Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · In this earthly world itself is the supreme reality that is not earthly
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1.
పార్థివ
ప్రపంచములోనే
అపార్థివమైన
పరమార్థమున్నది
ఆత్మానుభూతిని
అనుభవించి
ఆనందాన్ని
అందించేది
విద్య
ఆది
లేనిది
అనాది.
అదే
అన్నిటికీ
ఆది;
దానికి
ఆది
కాగలిగినది
మరొకటి
లేదు.
కాబట్టి,
దానికి
అంతము
కూడా
లేదు.
పెరిగిన
వరకూ
పెరిగి,
వికసించినంత
వరకూ
వికసించి,
పరిపూర్ణమైన
తన
ప్రభావముతో
ప్రపంచానికి
కూడా
సంపూర్ణతను
అందించే
ఈ
పరమ
తత్త్వాన్నే
“విద్య”
అందురు.
2
▾
Meaning
Keep
ఎందరో
మహానుభావులు,
విశ్వసౌందర్యములోని
పరమ
రహస్యాలను
హృదయాకాశములో
అవగాహన
చేసుకొని,
లోక
కళ్యాణార్థమై
తమ
అనుభూతిని
వాగ్విభూతిగా
లోకానికి
చాటింపజేసినది,
విద్య.
వేదములో
ప్రధానమైనది
నాదము.
ఈ
నాదము
విని
ఆనందించవలసినదే
కానీ
దానిని
విమర్శించవలసినది
కాదు.
అందువలననే
దానికి
“శ్రుతి”
అనే
పేరు
వచ్చినది.
శ్రవణ
మాత్రము
చేత
లోపలి
ఆత్మానుభూతిని
బయటికి
ఆవిర్భవింపజేసి
ఆపాతరమణీయంగా
ఆనందాన్ని
అందించేది
“విద్య”.
3
▾
Meaning
Keep
భగవద్గీత,
ఉపనిషత్తులు,
బ్రహ్మ
సూత్రములు
భారతీయ
తత్త్వచింతనకు
మూలకందములు
మామూలుగా
“వేదాంత”మనే
పదాన్ని
తత్త్వచింతనకు
పర్యాయపదంగా
వాడుతుంటారు.
కానీ,
వేదాంతమనేది
వేద
వాఙ్మయములో
ఒక
ప్రత్యేకమైన
శాఖ.
‘ఉపనిషత్
వాఙ్మయ’మంతా
వేదాంతమునకు
సంబంధించినదే.
బాహ్యసృష్టిలోని
అందచందాలను
అంతర్దృష్టితో
అవగాహన
చేసుకొని
వాటి
ఆవేశాన్ని
అనురాగముతో
కీర్తించిన
ఆనందగీతికలు,
‘ఋగ్వేదము’లోని
ఋక్కులు.
4
▾
Meaning
Keep
పాడుకొని
కొనియాడ
తగిన
పరమ
రమణీయ
పద
సంపద,
‘సామగానము’.
ఐహిక,
ఆముష్మిక
రహస్య
సంపుటి
‘అధర్వణ’
రూపాన్ని
ధరించినది.
సత్కర్మలైన,
పుణ్యకర్మలైన
యజ్ఞయాగాలు,
కర్మకాండకు
సంబంధించిన
మంత్రాలు,
‘యజుర్వేదము’లో
చేరినాయి.
ఇలా
నాలుగు
భాగాల్లో
విస్తరిల్లిన
వేద
వాఙ్మయములో
తిరిగి
నాలుగు
శాఖలు.
ఇవన్నియూ
‘విద్య’లనబడును.
మంత్రభాగము,
బ్రాహ్మణభాగము,
ఆరణ్యకము,
ఉపనిషత్
భాగము.
మంత్ర
భాగాన్ని
సంహిత
భాగమని
కూడా
అంటారు.
ఇందులో
మంత్రాలన్నీ
సంగ్రహంగా
కూడి
ఉంటాయి.
5
▾
Meaning
Keep
ఈ
మంత్రాలకు
వినియోగం,
ప్రయోజనం,
ప్రక్రియ
నిరూపించేది
“బ్రాహ్మణ”
భాగము.
