Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · True Vidyā is what brings purity of citta
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2.
చిత్త
శుద్ధిని
చేకూర్చునదే
నిజమైన
విద్య
అజ్ఞానము
అంతరించాలంటే
ఆత్మజ్ఞానము
కలగాలి
విద్య
యొక్క
పరమార్థమును
స్వయముగా
గ్రహించుటకు
కానీ,
ఇతరులకు
బోధించుటకు
గానీ
ముఖ్యముగా
కావలసినది
‘చిత్తశుద్ధి’.
ప్రకాశము,
పరిశుభ్రత
ఉన్న
గదిలో
పాములు,
తేళ్ళు,
మొదలగు
విషపురుగులు
ప్రవేశింపజాలవు.
చీకటిగ,
అశుభ్రముగా
ఉన్న
స్థానమందే
విషపురుగులు
ప్రవేశించును.
అదే
విధముగ,
అంధకార,
అశుద్ధమయిన
హృదయాలలో
పవిత్రజ్ఞానము
ప్రవేశింపదు.
కామక్రోధాది
విషకీటకములు
కాపురము
చేయును.
బొగ్గు
నలుపు
పోగొట్టాలనుకుంటే,
సబ్బుతో
తోమిన
పోదు;
లేక
పాలతో
కడిగినా
పోదు.
అగ్నిలో
వేస్తే
చాలు.
అంతా
బాగా
కాలి
తెల్లటి
భస్మంగా
మారుతుంది.
అటులనే,
అజ్ఞానము
అంతరించాలనుకొంటే,
అవిద్య
హతమారాలనుకొంటే,
ఆత్మజ్ఞానము
కలగాలి
లేక
బ్రహ్మవిద్య
రావాలి.
చీకటి
పోవాలంటే
వెలుగు
రావాలి;
కానీ
చీకటితో
పోట్లాడిన
చీకటి
పోదు.
ఆ
వెలుగే
విద్య.
ఆ
ప్రకాశమే
విద్య,
ఆ
జ్ఞానమే
విద్య.
ఇదే
పురుషోత్తమ
యోగము.
ఈ
యోగము
డబ్బిచ్చి
తెచ్చుకొనేది
కాదు,
మిత్రుల
నుండి
లభించేది
కాదు,
లేక
ఏ
కంపెనీ
సప్లై
చేయదు.
ఇది
ఎవరికి
వారు
శ్రద్ధాభక్తితో
తెలుసుకొనేది.
చదువుకొనేది
కాదు.
2
▾
Meaning
Keep
ఆధ్యాత్మిక,
ధార్మిక,
నైతిక
విలువ
మానవునకు
మకుటాయమానము
“God
is
no
where”
అన్న
పదాన్ని
ఏ
మార్పు
చేయనక్కరలేదు.
Where
అను
పదములో
నున్న
‘w’
ను,
‘no’
అను
పదమునుకు
చేర్చి
చదివిన
“God
is
now
here”
అవుతుంది.
అదే
విధముగ,
ప్రపంచములో
పంచి
పెట్టిన
విచ్ఛిన్న
భావాల్ని
ఏకోన్ముఖం
చేసి
పరమాత్మపై
పెడితే
అపరిచ్ఛిన్నమౌతుంది.
3
▾
Meaning
Keep
రామకృష్ణ
పరమహంస,
జయదేవ,
గౌరాంగ,
తుకారాం,
తులసీదాసు,
రామదాసు,
కబీర్
దాసు,
శారదాదేవి,
మీరా,
సక్కుబాయి,
మల్లమ్మ
మొదలయిన
వారికి
బాహ్య
చదువులంతగా
లేకపోయినప్పటికినీ
ఈనాడు
ప్రపంచమంతా
అన్ని
మతములవారు,
అన్ని
తెగలవారు,
అన్ని
రాష్ట్రముల
వారు
వారిని
పూజించుచూ,
గౌరవించుచున్నారంటే,
వారల
‘చిత్తశుద్ధి’తో
కూడిన
ఆత్మవిశ్వాసమే
మూలకారణము.
