Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Taittirīya Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11.
తైత్తిరీయోపనిషత్
ఈ
ఉపనిషత్తులో
బ్రహ్మ
విద్యోపదేశ
ముపక్రమింపబడినది.
ఈ
తైత్తిరీయము
శీక్షావల్లి,
బ్రహ్మానందవల్లి,
భృగువల్లి
అని
మూడు
భాగములుగా
నున్నది.
ఇందు
బ్రహ్మ
జ్ఞానోపదేశికలగు
చివరి
రెండు
వల్లులు
ముఖ్యము.
బ్రహ్మ
విద్యకు
దేవ
ఋష్యాదులు
కూడా
విఘ్నకారులగుచున్నారు.
అట్టి
విఘ్నము
లుపశమించుటకును
చిత్తైకాగ్రత
లభించుటకు
నుపయోగించు
కొన్ని
ఉపాయములు
శీక్షావల్లియందు
ఉపదేశింపబడినవి.
ఈ
వల్లియందు
పండ్రెండు
అనువాకములు
గలవు.
బ్రహ్మానందవల్లి,
భృగువల్లియను
చివరి
రెండు
ప్రత్యేక
నామములచే
వ్యవహరింప
బడుచున్నవి.
ఈ
వల్లీద్వయము
మోక్షమునకు
సాక్షాత్సాధన
భూతమగు
వారుణీ
విద్యయని
ప్రసిద్ధి
గాంచుటచే
రెండింటికినీ
విషయమొక్కటియే
అగుచున్నది.
పఠన
సౌకర్యమునకు
మాత్రము
ప్రత్యేక
వల్లులుగా
పరిగణింపబడుచున్నది.
2
▾
Meaning
Keep
అజ్ఞాన
నాశమే
మోక్ష
హేతువు
శీక్షావల్లియందు
కర్మకు
విరుద్ధములగు
సంహితాది
విషయములు
కర్మ
సముచ్చితములగు
ఉపాసనలు
వివరింపబడినవి.
స్వారాజ్యము
దీని
ఫలము.
ఇంత
మాత్రమున
సంసార
బీజ
మశేషముగా
నాశన
మొందనేరదు.
ఉపాసన
కామనా
విరుద్దము
కాదు.
దానిచే
కర్మ
వలెనే
ఉపాసనము
కూడా
మోక్షహేతువు
కాదు.
అజ్ఞానము
సంసార
కారణము.
ఇది
నశించుటచే
మోక్ష
మబ్బును.
అజ్ఞానము
సహజ
సిద్ధము.
మనము
కూర్చున్న
రైలు
బండి
నిలిచియుండి
ప్రక్కన
మరియొక
బండి
పోవుచుండగా
మనము
కూర్చున్న
బండియే
పోవుచున్నట్లు
ప్రత్యక్షముగా
కనబడును.
3
▾
Meaning
Keep
ఇట్టి
అజ్ఞానమునకు
కారణము
విచారించి
ప్రయోజనము
లేదు.
దానిని
పోగొట్టుకొను
మార్గము
మాత్రము
అన్వేషింపవలయును,
సంసారబీజమగు
ఈ
అజ్ఞానము
బ్రహ్మజ్ఞానము
చేతనే
తొలగిపోవును.
మరియొక
త్రోవలేదు.
కర్మ
ఫలము
నశ్వరమని,
శాస్త్రముచేతను,
యుక్తిచేతను
ప్రత్యక్షముగా
తెలియుచున్నది.
కర్మోపచితములగు
స్వర్గాది
లోకములను
పరీక్షించి
వానిచే
స్వతఃసిద్ధమగు
మోక్షము
కలుగనేరదని
ముముక్షువు
నిర్వేద
మొందుచున్నట్లు
శాస్త్రము
చెప్పుచున్నది.
కర్మ
కార్యమగు
స్వర్గము
కూడా
అనిత్యమే!
నరక
స్వర్గములు
మొదలగునవి
కర్మఫలములగుటంజేసి
దానిచే
యుత్పన్నమగుచున్నవి.
4
▾
Meaning
Keep
కర్మకు
పూర్వమేవీ
లేవు.
ఏది
పుట్టుకకు
పూర్వము
లేదో,
ఏది
పుట్టి
నశించునో
అది
లేనిదే
అగుచున్నది.
ఆద్యంతములయందు
లేని
వస్తువు
వర్తమానమునందు
కూడా
లేదనియే
భావింపనగును.
కర్మచే
పుట్టు
ఫలము
నిత్యము
కానేరదు.
