Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Character is the touchstone of humanity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
18.
మానవత్వమునకు
గుణమే
గీటురాయి
అన్నము
కొరకు
కాక,
ఆదర్శము
కొరకు
జీవించుటయే
గుణము
అధ్యాపకులు
మార్గదర్శకులు,
భవిష్యత్తుకు
రాచబాట
వేయువారు
విద్యార్థులు.
మానవజాతి
యొక్క
గౌరవము
కానీ,
శక్తి
సామర్థ్యములు
కానీ
ఉపాధ్యాయుల
గుణము
పైననే
ఆధారపడియుంటవి.
మానవత్వమునకు
గుణమే
గీటురాయి.
గుణమును
పోషించే
నిమిత్తము
తమ
విద్యను,
జ్ఞానమును
వినియోగించి,
విద్యార్థులను
ఉన్నతస్థాయికి
తీసికొనిపోవుటకు
అధ్యాపకులు
తగిన
ప్రయత్నము
చేయాలి.
సాంఘిక
జీవితానికి
సర్వోన్నతిని
కలిగించేది
గుణము.
మానవత్వమునకు
మొగ్గను
తొడిగేది
గుణము.
అన్నము
నిమిత్తము
కాక
ఆదర్శము
నిమిత్తమై
జీవించటయే
గుణము.
గుణములేని
జీవితము
దీపములేని
గుడి
వంటిది,
చెల్లని
రూపాయి
వంటిది,
దారము
తెగిన
గాలిపటము
వంటిది.
2
▾
Meaning
Keep
ధన
నిమిత్తమే
అధ్యాపకుడు
బోధన
సలపడము,
ఉద్యోగ
నిమిత్తమే
విద్యార్థులు
విద్యనభ్యసించడము
సరియైన
పద్ధతి
కాదు.
విద్యార్థి
యొక్క
ఔన్నత్యమును,
అభివృద్ధిని
ఆశించి
తన
కర్తవ్యమును
గుర్తించి
వర్తించడమే
అధ్యాపకుని
పని.
మానవత్వాన్ని
వికసింపచేసుకొని
సామాజిక
సేవ
యందు
గానీ,
దివ్యత్వమునందు
గానీ
మార్గదర్శకుడైన
వాడు
విద్యార్థి.
3
▾
Meaning
Keep
ఉన్నత
స్థితికి
లేక
అధోస్థితికి
మనస్సే
మూలకారణము
మానవత్వమునకు
ముఖ్యముగా
మూడు
కరణములున్నవి:
మనస్సు,
మాట,
నడత.
ఉపకారమునకు
గానీ,
అపకారమునకు
గానీ,
మనస్సే
మూలకారణము.
ఉన్నత
స్థితికి
గానీ,
అధోస్థితికి
గానీ,
దుఃఖమునకు
గానీ,
ఆనందమునకు
గానీ
మనస్సే
మూలకారణము.
4
▾
Meaning
Keep
అందుకే,
“మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః”
అన్న
నుడి.
మనస్సు
అంటే
ఏమిటి?
5
▾
Meaning
Keep
“సంకల్ప
వికల్పాత్మకం
మనః”
అనీ
“మననాత్
మనః”
అనీ
అన్నారు.
మననము
చేసేదే
మనస్సు.
6
▾
Meaning
Keep
సమస్త
దుఃఖములకు
మానసిక
సంభాషణలే
మూలకారణము
మనస్సునందు
రెండు
విధములైన
తలంపులు
జరుగుతుంటాయి.
ఒకటి
ఆలోచన,
రెండవది
మానసిక
సంభాషణ.
మన
సమస్యలను
పరిహారము
గావించుకొనే
స్థితిని
పొందేవి
ఆలోచనలు.
సమస్యలను
మరింత
అభివృద్ధి
గావించి,
మానవుని
అనేక
విధములైన
పెడమార్గములను
పట్టించేవి
మానసిక
సంభాషణలు.
అట్లు
అవి
రెండూ
భిన్న
భిన్నముగా
ప్రవర్తిస్తున్నవి.
ఈ
మానసిక
సంభాషణలలో
పరుల
దూషణలను,
చెడ్డనూ,
పరిస్థితినీ
ప్రవేశపెట్టుచున్నాము.
మనకున్న
అనారోగ్యమునకు,
త్వరలో
ప్రవేశిస్తున్న
వృద్ధాప్యమునకు,
సమస్త
దుఃఖములకూ
ఈ
మానసిక
సంభాషణలే
మూలకారణము.
ఇవి
మనస్సునందు
కారుమబ్బులవలె
చీకటిని
క్రమ్ముచున్నవి.
ఈ
సంభాషణలు
పెరిగి
పెద్దవై,
మానవత్వమును
కూడా
మరిపింప
చేయుచున్నవి.
జాగ్రదవస్థ
యందు
అనుభవించిన
సంభాషణ,
స్వప్నావస్థ
యందు
కూడా
ప్రారంభమవుతున్నందున
నిద్రలోని
మానసిక
విశ్రాంతిని
కోల్పోయి
బాధలనూ,
దుఃఖములనూ,
విషాదములనూ
అరికట్టుకోలేని
బలహీనులమైపోవుచున్నాము.
