Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1990
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
37
Keep
తమ్ముడా రమ్ము గంగిరెద్దు దాసుడడుగా
వెండి బిళ్ళయు మసలోడి దండె కలదు
ముక్కులందు పైడి కాడయు
పంగనామంబులు
వెంట గంగిరెద్దు
చేతి మొన కోల తన పేరు చెప్పుచుండు
ఊరు నడివీధి నాడుచు
అల శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండ్లి గావించు
ఆ వేడ్క జూచి కానుకలిచ్చి వత్తము కదలిరండు.
38
Keep
శివశివ శివశివ యనరాదా జీవా చింతలెల్ల బాపుకొని మనరాదా
శివసాయీశుని కనరాదా జీవా సువివేకంబును కనరాదా జీవా | |
శివ | |
శివమెత్తి జగమెల్ల తిరిగేవు ఓ చిత్తమా! నీకెంత సిగ్గులేదె
అవని సుఖంబుల కల్లాడెడి నీకావలికి మిగిలేది ఏది? | |
శివ | |
పొద్దుపోక యారివారి సుద్దులన్న మీరు సిద్దమౌదురే కడు శ్రద్ధతోడ
ముద్దుముద్దుగాను సాయి ముచ్చటలు చెప్ప నప్పుడొద్దికనుండరె చెవులార | |
శివ | |
పనిమాలి సినిమాలు పలుమారు మీరు చనిచని కనినను తనివి లేదె
క్షణమును దైవసన్నిధిని నిల్పగ కనులార కడు కష్టమౌగా | |
శివ | |
అవినీతి రోతమాటలందరితో నీవనుటకు గౌరవమయ్యెనుగా
నవనీతచోరుని నామము పల్కుట నాల్కా అవమానంబగునా | |
శివ | |
పనిలేని శునకంబువలె నీవు పరుగిడి వగరించి తిరిగేవు
క్షణమును సత్సంగములో నిల్పగ సాధ్యముకాదా చరణములారా | |
శివ | |
ఇచ్చవచ్చు చెడ్డపనులెల్ల సేయ ఆ ఈశ్వరుండు మిమ్ము సృజియించినాడ
తెచ్చుకొని చేతులా తెల్వి యింకనైన మీరు చెచ్చరను హరిపూజ సేయరారె | |
శివ | |
పాటలు పాడిన ఫలమేమి? మంచి మాటలు నేర్చిన మహిమేమి?
సూటిగ పెద్దల బాటనె పోయిన సుఖముల మూటలు దొరుకునుగా | |
శివ | |
సులువుగ దొరికిన సుందర సాయిని చులకన చేయగ చూతువుగా
పలు బొమ్మలకే పడిపడి మ్రొక్కినభయభక్తులతో బ్రతుకుదువా | |
శివ | |
39
Keep
ఆకాశామల గాత్రం దైవమ్
తారారవి శశి నేత్రం దైవమ్
వ్యాపక పవన … దైవమ్
పారావారా … దైవమ్.
40
Keep
అర్ధరాత్రి వేళ నేనెపుడు వెళ్ళివస్తినో చెప్పవే తల్లీ! చెప్పవే!
దేవరకు పెట్టవలెనని దేవునకు తెస్తూవుంటె
దేవుడేమో కాల్చిపోతె తెలియక నామద వేసిరి.
41
Keep
గొల్లభామలంతగూడి చల్లనమ్మబోవుచుండగ
చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు
అడుగవె తల్లి, అడుగవె...
42
Keep
అక్టోబరు యిరవయ్యి తేదీ
హంపినుండి స్కూలు కరుగుచు
బాబా కాలరు పిన్నొకటి
జారికనబడలేదు
మార్పుకలిగి వున్నాడు
ప్రాపంచిక సంబంధము క్రింద
ఇతనికెందుకు క్షేత్రదర్శనము
అదికూడా చెల్లెను హద్దు మాయ తొలగెను
ఆదినమే గృహము వీడెను
Previous
←
1989
Next
1991
→