ఆకాశ
పుష్పమెంత
ప్రయత్నించిననూ
లభ్యము
కాదు.
ఉన్నదానిని
పుట్టింప
నెవరికినీ
సాధ్యము
కాదు.
మోక్షము
సిద్ధపదార్థమైనను
అది
అజ్ఞానముచే
తెలియరాకున్నది.
అజ్ఞానము
పోయినప్పుడు
అది
ప్రత్యక్షముగా
తెలియును.
అంతకు
పూర్వము
సిద్ధమైనను
తెలియబడని
అనేక
శక్తులను
పరదేశమునను
వెదకి
కనుగొనినారే
గాని
వాటినెవరు
క్రొత్తగా
పుట్టించలేదు
కదా?
అటులనే
సిద్ధమగు
మోక్షమును
కనుగొనవలెను.
5
▾
Meaning
Keep
బ్రహ్మ
జ్ఞాన
బోధకములగు
వేదాంతములను
విశ్వాస
భావముచే
శ్రవణము
చేయవలెను.
అప్పుడే
అజ్ఞానము
నశించును.
సర్వ
సంసార
బీజ
కారణమగు
అజ్ఞానము
పోగొట్టుకొని
బ్రహ్మ
జ్ఞానోపదేశమును
సేయుటయే
బ్రహ్మవల్లి
లక్ష్యము.
6
▾
Meaning
Keep
వికారమసత్యం;
వికారము
లేనిది
సత్యం
ప్రతి
మానవుడును
అవిద్యా
ప్రయుక్తమగు
కామనచే
బోధితుడై
అత్యంత
ఫలాధిక్యమును
కోరుట
సహజము.
కర్మల
నాచరించుటకు
మహా
ప్రయత్నము
చేసి
యవి
నిత్యమగు
మోక్షము
నీయజాలవని
తెలిసికొని
నిర్విణ్ణుడగుచున్నాడు.
అత్యంత
ఫలతృష్ణ
యింకను
అతనిని
వదలలేదు.
సంసారమును
జూచి
భయము
నొందుచున్నాడు.
ఇక్కడ
సత్యము,
జ్ఞానము,
అనంతము
అను
మూడు
శబ్దములు
బ్రహ్మ
శబ్దముతో
ప్రత్యేకముగా
జోడింపబడి
అద్దాని
లక్షణమును
బోధించుచున్నవి.
ఈ
మూడు
శబ్దములు
పరస్పర
మొకదానితో
మరియొక
దానికి
సంబంధము
లేదు.
ఈ
పదములు
కేవలము
విశేషణములు
కాక
ఉన్నవి.
సజాతీయ
వస్తువులలో
నుండి
విశిష్ట
ధర్మములు
లేని
వస్తువులను
త్రోసి
పుచ్చుటయే
విశేషణముయొక్క
లక్షణము.
7
▾
Meaning
Keep
ఇటులనే
సత్యము
బ్రహ్మము
అనుచోట
సత్య
శబ్దమును
విశేషణముగా
గ్రహించినచో,
సత్యవిదూరములగు
ఇతర
బ్రహ్మముల
నుండి
ప్రకృత
బ్రహ్మము
సత్యమను
విశేషణముచే
వ్యవహరింపబడుచున్నది.
అదే
విధముగ
జ్ఞానానంత
విశేషణములచే
వానికి
విరుద్ధార్థకములగు
జడ
స్వరూపములు,
దేశ
కాల
వస్తు
పరిచ్ఛిన్నములు
అగు
బ్రహ్మములు
ప్రకృత
బ్రహ్మము
నుండి
ప్రత్యేకింపబడుచున్నట్లు
తోచుచున్నది.
లక్షణము
వస్తు
స్వరూప
నిరూపణముచేసి
దాని
ప్రత్యేక
వ్యక్తిత్వమును
వ్యక్తీకరించును.
లక్షణముచే
లక్షితమగు
ప్రతి
వస్తువు
జాతీయ
విజాతీయములగు
ఇతర
వస్తువులన్నిటి
నుండియు
వ్యావర్తింపబడుచున్నది.
8
▾
Meaning
Keep
ఏ
పదార్థము
ఏ
రూపమున
నిశ్చితము
కాబడుచున్నదో
ఆ
రూపమునకు
మార్పు
లేనప్పుడు
అది
సత్యమనబడును.
నిశ్చితమగు
దేని
రూపము
మార్పును
చెందునో
అది
అసత్యము.
వికారమసత్యము.
