Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1975
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
52
Keep
నవ్వుచు నవ్వుచు జీవితంబను నది దాటెడువారు
ఏడ్చిఏడ్చి తేలిమునుగుచు ఈతరాని వారినిజూచి
జాలి తలచక లోతెంతయని అడుగువారలు నరులేనా?
53
Keep
ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు
ప్రహ్లాదు పాలింప పరమపురుషు
డేగుణంబు గణించి యేతెంచెనోనాడు
కరినిగాచెడి తరి కమలనయను
డేగుణంబు గణించి యేతెంచెనోనాడు
ధ్రువకుమారుని సాక రూఢిమీర
ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు
పేదకుచేల్బ్రోవ వేదచరితు
డాగుణంబె గణించి యాయమరవంద్యు
డార్తజనులను పాలించునట్టివాడు
శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు
వెల్గె పర్తీశుడై నేడు ఫృద్వియందు.
54
Keep
ఏ దేశమేగినా నీ నామమే సుమీ
సత్యసాయీయంచు నిత్య పఠన
ఏ యార చూచినా నీ నామమే సుమీ
సత్యసాయీయంచు నిత్య జపము
ఏ నోట విన్నను నీ నామమే సుమీ
సాయిరామాయంచు నిత్య జపము
ఎచ్చోట చూచినా నీ నామమే సుమీ
సత్యసాయీయంచు నిత్య భజన
విశ్వమెల్లడ వ్యాప్తియై వెలయునట్టి
భక్త జనులకు ప్రాపుడై బరగునట్టి
భక్తినొసగి రక్షించెడు శక్తి మయుడు
పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు!
Previous
←
1974
Next
1976
→