Verse 4
How the king met his end· Verses 1–4
।
।
।
।
1He it was who was scorched by the weapon of Drona's son and yet did not die in his mother's womb, by the grace of the Bhagavan, Krsna of wonderful deeds; 2and who, when his life was to be undone by Taksaka, raised against him by a brahmana's anger, was not thrown into confusion by that great fear, having laid his heart in the Bhagavan; 3and who, letting go his clinging on every side, having come to know how the Unconquered stands, gave up his own body on the Ganga, a pupil of the son of Vyasa. 4For those who take up the talk of him whose renown is highest, who taste the nectar of his story and remember his lotus feet, there is no confusion even at the last hour.
The commentators
Bhāgavata Vāhini· Parīkṣit, Struck by a Curse
24. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు పాండవుల భక్తి శ్రద్ధలను, శ్రీకృష్ణుని అనుగ్రహ శక్తులను వ్యాసుల ద్వారా శ్రవణము చేయు పరీక్షిత్తునకు రాత్రి, పగలు అనే భేదము తెలియక, ఆనందమున మునిగి తేలుచుండ, ఇంతలో కిలకిల పక్షుల గానము కొక్కొరొకో యని కోడి కూతలూ వినిపించెను. సుప్రభాతము వినిపించె, దేవాలయము లందలి గంటలు మ్రోగదొడగెను. పరీక్షిత్తు నైరాశ్యముతో వేటకేగుట 'సరి! తెల్లవారినద'ని తలంచి, వ్యాసులవారు 'నాయనా! నేనిక వెళ్ళి వత్తునని' పరీక్షిత్తును ఆశీర్వదించి, కమండలము చేతబట్టి వెడలెను. వెడలుచున్న వ్యాసుల వారిని చూచి, పరీక్షితునకు అర్థము కాని ఆవేదన బయలుదేరెను. అయ్యో! అప్పుడే తెల్లవారెనా! మా తాతల మహత్తరమైన భక్తి శక్తులను పూర్తిగా విననైతిని కదా! అని నిరాశతో, విన్న విషయములను మననము చేయుచూ, ఏమి చేయుటకు తోచక, కాలకృత్యములు తీర్చుకొని, రాజ్యపరిపాలన విషయమున మనసు యే మాత్రమూ వెడలకుండుటచే, ఇంటియందుండిన యేవో కొన్ని పరిపాలనా విషయములు తలకు ప్రాకుచుండునని తలంచి, యేకాంతముగా నుండగోరి, షికారార్థము అడవికి వెళ్ళ నిశ్చయించి, తమ పరివారమునకు కబురంపెను. ఇంతలో సర్వము సిద్ధము గావించబడినదని ద్వారపాలకుడు తెలుప, భారమైన మనసుతో ఉత్సాహములేని ఊహలతో, కాయమును కదిలించి కడకు రథమును చేరెను.
సరి! పరివారము యథారీతిగా ముందు, వెనుక వేటకు తగిన ఆయుధములను ధరించి నడువజొచ్చిరి. ఇంతలో రాజునకు ఏమి తోచినదో ఏమో! ఇంతమంది పరివారము రానక్కరలేదు, అని కొంతమందిని వెనుకకు పోవ ఆజ్ఞాపించెను. ఏ కొంతమందినో వెంటపెట్టుకొని అడవిలో ప్రవేశించెను. ఇంతలో కొన్ని అడవి మృగములు గుంపులు, గుంపులు ఎదురేతెంచెను. వాటిని చూడగనే రాజునకు ఒక విధమైన ఉత్సాహము చెలరేగే, రథమును దిగి, అంబును ధరించి కాలినడకన వాటిని వేటాడుటకు పూనుకొనెను. యింతలో ఆ అడవి మృగములు చెల్లాచెదరై పోయెను. ఉన్న కొంతమంది సిపాయిలూ వాటిని తరుముతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము పట్టిరి. మహారాజు కొన్ని మృగములను వేటాడి తానొక మార్గమున పట్టిరి. మహారాజు కొన్ని మృగములను వెంటాడుచూ తనొక మార్గమున వెళ్ళెను. అడవిలో ఒకరి కొకరు వీడిపోవుటచే సంబంధము లేక నీటికై వెతుక జొచ్చెను. కడ కెటులనో ఒక పర్ణశాల కనుపించ, అక్కడికి కొండంత ఆశతో పరుగులిడెను. అక్కడ వెళ్ళి చూడ, యెవ్వరునూ మనుష్యులు కనుపించలేదు. రాజు వెలుపలనుండి యెన్నియో విధముల కేకలు వేసి పిలిచెను. ఎవ్వరునూ జవాబివ్వలేదు. ఉక్రోషంతో పరీక్షిత్తు బుషిపై మృతసర్పాన్ని వేయుట కడకు లోనికి మెల్లగ బయలుదేరి, 'దాహము, దాహము' అని అడిగెను. అందున ఎవ్వరూ పలకరించువారు లేకపోయిరి. ఒకమూల ఒక ముని తపస్సు చేయుచుండినటుల కనిపించెను. అతని దగ్గరికి వెళ్ళి, 'స్వామీ! స్వామీ!' అని పిలువ, అతను తీవ్రధ్యానమందుండుటచే ఏ మాత్రమూ కదలక మెదలక వుండెను. ఇది చూచిన, రాజునకు ఒక విధమైన ఆవేదన, ఆవేశము బయలుదేరెను. ఆకలి బాధతో విలపించుచూ, ముని ఆశ్రమమును చేరియూ పలకరించువారు లేకపోయిరి కదా! నేను చక్రవర్తినను భావము కూడనూ మరచి ఈ బుషులు ఇట్లు పలకరించక పోయిరి కదా! అని అజ్ఞానము ఆవేశించుటచే క్రోధముచే
