Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Voice of the Future
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"అయ్యో!
కడపటికి,
ఇట్టి
దుస్థితి
సంభవించునా?
సర్వశుభముల
ఫలమిదియా?
సదాచార
సారమిట్టిదిగా
మారునా?
జలమందు
మునిగి
ప్రాణము
కోల్పోవు
వానికినీ,
చెట్టునుండి
క్రిందపడి
ప్రాణము
విడుచువానికినీ,
పాముకాటుతో
ప్రాణమును
వీడువానికినీ
సద్గతి
లేదనియును,
అది
అపమృత్యువనియు
శాస్త్రము
చెప్పినదికదా!
అట్టివారు
భూతప్రేతములుగా
పుట్టుదురనియు
తెలిపెను
కదా!
కడకిట్టి
దుర్గతికి
కారణమేమి?
ఇది
చాలా
అన్యాయముగ
నున్నది"
అని
పెదవులు
విరుచుకొని
తలవూపుచూ
ధర్మజుడు
మరింత
విచారమున
మునుగుటచూచి
బ్రాహ్మణులు,
"మహారాజా!
మీరింత
విచారించనవసరము
లేదు.
ఇట్టి
మహాపురుషునకు
అట్టి
దుర్గతి
యేనాటికినీ
రాదు,
లేదు.
ఈతని
జన్మకుండలిలో
వజ్రయోగము,
భక్తియోగము
ఈ
రెండునూ
చాలా
బాగుగ
నున్నవి.
కాన
శాపవృత్తాంతము
వినగానే
రాజ్యమును,
దారాపుత్రాదులను
విడిచి
భాగీరథీ
తీరమున
కూర్చొని,
హరిని
శరణుజొచ్చును.
శాపము
కాదు,
వరదానము
ఆ
సమయమున
వ్యాసనందనుడైన
శుకమహర్షి
అచ్చటి
కరుదెంచి
ఆత్మజ్ఞాన
జిజ్ఞాస
గావించును.
కృష్ణ
కథాశ్రవణము
గావించుచు,
కృష్ణ
నామసంకీర్తన
చేయుచు,
పుణ్య
సలిలయగు
గంగాతీరమున
తన
ప్రాణములు
వీడును;
అట్టివానికి
దుర్గతి
యెట్లు
కలుగును?
ఇతనికి
పునర్జన్మము
కలుగుటకు
2
▾
Meaning
Keep
వీలులేదు,
భక్తియోగము
ద్వారా
పురుషోత్తమునిలో
చేరిపోవును"
అని
బ్రాహ్మణులు
తెలుపగనే
ధర్మజుడు
చింతను
వీడి
సంతసమున,
"ధన్యుడు,
ధన్యుడు"
అని
పలుకుచూ
"అటులైన
ఇది
శాపము
కాదు,
వరదానము"
అని
తెలిపినాడు.
ఆనందమున
అందరు
లేచి,
వచ్చిన
బ్రాహ్మణులకు
తగిన
గౌరవ
మర్యాదలు
జరిపి
వజ్రవైడూర్య
కనక
పీతాంబరములతో
సత్కరించి,
సాగనంపిరి.
బ్రాహ్మణులు
ఆనందముతో
వారివారి
గృహములు
చేరిరి.
యుధిష్ఠిరుడు,
తన
సోదరులు,
యెవరెవరి
వసతులకు
వారు
వెళ్ళి,
విన్న
విషయములను
స్మరించుచూ
ఆనందముగా
కాలము
గడుపుచుండిరి.
పురిటి
యింటిలోని
బిడ్డ
శుక్లపక్ష
చంద్రుని
రీతి
దినదిన
ప్రవర్ధమానుడై
వృద్ధిగాంచుచూ,
లోపలా
వెలుపలా
అందరికినీ
గారాబు
బిడ్డడై
పెరుగుచుండెను.