‘బ్రహ్మ’
శబ్దానికి
అనేక
అర్థములున్ననూ
ఇచట
మంత్రమనే
అర్థము.
ఈ
భాగములో
ఎక్కువగా
ప్రవృత్తి
మార్గానికి
చెందినవి.
వైరాగ్య
సూత్రాలు,
వేద
రహస్యాలు
‘ఆరణ్యకము’లో
ఉంటాయి.
ఈ
రెండింటి
సమన్వయం
చివరి
భాగమైన
‘ఉపనిషత్తు’లలో
ఉంటుంది.
ఇది
వేద
వాఙ్మయానికి
తుది
విభాగములగుట
వల్ల
దీనికి
‘వేదాంత’మని
పేరు
వచ్చింది.
ఒక
విధంగా
దీనిని
వేదసారమని
చెప్పవచ్చు.
సమస్త
వేద
సారస్వతానికి
నవనీతములాంటిది.
అనగా
పాలను
మధించగా
పైకి
తేలు
వెన్నవంటిది
ఈ
వాఙ్మయము.
ఉపనిషత్
‘సత్’
అనే
ధాతువు
నుండి
వచ్చినది.
ఈ
ధాతువునకు
“ఉప”,
“ని”
అనే
రెండు
ఉపసర్గలు
చేరాయి.
‘సత్’
అనే
ధాతువునకు
‘కూర్చుండుట’
అనియు,
దీనికే
‘నశింపజేయుట’
అని
కూడా
మరొక
అర్థమున్నది.
“ని”
అనగా
నిష్ఠను
తెలియజేస్తుంది.
“ఉప”
అనగా
సమీపము.
అనగా
ఆచార్య
సమీపమున
(గురు
సమీపమున)
నిష్ఠతో
కూర్చొని
నేర్చుకొన్న,
వివేక
విజ్ఞానాలు
అలవడును.
భగవద్గీత,
ఉపనిషత్తులు,
బ్రహ్మ
సూత్రములు
భారతీయ
తత్త్వచింతనకు
మూలకందములు.
వీటినే
‘ప్రస్థానత్రయము’లని
అందురు.
మనకంటికి
కనుపించేది,
మన
తనువును
మరిపించేది,
మనసును
మురిపించేది,
మన
మనుగడ
వెలయించేది,
ఈ
భౌతిక
ప్రపంచము.
ఈ
పార్థివమైన
ప్రపంచములోనే
అపార్థివమైన
పరమార్థమున్నది.
ఈ
రెండూ
ఒకే
అఖండ
చైతన్యంలోని
అవిచ్ఛిన్నమైన
అంశాలు.
దేనికదే
పరిపూర్ణము.
ఒకదానికొకటి
పరిపూరకం.
పరిపూర్ణమైన
పరబ్రహ్మతత్త్వము
నుంచే
పరిపూర్ణమైన
జీవతత్త్వం
ఉదయించింది.
జీవతత్త్వము
నుండి
శరీరము
విడిపోయిన
తరువాత,
శేషించి
ఉండే
చిరంతన
చైతన్యము
కూడా
పరిపూర్ణమైన
పరబ్రహ్మతత్త్వమే.
6
▾
Meaning
Keep
“పూర్ణమదః
పూర్ణమిదం
పూర్ణాత్పూర్ణముదచ్యతే,
పూర్ణస్య
పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే”
7
▾
Meaning
Keep
పవిత్రకర్మలకు,
పుణ్యకర్మలకు
గీటురాయి
త్యాగము
ఈ
ప్రపంచము
పరమేశ్వరుని
లీలావిలాసము
తప్ప
మరేమీ
కాదనే
పరమసత్యాన్ని
ప్రబోధిస్తుంది
విద్య.
8
▾
Meaning
Keep
దీనినే
ఉపనిషత్తులో
“ఈశావాస్యం”
అని
చెప్పబడింది.
పరమేశ్వరుడు
నివసించదగినది,
నివసించునది
ఈ
ప్రపంచమే
అని,
ఇందులో
స్వభావమునకు
కానీ,
స్వార్థబుద్ధికి
కానీ
తావే
లేదు.
