Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1973
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
4
Keep
కర్మ మార్గంబు విడరాని కాలిబాట
భక్తి మార్గంబు సులువైన బండిబాట
జ్ఞానమన విమానంబుపై యానమరయ
యోగమననింక జలధిపైయోడగాదె.
5
Keep
భారతావని గురుశిష్య భావముడిగె
సత్యసంపద క్రమచర్య సన్నగిల్లె
భక్తివిశ్వాసములయందు రక్తిదొలగె
బాధ్యతలు లేని స్వాతంత్య్రపరత హెచ్చె.
6
Keep
ఆటలపాటల బాల్యంబాయెను
ప్రాయములో ప్రేమాయణమాయెను
ముదిమిని చింతలు ముదిరేపోయెను
పరబ్రహ్మకాబట్టక పోయెను.
7
Keep
కానిదిదియని చెప్పంగగలరుగాని
బ్రహ్మమిదియని చెప్పంగ వశము కాదు
నిత్యసత్యమనంతంబు జ్ఞానమొకటె
అదియె బ్రహ్మంబు వాక్కునకలవి కాదు.
8
Keep
పాంచభౌతికము దుర్బలమైన కాయంబు
ఎప్పుడో విడిచేది ఎరుకలేదు
శత వర్షములదాక మితము చెప్పిరిగాని
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందో
ఊరనో అడవినో ఉదక మధ్యంబునో
ఎక్కడో విడిచేది ఎఱుక లేదు
మరణమే నిశ్చయమ్మది మానవునకు
బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడె
తన్ను తా తెలియుట ధర్మతత్వ మరయ
సత్యమైనట్టి బాట శ్రీసాయి మాట!
9
Keep
బాల్యమందున పలువురతోగూడి
ఆటపాటలందు ఐక్యుడగును
యవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కి
కామినీ లోలుడై క్రాలుచుండు
అర్థవయస్సున ఐహికంబున మున్గి
ద్రవ్యమార్జించుటన్ దవిలియుండు
ముదిమి వచ్చినయంత మురహరి తలవక
అదియిది లేదని అలమటించు
వివిధ దుర్వ్యసనంబులు వీడలేక
భక్తి మార్గంబు వెతుకునాసక్తి లేక
కర్మపంకిలమునబడి క్రాలుచుండు
మట్టి కలుపును జన్మంబు మానవుండు.
10
Keep
సత్సంగముచే సహజ విరక్తి
ఆ విరక్తిచే విగత భ్రాంతి
భ్రాంతి వీడితే శాంతి స్థిమితము
స్థిమిత శాంతిచే జీవన్ముక్తి!
11
Keep
నీలో నాలో నిజమొక విష్ణువె
ఓపికలేనీ కోపము వ్యర్థము
ఎల్లెడ సమమై ఉల్లంబుంటే
అపుడె అనుభవమగు విష్ణుత్వము.
12
Keep
ప్రాణాయామము ప్రత్యాహారము
నిత్యానిత్య వివేక విచారము
మంత్రము తోడ సమాధి నిధానము
జాగ్రత్తగ నిశ్చలముగ చేయుము.
13
Keep
ఎవతె భార్య యింకెవరో బిడ్డడు
ఎంత చిత్రమో ఈ సంసారము
ఎవరివాడవెవ్వడెటు వచ్చితివి
తత్వమొక్కటె తెలియర తమ్ముడ.
14
Keep
పోకన్నా నదు దేహము యే విధంబు పోషించి రక్షించినన్
రాకన్నానదు హాని వృద్ధులు మహారణ్యమునన్ దాగినన్.
15
Keep
అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న
నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిలబోరు గోపికల్
పొత్తములందు చిత్తరువురీతిగనుండెను కృష్ణుడు వారిలో!
16
Keep
కించిద్భగవద్గీతా పఠనము
కొంచెము గంగా తీర్థము పానము
హరిపూజన మొకపరిగావించిన
అతనిని యముడేమని తర్కించును.
17
Keep
తామరాకుపై తళతళలాడే
నీటి బోట్టు వలె నిలకడ లేనిది
బ్రతుకభిమానపు తెగులు పుట్టరా
దిగులు దుఃఖముల తెరరా లోకము.
18
Keep
ఇంద్రియంబుల మనసు నిల్పిన
అంధుడైన మోక్షమొందును
ఇంద్రియముల నిలకడలేనిది
చంద్రుడైన బసంతునొందడు.
19
Keep
జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు
రెండుకూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుంద్రు
బొమ్మలాటలాడించే సూత్రధారి కలడొకండు
మంచి చెడ్డ బొమ్మలందు ఒకటిలోనె రెండు ఉండు.
20
Keep
నీతినియమములేక తిరిగిన
ధాతకైన అ జ్ఞానముడుగదు
జ్యోతి లేనిది అంధకారము
భూతలంబున బాయదెందును
21
Keep
చెడ్డ చింత చేసిచేసి గ్రుడ్డియాటలాడియాడి
ఊడిపడే దేహానికి బూటకపు ఆటలాడి
ప్రారబ్దము తీరగనే కపట వేషాలు విడనాడి
పుణ్యపాపములతో కూడి మరణింతువు ఓ కిలాడి.
