Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Jñāna is attained only when one teaches with a pure mind
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
19.
చిత్తశుద్ధితో
బోధించినప్పుడే
జ్ఞానసిద్ధి
కలుగుతుంది
త్రికరణశుద్ధితో
సమస్త
కర్మలు
ఆచరించాలి
త్రికరణములలో
మూడవది
కాయము...
చేతులు.
జగత్తులో
మానవుడు
అనుభవించే
సమస్త
దుఃఖములకు,
ఆపదలకు
తాను
చేసే
పనులే
కారణము.
మానవుడు
తాను
సుఖపడుతున్నానని,
విచారపడుతున్నానని,
కష్టపడుతున్నానని
భావిస్తుంటాడు.
దీనికంతా
ఎవరో
కారకులు
అని
విశ్వసిస్తుంటాడు.
ఇది
చాలా
పొరపాటు.
మన
కర్మలే
దీనికి
కర్త.
మనము
నమ్మినను,
నమ్మకపోయిననూ,
కర్మల
ఫలితముననుభవించక
తప్పదు.
ఇది
ప్రకృతి
నియమము.
వేడి,
చలి,
నిప్పు,
వర్షము
వీటిని
నమ్మిననూ
నమ్మకపోయిననూ,
వాటి
ప్రభావము
మనపై
ప్రసరిస్తుంది.
అదే
విధముగానే,
మనము
చేసిన
కర్మల
ఫలితము
మనపై
ప్రసరించక
తప్పదు.
కనుక,
మనము
కర్మలను
సక్రమ
మార్గములో
ప్రవేశపెట్టాలి.
కర్మలకు
హస్తములు
మాత్రమే
కాదు,
శరీరమంతా
ప్రధానము.
2
▾
Meaning
Keep
ఏది
చేసినా,
ఏది
చూచినా,
ఏది
విన్నా,
త్రికరణశుద్ధితో
చేయాలి.
అనగా
మనోవాక్కాయ
పరిశుద్ధితో
త్రికరణశుద్ధితో
పలకాలి,
వినాలి,
ఆనందించాలి.
విద్యార్థులు
మొట్టమొదట
మానసికంగా
విద్యనభ్యసించి,
మనస్సులో
పొందుపరచి,
మాటలతో
పలుకవలెను.
మాటలతో
అందించిన
విద్యను,
క్రియలతో
అనుసరించి
చూపాలి.
కానీ,
ఈనాడు
మనము
మనస్సుతో
విద్యనందుకోవడము
లేదు.
కేవలము
శ్రవణము
ద్వారానే
అందుకొంటున్నాము.
శ్రవణము
మనస్సు
యొక్క
వికారము
వలన
స్పష్టము
కావచ్చు,
అస్పష్టము
కావచ్చు.
కనుక,
విద్యను
మనస్సుతో
స్వీకరించాలి,
చిత్తశుద్ధితో
బోధించాలి.
అప్పుడే
జ్ఞానసిద్ధి
కలుగుతుంది.
3
▾
Meaning
Keep
ఉపాధ్యాయులు
విద్యార్థుల
స్థాయికి
దిగి
వచ్చి
బోధించాలి
విద్యార్థులు
ఏ
కొద్దికాలము
మాత్రమో
విద్యనభ్యసిస్తుంటారు.
అధ్యాపకులు
విద్యాబోధకులగుటకు
అర్హులు
కావాలంటే,
నిర్విరామముగా
ఎల్లప్పుడూ
చదువుచుండాలి.
కనుక,
నిజమైన
విద్యార్థులెవరు
అంటే,
అధ్యాపకులే!
“నేనొక
ఆదర్శ
విద్యార్థి”
అనే
స్థాయిలో
బోధించినప్పుడే
తన
కర్తవ్యమును
తాను
చక్కగా
గుర్తించినవాడవుతాడు.
“నేను
ఏ
స్థాయిలో
ఉంటున్నాను?
విద్యార్థి
ఏ
స్థాయిలో
ఉంటున్నాడు?”
అని
గుర్తించి
విద్యార్థి
స్థాయికి
అధ్యాపకుడు
దిగాలి;
దిగకుండా
బోధిస్తే,
ఇక
విద్యార్థుల
పరిస్థితి
గురించి
ఆలోచించనవసరము
లేదు.
