Verse 8

Glance

Tap any word for its meaning.

The water offering, and the leave-taking· Verses 1–8

।

।

।

।

।

।

।

।

Then those men, wishing to give water to their own who had died, went with Krsna to the Ganga, the women going before them. All of them, having offered the water and wept bitterly once more, bathed in the water of that river, made clean by the dust of Hari's lotus feet. There Madhava spoke to the Kuru lord Dhrtarastra as he sat with his younger brother, and to Gandhari stricken with grief for her sons, and to Prtha, and to Draupadi, and with the sages he comforted those whose kinsmen had been killed and who were struck with sorrow, showing them the working of time among living beings, and that there is no undoing it.

Having won back for him to whom no enemy is born his own kingdom, taken from him by cheats; having had those unworthy kings killed, whose lives were cut short by the touching of her hair; having had him perform three horse sacrifices of the highest making, he spread that cleansing fame of his through the quarters, as he had spread Indra's. Having taken his leave of the sons of Pandu, with Saineya and Uddhava, honoured in return by Dvaipayana and the other brahmanas whom he had honoured, and having made up his mind to go to Dvaraka, brahmana, mounted on his chariot, he found Uttara running towards him, beside herself with fear.

The commentators

Bhāgavata Vāhini

కుంతీ దేవి వచ్చి "మమ్ములను, మా బిడ్డలను కంటిలో పెట్టుకొని కాపాడిన నీ ప్రేమ మమ్ములను ఇంతకాలము మరచి, ఎట్లుండెను? నా కుమారులు నేడు ఈ రాజ్యమును పాలించుచున్నారన్న ఇది అంతయూ నీ ప్రసాదమే! ఆనాడు నీవే లేకున్న నేటికి నా కుమారులేమయి వుండెడివారో మరదీ! మేము అనేక ఇడుములకు గురియైతిమి కానీ అన్నింటికన్ననూ నీవు మావెంటలేని కష్టము మమ్ములను మరింత బాధ పెట్టుచుండెను. కడకు తిరిగీ నిన్ను చూతుమను ఆశయే మాలో అడుగంటి పోయెను. ఈనాడు మా అందరి ఆనందము పూర్ణరూపము ధరించెను. ఈనాడెంత సుదినము నాయనా! అదృష్టము కానీ, ఆనందము కానీ చెప్పిరాదు కదా?" అని కంటనీరు తుడుచుకొనుచున్న కుంతిచేతులు పట్టుకొని విదురుడు కూడను తన కంటినీరును తుడుచుకొనుచూ గడచిన వాటిని మననము చేసుకొనుచూ " అమ్మా! కుంతీ దేవీ! విధిని దాట నెవరితరము? ఎట్లు జరుగవలెనో అట్లు జరుగక పోదు. ఎవరు చేసిన పాపపుణ్యమువారికి కారణములుగా నిలుచును కాని, అన్యులు కారు. ప్రారబ్ధ సూత్రమున బంధింపబడిన మానవుడు స్వతంత్రుడు కాజాలడు కదా! ఆ సూత్రమెట్లు ఆడించిన అట్లు ఆడకతప్పదు. ఎక్కడికి లాగిన అక్కడికి పోకతప్పదు, మన యిష్టాయిష్టములు ఇందులో యేమియునూ చేయజాలవు. అంతయు అతని ఇచ్చకదా?" అని అనేకవిధముల వేదాంతగోష్ఠి జరుపుచుండగా ధర్మజ భీమ నకులసహదేవులు తలలు వంచుకొని అతి శ్రద్ధతో వినుచుండురు.

