Verse 4

Tap any word for its meaning.

Putana comes into the camp· Verses 1–4

।

।

।

।

On the road Nanda turned over what Sura's son had said, that it was not idle talk, and went to Hari for refuge, uneasy about the portents that were coming. Sent by Kamsa, the terrible Putana, who killed children, went about killing infants in the towns and the villages and the cattle camps. For where men do not, in the course of their own work, do the hearing of the lord of the Satvatas and the rest, which drives raksasas off, there the women of the night-walkers are. That Putana, who went through the sky and moved where she pleased, came down one day into Nanda's cow settlement, made herself a woman by maya, and went in.

The commentators

Bhāgavata Vāhini

37. రాక్షస సంహారము బాల లీలలను స్మరించుట, వినిపించుట శుకుల వారికి కూడనూ అమిత ప్రీతి యగుటచే, అడిగినదే తడవుగ, శుకుడు, "మహారాజా! మిగిలిన ఈ శేష కాలమును భగవత్సేవా కార్యములతో పవిత్ర పరచుట కంటే మించినది వేరొకటి లేదుకదా? భగవత్ లీలలు అన్నీ అమృత బిందువులే! అన్నీ ఆనందములే. నీవు దేనిని వినగోరుదువో తెలుపుము. అందును గురించి ఉన్న సత్యమును, కన్న మహాత్మ్యమును విన్నవింతును" అని శుకులు అడుగగా పరీక్షిత్ మహారాజు, "స్వామీ! గోపాలుడు గోపాలురతో ఇంకనూ ఏయే వినోదములను జరుపుచుండెడివాడో వినుపించిన తరింతును" అని చెప్పెను. శ్రీకృష్ణుని వేణుగాన వైశిష్ట్యము "మహారాజా! గోపాలుడు బ్రహ్మ ముహూర్తమునందే మేల్కొని, కాల కృత్యములు తీర్చుకొని, పశువుల శాలకు వెళ్ళి, ఆ నాడు ఏ యే పశువులను మేతకై తీసుకొని పోవలెనో, వాటికి నీరు పెట్టి, మిగిలియుండు వాటికి కసవు వేసి, పలుపులు విప్పి, బయట తోలి ఉంచెడివాడు. తానుకూడనూ లోనికివెళ్ళి చలిది మూటకట్టి, అందులో మారుగాయలు పెట్టి, అన్నను హెచ్చరించి, వీధిలోనికి వెళ్ళి, తోడి గొల్ల పిల్లలకు తాను సిద్ధముగా ఉండినటుల గుర్తుచేయుటకు బూరకొమ్ములను ఊదెడివాడు.

