Verse 9

Tap any word for its meaning.

In plain words

Whoever remembers the ancient Seer, the ruler, subtler than the subtle, the ordainer of all, inconceivable in form, radiant like the sun and beyond darkness, reaches Him.

Word for word

Who would remember the Seer, the ancient one, the ruler, subtler than the subtle, the ordainer of all, of inconceivable form, sun-coloured, beyond darkness, [he goes to Him].

Sri Satchitananda Sai
Other commentaries

The commentators

Bhagavadgītābhāṣyam

किंविशिष्टं च पुरुषं याति इति उच्यते —

कविं क्रान्तदर्शिनं सर्वज्ञं पुराणं चिरन्तनम् अनुशासितारं सर्वस्य जगतः प्रशासितारम् अणोः सूक्ष्मादपि अणीयांसं सूक्ष्मतरम् अनुस्मरेत् अनुचिन्तयेत् यः कश्चित् , सर्वस्य कर्मफलजातस्य धातारं विधातारं विचित्रतया प्राणिभ्यो विभक्तारम् , अचिन्त्यरूपं न अस्य रूपं नियतं विद्यमानमपि केनचित् चिन्तयितुं शक्यते इति अचिन्त्यरूपः तम् , आदित्यवर्णम् आदित्यस्येव नित्यचैतन्यप्रकाशो वर्णो यस्य तम् आदित्यवर्णम् , तमसः परस्तात् अज्ञानलक्षणात् मोहान्धकारात् परं तम् अनुचिन्तयन् याति इति पूर्वेण सम्बन्धः ॥ ९ ॥

In plain words

And what is that Person like, the one he reaches? That is what is said next —

'The seer' — the one whose vision reaches past every limit, who knows everything; 'the ancient one,' existing since before time itself; 'the ruler' who governs this entire world; 'subtler than the subtlest atom' — finer than anything fine. Whoever meditates on Him — the one who ordains, who hands out the fruit of every action, distributing it to each being exactly as it's due, in all its endless variety; 'of unthinkable form' — a form that is real, definite, and yet no one can grasp it in thought; 'sun-colored' — glowing with the very radiance of eternal awareness, like the sun itself; 'beyond all darkness' — beyond the darkness that is nothing but ignorance, beyond delusion's dark. Whoever keeps his mind fixed there, meditating on Him alone, reaches Him.

Close to the Sanskrit

And distinguished by what — the Person whom he reaches: thus it is said —

'Kavi': the seer, the one whose vision has gone beyond, the omniscient one; 'purāṇa': ancient, primeval; 'anuśāsitāram': the ruler, the governor, of the whole world; 'more minute than even the subtle atom': finer, subtler; whoever, any person, meditates, contemplates — upon Him who is the ordainer, the distributor, of the entirety of the fruits of all action, who apportions them variously to living beings; 'of unthinkable form': his form, though it definitely exists, cannot be conceived by anyone — hence 'of unthinkable form'; Him; 'sun-colored': having a luster like that of the sun, the radiance of eternal consciousness whose luster it is; Him; 'beyond darkness': beyond the darkness characterized by ignorance, the darkness of delusion — Him, the one beyond that, meditating upon — 'he attains': this connects with the preceding word.

Gītā Vāhini· Prabodha 16 · Passage 4

“ఇందులో భగవంతుని ఏ విధముగా స్మరింతురో, విను. కవి అనియు, పురాణుడనియు, అనుశాసితుడనియు, సూక్ష్మములన్నింటి కంటే సూక్ష్మ స్వరూపుడనియు, సర్వాధారుడనియు, అచింత్యరూపుడనియు, ఆదిత్యవర్ణుడనియు, తమస్సుకు అతీతుడనియు వర్ణింతురు” అని అన్నాడు. అంతలో అర్జునుడు, “స్వామీ! సర్వ సామాన్య మానవులయందునూ కవులు కలరు కదా? అట్టి సామాన్య కవి వర్ణన పరమాత్మకు యోగ్యమైనదా? లేక ఆ ‘కవి’ అను వర్ణన ప్రత్యేక స్థానమునకు చెందినదా? కొంత వివరింపుము” అన్నాడు.