విధిని దాట నెవరి తరము కుంతి తిరిగీ తల నిమురుచూ "నాయనా! నీ చల్లని చూపుతో యుద్ధమును జయించితి. కాని ద్రౌపదీ పుత్రులను, సుభద్ర పుత్రుని కాపాడుకొనలేక దురదృష్టులమైతిమి. వారు నీ చూపునకు దూరమైరి. ఆ జ్వాలలే అనవరతము మా హృదయములను మండించుచున్నవి. నీవు చెప్పినటుల విధిదాట నెవరితరము? ఏదో గడచినది గడచి పోయినది. చింతించియూ ఫలములేవి వాటికై ప్రాకులాడుట వ్యర్థము. ఈ తాపములో నిన్ను చూచుట దాహము తీరినట్లయినది. మరదీ! ఇంతకాలము నీవు ఎక్కడుంటివి నాయనా!" అని కుంతీదేవి ఎంతో ఆనందమున ప్రశ్నించెను. అందులకు విదురుడు "అనేక తీర్థయాత్రలు చేయుచూ ఒకచో స్థిరములేక తిరుగుచుంటి" నని తెలిపెను. అంత పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగ పవిత్రయాత్రలను గురించి ప్రశ్నించుచూ ఆయా యాత్ర స్థానములయొక్క అనుభవములను విదురులు వినిపించుచుండ ధర్మజుడు మధ్య మధ్య మాకట్టి భాగ్యము ఎన్నడు కలుగునో అని, ఒక్కొక్క క్షేత్రము పేరు చెప్పినపుడంతయు కన్నులు మూసికొని హస్తములు జోడించి నమస్కరించుచుండెడివాడు. ఇంతలో భీముడు "బాబాయి! మీరు ద్వారకను కూడను దర్శించితిరా? అక్కడి విశేషములు తెలుప ప్రార్థింతు" ననెను. అంతలో ధర్మజుడు "అచట నందనందనుని చూచివచ్చితిరి కదా? విశేషమేమి వివరింపుము" అని ఆతురతతో అడుగగా, కుంతి దేవి "నాయనా! మన అబ్బాయి అర్జునుడు కూడను అక్కడే వుండెను. బహుశా అక్కడికి వెళ్ళియుండిన చూచియే వుందువు. యాదవులందరూ క్షేమమే కదా? వృద్ధులైన నందయశోదలు, దేవకీ వసుదేవు లెటులున్నారు?" అని ఒకరికి మించి ఒకరు ద్వారక సమాచారములగూర్చి ప్రశ్నల వర్షము కురిపించిరి. అన్నియు వినుచున్న విదురుడు దేనికినీ సమాధానము చెప్పక ఆ ప్రశ్నలను మరపించు విషయములు ముచ్చటించుచూ వెళ్ళెను.

కారణమేమన యదువంశము నాశనమైన విషయమూ మార్గమధ్యమున ఉద్ధవునివలన వినియుండెను. కనుక, ఇంతకాలమునకు అపురూపముగా చిక్కిన ఆనందములో మునిగియున్న పాండవులకు వెంటనే ఈ దుఃఖమును అందించ ఇష్టములేక తన రాకతో కలిగిన ఆనందమును తానే దుఃఖముగా మార్చురాదను ఉద్దేశ్యముతో రేపో మాపో యెట్లయినను అర్జునుడు వచ్చి తెలుపగలడు కదా? నాద్వారా ఈ వార్త తెలియకూడదని లోలోన మ్రింగి, కేవలము కృష్ణుని గుణగణములను మాత్రము వర్ణించుచూ ఆ లీలను తెలుపుచు మాటలను మార్పు చేయుచూ "అమ్మా! నా ఈ తాపసవేషముతో బంధువుల దగ్గరి కెక్కడికీ వెళ్ళ ఇష్టము లేక పోయెను. అందువలన నందయశోదలను కానీ, ఇతర యాదవ శ్రేష్ఠుల నెవ్వరినీ చూడలేదని" ఒక మాటతో ద్వారక సంభాషణలు అంతటితో నిలిపెను. "ఏదో చిన్నప్పటినుండియూ పెంచి పెద్దచేసిన పిల్లలగు పాండవులు యుద్ధమున విజయమును సాధించి రాజ్యమును పాలించుచున్నారను వార్త విని సాకిన చాపల్యముచే ఇచ్చటికి మాత్రమే వస్తినిగానీ మిగిలిన మన వారల యింద్లకెక్కడికినీ వెళ్ళ సంకల్పించలేదు. పాత అభిమానము నన్ను ఇక్కడికి ఈడ్చుకొని వచ్చినది" అని యేదేదో వేదాంతవిషయములను బోధించెను. ఈ రీతిగా మాటలను ముగించిన పిమ్మట ధర్మజుడు విదురునకై ప్రత్యేకముగా సర్వసౌకర్యములతో ఏర్పరచిన వసతి గృహమునకు దయచేయమని బాబాయిని ప్రార్థించి తోడ్కొనిపోయెను. అచట, పినతండ్రి సేవలు చేయుటకు పరివారమును నియమించి "ఇందులో తమరు కొంత విశ్రమించ" మని ధర్మజుడు ప్రార్థించగా, సర్వసదుపాయములతో నిండిన ఆ భవనమున నివసించుటకు విదురునకు ఇష్టము లేకపోయినప్పటికినీ, ధర్మజుని సంతృప్తికై కాదనలేక అందులో ప్రవేశించెను. కొంత విశ్రాంతి తీసుకొని శయ్యపై పరుండియే గడచిన కాలమును స్మరించుచూ తన అన్న అయిన ధృతరాష్ట్రుడు పన్నిన పన్నాగములకు తనవంశమే నాశనము చేసుకొనెననియూ, ఇన్ని విధముల పాండవులను బాధించిననూ