ఆ నాదం వినగానే గొల్లపిల్లలు ఉలిక్కిపడినట్లు యెవరి పనులు వారు పూర్తి చేసుకొని, చలిది మూటలు మూపున ధరించి, యశోదమ్మ యింటి ముందు సిద్ధమయ్యెడివారు. అందరు చేరి, వేణువు ఊదుకొంటూ, పాటలు పాడుకుంటూ కొంతమంది బాలురు కోకిల కూసిన తోడనే మారుకూతలు కూయుచూ, ఆకాశమున పక్షులు సంచరించుచుండ వాటి నీడలు భూమిపై పడుచుండుటచే ఆ నీడలను అనుసరించుచూ పరుగిడుచుందురు. కొందరు పశువుల వీపులపై పందుకొని, కూని రాగాలు తీయుచూ, మధ్య మధ్య గోపాలుడు ఏమి చేయుచున్నాడో, యెక్కడున్నాడో అని చూచుచూ అరణ్యము చేరుచుండెడివారు. కృష్ణుడు తన మురళిని మొలలో చెక్కి, కొరడాను చేత బట్టి, యెడమ చేతితో చలిది ముద్ద పట్టుకొని, చక్కని కంఠమెత్తి గానము చేయుచూ నడచుచుండెడివాడు. గోపాలుని గానమునకు తాళము అన్నట్లు గోవులు నెమ్మదిగా ఆ పాటలు వింటున్నవా అన్నట్లు చెవులు నిక్క పొడచి, మెడలు పై కెత్తి నడచుచూ కొలను చెంత చేరెడివి. అక్కడకు వెళ్ళునప్పటికి చలిది నారగించ తగిన సమయమగుటచే, అందరూ ఆ కొలను ఒద్దన కూర్చుని వారి మూటలు విప్పి పెరుగూ, మీగడా, పాలూ కలిపిన రకరకములైన వారి వారి మూటలు వారు ఆరగించుటకు మొదలు పెట్టునంతవరకూ వేచియుండెడివారు. గోపాలుడు ముద్దను నోట బెట్టగనే, అందరూ తిన మొదలుపెట్టెడివారు. ఒక్కొక్కపరి గోపాలుడు తన పెరుగు అన్నమును ముద్దలు ముద్దలుగా జేసి, అందరికీ పంచి, అందరూ తెచ్చిన వారి వారి అన్నమును తాను అడిగి అడిగి, ఒక్కొక్క ముద్ద పెట్టించుకొనెడి వాడు. గోపాలా! ఇది మా యెంగిలి కదా! మేమెట్లు పెట్ట గలము? అపరాధము కదా? అని జంకుచూ, వెనక వెనుకకు వెళ్ళుచుందురు. అట్టి సమయమున

గోపాలుడు 'అందరియందూ వున్నవాడు ఒక్కడే అయినపుడు భేద మెందుకు? యెంగిలి యెట్లగును?' అని వారు కొరికి ప్రక్కన పెట్టుకున్న నల్లికాయి ఊరగాయను తాను తీసుకొని చప్పరించెడివాడు. ఆనాడు శబరి యెంగిలి ఆరగించిన స్వామికి ఈనాడు గోపకుల యెంగిలి వేరెట్లగును? బాలకృష్ణుడు కంసుని దూతలను సంహరించుట ఈ విధముగా ఒకనాడు కొండనీడలో బండమీద కూర్చుని చలిది నారగించి, కొలనులో చేతులు కడుగుకొని అతి వేగముగా పశువుల వైపునకు పరుగెత్తుచున్న గోపాలుని చూచి, తోటి గోపాలురు యేమిటా! అని ఆశ్చర్యమున చూచుచుండ, మందలో చేరిన అందమైన కోడె క్రొత్తదిగా ఒకటి కనిపించెను. నేరుగా గోపాలుడు ఆ కోడె దగ్గరకు వెళ్ళి దాని వెనుక కాళ్ళు రెండూ చేతపట్టి గిర్రున త్రిప్పి ఒక బండ కేసి కొట్టగా, వికార స్వరముతో వింత శబ్దము చేయుచూ, రాక్షస రూపము ధరించి నోట రక్తము క్రక్కుచూ ప్రాణము వీడెను. గోపాలురు దానిని చూచి ఆశ్చర్య పరవశులై చెంతకు పరుగిడి వచ్చి, ఈ వింత యేమని అడుగగా, గోపాలుడు చిరునవ్వు చిందులు త్రొక్కుచూ, 'ఒక రాక్షసుడు, ఈ రూపము ధరించి కంసదూతగా వచ్చి మన గోవులలో చేరి ఈ నాటక మాడుచుండుటచే నేను వానికి తగిన శాస్తి చేసితిని' అని చెప్పగా, పిల్లలందరూ గోపాలుని పొగడుచూ, 'మంచి పని చేసితివి గోపాలా' అంటూ గంతులు వేయుచూ ఇంకా ఆ మందలో నూతనమైన పశువు లేమైనా వున్నవేమో అనియూ, తమ పశువులను ఏమైనా మ్రింగిన వేమో అనియూ వారి వారి పశువులను వారు సరిగా వెతుకుచూ కనిపెట్టుచూ పోవుచుండెడి వారు. ఈ రీతిగా మధ్యాహ్న మగుసరికి ఒక కొండను చేరుకొనిరి. అచట యెండ వేడిమి అధికమగుటచే పశువులను కొండనీడలకు మళ్ళించి, వారు కూడనూ కొండనీడలో విశ్రాంతిగా పరుండియుండిరి.