వికారము
లేనిది
సత్యము.
9
▾
Meaning
Keep
కర్మాచరణ
సహజ
రాగ
ప్రాప్తము
బ్రహ్మము
సత్యమనుటచే
అది
నిర్వికారము,
నిత్యము
అనియు
తదిరములగు
సవికారములు
బ్రహ్మము
కావనియు
తేలుచున్నది.
బ్రహ్మము
సత్యమగుటచే
బ్రహ్మేతరమగు
జగత్తు
వికారస్వరూపము,
అనృతము
కనుక
అది
బ్రహ్మము
కాదనియు
తేలుచున్నది.
జ్ఞాన
జ్ఞేయ
జ్ఞాతృ
పదార్థములన్నియును
బుద్ధియందు
నిగూఢముగా
నుండుటచే
అది
“గుహ”యని
పిలువబడుచున్నది.
10
▾
Meaning
Keep
ఈ
ఉపనిషత్తునందు
బ్రాహ్మణమున
వివిధ
ధర్మములు
వివరింపబడినవి.
అవి
కామ్యములు,
నైమిత్తికములు,
నిమిత్తములు
అని
మూడు
విధములు.
కర్మల
నాచరింపుమని
శాస్త్ర
మెవ్వరినీ
నియోగింపదు.
మనుజునకు
కర్మాచరణము
సహజ
రాగప్రాప్తము.
కామన
ప్రవృత్తికి
ముఖ్య
కారణము.
కామనానురూపముగా
మనుజుడు
ప్రవర్తించి
యద్దాని
ఫలము
ననుభవించును.
సహజ
సిద్ధములగు
కోరికలను
పడయు
మార్గమును
మాత్రము
శాస్త్రముపదేశించుచుననది.
11
▾
Meaning
Keep
అధ్యయనాధ్యాయనములను
గూర్చి
ప్రమాదములను
పొందకుము.
సత్యమును
గూర్చి
ప్రమాదమును
పొందకుము.
ధర్మమును
గూర్చి
ప్రమాదమును
పొందకుము.
తల్లినే
దైవముగా
భావించుము.
తండ్రియే
దైవముగా
భావించుము.
ఏ
పనులు
నింద్యములు
కావో
అవియే
నీకు
సేవింపదగినవి.
తదితరములు
సేవ్యములు
కావు.
12
▾
Meaning
Keep
ఉపదేశాత్మకం
బ్రహ్మవల్లి;
అనుభవాత్మకం
భృగువల్లి
శ్రవణ,
మనన,
నిధిధ్యాసములను
మూడు
ఆత్మ
సాక్షాత్కారోపాయములుగ
నుపదేశింపబడినవి.
వీనిలో
మొదటిది
అగు
శ్రవణము
వేదములయందు
సంపూర్ణ
విశ్వాసము
కలిగి
గురుసన్నిధియందు
చేయతగినది.
అందువలన
బ్రహ్మముయొక్క
పరోక్ష
జ్ఞానమబ్బును.
మననాత్మకమగు
తపస్సు
భృగువల్లియందు
ఉపదేశింపబడుచున్నది.
మననముచే
నిశ్చితమైన
నిర్గుణ
బ్రహ్మాత్మ
స్వరూపమును
మనమునందు
నిలిపి
బ్రహ్మానన్యమగు
స్వస్వరూపమున
ననవరతము
భావించుటయే
నిధిధ్యాసము.
బ్రహ్మవిద్యయే
బ్రహ్మ,
భృగువల్లీ
ద్వయమునందు
వివరింపబడినది.
ఉపదేశాత్మకము
బ్రహ్మవల్లి;
అనుభవాత్మకము
భృగువల్లి.
13
▾
Meaning
Keep
వరుణ
పుత్రుడగు
భృగువనువాడు
“పూజ్యడవగు
ఓ
తండ్రీ!
నాకు
బ్రహ్మము
నుపదేశింపుడు”
అని
తండ్రిని
సమీపించి
ప్రార్థించెను.
అపుడు
అన్నము,
ప్రాణము,
చక్షువు,
శ్రోత్రము,
మనస్సు,
వాక్కు
అని
వరుణుడు
పుత్రునకు
ఉపదేశించెను.
మరి
దేనివలన
ఈ
భూతములు
ఉత్పన్నమగుచున్నవో,
ఉత్పన్నములైన
ఈ
భూతములు
దేనిచేత
జీవించుచున్నవో,
అది
బ్రహ్మమని
తెలిసికొనుమని
అతడు
తెలియజెప్పెను.