నేటికినీ ధర్మజుడు ధృతరాష్ట్రుని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుచూ గౌరవించుచూ, సర్వవిధముల వారలను సుఖపరచుచున్నాడని తెలిసికొని పాండవుల ఉదార స్వభావములకు ఆనందించి ధృతరాష్ట్రుని బుద్ధులకు అనుకొనుచు, ఈ వృద్ధునకు ఇంకనూ వైరాగ్యమురాక రాజభవనమునందు సర్వసుఖముల ననుభవించుచూ, పుణ్యమును, పురుషార్థమునూ యోచించక జీవితము వ్యర్థము చేసుకొనుచున్నాడను తీవ్ర ఆవేదన, విదురునిలో చెలరేగెను. కాలమే అందరిని మ్రింగుచున్నది ఒకవైపున యోగదృష్టితో పాండవుల ఆసన్నకాలమును చూచి, రెండింటినీ మనసున అణగత్రొక్కి, పాండవులను నాటినుండియూ కాపాడు భగవంతుడే నేడునూ చూచుకొనగలడను ధైర్యమును తెచ్చుకొని పాండవులు పోయిన తరువాత ఈ గ్రుడ్డి రాజు మరింత బాధలకు గురికావలసి వచ్చునని తనలో తాను యోచించి, ఇకనైననూ అతనిని గృహమునుండియూ బైటపడ తీర్థయాత్రలు జేయించి కాలమును సార్థకము చేయించవలెనని తలచి, నిదానము చేయక ఇప్పుడే వెళ్ళి అతనికి హితమును తెలుపవలెనని లేచి చీకటిలో ఎవరికినీ తెలుపక ధృతరాష్ట్రుని వసతి గృహమునకు నడచిపోయెను. అప్పుడే విశ్రమించుటకు సిద్ధముగా ఉన్న ధృతరాష్ట్రగాంధారులు విదురుని రాక తెలిసి యెదురుచూచుచూ, తన పాపఫలమును చెప్పుకొనుచు అనేక విధముల దుఃఖించుచుండ, విదురుడు ఓదార్చుచూ, మధ్య వేదాంతసారము నందించుచూ, అనేక విషయములతో వారలనిరువురినీ చలార్చి, చల్లని మాటలతో ఈ కరుడుకట్టిన హృదయము కరుగదనియూ మొద్దుబారిన బుద్ధి కుదరదనియూ విదురుడు తలంచి, సమయమును చూచుకొని, కఠినమాటలను కంఠస్వరమునూ మార్చ మొదలిడెను. దీని కనిపెట్టిన ధృతరాష్ట్రుడు "తమ్ముడా! నూర్గురు పుత్రులను కోల్పోయి చింతాక్రాంతుడ పరితపించుచున్న మమ్ములను చల్లని మాటలతో శాంతపరచక, పుండ్ల సూదులు గ్రుచ్చినటుల మమ్ములనిట్టి కఠినవాక్కులతో గాయ పరచుట