వెనుకకు తిరిగి వచ్చుచుండ, తన కాలికి ఏదియో ఒక త్రాడువలె సోకెను. అది యెత్తి చూడ మృత సర్పమని తెలిసికొని, విపరీత బుద్ధిపుట్టి తపమున నిమగ్నుడైన ముని కంఠమున విసిరి, వచ్చిన దారిని బయలు దేరెను. వెలుపల రాగానే, కొందరు బుషి కుమారులు చూచి, లోన ఏమి జరిగినదో అని వెళ్ళి చూడగ, తపస్సాచరించుచున్న శమీకమహర్షి కంఠమున సర్పము కనిపించెను. ఏమి విచిత్రమని, శాంతముగా పరికించగా, అది మృత సర్పమని తెలుసుకొని, ఇది ఎవరి వలన జరిగినదని ఆలోచించుచూ, బహుశా ఇపుడు వెళ్ళిన వ్యక్తి పనియే అయివుండవచ్చునని తలంచి, బాలురు పరుగిడి పోయి శమీకమహర్షి కుమారుడైన శృంగి ఆడుకొనుచుండ, అతనితో ఈ వార్త తెలిపిరి. బుషి కుమారుడు పరీక్షితుని శపించుట పాపము! ఆ శృంగి ఇది ఒట్టి అసత్యము అనియూ, తన తండ్రికి ఇట్టి అవమానము ఎపుడునూ చేకూరదనియూ, ఇది కేవలము ఆటలకై ఆడుమాటలనియూ, లక్ష్యము చేయక, ఆటలలో నిమగ్నుడై యుండెను. తోడి పిల్లలు పదేపదే తెలుపుచూ, అసత్యము కాదనియూ, మేము సత్యమునే వచించుచున్నామనియూ, ఒక పరి వచ్చి చూచిన నీకే తెలియుననియూ చాలా ఆతురతగా తెలుపుచుండిన ఆ పలుకులు శృంగికి కొంత కలత కలిగించగా, పరుగిడి వచ్చి చూడగా, బుషి కుమారులు చెప్పిన వాక్యములు యథార్థములని తెలిసికొని, తన తండ్రి కింతటి అగౌరవము చేసిన వారెవ్వరని అనేక విధముల విచారించగ, ఎవరో ఒక రాజ వేషధారి ఆశ్రమమునకు వచ్చి వెడలు చుండెననియూ, బహుశా అతనే ఈ పని చేసియుండుననియూ, కొందరు బుషి కుమారులు తెలుప, పరుగిడి అన్ని మార్గములూ పరికించి చూచి, కొంత దూరములో తడబడుచూ నడచు చుండిన ఒక రాజరూపధారిని చూచి, క్రోధావేశముతో తన తండ్రి కింతటి అవమానము గావించెనని భరించలేక, జలము తీసి, ఆ వెడలు వ్యక్తివైపునకు చల్లుచు "మా తండ్రి కంఠమున
మృతసర్పమును వేసిన వ్యక్తి యేడు దినములలో సర్పము కాటుచే ప్రాణములు వీడును గాక" అని శపించెను. చుట్టునున్న పిల్లలు ఎంత వారించిననూ వినక యిట్టి కఠిన శాపమునిచ్చి, ఆశ్రమమున ఒక మూల కూర్చొని తండ్రికి జరిగిన పరాభవమును స్మరించుచూ, 'కుమారుడనగు నేను ప్రాణముతో నుండగనే తండ్రికింతటి అవమానము జరుగుట, ఛీ! నా జన్మమేమి ప్రయోజనము! తండ్రి గౌరవమును కాపాడలేని పుత్రుడుండియూ లేనటులనే', అని తనను తాను నిందించుకొంటూ విలపించుచూ వుండెను. క్రుంగి పొంగకుండుటే ఆత్మతత్త్వం తోటి బుషి కుమారులు ఎంతెంతనో బోధించుచూ, శాంతపరచుచూ, వేసిన వ్యక్తిని వారు కూడనూ దూషించుచూ, ఒకరికొకరు సమాధానములు తెలుపుకొనుచుండగనే, శమీక మహర్షి తన దీక్షనుండి జాగ్రత ప్రపంచమునకు వచ్చెను, కదలెను, కన్నులు తెరచెను. కంఠమందున్న మృతసర్పమును తీసి ప్రక్కకు వేసెను. చెంతనే ఒకమూల దుఃఖించుచున్న పిల్లలను చూచి దగ్గరకు పిలిచి, దుఃఖమునకు కారణమేమని అడుగగా జరిగిన వృత్తాంత మంతయూ తెలుపగా, శమీక మహర్షి చిరునవ్వు నవ్వి 'పాపము! ఎవరో తెలియక చేసిన ఈ చిన్న కార్యమునకే మీరింత దుఃఖించుట అజ్ఞానము. నాకు గౌరవ ప్రతిష్టలతో పనిలేదు. ఇట్టి మానాభిమానములకు క్రుంగి పొంగకుండుటే ఆత్మ తత్త్వము యొక్క సత్యము. ఎవరో అమాయకులు ఈ కార్యము చేసి యుందురు. మీరు బాలురగుటచే, ఈ చిన్నదానిని పెద్దదిగ చేసి కొండంత బాధను అనుభవించుచున్నారు. లెండు! ఆడుకొనుడు!' అని కుమారుడైన శృంగిని దగ్గర పిలిచి తొడపై కూర్చున బెట్టుకొని తల నిమురుచుండ, రోదించుచూ శృంగి 'నాన్నా! అమాయకులు చేసినపని కాదిది. రాజ వేషధారియైన ఒక వ్యక్తి మదాంధుడై గావించిన పరమ పాపము' అని కఠినోక్తు లాడుచుండెను.