22
Keep
పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునపుడు ఏడ్చుతావు
మధ్యన ఎన్నింటికో ఏడ్చుతావు, ధర్మగ్లాని కలుగుచుండ
ఉద్ధరింప ఏడ్చినావా? నీ సత్యస్వరూపము దర్శించుటకు ఏడ్చినావా?
ఎందుకోసం ఏడ్చినావు? ఏడ్పుకోసం ఏడ్చినావా?!
23
Keep
మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట
అమ్మ కడుపులో అణగియుండుట
అంతులేని సంసారము దయతో
దాటింపుము నను దబ్బున దేవా!
24
Keep
అంధుడగువాడు ఎవ్వడు ఈ అవనియందు
విద్యలన్నియు ఉండి జ్ఞానము లేని గుడ్డివాడట.
26
Keep
కామము క్రోథము లోభము మోహము
విడువుము నేనెవ్వడననియనుకో
తమ్ముతామెరుగని దద్దమ్మలకగు
నరకము లోపల నానా బాధలు.
27
Keep
నిను కనుగొనగలమా కృష్ణా! నిను కనుగొనగలమా!
అణువుకంటె అతి సూక్ష్మరూపుడవు
ఘనముకంటె అతి ఘననీయుడవు
ఎనుబదినాలుగు లక్షల జీవముల
అనయమ్మును నెడబాయకుందువట
అణురేణు తృణకాష్టము మొదలుగ
అఖండ రూపుడవై వెలయుచుందువట
ఘనమగు దొంగలలో గజదొంగవు
నిను కనుగొనగలమా కృష్ణా!
28
Keep
నేనునీవాయెను నీవునేనాయను
నీవునేనుకూడి నిజబోధలాయె
నీవునేనుకూడి నిజబోధ సల్పితే
మానాభిమానలు మరియు లేవాయె
క్షరమునేనౌదు అక్షరమునేనౌదు
క్షరమక్షరములుకూడి శాశ్వత వెలిగితె
అమనస్కందమౌను అంతతానౌను
మాయెకులోనౌచు మాయకుతానౌచు
మాయ యిరువదిగీదు మర్మములగును
మాయ యిరువదియైదు మర్మము తెలిసితే
మాయమాయమాయ మరిబలవును
రామాసీతారామా
29
Keep
కనులకగుపడు దృశ్యంబుగాంచి మీరు
సత్యమిదియని ఎంచక సంబరమున
తెరను దాగిన సత్యంబు తెలిసికొనగ
విశ్రమింపక నాతోడ వెడలి రండు.
30
Keep
చెడ్డ పని చేసి మంచిని చెందబోరు
మంచి పని చేసి కీడును గాంచబోరు
నింబమును నాట చూత ఫలంబు గనున?
చూతమును నాటి నింబంబు పొందనగునె?
31
Keep
వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను
వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరుని
కొదువలేదు నరులకు నన్నూరుకోట్లున్నారు
నరుని రూపములెజూచితి నిజరూపము కాంచనైతి
బురగ కాయలుజూచి మామిడియని భ్రమసినట్లు
వెఱ్ఱిచెరకు చూచి చెఱకని తా నమిలినట్లు
కలికిరాళ్ళ రూపముజూచి కలకండని భ్రమసినట్లు
రూపుజూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపు.
32
Keep
ఏది ఎరిగిన సర్వంబు ఎరుక పడునొ
ఏది తెలియక సర్వంబు తెలియబడదొ
అదియె పరవిద్యయనబడు నట్టిదాని
తెలిపి బోధించు సద్గురున్ తెలియనగును.
33
Keep
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
మహనీయులను గన్న మాతృభూమి
పాశ్యాత్య వీరుల పారద్రోలించియు
స్వాతంత్య్రమును గన్న సమరభూమి
పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు
ప్రతిభ చూపించిన భరతభూమి
సంగీతసాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్యభూమి
చిత్రకళలతోడ చిత్రమైయున్నట్టి
భరతభూమియందు ప్రభవమొంది
భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ
బాధ్యతంతయు మీదె బాలులార!
34
Keep
జనన మరణ మధ్యమందు జగన్నాటక రంగమందు
కామ క్రోథ గానములు లోభమోహ గీతములు
మదమాత్సర్య ద్వేషములు వ్యామోహముల నాటకములు
నవ విధముల ప్రదర్శనలు తుదకు శాంతి పాఠములు.
35
Keep
జన్మమున నిజజనులై జన్మించివారెందరు
జన్మము తరవాత మిగుల జన్మించినవారెందరు
జన్మమెత్తి ధర్మకర్మ శూన్యులైనవారెందరు
జన్మమంత తిరిగి నరజన్మమును కనుగొనలేరు
జన్మించినవారెందరు జన్మమెత్తినవారెందరు.