అందుకనే
త్యాగబుద్ధితో,
సర్వేశ్వర
భావముతో
ఆనందమయుడు
అందించిన
ఆనందాన్ని
అనాసక్తితో
అనుభవించవలసినదని
ఆర్షవాక్యం
ఆదేశించినది.
9
▾
Meaning
Keep
“నా”,
“నా”
అను
భావము
వదిలితే
కానీ
“నాది”
కాదని
బోధపడుతుంది.
అట్లనగా
సర్వం
త్యజించమని
కాదు,
‘త్యాగబుద్ధితో
అనుభవించటం
కర్తవ్యమని
విద్య
బోధించింది.’
పవిత్ర
కర్మలకు,
పుణ్యకర్మలకు
గీటురాయి
‘త్యాగము’,
అపవిత్ర
కర్మలకు,
పాపకర్మలకు
గీటురాయి
‘లోభము’
అని
కూడ
విద్య
ఆదేశిస్తుంది.
చేయవలసిన
పనులు
చేస్తూ
నూరు
సంవత్సరములు
జీవించవలెనని
కోరుకో,
తప్పు
లేదు.
‘చేసే
పని
తెలిసి
చేయాలి,’
అని
కూడా
విద్య
బోధిస్తుంది.
10
▾
Meaning
Keep
పశువు
ఇతర
జంతువులను
చంపుతుంది.
కానీ
ఆత్మజ్ఞానము
లేని
అంధుడు
తన
ఆత్మనే
చంపుకొంటున్నాడు.
అట్లు
చేసిన
వాడు
కారు
చీకట్లు
క్రమ్మిన
భీకర
లోకాలకు
పోతాడని
కూడా
విద్య
తెలుపుతుంది.
11
▾
Meaning
Keep
విద్య
ఆత్మ
లక్షణాలను
వివరిస్తుంది
విద్య
ఆత్మ
లక్షణాలను
వివరిస్తుంది.
ఆత్మ
చలించదు.
కానీ,
దానితో
సమానంగా
దేవతలు
కూడా
పరుగిడలేరు.
ఎంత
వేగంతో
ముందుకు
వెళ్ళినా
మనకంటే
ముందుగనే
ఆత్మ
సాక్షాత్కరిస్తుంది.
పంచ
తత్త్వాలకు
ఆత్మతత్త్వమే
ఆశ్రయము.
12
▾
Meaning
Keep
నిజానికి
“ఆత్మ
నిశ్చలము,
దాని
ఉనికిని
కొలిచి
చెప్పుటకు
సాధ్యము
కాదు,”
అని
‘విద్య’
బోధిస్తుంది.
13
▾
Meaning
Keep
ఆత్మకు
అనాత్మకు,
విద్యకు
అవిద్యకు,
వికాసానికి
వినాశానికి,
భేదమే
లోపిస్తుంది.
అట్టి
స్థితిని
అనుభవించి
భేదములో
ఏకత్వమును
పొందిన
వారి
చరిత్రలను,
సమత్వమును
నిరూపిస్తుంది
విద్య.
14
▾
Meaning
Keep
అట్టి
వారి
దృష్టికి
విద్య,
అవిద్య
సమానమే.
అవిద్య
ఎంత
హానికరమో,
విద్య
కూడా
అంతటి
హానికరము.
రెండింటి
రహస్యములను
బాగుగా
తెలిసినవాడు
కాబట్టి,
అట్టి
మనిషి
అవిద్యను
(కర్మ)
ఆధారము
చేసుకొని
మృత్యువును
[‘ఈశ్వరార్పణ
బుద్ధితో
చేసే
కర్మ
ద్వారా
అంతఃకరణ
మలమును
తొలగించుకుని
అంతఃకరణ
శుద్ధుడై
(చిత్తశుద్ధి)
ఆత్మ
జ్ఞానానికి
అర్హుడవుతాడు’
అని
భావం]
దాటుతాడు,
విద్యను
(ఆత్మ
జ్ఞానం)
ఆధారము
చేసుకొని
అమృతత్త్వాన్ని
పొందుతాడు.
Next
True Vidyā is what brings purity of citta
→