శమీక ముని 'యేమేమీ! రాజవేషధారియా! మీరు చూచితిరా? రాజులిట్టి అల్ప కార్యముల కొడిగట్టరే?" అనుచుండగనే తోడి బాలురు 'గురువర్యా! మేము చూచితిమి. అతడు నిజముగా రాజువలె నుండెను. అతనిని చూచి మేము పరుగిడి పోయి శృంగిని తీసుకొని వచ్చితిమి. శృంగి మీ కంఠమందు గల మృత సర్పమును చూచి దిగ్భ్రాంతి చెంది, ఎంత నివారించిననూ వినక, గంగా జలమును మంత్రించి, ఆ వెడలు వ్యక్తి వైపునకు చల్లుచూ, "నేటికి ఏడవ దినమున, సర్పమును వేసిన వ్యక్తి సర్పకాటుతో మరణించుగాక! అని శపించెను' అని బాలురు తెలిపిరి. శమీకమహర్షి కుమారుని మందలింపు - శాంతం బుషి స్వభావం శమీక మహర్షి ఆశ్చర్య చకితుడై తొడపైనున్న కుమారుని ప్రక్కకు నెట్టి 'ఏమీ! శపించితివా? అయ్యో! గోరంత తప్పుకు కొండంత శాపము నిచ్చుట బుషి కుమారునకు తీరని లోటుకదా? ఇంత మాత్రపు తప్పును సహించలేని బలహీనుడు బుషి కుమారుడన్న తోటి బుషి కుమార లోకమునకే అవమానము కదా! ఇట్టివాడు నా కుమారుడని చెప్పుకొనుటకు నాకే సిగ్గు చేటుగ నందునే, అయ్యో! బాలురబుద్ధి గడ్డి తిని, ముని జాతికి తీరని అపకీర్తి తెప్పించెనే, ఛీ! ఛీ! నీ ముఖము చూడకూడదు, ప్రజలను శిక్షించే అధికారము రాజుది కానీ మునులది కాదు. ప్రజలను శపించు ముని, మునికాదు. సర్వలోక రక్షకుడైన సర్వేశ్వరుని సాన్నిధ్యమును చెందగోరి పొందగోరి సర్వసంగ పరిత్యాగులై, కాననమున బడి, కంద మూలాదులను భక్షించి, కాయసుఖముల విసర్జించి కాలమును గడుపుచున్న మునులకు ఇట్టి కఠిన భావములు కలుగుట కలికాల ప్రవేశము కాబోలు! అయ్యో! యెంతటి పాపమునకు ఒడిగట్టుకొంటివి!' అని విచారముతో కుమారుని మందలించెను.
In plain words
24. Parīkṣit, Struck by a Curse As Parīkṣit listened, through Vyāsa, to the Bhakti and śraddhā of the Pāṇḍavas, and to the powers of Śrī Kṛṣṇa's grace, he lost all sense of the difference between night and day, sinking and rising in bliss; and just then the twittering song of birds and the cocks' crowing — 'kokkoroko!' — were heard. The Suprabhātam was heard, and the bells in the temples began to ring. Parīkṣit Goes Hunting in Dejection Thinking, 'Well! It has dawned,' the revered Vyāsa blessed Parīkṣit, saying, 'My child! I will take my leave now,' took his kamaṇḍalu in hand and departed. Watching the revered Vyāsa depart, an anguish he could not understand arose in Parīkṣit. 'Alas! Has it dawned already? The mighty Bhakti and powers of my grandfathers — I could not hear of them to the full!' So he thought in dejection. Turning over in his mind the things he had heard, and not knowing what to do, he finished his morning routine; and since his mind would not turn in the least to the business of governing the kingdom, and thinking that if he stayed at home some administrative matters or other would keep creeping into his head, he wished to be alone, resolved to go to the forest to hunt, and sent word to his retinue. Presently, when the doorkeeper reported that everything had been made ready, with a heavy heart and thoughts without zest, he dragged his body along and at last reached the chariot.