కృష్ణుడు, “అర్జునా! కవి అనగా కేవలము కావ్యములు, పద్యములు వ్రాయుట కాదు! కవి అనగా ‘సర్వజ్ఞత్వం.’ కాన, భగవంతుడే త్రికాలదర్శి; అతనే సర్వజ్ఞుడు. కవి చూడని స్థానముండదు. అందుకనే, ‘కవిః సర్వజ్ఞః క్రాంతదర్శి’ అని ఉత్పత్తి. ప్రతివాని హృదయమందును క్రాంతి కలిగించునది భగవంతుడే. వేయేటికి? సర్వ సృష్టికి కవియే ఆధారము. కాన, కవి అనగా ‘సర్వజ్ఞుడ’ని కానీ వేరు కాదు. భగవంతుడు అక్షర కవి. అతని కవిత్వం అమృత కావ్యం” అని వివరించినాడు. “స్వామీ! రెండవది ‘పురాణుడ’ని అంటిరి. అది యెట్టిది? దాని అంతారార్ధమును తెలుపుడు” అన్నాడు అర్జునుడు. “అర్జునా! ఎంత పాతవాడయిననూ అంతకంతకు క్రొత్తవాడగుచుండును! అట్టి వాడు భగవంతుడు. అతనే సనాతనుడు, ఎప్పటికప్పుడు నూతనుడు. అందుకనే ‘పురా నవమితి పురాణం’” అని అన్నాడు.

“ఇంక ‘అనుశాసితుడు’ అనగా ఏమి?” అన్నాడు అర్జునుడు. “అతను ‘సర్వతంత్ర స్వతంత్రుడు’. అతడు అందరి యందునూ శాసనము చేయువాడు. పంచభూతములు సహితము అతని ఆజ్ఞకు బద్ధులు కావలెను. అతడు శాసించిన శాసనముల హద్దులను మీరి పోవుటకు వాటికి కూడనూ సాధ్యము కాదు. లోకమున ఏ శాసనము చేసిననూ, అది బాహ్య సంబంధమైనది కానీ, పరమాత్ముని శాసనము అట్టిది కాదు, అంతర్యామియై శాసించును. అనగా మనసును కనిపెట్టి శాసించువాడు. కనుక అతను ‘సర్వతంత్ర స్వతంత్రుడు’ అని భావించు” అని భగవానుడనెను.

“స్వామీ! నాలుగవదయిన ‘సూక్ష్మ రూపుడు’, అతను ఎట్లుండును? సూక్ష్మమనగా యేమో సెలవిండు” అన్నాడు అర్జునుడు.

“పార్థా! సూక్ష్మమనగా చిన్నదేహము కలవాడని తలంచితివేమో! కాదు, కాదు. దీనికి ‘నిర్గుణు’డని అర్థము. దీనిని ఇంద్రియములతో తెలిసికొన సాధ్యము కాదు. వస్తువు యొక్క గుణములు తగ్గుకొలదీ ఆ వస్తువు సూక్ష్మమవుతుంది. ఎట్లన, పంచభూతములు (ప్రపంచ వస్తువులు) వున్నవనుకో; అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు వాటి వాటి గుణములు. భూమి మొదటిది, రెండవది జలము, మూడవది అగ్ని, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశము, కదా? ఇవి ఒకదానికంటే ఒకటి తేలికయి సూక్ష్మమవుచున్నవి; ఇది ప్రత్యక్ష ప్రమాణము.”

In plain words

“Listen to how God is remembered in this form. They describe Him as Kavi, as Purāṇa, as Anuśāsita, as one whose svarūpa is subtler than all that is subtle, as Sarvādhāra, as Acintya-rūpa, as Āditya-varṇa, and as one beyond tamas,” He said. Then Arjuna said, “Svāmī! Are there not poets even among the most ordinary people? Is a description as ordinary as ‘poet’ fitting for the Paramātma? Or does the description ‘Kavi’ belong to some special place? Explain it a little.”