ఇంతలో ప్రొద్దు తిరిగెను. పశువులను మళ్ళింతమని ఒక బాలుడు లేచి వెళ్ళి చూడగా, యేదో ఒక పెద్ద కొంగాకారముతో ఉండి పశువులను తన పొట్టన పెట్టుకొనుచుండగ గమనించి, 'కృష్ణా! గోపాలా!' అని కేకలు వేయగనే, గోపాలుడు క్షణములో వెళ్ళి, ఆ కొంగ ఆకారములో ఉన్న బకాసురుని ముక్కు పట్టి తోక వరకూ చీల్చి పారవేసి పొట్టలో చేరిన గోవులను రక్షించెను. ఇట్లు నిత్యమొక వింతగా, కంసుడు పంపిన రాక్షస దూతలను వధించుచుండుట గోపబాలురకు ఒక ఆటగా మారెను. ఆశ్చర్యము యే మాత్రమూ కనిపించక, గోపాలుని శక్తి సామర్థ్యములు అతీతమైనవని, వారి హృదయములలో నాటుకొని పోయెను. అందుచే గోపాలు రెట్టి భయములూ లేక, యెక్కడి కంటే అక్కడకు, ఎప్పుడంటే అప్పుడు గోపాలునితో వెళ్ళుటకు సిద్ధముగా ఉండెడి వారు. ముందు దినము బకాసురుడను రాక్షసుడు కొంగ రూపమున వచ్చి గోపాలుని చేతిలో ప్రాణాలు వీడుటచేత, సోదరుని మరణవార్త విని ఉగ్రుడై బకాసురుని తమ్ముడగు రాక్షసుడు కొండచిలువయై వచ్చి గోవులను, గోపాలురను, కడకు రామ కృష్ణాదులను సహితము విడువక మ్రింగ నోరు తెరచుకొని దారి కడ్డముగా వారి రాక కెదురుగా పరుండియుండెను. గోపాలుడు తెలియక గోవులను తోలుకొని నేరుగా పోయి గోవులూ, గోపాలురూ, అందరూ కొండ గుహ వంటి దాని నోటిలో చేరి పొట్టలోనికి దిగిరి. ఇది చూచి గోపాలుడు ఇదియునూ రాక్షసుడే అని కనిపెట్టి కొండ చిలువ రెండు దవడలను పట్టి తోకవరకూ చీల్చి, పొట్టలో నున్న గోవులను, గోపాలురను రక్షించి జరిగిన కథ నెరిగించి గోపాలుర భయములను బాపెను. అప్పటి నుండి గోపాలురకు అంతో యింతో ఉన్న భయములు, భ్రాంతులు కూడనూ వీడి, అన్నింటికి సర్వశక్తిమయుడగు మన గోపాలుడు కలడని నిర్భయులై, దేనినీ లెక్క చేయక, పక్కన చూడక, కృష్ణుని దిక్కునకే నడచుచుండెడి