4
▾
Meaning
Keep
దీనినే
“అవతరణ”
అంటారు.
దిగిరావడమనగా,
పైనుంచి
క్రిందకు
రావడమని
అర్థము
కాదు.
ఎవరిని
అనుగ్రహించవలెనో
వారి
స్థాయికి
రావడమనేదే
దాని
అర్థము.
క్రింద
ఉన్న
చంటిబిడ్డను
చంకలోనికి
ఎగిరి
రమ్మంటే,
రాలేదు.
నేను
పెద్దవాడిని
కదా?
వంగలేను
అంటే,
ఆ
బిడ్డ
నీకు
చిక్కదు.
వంగినంత
మాత్రాన,
లొంగినట్లు
కాదు!
అదే
విధముగానే,
పిల్లవానికి
వంగినట్లు
కాకుండా,
వానికి
బోధించే
నిమిత్తమై
వాని
స్థాయికి
దిగి
రావాలి.
ఇది
ప్రేమ
యొక్క
ప్రధాన
సూత్రము.
5
▾
Meaning
Keep
“నేను
ఒక్క
పాఠము
రెడీ
చేసుకొని
వచ్చాను.
దానిని
చెప్పడమే
నా
కర్తవ్యము.
నా
వృత్తిని
నేను
చేసుకొంటాను,
పోతాను”
అని
అనుకోవడము
ఈనాటి
అధ్యాపకులకు
పరిపాటైపోయింది.
పిల్లలకు
సరిగా
అర్థమైనదా
లేదా,
వారికి
తెలిసిందా
లేదా,
ఏ
విషయాన్ని
ఏ
విధంగా
బోధిస్తే
పిల్లల
హృదయానికి
హత్తుకొంటుందో
ఆ
మార్గాన్ని
అధ్యాపకులు
వెతకాలి.
పిల్లల
నుండి
యెటువంటి
ప్రవర్తన
ఆశిస్తున్నామో,
ఆ
ప్రవర్తనను
‘నడత’లో
చూపించాలి.
ప్రేమతో
బోధించిన,
వారిలో
గురుభక్తి
కూడా
అభివృద్ధి
అగును.
ముఖ్యంగా,
పిల్లల
సర్వతోముఖాభివృద్ధి
కోరుతూ
వారికి
బోధించే
హృదయాన్ని
పెంచుకోవాలి.
నిరంతరము
స్వార్థముతోనే
జీవితాన్ని
వ్యర్థము
చేయరాదు.
6
▾
Meaning
Keep
పిల్లల
హితమును
కోరి
ఉపదేశము
చేయువారే
నిజమైన
గురువులు
భేద
భావములు
లేకుండ
విశాల
భావమును
పెంచుకోవాలి.
తమ
కామ
పుత్రులను,
పాఠశాలలోని
ప్రేమపుత్రులను
సహ
పుత్రులుగా
భావించి,
వారిరువురకూ
సమమైన
బోధను
సలిపేవారు
ఋషులు.
ఈనాడు
ప్రిన్సిపాల్
కుమారుడు
ఒక
క్లాసులో
పరీక్ష
వ్రాస్తున్నాడంటే,
అతనిని
అక్కడ
ఇన్విజిలేటరుగా
నియమించరు.
కుమారునిపై
ప్రేమతో
వానికేమైనా
చెబుతారని
ఆయనను
అధికారిగా
వెయ్యరు.
అయితే,
పూర్వము
ఋష్యాశ్రమములలో
వారు
ఇటువంటి
తారతమ్యములను
ప్రదర్శించేవారు
కారు.
త్రికరణశుద్ధి
లేకపోవడమే
ఈ
వ్యత్యాసమునకు
మూలకారణము.
సాధనచేత,
పరిశుద్ధ
చిత్తమును
సంపాదించుకొన్నప్పుడే,
గురుస్థానానికి
అర్హులమవుతాము.
పిల్లల
హితమును
కోరి
ఉపదేశము
చేయువారే
నిజగురువులు.
నిజశిష్యులు
ఎటువంటివారు
అనగా,
గురువుపై
ఆసక్తి,
భక్తి
తప్ప
అన్యము
నెరుగని
వారు.
7
▾
Meaning
Keep
విద్యార్థుల
ప్రవర్తనలన్నింటికీ,
గుణములన్నింటికీ,
అధ్యాపకులే
మూలకారణము.