Very well! The retinue, in the customary way, set out on the march in front of and behind [the king], bearing weapons fit for the hunt. Then — who knows what came over the king! — saying, 'There is no need for so large a retinue to come,' he ordered some of them to go back. Taking along only a handful, he entered the forest. Presently some wild beasts came toward them, herd upon herd. The moment he saw them, a certain eagerness surged up in the king; he got down from the chariot, took up his arrows, and set about hunting them on foot. Meanwhile those wild beasts scattered in all directions. The few soldiers who were there chased after them, each taking a different path. The Mahārāja, having hunted some of the beasts, himself took a path of his own. The Mahārāja, pursuing some of the beasts, went off along a path of his own. Separated from one another in the forest and with no contact [with the others], he began to search for water. At last, somehow, a leaf-hut came into view, and he ran to it with hope as high as a mountain. When they went there and looked, no people at all were to be seen. The king called out from outside, shouting in many ways. No one answered. In Indignation, Parīkṣit Throws a Dead Snake upon the Ṛṣi At last, going slowly inside, he asked, 'Thirst! Thirst!' Inside, there was no one to speak to him. In a corner a muni appeared to be engaged in tapas. Going up to him, he called, 'Svāmī! Svāmī!' — but the muni, being deep in intense dhyāna, remained without moving or stirring in the least. Seeing this, a kind of anguish and agitation arose in the king. 'Here I am, lamenting in the pain of hunger, and though I have reached a muni's āśrama there is no one to speak to me! These ṛṣis, forgetting even that I am the emperor, have not so much as addressed me!' So thinking, as ajñāna took hold of him, out of anger
he was turning back to leave, when something like a rope brushed against his foot. Lifting it up and looking, he realised it was a dead snake; and, a perverse turn of Buddhi arising in him, he flung it around the neck of the muni, who was immersed in tapas, and set off back along the way he had come. As soon as he came outside, some sons of ṛṣis saw him, and, wondering what had happened inside, went in and looked: a snake was visible on the neck of Śamīka Maharṣi, who was practising tapas. 'How strange!' they thought; looking closely and calmly, they found it was a dead snake. Pondering by whom this had been done, and thinking that it was perhaps the doing of the man who had just left, the boys ran off to Śṛṅgi, the son of Śamīka Maharṣi, who was at play, and told him this news. The Ṛṣi's Son Curses Parīkṣit Poor boy! That Śṛṅgi, [thinking] that this was a sheer lie, that such an insult could never befall his father, and that this was merely talk made up for a game, paid no heed and remained absorbed in his play. His companions kept telling him, again and again, that it was no lie, that they were speaking nothing but the truth, that if he came and looked just once he would see for himself; and those words, spoken so very urgently, caused Śṛṅgi some disquiet. He came running and looked, and found that what the ṛṣis' sons had said was true. When he inquired in many ways who it was that had shown his father such disrespect, some of the ṛṣis' sons told him that someone dressed as a king had come to the āśrama and was leaving, and that perhaps he was the one who had done this deed. Running, he searched every path, and, seeing some distance off a man in a king's form walking with faltering steps, he could not bear, in his surge of anger, that this man had done his father such an insult; he took water and, sprinkling it toward the departing figure, [said:] "The one who on my father's neck
threw a dead snake — may that person, within seven days, give up his life by a snake's bite!" — so he cursed. However much the children around him tried to stop him, he would not listen. Having given so harsh a curse, he sat down in a corner of the āśrama, and, dwelling on the humiliation done to his father, he went on reproaching himself and lamenting: 'That while I, his son, am still alive, so great an insult should befall my father — fie! What is the use of my birth? A son who cannot protect his father's honour is as good as no son at all, though he lives!' Neither to Sink nor to Swell — That Is the Ātma-tattva Even as his fellow ṛṣi-boys were counselling him in every way and calming him, and they too were reviling the man who had thrown [the snake], and offering explanations to one another, Śamīka Maharṣi came out of his dīkṣā into the waking world; he stirred, and opened his eyes. He took the dead snake that lay on his neck and put it aside. Seeing the children grieving in a corner close by, he called them near and asked the reason for their grief; and when they told him the whole story of what had happened, Śamīka Maharṣi smiled gently and said, 'Poor children! That you should grieve so much over this small act, which someone did unknowingly, is ajñāna. I have nothing to do with honour and prestige. Neither to sink nor to swell over such honour and dishonour — that is the truth of the Ātma-tattva. Some innocent folk must have done this deed. Because you are boys, you have made this small thing into a big one and are suffering a mountain of distress. Up with you! Go and play!' So saying, he called his son Śṛṅgi near, seated him on his lap and stroked his head; and Śṛṅgi, weeping, kept uttering harsh words: 'Father! This was not the doing of innocent folk. It is the gravest sin, committed by a man dressed as a king, blind with arrogance.'
The muni Śamīka [exclaimed], 'What? What! A man dressed as a king? Did you see him? Would kings stoop to such petty deeds?" Even as he was saying this, the other boys said, 'Revered Guru! We saw him. He truly looked like a king. When we saw him we ran off and brought Śṛṅgi. Śṛṅgi saw the dead snake on your neck and was stunned; however much we tried to stop him he would not listen. He charged Gaṅgā water with a mantra and, sprinkling it toward the departing figure, cursed: "On the seventh day from today, may the person who threw the snake die of snakebite!"' — so the boys reported. Śamīka Maharṣi's Rebuke of His Son — Śānti Is the Svabhāva of a Ṛṣi Śamīka Maharṣi, struck with astonishment, pushed aside his son, who was on his lap, and said, 'What! You cursed him? Alas! To give a mountain-sized curse for a nail-sized fault — is that not an irreparable failing in a ṛṣi's son? That a weakling who cannot bear even so small a fault should be called a ṛṣi's son — is that not an insult to the whole world of fellow ṛṣi-sons! To say that such a one is my son would be a disgrace to me myself! Alas! Your boyish Buddhi has gone and eaten grass, and brought irreparable ill-fame upon the whole race of munis! Fie! Fie! Your face is not fit to be looked upon. The authority to punish the people belongs to the king, not to munis. A muni who curses people is no muni. For munis — who, longing to reach and to attain the presence of Sarveśvara, the Protector of all the worlds, have renounced all attachment, taken to the forest, live on tubers, roots and the like, and have cast off bodily comforts as they pass their days — for such munis to have such harsh feelings arise must be the Kali age making its entry! Alas! What a great sin you have taken upon yourself!' So, in sorrow, he rebuked his son.