36
Keep
సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
మేటి వస్తువునందున మేటియగుచు
అంతటను సర్వసాక్షియైయలరునట్టి
ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును
37
Keep
ఏది ఎరిగిన సర్వంబు ఎరుక పడునొ
ఏది తెలియక సర్వంబు ఎరుక పడదొ
అట్టి పరవిద్య నేర్పెడునతడె గురువు
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
38
Keep
వృక్షంబువై నీవు వర్థిల్లుచుండిన
వల్లికనై నేను అల్లుకొందు
పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన
తుమ్మెదనై నేను తిరుగుచుందు
అనంతమైనట్టి ఆకాశమీవైన
చిన్ని చుక్కగ నీలోన చెలగుచుందు
వర సముద్రుడే నీవైయుండిన
వాహినియై నేను ఐక్యమగుదు
మేరుపర్వత భవ్యమేదిని నీవైన
సెలయేటినై నేను చెలగుచుందు.
39
Keep
సౌఖ్యమనుభవింప జాలని లోభికి
ఎంత కలిగియున్న ఏమి ఫలము?
నీరు గతుకు కుక్కకేరెంత పారినా
ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు
40
Keep
గీతయే భగవానుని దూత గీతయే జగదేక మాత
గీత సాధకుని ఊత గీత సంసారికొక ఊత
గీతయే మంత్రాల మూట గీతయే వేదాంతపు ఊట
గీతయే ఘనరాజబాట గీతయే పుష్పాల తోట.
41
Keep
ఓ కృష్ణా! నా మొర వినుమా
ఎవరేమనినా వెతలెన్నిడినా
నీ పదములె మా గతియని
తలచే గోపికలను విడచి
మోముచూపకనె మధుర పోయెదవా
42
Keep
నీకు మిత్రులున్నారా! నీవు మిత్రునివైతివా!
మైత్రి వలన ఫలితమేమి, అనుభవించిన సుఖమేమి?
నిన్ను అతను మార్చెనా! లేక నీవు అతనిని మార్చితివా?
ఒకరినొకరు మార్చకున్న సఖ్యమన్న అర్థమేమి?
43
Keep
నరరాక్షసులు చేరి పురవీధుల తరుమ
బాధలెన్ని పడిరో బలరామ కృష్ణులు
పసికందులగు మీపై కంసభూపాలుండు
మదగజంబు వదల మనసెట్టులొప్పెనో?
కన్ననాటి మొదలు కష్టాల్ పాల్జేసి
కంటితోజూడు మా కర్మ ఫలమదేమొ!
44
Keep
పదపదమంచు కింకరులు పాశములాగెడి వేళ బంధువుల్
దబదబ బయటపెట్టుడిక లాభము లేదని చెప్పువేళ
ఆలుబిడ్డలు లబలబ యేడ్చువేళ
45
Keep
ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ బంధువుల్
గబగబ బైటపెట్టుడిక లాభము లేదనువేళ కింకరుల్ దబదబ ప్రాణపాశములు లాగెడువేళల ఆలుబిడ్డలున్ లబలబ ఏడ్చువేళ తరమా హరినామము నోట పల్కగన్!
46
Keep
మురళిగాన విలోల గోపాలబాలా
మోము చూపవదేల గోపికాలోలా?
మాతృదేవి ప్రేమ మరచితివో తండ్రీ!
మధురకే పోయితివా? మమత వీడితివా?
ఇదిగిదిగొ వత్తువని యిందాక చూచితిని
నిలువజాలను రార! నిను వీడి మనలేనురా!
47
Keep
సద్గురు చరణాబ్జములపై భక్తే
త్వరగా ముక్తిని చేర్చే మార్గము
ఇంద్రియ మానస సాంద్ర నియమమే
హృదయస్థుని చూపించును దేవుని.
48
Keep
ఎన్ని విద్యలు నేర్చిన ఏమి ఫలము
నొసటి వ్రాతను తప్పింపనెవరి తరము
చెడ్డ బుద్ధులు తన తల చేరెనేని
ఎండబారును బుద్ధులు బండబారు.
49
Keep
తప్పుగానక సర్వమొప్పుగా భావించి
శ్లాఘించుచుందురు సరస జనులు
తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా
ప్రకటించుచుందురు ప్రాజ్ఞజనులు
ఒప్పును తెలియక తప్పుగా భావించి
దూషించుచుందురు దుష్టజనులు
ఒప్పులన్నియు బలిమి తప్పులుగాజేసి
కలహించుచుందురు కలుష జనులు
వెనుకజూడ మూడిట నొక విధము కలదు
నాల్గవ స్థాయి యందున్న నరునినరయ
వీని కంటెను రాక్షసుండెవరు కలరు?
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
50
Keep
ఆ నంద బాలుడే ఆనంద బాలుడై
తనవారి గుర్తింప తరలి వచ్చె
ఆ రామచంద్రుడే ఆరామ చంద్రుడై
తన బంటులను కనుగొనగ వచ్చె
ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై
తన ఆయుధములు చేకొనగ వచ్చె
ఆ ఈశుడే బాలసాయీశుడై నేడు
తన గుంపుతోనాడుకొనగ వచ్చె
అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు
తాను జీవుల రంగస్థలాన నిలచి
ఆడు ఆనాటి ఈనాటియాటలరసి
సుంత వర్ణించి సంతసము కొంతగనుడు.
Previous
←
1972
Next
1974
→