వాటి
వలన
లభించే
ఫలితమేమాత్రమూ
లేదు.
ఏ
మానవుడు
ఈ
మానసిక
సంభాషణలను
స్తంభింపచేసి,
విశ్రాంతినందుకొనగల్గునో
అట్టి
మానవుడే
పరిపూర్ణ
మానవుడు.
7
▾
Meaning
Keep
మనస్సును,
మాటను
పరిశుద్ధము
చేసుకోవడానికి
ప్రయత్నించాలి
మానసిక
సంభాషణలను
అరికట్టే
సాధనలను
ఉపనిషత్తులు
తెల్పుతూ
వచ్చాయి.
మొట్టమొదటి
సాధన
ప్రాణాయామము.
ప్రాణాయామమనగా
ఒక
కసరత్తు
కాదు;
లేక
భయంకరమైన
సాధన
కాదు.
గాలిని
పీల్చడము
పూరకము.
గాలిని
విడవడమే
రేచకము.
ఈ
రెండింటి
మధ్యలో
గాలిని
నిలబెట్టడమే
కుంభకము.
ఈ
పూరక,
రేచక,
కుంభకముల
మధ్య
మనస్సును
ఏకాగ్రత
పరచాలి.
మనస్సునందు
“ఎవరు
లోనకు
వెళ్ళుతున్నారు?
ఎవరు
బయటకు
వెళ్ళుతున్నారు?”
అని
ప్రశ్నించుకోగా,
మానసిక
సంభాషణలు
తరిగిపోతాయి.
ఈ
విధమైన
ఉచ్ఛ్వాస
నిశ్వాసముల
గమనమునందు
మనస్సును
ప్రవేశపెట్టిన,
మానసిక
బలము
చేకూరుతుంది.
8
▾
Meaning
Keep
రెండవ
సాధన,
నిర్విరామ
కర్మాచరణము.
పరోపకారముతో,
ప్రజాసేవతో
కూడిన
కర్మల
నాచరించవలెను.
పవిత్ర
కార్యములందు
మనస్సును
ప్రవేశపెట్టినప్పుడు
మానసిక
సంభాషణలు
తగ్గుటకవకాశమున్నది.
9
▾
Meaning
Keep
భారతీయులు
ప్రాచీనకాలము
నుండి
శ్రవణ,
మనన,
నిదిధ్యాసనలను,
జపతపములను,
కేవలము
ముక్తి
నిమిత్తము
నియమించలేదు.
మానసిక
సంభాషణల
నరికట్టే
నిమిత్తమని
బోధిస్తూ
వచ్చేరు.
ఆ
సంభాషణలను
అరికట్టినప్పుడే
నిర్మల
మనస్సు
చేత
మహత్తర
కార్యములను
చేపట్టి
సాధించవచ్చును.
అప్పుడే
మనము
బోధించు
విషయములందు,
గమనించే
విషయములందు
పరిశుద్ధత
ఏర్పడుతుంది.
10
▾
Meaning
Keep
ఇంక,
రెండవ
కరణము
వాక్కు.
ఇది
మహాశక్తివంతమైనది.
ఒక
మనిషికి
మనము
దుఃఖకరమైన,
ఆందోళనకరమైన
విషయాన్ని
తెలిపినప్పుడు
బలహీనుడవుతాడు.
నిలువునా
కూలిపోతాడు.
ఈ
మాట
విన్నంతనే
తన
శక్తినంతటినీ
కోల్పోతాడు.
ఒక్క
మాటయే
శక్తినంతటినీ
జుర్రుకొంటున్నది.
మంచిమాటను
కానీ,
ఆనందకరమైన
మాటను
గానీ
చెప్పినప్పుడు
ఆ
మనిషికి
ఏనుగంత
బలము
చేకూర్చుతుంది.
బలమును
చేకూర్చునది
గానీ,
నిర్వీర్యుని
గావించునది
గానీ
మాటయే.
మాటకు
ఖర్చు
లేదు.
విలువ
ఎక్కువ.
11
▾
Meaning
Keep
మాటను
మనము
అదుపులో
పెట్టుకోవాలి.
మాటలను
ఉపయోగకరమైన
కార్యములో,
పరిశుద్ధ
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు,
మహత్తరమైన
శక్తిని
చేకూర్చుకోగల్గుతాము.
పూర్వీకులు
మౌనము
ద్వారా
మాటల
ధోరణిని
అణగద్రొక్కుతూ
వచ్చారు.
మానసికముగా
భగవంతుని
అంతర్దర్శనము,
మాటలతో
బహిర్దర్శనము
కల్గించు
కొనగల్గినప్పుడు,
మన
తెలివితేటలను,
మన
ఏకాగ్రతను
పోషించుకొన్నవారమౌతాము.
కనుక,
మనస్సును,
మాటను
పరిశుద్ధము
చేసుకొనటానికి
మానవుడు
ప్రయత్నము
చేయాలి.
Previous
←
The student must be sumati, of good mind, not durmati, of bad mind
Next
Jñāna is attained only when one teaches with a pure mind
→