Bhāgavata Vāhini· The Compassionate Śamīka Muni
దయామయుడైన శమీక మహాముని నిర్దాక్షిణ్యముగా మాటాడుచున్న తండ్రి మాటలు కుమారుడైన శృంగి హృదయమునకు కత్తిపోటువలె, సుత్తి వేటువలె తగులుటచే దుఃఖము భరించుకొనలేక, తండ్రి పాదములపైబడి 'తండ్రీ, క్షమించుము. రాజే ఇంతటి అవిశ్వాస అవినయముగా ప్రవర్తించుట నా కెంతయో విచారము కలిగి కుపితుడనైతిని. మీకు చేసిన పరాభవమును సహింపలేకపోతిని. బుషి ఆశ్రమమునకు వచ్చి ఇట్లు అనుచిత వ్యవహారమును గావించుట ప్రభువుకు న్యాయము కాదు కదా! అని రోదించుచుండెను. శమీక మహాముని పుత్రుని చేరదీసి, "బిడ్డా! కాలము బలవత్తరమైనది. మానవునకు వివేకము నశించు పరిస్థితి అపుడపుడు ఏర్పడుచుండును. వినాశకాలము విపరీత రూపమును ధరించి కాలముచే ఈరీతిగా చేయించుచుండును. రాజు మహా భక్తుడు, తేజస్వి, ధర్మాత్ముడు, సమస్త భూమండలములకు చక్రవర్తి. అతని కీర్తి త్రిభువనములకు వ్యాప్తమై అతడు యెల్లప్పుడూ వేలకొలది దాసదాసీలతో సేవించబడు చుండెడివాడు. అతను భవనమును వదలి వెలుపల వెళ్ళిన, చుట్టూ అనేక రక్షక భటులు అతని ఆజ్ఞలకై చేతులు కట్టుకొని, దృష్టిని మరల్చక వెంట పాదచారులై తిరుగు చుండెడివారు. అతను ఏరాజ్యమున ప్రవేశించిననూ ఆయా దేశపు రాజులు అతనికి స్వాగతములిచ్చి, అతనిని అనేక రీతుల గౌరవించి భృత్యులై కొలిచెడివారు.
తాపసులకు కోపము తగదు ఇట్టి భోగములతో అలవాటు పడిన మహారాజునకు ఇక్కడ యెట్టి స్వాగతమూ, గౌరవమూ జరుగకుండుటే గాక, చారెడు నీరునైననూ ఇచ్చి తాపము చల్లార్చలేక పోయిన పరిస్థితి ఏర్పడుటచే ఆకలి బాధ, ఒకవైపునా, పిలిచిననూ ఎవరూ పలుకక అతను ఆశించిన గౌరవము అందుకోలేక పోవుట, నిరాశ, తాపములు మరొకవైపుననూ ఆవరించుటచే భరించలేక ఈ విధమైన అనుచిత కార్యమును చేయుటలో కొంత పొరపడి యుండును. అంతమాత్రముననే, నీవు కుపితుడవై బుషి కుమారులకు విరోధమైన ఇట్టి కార్యమునకు పూనుకొనుట తాపస లోకమునకే తీరని పాపమును చేకూర్చితివి, ఛీ ఛీ ఎట్టి ద్రోహము నొనర్చితివి? అని మందలించుచూ, కన్నులు మూసుకొని ఈ అపరాధమును తప్పించు ఉపాయమేదైననూ కలదా అని విచారించి ఎట్టి ఉపాయము లేదని గ్రహించి, అన్నింటికీ ఆ పరమేశ్వరుడే సర్వసమర్థుడు అని తలంచి భగవంతుని ఈ రీతిగా ప్రార్థించెను. 'సర్వలోక శరణ్యా! అపక్వ బుద్ధిగల బాలుడు, కర్తవ్యా కర్తవ్యతా జ్ఞానము లేక, అజ్ఞాన ప్రోద్బలముచే రాజునకిట్టి అపరాధము గావించెను. కాన బాలుని క్షమించి యైననూ, లేక శిక్షించి యైననూ రాజునకు కల్యాణము కలుగజేయుము' అని ప్రార్థించెను. ఇంతలో కన్నులు తెరచి, గుమిగూడిన బుషులనూ, బుషికుమారులను చూచి విచారముతో, 'చూచితిరా! నా కుమారు డౌనర్చిన అపరాధము. లోకపాలకుడైన రాజును ఈ రీతిగా పరాభవము చేయుట బుషులకు పాడికాదుకదా! కాన మీరందరూ భగవంతుని ప్రార్థించి, ఆ రాజునకెట్టి కీడునూ వాటిల్లక శుభము లందుకొనునట్లు చేయుడు' అని శమీక మహాముని తెలిపెను. అందులో ఒక వృద్ధ బుషి, శాంతమూర్తుడై లేచి "మహాత్మా! తమకే ఇంతటి అనుగ్రహము రాజుపై వుండిన శాపమిచ్చినది తమ పుత్రుడే కదా! తమ శక్తి పుత్రుని కంటెనూ అధికమైనది కదా! తమరు సర్వ సమర్థులు కదా! అట్టి తమరు ఈ
బాలుడిచ్చిన శాపమును జరుగకుండునటుల చేయవచ్చును కదా? తమరింత విచారించనేల?" అని ప్రార్థించగనే మిగిలిన కొందరు బుషులు, బుషి కుమారులు "సత్యము, సత్యము మా ప్రార్థన లాలకించి, కుమారుని క్షమించి చక్రవర్తికి కల్యాణము కలుగజేయుడు" అని అందరూ ఏక కంఠముతో అడుగు కొనిరి. విధివిధానము తప్పినది కాదు అంత శమీక మహాముని చిరునవ్వు నవ్వి, కన్నులు మూసుకొని, మహారాజు యొక్క భూత, భవిష్యత్తును యోగ దృష్టితో పరికించి వర్తమానమున కేమైననూ ఆధారములు కలవా? లేక అవాంతర ఫలమా? అని