వారు. మహారాజా! గోపాలుని ఇట్టి బాలలీలలు నిమిష నిమిషమునకూ, వింతలే వినోదములే, విచిత్రములే. నే నేమి తెలుపుదును? అమానుషమైన ఈ వింతలు సామాన్యులకు సాధ్యమా? భగవంతుని శక్తులను జూచియు విస్మరించుట శాపమే! ఇట్టివి చూచియూ నమ్మనటువంటి కొందరి జన్మలు భూభారములే, బూరగ కాయలే అని శుకుడు మందస్మిత వదనుడై కన్నులు తెరచి చిన్మయ మూర్తి రూపమును దర్శించు చుండునటుల ఒక వైపునకు తదేక దృష్టితో నిలచి యుండుట చూచి పరీక్షిత్ మహారాజు, "స్వామీ! దానవులు సహితము దైవమును నమ్మి ఆ ఆరాధనలు జరుపుచుండ, మానవులై కూడనూ దైవమును విస్మరించుటకు తగిన కారణమేమి? చూచిన నేత్రములనైననూ నమ్మరు కాని, విన్న కర్ణములను విశ్వసింతురు. ఇది కేవలము పాప ఫలమనే నా భావము, లేదా, శాపమైననూ అయివుండ వచ్చును" అని పలికెను. శుకుడు "మహారాజా! నీ మాటలు పరమ సత్యము. కంస, జరాసంధుడు, శిశుపాలుడు, సాల్వుడు మొదలైన రాక్షసులు కృష్ణుని శక్తి సామర్థ్యము లెన్నియో కన్నులారా గాంచియు, గొల్ల పిల్లడను భావము వారల కర్ణములందు మెలగుచుండుటచే దృష్టిని విస్మరించి ఆకాశవాణి పలుకులను మననము చేయుటచే కదా, ప్రాణములను కోల్పోయిరి. సాక్షాత్ భగవానుని అమానుష చర్యలు, అత్యద్భుత శక్తులూ నిత్యము తాము పంపిన దూతలచే బోధింపబడుచుండియూ, వాటిని అలక్ష్యము చేసి, భగవంతుడను లక్ష్యమును మరచుట, శాపము కాక మరేమి? అదియూ చేసిన పాప ఫలమే! గోపాలుడు లోక పాలకుడే కానీ, గొల్ల పిల్లడు కాదు. రూపమునకు మానావాకారమైన పిల్లవాడే కానీ, శక్తి యుక్తులతో ముక్తిని హస్తమందుంచుకొని బంధవిముక్తిని చేసే భద్రమూర్తి. అతనే నారాయణ మూర్తి" అను శుకుల మాటలకు మహరాజు సంతసించి, "మా తాతలు ఆ గోపాలునితో కూడి ఆడి ఆనందించిన భాగ్యములో అణుమాత్రమైననూ, విని ఆనందించునట్టి భాగ్యము

నాకు గలుగుట ఇదియూ నా భాగ్యమే! వారి పుణ్యఫలము వలననే నే నిట్టి మహాబుషి వాక్యములతో మాధవ స్వరూపుని లీలలు వినగలిగితిని. కాకున్న ఇది సామాన్యుల కబ్బునా?" అని ఆనంద బాష్పములు విడుచుచూ, హస్తములు జోడించి, శుక మహర్షి ఆనంద వదనమును చూచుచూ, "స్వామీ! గోపాలుడు కాళియ మర్దనము గావించెనని వింటిని. దాని అంతరార్థ మేమియో, ఆ విధముగా గావించుటచే ప్రజలకు కల్గిన ఆశ్చర్య మేమియో, అందులో గల మహత్తరమైన విషయమేమిటో తెలిపి, నా సంశయమును రూపుమాపుడు" అని ప్రార్థించెను.

In plain words

37. The Slaying of the Rākṣasas Because remembering and recounting the Lord's childhood līlās was a source of boundless delight to Śuka too, the very moment he was asked, Śuka said: "Mahārāja! Is there anything greater than sanctifying this remaining span of time with deeds of service to the Lord? The Lord's līlās are all drops of amṛta! All of them are pure bliss. Tell me which of them you wish to hear. I shall relate to you the truth that there is about it, and the greatness I have beheld." When Śuka asked this, Mahārāja Parīkṣit replied, "Svāmī! If you narrate to me what further pastimes Gopāla kept up with the cowherd boys, I shall be carried across." The Unique Glory of Śrī Kṛṣṇa's Flute-Song "Mahārāja! Gopāla would wake in the Brahma-muhūrta itself, finish His morning duties, and go to the cattle-shed. Deciding which cattle were to be taken out to graze that day, He would give them water, throw fodder to those that were to stay behind, untie the tethers, drive the herd outside and keep them waiting there. Then He Himself would also go indoors, tie up His cold rice in a bundle with pickles tucked inside it, rouse His elder brother, go out into the street, and blow on horn-trumpets to let His fellow cowherd children know that He was ready.

