష్ఠములు.
ఇవి
సూక్ష్మ,
కారణ
శరీరములను
అగ్ని
కన్న
త్వరలో
నశింపజేయగలవు.
తలంపు
ఎట్లుండునో
మనిషి
అట్లే
మారును.
దేహ
ధ్యాస
కలవారు
పామరులుగనే
యుందురు.
“నేను
సత్తు,
చిత్తానందుడను”
అనెడి
ధ్యాస
కలవాడు
దైవస్వరూపుడుగనే
మారును.
భౌతికమైన
మాంసపు
ముద్దయైన
శరీరముతో,
భౌతిక
సూక్ష్మ
కారణ
శరీరములతోకాని
జీవుని
ఐక్యము
జేయరాదు.
ఆత్మను
పరమాత్మయందే
కలుపవలెను.
అపుడే
శాశ్వత
ఆనందము.
కష్టసుఖములు
మంచిచెడ్డలు
మనస్సుకు
చెందినవే
కానీ
నీకు
చెందినవి
కావు.
నీవు
కర్తవు
కావు;
దాని
ఫలము
ననుభవించు
వాడవు
కావు.
నీవు
స్వతంత్రుడవు.
ధర్మము
సద్గుణము.
అధర్మము
దుర్గుణము.
ఇవి
మనో
భావములు.
కాన
హృదయము
నంటుకొనియున్న
పాశములను
త్రెంచిన
వెంటనే
మానవుడు
శాశ్వత
బ్రహ్మమును
పొందును.
పట్టుపురుగు
తన
చుట్టునున్న
దారముతో
తానే
చుట్టుకొన్నట్లు
మానవుడు
తను
కోరిన
కోరికలతో
తాను
చిక్కుకొని
సంసారి
నేననుచున్నాడు.
19
▾
Meaning
Keep
అహంభావ
రాహిత్యమే
విముక్తి.
ఆత్మ
యెప్పుడును
అసంసారి.
దాని
స్వభావము
పవిత్రత.
సందేహము
జ్ఞానమునకు
శత్రువు.
అజ్ఞానమునకు
అది
తొలి
సంతానము.
ఎక్కడ
“నా”
అను
అహంభావ
ముండదో
అక్కడనే
విముక్తి.
నేను
అనెడి
అహం
యెక్కడ
నున్నదో
అక్కడే
బంధము.
మానవుని
బంధించునవి
ఇవియే!
ఆత్మ
జ్ఞాన
మబ్బుటకు
ప్రతిబంధకములు
మూడు
విధములు:
భూతకాల
ప్రతిబంధకములు,
వర్తమానకాల
ప్రతిబంధకములు,
భవిష్యత్కాల
ప్రతిబంధకములు.
వీటిని
తగురీతిగా
తొలగించుకొనవలెను.
జీవన్ముక్తుడు
ఈ
మూడింటిని
చింతించడు.
చూచువాడు,
చూడబడునది,
చూపు
అనెడి
భేదములను
వదలిపెట్టి
వాని
సమైక్యతతో
సర్వాంతర్యామియై
స్వప్రకాశుడైన
పరమాత్మనే
ధ్యానింపవలెను.
త్రిపుటి
మనఃకల్పితము.
త్రిపుటిలేని
సాధకుడు
జీవన్ముక్తుడు.
అట్టివానికి
బ్రహ్మాకారము
ఎక్కడ
చూచినను
కనిపించును.
Previous
←
Taittirīya Upaniṣad