లేక
లేక
కలిగిన
బిడ్డడగుటచే
అందరునూ
ఆ
బిడ్డను
ప్రాణ
సమానముగా
కంటికి
రెప్పవలె
కాపాడుకొనుచుండిరి.
ఉపపాండవులను
కోల్పోయి
దుఃఖమున
కుములుచుండిన
ద్రౌపదియును,
మహావీర
పుత్రరత్నమును
కోల్పోయి
నిరంతరము
దుఃఖముచే
కృశించుచున్న
సుభద్రయూ,
అశ్వత్థామ
వేసిన
అస్త్ర
ప్రభావముచే
ఉత్తర
గర్భమున
నుండు
బిడ్డ
యేమగునో!
అసలు
పాండవ
వంశమే
ఇంతటితో
సమాప్తి
కాగలదేమో!
అని
తమలో
తాము
విచారమున
మునిగియుండిన
యుధిష్ఠిర
భీమార్జునాదులునూ,
ఈ
బిడ్డను
చూచి
సర్వమూ
మరిచి
సంతోష
సాగరమున
మునిగి,
అల్లారు
ముద్దుగా
ఆడించుకొనుచు,
కాలమును
కడురమణీయముగా
గడుపుచుండిరి.
పరీక్షించినటుల
చూచువాడు
పరీక్షిత్తు
అపుడపుడు
అంతఃపురమునుండి
బాలుని
తెప్పించుకొని
తనివితీరా
చూచి,
తమ
తమ
భావములను
తాము
వృద్ధి
చేసికొనుచూ
ఆనందమున
తమను
తామే
మరచుచుండిరి.
బాలకుడు
కూడను
అతి
చురుకుగా,
చూచిన
వారల
నందరినీ
ఏదో
పరీక్షించునటుల
వారిని
రెప్పకొట్టక
చూచెడివాడు.
ఆ
బాలకుని
చూపులు
అందరికినీ
ఆశ్చర్యము
కలిగించెడివి.
క్రొత్తవారెవరు
వచ్చిననూ
తదేక
దృష్టితో,
3
▾
Meaning
Keep
వారిలో
దేనినో
వెదకుచుండినటుల
చూచెడివాడు.
పరీక్షించునటుల
పరిశీలించుచుండెను.
కొందరు
తన
తండ్రియైన
అభిమన్యుని
వెతుకుచున్నాడనెడివారు;
కొందరు
"కాదు
కాదు
కృష్ణ
పరమాత్మనేమో
వెతుకుచున్నాడు"
అనెడివారు;
మరికొందరు
కాదు
ఏదో
దివ్యకాంతులను
చూచుచున్నాడనెడివారు.
ఈ
రీతిగా
ఆ
బాలుని
చూపులు
వచ్చినవారలందరినీ
పరీక్షించునటుల
తెలిపెడివి.
ఈ
వార్త
నగరమంతయూ
ప్రాకి,
వెళ్ళిన
ప్రతివారినీ
పరీక్షించుచున్నాడను
మాట
ప్రతి
నోటినుండీ
వెలువడుచుండెను.
పేరు
పెట్టక
పూర్వమే
ఇంటివారూ,
బయటవారూ
"పరీక్షిత్,
పరీక్షిత్"
అని
పిలుచుటకు
మొదలిడిరి.
ఆ
పేరే
కడకు
స్థిరమాయెను.
పండితుని
మొదలు
పామరుని
వరకూ,
రాజు
మొదలుకొని
రైతు
వరకూ,
పరిచారకుని
మొదలుకొని
ప్రభువు
వరకూ
పరీక్షిత్,
పరీక్షిత్
అని
పిలువబడుచుండెను.
ఈ
రీతిగా
బాలుని
ప్రతాపము
దినదినమునకు
పెరుగుచుండగా,
యుధిష్ఠిరుడు
ఒక
శుభదినమును
చూచి,
పురోహితుని
పిలిపించి,
బాలుని
నామకరణమిడుటకు
సరియైన
శుభదినమును
నిర్ణయించవలెనని
ఆజ్ఞాపించెను.