భృగువు
ఈ
రెండు
వాక్యములు
తండ్రివలన
విని
తప
మొనరింప
అన్నమే
బ్రహ్మమని
తెలిసికొనెను.
14
▾
Meaning
Keep
ఏలయన
ఈ
భూతము
లన్నము
వలననే
పుట్టుచున్నవి.
పుట్టిన
భూతము
లన్నము
చేతనే
జీవించుచున్నవి.
ఇట్లు
తెలిసికొనిన
భృగువు
మరల
తండ్రి
దగ్గరకు
వెళ్ళి
తనకు
బ్రహ్మము
నుపదేశింపుడని
కోరెను.
తపస్సు
చేతనే
బ్రహ్మమును
తెలిసికొనుమని,
తపస్సే
బ్రహ్మమని
తండ్రి
కుమారునకు
తెలియజెప్పెను.
అతడు
తపస్సు
చేసి
విజ్ఞానము
బ్రహ్మమని
తెలిసికొనెను.
విజ్ఞానము
వలననే
భూతములు
ఉత్పన్నమగుచున్నవి.
విజ్ఞానముచే
జీవించుచున్నవి.
విద్యలలో
కెల్లా
ఉత్కృష్టము,
పవిత్రము,
పరమ
రహస్యమగు
బ్రహ్మవిద్యను
సంప్రదాయ
సిద్ధముగా
తెలిసికొనెను.
15
▾
Meaning
Keep
బ్రహ్మ
విజ్ఞానానికి
అన్నం
ద్వారం;
అన్నం
గురుతుల్యం
అన్నమును
నిందింపకూడదు.
అది
బ్రహ్మవిదునకు
వ్రతము.
ప్రాణమే
అన్నము.
శరీరమన్నాదము.
ప్రాణమునందు
శరీరము
ప్రతిష్ఠితమై
యున్నది.
అందువలన
అన్నమును
పరిహసింపకూడదు.
అది
వ్రతము.
ఉదకములు
జఠరాగ్నిచే
జీర్ణములై
అన్నమగుచున్నవి.
ఉదకములందు
విద్యుదగ్ని
ప్రతిష్ఠితమగుచున్నది.
జ్యోతిస్సునందు
ఉదకములు
ప్రతిష్ఠితములు.
అందువలన
ఈ
యుభయమునగు
అన్నమన్నమునందు
ప్రతిష్ఠితమగుచున్నది.
ఎవడు
ఆపోజ్యోతి
రూపమగు
అన్నమును
అన్నమునందు
ప్రతిష్ఠితమైన
దానినిగా
ఉపాసించుచున్నాడో
వాడు
ప్రతిష్ఠితుడగుచున్నాడు.
బ్రహ్మ
విజ్ఞానమునకు
అన్నము
ద్వారమగుటచే
అది
గురుతుల్యము.
దానిని
నిందింపరాదు.
ఉపాసకుని
కిది
ఒక
వ్రతము.
16
▾
Meaning
Keep
శరీరము
అన్నవికారమగుటచే
అన్నమయ
కోశమనియూ,
ప్రాణాత్మకమగునది
ప్రాణమయ
కోశమనియూ,
మంచి
చెడుగులను
విచారించునపుడు
మనోమయ
కోశమనియు,
విచారించిన
దాని
పర్యవసానమును
నిశ్చయించినపుడు
విజ్ఞానమయ
కోశమనియు,
నిశ్చయించిన
దాని
ఫలమగు
ఆనందము
ననుభవించునపుడు
ఆనందమయ
కోశమనియు
వ్యవహరింపబడుచున్నది.
17
▾
Meaning
Keep
అన్నమయ
కోశానికి
ఆత్మే
ప్రాణమయకోశం
బ్రహ్మ
భావముచే
ఉపాసించుటకై
ప్రాణమయ
కోశముయొక్క
పురుషాకృతిత్వము
ప్రదర్శింపబడుచున్నది.
ప్రాణమయకోశము
శరీర
పిండము
కంటే
అన్యము.
సూక్ష్మతరము.
అన్నమయ
కోశమును
తనలో
ఇముడ్చుకొనియున్నది.
అది
వాయుమయము.
దానిచే
అన్నమయకోశ
మాపాదమస్తకము
నిండియున్నది.
అన్నమయ
కోశమున
కది
ఆత్మ
యగుచున్నది.
ప్రాణవాయువు
లేక
అది
నిలువ
నేరదు.