విచారించగా, రాజు తక్షక విషానలమున జెందవలెననియూ, ఇది తప్పునది కాదనియూ, ఇట్టి విధివిధానమును తప్పించుటకు ప్రయత్నించుట భగవంతుని ఆజ్ఞకు విరుద్ధ ప్రవర్తన సలుపుటే అనియూ, అట్టి జన్మాంతర కర్మచే ఈ పిల్లవానికిట్టి సంకల్పమును రాజునకిట్టి దుర్గుణమును కలిగించినదనియూ, తెలుసుకొని, సర్వ సంకల్ప సిద్ధుడైన సర్వేశ్వరుడే దీనిని సమర్థింప గలడు కానీ అన్యులకిది సాధ్యము కాదనియూ, అట్లు ప్రయత్నించుట అహంకార ప్రభావమే అనియూ, తెలిసికొనెను. అహంకారము బుషులకు మహా శత్రువగుటచే దానిని ప్రవేశింపజేయకుండుటకై తన కెంత శక్తి యున్ననూ దానిని శమింపచేయుటకు శమీక మహర్షి పూనుకొనక తనకు తగిన సహాయము కొంతవరకైననూ చేయ సంకల్పించి కన్నులు తెరచి నలువైపులా పరికించి, సమర్థుడైన ఒక శిష్యరత్నమును చేరబిలిచి, "నీవిప్పుడే హస్తినాపురమునకు వెళ్ళిరావలెను. సిద్ధము కమ్మని!" అని ఆజ్ఞాపించెను. అంత ఆ శిష్యుడు 'సిద్ధ మగుటకు బుషి శిష్యులకు వేరేమున్నది? తమ ఆజ్ఞయే మా సర్వ సిద్ధము. ఈ నిమిషముకు ఇచ్చట నుండియే బయలుదేరుదును. ఆజ్ఞాపింపుడని నమస్కరించెను. అంత శమీక మహర్షి ఆసనమునుండి లేచి ఆ శిష్యుని లోనికి తీసికొని పోయి, ఆ రాజుకు తెలుప
వలసిన విషయములన్నియూ సక్రమముగా తెలిపెను. అంత శిష్యుడు శమీక మహామునికి నమస్కరించి బయలుదేరెను. శమీకుడు శిష్యుని పరీక్షిత్తు దగ్గరకు పంపుట ఇది ఇట్లుండ, మహారాజగు పరీక్షిత్తు హస్తినాపురము చేరి, కొంత శ్రమ తీర్చుకొని లేచిన తక్షణమే, తాను ఆశ్రమములో చేసి వచ్చిన మహాపరాధమునకు విచారించుచూ, 'అయ్యో! నా బుద్ధి ఎంత భ్రష్టయ్యెను? నిష్ఠుడగు మహా తపస్విని చక్రవర్తియగు నేను ఈ రీతిగా అవమానపరచుట పరమపాపము' అని విచారించుచూ, దానికి తగిన పరిహారమేమి? లేక మరొకపరి ఆశ్రమమునకు స్వయముగా వెళ్ళి క్షమాపణ కోరుటయా? లేక వారి శిక్షను శిరస్సొప్పించుటయా? కర్తవ్యమేమి? అని పరితపించుచున్న సమయమున ఒక సేవకుడు వచ్చి, ద్వారము చెంత చేతులు కట్టి నిలుచుకొనెను. మహారాజు ఆ దాసుని జూచి కారణమేమని ప్రశ్నించగా 'ఎవరో ఒక బుషి కుమారుడు తమ దర్శనమునకై శమీక మహర్షి పంపగా వచ్చినాడనియూ, అతను తమకు మహాబుషి పంపిన వార్తలను అతి త్వరగా అందించవలెననియూ చాలా ఆతురతపడుచున్నాడు. ఇందుకు ప్రభువులవారి ఆజ్ఞ', అని తెలిపెను. ఆ మాట వినగనే, తాను పరుండిన మల్లెలపాన్పు సర్పమువలె, నిప్పులవలె కాల్చుచూ బుసకొట్టుచున్నట్లు తోచెను. తక్షణమే లేచి, ద్వారపాలుని దగ్గరకు పిల్చి "బుషి కుమారుడేమనె? అతని ముఖ వర్చస్సు విచారముతో నున్నదా? క్రోధముతో నున్నదా? లేక ఆనంద శాంతము లొలుకుచున్నవా?" అని మీద మీద ప్రశ్నలు వేయదొడగెను. అంత ద్వారపాలుడు వినయముతో తలవంచి, 'మహారాజా! ఆ ముని కుమారుడు పరమ శాంతుడు. ఎల్లప్పుడు మహారాజునకు జయ జయశబ్దములు పలుకుచున్నాడు. ఉద్రేకము అతని మోము నందేమాత్రమూ కనుపించకున్నది' అని జవాబుచెప్పెను. అంత మహారాజు కొంత సర్దుకొని ఆ మహాబుషి కుమారుడు అడిగిన ప్రశ్నకు నీవేమి జవాబిచ్చి వచ్చితివని ద్వారపాలకుని ప్రశ్నించగా
"విప్రోత్తమా! మహారాజు గారు వనమునకు వెళ్ళి అలసి వచ్చిరి. విశ్రాంతి నుండి లేవగనే మీ వార్త వారికందింతునని తెలిపితిని" అని ద్వారపాలకుడు సమాధానము తెలిపెను. ఇంతలో మహారాజు ఆతురతతో, 'నీ ఈ సమాధానమునకు ఆ ముని కుమారుడేమనెను?' అని మరొక ప్రశ్న వేసెను. 