అంత
పండితులు,
జ్యోతిష్కులు
చేరి
ఒక
శుభదినమును
నిర్ణయించి
సుముహూర్తమును
యేర్పరిచిరి.
శుభలేఖలు
వ్రాయించి
రాజులకూ,
పౌరులకూ,
పండితులకూ
పంపిరి.
బుషులను,
మహాపురుషులను
స్వయముగా
పరివారమును
పంపి
ఆహ్వానించెను.
అర్జునుడు
స్వయముగా
వెళ్ళి
కృష్ణ
పరమాత్మకు
ఈ
శుభకార్యమును
తెలిపి,
పిల్లవానికి
తమ
ఆశీర్వాదములు
ప్రధానములని
తెలిపి
వెంటనే
తీసుకొని
వచ్చెను.
కృష్ణ
పరమాత్మ
వచ్చునప్పటికి
బుషులు,
బ్రాహ్మణులు,
రాజులు,
సామంతరాజులు,
పురప్రజలు,
సర్వాలంకార
భూషితులై,
పాండవుల
ద్వారమువద్ద
స్వాగతమిచ్చుటకు
సిద్ధముగ
నుండిరి.
అర్జునుని
రథము
ముందు,
కృష్ణ
పరమాత్మ
రథము
వెనుక,
వచ్చుచుండుట
చూచి
మంగళ
వాయిద్యములు
మ్రోగించిరి.
జయ
జయ
ధ్వనులు
మిన్ను
ముట్టెను.
యుధిష్ఠిరుడు
రథము
దగ్గర
4
▾
Meaning
Keep
కరుదెంచి,
కృష్ణుని
ఆలింగనము
చేసికొని,
చేతులు
పట్టుకొని,
లోపలికి
తీసుకొని
వెళ్ళి,
ఉన్నత
ఆసనమును
అలంకరింపమని
కోరెను.
వచ్చిన
రాజులు,
సామంతరాజులు,
బుషులు,
బ్రాహ్మణులు,
పెద్దలు
వారివారి
స్థానములు
వారు
అలంకరించిరి.
సహదేవుడు
అంతఃపురమునకు
వెళ్ళి
సర్వాలంకార
భూషితుడై
సూర్యునివలె
ప్రకాశించుచున్న
బాలుని
బంగరు
పళ్ళెరమున
పరుండబెట్టుకొని
స్వస్తివాచకములు,
ఆశీర్వచనములు
చెప్పుచుండగా,
సభా
మధ్యమునకు
తీసికొని
వచ్చెను.
దాసదాసీలు
పూజాసామగ్రులతో,
సుగంధపు
ద్రవ్యములతో
బంగరు
తట్టలను
పట్టుకొని
బారులుదీరి
వచ్చుచుండిరి.
స్త్రీలకు
ప్రత్యేకముగా
అమర్చిన
ఘోషాహాలులో
ద్రౌపది,
సుభద్ర,
రుక్మిణి,
ఉత్తర
ఇంకా
మిగిలిన
రాణులందరు
చేరి,
ఆనందముగ
బాలకుని
వైపు
చూచుచుండిరి.
సహదేవుడు
బాలకుని
తెచ్చి
కల్యాణ
మంటపమందు
పూలపాన్పుపై
పరుండబెట్టగనే
లేచి,
మోకాళ్ళతో
ప్రాకుచూ,
యెంత
వారించిననూ
నిలువక
అటు
ఇటూ
వెళ్ళుటకు
ఉబ్బూతలూగుచుండినటుల
కనుపించెను.
సహదేవుడు
అనేక
విధముల
ప్రయత్నించిననూ
నిలువకపోయెను.
ఈ
స్థితిని
చూచుచుండిన
యుధిష్ఠిరుడు,
అమితానందముతో,
"సహదేవా!