Kṛṣṇa explained, “Arjuna! Kavi does not mean merely one who writes poems and verses! Kavi means ‘omniscience’. So it is God alone who sees all three times; He alone is the all-knowing one. There is no place the Kavi does not see. That is why the derivation runs, ‘kaviḥ sarvajñaḥ krāntadarśī’. It is God who kindles radiance in every heart. Why say more? The Kavi alone is the support of all creation. So Kavi means ‘the all-knowing one’, and nothing else. God is the imperishable Kavi. His poetry is an immortal poem.” “Svāmī! Second, You said ‘Purāṇa’. What is that? Tell me its inner meaning,” said Arjuna. “Arjuna! However old He is, He keeps growing ever newer! Such a one is God. He alone is the eternal one, new at every moment. That is why it is said, ‘purā navamiti purāṇaṃ’,” He said.

“Then what does ‘Anuśāsita’ mean?” asked Arjuna. “He is ‘sarvatantra-svatantra’. He is the one who rules in everyone. Even the five elements must be bound by His command. Even they cannot go beyond the limits of the decrees He has laid down. Whatever rule is made in the world is of an outward kind; but the rule of the Paramātma is not like that. He rules as the Antaryāmi; that is, He is the one who rules by watching over the Manas. So know Him as ‘sarvatantra-svatantra’,” said the Lord.

“Svāmī! The fourth, ‘Sūkṣma-rūpa’: what is He like? Please tell me what sūkṣma means,” said Arjuna.

“Pārtha! Perhaps you thought sūkṣma means someone with a small body! No, no. It means ‘nirguṇa’. It cannot be known with the senses. As the guṇas of an object decrease, the object becomes subtler. How so? Take the five elements (the objects of the world): sound, touch, form, taste and smell are their respective guṇas. Earth is the first, water the second, fire the third, air the fourth, ākāśa the fifth, isn't it? Each is lighter than the one before and grows subtler; this is evident to direct perception.”

Gītā Vāhini· Prabodha 16 · Passage 10

“ఈ ఐదు సూక్ష్మ వస్తువులకంటే, తాను అతీతుడయి ఉండుటచే అతని యందు ఏ గుణములూ లేనందున భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడయి ఉన్నాడు. అన్నింటికంటే వ్యాపకుడయి యన్నాడు. గుణములు బరువుగా ఉండును. భగవంతుడు గుణాతీతుడు; కనుక అతను ఏ బరువూ లేక సూక్ష్మాతి సూక్ష్మ రూపుడయి ఉన్నాడు” అని కృష్ణుడు తెలిపెను.

“ఇక ఐదవది ‘సర్వాధారుడు’. అనగా, లోకమున ఆధారము ఒకటి, ఆధేయము ఒకటి అని రెండు కలవు. మన కంటికి కనుపించు, చెవులకు వినుపించు, ఒకటేమి, సృష్టి యావత్తు ఆధేయము. ఈ సృష్టి అంతయూ పై చెప్పిన పంచభూతములతో నిండినది. అనగా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి ఆధేయములే. ఎట్లన, ఇవి అన్నియూ భగవంతుని ఆధారముతో నిలిచినవి. వీటికన్నింటికి ఆధారుడు, ఆ దేవుడు. అతనికి వేరు ఆధారము మరొకటి లేదు. కనుక అతనే సర్వాధారుడని తేలినది.”

