Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 2008
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
547
Keep
చైతన్యమనియన్న క్షేత్రజ్ఞుడనియన్న
జ్ఞానమన్నను అహంకారమన్న
ఈశ్వరుడన్నను ఇల విష్ణువన్నను
బ్రహ్మమన్న ఆదిశక్తియన్న
ఆనందమదియన్న పరమపదంబన్న
ప్రకృతియనగ ఆత్మకు పలు పేర్లు.
548
Keep
కన్నుల నిచ్చిన దెందుకొ తెలుసా!
అన్నియు చూచేటందులకా? కాదు కాదు
దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకు
చెవులను యిచ్చినదెందుకొ తెలుసా!
శబ్దము వినేటందులకా? కానేకాదు
భగవానుని కీర్తన వినేటందులకు
నోటిని యిచ్చినదెందుకొ తెలుసా!
మాటలు పలికేటందులకా
ఆర్తామనుడౌ దేవదేవుని కీర్తన పాడేటందులకు.
చేతులనిచ్చిన దెందుకొ తెలుసా!
మూతికి ముద్దందించుటకా
పతితపావనుడౌ శివుని పూజలు
చేతులార చేసేటందుకురా.
పొందుగ పాదములిచ్చినదెందుకు!
సందులు గొందులు తిరుగుటకా?
అందుకు కాదు, నందివాహనుని
మందిరమ్మున తిరుగుటకు.
తెలివిని యిచ్చినదెందుకొ తెలుసా!
కలిమిని సంపాదించుటకా? కాదుకాదు
నాలుగు రోజుల నాటకమిదియని
నగ్నసత్యమును ఎఱుగుటకు.
దేహమునిచ్చినదెందుకొ తెలుసా!
దేశములన్నీ చుట్టుటకా!
పరోపకారార్థమిదం శరీరమను
పదమును ఆచరణలోనుంచుటకు.
549
Keep
చదివి వ్రాయ నేర్చినవారందరు విద్యావంతులేనా?
కాలేజి డిగ్రీని పొంద విద్యావంతుడగునా?
సుజ్ఞానము సుకృతములు లేని విద్యలు విద్యలగునా?
బ్రతుకుటకై విద్యయన్న పశు పక్షులు బ్రతుకలేదె!
Previous
←
2007
Next
More of His poems
→