నీవు
అడ్డు
తగలక
విడచిపెట్టుము;
బాలుడేమి
చేయునో
చూతము"
అని
నవ్వుతూ
తెలిపెను.
అంత
సహదేవుడు
చేతులు
విడిచి
బాలునికేమియూ
తొందరలు
కలుగకుండునట్లు
చుట్టూ
చూచుకుంటూ,
బాలుడు
వెళ్ళునట్లు
తానునూ
వెళ్ళుచూ
జాగ్రత్తగ
కనిపెట్టుకొనుచుండెను.
విడచిన
పిల్లవాడు
ముందు,
వెనుక
చూడక
ఏదో
ఎప్పటినుండియో
తెలిసిన
వానివలె
సరాసరి
దోగాడుచు
కృష్ణుడు
కూర్చొనియుండిన
స్థానమునకు
వెళ్ళి,
కృష్ణుని
పాదములు
గట్టిగ
పట్టుకొని,
అతనిని
ఎత్తుకొమ్మనినట్లు
గుర్తులు
5
▾
Meaning
Keep
చూపుచుండెను.
అది
చూచిన
కృష్ణ
పరమాత్మ
ఫక్కున
నవ్వుచు
పరమానందముతో
ఆ
బాలుని
యెత్తి
ఒడిలో
కూర్చొనబెట్టుకొనెను.
పరీక్షిత్తు
సార్థక
నామధేయుడు
కృష్ణుని
ఒడిలో
కూర్చొనియున్న
పిల్లవాడు,
సామాన్య
పిల్లల
వలె
అటూ
ఇటూ
తిరుగక,
నిల్చి,
అవీ
యివీ
లాగక,
కన్నులు
రెప్పలు
వేయక,
ఆడక
కృష్ణ
పరమాత్ముని
ముఖకమలమును
తదేక
దృష్టితో
చూచుచుండుట
చూపరులందరికినీ
ఆశ్చర్యమును
కలిగించినది.
కృష్ణ
పరమాత్మకు
సహితము
ఆశ్చర్యము
కలిగించెను.
అంత
కృష్ణ
పరమాత్మ
యుధిష్ఠిరునితో
"బావా!
ఈ
బాలుడు
వచ్చిన
వారలందరినీ
పరీక్షించుచున్నాడని
వినిన
వార్తను
నేను
విశ్వసించలేదు.
ఏదో
పిల్లవాడు
చేయు
చేష్టలకు
బ్రాహ్మణులు
ఈ
విధమైన
కథలు
కలిపించి
యుందురు
అని
తలంచియుంటిని.
ఇపుడు
చూడ
ఇది
పరమాశ్చర్యము!
నన్ను
కూడను
పరీక్షా
దృష్టితో
పరికించుచున్నాడు.
నేను
కూడను
కొంత
పరీక్షించి
చూతును".
అని
కృష్ణ
పరమాత్మ
ఆ
బాలుని
దృష్టిని
మరల్చుటకై
యెన్నియో
విధముల
ఆటబొమ్మలను
తెప్పించి,
ముందువైచి
తాను
ఆ
పిల్లవానికి
కనుపించనటుల
మరుగున
ఉండి,
తిలకించుచుండెను.
కానీ,
ఆ
బాలుని
దృష్టి
యే
సామగ్రినీ
ఆకర్షించక,
కృష్ణుడు
వెళ్ళిన
వైపునకే
తదేక
దృష్టితో
చూచుచూ,
అటుపోవ
ప్రయత్నించెను.
ఈ
విధముగ
పరమాత్ముడు
అనేక
విధముల
బాలుని
పరీక్షించి
కడకు
తన
ప్రయత్నములు
ఫలించక
పోవుటచే
"ఈ
బాలుడు
సామాన్యుడు
కాడు.
నా
పరీక్షకు
కూడనూ
లొంగక
నెగ్గినాడు.
