Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1973
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
1
Keep
కోటి పన్నాగములు పన్నేరయా
రంగలింగాయంచు దొంగ మొక్కులు మొక్కి
పంగనామము ప్రజకు పెడతారయా
ఇతరులెరుగకయున్న ఈశ్వరుండెరుగడా!
తగిన ఫలమును అనుభవిస్తారయా
2
Keep
హరిగోవిందా హరిగోవిందా
హరిగోవిందా అనరా మందా
మృత్యువు దాపున మసలేటప్పుడు
ధనము చదువు కాపాడదురా.
హరిగోవిందా హరిగోవిందా
హరి గోవిందా అనరా మందా.
3
Keep
కలలో చూచిన మేడలు మిద్దెలు
కన్నులు విప్పిన లేవుకదా.
4
Keep
శత్రుడు మిత్రుడు పుత్రుడు బంధువు
అనుచు ఉపేక్షాపేక్షలు మానుము
అందరిలోనూ ఆత్మనె చూడుము
5
Keep
అన్ని రూపులు, అన్ని మతములు నిన్నె చూపును
అన్ని మూర్తులు నీదు రూపులే, అందరందున నీవెయుందువు
6
Keep
ఓయిరామా! సాయిరామా! నీవు నా అండనుండు కోదండరామా!
మంచిగానె వచ్చి ఈ సంసార వార్థి
నన్ను ముంచివేసెనయ్య ఈ మోహవార్థి
ఎంచిచూడ నీకేది మించదయ్య
దయయుంచి దరి చేర్చవయ్య ఓడవౌచు | |
ఓ | |
పాపాల పుట్టినిల్లు పావనాంగ
ఈ కోపమన్న రావణుండు కోమలాంగ
ఏపుమీర పదితలల పాపరాజు
వారి రూపు మాపి నా తాపము బాపవయ్య | |
ఓ | |
వానరములనెల్లనేలి వానివల్ల కాని
కార్యమలరజేసి బ్రోచినావె
వానికన్న నేను తీసిపోను రామా
గాన నన్నుకూడ వేగ దిద్ది కావరావె! | |
ఓ | |
7
Keep
కారుమబ్బులకు కలికాంతులలో కాంతిజ్యోతి వెలిగించండి
ఆ కాంతితోనె మీ భ్రాంతులు దాటి శాంతిప్రదేశము చేరండి | |
కారు | |
జీవడను వత్తి తీసి విషయవాసనల నీరు పిండి
భక్తిసారము నూనె వేసి
ఆత్మజ్యోతి వెలిగించి నిర్భయశాంతిప్రదేశము చేరండి | |
కారు | |
8
Keep
సత్యధర్మము శాంతిప్రేమలతోనీ నిత్యజీవనయాత్ర సాగించు
యత్నప్రయత్నముల్ మానవ ధర్మముజయాపజయములు దైవాధీనము. | |
సత్య | |
భక్తితోడ భగవంతుని తలచుచు నిత్యకర్మములు నిర్వర్తించిన
అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షము అందెనే. | |
సత్య | |
అష్టసిద్ధుల సాధనెందులకు అది వట్టి భ్రమలతొ కట్టివేయునుగా
దట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమె పట్టపగలౌ. | |
సత్య | |
హృదయభూమిని సాగుచేయండి మీ మనసు వడకగ గుణములే ఎద్దుల్
వివేకమను చెలకొలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు. | |
సత్య | |
మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమధారలె పంట విత్తులుగ
భక్తే వర్షము భావమె కలుపులు బ్రహ్మానందమె పండెడు పంట. | |
సత్య | |
ప్రకృతి ధర్మము పట్టు విడకండి కర్మయోగమె జన్మ ధర్మంబు
స్మరణే మానవ జన్మ రహస్యము సాధనే భక్తుల సారలక్షణము | |
సత్య | |
కష్టసుఖములు ఖర్మలనకండి మన ఇష్ట లోపమె కష్టమౌనండి
పట్టు విడక ఆ పాదము కొలిచిన గట్టు చేర్చుట తన పట్టేను. | |
సత్య | |
మొదటి పట్టును విడువబోకండి ఆది పట్టులోనే భక్తి పట్టండి
ఎన్ని బాధలను పొందిన భగవ చ్చింతన మాత్రము విడకండి. | |
సత్య | |
ఎదను విడడు ఎడబాయలేడు మిమ్మేలుచుండు ఏవేళలా
కరుణే అతడు అతడే కరుణని కరుణకె కాచి పొందండి. | |
సత్య | |
9
Keep
రామరామ రామసీత .... రామరామ రామసీత
శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి
ప్రేమనహల్యా శాపముదీర్చి ప్రియభక్తుల రక్షించిన శ్రీరఫు | |
రామ | |
గురువాజ్ఞను వనమందొనరించి గుహుని భక్తికానందము చెంది
పరమాదరమున భరతునిగాంచి పాదుకలొసగిన పావనచరితుడు | |
రామ | |
ఖరదూషణాది దనుజుల ద్రుంచి కరుణ జటాయువు గతి సవరించి
శరభంగాది మునీంద్రుల బ్రోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన |
రామ | |
ముందుగ హనుమంతుని దీవించి ముదమలరగ రవిసుతు పాలించి
చెంగిన కినుకతొ వాలిని ద్రుంచి చేరిన వానరవీరుల బ్రోచిన | |
రామ | |
పావని సాహస మొరలాలించి ఆ వనరాశని నీట బంధించి
మోదము మీరగ లంకనుజేరి ఆదరముగ విభీషను బ్రోచిన | |
రామ | |
రావణాది సురవైరుల ద్రుంచి రమణితోడ సాధుల పాలించి
దేవతలెల్ల నుతింపగజేసి దేవిగూడి పురిజేరిన శ్రీరఫు | |
రామ | |
నిజ సహోదరులు నిను సేవింపగ నిన్నుగూడి ప్రజలెల్ల సుఖింపగ
అజహరాది సురులెల్ల నుతింపగ ఆనందముతోనయోధ్యనేలిన | |
రామ | |
10
Keep
మోహనమురళీనూదుచునొకపరి
గానము చేయగదె బాబా గానము చేయగదె |
మోహ |
కఠిన హృదయములు పాషాణంబులు
కరగికరగి నీరై ప్రవహింపగ
మోహనమురళినూదుచునొకపరి
గానము చేయగదే కృష్ణా! గానము చేయగదె |
మోహ |
ప్రేమరహితమగు భూములలో
ప్రేమావేశముతో
ప్రేమసుధావర్షము వర్షింపగ
ప్రేమనదులు ప్రవహింపగ మురళీ
సకల మహీధర వనసంయుతమై
జలనిధి జంతువితానయుతమై
సంతోషంబలరా ప్రకృతి సతీమణి పరవశతను
నీ చెంతనె నృత్యము చేయుచు
మురళీ గానము చేయగదే కృష్ణా! గానముచేయగదే!
Next
1982
→