చిత్తశుద్ధిని
చేకూర్చునదే
సత్యవిద్య.
4
▾
Meaning
Keep
హృదయాలలో
ఉన్న
దానిని
ఉన్నట్లు
చెప్పెడి
వారు
పై
మహనీయులు.
నేటి
విద్యావంతులలో
కోటికొక్కడైనా
ఉన్నది
ఉన్నట్లు
చెప్పడు
కదా!
సంవత్సరమునకొక
పర్యాయమే
సత్యనారాయణ
వ్రతము.
మిగిలి
కాలమంతా
అసత్యనారాయణ
పూజే.
అదే
నేటి
బాహ్య
విద్యల
యొక్క
బాహుబలము.
ఇట్టి
వానిని
విద్యలనవచ్చునా?
కాదు
కాదు.
5
▾
Meaning
Keep
పాత్రలో
ఉన్న
అన్నమును
మనము
తినక,
పరులకు
పెట్టక,
దాచి
పెట్టిన
పాచిపోవును.
అదే
విధంగా,
మనలో
ఉన్న
లోపదోషాలు
మనకు
మనమైన
చక్క
జేసుకొనక,
అనుభవజ్ఞులు
చెప్పితే
వినకపోయినవారి
జీవితమేమగును?
పాచిన
పప్పు
కంపుకొట్టినట్లు,
దుర్గంధంగా
మారిపోవు
జీవితమే
నిరర్థకమగును.
“మా
పిల్లవాడు
చాలా
మంచివాడే.
అయితే
రెండు
మాత్రము
దోషములున్నవి.
అవి
ఏవన,
వానికి
తెలియదు,
పరులు
చెప్పితే
వినడు”,
అని
అన్నాడట
ఎవరో
తండ్రి
ఆనాడు.
ఈనాడు
ఒక
పిల్లవాడు
కాదు,
పిల్లలందరూ
అదే
స్థాయిలో
ఉన్నారు.
ప్రతి
తండ్రీ
ఈ
మాట
అనటం
సహజమైనది.
ఇదేనా
విద్య
యొక్క
విలువ?
పిల్లలు
మంచివారే.
విద్యా
విధానములో
లోపమన్నది
అందరికీ
తెలిసిన
విషయమే.
కానీ,
ఎవ్వరూ
దానిని
సంస్కరింప
జేయలేకపోతున్నారు.
అదే
పెద్ద
బలహీనత!
చెప్పవచ్చు
కోటి,
చేయరు
ఒక్కటి.
“ప్రైమరీ,
అనగా,
ప్రాథమిక
పాఠశాల
మొదలు
విశ్వవిద్యాలయము
వరకూ
విద్యావిధానము
మారాలి,
మారాలి”
అని
పత్రికలలో
ప్రకటించుచుందురే
కానీ,
ఏమి
మారాలి?
ఎట్లు
మారాలి?
దీని
లోపమేమి?
అని
తెలుపువారు
కానీ,
తీర్చి
దిద్దువారు
కానీ,
కనుపించకున్నారు.
ఆధ్యాత్మిక,
ధార్మిక,
నైతిక
విలువ
మానవులకు
మకుటాయమానమన్న
సత్యాన్ని
గుర్తించలేకపోతున్నారు.
సామాన్యులుగా
ఉన్నప్పుడు
చదువులపై,
అనేక
వ్యాసాలు
వ్రాతురు.
వేదికలపై
చిలుక
పలుకులు
కురిపింతురు.
వారే
అధికార
స్థానమును
అలంకరించినపుడు,
ఆ
చెప్పిన
మాటలకు
పూర్తి
విరుద్ధముగా
చట్టముల
నియమింతురు.
6
▾
Meaning
Keep
మనోవాక్కాయ
కర్మల
ఏకత్వమే
మానవుని
నిజమైన
విలువ
అయస్కాంతము
మంచిదే,
కానీ
తుప్పు
పట్టిన
ఇనుమును
ఆకర్షించదు.
అనగా,
ఉపన్యాసాలు
మంచివే.