కనుక
పరీక్షితుడను
నామము
ఈ
బాలునకు
సార్థకము
కాగలదు"
అని
కృష్ణ
పరమాత్మ
చెప్పిన
తోడనే,
పండితులు
ఆశీర్వాదములు
చేసిరి.
బ్రాహ్మణులు
మంత్రములు
చెప్పిరి.
మంగళవాయిద్యములు
మిన్ను
ముట్టెను.
దాసీలు
గౌరీ
కల్యాణము
పాడిరు.
ఆచార్యుడు
బంగరు
గిన్నెలోని
తేనె
నవరత్నముల
పతకములో
అద్ది
ఒక్కొక్క
అక్షరము
వ్రాసి
బాలుని
నాలుక
పై
6
▾
Meaning
Keep
వేసెను.
సువర్ణ
పళ్ళెరమందున్న
బియ్యమందు,
సువర్ణ
పుష్పములతో
"పరీక్షిత్"
అను
సంస్కృత
అక్షరములతో
లిఖింపగా
అందరూ
బాలుని
శిరసున
ఆశీర్వాదములతో
అక్షింతలు
వేసిరి.
ఈ
విధముగా
పరీక్షిత్
నామకరణము
అత్యంత
వైభవముగా
జరిగెను.
వచ్చిన
స్త్రీ
పురుషులందరికినీ
తగిన
రీతిగా
సన్మానములు
ఇచ్చి
సాగనంపిరి.
నామకరణమునకై
యేర్పరిచిన
కల్యాణమండపమందు
బాలుడు
చేసిన
విచిత్రములను
లోపలా
వెలుపలా
ఒకరికొకరు
ముచ్చటించుకొనుచుండిరి.
కొందరు
మహా
ఆశ్చర్యముతో
బాలుని
దృష్టిని
శ్లాఘించిరి.
కృష్ణుడు
ఉత్తర
గర్భమును
రక్షించుట
ఇవి
అన్నియును
చూచిన
యుధిష్ఠిరుడు,
పరమాశ్చర్యముతో
వ్యాస
భగవానుడున్న
వసతికి
వెళ్ళి,
బాలుని
విచిత్ర
చేష్టలకు
కారణమేమనియును,
దీనివలన
ఏ
శుభాశుభములు
కలుగుననియూ
తాను
వినగోరుచున్నానియు,
వ్యాసులవారిని
ప్రార్థించెను.
అందులకు
వ్యాసులవారు
"ధర్మజా!
బాలుడు
ఉత్తర
గర్భమునందుండగ,
అశ్వత్థామ
వేసిన
అస్త్రము,
ఆ
బాలుని
సమీపించగా,
పరమాత్ముడు
పిండమందే
ప్రవేశించి
బాలుని
రక్షించెను;
ఆనాడు
గర్భమున
తనతోపాటు
వుండి
తనను
హతమార్చవచ్చిన
అస్త్రమును
దునుమార్చిన
ఆ
పురుషుడు
యెవరాయనని,
ఆనాడు
గర్భములో
చూచిన
దివ్యకాంతులుగల
రూపుడు
లోకమున
ఎక్కడున్నాడని
ఆనాటినుండియూ
ఆ
కాంతి
గల
వ్యక్తులను
కన్నువార్చక
చూచుచుండెను.
నేడు,
ఆ
దివ్య
స్వరూపుడు
ప్రత్యక్షమగుట
తోడనే
గుర్తించి
చెంత
చేరెను.
ఇదే
బాలుని
చేష్టలయందలి
మర్మము"
అని
వ్యాసుడు
తెలిపిన
తోడనే
ఆనందబాష్పములు
రాల్చుచూ,
యుధిష్ఠిరుడు
మహదానందముతో
"పరమాత్ముడు
కరుణానిధి"
అని
నమస్కరించెను.
Previous
←
The Birth of the Foremost of Bhāgavatas
Next
A Yajña for the Expiation of the Sin of War
→