“ఆరవది తెలిపెదను వినుము. ‘అచింత్య రూపుడు’ అనగా ‘చింతింప వీలుకాని వాడు’ అని అర్ధము. చింతించేది యేది? మనసు కదా. కనుక మనసుతో చింతించ వీలుకానిదని అర్ధము. ఎట్లని నీకు సంశయము కలుగవచ్చును. బావా! విను. మనుసు క్షణికం. అంతేకాదు; జడము. పరమాత్ముడు చూతమా, నిత్య వస్తువు, చైతన్యుడు కూడాను. ఇవి విచారించిన ఒకదానికొకటి పూర్తి విరుద్ధము. క్షణికం, నిత్యత్వం ఒకదానికొకటి సంబంధము లేదు. ఒకటి లేనిది, మరొకటి ఉండునది. ఇక జడము, చైతన్యము. ఇవియూ అంతే; ఒకదానికొకటి పొందిక లేవు. అలాంటి జడము, క్షణికమూ అయిన మనసు, నిత్యము, చైతన్యము అయిన పరమాత్ముని యెట్లు చింతింపగలదు? “అటులైన సాధకుని గతేమి?” అని కూడనూ నీవు అడుగవచ్చును. వానికి గతి లేకపోలేదు, బావా! పరమాత్ముని ‘అచింత్యరూపు’డని చింతించిన చాలును. తప్పక వానికి గతి కలుగును. చింతించవలసిన మార్గమున చింతించిన, రావలసిన మార్గమున ఫలితము వచ్చి తీరును. కాన చింతించవలసిన విధానమును కూడనూ సాధకుడు మొదలు తెలిసికొనవలెను.” అప్పుడు అర్జునుడు, “సరి స్వామీ! ముందుకు నడచుదుము, కాలము సమీపించుచున్నది. మనము ఏ బాధ్యతా లేక ఈ యుద్ధభూమిన నిలువలేదు కదా? ముందుకు ముంచుకు వచ్చుచున్నది, మన పాలిటికి యుద్ధము. నీవు త్వరత్వరగా ఏమి ఆజ్ఞ ఇత్తువో ఆ రీతిగా చేయుటకు సిద్ధముగా ఉన్నాను. కాన, మిగిలిన ఏడవదాని గురించి తెలుపుడు” అని అన్నాడు.

“అర్జునా! ‘ఆదిత్య వర్ణం’. అనగా సూర్యుని వలే ‘స్వయం ప్రకాశకుడు’ భగవంతుడని అర్థము. అంతేకాదు, సూర్యుని ప్రకాశము కూడనూ పరమాత్ముడే. లోకమును ప్రకాశింపజేయువాడు సూర్యుడైతే, సూర్యుని కూడా ప్రకాశింపజేయువాడు భగవంతుడు కనుక అతనికి ‘ఆదిత్యు’డని పేరు వచ్చినది.”

“ఇక ఎనిమిదవ దానిని కూడనూ తెలిపెదను వినుము. ‘తమస్సుపరుడు’. తమస్సు అనగా ‘అజ్ఞానము’, పరుడు అనగా ‘సాక్షి’. అజ్ఞానమునకు సాక్షి అని అర్థము. బావా! మాయ అన్ననూ, అజ్ఞానమన్ననూ ఒకటే కనుక, అట్టి మాయకు అతీతమైన వాడు పరమాత్ముడు అని కూడనూ తలంచవచ్చును. బావా! ఒకతూరి కన్నులు మూసుకొని చూడు, ఏమున్నదో తెలియగలదు. కన్నులు మూసుకొన్న ఏమున్నది? అంతా ఒకే చీకటి. ఔనా కాదా? ఆ చీకటి నీకెట్లు తెలిసినది? తెలియకున్న చీకటి అని యెట్లనుచున్నావు? అక్కడ చీకటి ఒకటి, చూచుట మరొకటి, రెండు ఉన్నవి కదా. నీవే చీకటి అయిన, నీవు ఎట్లు చూడగలవు? నీవు చూచుచున్నావు కనుక నీవు చీకటివి కాదు. చీకటిని చూచినట్టు సాక్షివి. బావా! మరొకటి యోచించుకో. మానవుడు ఒక్కొక్క సమయమున “నేను అజ్ఞానిని; నాకేమి తెలియదు” అని తనను తాను నిందించుకొంటూ ఉంటాడు. నిజముగా వాడు అజ్ఞానియే అయి ఉండిన “నేను అజ్ఞాని” అని తెలిసికొను జ్ఞానము ఎక్కడ నుండి వచ్చినది? ఎట్లు వచ్చినది? అజ్ఞానము దృశ్యము, జ్ఞానము దృక్కు, అజ్ఞానమును చూచే సాక్షివే నీవు కానీ, అజ్ఞానము నీవు కాదు. ఇదే విధముగానే పై చెప్పిన ఎనిమిది వర్ణనలనూ ఎవరు చింతింతురో అది సరియైన స్వరూప చింతన బావా!” అర్జునుడు, “కృష్ణా! ఈ విధమైన చింతన చేసినంత మాత్రమున సరిపోవునా లేక మరింకేమైననూ వీటికి జత చేర్చవలెనా?” అని అడిగెను.