ఆచరణకు
రోగము
తగిలింది.
ఆ
తగిలిన
రోగమును
నయము
చేస్తేనే,
అసలు
విద్య
రాణిస్తుంది.
ఇనుముకు
పట్టిన
తుప్పును
కడిగి
శుభ్రపరచినపుడే
అయస్కాంతము
ఆకర్షించును.
దీనినే
మహనీయులు
“మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం,
మహాత్మనం”
అని
అన్నారు.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వమే,
మానవుని
నిజమైన
విలువ.
ఈ
పవిత్ర
విలువను
ఈనాడు
మానవుడు
చేతులారా
కోల్పోవుచున్నాడు.
కారణం?
ఆత్మవిద్య
తెలియకపోవుట
చేత,
అసలు
విద్యను
అభ్యసించకపోవుట
చేత.
7
▾
Meaning
Keep
బ్రహ్మవిద్య
హృదయవిశాలముతో,
చిత్తశుద్ధితో
లభించును
‘పరమహంస’
కాలములో
ఎందరో
లౌకిక
విద్యావంతులు,
పండితులు,
మేధావులు
ఉండిరి.
కానీ,
వారిలో
ఆత్మజ్ఞానమంతగా
ప్రకాశించలేదు.
లేకున్న
ఆ
పండితుల
పేర్లు
కానీ,
ఆ
మేధావుల
పేర్లు
కానీ,
ఎక్కడా
వినిపించుట
లేదు.
ఏ
లౌకిక
విద్యలూ
నేర్వని,
‘పరమహంస’
పేరు
మాత్రమే
ప్రపంచమున
ఇంత
వ్యాప్తియగుటకు
కారణమేమి?
పంచదార
కలసిన
నీరు,
సామాన్య
నీరు
ఈ
రెండునూ
చూచుటకు
ఒక్కటిగనే
యుండును.
త్రాగి
చూచిన
ఏది
పానకం,
ఏది
నీరు
అని
తెలియును.
పరమహంసల
పలుకులు,
పరమార్థములతో
కూడినవి.
మేధావుల
పలుకులు
పాండిత్యముతో
కూడినవి.
పైపై
చదువుల
పండితులు
పైసాల
దగ్గరకు
వెడతారు
కానీ,
పరమాత్మ
దగ్గరకు
పోలేరు.
నీళ్ళలో
తడిసిన
అగ్గిపుల్ల
యెంత
ప్రయత్నించిననూ
వెలుగదు.
వెలుగక
పోవుటయే
కాక,
పెట్టెను
కూడా
అనగా
అగ్గిపెట్టెను
కూడా
పాడు
చేయును.
అదే
విధంగా,
ప్రపంచ
వాసనలతో
తడిసిన
అపవిత్ర
హృదయాలవి
చిలక
పలుకులు.
వారెంత
బోధించినా
వినువారే
కానీ,
తినువారుండరు.
ప్రపంచమందలి
అన్ని
వ్యవహారములకును
అసాధారణ
కారణము
జ్ఞానము.
పదార్థము
లేనిది
పదార్థ
జ్ఞానము
లేదు.
అయితే,
జ్ఞానము
పరోక్షము,
ప్రత్యక్షము
అని
రెండు
విధములు.
భేద
విశిష్టమును,
విషయ
విషయికమును
అగు
జ్ఞానము
పరోక్షజ్ఞానము.
పరోక్షజ్ఞానము
కలుగనిదే
ఏ
పదార్థము
యొక్కయూ
ప్రత్యక్షజ్ఞానము
కలుగదు.
ప్రత్యక్షము
కన్ను,
చెవి
ఇత్యాది
ఇంద్రియముల
ద్వారా,
వాక్యముల
ద్వారా
కలుగును.
ఇది
లౌకిక
విద్య.
అయితే,
బ్రహ్మవిద్య
హృదయ
విశాలతతో,
చిత్తశుద్ధితో
లభించును.
Previous
←
In this earthly world itself is the supreme reality that is not earthly
Next
When the vision is filled with Jñāna, creation is filled with Brahman
→