ప్రాణము
క్రియాశక్తి
కార్యభూతము.
ఈ
ప్రాణము
ప్రాణాపాన
వ్యానోదాన
సమానములను
అయిదు
రూపముల
మారి
ప్రాణమయ
కోశమగుచున్నది.
అన్నమయ
కోశమునకు
ప్రాణమయ
కోశము
ఆత్మయను
స్థిరమగు
భావనచే
అన్నమయకోశము
నందాత్మత్వ
బుద్ధి
తొలగును.
మూసలో
కరిగించి
పోసిన
లోహమువలె
అన్నమయ
కోశము
నాశ్రయించి
ఆత్మభావముచే
వర్ధిల్లుచున్న
ప్రాణమయ
కోశము
కూడా
పురుషాకారమున
కనిపించుచున్నది.
18
▾
Meaning
Keep
స్వాహా
రూపమగు
ప్రాణవృత్తి
ప్రాణమయ
కోశమునకు
శిరస్సు,
వ్యాన
వృత్తి
దక్షిణ
పక్షము,
అపాన
వృత్తి
ఉత్తర
పక్షము.
శరీర
మధ్యముననున్న
సమాన
వృత్తి
ఆత్మ.
పృథివి
దేవతాస్థితి
హేతువగుటచే
పుచ్ఛమగుచున్నది.
పృథివి
ప్రతిష్ఠాహేతువు
కానిచో
ఉదానవృత్తిచే
ఊర్ధ్వగమనమొంది
బరువుచే
క్రింద
పడుట
సంభవించును.
హృద్దేశమునుండి
ముఖ
నాసికా
మూలమున
పైకి
సంచరించుటచే
ప్రాణవృత్తి
శిరస్సనియు,
అచటనుండి
సర్వ
నాడులయందును
ప్రసరించుటచే
వ్యానవృత్తి
అనియు,
అధఃప్రసారముచే
అపానవృత్తి,
పక్షములనియు,
ఉదర
మధ్యమున
నాభి
సమీపమున
నుండుటచే
సమాన
మాత్మ
యనియు
కల్పింపబడినది.
19
▾
Meaning
Keep
మంత్రములన్నీ
మనోవృత్తి
రూపాలే!
మనోమయ
కోశమునకు
యజుర్వేదము
శిరస్సు.
ఋక్కులు
దక్షిణ
పక్షము.
సామముత్తర
పక్షము.
బ్రాహ్మణ
మాత్మ.
అధర్వణ
వేదము
ప్రతిష్ఠారూపమగు
పుచ్ఛము.
యజుర్వేద
మంత్రములు
యాగాదులందు
అధికముగా
ఉపయోగింపబడును.
వానిచే
స్వాహాకార
పూర్వకముగా
హవిస్సు
హోమము
చేయబడును.
అందువలన
యజుర్వేదము
ప్రధానమై
శిరస్సని
వర్ణింపబడినది.
20
▾
Meaning
Keep
యజుస్సు
అనునది
ఆ
నామముతో
వ్యవహరింపబడు
శబ్ద
విశేషరాశి.
శ్రోత్ర
ద్వారమున
యజుస్సును,
ప్రత్యేక
భావమున
గ్రహింపబడు
మనోవృత్తులు
యజుస్సనబడుచున్నవి.
ఈ
విధముననే
ఋగ్వేద
సామవేదములు
కూడా
విశిష్ట
లక్షణములని
గ్రహింపనగును.
ఇట్లు
మంత్రములన్నియు
మనోవృత్తి
రూపము
లగుచున్నవి.
మనో
వృత్తులన్నియు
ఆత్మ
చైతన్య
సముపేతములు
కనుక
యజుర్వేదాది
శబ్దవాచ్యమగు
శబ్దరాశి
ఆత్మ
విజ్ఞానమే
యగుచున్నది.
అందువలన
వేదములకు
నిత్యత్వము
సిద్ధించుచున్నది.
శాంతిక
పౌష్టికాది
ప్రతిష్ఠలకు
కారణమగు
కర్మము
ప్రధానమగుటంజేసి
అధర్వణ
వేదము
పుచ్ఛమని
ప్రస్తావింపబడినది.
ఇపుడు
చెప్పబడుచున్న
విజ్ఞానమయుడే
మనోవిషయ
శరీరములందు
పుట్టిన
మనోమయాత్మ
అగుచున్నాడు.
Previous
←
Aitareya Upaniṣad
Next
Brahmānubhava Upaniṣad (The Essence of All the Upaniṣads)
→