న్యాయమా? ఎంతో కాలమునకు చూడగల్గితిమి కదా అను ఆనందమును అనుభవించక మునుపే మమ్ముల మరింత ఆశాంతిలో త్రోయుట నీకు ధర్మమా?" "అయ్యో! మా విధి వ్రాత యిట్లుండ యెవరినని ఏమి ప్రయోజనము. అని నెత్తిని చేతులు పెట్టుకొని చింతించుచుండ, వైరాగ్యమునకు ఇది చక్కని సమయమని విదురుడు తలంచి, ఎటులయిననూ వీరిని క్షేత్రయాత్రల కంపెవలెనను సదుద్దేశములతో, వారల హృదయములు మార్పితలంచి మరింత కఠినమాటలను మొదలుపెట్టెను. ధృతరాష్ట్రగాంధారుల దుఃఖము ఒకవైపున అయ్యో, అనిపించుచున్ననూ, మరొక వైపు రాబోవు కఠినకాలమును స్మరించుచూ, వీరి నెటులయిననూ ధన్యులు గావించవలెనని తలంచి "రాజా! ఇంకను భోగవాంఛ తీరలేదా? చచ్చుదాకా సంసారకూపమున మునిగి తేలిన వచ్చు లాభమేమి? కాలమను సర్పము, కబళించను దేహమను పొదలో పొంచియుండగా, నీవు కన్నులు మూసుకొని కాలమును మ్రింగ తలంచుచున్నావు. కాలమును మ్రింగినవారు ఈ లోకమున ఎవ్వరూ లేరు. కాలమే అందరిని మ్రింగుచున్నది. అది తెలుసుకొనలేక అజ్ఞానమున మునిగి అర్థకామములతో అలమటించుచున్నావు. పశుజీవితమును గడుపుచున్నావు. మానవ జీవితమును వ్యర్థము చేయుచున్నావు. సార్థకము చేసికొనుటకు ప్రయత్నించు కాలము మించలేదు. ఇకనైననూ ఇల్లు విడిచి, ఇహమును మరచి, పరమును స్మరించు, తరించు. పరుల పంచలపడి ప్రాణమును విడువక పరమాత్మ చింతనతో కారడవుల ప్రాణమును విడుచుట పరమ పవిత్రము. గృహమును వీడి తపమునకు వెళ్ళుము".

In plain words

6. Reflections on Vairāgya Kuntī Devī came and said: "Your Prema, which kept us and our children in your eyes and protected us — how could it forget us all this time and stay away? That my sons are ruling this kingdom today — all of this is your grace alone! Had you not been there back then, who knows what would have become of my sons by now, O brother-in-law! We were subjected to many hardships, but more than all of them, the pain of your not being with us kept hurting us still more. In the end, even the hope of seeing you again had sunk to the bottom in us. Today the joy of all of us has taken on its full form. What an auspicious day today is, my dear! Neither the good fortune nor the joy of it can be put into words, can it?" As she wiped away her tears, Vidura, holding Kuntī's hands and wiping his own tears too, recalling all that had passed, said: "Mother! Kuntī Devī! Who has the power to overstep destiny? However a thing is to happen, so it cannot fail to happen. Whatever sin and merit each person has done — that alone stands as the cause of what befalls him; others are not the cause. A human being bound by the string of prārabdha surely cannot be his own master! However that string makes him dance, so he must dance. Wherever it pulls him, there he must go; our likes and dislikes can do nothing at all in this. All is His will, is it not?" As he carried on a Vedāntic discourse in this way, in many forms, Dharmaja, Bhīma, Nakula and Sahadeva listened with bowed heads and with the utmost attention.

Who Has the Power to Overstep Destiny? Kuntī, again stroking his head, said: "My child! By your cool glance you won the war. But we were unfortunate enough not to be able to protect Draupadī's sons and Subhadrā's son. They passed beyond your sight. Those very flames still burn our hearts without end. As you yourself have said, who has the power to overstep destiny? Whatever has happened has happened and is over. Grieving over it now brings no benefit, and it is futile to keep straining after what is gone. In this anguish, seeing you has been like having one's thirst quenched at last. Brother-in-law! Where in the world have you been all this time, my child!" So Kuntī Devī asked, overflowing with joy. In answer, Vidura said, "I have been wandering, making many pilgrimages, never staying steadily in one place." Then, as the Pāṇḍavas each questioned him in their own way about their sacred pilgrimages, and Vidura related his experiences of those pilgrimage sites, Dharmaja, again and again, wondering when such good fortune would be his own, would close his eyes and join his palms in salutation every single time a holy place's name was spoken. Just then Bhīma said, "Uncle! Did you also visit Dvārakā? Do tell us the news from there." Then Dharmaja asked eagerly, "Did you go there and see Nandanandana? Please tell us everything," and Kuntī Devī said, "My child! Our boy Arjuna, too, was right there. You must surely have gone and seen him as well. Are all the Yādavas well? How are the aged Nanda and Yaśodā, and Devakī and Vasudeva?" — one after another outdoing the last, they showered him with a rain of questions about news of Dvārakā. Vidura, hearing all this, without answering any of them, went off talking of matters that would make them forget their questions.

