శివశివ శివశివ యనరాదా జీవా చింతలెల్ల బాపుకొని మనరాదాశివసాయీశుని కనరాదా జీవా సువివేకంబును కనరాదా జీవా | |శివ | |శివమెత్తి జగమెల్ల తిరిగేవు ఓ చిత్తమా! నీకెంత సిగ్గులేదెఅవని సుఖంబుల కల్లాడెడి నీకావలికి మిగిలేది ఏది? | |శివ | |పొద్దుపోక యారివారి సుద్దులన్న మీరు సిద్దమౌదురే కడు శ్రద్ధతోడముద్దుముద్దుగాను సాయి ముచ్చటలు చెప్ప నప్పుడొద్దికనుండరె చెవులార | |శివ | |పనిమాలి సినిమాలు పలుమారు మీరు చనిచని కనినను తనివి లేదెక్షణమును దైవసన్నిధిని నిల్పగ కనులార కడు కష్టమౌగా | |శివ | |అవినీతి రోతమాటలందరితో నీవనుటకు గౌరవమయ్యెనుగానవనీతచోరుని నామము పల్కుట నాల్కా అవమానంబగునా | |శివ | |పనిలేని శునకంబువలె నీవు పరుగిడి వగరించి తిరిగేవుక్షణమును సత్సంగములో నిల్పగ సాధ్యముకాదా చరణములారా | |శివ | |ఇచ్చవచ్చు చెడ్డపనులెల్ల సేయ ఆ ఈశ్వరుండు మిమ్ము సృజియించినాడతెచ్చుకొని చేతులా తెల్వి యింకనైన మీరు చెచ్చరను హరిపూజ సేయరారె | |శివ | |పాటలు పాడిన ఫలమేమి? మంచి మాటలు నేర్చిన మహిమేమి?సూటిగ పెద్దల బాటనె పోయిన సుఖముల మూటలు దొరుకునుగా | |శివ | |సులువుగ దొరికిన సుందర సాయిని చులకన చేయగ చూతువుగాపలు బొమ్మలకే పడిపడి మ్రొక్కినభయభక్తులతో బ్రతుకుదువా | |శివ | |
In plain words
Will you not say ‘Śiva Śiva, Śiva Śiva’, O jīva? Will you not cast off all your cares and live? Will you not see the Lord Śiva Sai, O jīva? Will you not find true Viveka, O jīva? (Śiva…) Like one possessed you roam the whole world, O mind! Have you no shame at all? You who flounder after the pleasures of the earth, what is left to you on the far side? (Śiva…) For want of a way to pass the time, when it is other people's gossip, you are ready at once, and with the greatest attention; but when the tales of Sai are told most sweetly, will you not stay attentive then, O ears? (Śiva…) Going out of your way to the cinemas again and again, you go and go and see, and still you are not satisfied; to stand before God even for a moment, O eyes, is that so very hard? (Śiva…) To speak foul words of wrongdoing to everyone has become an honour for you; to speak the name of the Butter Thief, O tongue, is that a disgrace? (Śiva…) Like a dog with nothing to do, you run about panting and roam; to stay in holy company even for a moment, is it not possible, O feet? (Śiva…) To do every wicked deed that takes your fancy, did that Īśvara create you? Come to your senses even now, O hands, and come quickly to worship Hari. (Śiva…) What is the fruit of singing songs? What is the worth of learning good words? Go straight along the road of the elders, and bundles of happiness will come to you. (Śiva…) Sai the beautiful, found so easily, you set about making light of; falling again and again before many images, will you live in fear and Bhakti? (Śiva…)