'ప్రభూ! ఆ వచ్చిన మునికుమారుడు తమను దర్శించుటకు ఆతురత పడుచున్నట్లు, చాలా అవసరమైన వార్త అనియూ, వారి గురువుగారు తనకొరకు నిమిషములు లెక్కించుచుండుననియూ ఎంత త్వరలో దర్శించిన అంత మంచిదని నిమిష నిమిషమునకు రాజునకు శుభము కలుగుగాక! రాజునకు శుభము కలుగుగాక!' అని వల్లించుచున్నాడు. వారికొక ఉన్నతాసనమిచ్చి కూర్చోమన్ననూ వారు దానికి అంగీకరించక ద్వారము దగ్గర నిల్చి నిమిషములను లెక్కించుచున్నారని తెలిపెను. అంత రాజు ఆనంద భాష్పములు తుడుచుకొనుచు, కిరీటమునైననూ ధరించక, పాదరక్షలనైననూ వేసుకొనక, అంగవస్త్రమును అలంకరించక అతివేగముగ నడచుకొని ద్వారము దగ్గరకు వచ్చెను. అంత ముని కుమారుని చూచి, సాష్టాంగ నమస్కారము చేసి, వారి చేతులు రెండునూ పట్టుకొని లోనికి తోడ్కొని పోయి, బుషికుమారుని ఉన్నతాసనముపై కూర్చుండ బెట్టి, తాను క్రింద కూర్చుని తమ రాకకు కారణమేమని ప్రార్థించిన మహారాజును చూచుచూ, ముని కుమారుడు, 'రాజా! మా గురువుగారు శమీక మహాముని తమకు ప్రత్యేక ఆశీర్వాదములు అంపుతూ కొన్ని ముఖ్య విషయములు తమకు తెలుపమని శలవిచ్చి'రని తెలుపుతు కంటిధారలు తుడుచుకొనుచుండెను. అజ్ఞానంచే జరిగిన మహాపరాధం మహారాజు ఆతురతతో, "ముని కుమారా! ఆ విషయమేమియో త్వరగా తెలుపుము. నానుండి కావలసిన పని యేమైననూ వుండిన నా ప్రాణములైననూ ఒడ్డుటకు సిద్ధముగానున్నాను. లేక నా రాజ్యమునకేమైననూ కీడు వాటిల్ల
దినములు రానున్నవా? దానికి తగిన పరిహారము లేవియో తెలిపిన తప్పక శిరసావహింతును" అని ప్రార్థించెను. 'మహారాజా! రాజ్యమునకు కానీ, మహర్షులకు కానీ యెట్టి ప్రమాదములూ లేవు, రావు. కానీ తమకే కొన్ని అశుభములు ఆవరింప సమీపించుచున్నవి' అని మునికుమారుడు సూక్ష్మముగా తెలుప, మహారాజు 'ధన్యుడను! మహాబుషులూ, రాజ్య ప్రజలూ శుభముగా వుండిన నాకెన్ని అశుభములు సంభవించిననూ పరవాలేదు, వారల సుఖశాంతులే నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు' అని కొంత శాంతుడై తమ గురువుగారు ఏమి సెలవిచ్చిరో తెలుపమని మునికుమారుని ప్రార్థించెను. "మహారాజా! తెలియక అజ్ఞానముచే జరిగిన ఒక మహాపరాధమునకు మహాముని చాల విచారించుచున్నారు. ఆ విషయమును మీకు తెలుపుటకే నన్నిచటకు పంపుటకు మూలకారణము" అని ముని శిష్యుడు చెప్పుచుండగనే మహారాజు ఆత్రుతతో, "అది యెట్టి అపరాధమో, ఎవరు గావించినదో దయచేసి విపులముగా తెలుపు" మని కోరెను.
In plain words
25. The Compassionate Śamīka Muni The father's words, spoken without mercy, struck the heart of his son Śṛṅgi like a knife-thrust, like a hammer-blow; and, unable to bear his grief, he fell at his father's feet: 'Father, forgive me. That the king himself should act with such faithlessness and discourtesy caused me such great sorrow, and I became enraged. I could not endure the humiliation done to you. To come to a ṛṣi's hermitage and commit such improper conduct — that is not fitting for a lord, is it!' So saying, he kept weeping. Śamīka Mahāmuni drew his son to himself and said: "Child! Time is exceedingly mighty. Now and then, a situation arises for man in which his Viveka is destroyed. The time of destruction assumes a perverse form and, through Time, makes one act in this way. The king is a great devotee, radiant, a dharmātma, the emperor of the entire earth. His fame has spread through the three worlds; he was always served by thousands of male and female servants. Whenever he left the palace and went out, many guards all around him, awaiting his every command, hands folded and never turning their gaze away, would move about on foot behind him. Whatever kingdom he entered, the kings of those lands would welcome him, honour him in many ways, and wait upon him as his servants.