In plain words

“Because He is beyond these five subtle things, and because there are no guṇas at all in Him, God's svarūpa is subtler than the subtlest. He pervades more than all. Guṇas are heavy. God is guṇātīta; so, without any weight, His form is subtler than the subtlest,” Kṛṣṇa explained.

“Now the fifth, ‘Sarvādhāra’. In the world there are two things: the support, and the supported. What our eyes see, what our ears hear – why name one thing? – the whole of creation is the supported. This whole creation is filled with the five elements spoken of above: earth, water, fire, air and ākāśa. These are all things supported. How so? All of them stand by the support of God. That God is the support of all of them. For Him there is no other support. So it is settled that He alone is Sarvādhāra.”

“Listen, I shall explain the sixth. ‘Acintya-rūpa’ means ‘one who cannot be thought of’. What is it that thinks? The Manas, is it not? So it means: the one who cannot be thought of with the Manas. You may doubt this, and ask how. Brother-in-law! Listen. The Manas is momentary. Not only that; it is inert. The Paramātma, on the other hand, is the eternal reality, and Caitanya as well. Inquire into them, and they are wholly opposed to each other. The momentary and the eternal have no relation to each other: one is that which is not, the other is that which abides. Then the inert and Caitanya: these too are the same; they have no agreement with each other. How can such a Manas, inert and momentary, think of the Paramātma, who is eternal and Caitanya? You may also ask, ‘If so, what becomes of the sādhaka?’ It is not that there is no way for him, brother-in-law! It is enough to think of the Paramātma as ‘Acintya-rūpa’. Surely a way will come to him. If one thinks in the way one should think, the fruit will surely come in the way it should come. So the sādhaka must first learn the method of thinking too.” Then Arjuna said, “Very well, Svāmī! Let us move ahead; the time is drawing near. We are not standing on this battlefield without any responsibility, are we? The war is bearing down upon us. Whatever command You swiftly give, I am ready to carry it out. So tell me about the remaining seventh.”

“Arjuna! ‘Āditya-varṇaṃ’. It means that God is ‘self-luminous’, like the sun. Not only that; the light of the sun, too, is the Paramātma. If the sun is what makes the world shine, God is the one who makes even the sun shine; that is why He came to be called ‘Āditya’.”

“Now listen; I shall explain the eighth too. ‘Tamas-para’. Tamas means ‘Ajñāna’; para means ‘witness’. So it means the witness of Ajñāna. Brother-in-law! Since Māyā and Ajñāna are one and the same, one may also think of the Paramātma as the one beyond such Māyā. Brother-in-law! Close your eyes once and look, and you will know what is there. When the eyes are closed, what is there? All is one darkness. Yes or no? How did you know that darkness? If you did not know it, how can you call it darkness? There, the darkness is one thing and the seeing is another; there are two, are there not? If you yourself were the darkness, how could you see? Since you are seeing, you are not the darkness. You are the witness who saw the darkness. Brother-in-law! Consider one more thing. At times a man goes on blaming himself: ‘I am an ajñāni; I know nothing.’ If he really were an ajñāni, where did the Jñāna that knows ‘I am an ajñāni’ come from? How did it come? Ajñāna is the seen, Jñāna is the seer; you are only the witness who sees Ajñāna, and you are not Ajñāna. In just this way, whoever contemplates the eight descriptions spoken of above – that is right contemplation of the svarūpa, brother-in-law!” Arjuna asked, “Kṛṣṇa! Is it enough merely to contemplate in this way, or must something more be added to these?”