The moment they heard that sound, the cowherd boys would start as if jolted, each finish his own chores, carry his bundle of cold rice on his shoulder, and gather, ready, in front of mother Yaśodā's house. All of them together, playing the flute and singing songs as they went — some of the boys, the instant a cuckoo called, would call back in answer; and as birds wheeled across the sky and their shadows fell upon the earth, they would run chasing those shadows. Some lay sprawled on the backs of the cattle, humming tunes, and every now and then looking round to see what Gopāla was doing and where He was, until they reached the forest. Kṛṣṇa would walk along with His muraḷī tucked into His waistband, His whip in His hand, a ball of cold rice held in His left hand, lifting His lovely voice in song. As though keeping tāḷa to Gopāla's singing, and as though listening quietly to those songs, the cows would prick up their ears, lift their necks high, and walk on until they reached the edge of the pond. By the time they got there it would be the proper hour to eat the cold rice, so they would all sit down by that pond, untie their bundles — each his own, of every kind, mixed with curd, cream and milk — and wait until the moment came to begin eating them. As soon as Gopāla put a morsel into His mouth, all would begin to eat. Sometimes Gopāla would shape His own curd-rice into ball after ball and share it out among them all; then He Himself would ask, again and again, for the food each of them had brought, and have one morsel from each placed in His mouth. "Gopāla! This is our yengili, isn't it! How can we give it to you? Isn't it an offence?" they would say, shrinking back and drawing away, further and further. At such a time

Gopāla would say, 'When He who dwells in all is only One, why any distinction? How can it be yengili?' — and He would take for Himself the nallikāya pickle that they had bitten and set down beside them, and relish it with a smack of His lips. The Lord who in that age ate the yengili of Śabarī — how, in this age, could the yengili of the cowherds be anything different to Him? Bālakṛṣṇa Slays Kaṃsa's Messengers In this way, one day, having eaten His cold rice sitting on a rock in the shade of a hill and washed His hands in the pond, Gopāla was seen running at great speed towards the cattle. As His fellow cowherds stared in astonishment, wondering 'What is it?', they saw among the herd a handsome young bull, one that was new. Gopāla went straight up to that bull, seized both its hind legs in His hands, whirled it round and round and dashed it against a rock — whereupon, making a strange sound in a hideous voice, it took on a rākṣasa's form, and vomiting blood from its mouth, gave up its life. Seeing this, the cowherds, overwhelmed with astonishment, came running up close and asked what this marvel was. Gopāla, His smile dancing, told them: 'A rākṣasa took on this form and came as Kaṃsa's messenger, joined our cows, and was playing out this drama — so I gave him the punishment he deserved.' At this the children all praised Gopāla, crying 'You did a good deed, Gopāla!' and leaping about; and wondering whether there were yet any other new animals in that herd, and whether anything had swallowed any of their own cattle, each of them would go along carefully searching through his own cattle and keeping watch over them. Going on in this way, by midday they reached a hill. As the heat of the sun there was fierce, they turned the cattle into the hill's shade, and they too lay down to rest in the hill's shade.