కాబట్టి,
అధ్యాపకులు
స్వార్థభావమును,
రాజకీయమును
ప్రక్కకు
నెట్టి,
పరార్థమే
తమ
జీవిత
సార్థకత
అని
విశ్వసించాలి.
ఒకరితో
ఒకరు
కలిసి
మెలిసి
సోదర
సోదరీ
భావాన్ని
పెంచుకోవాలి.
అధ్యాపకులలో
అభిప్రాయ
భేదములు
చేరినప్పుడు,
విద్యార్థులు
దానిని
చక్కగా
గుర్తిస్తుంటారు.
వ్యక్తిగత
అభిప్రాయ
భేదములుండవచ్చు,
కాని
సంస్థ
విషయమందుగానీ,
బోధించే
విషయమునందుగానీ
కలసి
మెలసి
ఉండాలి.
విద్యార్థులకు
ఆదర్శజీవితాన్ని
నిరూపించాలి.
8
▾
Meaning
Keep
గురువులు
ఉన్నత
భావములతో,
త్యాగభావములతో
బోధించాలి
విద్యార్థులలో
కూడా
ఈనాడు
ఐకమత్యము
చక్కగా
కనిపించడము
లేదు.
సద్భావనలు,
సత్సంగములు
తక్కువ.
యథారాజా,
తథాప్రజా;
గురువులు
ఎట్టివారో,
శిష్యులు
కూడా
అట్టివారై
పోతున్నారు.
కనుక,
గురువులు
ఉన్నత
భావములతో,
త్యాగ
భావములతో
బోధించే
వారుగా
తయారు
కావాలి.
పదార్థ
విజ్ఞానశాస్త్రము
చక్కగా
తెలిసిన
వ్యక్తికి,
జంతుశాస్త్రము
తెలియకపోవచ్చును.
కానీ
వారిరువురూ
అన్యోన్యముగా
ఉండటానికి
అవకాశము
లేదా?
ఏ
శాస్త్రము
నేర్చుకున్నా,
దానితో
పరార్థ
విజ్ఞానము,
పరమార్థ
విజ్ఞానము
నేర్చుకొనే
అవకాశము,
అవసరము
ఉన్నవి.
మొన్న
బొంబాయిలో
అణు
విజ్ఞాన
కేంద్రమునకు
పోయినప్పుడు
“ఎనర్జి”
అంటే
ఏమిటో
చెప్పాను.
ప్రతి
పదార్థమునందు
“ఎనర్జీ”
ఉంటుంది.
కాగితమున
ఉన్నది,
బట్టలో
ఉంది.
‘ఎనర్జీ’ని
కోల్పోవడం
చేత
మరణం;
ఎనర్జీ
చేరటం
చేత,
పుట్టడం.
దీనినే,
“సత్,
చిత్,
ఆనందం”
అని
చెప్పుదురు.
మనము–సత్;
ఉన్నాము–చిత్;
ఆనందముగా,
అదే
మూడవది;
అదే
దివ్యత్వము,
అన్నిటికినీ
ఆధారమైనది.
అన్నిటికీ
ఆధారము
దైవత్వము,
ఆధ్యాత్మికము.
ఈనాడు
మనము
ఆధేయమైన
మానవత్వాన్ని
అలక్ష్యము
చేస్తున్నాము.
ఆధారమైన
దైవత్వాన్ని
ఏ
మాత్రమూ
జ్ఞప్తియందు
ఉంచుకోవడము
లేదు.
ఉదరమును
పోషించే
నిమిత్తమై,
మధ్యలో
వచ్చే
కొన్ని
సబ్జెక్టులను
పట్టుకొని
వ్రేలాడుతున్నాము.
మన
లక్ష్యము
‘చిన్న
సత్యము’.
ఆధారమైన
దైవత్వము
‘కఠిన
సత్యము’.
మానవులు
పెద్ద
సత్యాన్నైనా
అర్థము
చేసికోవాలి;
లేక,
చిన్న
సత్యాన్నైనా
జ్ఞప్తియందుంచుకోవాలి.
ఈ
రెండింటి
మధ్యయందే,
మన
విద్య
యొక్క
తత్త్వమంతా
ఇమిడియున్నది.
Previous
←
Character is the touchstone of humanity