The reason was this: he had already heard from Uddhava, on the way, of the destruction of the Yadu dynasty. So, not wishing at once to deliver this sorrow to the Pāṇḍavas, immersed as they were in a joy so precious and so long in coming, and intending that he himself must not turn into sorrow the joy his own arrival had brought — "Tomorrow or tonight, one way or another, Arjuna will come and can tell it, surely? This news must not become known through me" — he swallowed it down deep within himself, and describing only Kṛṣṇa's many virtues and recounting His līlā, he kept changing the subject: "Mother! In this ascetic's garb of mine I did not wish to go anywhere near my kinsfolk. So I have not seen Nanda and Yaśodā, nor any of the other eminent Yādavas" — and with that one remark he brought the talk about Dvārakā to a stop there. "It was just that, hearing the news that the Pāṇḍavas — children I reared and brought up from childhood — had won victory in the war and are ruling the kingdom, I came here alone, out of the fond eagerness of one who raised them; but I did not intend to go to the homes of any of the rest of our people. Old affection has dragged me here," he said, and went on to expound various Vedāntic matters. When the talk had concluded in this way, Dharmaja entreated his uncle to kindly come to the guest house specially prepared for Vidura with every comfort, and escorted him there. There Dharmaja appointed attendants to serve his uncle and entreated him, "May you rest a little in here." Although Vidura had no wish to live in that mansion filled with every amenity, he was unable to refuse, for Dharmaja's satisfaction, and entered it. Having taken a little rest and lying on the bed, as he recalled the past — that his elder brother Dhṛtarāṣṭra, through the very schemes he had devised, had brought destruction upon his own line; and that, although he had tormented the Pāṇḍavas in so many ways,

even today Dharmaja was worshipping and honouring Dhṛtarāṣṭra with great Bhakti and śraddhā and keeping them in comfort in every way — learning this, he rejoiced at the generous nature of the Pāṇḍavas; and as he reflected on Dhṛtarāṣṭra's cast of mind, an intense anguish surged up in Vidura: this old man, with Vairāgya still not come to him, enjoying every pleasure in the royal palace and giving no thought to merit or to the puruṣārtha, is laying his life to waste. Time Itself Is Swallowing Everyone On the one hand, seeing with yogic sight the approaching hour of the Pāṇḍavas, he suppressed both feelings in his mind, and summoned the courage of the conviction that the Lord Himself, who had protected the Pāṇḍavas from that day on, would be able to look after them today as well. Reflecting within himself that after the Pāṇḍavas were gone this blind king would have to undergo still greater sufferings, he resolved that at least now he must get him out of the household, make him undertake pilgrimages, and help him turn his remaining time to fruitful account; and, without delay, meaning to go right now and tell him what was for his true good, he rose and, in the dark and telling no one, walked to Dhṛtarāṣṭra's residence. Dhṛtarāṣṭra and Gāndhārī, who were just getting ready to retire, learned of Vidura's coming and awaited him, recounting the fruit of their own sin and grieving in many ways. Vidura consoled them, offering in between the essence of Vedānta, and calmed the two of them with many things. Then, thinking that by gentle words this hardened heart would not melt nor the dulled Buddhi be set right, he watched for his moment and began to use harsh words and to change his tone of voice. Noticing this, Dhṛtarāṣṭra said: "Brother! We have lost a hundred sons and, overcome with grief, are in anguish. Instead of calming us with gentle words, to wound us with such harsh words, as if thrusting needles into sores —

is that just? We have at last been able to see you after so very long — and even before we could taste that joy, to push us into still deeper unrest: is that Dharma for you?" "Alas! When this is what fate has written for us, whom can we blame, and what use is there?" So saying, they placed their hands on their heads and grieved. Vidura thought, "This is the fitting moment for Vairāgya," and, with the good intention that by any means he must send these two on pilgrimages to holy places, meaning to change their hearts, he began to use still harsher words. On the one hand the grief of Dhṛtarāṣṭra and Gāndhārī made him feel "Alas!"; on the other, foreseeing the harsh time to come, he resolved that by any means he must make these two blessed, and said: "O King! Is your craving for enjoyment still not quenched? Sinking and surfacing in the well of saṃsāra until death — what gain is there in it? While the serpent called Time lies in wait, ready to devour, in the thicket called the body, you close your eyes and think you will swallow Time. No one in this world has ever swallowed Time. Time itself is swallowing everyone. Unable to realise that, sunk in ajñāna, you are languishing over artha and kāma. You are leading the life of a beast. You are laying human life to waste. Strive to make it fruitful — the time has not yet run out. At least now, leave home, forget this world, remember the Supreme, and cross over. Rather than giving up your life lying at others' doorsteps, to give up one's life in the deep forest in contemplation of the Paramātma is supremely holy. Leave the household and go for tapas."