Anger Does Not Befit Ascetics For a Mahārāja accustomed to such luxuries, not only did no welcome or honour whatever take place here, but a situation arose in which no one could even give him a palmful of water to quench his burning thirst. And so, with the torment of hunger on one side, and on the other — calling out and no one answering, failing to receive the honour he expected, disappointment and distress — all enveloping him, he could not bear it, and may have erred somewhat in doing this kind of improper act. For just that much, you became angry and undertook such an act, contrary to [what befits] the sons of ṛṣis; you have brought an irremediable sin upon the very world of ascetics. Chī, chī! What treachery have you committed?" Rebuking him thus, he closed his eyes and pondered whether there was any means at all of averting this offence; realising there was none, and thinking that for everything, that Parameśvara alone is all-capable, he prayed to God in this way: 'O Refuge of all the worlds! A boy of immature Buddhi, lacking the Jñāna of what ought and ought not to be done, has, under the urging of ajñāna, committed such an offence against the king. Therefore, whether by forgiving the boy or by punishing him, bring about welfare for the king.' So he prayed. Then, opening his eyes and seeing the gathered ṛṣis and ṛṣi-sons, he said with sorrow: 'Do you see the offence my son has committed? For ṛṣis to humiliate in this way the king who protects the world is not proper, is it! Therefore all of you, pray to God and see to it that no harm befalls that king, and that he receives only auspicious things.' So said Śamīka Mahāmuni. Among them an aged ṛṣi, an embodiment of calm, rose and said: "Mahātmā! When you yourself have such grace toward the king — the one who gave the curse is your own son, is he not! Your power is greater than your son's, is it not! You are all-capable, are you not! Such as you are — this
boy's curse you could keep from coming to pass, could you not? Why should you grieve so much?" As soon as he had pleaded thus, the remaining few ṛṣis and ṛṣi-sons all asked with one voice: "True, true! Heed our prayer, forgive your son, and bring about welfare for the emperor." The Ordinance of Destiny Is Not to Be Escaped Then Śamīka Mahāmuni smiled, closed his eyes, and examined the Mahārāja's past and future with yogic vision, inquiring whether there were any grounds for this in the present, or whether it was some intervening fruit. As he inquired, he came to know: that the king must meet the poison-fire of Takṣaka, and that this could not be escaped; that to try to avert such an ordinance of destiny is nothing but conduct contrary to God's command; that karma from other births had produced in this boy such a saṅkalpa, and in the king such a failing; that only Sarveśvara, whose every saṅkalpa is fulfilled, could accomplish this, and that for others it is not possible; and that to attempt it would be nothing but the sway of Ahaṅkāra. Since Ahaṅkāra is the great enemy of ṛṣis, so as not to let it enter, Śamīka Maharṣi — however much power he had — did not undertake to quell the curse; but resolving to render, at least to some extent, such help as befitted him, he opened his eyes, looked around on all four sides, called near a capable jewel among his disciples, and commanded: "You must go to Hastināpura right now and come back. Get ready!" Then that disciple said, 'For the disciples of a ṛṣi, what more is there to getting ready? Your command itself is our entire readiness. This very minute I shall set out from right here. Command me,' and bowed. Then Śamīka Maharṣi rose from his seat, took that disciple inside, and all that the king needed to be told,
he told him properly, in due order. Then the disciple bowed to Śamīka Mahāmuni and set out. Śamīka Sends His Disciple to Parīkṣit Meanwhile Mahārāja Parīkṣit reached Hastināpura and rested a little from his fatigue. The very instant he rose, he was grieving over the great offence he had committed in the hermitage and come away from: 'Alas! How corrupted my Buddhi has become! That I, an emperor, should insult in this way a great ascetic steadfast in his discipline — it is the gravest of sins.' Grieving thus, he tormented himself: 'What is the fitting expiation for it? Or should I go once more to the hermitage myself and beg forgiveness? Or submit, head bowed, to their punishment? What is my duty?' At that moment a servant came and stood at the door with hands folded. Seeing that servant, the Mahārāja asked the reason. 'A certain ṛṣi's son has come for your darśan, sent by Śamīka Maharṣi, and he is very anxious to deliver to you, as quickly as possible, the tidings the Maharṣi has sent. On this, [we await] Your Majesty's command,' he said. The moment he heard that word, the bed of jasmine on which he lay seemed to him to be burning like a serpent, like live coals, and hissing. At once he rose, called the gatekeeper near, and began to put question upon question: "What did the ṛṣi's son say? Is the lustre of his face sorrowful? Is it angry? Or does it overflow with joy and peace?" Then the gatekeeper humbly bowed his head and answered: 'Mahārāja! That muni's son is supremely calm. He keeps uttering cries of "Victory, victory!" to the Mahārāja. Not the least agitation appears on his face.' Then the Mahārāja, composing himself somewhat, asked the gatekeeper, 'What answer did you give to the question that great ṛṣi's son asked, before you came here?' — and when he asked,
the gatekeeper answered: '"O best of Brahmins! The Mahārāja went to the forest and has come back tired. As soon as he rises from his rest, I shall deliver your tidings to him" — so I told him.' Thereupon the Mahārāja eagerly put another question: 'And to this answer of yours, what did that muni's son say?' 'Lord! The muni's son who has come is anxious to see you. He says it is a very urgent message, that their guru will be counting the minutes until he returns, and that the sooner he sees you the better; and every minute he keeps repeating, "May auspiciousness befall the king! May auspiciousness befall the king!" Though we offered him a high seat and asked him to sit, he would not agree, but stands at the door counting the minutes,' he said. Then the king, wiping away tears of joy, without even putting on his crown, without even putting on his sandals, without donning his upper cloth, walked very swiftly to the door. Seeing the muni's son, he made full prostration, took both his hands, led him inside, seated the ṛṣi's son on a high seat, sat below himself, and entreated him to say the reason for his coming. Looking at the Mahārāja, the muni's son said, 'O King! Our guru, Śamīka Mahāmuni, sends you his special blessings and has bidden me tell you some important matters,' and as he said this he kept wiping away the tears that streamed from his eyes. A Great Offence Committed Through Ajñāna The Mahārāja said eagerly: "Son of the muni! Tell me quickly what that matter is. If there is any task needed from me, I am ready to stake even my life. Or is it that some harm is to befall my kingdom
in the days to come? Tell me whatever remedies are fitting for it, and I shall without fail carry them out with bowed head." So he entreated. 'Mahārāja! Neither to the kingdom nor to the Maharṣis is there any danger — none is there, and none will come. But upon you yourself some inauspicious things are drawing near, to close around you,' the muni's son delicately intimated. The Mahārāja said, 'I am blessed! If the Maharṣis and the people of the kingdom are well, it does not matter however many misfortunes befall me. Their happiness and peace are my very in-breath and out-breath.' So saying, somewhat calmed, he entreated the muni's son to tell him what his guru had bidden him say. "Mahārāja! The Mahāmuni is deeply grieving over a great offence committed unknowingly, through ajñāna. To tell you of that matter is the root reason for sending me here." While the muni's disciple was still saying this, the Mahārāja asked eagerly, "Please tell me in full what kind of offence it is, and who committed it."