Meanwhile the day wore on. Saying 'Let us turn the cattle back,' one boy got up and went to look, and saw something in the shape of a huge stork, taking the cattle into its belly. The moment he shouted 'Kṛṣṇa! Gopāla!', Gopāla was there in an instant; He seized by the beak Bakāsura, who was in that stork's shape, tore him apart right down to the tail, flung him away, and rescued the cows that had gone into its belly. So, with a new marvel every day, the slaying of the rākṣasa messengers Kaṃsa sent became a game to the cowherd boys. They no longer showed any astonishment at all; the conviction that Gopāla's power and prowess were beyond all measure took root in their hearts. And so the cowherds, without any fear of any kind, would be ready to go with Gopāla wherever He said, whenever He said. Because on the previous day the rākṣasa called Bakāsura had come in the form of a stork and lost his life at Gopāla's hand, the rākṣasa who was Bakāsura's younger brother, hearing the news of his brother's death, flew into a rage, came as a python, and lay across the path, facing them as they approached, his mouth gaping wide to swallow the cows, the cowherds, and in the end even Rāma, Kṛṣṇa and the rest, sparing none. Gopāla, not knowing, drove the cows straight on, and the cows, the cowherds, all of them, entered its mouth, which was like a mountain cave, and went down into its belly. Seeing this, Gopāla discovered that this too was a rākṣasa; He seized the python's two jaws, tore it apart right down to the tail, rescued the cows and the cowherds who were in its belly, told them what had happened, and dispelled the cowherds' fears. From then on, whatever fears and delusions the cowherds still had, more or less, left them too. Knowing that in everything they had our Gopāla, who is all-powerful, they became fearless; heeding nothing, never glancing aside, they would walk only in Kṛṣṇa's direction —

— such were they. Mahārāja! These childhood līlās of Gopāla were, minute by minute, nothing but marvels, nothing but delights, nothing but wonders. What can I tell you of them? Are such superhuman marvels possible for ordinary beings? To See the Powers of the Lord and Still Forget Him Is Itself a Curse! "The births of those who see such things and still do not believe are nothing but burdens on the earth, nothing but empty būraga pods," said Śuka, his face gently smiling; and seeing him stand with his eyes open, his gaze fixed unwaveringly in one direction, as though beholding the form of the Cinmaya-mūrti, Mahārāja Parīkṣit said: "Svāmī! When even the dānavas believed in the Divine and carried on their worship of it, what fitting reason can there be for human beings, of all, to forget the Divine? They will not believe even the eyes that have seen, yet they trust the ears that have heard. My feeling is that this is simply the fruit of sin — or else it may even be a curse." Śuka said: "Mahārāja! Your words are the supreme truth. Kaṃsa, Jarāsandha, Śiśupāla, Sālva and the other rākṣasas beheld with their own eyes how many were Kṛṣṇa's powers and capabilities; yet because the notion 'He is a cowherd boy' kept moving in their ears, they disregarded what they had seen and kept dwelling on the words of the ākāśavāṇī — and was it not for this that they lost their lives? Though the superhuman deeds and the most wondrous powers of the Bhagavān who stood before them in person were being reported to them daily by the very messengers they themselves had sent, they paid them no heed and forgot their lakṣya, which is God — what is that, if not a curse? And that too is the fruit of sins committed! Gopāla is the Protector of the worlds, not a cowherd boy. In outward form He is a child of human shape, but He is the Auspicious One who, with His power and resourcefulness, holds Mukti in His hand and grants release from bondage. He is Nārāyaṇa Himself." At these words of Śuka the Mahārāja rejoiced: "Even an atom's worth of the good fortune my grandfathers had in playing and rejoicing together with that Gopāla — a good fortune such as to hear of it and rejoice — that fortune

— that this has come to me is itself my good fortune! It is only through the fruit of their puṇya that I have been able to hear, from the words of such a maharṣi, the līlās of Him whose very svarūpa is Mādhava. Otherwise, would this ever fall to the lot of ordinary people?" So saying, shedding tears of bliss, his palms joined, gazing at the blissful face of the maharṣi Śuka, he prayed: "Svāmī! I have heard that Gopāla accomplished the Kāḷiya-mardana. Tell me what its inner meaning is, what wonder arose in the people from His doing it in that way, and what the momentous truth within it is — and wipe away my doubt."